ప్రపంచంలో అతిపెద్ద టూ వీలర్స్ మార్కెట్లలో ఒకటైన భారత్‌లో.. ఎప్పటికప్పుడు సరికొత్త ద్విచక్ర వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఎన్ని కొత్త టూ వీలర్స్ లాంచ్ అయినా.. ప్రజలు మాత్రం ఎక్కువగా కొన్ని స్కూటర్లను మాత్రమే ఎంపిక చేసుకుని మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ దీపావళికి ఓ మంచి స్కూటర్ కొనాలనుకునే వారికి కూడా అలాంటివి బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.
హోండా యాక్టివా
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో హోండా యాక్టివా అగ్రగామి అనే చెప్పాలి. ఇది ఇప్పటికే మూడు కోట్లు కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది. ప్రస్తుతం యాక్టివా 125, యాక్టివా 6జీ వంటి రూపాల్లో అందుబాటులో ఉంది.
యాక్టివా 125 ధర రూ. 84,085 నుంచి రూ. 92,257 మధ్య ఉంది. ఇది 124 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 51.23 కిమీ మైలేజ్ అందిస్తుంది. యాక్టివా 6జీ విషయానికి వస్తే.. దీని ధర రూ. 79624 నుంచి రూ. 84624 మధ్య ఉంది (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఇది 109.51 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 59.5 కిమీ మైలేజ్ అందిస్తుంది.
టీవీఎస్ జుపీటర్
హోండా యాక్టివా తరువాత అత్యధికంగా అమ్ముడైన స్కూటర్ టీవీఎస్ జుపీటర్. ఇది జుపీటర్ 110, జుపీటర్ 125 అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
జుపీటర్ 110 ధర రూ. 77,400 నుంచి రూ. 90,150 మధ్య ఉంది. ఇది 113.3 సీసీ పెట్రోల్ ఇంజిన్ కలిగి 62 కిమీ మైలేజ్ అందిస్తుంది. జుపీటర్ 125 విషయానికి వస్తే.. దీని ధర రూ. 89,155 నుంచి రూ. 99,805 మధ్య ఉంది. ఇది 124.8 సీసీ ఇంజిన్ ద్వారా 57.27 కిమీ మైలేజ్ అందిస్తుంది.
హోండా డియో
ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడి కొనుగోలు చేస్తున్న స్కూటర్లలో హోండా డియో కూడా ఒకటి. రూ. 75630 నుంచి రూ. 82580 మధ్య ధరతో (ఎక్స్ షోరూమ్) అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ 50 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇది 109.51 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది.
సుజుకి యాక్సెస్ 125
ఇండియన్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందుతున్న సుజుకి యాక్సెస్ 125 ధర రూ. 83,482 నుంచి రూ. 94,082 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఇందులోని 124 సీసీ పెట్రోల్ ఇంజిన్ 45 కిమీ మైలేజ్ అందిస్తుంది. సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
టీవీఎస్ ఎన్‌టార్క్ 125
టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధర మార్కెట్లో రూ. 93,126 నుంచి రూ. 1.09 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ స్కూటర్ 124.8 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 47 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఓ మంచి స్టైలిష్ స్కూటర్ కావాలనుకునే వారికి ఈ స్కూటర్ ఓ మంచి ఎంపిక అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment