ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత్ ఈ ఏడాది చైనాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా అవతరించనుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
2024 ప్రారంభం నుంచి అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో ద్విచక్ర వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం టూ-వీలర్స్ సేల్స్ గణనీయంగా పెరిగాయి. ఇందులో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్, ఏథర్ ఎనర్జీ ప్రధానంగా ఉన్నాయి.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మాత్రమే కాకుండా.. ప్రీమియం టూ వీలర్ సెగ్మెంట్‌లో హార్లే డేవిడ్‌సన్, రాయల్ ఎన్‌ఫీల్డ్, యమహా, ఆల్ట్రావయొలెట్, రివోల్ట్ మోటార్స్ వంటివి మాత్రమే కాకుండా ఎనర్జికా మోటార్, డామన్ వంటి కొత్త సంస్థలు ప్రవేశించడానికి చూస్తున్నాయి.
రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ షా, సీనియర్ విశ్లేషకుడు సౌమెన్ మండల్ కూడా భారత్ ద్విచక్రవాహన విభాగంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తుందని అన్నారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడయ్యే ద్విచక్ర వాహనాల్లో దాదాపు 44 శాతం వాటా మనదేశానిదే అని భావించారు.
Comments
Please login to add a commentAdd a comment