తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నల్లగొండ జిల్లాలోని మఠంపల్లి మండలం రఘనాథపాలెంలో సుబ్బారెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పల బాధతో రైతు మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
మరో వైపు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం కనగర్తిలో రాజయ్య అనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఉరేసుకుని అఘాయిత్యానికి పాల్పడినట్టు స్థానికలు తెలిపారు. రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.