
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్రకటించింది. 250 సీసీ వరకు సామర్థ్యం గల అన్ని మోడళ్లకు ఇది వర్తిస్తుందని కంపెనీ బుధవారం తెలిపింది. వాహనం కొనుగోలు చేసిన తేదీ నుండి 91 రోజులు మొదలుకుని తొమ్మిదవ సంవత్సరం వరకు పొడిగించిన వారంటీని కస్టమర్లు పొందవచ్చు.
10 ఏళ్ల వరకు సమగ్ర వారంటీ కవరేజీని అందించడమేగాక, వాహనాన్ని ఇతరులకు విక్రయించినప్పడు వారంటీ బదిలీ అవుతుంది. అధిక విలువైన విడిభాగాలు, ఇతర అవసరమైన మెకానికల్, ఎలక్ట్రికల్ భాగాలతో సహా 10 సంవత్సరాల వరకు పొడిగించిన వారంటీ కవరేజీని అందించడం పరిశ్రమలో తొలిసారి అని హెచ్‌ఎంఎస్‌ఐ సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ యోగేశ్ మాథుర్ తెలిపారు.