భారతదేశంలో పండుగ సీజన్ ఇప్పటికే మొదలైపోయింది. ఈ తరుణంలో చాలా మంది కొత్త కార్లు లేదా బైకులను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో దేశీయ విఫణిలో కొనుగోలు చేయడానికి ఉత్తమమైన ఐదు స్పోర్టీ స్కూటర్‌లను గురించి తెలుసుకుందాం.
టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125)
ద్విచక్ర వాహన విభాగంలో అత్యంత ప్రజాదరణపొందిన 'టీవీఎస్ మోటార్' కంపెనీకి చెందిన 'ఎన్‌టార్క్ 125' పండుగ సీజన్‌లో కొత్త స్కూటర్ కొనాలనుకునే వారికి మంచి ఎంపిక. ఈ స్కూటర్ బేస్ మోడల్ ధర రూ.84636, టాప్ వేరియంట్ ధర రూ. 1.05 లక్షలు (ఎక్స్-షోరూమ్).
మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ 124.8 సీసీ ఇంజిన్ కలిగి 7000 ఆర్‌పీఎమ్ వద్ద 9.25 బీహెచ్‌పీ పవర్, 5500 ఆర్‌పీఎమ్ వద్ద 10 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. సీవీటీ యూనిట్‌తో లభించే ఈ స్కూటర్ మంచి పనితీరుని అందిస్తుంది.
సుజుకి అవెనిస్ 125 (Suzuki Avenis 125)
సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన ఉత్తమ స్కూటర్లలో ఒకటి అవెనిస్ 125. రూ. 89900 ప్రారంభ ధర వద్ద లభించే ఈ స్కూటర్ 124.3 సీసీ ఇంజిన్ కలిగి 6750 ఆర్‌పీఎమ్ వద్ద 8.58 బీహెచ్‌పీ పవర్, 5500 ఆర్‌పీఎమ్ వద్ద 10 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
హోండా గ్రాజియా 125 (Honda Grazia 125)
హోండా గ్రాజియా 125 మంచి డిజైన్ కలిగి రూ. 82520 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న ఉత్తమ స్కూటర్లలో ఒకటి. ఇందులో 6000 ఆర్‌పీఎమ్ వద్ద 8.14 బీహెచ్‌పీ పవర్, 5000 ఆర్‌పీఎమ్ వద్ద 10.3 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. సీవీటీ యూనిట్‌తో లభించే ఈ స్కూటర్ పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది.
యమహా రే జెడ్ఆర్ 125 (Yamaha Ray ZR 125)
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన యమహా అనేక స్టైలిష్ బైకులు విడుదల చేసి మంచి అమ్మకాలు పొందుతోంది. కంపెనీకి చెందిన 'రే జెడ్ఆర్ 125' మన జాబితాలోని ఉత్తమ స్కూటర్లలో ఒకటి. రూ. 84730 (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ వెహికల్ 125 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి 8.04 బీహెచ్‌పీ పవర్, 10.3 టార్క్ అందిస్తుంది.
ఇదీ చదవండి: అందుకే 'రోహన్ మూర్తి' ఇన్ఫోసిస్ జాబ్ వదిలేసాడు!
ఏప్రిలియా ఎస్ఆర్ 125 (Aprilia SR 125)
మన జాబితాలో ఖరీదైన స్కూటర్ ఏప్రిలియా ఎస్ఆర్ 125. దీని ధర రూ. 1.23 లక్షలు (ఎక్స్ షోరూమ్). 124.45 సీసీ ఇంజిన్ కలిగిన ఈ స్కూటర్ 7300 ఆర్‌పీఎమ్ వద్ద 9.97 బీహెచ్‌పీ పవర్, 5500 ఆర్‌పీఎమ్ వద్ద 10.33 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ స్కూటర్ రైడర్లకు అవసరమైన లేటెస్ట్ ఫీచర్స్ ఎన్నో కలిగి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment