Honda Motor Cycle
-
మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు ఇవే!
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ తరుణంలో చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని చాలా ఆసక్తి కనపరుస్తారు. అలాంటి వారికోసం ఈ కథనంలో ఈ వారంలో మార్కెట్లో అడుగుపెట్టిన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హోండా సీబీ300ఎఫ్ (Honda CB300F) హోండా మోటార్‌సైకిల్ ఇండియా పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అప్డేటెడ్ 'సీబీ300ఎఫ్' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 1.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ దేశవ్యాప్తంగా ఉన్న బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయి. ఈ బైక్ 293 సీసీ ఆయిల్-కూల్డ్ SOHC ఇంజన్ కలిగి 24 హార్స్ పవర్ అండ్ 25.6 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. 14.1 లీటర్ల ఫ్యూయెల్ కెపాసిటీ కలిగిన ఈ బైక్ లాంగ్ రైడ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలం 7.94 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ (Kawasaki Ninja ZX-4R) ఇప్పటికే మార్కెట్లో మంచి ప్రజాదరణతో ముందుకు సాగుతున్న కవాసకి ఇప్పుడు ఎట్టకేలకు 'నింజా జెడ్ఎక్స్-4ఆర్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ధర ఎక్కువైనా అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ 399 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్-ఫోర్ ఇంజిన్ కలిగి సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్పర్ క్లచ్‌తో లభిస్తుంది. ఈ ఇంజిన్ 14,500 ఆర్పీఎమ్ వద్ద 76 బీహెచ్పీ పవర్ & 13,000 ఆర్పీఎమ్ వద్ద 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇదీ చదవండి: మహిళలకు శుభవార్త! గ్యాస్ స్టవ్‌తో పాటు ఫ్రీ సిలిండర్ పొందండిలా.. న్యూ కేటిఎమ్ 390 డ్యూక్ (New KTM 390 Duke) యువ రైడర్లకు ఎంతగానో ఇష్టమైన కేటిఎమ్ ఇప్పుడు మరో కొత్త బైక్ రూపంలో (న్యూ కేటిఎమ్ 390 డ్యూక్) దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ బైక్ ధర రూ. 3,10,520 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా పెద్ద ఇంజిన్ పొందుతుంది. కావున ఇందులో 399 సీసీ ఉంటుంది. ఇది 45 హార్స్ పవర్, 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కంపెనీ ఈ బైక్ కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టింది. డెలివరీలు ఈ నెల చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
హోండా కొత్త బైక్ ఎస్పీ160: ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!
Honda SP160 ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా భారత మార్కెట్లో సరికొత్త బైక్ ఎస్పీ160 విడుదల చేసింది. ఇది హోండా యునికార్న్ , హోండా X-బ్లేడ్ తర్వాత 160cc విభాగంలో ఇది మూడో మోడల్. వీటి ఎక్స్‌షోరూంలో ధర రూ.1.17 లక్షల నుండి ప్రారంభం. రెండు ట్రిమ్స్, ఆరు రంగుల్లో లభిస్తుంది. 13 బీహెచ్పీ పవర్, 14.58 ఎన్ఎం టార్క్‌తో 162 సీసీ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజన్, ఫ్లాషింగ్ ఇండికేటర్ లైట్స్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్, సింగిల్ చానెల్ యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, స్పోర్టీ మఫ్లర్ వంటి హంగులు ఉన్నాయి. 3 ఏళ్లు స్టాండర్డ్, ఏడేళ్లు ఆప్షనల్ వారంటీ ఉంది. వేరియంట్ వారీగా హోండా ఎస్పీ160 ధరలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) సింగిల్ డిస్క్ - రూ. 1,17,500 డ్యూయల్ డిస్క్ - రూ. 1,21,900 -
హోండా డియో కొనాలా.. కొత్త ధరలు తెలుసుకోండి!
Honda Dio H Smart: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ఇటీవల డియో హెచ్-స్మార్ట్ను సైలెంట్‌గా ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ స్కూటర్ ధరలు కంపెనీ అధికారిక వెబ్సైట్లో రూ. 77,712 (ఎక్స్-షోరూమ్) వద్ద ఉన్నాయి. ఇది బిఎస్ 6 స్టేజ్ 2 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ పొందిన కారణంగా దాని స్టాండర్డ్ మోడల్ కంటే కొంత ఎక్కువ ధర పొందింది. హోండా డియో స్టాండర్డ్ అండ్ డిఎల్ఎక్స్ వేరియంట్ల ధరలు గతంలో రూ. 68,625 & రూ. 72,626 వద్ద ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్2 (OBD2) కారణంగా ఈ రెండు వేరియంట్ల ధరలు రూ. 1,586 వరకు పెరిగాయి. ధరల పెరుగుదల కాకుండా ఇందులో ఎటువంటి మార్పులు జరగలేదు. ధరల పెరుగుదల తరువాత 110సీసీ విభాగంలో అత్యంత ఖరీదైన స్కూటర్ల జాబితాలో డియో ఒకటిగా చేరింది. (ఇదీ చదవండి: రూ. 500 నోట్ల రద్దుపై షికార్లు కొడుతున్న పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన శక్తికాంత దాస్!) హోండా డియో స్కూటర్ 109 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ కలిగి.. లేటెస్ట్ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్స్ పొందింది. ఇది 7.8 బిహెచ్పి పవర్ 9 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కొత్త హోండా స్మార్ట్ కీ స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ సేఫ్ వంటి ఫంక్షన్లను పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్నాయి. -
టూ–వీలర్లకు వారంటీ పొడిగించిన హోండా మోటార్‌సైకిల్.. వివరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఎక్స్టెండెడ్ వారంటీ ప్రకటించింది. 250 సీసీ వరకు సామర్థ్యం గల అన్ని మోడళ్లకు ఇది వర్తిస్తుందని కంపెనీ బుధవారం తెలిపింది. వాహనం కొనుగోలు చేసిన తేదీ నుండి 91 రోజులు మొదలుకుని తొమ్మిదవ సంవత్సరం వరకు పొడిగించిన వారంటీని కస్టమర్లు పొందవచ్చు. 10 ఏళ్ల వరకు సమగ్ర వారంటీ కవరేజీని అందించడమేగాక, వాహనాన్ని ఇతరులకు విక్రయించినప్పడు వారంటీ బదిలీ అవుతుంది. అధిక విలువైన విడిభాగాలు, ఇతర అవసరమైన మెకానికల్, ఎలక్ట్రికల్ భాగాలతో సహా 10 సంవత్సరాల వరకు పొడిగించిన వారంటీ కవరేజీని అందించడం పరిశ్రమలో తొలిసారి అని హెచ్ఎంఎస్ఐ సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ యోగేశ్ మాథుర్ తెలిపారు. -
హోండా కొత్త బైక్.. ధర చాలా తక్కువ
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ ఇండియా ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో 2023 హోండా SP125 బైక్ విడుదల చేసింది. ఈ బైక్ త్వరలో అమలులోకి రానున్న బిఎస్6 ఫేస్-2 నిబంధనలకు అనుకూలంగా తయారైంది. ధర: 2023 హోండా ఎస్పి125 రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ.85131, రూ.89131 (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ ధరలు దాని మునుపటి మోడల్స్ కంటే రూ. 1,000 ఎక్కువ. (ఇదీ చదవండి: YouTube: అతనికి జాబ్ లేదు! కోట్లు సంపాదిస్తున్నాడిలా..) డిజైన్ & ఫీచర్స్: కొత్త హోండా ఎస్పి125 డిజైన్, ఫీచర్స్ పరంగా ఎక్కువ అప్డేటెడ్స్ లేదు. అయితే ఇది మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ కలర్ ఆఫర్లో లభిస్తుంది. అంతే కాకుండా.. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితోపాటు టెలిస్కోపిక్ ఫోర్క్, ప్రీలోడ్-అడ్జస్టబుల్ రియర్ షాక్ అబ్జార్బర్స్ వంటివి ఉంటాయి. (ఇదీ చదవండి: New Mahindra Thar: థార్ కొత్త వేరియంట్.. మారుతి జిమ్నీకి గట్టి షాక్!) ఇంజిన్: 2023 హోండా ఎస్పి125 బైక్ 123.94 సీసీ ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్ పొందుతుంది. ఇది 10.8 హెచ్‌పి పవర్, 10.9 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది. -
హోండా మోటార్‌సైకిల్ మాస్టర్ ప్లాన్.. భవిష్యత్ ప్రణాళిక ఇలా!
భారతదేశంలో అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా పేరు పొందిన హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లో ఏకంగా పది ఎలక్ట్రిక్ టూ వీలర్స్ విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి కంపెనీ ఇప్పటి నుంచే ప్రణాళికలను రూపొందిస్తోంది. నివేదికల ప్రకారం.. మల్టిపుల్ పవర్‌ట్రెయిన్స్, స్పీడ్ కేటగిరి, బాడీ టైప్ వంటి వాటిని ఆధారంగా చేసుకుని కంపెనీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. సుమారు రెండు సంవత్సరాల తరువాత కంపెనీ ఈ ప్లాన్ సిద్ధం చేసింది. (ఇదీ చదవండి: సైడ్ బిజినెస్‌తో కోట్లు గడిస్తున్న హీరోయిన్లు వీళ్లే!) 2024 నాటికి దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడానికి కంపెనీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ పాపులర్ స్కూటర్ హోండా యాక్టివాను ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదల చేయనుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తన ఉనికిని చాటుకోవడానికి హోండా చేయవలసిన అన్ని ప్రయత్నాలను నిర్విరామంగా చేస్తోంది. (ఇదీ చదవండి: హయ్యర్ స్టడీస్ లోన్‌పై బ్యాంకు విధించే చార్జెస్, ఇవే!) 2024లో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ విడుదలైన తరువాత మరో టూ వీలర్ కూడా లాంచ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే వచ్చే ఏడాదిలో కంపెనీ రెండు ఈవీ మోడల్స్ విడుదల చేయనున్నట్లు స్పష్టమైంది. ఆ తరువాత 2026-27 మధ్యలో మరికొన్ని మోడల్స్ విడుదల చేయాలనీ సంస్థ యోచిస్తోంది. మొత్తం మీద కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తప్పకుండా మంచి అభివృద్ధిని సాధిస్తుందని భావిస్తున్నాము. -
హోండా కస్టమర్లకు అలర్ట్.. వెంటనే బైక్స్ షో రూమ్ కి తీసుకెళ్లండి
మీ దగ్గర కొత్త హోండా మోటార్ సైకిల్ వాహనం ఉందా? అయితే, వెంటనే షో రూమ్ తీసుకెళ్లండి. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) రిఫ్లెక్స్ రిఫ్లెక్టర్లలలో సమస్య కారణంగా మన దేశంలోని కొన్ని మోడళ్లను రీకాల్ చేస్తుంది. వెనక్కి పిలిపించిన వాటిలో హోండా యాక్టివా 5జీ, హోండా యాక్టివా 6జీ, హోండా యాక్టివా 125, సిబి షైన్, హార్నెట్ 2.0, ఎక్స్-బ్లేడ్, హెచ్ నెస్ సీబి 350, సీబి 300ఆర్ ఉన్నాయి. రీకాల్ చేయబడ్డ మొత్తం యూనిట్ సంఖ్య ఇంకా తెలియదు. రిఫ్లెక్స్ రిఫ్లెక్టర్ల సమస్య వల్ల రాత్రి సమయంలో వెనుక నుంచి వచ్చే వాహనాలకు ముందు వెళ్తున్న వాహనం సరిగా కనిపించక ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. అందుకే ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా నవంబర్ 2019 నుంచి జనవరి 2021 మధ్య తయారు చేయబడ్డ మోడల్స్ కు వారెంటీ స్టేటస్ తో సంబంధం లేకుండా కొత్త రిఫ్లెక్స్ రిఫ్లెక్టర్ ని ఉచితంగా అధీకృత హెచ్ఎంఎస్ఐ డీలర్ లు మార్చానున్నట్లు తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి కంపెనీ జూన్ 1, 2021న రీకాల్ ప్రక్రియను ప్రారంభించింది. వాహనాన్ని తనిఖీ చేయడానికి అవసరమైతే రీప్లేస్ మెంట్ కోసం కాల్, ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ ద్వారా వినియోగదారులను చేరుకొనున్నట్లు హెచ్ఎంఎస్ఐ తెలిపింది. అదేవిధంగా, కస్టమర్ లు కంపెనీ వెబ్ సైట్ లో విఐఎన్ ని కూడా నమోదు చేయవచ్చు. హెచ్ ఎమ్ ఎస్ఐ డీలర్ షిప్ లు/విడిభాగాల డిస్ట్రిబ్యూటర్ ల వద్ద అనుమానిత స్పేర్ పార్టుల స్టాక్ కూడా రీకాల్ చేయనున్నారు. అమెరికాలోలో కూడా ఇలాంటి సమస్య కారణంగా హోండా మోటార్ కంపెనీ రీకాల్ చేసింది. యుఎస్ఎలో 28,528 మోటార్ సైకిళ్లలో లోపభూయిష్టమైన రియర్ రిఫ్లెక్టర్ ఫిట్ మెంట్ లను మార్చేసింది. చదవండి: BMW : మూడు సెకన్లలోనే అంత వేగమా -
మూడేళ్లలో హోండాకు నంబర్-1 మార్కెట్‌గా భారత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ద్విచక్ర వాహన రంగంలో రెండు మూడేళ్లలో సంస్థకు టాప్-1 మార్కెట్‌గా భారత్ నిలుస్తుందని హోండా భావిస్తోంది. ప్రస్తుతం హోండాకు 25 శాతం అమ్మకాలతో భారత్ రెండో స్థానంలో ఉంది. తొలి స్థానాన్ని ఇండోనేసియా కైవసం చేసుకుంది. కంపెనీ చేసిన పెట్టుబడులు, వృద్ధి రేటు కారణంగా 2017-18 నాటికి భారత్ అగ్ర స్థానానికి ఎగబాకుతుందని హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా ప్రెసిడెంట్ కీట మురమత్సు తెలిపారు. కంపెనీ స్కూటర్ల అమ్మకాలు దేశీయంగా గణనీయంగా పెరగడం కూడా ఇందుకు దోహదం చేస్తుందని చెప్పారు. 2015 ఎడిషన్ ఏవియేటర్, యాక్టివా-ఐ స్కూటర్ల ఆవిష్కరణ సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 2015లో 8 మోడళ్లను తీసుకొచ్చామని, మరో 7 మోడళ్లు రానున్నాయని తెలిపారు. ఏడు సెకన్లకో కస్టమర్..: భారత్‌లో హోండా ఇప్పటి వరకు 2 కోట్ల టూ వీలర్లను విక్రయించింది. 7 సెకన్లకు ఒక కొత్త కస్టమర్ వచ్చి చేరుతున్నారు. ఏప్రిల్, మే గణాంకాల ఆధారంగా ద్విచక్ర వాహన మార్కెట్లో హోండా 26 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. 2014-15లో దేశీయంగా 44.5 లక్షల యూనిట్లు విక్రయించింది. ఈ ఏడాది 46.7 లక్షల వాహన అమ్మకాలు లక్ష్యం. ప్రస్తుత 3 ప్లాంట్ల వార్షిక సామర్థ్యం 46 లక్షల యూనిట్లు. గుజరాత్ ప్లాంటు 2016 ఆరంభంలో అందుబాటులోకి రానుంది. పెరుగుతున్న మహిళా కస్టమర్లు.. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో అమ్ముడైన ద్విచక్ర వాహనాల్లో స్కూటర్ల వాటా 28 శాతం. 2015-16లో ఇది 30 శాతానికి చేరుతుందని కంపెనీ సేల్స్ ఆపరేటింగ్ హెడ్ యద్విందర్ సింగ్ గులేరియా తెలిపారు. ‘మహిళా కస్టమర్లు గణనీయంగా పెరుగుతున్నారు. హోండా స్కూటర్ కస్టమర్లలో ముగ్గురిలో ఒకరు మహిళ ఉంటున్నారు. నెలకు 75,000 మంది కస్టమర్ల జాబితాలో చేరుతున్నారు’ అని వివరించారు. హైదరాబాద్ విపణిలో హోండా తొలి స్థానంలో ఉంది. బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి తాప్సీని హైదరాబాద్ వేదికగా హోండా ప్రకటించింది. -
బైక్‌ల ధరలూ తగ్గాయ్
న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్లో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో కార్ల ధరలను తగ్గించినట్లే ద్విచక్రవాహనాల ధరలను కంపెనీలు తగ్గిస్తున్నాయి. టూవీలర్ల ధరలను రూ. 1,600-రూ.7,600 వరకూ తగ్గిస్తున్నామని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రకటించింది. రూ.4,500 వరకూ తగ్గిస్తున్నట్లు హీరో మోటోకార్ప్ మంగళవారం తెలిపింది. మధ్యంతర బడ్జెట్లో చిన్న కార్లు, మోటార్‌బైక్‌లు, స్కూటర్లపై ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఈ తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకే అందించనున్నామని ఈ రెండు కంపెనీలు పేర్కొన్నాయి. తగ్గించిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని హోండా వివరించింది. తమ వాహనాల ధరలను 2 నుంచి 5 శాతం వరకూ తగ్గిస్తున్నామని హీరో మోటోకార్ప్ పేర్కొంది. హీరో మోటోకార్ప్ కరిజ్మా జెడ్‌ఎంఆర్, ఇంపల్స్, స్ప్లెండర్, గ్లామర్ టూవీలర్లను విక్రయిస్తోంది. ఆక్టివా, డియో, స్కూటర్లతో పాటు డ్రీమ్ యుగ, సీబీ స్టన్నర్, సీబీ యూనికార్న్, సీబీ ట్విస్టర్, షైన్ బైక్‌లను హోండా విక్రయిస్తోంది.