హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా తాజాగా భారత మార్కెట్లో డియో 125 స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.83,400 నుంచి ప్రారంభం. డియో స్కూటర్ ఇప్పటి వరకు 110 సీసీ ఇంజన్‌తో అందుబాటులో ఉంది.
ఎన్‌హాన్స్‌డ్ స్మార్ట్ పవర్ ఫీచర్‌తో ప్రస్తుతం రెండు వేరియంట్లలో 125 సీసీ ఇంజన్‌తో కొత్త మోడల్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్, ఇంజన్ ఇన్‌హిబిటర్‌తో సైడ్ స్టాండ్ ఇండికేటర్, సీట్, ఫ్యూయల్ లిడ్ తెరవడానికి మల్టీ ఫంక్షన్ స్విచ్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, 171 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వంటి హంగులు జోడించింది.
Comments
Please login to add a commentAdd a comment