ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్‌తో వాణిజ్యం డౌన్∙ గోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ అంచనా
న్యూఢిల్లీ:పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితంగా ఇజ్రాయెల్, లెబనాన్, జోర్డాన్ తదితర దేశాలతో భారత్ వాణిజ్యంపై ప్రభావం పడినట్టు పరిశోధనా సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) తెలిపింది. ఈ కల్లోల పరిస్థితుల్లో, పశ్చమాసియాలో వేగంగా మారిపోతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
2024 జనవరి–జూలై కాలంలో ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న దేశాలతో భారత వాణిజ్యం ప్రభావానికి లోనైనట్టు తెలిపింది. ‘‘ఇజ్రాయెల్‌కు భారత్ నుంచి ఎగుమతులు 63.5 శాతం తగ్గిపోయాయి. జోర్డాన్‌కు 38.5 శాతం క్షీణించాయి. లెబనాన్‌కు సైతం 6.8 శాతం తగ్గాయి’’అని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలు కాగా, అది ఇప్పుడు లెబనాన్, సిరియాకు విస్తరించిందని.. ప్రత్యక్షంగా జోర్డాన్, ఇరాన్‌పైనా ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్ ఈ వివాదానికి దూరంగా ఉన్నాయి.
తటస్థంగా ఉండడంతో ఈ గల్ఫ్ దేశాలతో (జీసీసీ) భారత్ వాణిజ్యం ఈ ఏడాది జనవరి–జూలై మధ్య 17.8 శాతం పెరిగినట్టు తెలిపారు. మరోవైపు సూయిజ్ కెనాల్, రెడ్‌సీ వంటి కీలక నౌకా రవాణా మార్గాల్లో అవరోధాలతో.. హార్న్ ఆఫ్ ఆఫ్రికా వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాల్సి రావడంతో షిప్పింగ్ వ్యయాలు 15–20 శాతం మేర పెరిగినట్టు జీటీఆర్‌ఐ నివేదిక తెలిపింది. ‘‘ఇది భారత కంపెనీల లాభాల మార్జిన్లను గణనీయంగా దెబ్బతీసింది. ముఖ్యంగా తక్కువ స్థాయి ఇంజనీరింగ్ ఉత్పత్తులను ఎగుమతి చేసే కంపెనీలు, టెక్స్‌టైల్స్,గార్మెంట్స్‌లపై ప్రభా వం ఎక్కువగా ఉంది’’ అనివెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment