దక్షిణాది మార్కెట్లోకి హీరో డ్యూయట్ | Hero MotoCorp launches all new Hero Duet | Sakshi
Sakshi News home page

దక్షిణాది మార్కెట్లోకి హీరో డ్యూయట్

Published Thu, Oct 29 2015 12:26 AM | Last Updated on Sat, Sep 15 2018 7:51 PM

దక్షిణాది మార్కెట్లోకి హీరో డ్యూయట్ - Sakshi

దక్షిణాది మార్కెట్లోకి హీరో డ్యూయట్

న్యూఢిల్లీ: టూవీలర్ దిగ్గజ కంపెనీ హీరో మోటొకార్ప్ కొత్త స్కూటర్ మోడల్ డ్యూయట్‌ను దక్షిణాది మార్కెట్లో బుధవారం విడుదల చేసింది. డ్యూయట్ మోడల్‌లో ఎల్‌ఎక్స్ వేరియంట్ ధర రూ.48,400 అని, వీఎక్స్ వేరియంట్ ధర రూ.49,900(ఎక్స్‌షోరూమ్ బెంగళూరు) అని కంపెనీ పేర్కొంది. డ్యూయట్, మాస్టర్ ఎడ్జ్ మోడళ్లతో తమ స్కూటర్ల పోర్ట్‌ఫోలియోను విస్తరించామని హీరో మోటొకార్ప్ సీఎండీ, సీఈఓ, పవన్ ముంజాల్ పేర్కొన్నారు. తమ సొంత పరిశోధన, అభివృద్ధి విభాగం అభివృద్ధి చేసిన తొలి ఉత్పత్తులు ఈ మోడళ్లని వివరించారు.

గత నెలలోనే మాస్టర్‌ఎడ్జ్ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చామని, మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. తాజాగా డ్యూయట్ మోడల్‌ను కూడా ఇక్కడ అందిస్తున్నామని, దీంతో స్కూటర్ల మార్కెట్లో తమ స్థానం మరింత పటిష్టమవుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ 110 సీసీ స్కూటర్‌లో మొబైల్ చార్జింగ్ పాయింట్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఇంధనాన్ని వెలుపలే నింపుకునే సౌలభ్యం వంటి ఫీచర్లున్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement