కేంద్ర ప్రభుత్వం 100 స్మార్ట్ సిటీల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణలో అయిదు, ఆంధ్రప్రదేశ్లో నాలుగు స్మార్ట్ సిటీలను కేంద్రం నిర్మించనుంది.
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 100 స్మార్ట్ సిటీల జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో అయిదు, ఆంధ్రప్రదేశ్లో నాలుగు స్మార్ట్ సిటీలను కేంద్రం నిర్మించనుంది. 7060 కోట్లుతో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయనుంది. తెలంగాణలో స్మార్ట్ సిటీల జాబితాలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్,నల్గొండ కాగా, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు,విజయవాడ, కర్నూలు, చిత్తూరు ఉన్నాయి. కాగా కేంద్రబడ్జెట్‌లో 100 నగరాలను స్మార్ట్ సిటీలు అభివద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే.
స్మార్ట్ సిటీ అంటే.. ...
స్మార్ట్, శాటిలైట్‌గా ఎంపిక చేసిన నగరాల్లో రవాణా, శానిటేషన్, త్రాగునీరు, గహనిర్మాణం, జీవనవిధానాల్లో మార్పు. పబ్లిక్ అండ్ కమర్షియల్ సౌకర్యాలు, వైఫై కనెక్లివిటీ, జియోగ్రాఫికల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) బేస్‌డ్ అర్బన్ ప్లానింగ్, విజ్‌వరల్డ్ విభాగాలతో అనుసంధానించనున్నారు. బైస్కిల్ మార్గాలు, వాక్‌వేలు, చెరువుల అభివద్ధికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టే అవకాశం ఉంటుంది.
smart citys, telangana, andhra pradesh, hyderabad, guntur, vijayawada, guntur, karimnagar, nalgonda, nizamabad,స్మార్ట్ సిటీలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ