two wheelar
-
ఈ టూవీలర్స్ అమ్మకాలు.. వీటిదే ఆధిపత్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో డిసెంబర్ నెలలో 'బజాజ్ చేతక్' (Bajaj Chetak) తొలి స్థానంలోకి దూసుకొచ్చింది. గత నెలలో 18,276 యూనిట్లతో బజాజ్ ఆటో 25 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. 2020 జనవరిలో ఎలక్ట్రిక్ చేతక్ ద్వారా స్కూటర్స్ రంగంలోకి బజాజ్ రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఈ-టూ వీలర్స్ విభాగంలో దేశంలో ఒక నెల అమ్మకాల్లో తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం సంస్థకు ఇదే తొలిసారి. డిసెంబర్ నెలలో 17,212 యూనిట్లతో టీవీఎస్ మోటార్ కంపెనీ రెండవ స్థానంలో నిలిచింది.నవంబర్ వరకు తొలి స్థానంలో కొనసాగిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) గత నెలలో అతి తక్కువగా 13,769 యూనిట్లతో 19 శాతం వాటాతో మూడవ స్థానానికి పరిమితమైంది. 2024లో కంపెనీకి అతి తక్కువ విక్రయాలు నమోదైంది డిసెంబర్ నెలలోనే కావడం గమనార్హం. అక్టోబర్‌లో 41,817 యూనిట్ల అమ్మకాలు సాధించిన ఓలా ఎలక్ట్రిక్ నవంబర్‌లో 29,252 యూనిట్లను నమోదు చేసింది.హోండా ఎలక్ట్రిక్ (Honda Electric) టూ వీలర్లు రోడ్డెక్కితే ఈ ఏడాది మార్కెట్ మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనపడుతోంది. సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) ఆధారత టూవీలర్ రంగాన్ని ఏలుతున్న దిగ్గజాలే ఎలక్ట్రిక్ విభాగాన్ని శాసిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి నెల నమోదవుతున్న అమ్మకాలే ఇందుకు నిదర్శనం.రెండింటిలో ఒకటి ఈవీ..భారత త్రిచక్ర వాహన రంగంలో ఎలక్ట్రిక్ త్రీవీలర్లు దూకుడుమీదున్నాయి. భారత ఈవీ రంగంలో టూవీలర్ల తర్వాత త్రీవీలర్లు రెండవ స్థానంలో నిలిచాయి. 2024లో దేశవ్యాప్తంగా మొత్తం 6,91,011 యూనిట్ల ఈ-త్రీవీలర్స్ రోడ్డెక్కాయి. భారత్‌లో గతేడాది ఎలక్ట్రిక్, ఐసీఈ, సీఎన్జీ, ఎల్పీజీ విభాగాల్లో కలిపి మొత్తం 12,20,925 యూనిట్ల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో ఎలక్ట్రిక్ వాటా ఏకంగా 56 శాతం ఉంది. అంటే అమ్ముడవుతున్న ప్రతి రెండింటిలో ఒకటి ఎలక్ట్రిక్ కావడం విశేషం.ఎలక్ట్రిక్ త్రీవీలర్స్‌లో నాయకత్వ స్థానాన్ని కొనసాగిస్తున్న మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ 10 శాతం వాటా సాధించింది. వేగంగా దూసుకొచ్చిన బజాజ్ ఆటో 6 శాతం వాటాతో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2023లో అమ్ముడైన 5,83,697 యూనిట్ల ఎలక్ట్రిక్ త్రీవీలర్లతో పోలిస్తే 2024 విక్రయాల్లో 18 శాతం వృద్ధి నమోదైంది.2023లో సగటున ఒక నెలలో 48,633 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళితే గతేడాది ఈ సంఖ్య నెలకు 57,584 యూనిట్లకు ఎగసింది. ఐసీఈ, సీఎన్జీ, ఎల్పీజీ ఆప్షన్స్‌తో పోలిస్తే నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడం వల్లే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు డిమాండ్ పెరుగుతోంది. మెరుగైన రుణ లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అందుబాటులోకి విభిన్న మోడళ్లు, సరుకు రవాణాకై లాజిస్టిక్స్ కంపెనీల నుంచి డిమాండ్ ఇందుకు మరింత ఆజ్యం పోస్తోంది. త్రీవీలర్స్‌లో సీఎన్జీ విభాగానికి 28 శాతం వాటా కాగా, డీజిల్‌కు 11, ఎల్పీజీ 3, పెట్రోల్‌కు ఒక శాతం వాటా ఉంది.పోటీలో నువ్వా నేనా..రెండవ స్థానంలో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీతో నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతూ.. 2024 సెప్టెంబర్‌లో 19,213 యూనిట్లతో తొలిసారిగా బజాజ్ ఆటో రెండవ స్థానాన్ని పొంది టీవీఎస్‌ను మూడవ స్థానానిని నెట్టింది. అక్టోబర్, నవంబర్‌లో టీవీఎస్‌కు గట్టి పోటీ ఇచ్చిన బజాజ్ ఆటో మూడవ స్థానానికి పరిమితమైంది.ఇక 2020 జనవరి నుంచి 2023 నవంబర్ వరకు బజాజ్ ఆటో మొత్తం 1,04,200 యూనిట్ల అమ్మకాలను సాధించింది. తొలి లక్ష యూనిట్లకు కంపెనీకి 47 నెలల సమయం పట్టింది. 2024లో ఏకంగా 2 లక్షల యూనిట్ల విక్రయాలకు చేరువైంది. గతేడాది సంస్థ మొత్తం 1,93,439 యూనిట్ల అమ్మకాలతో భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో మూడవ స్థానంలో ఉంది. ఓలా ఎలక్ట్రిక్ 4,07,547 యూనిట్లతో మొదటి, టీవీఎస్ మోటార్ కో 2,20,472 యూనిట్లతో రెండవ స్థానంలో నిలిచాయి. -
మురారి మోపెడ్ సంబరం, రూ. 60వేలతో డీజే పార్టీ...కట్ చేస్తే!
గోరంత విషయాన్ని కొండంత చేసి చూపించడం లేటెస్ట్ ట్రెండ్. దీన్నే బడాయి అని కూడా అంటారు. ఇదే ఫాలో అయ్యాడు ఓ బడాయి బసవయ్య. బ్యాంకు లోన్‌తో బైక్ కొనుగోలు చేసి, నానా హంగామా చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాడు. అసలు స్టోరీ ఏంటీ అంటే.. మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన మురారి లాల్ కుష్వాహ టీ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అలా వ్యాపారంలో వచ్చిన ఆదాయంతో ఒక మోపెడ్ కొనుక్కోవాలనుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత చేసిన హడావిడే సోషల్ మీడియాలో విడ్డూరంగా నిలిచింది. బైక్ కొనుక్కోవాలనే ఆలోచనరాగానే అందరిలాగానే బ్యాంకును ఆశ్రయించాడు మురారి లాల్. రూ. 90వేల విలువైన టూవీలర్ ( టీవీఎస్ మోపెడ్) కోసం లోన్ తీసుకొని, 20వేల రూపాయల డౌన్‌పేమెంట్ కట్టాడు. ఇక్కడే మొదలైంది అసలు కథ. బైక్‌ను తీసుకోవడానికి షోరూమ్‌కు ఏకంగా గుర్రపు బండి, డీజే గ్యాంగ్‌తో తరలి వచ్చాడు. ఆచారం ప్రకారం, కొత్త బండికి పూలమాలవేసి, పూజలు నిర్వహించాడు. అనంతరం బైక్ ఊరేగింపు షురూ అయింది. దోస్తులతో కలిసి డీజే పాటలకు స్టెప్పులేస్తూ దాదాపు 115 కిలోమీటర్లు ఊరేగింపు తీశారు. అంతేకాదు బండి అందరికీ కనిపించేలా జేసీబీతో కూడా పైకెత్తించాడు. దీని కోసం మురారి పెట్టిన మొత్తం ఖర్చు అక్షరాలా 60వేల రూపాయలు. పైగా తన పిల్లల సంతోషం కోసమే ఇదంతా చేశానని చెప్పుకొచ్చాడు. ఇలాంటి ముఖ్యమైన సందర్భాల్లో వేడుక చేసుకోవడం తనకిష్టమని చెప్పాడు.ట్విస్ట్ ఏంటంటేఈ తతంగం అంతా పోలీసులకు చేరింది. ముందస్తు అనుమతి లేకుండా రహదారిపై అనవసర హగామా చేయడమేకాకుండా, డీజేతో శబ్ద, వాయు కాలుష్యానికి కారణమై నారంటూ స్థానిక పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మురారితో పాటు డీజే ఆపరేటర్‌పై కూడా కేసు నమోదు చేశారు. డీజే సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మురారికి ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో రూ.12,500 పెట్టి ఫోన్ కొని, రూ.25 వేలతో సంబరాలు చేసుకున్నాడట మురారి. -
చైనాను అధిగమించనున్న భారత్!.. అమ్మకాల్లో అగ్రగామిగా..
ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత్ ఈ ఏడాది చైనాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా అవతరించనుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.2024 ప్రారంభం నుంచి అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో ద్విచక్ర వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం టూ-వీలర్స్ సేల్స్ గణనీయంగా పెరిగాయి. ఇందులో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్, ఏథర్ ఎనర్జీ ప్రధానంగా ఉన్నాయి.ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మాత్రమే కాకుండా.. ప్రీమియం టూ వీలర్ సెగ్మెంట్లో హార్లే డేవిడ్సన్, రాయల్ ఎన్ఫీల్డ్, యమహా, ఆల్ట్రావయొలెట్, రివోల్ట్ మోటార్స్ వంటివి మాత్రమే కాకుండా ఎనర్జికా మోటార్, డామన్ వంటి కొత్త సంస్థలు ప్రవేశించడానికి చూస్తున్నాయి.రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ షా, సీనియర్ విశ్లేషకుడు సౌమెన్ మండల్ కూడా భారత్ ద్విచక్రవాహన విభాగంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తుందని అన్నారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడయ్యే ద్విచక్ర వాహనాల్లో దాదాపు 44 శాతం వాటా మనదేశానిదే అని భావించారు. -
Lok sabha elections 2024: ఎన్నికల ఎఫెక్ట్... టూ వీలర్లు, ఫ్రిజ్ సేల్స్ రయ్!
సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆటోమొబైల్, గృహోపకరణాల మార్కెట్లో సందడి నెలకొంది. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ టూ వీలర్లు, గృహోపకరణాలకు ఒక్కసారిగా డిమాండ్ పుంజుకుంది. ఇదంతా ఎన్నికల చలవేనంటున్నాయి పరిశ్రమ వర్గాలు. నిజానికి వీటి కొనుగోళ్లు కొద్ది నెలలుగా తీవ్రంగా మందగించాయి. ఎన్నికల హడావుడి మొదలయ్యాక ఏప్రిల్, మే నెలల్లో వీటి అమ్మకాలు భారీగా పెరిగాయి. 125 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం, రూ.లక్ష వరకు ధర ఉన్న చిన్న టూ వీలర్ల విక్రయాల్లో 33 శాతం వృద్ధి నమోదైందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) ప్రెసిడెంట్ మనీశ్ రాజ్ సింఘానియా వెల్లడించారు. కరోనా విలయం తర్వాత ప్రీమియం టూ వీలర్లకు డిమాండ్ పుంజుకుంటున్నా ఎంట్రీ లెవెల్ విభాగంలో మాత్రం అమ్మకాలు నత్తనడకన వచ్చాయి. ‘‘కానీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వాలిచ్చే ప్రోత్సాహకాలకు తోడు పారీ్టలు సైతం భారీగా ఖర్చుకు తెరతీయడంతో అల్పాదాయ కుటుంబాల చేతిలో డబ్బులు ఆడుతున్నాయి. దాంతో చిన్న టూ వీలర్లు, ఫ్రిజ్‌ల వంటివాటిని భారీగా కొంటున్నారు’ అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మండుటెండల దెబ్బకు రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్ల కొనుగోళ్లు పెరిగాయి. ఎంట్రీ లెవెల్ సింగిల్ డోర్ ఫ్రిజ్‌లు శరవేగంగా అమ్ముడవుతున్నాయని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది పేర్కొన్నారు. ‘‘చాలాకాలంగా ఈ విభాగంలో అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఇప్పుడు మాత్రం ప్రీమియం సెగ్మెంట్‌తో సమానంగా వీటి సేల్స్ నమోదవుతున్నాయి’’ అని వివరించారు. ఎన్నికల ఖర్చు రికార్డ్... రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం 2024లో సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వ్యయం గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టనుంది. ఈ ఏడాది ఎన్నికల సీజన్లో పార్టీలు, అభ్యర్థుల ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు దాటొచ్చని స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్)కు చెందిన ఎన్. భాస్కరరావు అంచనా వేశారు. -
నిరాశపర్చిన ఈ–టూవీలర్స్ విక్రయాలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు ఏప్రిల్ నెలలో నిరాశపరిచాయి. దేశవ్యాప్తంగా మార్చి నెలలో 1,37,146 యూనిట్లు రోడ్డెక్కితే.. గత నెలలో ఈ సంఖ్య సగానికంటే క్షీణించి 64,013 యూనిట్లకు పరిమితమైంది. సబ్సిడీ మొత్తం తగ్గడం, కొన్ని ప్రముఖ మోడళ్ల ధర పెరగడం ఈ క్షీణతకు కారణం.ఎన్నికల సీజన్ కావడం కూడా ప్రభావం చూపిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 2023 ఏప్రిల్‌లో కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిన ఈ–టూవీలర్ల సంఖ్య 66,873 యూనిట్లు. 2024 జనవరి, ఫిబ్రవరిలో ప్రతినెలా 82 వేల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఫేమ్–2 సబ్సిడీ అందుకోవడానికి మార్చి నెల చివరిది కావడం కూడా 1,37,146 యూనిట్ల గరిష్ట అమ్మకాలకు దోహదం చేసింది.కంపెనీలు మోడల్‌నుబట్టి రూ.4,000లతో మొదలుకుని రూ.16,000 వరకు ధరలను పెంచడం గమనార్హం. అయితే నూతన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు అమలులో ఉంటుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.10,000, ఈ–రిక్షా, ఈ–కార్ట్‌కు రూ.25,000, ఈ–ఆటోకు రూ.50,000 సబ్సిడీ ఆఫర్ చేస్తారు. ఇక ఏప్రిల్‌లో ఈ–టూ వీలర్ల విక్రయాల్లో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ కో, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ టాప్‌లో నిలిచాయి.ఇవి చదవండి: అధిక రాబడులకు మూమెంటమ్ ఇన్వెస్టింగ్.. -
సబ్సిడీ ఎత్తేస్తే అంతే.. సీఈవో ఆందోళన!
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ఉపసంహరించుకోవడంపై ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య ఎలక్ట్రిక్ టూవీలర్ పరిశ్రమలో ఒకటీ రెండు సంవత్సరాల వృద్ధి స్తబ్దతకు దారితీయవచ్చని ఆయన అంటున్నారు. పరిశ్రమ మనుగడ కోసం రాయితీలపైనే పూర్తిగా ఆధారపడనప్పటికీ వచ్చే ఏప్రిల్‌లోనే సబ్సిడీని నిలిపివేస్తే కంపెనీలు మరింత కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఈ దృష్టాంతం పరిశ్రమ వృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో జాప్యానికి దారి తీస్తుంది. ఈ ఏడాది మార్చిలో ముగియనున్న ఫేమ్2(FAME-II) పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే గత ఏడాది జూన్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ మొత్తాన్ని తగ్గించింది. ఉన్నట్టుండి సబ్సిడీని తగ్గించడం వల్ల కలిగిన ప్రతికూల ప్రభావాన్ని తరుణ్ మెహతా ఎత్తిచూపారు. దీనివల్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ 2023లో వృద్ధిని కోల్పోయిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడంలో పేరుగాంచిన చండీగఢ్ ఫేమ్ స్కీమ్ లేకపోతే ప్రభావితం కావచ్చన్నారు. దేశం అంతటా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల స్వీకరణను ప్రోత్సహించడంలో ఫేమ్ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది కాలుష నియంత్రణ, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దోహదం చేస్తోంది. అయితే బ్యాటరీ ఖర్చులు అధికంగా ఉండటం, విడి భాగాలపై సరఫరా పరిమితులు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ఖరీదైనవిగా మార్చాయి. -
కొత్త వెర్షన్ బీఎండబ్ల్యూ బైక్ భలే ఉందే.. ధర ఎంతంటే?
ప్రముఖ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత్‌లో న్యూ వెర్షన్ బైక్‌ను విడుదల చేసింది. 1000ఆర్ఆర్ పేరుతో లాంచ్ చేసిన బైక్ ప్రారంభ ధర రూ.49 లక్షలుగా ఉంది. అప్డేట్ చేసిన ఎం 1000 ఆర్ఆర్ను సైతం వాహనదారులకు పరిచయం చేసింది. దీని ధర రూ.49లక్షలుగా ఉంది. ఎం 1000 ఆర్ఆర్ కాంపిటీషన్ పేరిట తీసుకొచ్చిన మరో బైక్ ధర రూ.55 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ వేరియంట్లో బ్లాక్‌స్ట్రోమ్ మెటాలిక్ అండ్ ఎం మోటార్‌స్పోర్ట్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ సూపర్ బైక్‌లో లిక్విడ్ కూల్డ్ 999సీసీ, ఇన్లైన్ 4 సిలిండర్ ఇంజిన్, 212హెచ్‌పీ, 113 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. కేవలం 3.1 సెకన్లలో 0-100 కేపీఎంహెచ్ స్పీడ్ అందుకోగలదు. అయితే, టాప్ స్పీడ్ 314కేపీఎంహెచ్ వరకు దూసుకెళ్లగలదు. కంప్లీట్ బిల్ట్ అప్ యూనిట్ (సీబీయూ) తో వస్తున్న ఈ బైక్ ప్రీ ఆర్డర్లు అన్ని బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా అథరైజ్డ్ డీలర్ల వద్ద జూన్ 28 నుంచి ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. 2023 నవంబర్ నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని పేర్కొంది. -
టూ–వీలర్లకు వారంటీ పొడిగించిన హోండా మోటార్‌సైకిల్.. వివరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఎక్స్టెండెడ్ వారంటీ ప్రకటించింది. 250 సీసీ వరకు సామర్థ్యం గల అన్ని మోడళ్లకు ఇది వర్తిస్తుందని కంపెనీ బుధవారం తెలిపింది. వాహనం కొనుగోలు చేసిన తేదీ నుండి 91 రోజులు మొదలుకుని తొమ్మిదవ సంవత్సరం వరకు పొడిగించిన వారంటీని కస్టమర్లు పొందవచ్చు. 10 ఏళ్ల వరకు సమగ్ర వారంటీ కవరేజీని అందించడమేగాక, వాహనాన్ని ఇతరులకు విక్రయించినప్పడు వారంటీ బదిలీ అవుతుంది. అధిక విలువైన విడిభాగాలు, ఇతర అవసరమైన మెకానికల్, ఎలక్ట్రికల్ భాగాలతో సహా 10 సంవత్సరాల వరకు పొడిగించిన వారంటీ కవరేజీని అందించడం పరిశ్రమలో తొలిసారి అని హెచ్ఎంఎస్ఐ సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ యోగేశ్ మాథుర్ తెలిపారు. -
ఎండలో బండి నడుపుతున్నారా? జాగ్రత్త.. ప్రమాదం పొంచి ఉన్నట్టే
రాత్రికి వంద రూపాయల పెట్రోల్ వేయించా... మాములుగా అయితే బండి రోజులు నడుస్తుంది. అలాంటిది ఒక్క రోజుకే పెట్రోల్ నిల్ అని చూపుతోందని సురేష్ ఆందోళన చెందాడు. ఈ సమస్య సురేష్ ఒక్కడిదే కాదు... జిల్లా వ్యాప్తంగా వాహనాలు వినియోగిస్తున్న అందరి అనుభవం. వేయించున్నా పెట్రోల్ ఏంమైంది? పెట్రోల్ బంకులోనే తక్కువగా వేస్తున్నారా? లేదా ఎవరైనా దొంగలిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవేవి కాదని నిపుణులు చెబుతున్నారు. మండుతున్న ఎండల వేడికి వాహనాల్లోని పెట్రోల్ ఆవిరవుతుండడమే కారణంగా విశ్లేషిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి హిందూపురం: అసలే వేసవికాలం... గతంలో ఎన్నడూ లేనంతగా సూరీడు భగభగ మంటూ నిప్పులు చెరుగుతున్నాడు. ఇలాంటి తరుణంలో వాహనాలను ఎక్కడబడితే అక్కడ ఎండలో ఉంచేస్తే పెట్రోల్ మొత్తం ఖాళీ అయిపోవడం ఖాయం. వాహనదారులు వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, లేకపోతే కొత్త సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ నెలాఖరు నుంచి మే మాసం లోపు 43.1 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్క్‌కు చేరుకోవడంతో ఎండ వేడిమికి జనం విలవిల్లాడుతున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి.. మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉదయం 8 గంటలకే ఎండ వేడిమి ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఒకవేళ తప్పనిసరైతే ద్విచక్ర వాహనాలు లేదా, కార్లలో అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో వాహనాలను ఎండలో ఎక్కడబడితే అక్కడే ఆపేస్తున్నారు. దీంతో ఎండ వేడిమికి ఆయా వాహనాల్లోని ఇంధనం ఆవిరైపోతోంది. ఇది ఒక్కోసారి అగ్నిప్రమాదాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్కింగ్ జోన్లు లేక అవస్థలు.. జిల్లాలోని హిందూపురం, పుట్టపర్తి, కదిరి మున్సిపాల్టీలతో పాటు పంచాయతీ కేంద్రాల్లో పార్కింగ్ జోన్లు లేక వాహదారులు అవస్థలు పడుతున్నారు. కాయగూరలకు ఇతర అవసరాలకు వాహనాల్లో వెళ్లినప్పుడు ఎండలోనే పార్కింగ్ చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఇంధనం ఆవిరై పోతుండడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల 2,77,235 వాహనాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అలాగే వివిధ ప్రాంతాల్లోని 139 పెట్రోలు బంకుల్లో గతంలో రోజు వారీ 139 వేల లీటర్ల పెట్రోలు, డీజిల్ విక్రయాలు సాగేవి. వేసవి ఆరంభం నుంచి ఇది పెరుగుతూ వస్తోంది. తాజాగా 210 వేల లీటర్ల మార్క్‌ను చేరుకుంది.వేసవిలో వాహనదారులు అప్రమత్తంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎండ వేడిమికి పెట్రోల్ ట్యాంకుల్లో గ్యాస్ ఏర్పడి పేలిపోయే ప్రమాదముంది. రాత్రి పూట బైక్‌ను నిలిపి ఉంచినప్డుపు ఓ సారి ట్యాంక్ మూత తీసి మళ్లీ మూసి వేయాలి. మందపాటి సీటు కవర్లు వాడడం మంచిది. పెట్రోల్ ట్యాంకులను సైతం కప్పి ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలను నీడలోనే పార్కింగ్ చేయడం ఉత్తమం. – షాజహాన్, మెకానిక్, హిందూపురం -
Hyderabad: పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై టూ వీలర్ ప్రవేశానికి చెక్..
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు వ్యతిరేకంగా పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్స్‌ప్రెస్‌వే పై ద్విచక్ర వాహనదారులు ప్రయాణించకుండా ఉండేందుకు హెచ్ఎండీఏతో కలిసి తగు చర్యలు తీసుకుంటున్నామని రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్యామ్‌సుందర్‌రెడ్డి తెలిపారు. సరోజినీదేవి ఆసుపత్రి నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు 11 కిలో మీటర్ల మేర నిర్మించిన పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే కేవలం కార్లకు మాత్రమే అనుమతి ఉందన్నారు. ద్విచక్ర వాహనాదారులు, భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు. కానీ కొందరు ద్విచక్ర వాహనాదారులు ఈ వంతెనపై నుంచి ప్రయాణిస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నారన్నారు. ► గతంలో ఈ వంతెనపై ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై మృతి చెందిన ఘటనలు సైతం జరిగాయన్నారు. ►ఈ నేపథ్యంలో పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే ద్విచక్ర వాహనదారుల ప్రవేశాన్ని అరికట్టేందుకు హెచ్ఎండీఏతో పలుమార్లు సంప్రదింపులు జరిపి తగు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ►ఎక్స్‌ప్రెస్‌వే వంతెనపై ఎక్కేందుకు, దిగేందుకు ఏర్పాటు చేసిన ర్యాంపుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ► ఈ నెల చివరి నాటికి ఈ పనులు పూర్తి అవుతాయన్నారు. సీసీ కెమెరాల ద్వారా వాహనాదారులను గుర్తించి అపరాధ రుసుం వేస్తామన్నారు. ►సీసీ కెమెరాలను పర్యవేక్షించేందుకు పోలీస్‌స్టేషన్‌లోనే తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఫ్లై ఓవర్ ర్యాంపుల వద్ద సీసీ కెమెరా వాహనాన్ని గుర్తించి అపరాధ రుసుం విధించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. -
వాహనాల తయారీ నిలిపివేసిన హీరో మోటాకార్ప్
-
వాహనాల తయారీ నిలిపివేసిన హీరో మోటాకార్ప్
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు సంస్థ హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న తరుణంలో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కంపెనీకి చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్(జీపీసీ)తో సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని తయారీ ప్లాంట్లలో తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించినట్లు హీరో మోటోకార్ప్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. రేపటి(ఏప్రిల్ 22) నుంచి మే 1 వరకు కంపెనీకి సంబంధించిన అన్ని ప్లాంట్లను మూసివేస్తున్నట్లు తెలిపింది. అయితే, ప్లాంట్లను మూసివేయడం కారణంగా వాహనాల తయారీ నిలిచిపోవడంతో ఆ ప్రభావం డిమాండ్ పై పడే ప్రమాదం ఉందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. కంపెనీ మాత్రం వాహనాల తయారీని నిలిపివేయడం ద్వారా డిమాండ్ పై ఎలాంటి ప్రభావం ఉండకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఈ మూసివేత ద్వారా ఏర్పడే ప్రొడక్షన్ లాస్ ను భర్తీ చేస్తామన్నారు. తయారీ కర్మాగారాల్లో అవసరమైన నిర్వహణ పనులను చేపట్టడానికి కంపెనీ ఈ షట్-డౌన్ రోజులను ఉపయోగించుకొనున్నట్లు పేర్కొంది. అలాగే, కంపెనీకి చెందిన అన్ని కార్పొరేట్ కార్యాలయాలు సైతం మూసి వేసే ఉన్నాయి. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానంలో విధులు నిర్వహిస్తున్నారు. మళ్లీ మే 1 అనంతరం ప్రతీ ప్లాంటులోని వాహనాల తయారీ ఎప్పటిలాగే కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. చదవండి: దేశంలో బంగారం దిగుమతుల జోరు -
వాహనం నల్లగొండ.. చలాన్లు కరీంనగర్!
సాక్షి, శాలిగౌరారం: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం రామాంజాపురం గ్రామానికి చెందిన సొప్పరి లింగయ్య ద్విచక్ర వాహనానికి కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల నుంచి ఈ చలాన్లు రావడంతో కంగుతిన్నాడు. లక్ష్మయ్య వద్ద ఏపీ 24 ఏటీ 6032 నంబరు గల ద్విచక్ర వాహనం ఉంది. ఇంటి నుంచి వ్యవసాయ పొలం వద్దకు రాకపోకలకు మాత్రమే ఎక్కువగా వినియోగిస్తుంటాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఇటీవల పోస్టులో ఇంటికి ఈ–చలాన్ వచ్చింది. ఐదు చలాన్లకు గాను రూ.3 వేలకు పైగా చెల్లించాడు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, ఈ చలాన్లు రావడం ఏమిటని ఆరా తీయగా.. తన వాహన నంబర్ ప్లేటుతో ఉన్న ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు ప్రయాణించే ఫొటో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. కరీంనగర్లో ఎవరో దొంగతనంగా మరో వాహనం నడుపుతున్నట్లు గుర్తించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
బైకుల దొంగ అరెస్ట్
సాక్షి, వరంగల్: మండలంలో ఈనెల 10న 2 మోటార్‌సైకిళ్లు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు గార్ల, బయ్యారం సీఐ వై.రమేష్ తెలిపారు. బుధవారం గార్ల పోలీస్‌స్టేషన్‌లో మోటార్‌సైకిళ్ల చోరీకి సంబందించిన వివరాలను సీఐ విలేకరులకు వెల్లడించారు. గార్లలో గత 2 నెలల క్రితం బంధువుల ఇళ్లకు వచ్చిన మహ్మద్ రఫిక్ గార్లలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 10న అర్ధరాత్రి గార్లకు చెందిన పతంగి ప్రవీణ్, గద్దపాటి రాము తమ ఇళ్ల ముందర మోటార్‌సైకిళ్లు పెట్టి, ఉదయాన్నే లేచిచూడగా మోటార్ సైకిళ్లు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు గార్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు గార్ల ఎస్సై పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి గార్లలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మహ్మద్ రఫిక్ మోటార్‌సైకిళ్ల చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. నాటినుంచి పరారీలో ఉన్న నిందితుడు బుధవారం సత్యనారాయణపురం క్రాస్‌రోడ్ వద్ద చోరీ చేసిన అప్పాచీ, స్కూటీ మోటార్‌సైకిళ్లను వేరే వ్యక్తులకు అమ్ముతుండగా గార్ల పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి రూ.1లక్ష విలువ గల 2 మోటార్‌సైకిళ్లను స్వాధీన పరుచుకుని, నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ఇకనుంచి ప్రతీ గ్రామంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుని శాంతి భద్రతలను కాపాడుకోవడంలో పోలీసులతో ప్రజలు భాగస్వాములు కావాలని సీఐ కోరారు. కాగా, మోటార్‌సైకిళ్ల చోరీ నిందితుడిని పట్టుకున్న ఎస్సై పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సిబ్బందిని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అభినందించి, వీరికి త్వరలో రివార్డులు అందజేస్తామని తెలిపినట్లు సీఐ రమేష్ విలేకరులకు తెలిపారు. -
అంతులేని అభిమానం !
అంతులేని అభిమానం .. ఎల్లలదాకా ప్రయాణం ఆత్మకూరు రూరల్: నెరిసిన జుట్టు , సడలిన ఒళ్లు, ముంచుకొచ్చిన వృద్ధాప్యం .. ఇవేవి ఆయన సంకల్ప దీక్షకు అడ్డురాలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై గల అవ్యాజాభిమానం, ఆయన కుమారుడు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఉన్న వాత్సల్యం.. అరవై ఏళ్ల రహిమాన్‌ను తన ద్విచక్రవాహనంపై రాష్ట్రం నలుమూలకు ప్రచార యాత్ర సాగించేందుకు పూనుకునేందుకు పురికొల్పాయి. రహిమాన్ శుక్రవారం ఆత్మకూరు వచ్చారు. పులివెందుల మండలం వేంపల్లెకు చెందిన విశ్రాంత సైనిక, దూరదర్శన్ ఉద్యోగి అయిన ఈయన.. మూడు నెలల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన ప్రచార యాత్ర చేపట్టారు. తన బజాజ్ ద్విచక్రవాహనానికి చుట్టూ దివంగత వైఎస్ఆర్ çఅమలు చేసిన పథకాల జాబితాను, వైఎస్ జగన్ చేపట్టిన దీక్షల వివరాలను, వైఎస్ ఆర్, వైఎస్ జగన్, వైఎస్ షర్మిళ చిత్రపటాలను , పార్టీ పతాకాలను అలంకరించాడు. వాహనానికి ఉన్న చిన్న పాటి మైక్ సిస్టంలో వైఎస్ఆర్ పాటలు వినిపిస్తూ తన యాత్ర సాగిస్తున్నాడు. నిజానికి తనకు శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన ఉన్నట్లు తెలియదని ఇక్కడికి వచ్చాకే విషయం తెలిసిందన్నారు. తాను జగనన్నతో పాటు నియోజకవర్గం అంతటా అనుసరిస్తానని ఆయన చెప్పారు.