దేశవ్యాప్తంగా నిన్న(సోమవారం) శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో నేడు కూడా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల నేపధ్యంలో దేశవ్యాప్తంగా భారీగా వివిధ వస్తువుల కొనుగోళ్లు జరిగాయి.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకల సందర్భంగా రూ. 25 వేల కోట్లకు పైగా లావాదేవీలతో కూడిన వ్యాపారం జరిగింది. కృష్ణాష్టమి దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా నిర్వహించే పండుగ కావడంతో ప్రతీయేటా భారీగా కొనుగోళ్లు జరుగుతుంటాయి. ఈ ఏడాది జన్మాష్టమి సందర్భంగా జరిగిన కొనుగోళ్ల వివరాలను సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ మీడియాకు అందించారు.
శ్రీకృష్ణాష్టమి సందర్బంగా పూలు, పండ్లు, స్వీట్లు, వస్త్రాలు, అలంకరణ వస్తువులు, స్వీట్లు, పాలు, పెరుగు, వెన్న, డ్రై ఫ్రూట్స్ మొదలైనవాటిని వినియోగదారులు భారీ ఎత్తున కొనుగోలు చేశారని ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. జన్మాష్టమి వంటి పండుగలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంటాయన్నారు. ఈసారి జన్మాష్టమి ప్రత్యేక ఆకర్షణలుగా డిజిటల్ టేబుల్‌లాక్స్, శ్రీకృష్ణునితో సెల్ఫీ పాయింట్ నిలిచాయని అన్నారు. కాగా దేశంలోని వివిధ సామాజిక సంస్థలు కూడా జన్మాష్టమి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాయి.
Comments
Please login to add a commentAdd a comment