Scooter Market
-
బడ్జెట్ ధరలో బెస్ట్ స్కూటర్లు: గొప్ప మైలేజ్ కూడా..
ప్రపంచంలో అతిపెద్ద టూ వీలర్స్ మార్కెట్లలో ఒకటైన భారత్‌లో.. ఎప్పటికప్పుడు సరికొత్త ద్విచక్ర వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఎన్ని కొత్త టూ వీలర్స్ లాంచ్ అయినా.. ప్రజలు మాత్రం ఎక్కువగా కొన్ని స్కూటర్లను మాత్రమే ఎంపిక చేసుకుని మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ దీపావళికి ఓ మంచి స్కూటర్ కొనాలనుకునే వారికి కూడా అలాంటివి బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.హోండా యాక్టివాభారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో హోండా యాక్టివా అగ్రగామి అనే చెప్పాలి. ఇది ఇప్పటికే మూడు కోట్లు కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది. ప్రస్తుతం యాక్టివా 125, యాక్టివా 6జీ వంటి రూపాల్లో అందుబాటులో ఉంది.యాక్టివా 125 ధర రూ. 84,085 నుంచి రూ. 92,257 మధ్య ఉంది. ఇది 124 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 51.23 కిమీ మైలేజ్ అందిస్తుంది. యాక్టివా 6జీ విషయానికి వస్తే.. దీని ధర రూ. 79624 నుంచి రూ. 84624 మధ్య ఉంది (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఇది 109.51 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 59.5 కిమీ మైలేజ్ అందిస్తుంది.టీవీఎస్ జుపీటర్హోండా యాక్టివా తరువాత అత్యధికంగా అమ్ముడైన స్కూటర్ టీవీఎస్ జుపీటర్. ఇది జుపీటర్ 110, జుపీటర్ 125 అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.జుపీటర్ 110 ధర రూ. 77,400 నుంచి రూ. 90,150 మధ్య ఉంది. ఇది 113.3 సీసీ పెట్రోల్ ఇంజిన్ కలిగి 62 కిమీ మైలేజ్ అందిస్తుంది. జుపీటర్ 125 విషయానికి వస్తే.. దీని ధర రూ. 89,155 నుంచి రూ. 99,805 మధ్య ఉంది. ఇది 124.8 సీసీ ఇంజిన్ ద్వారా 57.27 కిమీ మైలేజ్ అందిస్తుంది.హోండా డియోఎక్కువ మంది ప్రజలు ఇష్టపడి కొనుగోలు చేస్తున్న స్కూటర్లలో హోండా డియో కూడా ఒకటి. రూ. 75630 నుంచి రూ. 82580 మధ్య ధరతో (ఎక్స్ షోరూమ్) అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ 50 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇది 109.51 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది.సుజుకి యాక్సెస్ 125ఇండియన్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందుతున్న సుజుకి యాక్సెస్ 125 ధర రూ. 83,482 నుంచి రూ. 94,082 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఇందులోని 124 సీసీ పెట్రోల్ ఇంజిన్ 45 కిమీ మైలేజ్ అందిస్తుంది. సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.టీవీఎస్ ఎన్‌టార్క్ 125టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధర మార్కెట్లో రూ. 93,126 నుంచి రూ. 1.09 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ స్కూటర్ 124.8 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 47 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఓ మంచి స్టైలిష్ స్కూటర్ కావాలనుకునే వారికి ఈ స్కూటర్ ఓ మంచి ఎంపిక అవుతుంది. -
పండుగలకు జోరుగా టూ వీలర్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: గ్రామీణ డిమాండ్ తిరిగి బలంగా పుంజుకోవడం, రుతుపవనాల పునరుద్ధరణ కారణంగా రాబోయే పండుగ సీజన్లో ద్విచక్ర వాహనాల విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతాయని టీవీఎస్ మోటార్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కమ్యూటర్ బిజినెస్ హెడ్ అనిరుద్ధ హల్దార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో స్కూటర్లకు ఆదరణ పెరగడం ద్విచక్ర వాహన పరిశ్రమ వృద్ధిని నడిపిస్తోందని అన్నారు. మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమలో స్కూటర్ల విభాగం వాటా ప్రస్తుతం 32 శాతం ఉందని, ఇది మరింత వృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. టెక్నాలజీ కారణంగా స్కూటర్లు మెరుగైన మైలేజీ ఇవ్వడం కూడా కస్టమర్ల ఆసక్తికి కారణమైందని వివరించారు. అదనంగా స్థలం, సౌకర్యం, సౌలభ్యం ఉండడం కలిసి వచ్చే అంశమని అన్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ రోడ్లు మెరుగవడం కూడా స్కూటర్ల వినియోగం పెరిగేందుకు దోహదం చేసిందని చెప్పారు. అటు కుటుంబ సభ్యులు సైతం సౌకర్యంగా నడపవచ్చని అన్నారు. గ్రామీణ ప్రాంతాల డిమాండ్.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి కొన్ని నెలల్లో టూ వీలర్స్ పరిశ్రమలో 13 శాతం వృద్ధిని చూశామని అనిరుద్ధ హల్దార్ తెలిపారు. ‘ఇది ఇటీవలి సంవత్సరాలలో మనం చూసిన దానికంటే ఎక్కువ. ఈమధ్య గ్రామీణ ప్రాంతాల డిమాండ్ పట్టణ ప్రాంతాలను మించిపోవడం మరింత సంతోషకరమైన విషయం. గ్రామీణ డిమాండ్ పట్టణ డిమాండ్‌ను అధిగమించడం ప్రారంభించినప్పుడు ఇది మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమకు చాలా మంచి సంకేతం. పండుగల సీజన్లో మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమ ప్రస్తుత వృద్ధి రేటును అధిగమిస్తుందని విశ్వసిస్తున్నాం. పరిశ్రమను మించిన వృద్ధిని టీవీఎస్ నమోదు చేస్తుందని నమ్మకంగా ఉంది’ అని హల్దార్ చెప్పారు. -
2023లో మగువలు మెచ్చిన బెస్ట్ స్కూటర్లు.. ఇవే!
Best Scooters For Womens: భారతదేశంలో రోజురోజుకి లెక్కకు మించిన టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో మగవారికి నచ్చినవి, మహిళకు నచ్చినవి రెండూ ఉన్నాయి. ఈ కథనంలో మహిళలకు ఇష్టమైన టాప్ 5 స్కూటర్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయి? వివరాలు ఏంటి అనే సమాచారం వివరంగా చూసేద్దాం.. హోండా యాక్టివా జి6 (Honda Activa G6) దేశీయ విఫణిలో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న 'హోండా యాక్టివా జి6' మగువలు మెచ్చిన టాప్ స్కూటర్లలో ఒకటని చెప్పవచ్చు. ఇది కొంత ఖరీదైన స్కూటర్ అయినప్పటికీ.. మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి, ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కలిగి అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ స్కూటర్ ధరలు రూ. 77,710 నుంచి రూ. 84,207 వరకు (ఎక్స్ షోరూమ్) ఉంది. టీవీఎస్ జుపీటర్ (TVS Jupiter) టీవీఎస్ కంపెనీకి చెందిన జుపీటర్ కూడా ఎక్కువ మంది మహిళకు ఇష్టమైన మోడల్. రూ. 76,738 నుంచి రూ. 91,739 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న ఈ స్కూటర్ డిజైన్ పరంగా, ఫీచర్స్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 109.7 సీసీ ఇంజిన్ కలిగిన జుపీటర్ 7.88 పీఎస్ పవర్, 8.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) మంచి రైడింగ్ అనుభూతిని అందించే స్కూటర్ల జాబితాలో ఒకటైన సుజుకి యాక్సెస్ 125 రూ. 82,171 రూ. 92,271 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తోంది. బ్లూటూత్ కనెక్టివిటీ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ మంచి అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది. 50 నుంచి 62 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ స్కూటర్ 124 సీసీ ఇంజిన్ కలిగి 8.7 పీఎస్ పవర్, 10 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా డియో (Honda Dio) అతి తక్కువ కాలంలో ఎక్కువ అమ్మకాలు పొందిన హోండా డియో మహిళలకు బాగా నచ్చిన మరో మోడల్. రూ. 74,231 నుంచి రూ. 81,732 మధ్య లభించే ఈ స్కూటర్ 109.51 సీసీ ఇంజిన్ కలిగి 7.76 పీఎస్ పవర్, 9 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ మంచి రైడింగ్ అనుభూతిని అందించే కారణంగానే కొనుగోలుదారులు ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇదీ చదవండి: భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్ - కారణం ఇదే! టీవీఎస్ స్కూటీ జెస్ట్ (TVS Scooty Zest) మన జాబితాలో మహిళలకు ఇష్టమైన మరో స్కూటర్ టీవీఎస్ కంపెనీకి చెందిన 'స్కూటీ జెస్ట్'. దీని ధర రూ. 71,636 నుంచి రూ. 73,313 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభిస్తుంది. 109.7 సీసీ ఇంజిన్ కలిగి 7.81 పీఎస్ పవర్, 8.8 న్యూటన్ మీటర్ టార్క్ అందించే ఈ స్కూటర్ సింపుల్ డిజైన్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. -
దీపావళికి కొత్త స్కూటర్ కొనాలా? బెస్ట్ మోడల్స్ ఇక్కడ చూడండి!
భారతదేశంలో పండుగ సీజన్ ఇప్పటికే మొదలైపోయింది. ఈ తరుణంలో చాలా మంది కొత్త కార్లు లేదా బైకులను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో దేశీయ విఫణిలో కొనుగోలు చేయడానికి ఉత్తమమైన ఐదు స్పోర్టీ స్కూటర్లను గురించి తెలుసుకుందాం. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125) ద్విచక్ర వాహన విభాగంలో అత్యంత ప్రజాదరణపొందిన 'టీవీఎస్ మోటార్' కంపెనీకి చెందిన 'ఎన్‌టార్క్ 125' పండుగ సీజన్లో కొత్త స్కూటర్ కొనాలనుకునే వారికి మంచి ఎంపిక. ఈ స్కూటర్ బేస్ మోడల్ ధర రూ.84636, టాప్ వేరియంట్ ధర రూ. 1.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ 124.8 సీసీ ఇంజిన్ కలిగి 7000 ఆర్పీఎమ్ వద్ద 9.25 బీహెచ్పీ పవర్, 5500 ఆర్పీఎమ్ వద్ద 10 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. సీవీటీ యూనిట్‌తో లభించే ఈ స్కూటర్ మంచి పనితీరుని అందిస్తుంది. సుజుకి అవెనిస్ 125 (Suzuki Avenis 125) సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన ఉత్తమ స్కూటర్లలో ఒకటి అవెనిస్ 125. రూ. 89900 ప్రారంభ ధర వద్ద లభించే ఈ స్కూటర్ 124.3 సీసీ ఇంజిన్ కలిగి 6750 ఆర్పీఎమ్ వద్ద 8.58 బీహెచ్పీ పవర్, 5500 ఆర్పీఎమ్ వద్ద 10 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా గ్రాజియా 125 (Honda Grazia 125) హోండా గ్రాజియా 125 మంచి డిజైన్ కలిగి రూ. 82520 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న ఉత్తమ స్కూటర్లలో ఒకటి. ఇందులో 6000 ఆర్పీఎమ్ వద్ద 8.14 బీహెచ్పీ పవర్, 5000 ఆర్పీఎమ్ వద్ద 10.3 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. సీవీటీ యూనిట్‌తో లభించే ఈ స్కూటర్ పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. యమహా రే జెడ్ఆర్ 125 (Yamaha Ray ZR 125) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన యమహా అనేక స్టైలిష్ బైకులు విడుదల చేసి మంచి అమ్మకాలు పొందుతోంది. కంపెనీకి చెందిన 'రే జెడ్ఆర్ 125' మన జాబితాలోని ఉత్తమ స్కూటర్లలో ఒకటి. రూ. 84730 (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ వెహికల్ 125 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి 8.04 బీహెచ్పీ పవర్, 10.3 టార్క్ అందిస్తుంది. ఇదీ చదవండి: అందుకే 'రోహన్ మూర్తి' ఇన్ఫోసిస్ జాబ్ వదిలేసాడు! ఏప్రిలియా ఎస్ఆర్ 125 (Aprilia SR 125) మన జాబితాలో ఖరీదైన స్కూటర్ ఏప్రిలియా ఎస్ఆర్ 125. దీని ధర రూ. 1.23 లక్షలు (ఎక్స్ షోరూమ్). 124.45 సీసీ ఇంజిన్ కలిగిన ఈ స్కూటర్ 7300 ఆర్పీఎమ్ వద్ద 9.97 బీహెచ్పీ పవర్, 5500 ఆర్పీఎమ్ వద్ద 10.33 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ స్కూటర్ రైడర్లకు అవసరమైన లేటెస్ట్ ఫీచర్స్ ఎన్నో కలిగి ఉంటుంది. -
హోండా నుంచి డియో 125 స్కూటర్ - ధర ఎంతో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా తాజాగా భారత మార్కెట్లో డియో 125 స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.83,400 నుంచి ప్రారంభం. డియో స్కూటర్ ఇప్పటి వరకు 110 సీసీ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ ఫీచర్‌తో ప్రస్తుతం రెండు వేరియంట్లలో 125 సీసీ ఇంజన్‌తో కొత్త మోడల్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్, ఇంజన్ ఇన్హిబిటర్‌తో సైడ్ స్టాండ్ ఇండికేటర్, సీట్, ఫ్యూయల్ లిడ్ తెరవడానికి మల్టీ ఫంక్షన్ స్విచ్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, 171 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వంటి హంగులు జోడించింది. -
మహీంద్రా ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కిస్బీ’ కమింగ్ సూన్
సాక్షి, ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ బైక్ లవర్స్‌ను ఆకర్షించేలా ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ప్యుగోట్ కిస్బీ’ ని త్వరలోనే దేశీయంగా ఆవిష్కరించనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఇది మార్కెట్లను పలకరించే అవకాశం అంచనా. కిస్బీ ధర రూ. 1 లక్షగా ఉంటుందని భావిస్తున్నారు. దేశీయంగా ఎలక్ట్రిక్ వెహికిల్ మార్కెట్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో రానున్న మహీంద్ర ఈ-స్కూటర్ కిస్బీ...ఎథర్ 450ఎక్స్, ఓలా ఎస్1, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్, టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 1.6 కేడబ్ల్యూహెచ్ 48వీ సామర్థ్యం గల లిథియం అయాన్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తున్న కిస్బీ గంటలకు 45 కి.మీ. గరిష్ట వేగంతో 42 కి.మీ. మైలేజే ఇవ్వనుందిట. లాంచింగ్ ముందు ఇండియాలో ప్రత్యేకంగా తీసుకురానున్న కిస్బీ మోడల్ ఈవీ టెస్ట్ రన్ కూడా నిర్వహించింది. కిస్బీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు ఏథర్ 450ఎక్స్ ఈవీ తరహాలో హైటెక్ ఫీచర్లను జోడించినట్టు తెలుస్తోందికలిగి ఉంది. స్కూటర్లో ట్యూబులర్ స్టీల్ చట్రం,టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, రియర్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్బర్, 14 ఇంచ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్, వెనక డ్రమ్ బ్రేక్స్ కలిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. -
బైక్స్ కాదు...స్కూటర్లు దూసుకెళ్తున్నాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గతేడాది ఏప్రిల్-జూలైలో దేశవ్యాప్తంగా 9,77,986 స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది జూలైతో ముగిసిన నాలుగు నెలల్లో ఈ సంఖ్య ఏకంగా 16,87,062 యూనిట్లు నమోదైంది. అంటే 72.5 శాతం అధికం. మోటార్‌సైకిళ్ల వృద్ధి 27 శాతానికే పరిమితమైంది. భారత్‌లో స్కూటర్ల అమ్మకాలు దూసుకెళ్తున్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. తక్కువ బరువు, సులభంగా నడపడానికి వీలుండడం స్కూటర్ల ప్రత్యేకత. నగరాల్లో అయితే కిక్కిరిసిన ట్రాఫిక్‌లో గేర్‌లెస్ వాహనాలే నయం అన్న భావన ప్రజల్లో ఉంది. స్కూటర్ల డిజైన్, పనితీరు విషయంలో పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. బ్యాటరీతో నడిచే ఈ-స్కూటర్ల అమ్మకాలు క్రమంగా అధికం అవుతున్నాయి. జోరుగా వృద్ధి నమోదు.. కంపెనీనిబట్టి స్కూటర్ల అమ్మకాల్లో 15–437 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మోటార్‌సైకిళ్ల కంటే ఇదే అధికం. ఈ ఏడాది జూలైలో 49.79 శాతం వాటాతో స్కూటర్ల రంగంలో హోండా యాక్టివా రారాజుగా నిలిచింది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో రీ ఎంటట్రీ ఇచ్చిన బజాజ్ ఆటో 9,261 యూనిట్లతో ఏకంగా 437.49 శాతం వృద్ధిని సాధించింది. ఇక 2021తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూలైలో హోండా మోటార్‌సైకిల్స్, స్కూటర్స్ ఇండియా 78.39 శాతం అధికంగా 8,12,086 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 108.14 శాతం వృద్ధితో 4,08,036 యూనిట్లు, సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 30.3 శాతం దూసుకెళ్లి 2,21,931 యూనిట్లు, హీరో మోటోకార్ప్ 15.42 శాతం అధికమై 1,04,885 యూనిట్లు, ఇండియా యమహా మోటార్ 60.32 శాతం హెచ్చి 57,525 యూనిట్లను సాధించాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు సైతం.. క్రమంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాల్లో ఈ–టూవీలర్ల వాటా ఈ ఏడాది జనవరిలో 2.7 శాతం. జూన్ నాటికి ఇది 3.8 శాతానికి ఎగసింది. అన్ని కంపెనీలవి కలిపి జనవరిలో 27,590 యూనిట్లు రోడ్డెక్కితే, జూన్ నాటికి ఈ సంఖ్య 42,262 యూనిట్లకు చేరింది. జనవరి-జూన్‌లో దేశవ్యాప్తంగా 2,40,662 ఈ-టూవీలర్లు విక్రయం అయ్యాయి. హీరో మోటోకార్ప్ పెట్టుబడి చేసిన ఏథర్ ఎనర్జీ 2022 ఏప్రిల్-జూలైలో 219.48 శాతం వృద్ధిని సాధించింది 13,265 యూనిట్లను విక్రయించింది. ఓకినావా ఆటోటెక్ 259 శాతం దూసుకెళ్లింది. ఈ ఏడాది జనవరి–జూన్‌లో ఓకినావా నుంచి 47,121 యూనిట్లు, హీరో ఎలక్ట్రిక్ 44,084, ఓలా 41,994, యాంపీర్ ఎలక్ట్రిక్ 33,785, ఏథర్ 15,952, ప్యూర్ ఈవీ 9,531, టీవీఎస్ 8,670, రివోల్ట్ 8,462, బజాజ్ 7,394 యూనిట్లు రోడ్డెక్కాయి. జోరుగా ఈ-స్కూటర్ల విక్రయాలు మోటార్‌సైకిళ్లు ఇలా.. భారత్‌లో 2021 ఏప్రిల్-జూలైలో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 25,77,474 యూనిట్లు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూలైలో ఈ సంఖ్య 27.07 శాతం వృద్ధితో 32,75,256 యూనిట్లుగా ఉంది. ఈ కాలంలో మోటార్‌సైకిళ్ల విక్రయాల్లో బజాజ్ 5.53 శాతం, సుజుకీ 5.69 శాతం తిరోగమన వృద్ధి చెందాయి. హీరో 29.31 శాతం, హోండా 55.56, టీవీఎస్ 13.58, యమహా 67.19, రాయల్ ఎన్ఫీల్డ్ 41.81 శాతం వృద్ధి నమోదు చేశాయి. కాగా, 2021-22లో భారత్‌లో 1,34,66,412 యూనిట్ల ద్విచక్ర వాహనాలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 2025 నాటికి టూవీలర్స్ పరిశ్రమ దేశంలో 2.49 కోట్ల యూనిట్లకు చేరుతుందని అంచనా. -
కీవే అదిరిపోయే స్కూటర్లు: అయ్య బాబోయ్ అంత ధరా!
సాక్షి, ముంబై: బెనెల్లీ గ్రూప్‌కు చెందిన హంగేరియన్ వాహన తయారీ సంస్థ కీవే సరికొత్త ఉత్పత్తులతో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. కొత్త బ్రాండ్‌ను సిక్స్టీస్ 300ఐ, వియోస్ట్ 300లను రెండు మోడల్స్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధర రూ.2,99,000 లుగా ఉండనున్నాయి. వాటిల్లో ఒకటి రెట్రో క్లాసిక్ మోడల్ అయితే, రెండోది మ్యాక్సీ-స్కూటర్. రూ. 10,000 ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే రెండేళ్ల అనిలిమిటెడ్ వారంటీకూడా ఉంది. కేరళలోని త్రివేండ్రంలో ఇప్పటికే ఒక బ్రాంచ్‌ను ఓపెన్ చేసింది. 1999లో ఏర్పాటు చేసిన కీవే కంపెనీ అధునాతన టెక్నాలజీతో రెట్రో క్లాసిక్ స్కూటర్‌ను తీసుకొస్తున్నామని వెల్లడించింది. కీవే కనెక్ట్ సిస్టమ్, సిమ్ కార్డు టెక్నాలజీతో ఈ స్కూటర్లు పనిచేస్తాయి. అంటే ఇంటిగ్రేటెడ్ జీపీఎస్ యూనిట్ కీవే యాప్‌కు కనెక్ట్ అయితే వెహికల్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఇంజిన్‌ను రిమోట్ స్విచ్ ఆఫ్ చేయడం, జియో-ఫెన్స్‌ను సెటప్ రైడ్ రికార్డ్స్ మేనేజ్, స్పీడ్ లిమిట్, కమ్యూనిటీ రైడ్‌లో లొకేషన్ సమాచారాన్ని స్నేహితులతో షేర్ చేసే అవకాశాన్ని కూడా అందిస్తోంది. కీవే సిక్స్టీస్ 300ఐ ఫీచర్లు రెట్రో క్లాసిక్ స్కూటర్ లో 278 సీసీ సింగిల్-సిలిండర్, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 6500 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 18.7 హెచ్‌పీ పవర్, 6000 ఆర్పీఎం వద్ద 22ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 120/70-12 టైర్లు, డ్యూయల్-ఛానల్ ABSతో డిస్క్ బ్రేక్‌లు, స్ప్లిట్-సీట్, డ్యూయల్ ఎల్ఈడీ బ్రేక్ లైట్లు, సిగ్నల్ లైట్లతో కలిపి ఫుల్ ఎల్ఈడీ హెడ్‌లైట్ ఇతర ఆకర్షణలు ఇంకా మల్టీ-ఫంక్షన్ ఇగ్నిషన్ స్విచ్ ఎలక్ట్రిక్ స్టార్టర్, అండర్-సీట్ స్టోరేజ్ యాక్సెస్, స్టీరింగ్ లాక్ వంటి స్పెసిఫికేషన్లు కూడా లబ్యం. మ్యాట్ లైట్ బ్లూ, మ్యాట్ వైట్, మ్యాట్ గ్రే కలర్స్‌లో ఇది లభ్యం. కీవే వియోస్ట్ 300 ఫీచర్లు యాంగ్యులర్ బాడీవర్క్‌తో కూడిన ఏరోడైనమిక్ డిజైన్‌తో కూడిన మ్యాక్సీ స్కూటర్ ఇది. 12 లీటర్ల ఫ్యుయెల్ ట్యాంక్, 278సీసీ లిక్విడ్-కూల్డ్ ఫోర్-స్ట్రోక్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 6500 ఆర్పీఎంవద్ద 18.7హెచ్‌పీ గరిష్ట పవర్‌ను, 6000ఆర్పీఎం వద్ద 22ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నాలుగు ఎల్ఈడీ, ప్రొజెక్టర్లు, డీఆర్ఎల్ హెడ్లైట్లు, టర్న్ ఇండికేటర్ సిగ్నల్లు, కాంటినెంటల్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్, డిస్క్ బ్రేక్‌లు, టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్లు, డ్యూయల్-ఛానల్ ABSలు ఇతర ఫీచర్లు. మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ, మ్యాట్ వైట్ అనే మూడు రంగుల్లో ఈ స్కూటరు లభిస్తుంది. Benelli | Keeway India cordially invites you to our newest dealership in Trivandrum. Come witness the roar. Visit: Benelli | Keeway - Trivandrum NH 66 Bypass, Chackai, Anayara. P.O, Trivandrum - 695029, Kerala.#Trivandrum #BenelliIndia #KeewayIndia #India pic.twitter.com/xCaELTIFZq — KeewayIndia (@keeway_india) June 1, 2022 అలాగే 2022 చివరికి నాలుగు కేటగిరీల్లో మొత్తం ఎనిమిది ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేయాలని కీవే భావిస్తోంది. ముఖ్యంగా హై-ఎండ్ స్కూటర్లు, క్రూయిజర్లు, స్పోర్ట్ మోటార్‌సైకిళ్లు, రెట్రో-స్ట్రీట్ బైక్స్‌పై దృష్టిపెట్టినట్టు కీవే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఝబఖ్ తెలిపారు. The #Vieste300 is a modern powerhouse with a chiselled design, made to ease your city commute. Experience its brilliant performance first hand. Starts at ₹ 2.99 Lakhs* with 2-Year Unlimited KMS warranty ,Book yours online at ₹ 10 000 only from https://t.co/TZ4YeukZv3 T&C* Apply pic.twitter.com/Xiyn0EvPia — KeewayIndia (@keeway_india) May 31, 2022 -
ఉడెన్ కిక్ టు ఎలక్ట్రిక్ దాకా.. స్కూటర్ పుట్టుక, పరిణామ క్రమం గురించి తెలుసా?
Scooter History And Evolution: స్కూటర్.. సామాన్యుడికి ఇష్టమైన మోతబండి. మార్కెట్లో భారత వాహన రంగాన్ని సైతం ఏలే దమ్ముంది ఈ బండికి. అయితే కాలం మారినట్లే.. ఇందులోనూ కొత్త కొత్త అప్డేట్ వెర్షన్లు వస్తున్నాయి. మరి దీని పరిణామా క్రమంలో కొన్ని మార్పులు ఎలా జరిగాయి.. ఆ కథ ఏంటో ఒక్కసారి స్కూటర్బండిపై కాలంలో వెనక్కి వెళ్లి చూద్దాం. స్కూటర్.. జర్మనీలో 18వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ బండి ప్రయాణం ఇప్పటికీ అప్రతిహతంగా సాగుతోంది. ఆధునిక కాలంలోనూ తన రూపం మార్చుకుని సామాన్యుడి జీవితంలో మమేకమవుతోంది. 19వ శతాబ్దంలో భారత్‌లోకి ప్రవేశించిన స్కూటర్లు రోడ్లపై ఎటు చూసినా దర్శనమిచ్చేవి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్క్‌లు వంటి జనసమ్మర్థ ప్రాంతాల్లో అవే ఎక్కువగా కనిపించేవి. సినిమాల్లో హీరోల ఎంట్రన్స్‌లు కూడా వాటి పైనే ఎక్కువగా ఉండేవి. వ్యవసాయ పనులు చేసుకునే వారు, ఉద్యోగస్తులే కాకుండా దాదాపు అన్ని వర్గాల వారితో స్కూటర్ తన బంధాన్ని పెనవేసుకుంది. ద్విచక్ర వాహనదారుల అభిరుచులలో మార్పులు రావడంతో కాలక్రమేణా స్కూటర్లు తన రూపును మార్చుకున్నాయి. ఇప్పుడు మార్కెట్లో ఎలక్ట్రికల్ స్కూటర్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ పెట్రోలు వాహనాలు ఎక్కువగా రోడ్లపై తిరుగుతుండటం, శబ్ధ కాలుష్యం తదితర కారణాలతో వాహనదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించారు. ఎలక్ట్రికల్ స్కూటర్లే కాకుండా స్పోర్ట్స్ బైక్‌లు, బుల్లెట్లపై యువతలో క్రేజ్ ఉండటంతో వాటిని కూడా కంపెనీలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే ఒక్కసారి బ్యాటరీ రీచార్జ్ చేస్తే వందకుపైగా కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉండటం, పెట్రోల్ ఖర్చు తప్పుతుండటం, కాలుష్య రహిత వాహనం కావడంతో ఎక్కవమంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఎలక్ట్రికల్ స్కూటర్ల హవా నడుస్తోంది. వీటి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో చాలా కంపెనీలు ఆన్లైన్లో ప్రీబుకింగ్‌ను ఓపెన్ చేస్తున్నాయి. అట్లాంట భారత్‌లో తయారైన మొట్టమొదట స్కూటర్ ఇదే. ఎన్‌హెచ్ రాజ్‌కుమార్ అనే వ్యక్తి కేరళలోని తిరువనంతపురంలో దీన్ని రూపొందించడాన్ని మొదలుపెట్టారు. సుదీర్ఘకాలం పాటు శ్రమించి 1976లో తొలిసారిగా మీడియా ముందు అట్లాంట స్కూటర్‌ను ప్రవేశపెట్టారు. గంటకు 70 కిలో మీటర్ల వేగం, లీటర్‌కు 60 కిలోమీటర్ల మేరకు ప్రయాణం దీని సొంతం. అప్పట్లో దీని ధర రూ.2,300 ఉండేది. ఈ స్కూటర్‌ను తయారు చేయడానికి వాడిన భాగాల్లో 75 శాతం మన దేశంలో తయారు చేసినవే. కొన్నాళ్ల అనంతరం కేంద్ర ప్రభుత్వం దీన్ని టేకోవర్ చేయడం ప్రారంభించింది. రాజకీయ కారణాలు, కార్మికుల సమస్యలతో ‘అట్లాంట’ తన ఉనికిని కోల్పోయింది. లూనా 1972లో 50సీసీ ఇంజన్‌తో కెనిటిక్ ఇంజనీరింగ్ సంస్థ మోపెడ్‌ను భారత ఆటోమెబైల్ మార్కెట్లోకి విడుదల చేసింది. 2000 సంవత్సరం వరకు వీటి ఉత్పత్తి జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయదారులు దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పటికీ రూరల్ ప్రాంతాల్లో లూనాలు కనిపిస్తుండటం విశేషం. చేతక్ 1972లో బజాజ్ కంపెనీ చేతక్ బండిని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 15వ శతాబ్దానికి చెందిన రాజస్థాన్ రాజు మహారాణ ప్రతాప్ తన గుర్రానికి పెట్టుకున్న పేరు (చేతక్)నే బజాజ్ కంపెనీ ఈ బండికి పెట్టింది. గంటలకు 90 కిలోమీటర్ల వేగం, లీటర్‌కు 62 కిలోమీటర్ల ప్రయాణం దీని సొంతం. 2006 వరకు దీని హవా సాగింది. ఆ తరువాత బజాజ్ కంపెనీ బైక్‌లపై దృష్టి సారించి చేతక్‌ల ఉత్పత్తిని నిలిపివేసింది. ఇలా 1950లో మొదలైన స్కూటర్ కాలాంతరంగా పలు రూపాలను మార్చుకుంటూ వస్తోంది. ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఎలక్ట్రికల్ స్కూటర్లపై వాహనదారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వాటి తయారీకి కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. కొన్ని కంపెనీలు మహిళల కోసం ప్రత్యేకంగా స్కూటర్లు డిజైన్ చేస్తున్నాయి. ప్రస్తుతం రోడ్లపై అవే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. లంబ్రెట్టా 1920ల అనంతరం ఆటోపెడ్ కన్నా మెరుగ్గా 1952లో లంబ్రెట్టా అనే స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. దీని భాగాలను ఇటలీ నుంచి భారత్‌కు తీసుకువచ్చి ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండియా (ఏపీఐ) అసెంబ్లింగ్ చేసేది. దీని ఇంజన్ కెపాసిటీ 48సీసీ. ఎల్ఐ 150 సీరీస్ 2 అనే పేరుతో ఏపీఐకి లైసెన్స్ మంజూరు అయ్యింది. 1976 వరకు వీటి అమ్మకాలు జరగ్గా ఆ తరువాత న్యాయపరమైన సమస్యలు తలెత్తడంతో వీటిని మార్కెట్లోకి విడుదల చేయడాన్ని ఏపీఐ నిలిపివేసింది. ఆటోపెడ్ దీన్నే క్రప్–రోలర్ అని కూడా పిలిచేవారు. 1915–1921 వరకు ఇవి ప్రపంచ మార్కెట్లో ఉన్నాయి. గంటకు 32 కిలోమీటర్ల వేగంతో దీనిపై ప్రయాణించవచ్చు. దీని టైర్లు 10 ఇంచులకు పైగా ఉండేవి. ఉడెన్ కిక్ స్కూటర్ 1894లో హిల్డర్ బ్రాండ్ అండ్ ఓల్ఫ్ ముల్లర్ మోటర్ సైకిల్‌ను రూపొందించినా పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. వారు రూపొందించిన మోటర్‌సైకిల్ స్ఫూర్తితో అర్థర్ హుగో సీసెల్గిబ్జన్ స్కేటింగ్‌కి ఉపయోగించే చక్రాలు, చెక్కతో 1913లో ఉడెన్ కిక్ స్కూటర్‌ను రూపొందించారు. మార్కెట్లోకి ఇది 1916లో వచ్చింది. అయితే అప్పటికే ప్రపంచవ్యాప్తంగా స్కూటర్ల తయారీకి విస్తృత స్థాయిలో పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఆటోపెడ్ మార్కెట్లోకి వచ్చింది. –సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ -
కిచెన్‌లో ఈవీ స్కూటర్! కారణమేంటీ?
ఎవరింట్లో అయినా కిచెన్ అంటే వంట పాత్రలు, గ్యాస్‌స్టవ్, మిక్సీ, మైక్రో ఓవెన్లు, పొపుల పెట్టె లాంటి వస్తువులు ఉంటాయి. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భాస్కర్ ఇంట్లో రాత్రయితే చాలు స్కూటర్ వచ్చి చేరుతుంది. వంటింట్లో స్కూటర్‌తో పనేంటి ? ప్రతీ రోజు రాత్రి అదక్కడికి ఎందుకు వస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రిక్ వెహికల్ హాబ్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న బెంగళూరు నివాసి భాస్కర్. పెరుగుతున్న పెట్రోలు ధరల భారం మోయలేక ఇటీవలే ముచ్చపడి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. అయితే పెట్రోలు బాధలు తప్పినా ఇరుగుపొరుగుకు శత్రువయ్యాడు. వంటిల్లులోకి స్కూటర్ తేవడంతో ఆఖరికి సొంతింట్లో కూడా మద్దతు సంపాదించలేని స్థితికి చేరుకున్నాడు. ఇలాంటి ఒక్క భాస్కర్‌కే కాదు నగరాల్లో నివాసం ఉంటూ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసిన చాలా మంది పరిస్థితి భాస్కర్లాగే మారింది. ఎక్కడ ఛార్జ్ చేయాలి ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్న వారిలో ఎక్కువ మంది అపార్ట్మెంట్లలోనే నివాసం ఉంటున్నారు. మన దగ్గరున్న నూటికి 99 శాతం అపార్ట్మెంట్లలో ఛార్జింగ్ పాయింట్లు లేవు. దీంతో వాహనం కొనుగోలు చేసిన వారు దాన్ని ఛార్జింగ్ పెట్టుకునేందుకు నానా ఆగచాట్లు పడుతున్నారు. - అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న అన్ని కుటుంబాలు ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి ఇంకా మారలేదు. - ఎలక్ట్రిక్ వెహికల్‌కి మారిన వారు అపార్ట్మెంట్లో ఛార్జింగ్ పాయింట్ పెట్టుకుంటామంటే మిగిలిన వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. - ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తే దానికి వచ్చే కరెంటు బిల్లు ఎవరు భరించాలి ? ఆ ఛార్జింగ్ పాయింట్‌ని సురక్షితంగా ఎవరు మెయింటైన్ చేయాలనేది సమస్యగా మారింది. - ఛార్జింగ్ పాయింట్లు పేలిపోతాయనే అపోహలు ఇంకా జనాల్లో ఉన్నాయి. దీంతో ఛార్జింగ్పాయింట్ ఏర్పాటుకు ససేమిరా అంటున్నారు. ఏర్పాటు కూడా కష్టమే ఇక అపార్ట్మెంటులో ఉన్న వాళ్లందరినీ ఒప్పించి ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకోవాలంటే విద్యుత్ శాఖ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. - ఛార్జింగ్ పాయింట్‌కి ప్రత్యేకంగా మీటరు ఏర్పాటు చేసుకోవాలి. దీని కోసం విద్యుత్ డిస్కంలకు దరఖాస్తు చేయాలి. - ఇటీవల బెంగళూరుకి చెందిన నరేశ్ ఇలా కొత్తగా పాయింట్ ఏర్పాటు చేసుకుంటే ఈవీ ఛార్జింగ్ ఎక్వీప్మెంట్కి రూ. 2000ల ఖర్చు వస్తే విద్యుత్ శాఖ వారు వైరు లాగేందుకే రూ. 11,000 వసూలు చేశారు. - ఈవీ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు సంబంధించి విద్యుత్ సంస్థలకు ఓ విధానమంటూ లేదు. పై నుంచి ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి గైడ్‌లైన్స్ లేవు. దీంతో ఈవీ ఛార్జింగ్ పాయింట్ల విషయంలో విద్యుత్‌శాఖ స్పందన అంతంత మాత్రంగానే ఉంది. తప్పని తిప్పలు కాలుష్యాన్ని తగ్గించాలంటూ ఓ వైపు ప్రభుత్వ విధానాలు, మరోవైపు పెరిగిపోతున్న పెట్రోలు ధరల ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ పెరిగిపోతుంది. అయితే ఈవీకి మారాలంటూ ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, అందుకు తగ్గ పరిస్థితులు సృష్టించడంలో విఫలం అవుతోంది. దీంతో అపార్ట్మెంట్లలో నివాసం ఉండేవారు ఛార్జింగ్ పాయింట్ల కోసం తోటి వారితో పోరాటం చేయాల్సి వస్తోంది. లేదంటే ఇంటి వంట గదిలోకి తీసుకెళ్లి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తోంది. మా సమస్య పరిష్కరించండి అపార్ట్మెంట్లలో ఛార్జింగ్ పాయింట్లకు అనుమతి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానాల్లో అర్జీలు నమోదు అవుతున్నాయి. ఈవీ ఛార్జింగ్ పాయింట్లకు అడ్డుపడుతున్న అపార్ట్మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేన్స్ అభ్యంతరాలను కొట్టేయాలంటూ న్యాయస్థానాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. బెంగళూరు సివిల్ కోర్టులో ఇప్పటికే రెండు వేల మంది సంతకాలతో కూడిన పిటిషన్ విచారణలో ఉంది. సమగ్ర విధానమేదీ? ఈవీ తయారీ, అమ్మకాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చూపెడుతున్న శ్రద్ధ వాటి మెయింటెన్స్ విధానాలపై కూడా చూపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. అపార్ట్మెంట్లలో ఛార్జింగ్ పాయింట్లను చేర్చడం, కొత్త కనెక్షన్ విషయంలో విద్యుత్ సంస్థలకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు కొత్తగా వచ్చే ఇళ్లలో ఈవీ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు, మెయింటనెన్స్‌ను తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలు అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: Yamaha: ఫెస్టివల్ ఆఫర్, ఈ బైక్ కొంటే లక్ష వరకు.. -
భారత మార్కెట్లో విడుదలైన వెస్పా 75వ ఎడిషన్ స్కూటర్
ప్రముఖ ఇటాలియన్ వాహన సంస్థ పియాజియో భారతీయ మార్కెట్లోకి వెస్పా 75వ ఎడిషన్ 125 సీసీ, 150 సీసీ స్కూటర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిని ₹1.26 లక్షలు (125 సీసీ, ఎక్స్ షోరూమ్ పూణే), ₹1.39 లక్షల(150 సీసీ, ఎక్స్ షోరూమ్ పూణే)కు విడుదల చేసింది. ఈ రెండు స్కూటర్లు కంపెనీ పోర్టల్, డీలర్స్ వద్ద బుకింగ్స్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్ల సైడ్ ప్యానెల్స్ పై '75' డెకాల్స్ అనే ప్రత్యేక నంబర్ ఉంటుంది.(చదవండి: తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్...!) ఈ స్కూటర్లలో ఒరిజినల్ ఫీచర్లు, మెకానికల్ టెక్ స్పెసిఫికేషన్ లను కలిగి ఉంటాయి. చిన్న 125సీసీ మోడల్ 7,500 ఆర్ పీఎమ్ వద్ద 9.93హెచ్ పీ పవర్, 5,500ఆర్ పీఎమ్ వద్ద 9.6ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 150 సీసీ సామర్థ్యం గల స్కూటర్ 7,600 ఆర్ పీఎమ్ వద్ద 10.4 హెచ్ పీ పవర్, 5,500 ఆర్ పీఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వీటిలో ముందు వైపున 200మిమి డిస్క్, వెనుక వైపున 140మిమి డ్రమ్ బ్రేక్స్ తో వస్తాయి. 125 సీసీ మోడల్ లో సీబిఎస్ సిస్టమ్ వస్తుంది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 190 నగరాల్లో వెస్పా ఉనికిని కలిగి ఉంది. అయితే డీలర్‌షిప్‌లు త్వరలో 300 నగరాలకు విస్తరించడానికి కంపెనీ యోచిస్తోంది.(చదవండి: Wikipedia:హ్యాక్..! లిస్ట్‌లో టాప్ సెలబ్రిటీలు..!) -
ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 బుకింగ్ షురూ
న్యూఢిల్లీ, సాక్షి: మ్యాక్సి స్కూటర్.. ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160కు బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు పియాజియో ఇండియా తాజాగా పేర్కొంది. విడుదలకు ముందు (ప్రీలాంచ్) బుకింగ్‌కు తెరతీసినట్లు తెలియజేసింది. రూ. 5,000 చెల్లించడం ద్వారా స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ప్రీమియం స్కూటర్‌ను ప్రస్తుతం బారామతి ప్లాంటులో తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. బీఎస్-6 ప్రమాణాలతోపాటు.. లెడ్ స్ప్లిట్ హెడ్లైట్లు, మొబైల్ కనెక్టివిటీ, సర్దుబాటుకు వీలయ్యే వెనుక సస్పెన్షన్, డిస్క్ బ్రేకులు తదితర ఫీచర్స్‌ను పొందుపరచినట్లు పియాజియో ఇండియా ఒక ప్రకటనలో వివరించింది. కంపెనీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో లేదా డీలర్ల ద్వారా దేశవ్యాప్తంగా బుకింగ్స్‌కు వీలున్నట్లు తెలియజేసింది. (హెల్మెట్ వాయిస్ కమాండ్స్‌తో ఇక బైకులు!) సవాళ్లున్నప్పటికీ 2020లో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ దేశీయంగా ప్రీమియం స్కూటర్ ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ఉత్పత్తిని చేపట్టగలిగినట్లు పియాజియో ఇండియా చైర్మన్ డీగో గ్రాఫీ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. ఆధునిక ఫీచర్లు, తరువాతి తరం డిజైన్‌తో రానున్న ప్రీమియం స్కూటర్ వినియోగదారులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది(2020) ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారి క్యాండీ రెడ్ కలర్లో మ్యాక్సి స్కూటర్‌ను పియాజియో ప్రదర్శించింది. దేశీయంగా జపనీస్ దిగ్గజం సుజుకీ తయారీ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 వాహనానికి ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ ప్రత్యక్ష 160 పోటీనివ్వగలదని ఆటో రంగ నిపుణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. (కొత్త ఏడాదిలో ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ) ఎల్సీడీ క్లస్టర్ దేశీ మార్కెట్‌కు అనుగుణంగా ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160ను పియాజియో ఇటలీలో రూపొందించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. మూడు వాల్వ్‌ల ఫ్యూయల్ ఇంజక్ట్‌డ్ మోటార్‌తో కూడిన 160 సీసీ ఇంజిన్‌ను ఆధునీకరించి మ్యాక్సీ స్కూటర్లో వినియోగించినట్లు ఆటో రంగ నిపుణులు తెలియజేశారు. ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, డిస్క్ బ్రేకులు తదితర ఫీచర్స్‌తో స్కూటర్ వెలువడనున్నట్లు చెబుతున్నారు. ట్విన్ క్రిస్టల్ హెడ్‌లైట్స్, 3 కోట్ హెచ్డీ బాడీ పెయింట్ ఫినిష్‌తో రూపొందుతున్నట్లు వివరించారు. ఎప్రిలియా ప్రీమియం స్కూటర్.. గ్లాసీ రెడ్, మ్యాట్ బ్లూ, గ్లాసీ వైట్ అండ్ మ్యాట్ బ్లాక్ కలర్స్‌లో లభ్యంకానున్నట్లు తెలియజేశారు. ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.10-1.2 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. -
కొత్త ఏడాదిలో ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160
ముంబై, సాక్షి: మ్యాక్సి స్కూటర్.. ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160ను వచ్చే ఏడాది(2021) తొలినాళ్లలో విడుదల చేసేందుకు పియాజియో ఇండియా ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది. ఇటాలియన్ కంపెనీ దేశీయంగా విడుదల చేయనున్న ఈ ప్రధాన వాహనాన్ని రెండు ప్రత్యేక కలర్స్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. కంపెనీ బారామతిలో్ ఏర్పాటు చేసిన ప్లాంటులో మ్యాక్సి స్కూటర్ తయారీకి సన్నాహాలు చేసినట్లు పియాజియో ఇటీవల తెలియజేసింది. ఈ ఏడాది(2020) ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారి క్యాండీ రెడ్ కలర్లో మ్యాక్సి స్కూటర్‌ను పియాజియో ప్రదర్శించింది. తాజాగా బ్లూకలర్‌పైనా కంపెనీ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. దేశీయంగా జపనీస్ దిగ్గజం సుజుకీ తయారీ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 వాహనానికి ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ ప్రత్యక్ష 160 పోటీనివ్వగలదని ఆటో రంగ నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి: (కార్లయిల్ చేతికి గ్రాన్సూల్స్ ఇండియా!) ఎల్సీడీ క్లస్టర్ దేశీ మార్కెట్‌కు అనుగుణంగా ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160ను పియాజియో ఇటలీలో రూపొందించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. తద్వారా ఈ విభాగంలో విలువైన బ్రాండ్లకు డిమాండ్ ఉన్నట్లు చెబుతున్నాయి. మూడు వాల్వ్‌ల ఫ్యూయల్ ఇంజక్ట్‌డ్ మోటార్‌తో కూడిన 160 సీసీ ఇంజిన్‌ను ఆధునీకరించి మ్యాక్సీ స్కూటర్లో వినియోగించినట్లు ఆటో రంగ నిపుణులు తెలియజేశారు. ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, డిస్క్ బ్రేకులు తదితర ఫీచర్స్‌తో స్కూటర్ వెలువడనున్నట్లు చెబుతున్నారు. ట్విన్ క్రిస్టల్ హెడ్‌లైట్స్, 3 కోట్ హెచ్డీ బాడీ పెయింట్ ఫినిష్‌తో రూపొందుతున్నట్లు వివరించారు. అధికారిక సమాచారం లేకున్నప్పటికీ బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా రూపొందిన ఎప్రిలియా స్కూటర్ ఖరీదు రూ. 1.1-1.2 లక్షల స్థాయిలో ఉండొచ్చని ఆటో వర్గాల అంచనా. -
హోండా డియో బీఎస్-6 లాంచ్
సాక్షి, ముంబై: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) కొత్త హోండా డియోను విడుదల చేసింది, భారత్ స్టేజ్ 6(బిఎస్ 6) ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసిన కొత్త హోండా డియో స్కూటర్‌ను లాంచ్ చేసింది. కొత్త డిజైన్, కొత్తఫీచర్లతో లాంచ్ చేసిన దీని ప్రారంభ ధరను రూ. 59,990గా ఉంచింది. కొత్త హోండా డియోకు 6 సంవత్సరాల వారంటీ ( 3 సంవత్సరాల ప్రామాణిక వారంటీ 3 సంవత్సరాల అదనపు ఐచ్ఛిక వారంటీ కూడా) అందిస్తోంది. మొత్తం ఏడు కొత్త రంగులలో స్టాండర్డ్, డీలక్స్ అనే రెండు వేరియంట్లలో లభ్యం మవుతోంది. 110 సీసీ ఇంజన్, మెరుగైన స్మార్ట్ పవర్ (ఇఎస్పి)తో నడిచే హోండా ఎకో టెక్నాలజీ (హెచ్ఇటి) తో పాటు, కొత్త డిజైన్‌ను, కొత్త ఫీచర్లను న్యూ వేరియంట్లో జోడించింది. దీని ఇంజీన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.68 బీహెచ్పీ పవర్‌ను, 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 8.79 ఎన్ఎమ్ గరిష్ట్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 2020 హోండా డియోలో కొత్త సిగ్నేచర్ ఎల్ఇడి పొజిషన్ లాంప్, మోడరన్ టెయిల్ లాంప్ డిజైన్, స్ప్లిట్ గ్రాబ్ రైల్స్, కాంబీ బ్రేక్ సిస్టం(సీబీఎస్) కొత్త బాడీ గ్రాఫిక్‌లతో కొత్త హోండా డియోకు పుల్ డిజిటల్ స్పీడోమీటర్, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ప్రధాన ఫీచర్లు. ధరలు 2020 హోండా డియో బిఎస్ 6 మోడల్ స్టాండర్డ్ వేరియంట్ ధర : 59,990 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్, కాండీ జాజీ బ్లూ, స్పోర్ట్స్ రెడ్ , వైబ్రెంట్ ఆరెంజ్ ఇలా నాలుగు రంగు ఎంపికలలో లభిస్తుంది. హోండా డియో డీలక్స్ వేరియంట్ ధర రూ.63,340 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) మాట్టే సాంగ్రియా రెడ్ మెటాలిక్, డాజిల్ ఎల్లో మెటాలిక్ , మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్ అనే మూడు రంగు ఎంపికలలో లభిస్తుంది. -
ఒకినామా ఎలక్ట్రిక్ స్కూటర్లు
సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనల తయారి సంస్థ ఒకినావా ‘ప్రైజ్ ప్రో’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధరను 71,990 రూపాయల (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. గ్లాసీ రెడ్ బ్లాక్, గ్లాసీ స్పార్కిల్ బ్లాక్‌అనే రెండు రంగుల్లో ఈ స్కూటర్నుతీసుకొచ్చామని ఒకినావా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఒకినావా ప్రైజ్‌ప్రో ఎకానమీ, స్పోర్ట్స్, టర్బో అనే మూడు మోడళ్లలో వినియోగదారులకు లభ్యంకానుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 90-110కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకోవడంలో గణనీయమైన ప్రగతిని సాధించామని ఓకినావా ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎండీ జితేందర్ శర్మ వెల్లడించారు. భారతీయ వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడానికి, ఎక్కువమంది వినియోగదారులను ఆకట్టుకొనేందుకు పెట్రోల్ స్కూటర్ కంటే సమర్థవంతమైన ఉత్పత్తులను పరిచయం చేయాలనుకుంటోందన్నారు. లిథియం-అయాన్ బ్యాటరీలు బ్యాటరీ ఛార్జింగ్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తాయని తెలిపారు. ఆఫీసులకు వెళ్లేవారికి, కుటుంబాలకు సంబంధించిన రోజువారీ ప్రయాణ అవసరాలను ఈ ప్రొడక్ట్ తీరుస్తుందన్నారు. అలాగే ఈ వాహనాలపై జీఎస్టీ 18 నుంచి 5 శాతానికి తగ్గించిన కారణంగా ఇది అత్యంత చౌకైన స్కూటర్ అని శర్మ తెలిపారు. ప్రైజ్‌ప్రో స్కూటర్ కీలక స్పెసిఫికేషన్స్ 1000-వాట్ల బీఎల్డీసీ వాటర్‌ప్రూఫ్ ఎలక్ట్రిక్ మోటారు ఇది 2.0 కిలోవాట్ డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. గరిష్ట శక్తి 2500 వాట్స్ 2 నుండి 3 గంటల్లో పూర్తి ఛార్జింగ్ స్పోర్ట్స్ మోడ్‌లో 90 కిమీ / ఛార్జ్ ఎకో మోడ్‌లో 110 కిమీ / ఛార్జ్ బ్యాటరీ వారెంటీ: 3 సంవత్సరాలు లేదా 20000 కి.మీ (ఏది ముందు అయితే అది) ఫైనాన్సింగ్ పార్టనర్లు: మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ , హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఎకో మోడ్ 30-35 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుండగా, స్పోర్ట్స్ మోడ్‌లో 50-60 కిలోమీటర్ల వేగాన్ని, టర్బో అత్యధిక టాప్ స్పీడ్‌తో 65-70 కిలోమీటర్లు అందిస్తుంది. ఇంకా సెంట్రల్ లాకింగ్ విత్ యాంటీ-తెఫ్ట్ అలారం, కీలెస్ ఎంట్రీ, ఫైండ్ మై స్కూటర్ ఫంక్షన్, మొబైల్ ఛార్జింగ్ యుఎస్బీ పోర్ట్ , మోటర్ వాకింగ్ అసిస్ట్ విత్ ఫ్రంట్ అండ్ రివర్స్ మోషన్, రోడ్డుసైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ వంటి కొన్ని ఆసక్తికరమైన ఫీచర్లను ఇందులో జోడించింది. ఒకినావా ప్రైజ్ప్రోలో 150 కిలోల లోడింగ్ సామర్థ్యం ఉంది. -
రూ.15 లక్షల స్కూటర్ తెస్తాం!
♦ పియాజియో వెహికల్స్ ఎండీ స్టెఫానో పెలె ♦ త్వరలో మార్కెట్లోకి వెస్పా 946 ఎంపోరియం ♦ ఈ ఏడాది మరిన్ని నూతన మోడళ్లు ప్రవేశపెడతాం... పియాజియో.. ప్రీమియం ద్విచక్ర వాహనాల తయారీలో ఉన్న ఈ ఇటాలియన్ కంపెనీ భారత మార్కెట్లో దూసుకెళ్తోంది. రెండేళ్లుగా డీలర్షిప్ కేంద్రాలను పెంచడమేగాక మార్కెట్ పరంగా ఉనికిని చాటుకుంటోంది. తయారీ కేంద్రం సామర్థ్యాన్ని పెంచుతోంది. 18-28 ఏళ్ల యువ కస్టమర్లు లక్ష్యంగా వెస్పా ఫ్లాగ్షిప్ మోడల్‌తో స్కూటర్ల విపణిలో తనకంటూ ప్రత్యేకతను సాధించింది. 125 సీసీ స్కూటర్లతో భారత్‌లో 2012లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. మార్కెట్ తీరుకు అనుగుణంగా ఇప్పుడు 150 సీసీ సామర్థ్యమున్న మోడళ్లను విస్తృతం చేస్తున్నట్టు పియాజియో వెహికల్స్ ఎండీ స్టెఫానో పెలె తెలిపారు. ప్రతి మోడల్ ఒక కొత్త విభాగాన్ని సృష్టిస్తుందని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. విశేషాలివీ.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : భారత్‌లో వేగం పెంచినట్టు ఉన్నారు.. అవును. రెండేళ్లుగా బ్రాండ్ ఉనికిని పెంచాం. ఈ ఏడాది మరింత విస్తరిస్తున్నాం. చిన్న పట్టణాల్లోనూ వినియోగదారులు వెస్పా స్కూటర్లు కొంటున్నారు. పుణేకు 200 కిలోమీటర్ల దూరంలో ఓ మారుమూల పల్లెలో వెస్పా పరుగు తీయడం కంటపడింది. స్కూటర్ యజమానితో మాట్లాడాను. వాహనం గురించి అడిగాను. తనకు బాగా నచ్చిందన్నది ఆయన సమాధానం. ఇదే మాకు స్ఫూర్తి కలిగిస్తోంది. పల్లెల్లోనూ మాకు కస్టమర్లున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 90 డీలర్షిప్ కేంద్రాలున్నాయి. డిసెంబర్‌కల్లా మరో 25 రానున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నాం. 2016లో విస్తరణతో ఈ నగరాల్లోని ఔట్లెట్ల సంఖ్య 20 శాతానికి చేరుతుంది. ఏ లక్ష్యంతో ఇక్కడ అడుగుపెట్టారు? స్కూటర్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అందుకే మా ఫోకస్ అంతా ప్రీమియం స్కూటర్లపైనే. దేశంలో బైక్‌ల కంటే వీటి వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. తొలుత 125 సీసీ మోడళ్లను ప్రవేశపెట్టాం. ఇప్పుడు దేశంలో 150 సీసీ మోడళ్లు పాపులర్ అవుతున్నాయి. దీంతో ఈ శ్రేణిని పెంచుతున్నాం. 100 రకాల వాహనాలున్నా వెస్పా తన ఉనికిని చాటుకుంటోంది. ఆ స్థాయిలో డిజైన్‌తో ప్రవేశపెట్టాం. రంగులూ ఆకట్టుకునే రీతిలో ఎంపిక చేశాం. ప్రతి మోడల్ మార్కెట్లో ఒక నూతన విభాగాన్ని సృష్టించాలన్నదే మా లక్ష్యం. ఇప్పటి వరకు వచ్చిన మోడళ్లు దీనిని నిరూపించాయి కూడా. ఆటో షోలలో పలు మోడళ్లను ప్రదర్శించారు. భారత్‌కు వేటిని తీసుకొస్తున్నారు? స్పోర్టీ, స్టైలిష్ స్కూటర్ అప్రీలియా ఎస్ఆర్ 150 ఆగస్టుకల్లా రోడ్డెక్కనుంది. స్కూటర్‌లాంటి సౌకర్యం, బైక్‌లాంటి పవర్‌తో ఇది వస్తోంది. కొత్త విభాగాన్ని క్రియేట్ చేయడం ఖాయం. మోటో గుజ్జి బ్రాండ్‌లో రోమర్, బాబర్ బైక్‌లను మూడో త్రైమాసికంలో ప్రవేశపెడుతున్నాం. వెస్పా 300 జీటీఎస్ స్కూటర్, వెస్పా 946 ఎంపోరియో అర్మాణీ స్కూటర్ ఈ ఏడాదే రానున్నాయి. భారత్‌లో 946 మోడల్ ధర ఇంకా నిర్ణయించలేదు. రూ.12లక్షలు-15 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. విభిన్న కాన్సెప్ట్స్‌తో ఈ స్కూటర్‌ను రూపొందించాం. పియాజియో మెడ్లీ 150, పియాజియో లిబర్టీ 125 స్కూటర్లు ప్రస్తుతానికి విదేశీ మార్కెట్లలోనే విక్రయిస్తాం. ఆ తర్వాత భారత్‌కు పరిచయం చేయాలని ఉంది. మరి కొత్త మోడళ్ల రాకతో తయారీ సామర్థ్యం పెంచాల్సి వస్తుందా? అమ్మకాల్లో విలువ పరంగా రెండింతల వృద్ధి నమోదు చేశాం. మహారాష్ట్రలోని తారామతి వద్ద ఉన్న ప్లాంటు వార్షిక సామర్థ్యం 1,00,000 యూనిట్లు. కొత్త మోడళ్లు పరుగు తీయనుండడంతో వచ్చే ఏడాది సామర్థ్యం పెంచాల్సి వస్తుంది. నేపాల్, మాల్దీవులకు ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేస్తున్నాం. దక్షిణాసియా దేశాలు, లాటిన్ అమెరికా మార్కెట్లకు ఎగుమతులను కొద్ది రోజుల్లో మొదలు పెడతాం. హైదరాబాద్ మార్కెట్ గురించి కాస్త వివరించండి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వెస్పా స్కూటర్ మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది. కంపెనీకి భారత్‌లో టాప్-5 నగరాల్లో భాగ్యనగరి నిలిచింది. అందుకే మోటోప్లెక్స్ ఔట్‌లెట్‌ను ఇక్కడ ప్రారంభించాం. పియాజియోకు చెం దిన ప్రీమియం ఇటాలియన్ బ్రాండ్స్ అయిన అప్రీలియా, మోటో గుజ్జి, వెస్పా బ్రాండ్ ద్విచక్ర వాహనాలన్నింటికీ వన్ స్టాప్ స్టోర్‌గా మోటోప్లెక్స్ ఉంటుంది. ప్రస్తుతం దేశంలో పుణే తర్వాత ఈ స్టోర్ ఉన్నది హైదరాబాద్‌లోనే. ప్రపంచ వ్యాప్తంగా 1946 నుంచి ఇప్పటి వరకు 1.80 కోట్ల వెస్పా స్కూటర్లు అమ్ముడయ్యాయి. -
ఇక స్కూటర్ల పైనే సుజుకి ఫోకస్..
అమ్మకాల్లో 70% వాటా వీటిదే భవిష్యత్‌లో అధిక సామర్థ్యమున్న మోడళ్లు తీసుకొస్తాం... కంపెనీ జోనల్ మేనేజర్ ప్రభాకర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా స్కూటర్ల విపణిపైనే ఫోకస్ చేసింది. దేశవ్యాప్తంగా సంస్థ అమ్మకాల్లో వీటి వాటా అత్యధికంగా 65-70 శాతం ఉండడమే ఇందుకు కారణం. దీనికితోడు భారత్‌లో స్కూటర్ల మార్కెట్ 12 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. సుజుకి సైతం ఇదే స్థాయిలో పనితీరు కనబరుస్తోంది. దీంతో ట్రెండ్‌కు తగ్గట్టుగా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు సంస్థ దక్షిణప్రాంత సేల్స్ జోనల్ మేనేజర్ డి.వి.ప్రభాకర్ తెలిపారు. సోమవారమిక్కడ నారాయణగూడలో నవకర్ సుజుకి షోరూంను ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. దక్షిణాదితోపాటు పశ్చిమ భారత్‌లో స్కూటర్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయని వివరించారు. 100-110 సీసీ బైక్‌ల యజమానులు స్కూటర్లకు మళ్లుతున్నారని చెప్పారు. 150 సీసీ స్కూటర్లు సైతం.. ప్రస్తుతం కంపెనీ 125 సీసీ వరకు సామర్థ్యమున్న స్కూటర్లను భారత్‌లో విక్రయిస్తోంది. 150 సీసీ స్కూటర్ 2017లో భారత్‌కు వచ్చే అవకాశం ఉందని ప్రభాకర్ వెల్లడించారు. యాక్సెస్ 125 మోడల్‌ను మరింత స్పోర్టీ లుక్‌తో తీర్చిదిద్ది ఈ ఏడాది చివరికల్లా విడుదల చేయనున్నట్టు చెప్పారు. రాబోయే మోడళ్లన్నీ 125 సీసీ, ఆపై సామర్థ్యమున్నవే ఉంటాయన్నారు. భారత్‌లో మోటార్‌సైకిళ్ల విభాగంలో 150 సీసీ, ఆపై సామర్థ్యమున్న విభాగాలే వృద్ధి చెందుతున్నాయి. కంపెనీ సైతం దీనికి అనుగుణంగా మోడళ్లను తెస్తుందని వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ నెలకు అన్ని మోడళ్లు కలిపి 1,800 యూనిట్లు విక్రయిస్తోంది. దీనిని 3,000 యూనిట్లకు పెంచాలన్నది లక్ష్యం. -
దక్షిణాది మార్కెట్లోకి హీరో డ్యూయట్
న్యూఢిల్లీ: టూవీలర్ దిగ్గజ కంపెనీ హీరో మోటొకార్ప్ కొత్త స్కూటర్ మోడల్ డ్యూయట్‌ను దక్షిణాది మార్కెట్లో బుధవారం విడుదల చేసింది. డ్యూయట్ మోడల్లో ఎల్ఎక్స్ వేరియంట్ ధర రూ.48,400 అని, వీఎక్స్ వేరియంట్ ధర రూ.49,900(ఎక్స్‌షోరూమ్ బెంగళూరు) అని కంపెనీ పేర్కొంది. డ్యూయట్, మాస్టర్ ఎడ్జ్ మోడళ్లతో తమ స్కూటర్ల పోర్ట్‌ఫోలియోను విస్తరించామని హీరో మోటొకార్ప్ సీఎండీ, సీఈఓ, పవన్ ముంజాల్ పేర్కొన్నారు. తమ సొంత పరిశోధన, అభివృద్ధి విభాగం అభివృద్ధి చేసిన తొలి ఉత్పత్తులు ఈ మోడళ్లని వివరించారు. గత నెలలోనే మాస్టర్ఎడ్జ్ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చామని, మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. తాజాగా డ్యూయట్ మోడల్‌ను కూడా ఇక్కడ అందిస్తున్నామని, దీంతో స్కూటర్ల మార్కెట్లో తమ స్థానం మరింత పటిష్టమవుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ 110 సీసీ స్కూటర్లో మొబైల్ చార్జింగ్ పాయింట్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఇంధనాన్ని వెలుపలే నింపుకునే సౌలభ్యం వంటి ఫీచర్లున్నాయని తెలిపారు. -
ఇండియాలో పెరుగుతున్న స్కూటర్ మార్కెట్