Honda Dio H Smart: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ఇటీవల డియో హెచ్-స్మార్ట్‌ను సైలెంట్‌గా ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ స్కూటర్ ధరలు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 77,712 (ఎక్స్-షోరూమ్) వద్ద ఉన్నాయి. ఇది బిఎస్ 6 స్టేజ్ 2 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్‌డేట్ పొందిన కారణంగా దాని స్టాండర్డ్ మోడల్ కంటే కొంత ఎక్కువ ధర పొందింది.
హోండా డియో స్టాండర్డ్ అండ్ డిఎల్ఎక్స్ వేరియంట్‌ల ధరలు గతంలో రూ. 68,625 & రూ. 72,626 వద్ద ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్2 (OBD2) కారణంగా ఈ రెండు వేరియంట్ల ధరలు రూ. 1,586 వరకు పెరిగాయి. ధరల పెరుగుదల కాకుండా ఇందులో ఎటువంటి మార్పులు జరగలేదు. ధరల పెరుగుదల తరువాత 110సీసీ విభాగంలో అత్యంత ఖరీదైన స్కూటర్ల జాబితాలో డియో ఒకటిగా చేరింది.
(ఇదీ చదవండి: రూ. 500 నోట్ల రద్దుపై షికార్లు కొడుతున్న పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన శక్తికాంత దాస్!)
హోండా డియో స్కూటర్ 109 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ కలిగి.. లేటెస్ట్ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్స్ పొందింది. ఇది 7.8 బిహెచ్‌పి పవర్ 9 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కొత్త హోండా స్మార్ట్ కీ స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ సేఫ్ వంటి ఫంక్షన్‌లను పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment