Honda SP160 ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా భారత మార్కెట్లో సరికొత్త బైక్ ఎస్పీ160 విడుదల చేసింది. ఇది హోండా యునికార్న్ , హోండా X-బ్లేడ్ తర్వాత 160cc విభాగంలో ఇది మూడో మోడల్.
వీటి ఎక్స్‌షోరూంలో ధర రూ.1.17 లక్షల నుండి ప్రారంభం. రెండు ట్రిమ్స్, ఆరు రంగుల్లో లభిస్తుంది. 13 బీహెచ్పీ పవర్, 14.58 ఎన్ఎం టార్క్‌తో 162 సీసీ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజన్, ఫ్లాషింగ్ ఇండికేటర్ లైట్స్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్, సింగిల్ చానెల్ యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, స్పోర్టీ మఫ్లర్ వంటి హంగులు ఉన్నాయి. 3 ఏళ్లు స్టాండర్డ్, ఏడేళ్లు ఆప్షనల్ వారంటీ ఉంది.
వేరియంట్ వారీగా హోండా ఎస్పీ160 ధరలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)
సింగిల్ డిస్క్ - రూ. 1,17,500
డ్యూయల్ డిస్క్ - రూ. 1,21,900
Comments
Please login to add a commentAdd a comment