
సాక్షి, శాలిగౌరారం: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం రామాంజాపురం గ్రామానికి చెందిన సొప్పరి లింగయ్య ద్విచక్ర వాహనానికి కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల నుంచి ఈ చలాన్‌లు రావడంతో కంగుతిన్నాడు. లక్ష్మయ్య వద్ద ఏపీ 24 ఏటీ 6032 నంబరు గల ద్విచక్ర వాహనం ఉంది. ఇంటి నుంచి వ్యవసాయ పొలం వద్దకు రాకపోకలకు మాత్రమే ఎక్కువగా వినియోగిస్తుంటాడు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఇటీవల పోస్టులో ఇంటికి ఈ–చలాన్ వచ్చింది. ఐదు చలాన్‌లకు గాను రూ.3 వేలకు పైగా చెల్లించాడు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, ఈ చలాన్లు రావడం ఏమిటని ఆరా తీయగా.. తన వాహన నంబర్ ప్లేటుతో ఉన్న ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు ప్రయాణించే ఫొటో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. కరీంనగర్‌లో ఎవరో దొంగతనంగా మరో వాహనం నడుపుతున్నట్లు గుర్తించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment