Honda Dio
-
హోండా నుంచి డియో 125 స్కూటర్ - ధర ఎంతో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా తాజాగా భారత మార్కెట్లో డియో 125 స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.83,400 నుంచి ప్రారంభం. డియో స్కూటర్ ఇప్పటి వరకు 110 సీసీ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ ఫీచర్‌తో ప్రస్తుతం రెండు వేరియంట్లలో 125 సీసీ ఇంజన్‌తో కొత్త మోడల్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్, ఇంజన్ ఇన్హిబిటర్‌తో సైడ్ స్టాండ్ ఇండికేటర్, సీట్, ఫ్యూయల్ లిడ్ తెరవడానికి మల్టీ ఫంక్షన్ స్విచ్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, 171 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వంటి హంగులు జోడించింది. -
హోండా డియో కొనాలా.. కొత్త ధరలు తెలుసుకోండి!
Honda Dio H Smart: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ఇటీవల డియో హెచ్-స్మార్ట్ను సైలెంట్‌గా ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ స్కూటర్ ధరలు కంపెనీ అధికారిక వెబ్సైట్లో రూ. 77,712 (ఎక్స్-షోరూమ్) వద్ద ఉన్నాయి. ఇది బిఎస్ 6 స్టేజ్ 2 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ పొందిన కారణంగా దాని స్టాండర్డ్ మోడల్ కంటే కొంత ఎక్కువ ధర పొందింది. హోండా డియో స్టాండర్డ్ అండ్ డిఎల్ఎక్స్ వేరియంట్ల ధరలు గతంలో రూ. 68,625 & రూ. 72,626 వద్ద ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్2 (OBD2) కారణంగా ఈ రెండు వేరియంట్ల ధరలు రూ. 1,586 వరకు పెరిగాయి. ధరల పెరుగుదల కాకుండా ఇందులో ఎటువంటి మార్పులు జరగలేదు. ధరల పెరుగుదల తరువాత 110సీసీ విభాగంలో అత్యంత ఖరీదైన స్కూటర్ల జాబితాలో డియో ఒకటిగా చేరింది. (ఇదీ చదవండి: రూ. 500 నోట్ల రద్దుపై షికార్లు కొడుతున్న పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన శక్తికాంత దాస్!) హోండా డియో స్కూటర్ 109 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ కలిగి.. లేటెస్ట్ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్స్ పొందింది. ఇది 7.8 బిహెచ్పి పవర్ 9 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కొత్త హోండా స్మార్ట్ కీ స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ సేఫ్ వంటి ఫంక్షన్లను పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్నాయి. -
Banjara Hills: ఒక స్కూటీ.. 130 చలానాలు
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం ఉదయం వివిధ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ చౌరస్తాలో వాహనాల తనిఖీల్లో పాల్గొన్న ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి టీఎస్ 10 ఈఆర్ 7069 నెంబర్ కలిగిన హోండా డియో (స్కటీ)ని పరిశీలించగా ఈ వాహనంపై 130 పెండింగ్ చలానాలు ఉన్నట్లుగా గుర్తించి అవాక్కయ్యారు. గత మూడేళ్లుగా ఈ వాహన యజమాని విజయ్ పెండింగ్ చలానాలతోనే ఎప్పటికప్పుడు పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నట్లు గుర్తించారు. మొత్తం 130 చలానాలకు గాను రూ.35,950 బకాయి ఉన్నట్లు తేలింది. ఈ మొత్తాన్ని చెల్లించడంలో వాహనదారుడు చేతులెత్తేయడంతో వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. చదవండి: ఇతగాడి పెండింగ్ చలానాలను చూస్తే అవాక్కవ్వాల్సిందే.. -
హోండా కొత్త డియో.. ధర రూ.49,132
న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా 2017 వెర్షన్ డియో స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది బీఎస్–4 నిబంధనలకు అనువుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీని ధర రూ.49,132గా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉందని తెలిపింది. ఈ కొత్త స్కూటర్లో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ ఆన్ (ఏహెచ్‌వో) ఫీచర్ సహా ఎల్ఈడీ పొజిషన్ ల్యాంప్, డ్యూయెల్ టోన్ కలర్ బాడీ, స్పోర్టియర్ గ్రాఫిక్స్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. కాగా హోండా కంపెనీ 2002లో డియో స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది.