Extended
-
సీఈఏ పదవీ కాలం పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి అనంత నాగేశ్వరన్ పదవీకాలాన్ని కేంద్రం మరో రెండేళ్ల పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో నాగేశ్వరన్ మార్చి 31, 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు. కేవీ సుబ్రమణియన్ స్థానంలో 2022, జనవరి 28న సీఈఏగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వివిధ ఆర్థిక విధానాలపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడంతో పాటు కేంద్ర బడ్జెట్‌కు ముందు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేను రూపొందించడం సీఈఏ కార్యాలయం ప్రధాన బాధ్యత. నాగేశ్వర్ సీఈఏగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు 2019 నుంచి 2021 వరకు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో పార్ట్‌టైం సభ్యుడిగా పనిచేశారు. భారత్, సింగ్‌పూర్‌లో అనేక బిజినెస్ స్కూల్స్‌లో బోధించారు. నాగేశ్వరన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ డిగ్రీని పొందారు. 1994లో మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్‌లో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. -
కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును మరోసారి పొడిగించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల బ్యారేజీల్లో అవకతవకలపై ఉమ్మడి ఏపీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ వేసింది.జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ఏప్రిల్ 30 వరకు కమిషన్ గడువు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ ఈ నెల 23న హైదరాబాద్ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి విచారణ కొనసాగించనున్నారు. ఈ దఫా మిగిలిన విచారణతో పాటు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయనున్నట్టు సమాచారం. కాగా తదుపరి జరగనున్న విచారణలోఅధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లలతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్ద నాయకులను కూడా పిలిచే అవకాశముందని తెలుస్తోంది. -
ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంపు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువును పెంచుతూ కీలక ప్రకటన చేసింది. దీంతో గడువు మరో 15 రోజులు ముందుకు సాగింది.నిజానికి ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing) గడువు 2024 డిసెంబర్ 31.. అయితే ఈ గడువును ఆదాయ పన్ను శాఖ 2025 జనవరి 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పొడిగింపు పన్ను చెల్లింపుదారులు.. వారి ఫైలింగ్‌లను పూర్తి చేయడానికి లేదా సవరించడానికి ఓ అవకాశం అని తెలుస్తోంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 119 ప్రకారం.. బోర్డు అధికారాలను ఉపయోగించి ఈ మార్పు చేసింది.సాధారణంగా ప్రతి ఏటా ఐటీఆర్ ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్ జులై 31. ఈ తేదీ లోపల ఐటీఆర్ ఫైల్ చేయనివారు.. జరిమానా చెల్లించి డిసెంబర్ 31 లోపల ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ గడువును కూడా మరో 15 రోజులు పొడిగిస్తూ ఆదాయ పన్ను శాఖ నిర్ణయం తీసుకుంది. జనవరి 15 లోపల ఐటీఆర్ ఫైల్ చేయని వారు మాత్రమే కాకుండా.. ఫైల్ చేసిన వారు కూడా ఏవైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చు.బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్న వారు రూ.1,000 జరిమానా చెల్లించాలి. ఆదాయం ఐదు లక్షల రూపాయలకంటే ఎక్కువ ఉంటే వారు రూ. 5 వేల వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో బకాయిలపై వడ్డీ, ఫెనాల్టీ వంటివి కూడా చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్లకు శుభవార్త.. డెడ్‌లైన్ పొడిగింపు2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత జనాభాలో 6.68 శాతం మంది మాత్రమే ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేశారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) డిసెంబర్ 17న పార్లమెంటుకు తెలియజేశారు. ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసుకునే మొత్తం వ్యక్తుల సంఖ్య 8,09,03,315 అని ఆయన పేర్కొన్నారు.CBDT extends the last date for furnishing Belated/ Revised return of income for AY 2024-25 in the case of Resident Individuals from 31st December, 2024 to 15th January, 2025.✅Circular no. 21/2024 dated 31/12/2024 issued-https://t.co/DedADMfnGX pic.twitter.com/sBVdGZqxRF— Income Tax India (@IncomeTaxIndia) December 31, 2024 -
ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పెంపు
న్యూఢిల్లీ: 2023–24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువును డిసెంబర్ 15 వరకు పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఉత్తర్వులు వెలువరించింది.2024–25 అసెస్మెంట్ సంవత్సరానికిగాను నవంబర్ 30 వరకు ఉన్న గడువును 15 రోజులు పొడిగించింది. అంతర్జాతీయ లావాదేవీలు, సెక్షన్ 92ఈ కింద నివేదికలను సమర్పించాల్సిన పన్ను చెల్లింపుదారుల కోసం సీబీడీటీ ఈ వెసులుబాటు కల్పించింది.CBDT Extends Due Date for furnishing Return of Income for Assessment Year 2024-25.➡️The due date for the assessees referred to in clause (aa) of Explanation 2 to Sub Section (1) of Section 139 has been extended from 30th November, 2024, to 15th December, 2024.➡️ Circular No.… pic.twitter.com/4umO91ELAQ— Income Tax India (@IncomeTaxIndia) November 30, 2024 -
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవీకాలం పొడిగింపు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వర్ రావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల సంఘం (ఏసీసీ) రాజేశ్వర్ రావు పునర్నియామకానికి ఆమోదం తెలిపింది.2024 అక్టోబర్ 9 నుంచి ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఆయన పదవీకాలం కొనసాగుతుందని ఏసీసీ పేర్కొంది. 2020 అక్టోబర్‌లో డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1984లో ఆర్బీఐలో చేరిన ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు. -
కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. జులై 3 దాకా కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.కేసు తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. తన క్లైంట్కు జ్యుడీషియల్ కస్ఠడీ పొడిగించడాన్ని కేజ్రీవాల్ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. కేజ్రీవాల్‌కు గతంలో విధించిన జ్యుడీషియల్ కస్డడీ ముగియడంతో తీహార్ జైలు నుంచి ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు ప్రవేశపెట్టారు.కేజ్రీవాల్‌తో పాటు ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న వినోద్చౌహాన్ కస్టడీని కూడా కోర్టు జులై 3 దాకా పొడిగించింది. లిక్కర్ స్కామ్‌లో ప్రతి అంశం చివరకు కేజ్రీవాల్‌కే ముడిపడి ఉంటోందని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టు ముందు వాదనలు వినిపించారు. -
ఆధార్ - రేషన్ కార్డు లింక్.. మరో అవకాశం
ఆధార్ - రేషన్ కార్డు ఇంకా లింక్ చేసుకోని వారికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. వాస్తవానికి వీటిని లింక్ చేసుకోవడానికి గడువు జూన్ 30తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ గడువును గడువును మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకలను అడ్డుకోవడానికి ఆధార్ - రేషన్ కార్డును తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని కేంద్రం గతంలో ఆదేశించింది. వీటి అనుసంధానం వల్ల అర్హులకు ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలను అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో లింక్ పూర్తి చేసుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేయవచ్చు. -
TS: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీని ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు గురువారం తెలంగాణ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. మే 4వ తేదీ వరకు ఫెయిలైన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా ఇంటర్ ఫలితాలు విడుదలైన రోజు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ మే 2వ తేదీతో ముగిసింది. కానీ విద్యార్థుల విజ్ఞప్తుల మేరకు పరీక్ష ఫీజు చెల్లింపు తేదీని మే 4వ తేదీ వరకు పొడిగించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి నిర్వహిస్తారు. ఫస్టియర్‌కు ఉదయం 9 నుంచి మ. 12 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు మ. 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. -
‘ఆమ్ ఆద్మీ’ని అంతం చేసే కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దోపిడీ రాకెట్ నడుపుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి అనే పొగతో కప్పేసి ఆప్‌ను అవినీతి పార్టీగా చిత్రీకరించి, అంతమొందించడం ఈడీ లక్ష్యాల్లో ఒకటని చెప్పారు. తాను ఈడీ దర్యాప్తును వ్యతిరేకించడం లేదని అన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తనను ఈడీ కస్టడీలో ఉంచుకోవచ్చని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఏడు రోజుల కస్టడీ ముగియడంతో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపర్చారు. తొలుత ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు, న్యాయవాది జొహెబ్హుస్సేన్ వాదనలు వినిపించారు. మద్యం కుంభకోణం కేసులో స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ఇతరత్రా డేటాను పరిశీలించాల్సి ఉందని ధర్మాసనానికి రాజు తెలియజేశారు. ఇతర నిందితులతో కలిపి కేజ్రీవాల్‌ను విచారించాల్సి ఉందన్నారు. గోవా నుంచి సమన్లు అందుకొన్న కొందరితో కలిపి కేజ్రీవాల్‌ను విచారించాలన్నారు. లిక్కర్ కేసులో దర్యాప్తునకు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా సహకరించడం లేదని ఆరోపించారు. మరో ఏడు రోజులపాటు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అనుమతించాలని న్యాయమూర్తిని కోరారు. అనంతరం స్వయంగా వాదనలు వినిపించుకోవడానికి కేజ్రీవాల్‌కు అవకాశం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది గుప్తా కోరగా, న్యాయమూర్తి అనుమతించారు. కేజ్రీవాల్ తన వాదనలు హిందీలో కొనసాగించారు. 2022లో సీబీఐ కేసు నమోదైందని, తనని ఎవరూ అరెస్టు చేయలేదని, ఏ కోర్టు కూడా తనను దోషిగా గుర్తించడం గానీ లేదా ఆరోపణలు చేయడం గానీ జరగలేదని స్పష్టం చేశారు. ట్రాప్ చేయడమే ఈడీ అసలు ఉద్దేశం ఈ కేసులో సీబీఐ ఇప్పటిదాకా 31,000 పేజీలను కోర్టులో ఫైల్ చేసిందని, 294 మంది సాకు‡్ష్యలను విచారించిందని, ఈడీ 162 మందిని విచారించిందని, 25,000 పేజీల రిపోర్టును ఫైల్ చేసిందని చెప్పారు. తన పేరు కేవలం 4 స్టేట్‌మెంట్లలోనే ఉందని తెలిపారు. తననెందుకు అరెస్టు చేశారో చెప్పాలన్నారు. అయితే, ఈ వివరాలన్నీ అఫిడవిట్ రూపంలో ఇస్తే రికార్డుల్లో చేరుస్తానని న్యాయమూర్తి సూచించారు. దీంతో, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ అభ్యర్ధించారు. తాను ముఖ్యమంత్రినని, తన నివాసానికి మంత్రులు వస్తుంటారని, గుసగుసలాడుతుంటారని, దీని ఆధారంగా సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. దీనిపై ఎస్.వి.రాజు అభ్యంతరం వ్యక్తం చేయగా... ‘‘రాజు గారు, మీ ఆశీర్వాదం నాకు కావాలి. నన్ను మాట్లాడనివ్వండి’’ అని కేజ్రీవాల్ కోరారు. ఐదు నిమిషాలు మాత్రమే సమయం ఇవ్వగలనని న్యాయమూర్తి చెప్పడంతో కేజ్రీవాల్ తన వాదనలు కొనసాగించారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరును ప్రస్తావించారు. తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చే వరకూ అతడి నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటూనే ఉన్నారని, దీన్నిబట్టి తనని ట్రాప్ చేయడమే ఈడీ అసలు ఉద్దేశమని అర్థమవుతోందని చెప్పారు. కొంతమంది నిందితులు అప్రూవర్లుగా మారిన అనంతరం ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. మాగుంట రాఘవ ఇచ్చిన స్టేట్మెంట్లను ప్రస్తావిస్తూ... ఆయన ఐదు స్టేట్మెంట్లు ఇచ్చారని తెలియజేశారు. ఈడీ ఏం చెబితే అదే వాంగ్మూలంగా ఇచ్చారని అన్నారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి స్టేట్మెంట్ మార్చుకోగానే ఆయన కుమారుడు మాగుంట రాఘవ బెయిలు పొందారని కేజ్రీవాల్ ఆరోపించారు. స్టేట్మెంట్లలో రాఘవ చెప్పింది ఏదీ కూడా ఈడీ రికార్డుల్లోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈడీ కార్యాలయంలో లక్ష పేజీలు ఉన్నప్పటికీ, తనకు అనుకూలంగా ఉన్న ఒక్క అంశాన్ని కూడా రికార్డుల్లోకి తీసుకోలేదన్నారు. రూ.100 కోట్ల కుంభకోణం అంటున్నారని, అయితే ఆ సొమ్ము ఎక్కడా లేదని చెప్పారు. ఈడీ దర్యాప్తు తర్వాతే మద్యం కుంభకోణం అనేది మొదలైందని విమర్శించారు. ఈడీ అంతిమ లక్ష్యం ఆమ్ ఆద్మీ పార్టీని అంతమొందించడమేనని పేర్కొన్నారు. దీనిపై ఈడీ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తంచేశారు. దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేయడం తగదన్నారు. నా వద్ద ఆధారాలున్నాయి బీజేపీకి శరత్‌చంద్రారెడ్డి రూ.55 కోట్లు విరాళంగా ఇచ్చారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ రాకెట్ నడుస్తోందనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ఈడీ తనని ఎన్నిరోజులు రిమాండ్‌లో ఉంచుకున్నా అభ్యంతరం లేదన్నారు. ఈడీపై పదేపదే అవే విమర్శలు చేయడం ద్వారా ప్రజల మద్దతు కూడకట్టుకోవాలని కేజ్రీవాల్ ప్రయతి్నస్తున్నారని ఎస్.వి.రాజు ధర్మాసనానికి తెలిపారు. ఈడీ కార్యాలయంలో తనకు అనుకూలంగా పేజీలు ఉన్నాయని కేజ్రీవాల్ ఎలా భావిస్తున్నారు? ఇదంతా ఊహాజనితం అని అన్నారు. లంచం ద్వారా వచ్చిన సొమ్ములు గోవా ఎన్నికల్లో కేజ్రీవాల్ వినియోగించారని తెలిపారు. ఈ సొమ్మంతా హవాలా రూపంలో సౌత్ గ్రూపు నుంచి వచ్చిందేనని, అదంతా ఒక చైన్ లాంటిదని, అందుకే దాని గురించి కేజ్రీవాల్ మాట్లాడడం లేదని తెలిపారు. బీజేపీకి శరత్‌చంద్రారెడ్డి విరాళం ఆరోపణలపై రాజు బదులిస్తూ... దీనికి, మద్యం కుంభకోణానికి సంబంధం లేదన్నారు. ఎందుకంటే ఢిల్లీలో మద్యం విధానాన్ని రూపొందించే హక్కు బీజేపీకి లేదన్నారు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వెంటనే క్లీన్చిట్ రాదని, దర్యాప్తును ఎదుర్కోవాలని,సామాన్యుడికి, సీఎంకు అరెస్టు విషయంలో తేడా ఉండదని రాజు పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసులో ప్రశ్నించడానికి కేజ్రీవాల్‌కు మరో వారం రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించాలని కోరారు. అనంతరం, రాజు వాదనలకు తాను స్పందించవచ్చా? అని కేజ్రీవాల్ తరపు న్యాయవాది గుప్తా కోరగా.. ఇప్పటివరకూ స్పందించారుగా ఇక అప్రస్తుతం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది అప్రస్తుతం, అసందర్భం అని ఎలా అంటారని గుప్తా ప్రశ్నించగా... గట్టిగా మాట్లాడొద్దని హెచ్చరిస్తూ అందరి వాదనలు విన్నానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 4 రోజులపాటు ఈడీ కస్టడీకి మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ ఈడీ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు మరో 4 రోజులపాటు పొడిగించింది. ఆయనను ఏప్రిల్ 1న ఉదయం 11 గంటల్లోగా తమ ఎదుట హాజరుపర్చాలని ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఈడీ అధికారులను ఆదేశించారు. కేజ్రీవాల్‌ను ఏడు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా, న్యాయమూర్తి నిరాకరించారు. కేవలం 4 రోజలుపాటు కస్టడీకి అనుమతించారు. గత ఐదు రోజులపాటు కేజ్రీవాల్‌ను ప్రశ్నించామని, తప్పించుకొనేలా ఆయన సమాధానాలిచ్చారని రిమాండ్ పిటిషన్లో ఈడీ వెల్లడించింది. -
ఆధార్ ఫ్రీ అప్డేట్ కోసం మరో ఛాన్స్ - లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి కేంద్రం మార్చి 14 వరకు గడువును ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ గడువును 2024 జూన్ 14 వరకు పొడిగిస్తూ.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. ఆధార్ అప్డేట్ కోసం ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుండంతో యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఫ్రీ సర్వీస్ మై ఆధార్ (#myAdhaar) పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవాలనే వారు ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. మీ ఆధార్ కార్డును ఎలా అప్డేట్ చేసుకోవాలంటే.. యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి ఆధార్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)ని ఉపయోగించి లాగిన్ చేయాలి. లాగిన్ అయిన తరువాత మీకు డాక్యుమెంట్ అప్డేట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయాలి. ఏ వివరాలను అప్డేట్ చేసుకోవాలో దాన్ని సెలక్ట్ చేసుకుని, అవసరమైన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. చివరగా సబ్మిట్ చేయడానికి ముందు మీ వివరాలను ద్రువీకరించుకోవాలి. కేవలం myAadhaar పోర్టల్ మాత్రమే జూన్ 14 వరకు డాక్యుమెంట్ల ఆధార్ అప్డేట్లను ఉచితంగా అందిస్తుంది. ఫిజికల్ ఆధార్ కేంద్రాలలో ఈ దీని కోసం రూ. 50 ఫీజు వసూలు చేస్తారు. 50 రూపాయలకంటే ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తే ఆపరేటర్ మీద చర్యలు తీసుకుంటారు. #UIDAI extends free online document upload facility till 14th June 2024; to benefit millions of Aadhaar holders. This free service is available only on the #myAadhaar portal. UIDAI has been encouraging people to keep documents updated in their #Aadhaar pic.twitter.com/eaSvSWLvvt — Aadhaar (@UIDAI) March 12, 2024 -
కేంద్రం శుభవార్త.. గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ స్కీమ్ పొడిగింపు
కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు మాత్రమే కాకుండా ఎల్పీజీ సబ్సిడీ పథకాన్ని కూడా ఏడాది పాటు పొడిగించింది. కేంద్రం గతేడాది అక్టోబర్‌లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఎల్పీజీ సబ్సిడీని సిలిండర్‌పై రూ.300కి పెంచింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ఈ రాయితీని వర్తిస్తుంది. రానున్న మూడేళ్లలో అదనపు ఎల్పీజీ కనెక్షన్లు అందజేస్తామని, దీనికి రూ.1650 కోట్ల ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. జనపనారకు కూడా కేంద్రం కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు తెలిపింది. జనపనార మద్దతు ధర ఇప్పుడు ఉన్నదానికంటే కూడా 285 రూపాయలు పెంచింది. దీంతో క్వింటాల్ జనపనార ధర రూ. 5,335కు చేరింది. -
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పొడిగింపు.. అందుకేనా..!
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం ఒక రోజు పొడిగించింది. ముందుగా ఈ నెల 9వ తేదీ శుక్రవారం వరకే సమావేశాలు జరుగుతాయని ప్రకటించినప్పటికీ తాజాగా శనివారం కూడా సెషన్ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ప్రకటించారు. కాగా, యూపీఏ పదేళ్ల పాలనలో అస్తవ్యస్థమైన దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుందన్న పుకార్ల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల పొడిగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. పదేళ్ల యూపీఏ పాలనలో అవలంబించిన అస్తవ్యస్థమైన ఆర్థిక విధానాలు, అవినీతి వల్ల దేశం చాలా విలువైన పదేళ్ల కాలాన్ని కోల్పోయిన వైనాన్ని మోదీ ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా ఎండగట్టనున్నట్లు సమాచారం. యూపీఏ పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారత్ తీసుకొని ఉండాల్సిన చర్యలు కూడా శ్వేతపత్రంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యూపీఏ పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెప్పడం గమనార్హం. ఇదీచదవండి.. ఇండియా కూటమికి నితీశ్ అంత్యక్రియలు చేశారు -
తెలంగాణ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మళ్లీ పెంపు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ట్రాఫిక్ ఛలాన్ల రాయితీ గడువును మరోసారి పెంచారు. వచ్చే నెల(ఫిబ్రవరి) 15వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత పొడిగింపు ఉండదని అధికార వర్గాలు వెల్లడించినా.. పొడిగింపు వైపే ప్రభుత్వం మొగ్గు చూపించినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే.. గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు అవకాశమిచ్చారు. తొలుత పదిహేను రోజులపాటు అవకాశమిచ్చిన పోలీసులు ఆ తర్వాత జనవరి 10 నుంచి ఈ నెలాఖరు వరకు పొడిగించారు. .. తద్వారా పెండింగ్ చలాన్ల రాయితీ చెల్లింపులకు నెల రోజులకు పైగా సమయం దొరికింది. ఇక.. తెలంగాణ వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లకు గాను ఇప్పటి వరకు 1,52,47,864 చలాన్లు చెల్లించారు. వీటి ద్వారా రూ.135 కోట్ల ఆదాయం వచ్చింది. -
వదంతులపై స్పందించే గడువు పెంపు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో వ్యాపించే వదంతులపై తప్పనిసరిగా స్పందించాల్సిన గడువును క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పొడిగించింది. దీంతో టాప్–100 లిస్టెడ్ కంపెనీలకు వెసులుబాటు లభించింది. వెరసి మార్కెట్లో పుట్టే రూమర్లను ధ్రువ పరచడం, ఖండించడం లేదా స్పష్టతనివ్వడం వంటి చర్యలను తప్పనిసరిగా చేపట్టాలనే నిబంధన అమలుకు మరింత గడువు లభించింది. సెబీ ప్రతిపాదిత ఈ నిబంధనలు తొలుత టాప్ ర్యాంక్‌లోని 100 లిస్టెడ్ కంపెనీలకు అమలుకానున్న సంగతి తెలిసిందే. మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)రీత్యా అగ్రభాగంలో నిలిచే 100 కంపెనీలు 2024 ఫిబ్రవరి 1 నుంచి రూమర్లపై తప్పనిసరిగా స్పందించాలంటూ సెబీ ఇంతక్రితం గడువు విధించింది. తాజాగా ఈ డెడ్‌లైన్‌ను జూన్ 1వరకూ పొడిగిస్తూ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ బాటలో మార్కెట్ విలువలో టాప్–250 ర్యాంకు లిస్టెడ్ కంపెనీలకు రూమర్లపై స్పందించాల్సిన నిబంధనలు 2024 డిసెంబర్ 1 నుంచి అమలుకానున్నాయి. నిజానికి 2024 ఆగస్ట్ 1 నుంచి నిబంధనలు అమలు చేయవలసిందిగా టాప్–250 సంస్థలను సెబీ గతంలో ఆదేశించింది. లిస్టెడ్ కంపెనీలు కార్పొరేట్ పాలనను మరింత పటిష్టంగా అమలు చేసే లక్ష్యంతో సెబీ తాజా నిబంధనలకు తెరతీసిన విషయం విదితమే. -
AP: గ్రూప్-1 దరఖాస్తు స్వీకరణకు గడువు పొడిగింపు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్-1 దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 28 వరకు పొడిగించినట్లు తెలిపింది. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్సైట్లో తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని, ఓటీపీఆర్‌తో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో మార్చి 17న ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నట్టు సర్వీస్ కమిషన్ పేర్కొంది. కమిషన్ ప్రకటించిన గ్రూప్-1 విభాగంలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 18 అసిస్టెంట్ ట్యాక్స్ కమిషనర్స్ పోస్టులు, 26 డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్స్, ఆర్టీవో, గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్స్, జిల్లా బీసీ సంక్షేమ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు సైతం ఆఫ్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలోనే నిర్వహించనున్న విషయం తెలిసిందే చదవండి: AP: ESMSపై కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమం -
ఆధార్ ఉచిత అప్డేట్ గడువు మరోసారి పెంపు
సాక్షి, అమరావతి: ఆధార్‌లో అడ్రసు తదితర వివరాలను సొంతంగా అధికారిక ఆన్లైన్ వెబ్‌పోర్టల్‌లో అప్డేట్ చేసుకునే వారికి ఆ సేవలను ఉచితంగా అందజేసే గడువును ఆధార్‌కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ మరోసారి వచ్చే ఏడాది మార్చి 14వ తేదీ వరకు పొడిగించింది. ఆధార్‌కార్డులు కలిగి ఉన్న ఎవరైనా ఆ కార్డు పొందిన పదేళ్ల గడువులో ఒక్కసారైనా వారికి సంబంధించి తాజా అడ్రసు తదితర వివరాలను కచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ గతంలోనే సూచించింది. ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాల్లో ఆధార్ వినియోగం పెరిగిన నేపథ్యంలో వినియోగదారుడి పాత సమాచారం కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఐడీఏఐ అప్పట్లో ప్రకటించింది. అదే సమయంలో.. ఆధార్‌కు సంబంధించి వివిధ రకాల సేవలను పొందాలంటే యూఐఏడీఐ నిర్ధారించిన నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉండగా.. ఆన్లైన్లో సొంతంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునే వారికి ఆ సేవలకు మినహాయింపు ఉంటుందని కూడా అప్పట్లో ప్రకటించింది. మొదట 2023 ఫిబ్రవరి వరకే ఈ ఉచిత సేవలని యూఐడీఏఐ ప్రకటించగా.. అనంతరం ఆ గడువును మూడు దఫాలు పొడిగించింది. తాజాగా నాలుగోసారి 2024 మార్చి 14 వరకు గడువు పొడిగిస్తున్నట్టు పేర్కొంటూ యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ సీఆర్ ప్రభాకరన్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. -
రూ.2000 నోట్లు: ఆర్బీఐ గుడ్ న్యూస్
Rs 2000 notes Deadline extended up to October 7 ఉపసంహరించుకున్న రూ. 2000 నోటు డిపాజిట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ గడువును అక్టోబరు 7 వరకు పెంచుతున్నట్టు శనివారం వెల్లడించింది. అంతేకాదు రూ.2000 నోట్లు చట్ట బద్దంగా చలామణిలో ఉంటాయని కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి జాప్యం లేకుండా రూ.2000 నోట్లను డిపాజిట్ చేయాలని లేదా మార్చుకోవాలని ఆర్బీఐ ప్రజలను కోరింది. RBI సంచలన ప్రకటన ఉపసంహరణ ప్రక్రియకు నిర్దేశించిన వ్యవధి ముగిసినందున, రూ. 2000 నోట్ల డిపాజిట్ / మార్పిడికి అవకాశాన్ని అక్టోబర్ 07, 2023 వరకు పొడిగించాలని నిర్ణయించాం అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 2000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయని వెల్లడించింది. ► వినియోగదారులు అక్టోబరు 8 తరువాత నుంచి ఈ నోట్లను 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో ఒకేసారి రూ.20,000 వరకు మార్చుకోవచ్చు. వ్యక్తులు, సంస్థలు 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను దేశంలోని తమ బ్యాంక్ ఖాతాలకు ఎంత మొత్తానికి అయినా జమ చేయవచ్చు. ► అంతేకాకుండా, దేశంలోని కస్టమర్లు భారతదేశంలోని వారి బ్యాంక్ ఖాతాలకు క్రెడిట్ కోసం 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో దేనినైనా చిరునామాకు పంపి, ఇండియా పోస్ట్ ద్వారా రూ.2000 నోట్లను పంపవచ్చు అయితే ఈ క్రెడిట్ సంబంధిత ఆర్బీఐ / ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటుంది, చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాల సమర్పించాలి. ► న్యాయస్థానాలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు, ప్రభుత్వ విభాగాలు లేదా దర్యాప్తు ప్రక్రియల్లో పాలుపంచుకున్న ఇతర పబ్లిక్ అథారిటీలు లేదా ఎన్ఫోర్స్మెంట్ ఎటువంటి పరిమితి లేకుండా 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలలో దేనిలోనైనా రూ.2000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు అని ఆర్బీఐ తెలిపింది. కాగా క్లీన్-నోట్ విధానంలో భాగంగా మే 19న రూ. 2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 31 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లు రూ.0.24 లక్షల కోట్లుగా ఉన్నాయని ఆర్బీఐ గత శుక్రవారం వెల్లడించింది. (లగ్జరీ బీఎండబ్ల్యూ ఈవీ: గంటల్లోనే హాల్ సేల్, ధర ఎంతంటే?) -
TS: ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీకాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీకాలం పొడిగించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో టీఎస్ఎఫ్సీ పార్థసారథి పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
గుడ్‌న్యూస్: అత్యధిక వడ్డీ స్కీమ్ గడువు పొడిగింపు
Amrit Kalash Deposit Scheme Deadline Extended: కష్టపడి పోగుచేసుకున్న సొమ్మును భద్రపరచుకునేందుకు ఉత్తమమైన మార్గం ఫిక్స్డ్ డిపాజిట్లు. అయితే వడ్డీ రేట్లు పొదుపుచేసే కాలానికి (టెన్యూర్) అనుగుణంగా ఉంటాయి. అలాగే సాధారణ ప్రజలు, మహిళలు, సీనియర్ సిటిజెన్లు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వడ్డీ రేటుతో బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ స్కీములను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అత్యధిక వడ్డీని ఇచ్చే ‘అమృత్ కలశ్’ (Amrit Kalash) స్కీమును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొన్ని నెలల క్రితం ప్రకటించింది. ప్రత్యేక పథకం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ప్రత్యేక అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీని మరోసారి పొడిగించింది. సాధారణ ప్రజలు, సీనియర్ సిటిజన్లకు అందించే అన్ని రకాల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లోనూ అత్యధిక వడ్డీని అందించే పథకం ఇదే. ఎస్బీఐ అమృత్ కలశ్ అనేది 400 రోజుల ప్రత్యేక టెన్యూర్ స్కీమ్. ఈ పథకం 2023 ఏప్రిల్ 12 నుంచి అమలవుతోంది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీని ఎస్బీఐ అందిస్తుంది. గత ఫిబ్రవరి 15న అధికారింగా లాంచ్ అయిన ఈ స్పెషల్ స్కీమ్ గడువును ఎస్బీఐ పలుసార్లు పెంచుతూ వచ్చింది. ఆగస్ట్ 15వ తేదీతోనే గడువు ముగిసినప్పటికీ తాజాగా మరోసారి డిసెంబర్ 31 వరకు పెంచుతున్నట్లు బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఇదీ చదవండి: శ్రావణమాస వేళ శుభవార్త: తగ్గిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి -
ఇలాంటి స్కీమ్ మళ్ళీ మళ్ళీ రాదు.. తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ!
SBI Amrit Kalash: భారతదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన 'ఎస్బీఐ' (SBI) గత కొన్ని నెలలుగా ఫిక్స్డ్ డిపాజిట్‌కి సంబంధించిన స్కీమ్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం 2023 జూన్ 30 నాటికి ముగిసింది. అయితే డిపాజిట్ల స్వీకరణకు గడువు మళ్ళీ ఇప్పుడు పొడిగించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమృత్ కలశ్ (Amrit Kalash) అనే పేరుగల ఈ స్కీమ్ గడువు ఇప్పటికే ముగిసింది. కానీ ఇప్పుడు SBI దీని గడువుని 2023 ఆగష్టు 15కి పెంచింది. అంటే ఈ స్కీమ్ ఇక కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది ఒకరకమైన షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. దీని ద్వారా మంచి వడ్డీ పొందవచ్చు. తక్కువ కాలంలో మంచి వడ్డీ కావాలనుకునే వారికి ఇది మంచి స్కీమ్ అనే చెప్పాలి. అమృత్ కలశ్ స్కీమ్ వడ్డీ.. నిజానికి అమృత్ కలశ్ స్కీమ్ కాల వ్యవధి కేవలం 400 రోజులు మాత్రమే. ఇందులో పెట్టుబడి పెట్టిన తరువాత సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. కాగా ఎస్బీఐ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక శాతం వడ్డీ ఎక్కువగా లభిస్తుంది. (ఇదీ చదవండి: మొదటిసారి రోడ్డుపై కనిపించిన ప్రపంచములోనే ఖరీదైన కారు - చూస్తే హవాక్కావల్సిందే!) అమృత్ కలశ్ స్కీమ్ కింద ఒక సీనియర్ సిటిజన్ రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే.. అతనికి 400 రోజులకు 7.6 శాతం వడ్డీ ప్రకారం రూ. 86,000 వడ్డీ, సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీ లెక్కన రూ. 80,170 వడ్డీ లభిస్తుంది. (ఇదీ చదవండి: భారత్ కీలక నిర్ణయం.. ఇలాగే జరిగితే చైనా కంపెనీల కథ కంచికే!) అమృత్ కలశ్ స్కీమ్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కి వెళ్ళవచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. -
AP: విద్యార్థులకు గమనిక.. ఒంటి పూట బడులు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 24 వరకు ఒంటి పూట బడులు పొడిగిస్తున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు బోధన సమయం, ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు రాగిజావా పంపిణీ, ఉదయం 11.30 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్న భోజనం ఉంటుందని స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ హామీ ఇచ్చారు: బొప్పరాజు -
టూ–వీలర్లకు వారంటీ పొడిగించిన హోండా మోటార్‌సైకిల్.. వివరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఎక్స్టెండెడ్ వారంటీ ప్రకటించింది. 250 సీసీ వరకు సామర్థ్యం గల అన్ని మోడళ్లకు ఇది వర్తిస్తుందని కంపెనీ బుధవారం తెలిపింది. వాహనం కొనుగోలు చేసిన తేదీ నుండి 91 రోజులు మొదలుకుని తొమ్మిదవ సంవత్సరం వరకు పొడిగించిన వారంటీని కస్టమర్లు పొందవచ్చు. 10 ఏళ్ల వరకు సమగ్ర వారంటీ కవరేజీని అందించడమేగాక, వాహనాన్ని ఇతరులకు విక్రయించినప్పడు వారంటీ బదిలీ అవుతుంది. అధిక విలువైన విడిభాగాలు, ఇతర అవసరమైన మెకానికల్, ఎలక్ట్రికల్ భాగాలతో సహా 10 సంవత్సరాల వరకు పొడిగించిన వారంటీ కవరేజీని అందించడం పరిశ్రమలో తొలిసారి అని హెచ్ఎంఎస్ఐ సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ యోగేశ్ మాథుర్ తెలిపారు. -
ఆ స్కీమ్ గడువు మళ్ళీ పెంచిన హెచ్డీఎఫ్సీ - కస్టమర్లకు పండగే!
HDFC Senior Citizen Scheme: ప్రముఖ ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ ప్రత్యేకంగా తీసుకువచ్చిన సీనియర్ సిటిజన్స్ ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువును మరింత పొడిగించింది. 60 సంవత్సరాలకంటే ఎక్కువ వయసున్న వారికి 'స్పెషల్ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ' ద్వారా గరిష్ఠ వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ స్కీమ్ 2020లోనే అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు దాని గడువును 2023 జులై 7 వరకు పెంచింది. ఈ స్కీమ్ ద్వారా సీరియర్ సిటిజన్ ఇన్వెస్టర్లకు అదనంగా 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు లభిస్తుంది. అంటే దీని ప్రకారం సాధారణ కస్టమర్లకు ఇప్పటికే అందించే 50 బేసిస్ పాయింట్లకు అదనంగా సీనియర్ సిటిజన్లకు 25 బేసిస్ పాయింట్లు కలుస్తాయి. అంటే దీని ప్రకారం సీనియర్ సిటిజన్స్ 0.75 శాతం ఎక్కువ వడ్డీని పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో సీనియర్ సిటిజన్ ఐదు సంవత్సరాలకంటే ముందే ప్రీమెచ్యూర్ చేస్తే వారికి 1% వడ్డీ లభిస్తుంది. 5 ఏళ్ల తరువాత దీనిపైన 1.25% శాతం వడ్డీ లభిస్తుంది. (ఇదీ చదవండి: మహీంద్రా ఎక్స్యువి700 సన్‌రూఫ్ మళ్ళీ లీక్.. ఇలా అయితే ఎలా? వైరల్ వీడియో!) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎఫ్డీ రేట్లు.. 7 రోజుల నుంచి 14 రోజులకు & 15 నుంచి 29 రోజులకు వడ్డీ 3.50 శాతం 30 రోజుల నుంచి 45 రోజుల వరకు వడ్డీ 4.0 శాతం 46 రోజుల నుంచి 60 రోజుల & 61 రోజుల నుంచి 89 రోజుల వరకు వడ్డీ 5.0 శాతం 90 రోజుల నుంచి 6 నెలల లోపు వరకు వడ్డీ 5.0 శాతం 6 నెలల ఒక రోజు నుంచి 9 నెలల లోపు 6.25 శాతం 9 నెలల ఒక రోజు నుంచి ఒక సంవత్సరం లోపు 6.50 శాతం ఒక సంవత్సరం నుంచి 15 నెలల లోపు 7.10 శాతం 15 నెల్ల నుంచి 18 నెలల లోపు 7.60 శాతం 18 నెలల నుంచి 21 నెలల లోపు 7.50 శాతం 21 నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు 7.50 శాతం రెండు సంవత్సరాల ఒక రోజు నుంచి రెండు సంవత్సరాల 11 నెలల వరకు 7.50 శాతం 2 ఏళ్ల 11 నెలలు (35 నెలలకు) వడ్డీ 7.70 శాతం 5 సంవత్సరాల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల వరకు వడ్డీ 7.75 శాతం -
మనీశ్ సిసోడియాకు మళ్లీ షాక్.. కస్టడీ పొడిగింపు.. బెయిల్‌పై 12న విచారణ..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 17వరకు పొడిగించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 12న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మరికొన్ని రోజులు కస్టడీలో ఉండటం అనివార్యమైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి 8 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కస్టడీలోనే ఉన్నారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసునకున్నప్పటికీ న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నందున బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే నెల రోజులకుపైగా కస్టడీలోనే ఉండటంతో ఏప్రిల్ 12న బెయిల్‌పై విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది. సిసోడియాపై మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఆయన ఖాతాలోకి అక్రమంగా రాలేదని అతని తరఫు న్యాయవాది వాదించారు. ఇల్లు, కార్యాలయాలు, బ్యాంకు లాకర్లలో కూడా అధికారులు తనిఖీలు చేశారని, ఒక్క ఆధారం కూడా లభించలేదని గుర్తు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో దీనిపై ఏప్రిల్ 12న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. చదవండి: సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీ దుర్వినియోగంపై పిటిషన్ తిరస్కరణ.. -
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు గుడ్‌న్యూస్: నామినీ నమోదు ఎలా?
సాక్షి,ముంబై: మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాదారులకు సెబీ భారీ ఊరటనిచ్చింది. నామినీ వివరాల నమోదుకు గడువు పొడిగిస్తూ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఖాతాదారులకు సమర్పించే గడువును ఆరు నెలలపాటు, అంటే ఈ ఏడాది సెప్టెంబరు 30వరకు పొడిగించింది. (ఇదీ చదవండి: దిల్ ఉండాలబ్బా..! ఆనంద్ మహీంద్ర అమేజింగ్ వీడియో) ప్రస్తుత డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) ఇన్వెస్టర్లకు నామినీ వివరాలు అప్డేట్ చేయడం లేదా తొలగించేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గడువు మార్చి 31తో ముగియనున్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలోనే ఈ గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. తొలుత అర్హతగల ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదారులంతా 2022 మార్చి31లోగా నామినీ వివరాలు దాఖలు చేయవలసిందిగా 2021 జూలైలో సెబీ ఆదేశించింది. ఆ తరువాత ఈ గడువును పెంచడంతోపాటు 2023 మార్చి31లోగా డీమ్యాట్ ఖాతాలు, ఎంఎఫ్ ఫోలియోలకు నామినీ వివరాలు జత చేయడం మ్యాండేటరీ చేసింది. (హిప్ హిప్ హుర్రే! దూసుకుపోతున్న థార్ ) నామిని అంటే నామినేషన్ అనేది మరణం సంభవించినప్పుడు ఖాతాదారుడి ఆస్తులకు వారసుడిగా ఒకవ్యక్తిని నియమించే ప్రక్రియ. ఇన్వెస్టర్లు ప్రారంభించిన కొత్త ఫోలియోలు/ఖాతాలకు నామిని నమోదు తప్పనిసరి. దీంతో పెట్టుబడిదారుడు మరణించిన సందర్భంలో నామినీకి నిధులను బదిలీ చేయడం సులభమవుతుంది. లేదంటే వారి వారసులు ఆయా యూనిట్లను అతడు లేదా ఆమె పేరు మీద బదిలీ చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా వీలునామా, చట్టపరమైన వారసత్వ ధృవీకరణ పత్రం, ఇతర చట్టపర వారసుల నుండి ఎన్వోసీలు లాంటి అనేక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) నామినీ నమోదు ఎలా? మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులు స్వయంగా సంబంధిత శాఖల ద్వారా, లేదా CAMD, KFintech వంటి RTA వెబ్సైట్ల ద్వారా నామినేషన్ పూర్తి చేయవచ్చు. వన్-టైమ్-పాస్వర్డ్ (OTP) ధృవీకరణ ద్వారా ఆ ప్రక్రియనుపూర్తి చేయవచ్చు. -
ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్: ఖాతాదారులకు గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి శుభవార్త. దీనికి సంబంధించిన గుడువుపై ఆందోళన అవసరం లేదు. 2023 మార్చి 3 తో గడువు ముగిసి పోతుందున్న ఆందోళన నేపథ్యంలో ఈపీఎఫ్‌వో గడువును పొడిగించింది. అధికారిక పోర్టల్ సమాచారం ప్రకారం ఈ గడువు మే 3 వ తేదీవరకు ఉంది. ఈ పరిధిలోని చందాదారులు, పెన్షన్‌దారుల్లో ఇప్పుడు అధిక పెన్షన్ కోసం మే 3 తేదీ వరకు అప్లయ్ చేసుకోవవచ్చు. (ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ సర్క్యులర్ జారీ.. ‘అధిక పెన్షన్’కు ఏం చేయాలి?) సుప్రీంకోర్టు నవంబర్ 4, 2022న తన ఆదేశాలలో ఈపీఎఫ్ఓ అర్హతగల సభ్యులందరికీ అధిక పెన్షన్‌ను ఎంచుకోవడానికి నాలుగు నెలల సమయం ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల వ్యవధి మార్చి 3, 2023తో ముగిసిపోనుందనే ఆందోళన సభ్యులలో నెలకొంది. అయితే తాజాగా 60 రోజుల పొడిగింపుతో అర్హత ఉన్న సభ్యులందరూ, యజమానులతో కలిసి మే 3, 2023 వరకు రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఏకీకృత సభ్యుల పోర్టల్‌లో అధిక పెన్షన్ కోసం సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవచ్చు. గత నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడి దీనికి సంబంధించిన అర్హతలపై ఈపీఎఫ్ఓ తన జోనల్ కార్యాలయాల్లోని అదనపు చీఫ్ ప్రావిడెంట్ కమిషనర్లు, ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాల్లోని రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్లకు ప్రత్యేక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. -
AP: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్.. మరో పదేళ్లు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిర్దేశించిన సబ్‌ప్లాన్ (ఉప ప్రణాళిక)ను ప్రభుత్వం మరో పదేళ్లు పొడిగించింది. ఈ మేరకు ఆదివారం ఆర్డినెన్స్‌ను జారీచేసింది. దళిత, గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం పదేళ్ల కాలపరిమితితో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ఈ నెల 23తో ముగియనుంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సబ్‌ప్లాన్‌ను కొనసాగించేందుకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆయా వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్డినెన్స్ తేవడం గొప్ప విషయం ఈ సందర్భంగా పలువురు మంత్రులు, వివిధ ప్రజా సంఘాల నేతలు స్పందించారు. ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పందిస్తూ.. సబ్‌ప్లాన్ చట్టం 2013 జనవరి 23 నుంచి అమలులోకి వచి్చందని.. చట్ట ప్రకారం పదేళ్ల తర్వాత ఇప్పుడు రద్దయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనిపై సకాలంలో సీఎం వైఎస్ జగన్ స్పందించి.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదంతో ముందుగానే ఆర్డినెన్స్ తేవడం గొప్ప విషయమన్నారు. దీంతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపట్ల సీఎం తనకున్న ప్రేమను మరోసారి చూపించారని కొనియాడారు. సబ్‌ప్లాన్ మరో పదేళ్లు కొనసాగేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, దేశంలో మెరుగ్గా సబ్‌ప్లాన్ అమలుచేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవడం వెనుక సీఎం జగన్ చిత్తశుద్ధే కారణమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి.. వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ అన్నారు. సబ్‌ప్లాన్‌ను మరో పదేళ్లు పొడిగించడం హర్షణీయమంటూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సీపీఎం, కేవీపీఎస్, సెంటర్ ఫర్ దళిత స్టడీస్ హర్షం ఇక ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తేవడం పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఒ.నల్లప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, సెంటర్ ఫర్ దళిత స్టడీస్ (హైదరాబాద్) చైర్పర్సన్ మల్లేపల్లి లక్ష్మయ్య, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్, ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్‌నాయక్ వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తంచేశారు. అలాగే, జాతీయ దళిత హక్కుల చైర్మన్ పెరికె ప్రసాదరావు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేరాజోత్ హనుమంతు నాయక్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజు కూడా ముఖ్యమంత్రి నిర్ణయంపట్ల సంతోషం వ్యక్తంచేశారు. సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామన్నారు. -
ఏపీలో సంక్రాతి సెలవులు పొడిగింపు
-
ట్రేడర్లకు గుడ్ న్యూస్: ఆర్బీఐ కీలక నిర్ణయం
సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్‌కు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ట్రేడింగ్ సమయాన్ని ప్రీ-పాండమిక్ స్థాయిలకు పొడిగించింది. మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టడంతో, లిక్విడిటీ కార్యకలాపాలలో సాధారణ స్థితిని పునరుద్ధరించేందుకు, ఆర్బీఐ ట్రేడింగ్ గంటలను తిరిగి మార్చాలని నిర్ణయించింది. ఈ మార్పులు డిసెంబర్ 12, 2022 నుండి అమలులోకి వస్తాయి. ఏప్రిల్ 18, 2022లో కొన్ని మార్పులు చేసిన ఎనిమిది నెలల తర్వాత మరోసారి టైమింగ్స్‌ను పొడిగించింది. అంటే కోవిడ్ ముందున్నట్టుగా ట్రేడింగ్ గంటల పొడిగించింది.మార్కెట్ ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 5వరకు ట్రేడింగ్ ఉంటుంది. ప్రస్తుతం పనిచేస్తున్న మధ్యాహ్నం 3:30తో పోలిస్తే గంటన్నర ఎక్కువ. ఇవే టైమింగ్స్ కమర్షియల్ పేపర్ , డిపాజిట్ మార్కెట్ సర్టిఫికేట్లకు, అలాగే రూపాయి వడ్డీ రేటు డెరివేటివ్ మార్కెట్‌కి కూడా వర్తిస్తాయి. కాగా కోవిడ్ ఉధృతితో ఏప్రిల్ 2020లో స్టాక్‌మార్కెట్ సమయాన్ని కుదించిన సంగతి తెలిసిందే. -
APPSC: గ్రూప్-1 దరఖాస్తుల గడువు పెంపు
సాక్షి, విజయవాడ: గ్రూప్-1 పరీక్షల కోసం దరఖాస్తు తేదీ పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వివరాలను వెల్లడించారు. దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 2వ తేదీ కాగా.. ఆ తేదీని నవంబర్ 5కి మార్చినట్లు వెల్లడించారు. ఎల్లుండి(4వ తేదీ) అర్థరాత్రి లోపు ఫీజు చెల్లించాలని ఆయన తెలిపారు. డిసెంబర్ 18న స్క్రీనింగ్ టెస్ట్, మార్చ్ 2023లో మెయిన్స్ పరీక్షలు ఉంటాయని.. ఈ దరఖాస్తు పొడిగింపును గమనించి వినియోగించుకోవాలని అర్హులకు సవాంగ్ సూచించారు. -
సంజయ్ రౌత్ కస్టడీ మళ్లీ పొడిగింపు
ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. మనీ లాండరింగ్ కేసులో రౌత్‌ను నిందితుడిగా పేర్కొంటూ ఈడీ వేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ముంబై పట్రా చౌల్ అభివృద్ధి పనుల్లో అవకతవకల కేసులో ఆగస్ట్ ఒకటో తేదీన ఈడీ సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన కస్టడీని న్యాయస్థానం పొడిగిస్తూ వస్తోంది. రౌత్ బెయిల్ పిటిషన్‌పై 21న కోర్టు విచారణ చేపట్టనుంది. -
AP: వారానికి ఐదు రోజుల పని.. మరో ఏడాది పొడిగింపు
సాక్షి, అమరావతి: సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వ పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ గురువారం ఉత్తర్వులిచ్చారు. చదవండి: మీకు తెలుసా?.. చెప్పింది చేస్తే.. నష్టపోవాల్సిందే! వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో వారానికి ఐదురోజుల పని విధానాన్ని ఈ ఏడాది జూన్ 27వ తేదీ నుంచి ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదురోజుల పని విధానంలో ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలకు వరకు పని చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజులు పని చేసే విధానాన్ని మరో ఏడాది పాటు పొడిగించిన సీఎం వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. -
తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు..?
-
తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే 155 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యా సంస్థలు తెరుచుకోవడంతో ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలు తెరుచుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నుంచి విద్యాసంస్థలు ఓపెన్ కానుండటంతో పాఠశాలలకు సెలవులు పొడిగింపు ఉంటుందా..? అనే చర్చ నడుస్తోంది. అయితే, కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే వైద్యశాఖ నివేదిక ఇవ్వడం, హెచ్చరించడంతో విద్యా సంస్థలు తెరుచుకోవడంపై ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో పాఠశాలల ప్రారంభంపై ఆదివారం సాయంత్రానికి ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: బడి పిల్లల మధ్యాహ్న భోజనంలో మార్పులకు కేంద్రం నిర్ణయం -
ఏపీ సీఎస్ సమీర్‌శర్మ పదవీకాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీ కాలం పొడిగించింది కేంద్రం. మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది. దీంతో సీఎస్ సమీర్ శర్మ మరో 6 నెలల పాటు.. అంటే నవంబరు 30వ తేదీ వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉంటారు. ఈ మేరకు సీఎస్ పదవీకాలం పెంపుపై ఉత్తర్వులు విడుదల చేసింది డీవోపీటీ(Department of Personnel and Training). గతంలో 6 నెలల పాటు సమీర్ శర్మ కి సర్వీస్ పొడిగించించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. ఏపీలో మొదటి సారి ఆరు నెలలకు మించి పొడిగింపు పొందిన అధికారిగా సీఎస్ సమీర్ శర్మ గుర్తింపు దక్కించుకున్నారు. గతంలో యూపీ, బీహార్ సీఎస్ లకు మాత్రమే ఇలాంటి అవకాశం ఇచ్చింది కేంద్రం. -
కీలక నిర్ణయం..వారికి అదిరిపోయే శుభవార్తను అందించిన ఐసీఐసీఐ బ్యాంక్..!
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్తను అందించింది. సీనియర్ సిటిజన్ల కోసం ప్రవేశపెట్టిన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువును పొడిగిస్తూ ఐసీఐసీఐ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రత్యేకమైన వడ్డీరేట్లను సీనియర్ సిటిజన్లకు అందించనుంది. సీనియర్ సిటిజన్ల కోసం ఐసీఐసీఐ బ్యాంకు పలు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. వారి కోసం ప్రత్యేకమైన వడ్డీ రేట్లతో ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను ప్రకటించింది. ఈ స్కీమ్‌లో భాగంగా సీనియర్ సిటిజన్లకు అందించే 0. 50 శాతం వడ్డీరేటుతో పాటు మరో 0.25 శాతం అదనపు వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లకు అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ స్కీమ్ జనవరి 20నే ముగియాల్సి ఉండగా దానిని ఏప్రిల్ 8 వరకు ఐసీఐసీఐ బ్యాంక్ పొడిగించింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఎఫ్డీ స్కీమ్ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. దీంతో ఈ స్కీమ్ సినీయర్ సిటిజన్లకు మరో 5 నెలల పాటు అందుబాటులో ఉండనుంది. ఈ కొత్త వడ్డీ రేట్లు కొత్తగా ఓపెన్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు వర్తించనుంది. దాంతో పాటుగా పాత ఫిక్స్డ్ డిపాజిట్లను రెన్యూవల్ చేసుకున్నవారికి కూడా కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఈ ప్రత్యేక పథకం 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలవ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 6.35 శాత వడ్డీ రేటును అందిస్తుంది. ఇది సాధారణ ఖాతాదారులకు అందించే 5.60 శాతం కంటే ఎక్కువ. చదవండి: గట్టి షాకిచ్చిన ఆర్బీఐ..! వారు రూ. 5 వేలకు మించి విత్ డ్రా చేయలేరు..! -
గురుకుల సెట్–22 దరఖాస్తుకు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఐదో తరగతి ప్రవేశాలకు నిర్వహించనున్న గురుకుల సెట్(వీటీజీసెట్)–2022 దరఖాస్తు గడువును ఏప్రిల్ 7 వరకు పొడిగిస్తున్నట్లు సెట్ చీఫ్ కన్వీనర్ రోనాల్డ్‌రాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వీటీజీసెట్–22 మే 8న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్సైట్లో పరిశీలించవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు. -
ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. కరోనా కారణంగా సెలవులు పొడిగించడంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఇంటర్ బోర్డు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌లో జరిగే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 24 వరకు ఫీజు చెల్లించవచ్చని గతంలో పేర్కొంది. తాజాగా ఈ గడువును ఫిబ్రవరి 4వ తేదీ వరకు పొడిగించారు. ప్రథమ సంవత్సరం ఆర్ట్స్, అండ్ సైన్స్ గ్రూపులకు, ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్ గ్రూపులకు రూ.490, ద్వితీయ సంవత్సరం సైన్స్ గ్రూపులకు రూ.690 ఫీజును నిర్ణయించారు. ఒకేషనల్ కోర్సులకు ఫస్టియర్‌కు రూ.690, సెకండియర్‌కు రూ.840 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు
School Holidays Extended in Telangana Because Of Covid-19: తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల(జనవరి) 30 వరకు సెలవుల్ని పొడిగించినట్లు తెలంగాణ చీఫ్‌సెక్రటరీ ప్రకటించారు. కరోనా నేపథ్యంలోనే విద్యా సంస్థలకు సెలవులు పొడిగించినట్లు తెలిపారు. జనవరి తొలి వారంలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి ఈనెల 8వ తేదీ నుంచే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సంక్రాతిని కలిపేసుకుని ఈనెల 16 వరకు సెలవులు ఉండగా.. 17 నుంచి విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నెలాఖరు వరకు సెలవులు పొడిగించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. అన్ని విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయని స్పష్టత ఇచ్చింది సర్కార్. ఇక రాష్ట్రంలో కరోనా ఆంక్షలను 20వ తేదీకి వరకు ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవులు కూడా పొడిగించాలని వైద్య,ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో తాజాగా ఒక్కరోజులో 1,963 కొత్త కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 22, 017గా ఉంది. -
క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు ఊరట..! ఆన్లైన్ లావాదేవీలపై ఆర్బీఐ కీలక నిర్ణయం..!
క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు ఊరట కల్పిస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్, డెబిట్ కార్డుల టోకనైజేషన్ విధానాల అమలును మరో ఆరు నెలలపాటు పొడిగించింది. ఆర్బీఐ ఒక ప్రకటనలో...సీఓఎఫ్(కార్డ్ ఆన్ ఫైల్ డేటా) ను నిల్వ చేసేందుకు మరో ఆరు నెలల పాటు పొడిగించినట్లు పేర్కొంది. దీంతో కొత్త టోకెనైజేషన్ పాలసీ 2022 జూలై 1 నుంచి ప్రారంభంకానుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చాలనే లక్ష్యంతో ఈ కొత్త రూల్స్‌ను ఆర్బీఐ ప్రవేశపెట్టనుంది. వచ్చే ఏడాది జనవరి 1 తో కొత్త రూల్స్ వచ్చే నేపథ్యంలో ఇప్పటికే ఆయా బ్యాంకులు మర్చంట్ వెబ్సైట్ లేదా పలు యాప్‌లో క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను స్టోర్ చేసే విషయంలో ఖాతాదారులను అలర్ట్ చేశాయి. ప్రస్తుతం ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులకు ఊరట కల్గనుంది. టోకనైజేషన్ విధానాలతో ఆయా క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలను బహిర్గతం చేయకుండా ఆన్లైన్ కొనుగోళ్లను అనుమతిస్తుంది. సీఐఐ అభ్యర్థన మేరకే..! ఇటీవల టోకనైజేషన్‌ను అమలు చేయడానికి కనీసం ఆరు నెలల సమయాన్ని ట్రేడ్ యూనియన్ వ్యాపారులు కోరారు. దీని అమలు పలు అంతరాయాలను కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ కొత్త నియమాల కారణంగా ఆన్లైన్ మర్చెంట్స్ తమ రాబడిలో 20 నుంచి 40 శాతం మేర నష్టపోయే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) గతంలో పేర్కొంది. ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం...2020-21లో భారత డిజిటల్ చెల్లింపుల పరిశ్రమ విలువ రూ. 14,14,85,173 కోట్లుగా ఉంది. కరోనా మహమ్మారి సమయంలో డిజిటల్ చెల్లింపులు ఆర్థిక వృద్ధిని ప్రేరేపించాయని సీఐఐ పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు 98.5 కోట్ల కార్డ్‌లు ఉన్నాయని అంచనా. వీటితో ఒకే రోజు సుమారు 1.5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని సీఐఐ తెలిపింది. చదవండి: వ్యాపారులకు అలర్ట్.. జనవరి 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్..! -
AP: ఏప్రిల్ 2 వరకు ఓటీఎస్ పథకం పొడిగింపు
సాక్షి, పశ్చిమగోదావరి: ఏప్రిల్ 2 వరకు ఓటీఎస్ పథకం పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. పేదల ఇళ్లపై ఉన్న అప్పులను, వడ్డీని మాఫీచేసి, సర్వ హక్కులతో వారికి రిజిస్ట్రేషన్ చేయించే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం మంగళవారం నుంచి రాష్ట్రంలో ప్రారంభమైంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా రిజిస్ట్రేషన్ పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే లబ్ధిపొందిన 8.26 లక్షల మందికి కూడా మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్ పట్టాలను అందజేయనున్నారు జగనన్న సంపూర్ణ గృహ హక్కు ద్వారా అందే ప్రయోజనాలివే.. ♦ఇంటిపై సర్వ హక్కులు: గతంలో ఉన్న ‘నివసించే హక్కు’ స్థానంలో నేడు లబ్ధిదారునికి తన ఇంటిపై సర్వహక్కులు రానున్నాయి. ♦లావాదేవీలు సులభతరం: ఇంటిపై పూర్తి హక్కును పొందడం ద్వారా లబ్ధిదారుడు సదరు ఇంటిని అమ్ముకోవచ్చు.. బహుమతిగా ఇవ్వవచ్చు.. వారసత్వంగా అందించవచ్చు.. అవసరమైతే తనఖా పెట్టి బ్యాంకుల నుండి రుణం కూడా పొందవచ్చు. ♦రూ.16 వేల కోట్ల లబ్ధి: దాదాపు 52 లక్షల మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు రూ.10 వేల కోట్ల రుణమాఫీ, మరో రూ.6 వేల కోట్ల మేర స్టాంపు డ్యూటీ.. రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుతో మొత్తం రూ.16,000 కోట్ల లబ్ధి కలగనుంది. ♦నామమాత్రపు రుసుము: 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ వద్ద స్థలాలను తనఖా పెట్టి, ఇళ్ల నిర్మాణాలకు రుణాలు తీసుకున్న 40 లక్షల మంది లబ్ధిదారులకు అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.10 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు. అసలు, వడ్డీ ఎంత ఎక్కువ ఉన్నా గ్రామాల్లో కేవలం రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు చెల్లిస్తే చాలు. మిగిలిన మొత్తం మాఫీ. చెల్లించాల్సిన వడ్డీ, అసలు మొత్తంపై రుసుం కంటే తక్కువ ఉంటే ఆ తక్కువ మొత్తానికే రిజిస్ట్రేషన్ చార్జీలన్నీ కూడా పూర్తిగా మాఫీచేస్తూ పూర్తి హక్కులు కల్పించనున్నారు. ♦ఇంటిపై సర్వహక్కులు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సొంత డబ్బులతో ఇల్లు నిర్మించుకున్నప్పటికీ, ఇప్పటికీ ఇంటి మీద పూర్తి హక్కులులేని దాదాపు 12 లక్షల మందికి కేవలం రూ.10కే సర్వహక్కులతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తోంది. ♦22–ఏ నుండి తొలగింపు: లబ్ధిదారుడి స్థిరాస్తిని గతంలో ఉన్న నిషేధిత భూముల జాబితా (22–ఏ నిబంధన) నుండి తొలగిస్తున్నారు. దీంతో లబ్ధిదారుడు తన ఇంటిపై ఎలాంటి లావాదేవీలైనా చేసుకోవచ్చు. ♦ రిజిస్ట్రేషన్ ఇక సులభతరం: లబ్ధిదారుడికి చెందిన స్థిరాస్తిని గ్రామ–వార్డు సచివాలయంలోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల నుండి పూర్తి మినహాయింపు ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పడిగాపులు కాయాల్సిన అవసరంలేదు. ♦ లింకు డాక్యుమెంట్లతో పనిలేదు: ఈ పథకం కింద పొందిన పట్టా ద్వారా క్రయ విక్రయాలకు ఏ విధమైన లింకు డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ పదవీకాలం ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాము అనుకున్నదే చేస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల దాకా పొడిగించే వెసులుబాటును కల్పిస్తూ ఇటీవలే వివాదాస్పద ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చిన కేంద్రం... దీనికి అనుగుణంగానే ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని బుధవారం మరో ఏడాదిపాటు పెంచింది. 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన మిశ్రా 2018 నవంబరు 18న రెండేళ్ల పదవీకాలానికి ఈడీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2020లో ఆయన పదవీకాలాన్ని పెంచుతూ... రెండేళ్ల బదులు మూడేళ్లకు గాను ఆయన్ను ఈడీ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర నియామక ఉత్తర్వులను సవరించింది. కొందరు దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా... ఆ ఒక్కసారికి పొడిగింపునకు సమ్మతించిన కోర్టు తదుపరి మాత్రం సంజయ్‌కుమార్ మిశ్రాకు పొడిగింపు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. అయినప్పటికీ సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పదవీకాలాన్ని పెంచుతూ ఆర్డినెన్స్ తెచ్చి... మిశ్రాకు మరో ఏడాది పొడిగింపునిచ్చింది. గురువారం ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా... 2022 నవంబరు 18 దాకా ఆయన పదవిలో కొనసాగుతారని బుధవారం ఆదేశాలు జారీచేసింది. జాబితాలోకి విదేశాంగ కార్యదర్శి పదవీకాలం పొడిగింపు అర్హుల జాబితాలో విదేశాంగ కార్యదర్శిని చేరుస్తూ కేంద్రం ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను సవరించింది. రక్షణ, హోంశాఖ కార్యదర్శులు, ఐబీ డైరెక్టర్, ‘రా’ కార్యదర్శి, సీబీఐ, ఈడీల డైరెక్టర్ల పదవీకాలాన్ని గరిష్టంగా ఐదేళ్ల వరకు పొడిగించేలా ఆదివారం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో విదేశాంగ కార్యదర్శిని చేర్చింది. -
పాన్ కార్డు- ఆధార్ కార్డు లింక్‌పై కేంద్రం కీలక ప్రకటన
గత కొన్నిరోజుల నుంచి ఆదాయపన్ను శాఖ వెబ్సైట్లో తలెత్తిన సమస్యలతో పన్ను చెల్లింపుదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆదాయపన్ను శాఖ కీలక ప్రకటన చేసింది. పాన్ కార్డును ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలపాటు పొడిగించింది. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసే గడువు 2022 మార్చి 31. పాన్ కార్డును ఆదార్‌కార్డుతో లింక్ చేసే గడువును పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఒక ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కాస్త ఉపశమనం లభించనుంది. చదవండి: youtube: యూట్యూబ్‌ను దున్నేస్తున్నారు, రోజూ 1,500 కోట్ల షార్ట్ వీడియోస్ పాన్ కార్డును, ఆధార్‌తో అనుసంధాన గడువు పొడిగించడం ఇది నాలుగో సారి. ఈ ఏడాది ప్రవేశ పెట్టిన ఆర్ధిక బిల్లులో ప్రభుత్వం కొన్ని సవరణలను చేసింది. కొత్త నిబందనల ప్రకారం ఒక వ్యక్తి పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే రూ.1000 వరకు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పాన్-ఆధార్ లింకింగ్ పొడగింపు నిర్ణయంతో పాటు మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగి కొవిడ్ చికిత్సకు కంపెనీలు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందని కూడా కేంద్రం పేర్కొంది. In view of the difficulties being faced by the taxpayers, the Central Govt has extended certain timelines. CBDT Notification No. 113 of 2021 in S.O. 3814(E) dated 17th September, 2021 issued which is available on https://t.co/qX8AZ4HCvf. pic.twitter.com/D3pIf64CoU — Income Tax India (@IncomeTaxIndia) September 17, 2021 మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇలా లింక్ చేయండి.. ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ వెబ్సైట్ www.incometaxindiaefiling.gov.inకి లాగిన్ అవ్వండి. 'లింక్ ఆధార్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి సంబంధిత ఫీల్డ్‌లలో పాన్ నంబర్, ఆధార్ నంబర్, మీ పూర్తి పేరునమోదు చేయాలి. తరువాత పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయండి క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసి, పేజీ దిగువన ఉన్న ‘లింక్ ఆధార్’ బటన్‌పై క్లిక్ చేస్తే మీ పాన్ కార్డు విజయవంతంగా ఆధార్ కార్డుతో అనుసంధానం జరిగినట్లు పాప్ఆప్విండో వస్తుంది. చదవండి: Ford India Shutdown: భారత్‌కు దిగ్గజ కంపెనీ గుడ్‌బై, పరిహారంపై రాని స్పష్టత -
కోవిడ్ ఎఫెక్ట్: ఉత్తరాఖండ్‌లో కర్ఫ్యూ పొడిగింపు
డెహ్రడూన్: కరోనా మూడో వేవ్ విజృంభిస్తుండటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కర్ప్యూను సెప్టెంబర్ 14(మరోవారం) వరకు పొడిగించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం గతంలో విధించిన కర్ఫ్యూ సమయం సెప్టెంబర్ 7న ముగుస్తుండటంతో.. దాన్ని మరో వారం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ కట్టడిలో భాగంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం గతనెలలో రాష్ట్రంలో సామాజిక, రాజకీయ, వినోద సమావేశాలను నిషేధించిన సంగతి తెలిసిందే. (చదవండి: మంత్రి గారు మాస్క్ ముఖానికి పెట్టుకోవాలి, అక్కడ కాదు..!) కర్ఫ్యూ అమలవుతున్నప్పటికి వ్యాక్సిన్లు వేయడం యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ కర్ఫ్యూ సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు ఉదయం 8 గంటలు నుంచి రాత్రి 9 గంటలు వరకు మాత్రమే పనిచేసేలా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చదవండి: మంచు నిండిన ఈ ప్రదేశానికి పచ్చిక భూమి అనే పేరేంటో! -
ఏపీ: ఈ–కేవైసీ గడువు 15 వరకు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆధార్ కార్డుతో ఎలక్ట్రానిక్ పద్ధతిన వినియోగదారుల రేషన్ కార్డుల అనుసంధానం చేసే (ఈ–కేవైసీ) గడువును మరో 15 రోజులు పొడిగిస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ మంగళవారం ప్రకటించారు. లబ్ధిదారులెవరూ ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ముందు ప్రకటించిన దాని ప్రకారం ఈ–కేవైసీ నమోదు గడువు ఆగస్టు 31తో ముగిసింది. వరుస సెలవులు, పండుగలు రావడం, సర్వర్లు సరిగా పని చేయక పలు చోట్ల ఆధార్ నమోదు కేంద్రాలు పని చేయలేదని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో గడువు పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్‌తో అనుసంధానం అవసరం లేదన్నారు. ఆపై వయసున్న పిల్లలకు సెప్టెంబర్ వరకు గడువు ఉందని, పెద్దలు మాత్రం సెప్టెంబర్ 15లోగా చేయించుకోవచ్చని వివరించారు. ఇవీ చదవండి: ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేయమన్నా వేయని లోకేశ్ ప్రభుత్వ భూమిపై పచ్చమూక.. -
Telangana:రెండేళ్ల సర్వీసుకే పదోన్నతుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు అవసరమైన కనీస సర్వీసు కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు ఈ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 31తో ముగియనున్న 2020–21 పదోన్నతుల ప్యానెల్ ఈయర్ కోసం మాత్రమే ఈ అవకాశం కల్పించారు. అయితే తాజా నిర్ణయంతో ప్యానెల్ ఇయర్‌తో సంబంధం లేకుండా తదుపరి ఆదేశాలు జారీ వరకు ఈ వెసులుబాటు అమలు కానుంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ గ్రూప్–1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మంత్ నాయక్ స్వాగతించారు. -
ఏపీలో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడిగింపు
-
ఏపీలో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడిగింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నేపథ్యంలో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది. కాగా, అర్ధరాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని తాజా ఉత్తర్వులలో పేర్కొంది. సెప్టెంబర్ 4 వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. కాగా, ఏపీలో రోజువారి కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నవిషయం తెలిసిందే. -
వైజాగ్ స్టీల్ ’అడ్వైజర్ల’ బిడ్డింగ్‌కు గడువు పొడిగింపు
ఉక్కునగరం (గాజువాక): వైజాగ్ స్టీల్ (ఆర్ఐఎన్ఎల్) ప్రైవేటీకరణ ప్రక్రియ నిర్వహణకు సంబంధించిన లావాదేవీ సలహాదారుల (అడ్వైజర్లు) బిడ్డింగ్‌కు గడువును ఆగస్టు 26 వరకూ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు పొడిగించడం ఇది రెండోసారి. వాస్తవానికి జూలై 28కి గడువు ముగియాల్సి ఉండగా దాన్ని తర్వాత ఆగస్టు 17కి, అటుపైన తాజాగా ఆగస్టు 26కి పొడిగించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం వాటాల విక్రయానికి సంబంధించి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి లావాదేవీ సలహాదారుల నియామకం కోసం పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) జూలై 7న బిడ్లు (ఆర్ఎఫ్పీ) ఆహ్వానించింది. -
పాక్షికంగా కేసుల భౌతిక విచారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో కేసుల విచారణను ఈ నెల 9 నుంచి సెప్టెంబర్ 9 వరకు ప్రయోగాత్మకంగా పాక్షికంగా భౌతిక పద్ధతిలో చేపట్టడంతోపాటు ఆన్‌లైన్‌లోనూ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. అయితే ఈ నెల 8 వరకు మాత్రం ప్రస్తుతమున్న ఆన్లైన్ విధానంలోనే కేసుల విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. సోమ, మంగళవారాల్లో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనంతోపాటు ముగ్గురు సింగిల్ జడ్జీలు భౌతికంగా కేసులను విచారిస్తారని, బుధ, గురువారాల్లో న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్. రామచందర్‌రావు, జస్టిస్ టి. వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనంతోపాటు ముగ్గురు సింగిల్ జడ్జీలు భౌతికంగా కేసులను విచారిస్తారని హైకోర్టు తెలిపింది. ఆ తర్వాత రెండు రోజులు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనంతోపాటు ముగ్గురు సింగిల్ జడ్జీలు భౌతికంగా కేసులను విచారిస్తారని పేర్కొంది. హైకోర్టుతోపాటు కింది కోర్టుల్లో వ్యాక్సిన్ వేయించుకున్న న్యాయవాదులనే కోర్టు హాల్లోకి అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్‌ను వెంట ఉంచుకోవాలని సూచించింది. అలాగే హైకోర్టుతోపాటు కిందిస్థాయి కోర్టులు, ట్రిబ్యునళ్లలో ఆయా రోజుల్లో కేసులు విచారణలో ఉన్న న్యాయవాదులనే అనుమతిస్తామని పేర్కొంది. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాలని హైకోర్టు రిజిస్ట్రార్ వెంకటేశ్వర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రేపట్నుంచి సెప్టెంబర్ 9 వరకు కింది కోర్టుల్లోనూ... సోమవారం నుంచి సెప్టెంబర్ 9 వరకు కింది కోర్టులు, ట్రిబ్యునళ్లలో పాక్షికంగానే భౌతికంగా కేసుల విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మాత్రం ఈ నెల 8 వరకు ఆన్లైన్లోనే విచారణ కొనసాగించాలని స్పష్టం చేసింది. సీబీఐ, ఏసీబీ, నాంపల్లి, సిటీ సివిల్ కోర్టు, వరంగల్ జిల్లా కోర్టుల్లో ప్రస్తుతం కొనసాగిస్తున్న విధానంలోనే పాక్షికంగా ప్రత్యక్షంగా కేసులను విచారించాలని పేర్కొంది. తుది విచారణ దశలో ఉన్న కేసుల్లో ముందుగా సమాచారం ఇచ్చి భౌతికంగా లేదా ఆన్లైన్ ద్వారా వాదనలు వినిపించే అవకాశం న్యాయవాదులకు ఉంటుందని తెలిపింది. -
అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగుతోంది. తాజాగా ప్రత్యేక పరిస్థతులను దృష్టిలో వుంచుకుని అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని ఆగస్టు 31 వరకు పొడిగించింది కేంద్రం. జూలై 31తో అంతర్జాతీయ విమానాలపై నిషేధం ముగియనుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వందే భారత్ మిషన్ కింద నడుస్తున్న విమానాలు మునుపటిలాగే తమ కార్యకలాపాలను కొనసాగుతాయి. దేశాలతో ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందాల ప్రకారం నడుస్తున్న విమానాలు కూడా యథావిధిగా కొనసాగుతాయి. యుఎస్, యుకె, యుఎఇ, కెన్యా, భూటాన్ , ఫ్రాన్స్‌తో సహా ప్రపంచంలోని 28 దేశాలతో భారతదేశానికి ఎయిర్ బబుల్ ఒప్పందం ఉంది. అలాగే కొన్నికార్గో విమానాలకు కూడా నిషేధం వర్తించదని డీజీసిఏ స్పష్టం చేసింది. కాగా కరోనా థర్డ్‌వేవ్‌పై నిపుణులు, పలువురు శాస్త్రవేత్తల హెచ్చరికల మధ్య డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. తొలి దశలో కరోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందడం ప్రారంభమైనప్పటి నుంచి 2020 మార్చి 23 నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం నిలిపివేసింది. అయితే ఈ ఏడాది మేనుంచి దేశీయ విమానాలను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
ఆంధ్ర ప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
-
కరోనాపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను తాజాగా పొడిగించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టినా మరికొన్నాళ్లు ఈ మార్గదర్శకాలు పాటించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు గైడ్‌లైన్స్‌ను మరికొన్నాళ్లు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 31వ తేదీ వరకు మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కేసులు తగ్గుతున్నాయని ఆత్మ సంతృప్తి చెందవద్దని ఈ సందర్భంగా హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల, ఆర్ ఫ్యాక్టర్ అధికంగా ఉండడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పండుగల నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో ప్రజలు కరోనా మార్గదర్శకాలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. స్థానికంగా కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షల సడలింపులపై నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు పంచ వ్యూహం సిద్ధం చేసింది. టెస్ట్.. ట్రాక్.. ట్రీట్.. టీకా.. కరోనాగా పేర్కొంది. మార్గదర్శకాలకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు పంపారు. -
ఏపీలో మరో వారంపాటు నైట్ కర్ఫ్యూ పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో వారం పాటు నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్ సూపర్ కేర్ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. ‘‘పోలీస్ బెటాలియన్స్‌లో కూడా కోవిడ్ కేర్ ఎక్విప్మెంట్ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలి. కమ్యూనిటీ ఆస్పత్రులు స్ధాయివరకు ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలి. సబ్‌సెంటర్ల వరకు టెలీమెడిసిన్ సేవలు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండాలి. అప్పుడే వారితో పీహెచ్‌సీల వైద్యులు కూడా వీసీ ద్వారా అందుబాటులోకి వస్తారు. కోవిడ్ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్ కర్ఫ్యూ కొనసాగించాలి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగించాలి. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని’’ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. -
Income Tax Return: వారికోసం ఐటీ రిటర్న్ తేదీల గడువు పెంపు
ముంబై: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ) 2021 జూలై 15 వరకు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్ఆర్ఐ) తో పాటు ఇతర ప్రవాసులకు ఆదాయపు పన్ను చెల్లింపులను దాఖలు చేయడానికి చివరి తేదీని పొడిగించింది. ఆదాయపు పన్నులను మ్యానువల్‌గా చెల్లించడానికి టాక్స్ పేయర్లకు ఆప్షన్‌ను సీబీడీటీ ఇచ్చింది.ఆదాయపు పన్ను శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఆదాయపు పన్ను ఫారాలు 15 సీఎ, 15 సీబీలను దాఖలు చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా పొడిగించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఎన్ఆర్ఐ టాక్స్ పేయర్లకు ఈ ఫైలింగ్ చేయడానికి జూన్ 30 చివరి తేదిగా ఉంది.పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు రెండు ఫారాలను మాన్యువల్ ఫార్మాట్లో అధీకృత డీలర్లకు సమర్పించవచ్చని, అంతేకాకుండా విదేశీ చెల్లింపుల ప్రయోజనం కోసం ఈ ఫారాలను 2021 జూలై 15 వరకు అంగీకరించాలని ఆర్థిక శాఖ సూచించింది. డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్(DIN)ను రూపొందించే ఉద్దేశ్యంతో ఈ ఫారమ్‌లను తరువాతి తేదీలో అప్లోడ్ చేయడం కోసం కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌తో అవకాశం కల్గుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. CBDT grants further relaxation in electronic filing of forms 15CA & 15CB in view of difficulties reported by taxpayers in filing of the forms online on https://t.co/GYvO3n9wMf. Date for submission of forms in manual format to the authorised dealers is extended to 15th July, 2021. pic.twitter.com/gQLRJsnlBu — Income Tax India (@IncomeTaxIndia) July 5, 2021 -
ఏపీ: నేటి నుంచి మరో 10 రోజులు కర్ఫ్యూ
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో మరో పదిరోజుల పాటు కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. కాగా కర్ఫ్యూ లో మరో రెండుగంటలు సడలింపు ఇస్తున్నట్లు ఇప్పటికే తెలిపింది. తాజా నిర్ణయంతో సడలింపు సమయం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు వరకూ అమలు కానుంది. ఇదిలా ఉంటే రోజుకు పదహారు గంటల పాటు రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగనుంది. కర్ఫ్యూ సమయంలో ఈ పాస్ ఉన్నవారికే ఏపీలోకి అనుమతి ఇస్తామని.. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్ఫ్యూ పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. చదవండి: ఏపీలో కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగింపు -
తెలంగాణలో మరో పదిరోజుల పాటు లాక్డౌన్
-
Telangana: లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు
సాక్షి, హైదరాబాద్: కరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుత లాక్డౌన్ గడువు బుధవారం (ఈ నెల 9) వరకు ఉండగా.. మరో 10 రోజులపాటు పొడిగించింది. సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచింది. ప్రజలు ఇళ్లు, గమ్యస్థానాలకు చేరుకునేందుకు మరో గంటపాటు అదనంగా సమయం ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సుదీర్ఘంగా దాదాపు 8 గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్రంలో ఈ నెల 19 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడు నియోజకవర్గాల్లో లాక్డౌన్ యథాతథం రాష్ట్ర సరిహద్దుల్లోని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలో మాత్రం ప్రస్తుతమున్న తరహాలోనే.. మిగతా పది రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నియోజకవర్గాల్లో ఇటీవల పర్యటించిన వైద్యాధికారుల బృందం కరోనా ఇంకా అదుపులోకి రాలేదని నివేదిక ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ నియోజకవర్గాల్లో రోజూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఉంటుంది. 15 రోజుల్లోగా 4.46 లక్షల రేషన్‌కార్డులు రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, నిరీక్షణలో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ఇక రేషన్ డీలర్ల కమీషన్ సహా ఇతర సమస్యలు, పీడీఎస్లోని ఇబ్బందుల పరిష్కారం కోసం.. గంగుల కమలాకర్ అధ్యక్షతన హరీశ్, తలసాని, సబిత, ఇంద్రకరణ్‌రెడ్డి సభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. మంగళవారం ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశానికి హాజరవుతున్న మంత్రులు తలసాని, కేటీఆర్, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ 9 ఉమ్మడి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ‘తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టీఎస్ఎఫ్íపీజెడ్) ఏర్పాటుకు మంత్రివర్గం అనుమతించింది. ఒక్కొక్కటీ 250 ఎకరాలకు తగ్గకుండా రైస్‌మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. 27 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ సర్వే రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ భూములపై డిజిటల్ సర్వే చేపట్టి.. అక్షాంశ, రేఖాంశాల (కోఆర్డినేట్స్) ను నిర్ధారించాలని.. ఉమ్మడి 9 జిల్లాల్లో జిల్లాకు 3 గ్రామాల చొప్పున 27 చోట్ల పైలట్ ప్రాజెక్టుగా సర్వే చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. ధాన్యం కొనుగోళ్లు వెంటనే పూర్తిచేయాలి యాసంగిలో ఇప్పటికే 84 లక్షల టన్నుల వరి ధా న్యం సేకరణ జరిగిందని.. మిగిలిన కొద్దిపాటి ధా న్యం కొనుగోళ్లను కూడా వెంటనే పూర్తి చేయాలని కేబినెట్ భేటీ సందర్భంగా సీఎం ఆదేశించారు. మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక భవనాలు రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు సంబంధించి వైద్యసేవలను మరింతగా పటిష్టం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇతర రోగులతో కలపకుండా తల్లీబిడ్డలకు ప్రత్యేకంగా వైద్యసేవలు అందించాలని.. ఈ మేరకు ప్రధాన ఆస్పత్రి భవనంలో కాకుండా ప్రత్యేక భవనంలో ఏర్పాటు చేయాలని, తగిన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించింది. ఆ ప్రత్యేక భవనంలోనే హైరిస్క్ ప్రసవాలకు అవసరమైన వైద్యసేవల కోసం ప్రత్యేక ‘మెటర్నల్ ఐసీయూ’లను, నవజాత శిశువుల కోసం ఎస్ఎన్సీయూలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇక గర్భిణులకు మూడో నెల నుంచే సమతుల పౌష్టికాహార కిట్లను అందించాలని నిర్ణయించింది. కరోనా మూడోవేవ్ రావచ్చనే అంచనాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, సిబ్బందిని, మందులను సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించింది. రూ.10 వేల కోట్లతో ఆస్పత్రుల మెరుగు ఇరిగేషన్ రంగాన్ని పటిష్టం చేసి వ్యవసాయంలో గుణాత్మక మార్పులు సాధించిన తరహాలోనే రాష్ట్రంలోని ప్రజారోగ్య రంగంపై పూర్తి దృష్టి సారించాలని కేబినెట్ తీర్మానించింది. రానున్న రెండేళ్లలో రూ.10,000 కోట్లు ఖర్చు చేసి.. రాష్ట్రంలోని పేదలకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లతో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది. దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు శ్రీలంకకు వెళ్లి అధ్యయనం చేసి.. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అన్ని జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు రాష్ట్రంలో బుధవారం 19 జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాగ్నస్టిక్స్ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. వీటితోపాటు మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ త్వరలో డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది. అన్ని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఈసీజీ, డిజిటల్ ఎక్స్–రే, అల్ట్రా సౌండ్, 2డీ ఎకోతోపాటుగా ‘మామ్మోగ్రామ్’ యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. దీనితోపాటు వైద్యారోగ్య శాఖకు సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ►సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల ఆస్పత్రులను నిర్మించాలి. ప్రస్తుతమున్న ఆస్పత్రులను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలి. ►సూర్యాపేటలో ప్రస్తుతమున్న 50 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలి. ►రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థాయిల్లోని దవాఖానాల్లో రోగుల సహాయకులుగా వచ్చేవారికి వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ►తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌ను ములుగు, సిరిసి ల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి. ►ఎలర్జీ సమస్యల పరీక్షలు, చికిత్సకు హైదరాబాద్, వరంగల్, సిద్దిపేటలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ►డయాలసిస్ కేంద్రాలలో మరిన్ని యంత్రాలు, కొత్తగా మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం. ►కేన్సర్ రోగులకు జిల్లా కేంద్రాల్లోనే కీమోథెరపీ, రేడియోథెరపీ అందించేలా.. అవసరమైన మౌలిక వసతులతో జిల్లా కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ►అన్ని దవాఖానాల్లో అవసరాలను అందుకునే విధంగా బ్లడ్ బ్యాంకులను ఆధునీకరించి అవసరమైన మేరకు కొత్త బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలి. ►వైద్యానికి సంబంధించి ఆర్థోపెడిక్, న్యూరా లజీ తదితర ప్రత్యేక విభాగాలలో, మెరుగైన వైద్య సేవలకోసం కావలసిన మౌలిక వసతుల కల్పన, అవసరమైన సిబ్బంది నియామకం చేపట్టాలని వైద్యశాఖకు ఆదేశం. ►వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో ఎయిమ్స్ తరహాలో మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలి. ►రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో ఎండీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు అభ్యసించిన అర్హులను నియమించుకుని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోసం వినియోగించాలి. ►నర్సింగ్, మిడ్ వైఫరీ కోర్సులు, ల్యాబ్, రేడియాలజీ, డయాలసిస్ టెక్నీషియన్లు వంటి ప్రత్యేక నైపుణ్య కోర్సులను ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అందుబాటులోకి తేవాలని ఆదేశం. -
ఆంధ్ర ప్రదేశ్ లో ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు
-
ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు
-
ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ఫ్యూ వేళల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి మ.12 గంటల వరకు సడలింపు యథాతథంగా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌పై సమీక్ష చేపట్టారు. ఏపీలో నేటితో కర్ఫ్యూ ఆంక్షలు ముగియడంతో జూన్ 10 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి: 14 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన వారెప్పటికీ అనాథలు కారు..! -
ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ పొడిగింపు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు. ఈ నెల 17 వరకు మరో వారం పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. రేపటి (సోమవారం) నుంచి ఢిల్లీలో వారం పాటు మెట్రో సర్వీసులు రద్దు చేసున్నట్లు ఆయన ప్రకటించారు. లాక్డౌన్ సత్ఫలితాలు ఇస్తోందని కేజ్రీవాల్ అన్నారు. పాజిటివ్ రేటు 35 నుంచి 23 శాతానికి తగ్గిందని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. దేశంలో కరోనా వైరస్ రెండో వేవ్ తీవ్రరూపంలో వ్యాపిస్తోంది. కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నా ఏమాత్రం ఫలితం ఉండడం లేదు. దీంతో విధిలేక చివరి అస్త్రంగా రాష్ట్రాలు లాక్డౌన్ విధిస్తున్నాయి. కరోనా గొలుసు తెంపేందుకు లాక్‌డౌనే పరిష్కారమని రాష్ట్రాలు భావిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఏకంగా 14 రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉంది. మొదట మహారాష్ట్రతో మొదలైన లాక్డౌన్ అనంతరం ఢిల్లీ, కర్ణాటక విధించగా తాజాగా తమిళనాడు కూడా విధించింది. కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,03,738 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. చదవండి: దేశంలో పంజా విసురుతున్న మ్యూకోర్మైకోసిస్ కరోనా సంక్షోభంపై టాస్క్‌ఫోర్స్ -
వాహన పన్ను చెల్లింపు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: మోటారు వాహన పన్ను చెల్లింపు గడువును ప్రభుత్వం జూన్ 30 వరకు పొడిగించింది. ప్రస్తుత త్రైమాసిక పన్నును ఏప్రిల్ 30లోగా చెల్లించాల్సి ఉంది. కాగా, కరోనా తీవ్రత నేపథ్యంలో పన్ను చెల్లింపు తేదీని పొడిగించాలని లారీ యజమానుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం పన్ను చెల్లింపు గడువును జూన్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: కరోనా: ప్రయాణికులు లేకపోవడంతో 10 రైళ్లు రద్దు ఏపీ: వాహన విక్రయాల్లో జోష్ -
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడిగింపు
-
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడిగింపు
ఢిల్లీ: కరోనా కేసులు పెరగడంతో ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ పొడిగించారు. మే 3 ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుంది. సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదన్నారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో నిన్న రికార్డుస్థాయిలో 357 కరోనా మరణాలు సంభవించాయని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో మృత్యుఘోష ఆగడం లేదు. ఆస్పత్రుల్లో ప్రాణవాయువు నిండుకుంది. దీంతో ఆస్పత్రుల్లో అత్యవసర విభాగాల్లో కృత్రిమ ఆక్సిజన్‌తో చికిత్స పొందుతున్న రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. శుక్రవారం గంగారాం ఆస్పత్రిలో 25 మంది రోగులు ఆక్సిజన్ అందక మరణించిన ఘటన మరవకముందే ఢిల్లీలో శనివారం మరో ఘోరం జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20 మంది రోగులు ఆక్సిజన్ అందక కన్నుమూశారు. చదవండి: దేశంలో కొత్తగా 3,49,691 కరోనా కేసులు ఢిల్లీలో ఆగని మృత్యుఘోష -
సచిన్‌వాజేకు మరోసారి ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై: వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల వాహనం రేపిన వివాదంలో సస్పెండైన పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజే చుట్టూ అల్లుకున్న ఉచ్చు మరింత బిగిస్తోంది. తాజాగా ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజే కస్టడీని ఏప్రిల్ 7వ తేదీవరకు పొడగించింది. అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో పట్టుబడిన వాహనం స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మృతి కేసులో వాజే ఎన్ఐఏ అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్ఐఏ విచారణలో షాకింగ్ విషయాలు ఈ కేసులో సచిన్ వాజే ప్రమేయం ఉందని గుర్తించిన ఎన్ఐఏ వాజేను మార్చి 13 న అరెస్టు చేసింది. ఈ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది ఎన్ఐఏ. ముఖ్యంగా ముంబైలోని నారిమన్ పాయింట్ ఫైవ్ స్టార్ హోటల్ లోని ఓ గదిని తన కోసం 100 రోజుల పాటు ఒక వ్యాపారవేత్త చేత 12 లక్షల వ్యయంతో బుక్ చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ తెలిపింది. నకిలీ ఆధార్ కార్డుతో స్టార్ హోటల్లో సదరు వ్యాపారవేత్త ద్వారా 1964 రూమ్ ను బుక్ చేసుకున్నాడని వెల్లడించింది. వంద రోజులకు 12 లక్షల రూపాయలు వెచ్చించి దీన్ని తమ అధీనంలో ఉంచుకున్నారనితెలిపింది. చాలా వ్యాపార వివాదాల్లో వాజే ఈ వ్యాపారవేత్తకు అండగా ఉంటున్నాడని తేలిందని ఎన్ఐఏ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నసంగతి తెలిసిందే. -
దివాలా ప్రొసీడింగ్స్ : వారికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: దివాలా చట్టం కింద కొత్త ప్రొసీడింగ్స్ నిలిపివేతను మరో మూడు నెలల పాటు (మార్చి దాకా) పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా వైరస్ దెబ్బతో కుదేలైన కార్పొరేట్ రుణ గ్రహీత సంస్థలకు ఇది ఊరట కల్గించనుంది. కరోనా కష్టకాలంలో వ్యాపార సంస్థలు, పన్నుల చెల్లింపుదారులకు తోడ్పాటునిచ్చేందుకు పన్ను చెల్లింపు తేదీలను పొడిగించడంతో పాటు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని బెంగళూరు చాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ (బీసీఐసీ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. ‘దివాలా చట్టం కింద చర్యల నిలిపివేతను డిసెంబర్ 25 తర్వాత వచ్చే ఏడాది మార్చి 31దాకా పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి‘ అని మంత్రి చెప్పారు. దీంతో మొత్తం ఏడాది పొడవునా దివాలా చట్టం అమలు పక్కన పెట్టినట్లవుతుందని తెలిపారు. కరోనా మహమ్మారితో ప్రతి పరిశ్రమ తీవ్ర ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో ఏ ఒక్కరూ సమస్యలు ఎదుర్కొనకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన మార్చి 25 నాటి నుంచి దివాలా చట్టం కింద కొత్తగా ప్రొసీడింగ్స్ చేపట్టకుండా ఆర్డినెన్స్ ద్వారా నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
పెన్షనర్లకు ఊరట : కీలక ఉత్తర్వులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌దారులకు ఊరట. కేంద్ర పెన్షన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును మరో రెండు నెలలు పెంచుతూ కేంద్రప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఈ గడువును పెంచాలన్న పెన్షన్‌దారుల సంఘాల విజ్ఞప్తి మేరకు 2021 ఫిబ్రవరి 28 వరకు పెంచుతూ కేంద్ర పెన్షన్ వెల్ఫేర్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని లైఫ్ సర్టిఫికేట్ గడువును మరికొంత కాలం పెంచాలంటూ వివిధ పెన్షన్‌దారుల సంఘాల నుంచి పిటిషన్లు సంబంధిత మంత్రిత్వ శాఖకు వెల్లువెత్తడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని భారత ప్రభుత్వ అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. కోవిడ్-19 కేసులు వరకు పెరుగుతున్న నేపథ్యంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయంతో సంప్రదించిన పిదప ఈ గడువును 2021 ఫిబ్రవరి 28 వరకు పెంచినట్టు తెలిపారు. అలాగే పొడిగించిన కాలంలో, (ఫిబ్రవరి వరకు) ప్రతీ నెలా పెన్షన్ యథావిధిగా చెల్లిస్తామని పేర్కొన్నారు. వాయిదా ప్రధాన లక్ష్యం వివిధ శాఖల వద్ద విపరీతమైన రద్దీని నివారించడమనీ, సంబంధిత శాఖలలో సరైన పారిశుద్ధ్యం, సామాజిక దూరాన్ని పాటించాలని నోటీసులో పేర్కొంది. కాగా ప్రతీ ఏడాది పింఛనుదారులు నవంబర్‌లోగా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంది. కరోనా ప్రభావం వృద్ధులపై తీవ్రంగా ఉంటుందనే ఆందోళన మేరకు కేంద్ర పెన్షన్ వెల్ఫేర్ శాఖ లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసే చివరి తేదీని 2020 డిసెంబర్ 31వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. -
నవంబర్ 3 వరకు నీరవ్ మోదీ రిమాండ్ పొడిగింపు
లండన్: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ జ్యుడీషియల్ రిమాండ్‌ను యూకే కోర్టు నవంబర్ 3వ తేదీ వరకు పొడిగించింది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడానికి సంబంధించిన కేసు తదుపరి విచారణ నవంబర్ 3న జరగనుండడంతో అప్పటివరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.14 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన నీరవ్ మోదీ విదేశాలకు పరారయ్యాడు. లండన్‌లో తలదాచుకుంటున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీరవ్ మోదీని తమకు అప్పగించాలంటూ భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన లండన్ కోర్టు మెజిస్ట్రేట్ అతడి రిమాండ్‌ను నవంబర్ 3 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పం -
ఐటీఆర్ ఫైలింగ్ : గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్నుకు సంబంధించి 2018-19 రిటర్న్స్ దాఖలుకు తుది గడువును ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) మరో రెండు నెలలు పొడిగించింది. ఈ మేరకు బుధవారం ఒక ట్వీట్ చేసింది. నిజానికి ఈ గడువు సెప్టెంబర్‌తో ముగిసిపోయింది. కోవిడ్-19 నేపథ్యంలో రిటర్న్స్ దాఖలు విషయంలో కొన్ని అవరోధాలు ఏర్పడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ తెలిపింది. గడువు పొడిగింపు ఇది నాల్గవసారి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి అసెస్మెంట్ ఇయర్ 2019–20 అవుతుంది. అంటే 2020 మార్చినాటికి 2018–19 ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే దీనిని తొలుత జూన్ 30 వరకూ సీబీడీటీ పొడిగించింది. మళ్లీ జూలై 31 వరకూ పెంచింది. జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో కొన్ని అధిక విలువలు కలిగిన లావాదేవీలు జరిగాయని పేర్కొంటూ, కొందరికి ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ఎస్ఎంఎస్, ఈ-మెయిల్‌ను పంపుతోంది. జీఎస్టీ రిటర్న్స్ గడువు అక్టోబర్ 31 వరకూ... మరోవైపు 2018-19 వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వార్షిక రిటర్న్స్, ఆడిట్ రిపోర్ట్ దాఖలుకు (జీఎస్టీఆర్-9, జీఎస్టీఆర్ 9సీ) గడువును మరోనెల అంటే అక్టోబర్ 31వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు సీబీఐసీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్డ్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్) మరో ట్వీట్లో ప్రకటించింది. మేలో ఈ గడువును సీబీఐసీ మూడు నెలల పాటు అంటే సెప్టెంబర్ వరకూ పొడిగించింది. కరోనా ప్రేరిత అంశాలు దీనికి నేపథ్యం. -
రియాకు రిమాండ్ పొడిగింపు
ముంబై: నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఇరువురూ బాంబే హైకోర్టులో మంగళవారం బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. వీరి బెయిలు విచారణ బుధవారం జస్టిస్ సారంగ్ కొత్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుందని వారి తరఫు న్యాయవాది సతీష్ మనేషిండే తెలిపారు. సెప్టెంబర్ 9న రియాచక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. రియా చక్రవర్తి తాను ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్న వ్యక్తులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ, ఆ రోజు వీరు పెట్టుకున్న బెయిలు పిటిషన్లను స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టు తిరస్కరించింది. స్పెషల్ కోర్టు వీరి జ్యూడీషియల్ రిమాండ్‌ని అక్టోబర్ 6 వరకు మరో పద్నాలుగు రోజులు పొడిగించింది. శామ్యూల్ మిరాండాతో సహా రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఎన్సీబీ సెప్టెంబర్ 5న అరెస్టు చేసింది. వీరి బెయిలు పిటిషన్లను సైతం ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 11న తిరస్కరించింది. -
మహిళా సైనికాధికారుల కమిషన్ గడువు మరో నెల పెంపు
న్యూఢిల్లీ: మహిళా సైనికాధికారులకు ప్రత్యేకంగా పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు తీర్పు మరో నెల రోజుల గడువునిచ్చింది. గత తీర్పులో ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాల ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో నిర్ణయం తుది దశలో ఉందనీ, కేవలం ఆదేశాలు ఇవ్వడం మాత్రమే మిగిలి ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కోర్టు ఆదేశాల్లోని ప్రతి విషయాన్నీ తు.చ.తప్పకుండా పాటిస్తామని కేంద్రం పేర్కొంది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఈ తీర్పు అమలుకు 6 నెలల సమయం కావాలని కేంద్రం కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. లింగ వివక్షను నిర్మూలించేందుకు మహిళాసైనికాధికారులకు పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 17న చరిత్రాత్మక తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం 3 నెలల లోపు పర్మనెంట్ కమిషన్ ని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. -
కోవిడ్-19 : కేరళ కీలక నిర్ణయం
తిరువనంతపురం: కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారిని దీటుగా నిలువరించేందుకు కోవిడ్-19 నిబంధనలను ఏడాది పాటు పొడిగిస్తూ ఎపిడెమిక్ డిసీజ్ ఆర్డినెన్స్‌ను సవరించింది. రాష్ట్రంలో కోవిడ్-19 క్రమంగా వ్యాప్తి చెందుతుండటంతో కేరళ ప్రభుత్వం మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు వచ్చే ఏడాది జులై వరకూ లేదా తదుపరి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసేవరకూ అమల్లో ఉంటాయని పేర్కొంది. తాజా నిబంధనల ప్రకారం 2021 జులై వరకూ ప్రజలు మాస్క్‌లను ధరించడం, భౌతిక దూరం పాటించడం, జనసమూహాలకు దూరంగా ఉండటం వంటి ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కోవిడ్-19 నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (ఆ ఔషధం ట్రయల్స్ నిలిపివేత: డబ్ల్యూహెచ్‌వో) నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేరళ ఎపిడెమిక్ డిసీజెస్ ఆర్డినెన్స్ నిబంధనల కింద చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక కోవిడ్-19 నిబంధనల ప్రకారం వివాహ వేడుకల్లో 50 మందికి మించకుండా పాల్గొనడంతో పాటు మాస్క్‌లు ధరించి, శానిటైజర్ ఉపయోగించాలి. అతిథుల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలి.అంత్యక్రియలకు 20 మందికి మించకుండా కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాలు, ఫుట్‌పాత్‌లపై ఏ ఒక్కరూ ఉమ్మివేసినా కఠిన చర్యలు చేపడతారు. అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి వేడుకలు, గెట్ టు గెదర్, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించడం నిషేధం. ఈ తరహా కార్యక్రమాలకు ముందస్తు అనుమతితో కేవలం 10 మందిని అనుమతిస్తారు. అలాగే షాపులు, వాణిజ్య సంస్థలు సైతం వచ్చే ఏడాది జులై వరకూ కోవిడ్-19 నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. చదవండి : ఇల్లు ఖాళీ చెయ్ -
ఖైదీలకు గుడ్ న్యూస్..మరో 8 వారాలు సేఫ్‌గా!
లక్నో : భారత్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 2,234 మంది ఖైదీలకు మరో రెండు నెలల ప్రత్యేక పెరోల్ మంజూరు చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో 71 జైళ్లలో ఉన్న 2,234 మంది ఖైదీను 8 వారాల పాటు పెరోల్‌పై విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దాన్ని మరో 8 వారాలు పొడిగించాలని నిర్ణయించినట్లు హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీష్ అవస్థీ పేర్కొన్నారు. ఈ మేరకు మే 25న ఓ ప్రకటన విడుదల చేశారు. (ఖైదీకి కరోనా.. క్వారంటైన్‌కు 100 మంది ) దేశంలో మహమ్మారి వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో గరిష్టంగా ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించిన కేసులలో ఖైదీలను పెరోల్ లేదా మధ్యంతర బెయల్‌పై విడుదల చేయడాన్ని పరిశీలించడానికి కమిటీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. జైళ్లల్లో సామాజిక దూరం పాటించడం చాలా కష్టతరమైన విషయం. దీంతో జైళ్లలో అధిక రద్దీ కారణంగా కరోనా ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని సుప్రీం అభిప్రాయపడింది. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఖైదీలకు ఇచ్చిన పెరోల్ గడువును మరో 8 వారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. (మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ ) -
నరీందర్ బత్రా పదవీకాలం పొడిగింపు
లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్ష పదవిలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు (ఐఓఏ) చీఫ్ నరీందర్ బత్రా మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. కరోనా కారణంగా న్యూఢిల్లీ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 28న జరగాల్సిన ఎఫ్ఐహెచ్ వార్షిక సమావేశం వచ్చే ఏడాది మే నెలకు వాయిదా పడటంతో ఈ నిర్ణయం తీసకున్నట్లు ఎఫ్ఐహెచ్ శనివారం ప్రకటించింది. ‘ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్ష పదవితో పాటు మిగిలిన అధికారుల పదవులను కూడా మరో ఏడాది పాటు పొడిగిస్తున్నాం’ అని ఎఫ్ఐహెచ్ తన ప్రకటనలో వెల్లడించింది. నిజానికి ప్రస్తుతం ఉన్న కార్యవర్గం పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్‌తో ముగియాల్సింది. బత్రా 2016 నవంబర్‌లో ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా బత్రాకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లో కూడా సభ్యత్వం ఉంది. -
లాన్‌డౌన్ పొడిగింపు; జనం ఏమంటున్నారు?
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కట్టకి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం రెండోసారి పొడిగించింది. కరోనా వ్యాప్తి నానాటికి పెరుగుతుండటంతో విధిలేని పరిస్థితుల్లో కేంద్రం మరోసారి నిర్బంధాన్ని పొడిగించాల్సి వచ్చింది. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్డౌన్ కొనసాగింపునకే మొగ్గు చూపారు. దీంతో లాక్డౌన్ కొనసాగింపునకు కేంద్రం సుముఖంగా ఉందన్న వార్తలు నాలుగు రోజులు నుంచి వస్తున్నాయి. అనుకున్నట్టుగానే లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ నేడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. (మే 17 వరకు లాక్డౌన్ పొడగింపు) కరోనా తీవ్రత తక్కువ ఉన్న ప్రాంతాల్లో నిర్బంధాన్ని కాస్త సడలించి ప్రజలకు కేంద్రం ఊరట కల్పించింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా అమలు చేయనున్నట్టు ప్రభుత్వం పునరుద్ఘాటించింది. నిర్బంధాన్ని మే 3 వరకు పొడిగిస్తూ ప్రకటన చేసిన తర్వాత గ్రీన్ జోన్లలో ప్రభుత్వం పలు సడలింపులు ప్రకటించింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో అమలు చేసుకోవచ్చని సూచించింది. అయితే రాష్ట్రాలు వీటిలో చాలా వాటిని అమలు చేయలేదు. అటు జనం కూడా కరోనా భయంతో లాక్‌డౌన్‌కే మొగ్గు చూపుతున్నారు. (3 తర్వాత లాక్డౌన్ సడలింపు పక్కా..) ‘సాక్షి డాట్ కామ్’ నిర్వహించిన ఆన్లైన్ పోల్‌లోనూ ఎక్కువ మంది లాన్‌డౌన్ కొనసాగింపునకే మొగ్గు చూపారు. మే నెలాఖరు వరకు పొడిగించాలని 63 శాతం మంది, కొన్ని సడలింపులతో పొడిగించాలని 13 శాతం మంది అభిప్రాయపడ్డారు. 19 శాతం మంది మరో 15 రోజులైనా పొడిగించాలన్నారు. లాక్డౌన్ పొడిగించాల్సిన అవసరం లేదని కేవలం 6 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయాలని ఎవరూ కోరుకోలేదు. దీన్నిబట్టి ప్రజలు ఎక్కువ శాతం లాక్డౌన్ కొనసాగించడానికే మొగ్గుచూపారని అర్థమవుతుంది. -
లాక్డౌన్ పొడిగింపు; రైల్వేకు దెబ్బ
న్యూఢిల్లీ: లాక్డౌన్ పొడిగించడంతో రైల్వేశాఖకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టిక్కెట్లను ముందుగానే తీసుకున్న ప్రయాణికులు పెద్ద సంఖ్యలో టిక్కెట్లు రద్దు చేసుకుంటున్నారు. ఏప్రిల్ 15 నుంచి మే 3 మధ్య కాలానికి 39 లక్షల టికెట్లు రద్దు చేసుకునే అవకాశముందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్డౌన్ ఏప్రిల్ 14కు ముగుస్తుందన్న ఉద్దేశంతో 15 నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు అడ్వాన్స్ టిక్కెట్లు తీసుకున్నారు. లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుపోయిన వారు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు భారీగా టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించడంతో మే 3 వరకు పాసింజర్ రైళ్లను నిలిపివేస్తున్నట్టు రైల్వేశాఖ తెలిపింది. అలాగే టిక్కెట్ కౌంటర్లను ముసివేస్తున్నామని, అడ్వాన్స్ ఆన్లైన్ రిజర్వేషన్‌ను కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రద్దైన టిక్కెట్లను పూర్తి మొత్తం రిఫండ్ చేస్తామని వెల్లడించింది. సరకు రవాణా చేసే గూడ్స్, పార్శిల్ రైళ్లు యథావిధిగా నడుస్తాయని తెలిపింది. కాగా, లాక్‌డౌన్‌తో ఇప్పటికే పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోయిన రైల్వేశాఖ.. భారీ సంఖ్యలో టిక్కెట్ల రద్దుతో మరింత ఆదాయం నష్టపోనుంది. మోదీజీ! ఈ ప్రశ్నలకు బదులేదీ? -
దేశంలో చిక్కుకుపోయిన విదేశీయులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 కారణంగా ఇండియాలో చిక్కుకు పోయిన విదేశీయులకు భారత ప్రభుత్వం ఊరట కల్పించింది. విదేశీయుల వీసా గడువును పొడిగించింది. విదేశీయుల వీసాల చెల్లుబాటును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తరువులిచ్చింది. కరోనా వైరస్ కారణంగా బారతదేశంలో చిక్కుకుపోయిన విదేశీ పౌరుల రెగ్యులర్ వీసా, ఇ-వీసా లేదా స్టే నిబంధనలను 30.04.2020 (అర్ధరాత్రి) వరకు పొడిగించినట్టు తెలిపింది. అటువంటి విదేశీ పౌరుల వీసాలను ఎలాంటి జరిమానా లేకుండా ఉచితంగా ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్టు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నేపథ్యంలో దేశీయంగా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. అలాగే ఇతర దేశాలకు రాకపోకలను కూడా నిషేధించిన సంగతి విదితమే. కాగా దేశంలో 21 రోజుల లాక్డౌన్ రేపటితో ముగియనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా పలువురు ముఖ్యమంత్రులు లాక్డౌన్ పొడిగించాలని కోరుకుంటుండగా. ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికే ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ ను పొడిగించాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (మంగళవారం) ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని తెలుస్తోంది. -
కరోనా: ఇటలీ మరోసారి కీలక నిర్ణయం
రోమ్ : కరోనా వైరస్ కారణంగా భారీ ప్రభావితమైన దేశం ఇటలీ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ మే 3వ తేదీవరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కష్టమే అయినా.. తప్పడం లేదని ఇటలీ ప్రధాన మంత్రి గియుసేప్ కాంటే శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్నలాక్ డౌన్ త్వరలో (ఏప్రిల్,13) ముగియనున్ననేపథ్యంలో మినహాయింపులతో తాజా నిర్ణయం తీసుకుంది.అయితే కదలికలపై కఠినమైన ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. కష్టమైందే.. కానీ ఇది చాలా అవసరమైన నిర్ణయం. దీనికి తాను బాధ్యత తీసుకుంటానని కాంటే వెల్లడించారు. అయితే కొన్ని మినహాయింపులను ప్రకటించారు. బుక్ షాపులు, స్టేషనరీ, పిల్లల బట్టలు దుకాణాలు మంగళవారం నుండి తిరిగి తెరుచుకుంటాయని కాంటే చెప్పారు. కోవిడ్-19 కేసుల రోజువారీ ధోరణిని పరిశీలిస్తూ, పరిస్థితులు అనుకూలిస్తే, తదనుగుణంగా వ్యవహరిస్తానని ప్రధాని అక్కడి ప్రజల్లో కొత్త ఆశలు రేపారు. లాక్ డౌన్ కాలంలో మూతపడిన కర్మాగారాలు మాత్రం మూసిసే వుంటాయని ప్రకటించారు. (కరోనా: శరవేగంగా ఆర్థిక వ్యవస్థ పతనం) సాధారణ ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ ప్రారంభించాలని వ్యాపార వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. కానీ తాజా నిర్ణయంతో వాణిజ్య కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని, లేదంటే ఆర్థిక విపత్తు తప్పదని హెచ్చరించిన పరిశ్రమల పెద్దల ఆశలపై నీళ్లు చల్లారు. కార్మికుల వేతనాలు లేక, మార్కెట్ వాటాను శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉందని అక్కడి ఆర్థిక నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. మరోవైపు సడలింపు కొత్త వ్యాప్తికి కారణమవుతుందని, సాధ్యమైనంత కఠినంగా లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగించాలని వైద్య , ఇతర నిపుణులు వాదిస్తున్నారు. (కరోనా: ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) ఇటలీలో కరోనా వైరస్ విజృంభణతో ఆ దేశ ప్రభుత్వం మార్చి 10 నుండి ఏప్రిల్ 3 దాకా ఆ తరువాత ఏప్రిల్ 13 వరకూ లాక్డౌన్ పొడిగించింది. కొన్ని మినహాయింపులతో మే 3 వరకు లాక్ డౌన్ తప్పనిసరి చేసింది. ఇటలీలో వైరస్ కారణంగా ఇప్పటివరకు దాదాపు 19,000 మరణాలు నమోదయ్యాయి. -
లాక్‌డౌన్‌ను పొడిగించిన తొలి రాష్ట్రం..
భువనేశ్వర్ : ఒడిశాలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రస్తుతం ఏప్రిల్14 వరకు 21 రోజుల లాక్డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే రోజురోజుకి కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు కొనసాగించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం నవీన్ పట్నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో దేశంలో లాక్‌డౌన్‌ను పొడగించిన మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ‘కోవిడ్-19 సంక్షోభం కారణంగా అమలవుతున్న లాక్డౌన్ కాలంలో మీ క్రమశిక్షణ, త్యాగం కరోనాకు వ్యతిరేకంగా పోరాడటానికి మాకు బలాన్ని ఇచ్చింది’ అని సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. ఈ క్రమంలో రైళ్లు, విమానాల సేవలు ఈ నెల ఆఖరు వరకు నిలిపి వేస్తున్నట్లు, జూన్ 17 వరకు విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు సీఎం తెలిపారు. అయితే వ్యవసాయ ఆధారిత పనులకు మినహాయింపు ఉందని పేర్కొన్నారు. కరోనా తర్వాత పరిస్థితులు అన్నీ ఒకేలా ఉండవని, ప్రజలంతా అర్థం చేసుకోని.. సహకరించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు.(కరోనా: 5 వేలు దాటిన కేసులు.. అక్కడ తొలి మరణం ) కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కొనసాగించడం తప్ప మరో దారి లేదంటూ పలు రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. దేశంలో లాక్డౌన్ ఎత్తివేసినా తెలంగాణలో మాత్రం కొనసాగించాలనుకుంటున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది. దీనిపై ఉత్తరప్రదేశ్ సర్కార్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కరోనాను పూర్తిగా కట్టడి చేశాకే లాక్డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందంటూ ప్రభుత్వ ముఖ్య అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక రాజస్తాన్ కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. కరోనా: ‘ఆ డ్రగ్ తనకు పనిచేయలేదు’ -
జూన్ 7 వరకు స్టేలు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టు, కింది కోర్టులు ఇచ్చిన స్టే ఉత్తర్వులను జూన్ 7 వరకూ పొడిగిస్తూ ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో గతంలోనే హైకోర్టు సహా కింది కోర్టులు జారీ చేసిన స్టే ఉత్తర్వులను ఈ నెల 20 వరకూ పొడిగించిన విదితమే. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఆ తేదీ నుంచి మధ్యంతర స్టే ఉత్తర్వులను జూన్ 7 వరకూ పొడిగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. జూన్ 7లోగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఏమైనా ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఈ స్టే ఉత్తర్వులు అమల్లోనే ఉంటాయని స్పష్టం చేసింది. స్టే పొడిగింపు ఉత్తర్వుల కారణంగా ఎవరికైనా అన్యాయం జరిగిందని భావించినా, తీరని నష్టం వాటిల్లుతోందని అనుకున్నా వారు సంబంధిత కోర్టుల ద్వారా తగిన ఉత్తర్వులు పొందవచ్చని తెలిపింది. ఆస్తులకు సంబంధించి డిక్రీల అమలులో భాగంగా కోర్టు అధికారులు ఆస్తుల స్వాధీనం చేయకుండా అప్పీల్ చేసేందుకు ఆస్కారం లేనందున తిరిగి ఉత్తర్వులు జారీ చేసే వరకూ డిక్రీల అమలును నిలిపివేస్తున్నట్లు హైకో ర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పీల్‌కు ఆస్కా రం లేనప్పుడు న్యాయాన్ని తోసిపుచ్చినట్లు అవుతుందని, అందుకే డిక్రీల అమలును నిలిపివేయాల్సి వస్తోందని పేర్కొంది. -
ఒలింపిక్స్ వరకు కోచ్‌ల కొనసాగింపు!
న్యూఢిల్లీ: ప్రత్యేకించి ఒలింపిక్స్ కోసమే విదేశీ కోచ్‌లను నియమించుకున్న భారత క్రీడా సమాఖ్యలు ఇప్పుడు ఆ కోచ్‌ల కాంట్రాక్టు గడువు పొడిగించాలని భావిస్తున్నాయి. ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ వల్ల టోక్యో మెగా ఈవెంట్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దీంతో ఆ పోటీలు ముగిసే వరకు కోచ్‌లను కొనసాగించాలని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)కి పలు క్రీడా సమాఖ్యల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. మహిళా రెజ్లింగ్ కోచ్ ఆండ్రూ కుక్, షూటింగ్ (పిస్టల్) కోచ్ పావెల్ స్మిర్నోవ్, బాక్సింగ్ కోచ్‌లు శాంటియాగో నియెవా, రాఫెల్లె బెర్గమస్కొ, అథ్లెటిక్స్ హైపెర్ఫార్మెన్స్ డైరెక్టర్ హెర్మన్ తదితర విదేశీ కోచ్‌లకు ‘సాయ్’ పొడిగింపు ఇచ్చే అవకాశాలున్నాయి. దేశవ్యాప్త లాక్డౌన్ కొనసాగుతున్న దృష్ట్యా క్రీడా శిబిరాలేవీ కొనసాగడం లేదు. ఈ లాక్డౌన్ ముగిశాక కోచ్‌ల సేవలు, శిబిరాలు మొదలవుతాయి. ‘విదేశీ కోచ్‌ల జీతాలను ‘సాయ్’ చెల్లిస్తుంది. ప్రస్తుతం ఉన్న అసాధారణ పరిస్థితులు వారికి తెలుసు. కాబట్టి సహకరించేందుకు వారు సిద్ధంగానే ఉన్నారు’ అని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కార్యదర్శి వీఎన్ ప్రసూద్ తెలిపారు. కుక్ (అమెరికా), టెమొ గెబిష్విలి (జార్జియా), బజ్రంగ్ పూనియా కోచ్ షాకో బెంటినిడిస్ (జార్జియా)లతో డబ్ల్యూఎఫ్ఐ కాంట్రాక్టు పొడిగించుకుంటుంది. 21 రోజుల లాక్డౌన్ పూర్తయ్యాక ఆటగాళ్ల సన్నాహకాలు మొదలవుతాయని ప్రసూద్ ఆశిస్తున్నారు. -
మరో రెండేళ్లు పొడిగింపు
న్యూఢిల్లీ: లిస్టైన కంపెనీల సీఎమ్‌డీ (చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్) పదవి విభజన గడువును మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ మరో రెండేళ్లు పొడిగించింది. ఈ మేరకు కంపెనీల నుంచి వచ్చిన వినతులను సెబీ మన్నించింది. సెబీ నిబంధనల ప్రకారం, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అగ్రశ్రేణి 500 లిస్టెడ్ కంపెనీలు సీఎమ్‌డీ పదవిని చైర్మన్‌గా, ఎమ్‌డీగా విభజించాల్సి ఉంది. దీనికి గడువును ఈ ఏడాది ఏప్రిల్ 1గా నిర్ణయించింది. లిస్టెడ్ కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌ను మెరుగుపరచడం లక్ష్యంగా, కోటక్ కమిటీ సూచనల మేరకు సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరో రెండేళ్లపాటు పొడిగించాలని తాజాగా సెబీ నిర్ణయించింది. గడువు పొడిగింపునకు సంబంధించిన కారణాలను సెబీ వెల్లడించలేదు. అయితే ప్రస్తుత ఆర్థిక మందగమన కాలంలో సీఎమ్‌డీ పదవిని రెండుగా విభజించడం ఒకింత భారంతో కూడుకున్నదని, ఈ గడువును పొడిగించాలని పలు కంపెనీలు విన్నవించడంతో సెబీ గడువును పొడిగించిందని సమాచారం. ప్రస్తుతం టాప్ 500 లిస్టెడ్ కంపెనీల్లో సగం మాత్రమే సీఎమ్‌డీ పదవిని రెండుగా విభజించాయని స్టాక్ ఎక్సే్చంజ్‌ల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పలు కంపెనీలు ఈ రెండు పదవులను కలిపేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, విప్రో, హీరో మోటోకార్ప్, తదితర కంపెనీల్లో ఈ రెండు బాధ్యతలను ఒక్క వ్యక్తే నిర్వహిస్తున్నారు. -
చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దుపై స్టేను హైకోర్టు మరో 8 వారాలు పొడిగించింది. పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు గత నవంబర్‌లో స్టే ఇచ్చింది. ఆ ఉత్తర్వులను తాజాగా పొడిగిస్తూ న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఆదేశాలు జారీ చేశారు. రమేశ్ జర్మనీ పౌరసత్వం రద్దయిందో లేదో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించారు. విచారణ 4 వారాలకు వాయిదా వేశారు. వాస్తవాలు దాచి మోసపూరిత విధానాల ద్వారా రమేశ్ భారతీయ పౌరసత్వం పొందినట్లు నిర్ధారించి.. భారత పౌరసత్వ చట్టం ప్రకారం పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
బీఎస్ఎన్ఎల్ పండుగ ఆఫర్ : 90 రోజులు ఫ్రీ
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన చందాదారులకు అద్భుత ఆఫర్ తీసుకొచ్చింది. పండుగ సీజన్ సందర్భంగా ప్లాన్‌ను సమీక్షించి బీఎస్ఎన్ఎల్ రూ .1,699 వార్షిక ప్రీ పెయిడ్ ప్లాన్‌పై అదనపు ప్రయోజనలను అందిస్తోంది. అక్టోబర్ 31 లోపు రీఛార్జ్ చేసే వినియోగదారులకు మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆఫర్ వివరాలు రూ .1,699 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును 455 రోజులకు పొడిగించింది. వాస్తవానికి ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు మాత్రమే. దీంతోపాటు అక్టోబర్ మాసంలో రోజుకు 3.5 జీబీ (1.5 జీబీ అదనం) డేటాను అందిస్తోంది. నవంబరు డిసెంబర్ మాసాల్లో రోజుకు 3 జీబీ డేటా అందిస్తుంది. అలాగే ఏడాదిపాటు ఉచిత వ్యక్తిగతీకరించిన రింగ్ బ్యాక్ టోన్ (పిఆర్బిటి) లేదా కాలర్ ట్యూన్లను కూడా అందిస్తుంది. రోజుకు 2 జీబీ డేటాతో పాటు రోజుకు 250 నిమిషాలు కాలింగ్, రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. అంటే అక్టోబర్ 31 లోపు రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు 90 రోజుల అదనపు ప్రయోజనాలు అందుబాటులో వుంటాయి. -
పీఎన్బీ స్కాం: నీరవ్ రిమాండ్ పొడిగింపు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ (48)కి మరోసారి ఎదురు దెబ్బ తప్పలేదు. లండన్ వాండ్స్‌వర్త్ జైలు జైల్లో ఉన్న నీరవ్‌మోదీ బెయిల్ నిరాకరించి, రిమాండ్‌ను మరో 28 రోజులు పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. అక్టోబర్ 17 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతినిస్తూ వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం ఆదేశించింది. ఇప్పటికే మూడుసార్లు బెయిల్ నిరాకరించారు. కాగా దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా నిలిచిన పీఎన్బీ స్కాంలో డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ ప్రధాని నిందితుడు. బ్యాంకును సుమారు 13వేల కోట్ల రూపాయలకు పైగా ముంచేసి లండన్‌కు పారిపోయిన నీరవ్ మోదీని తిరిగి భారత్‌కు రప్పించేందుకు కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈనేపథ్యంలోనే ఆయన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయడంతో లండన్ పోలీసులతో కలిసి నీరవ్‌ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం నీరవ్ లండన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. -
శ్రీలంక అనూహ్య నిర్ణయం
కొలంబో : శ్రీలంక ప్రభుత్వం మరోసారి అనూహ్య నిర్ణయం తీసుకుంది. దేశంలో కొనసాగుతున్న అత్యవసర పరిస్థితిని కొనసాగించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 21 ఉగ్రదాడి అనంతరం దేశంలో విధించిన ఎమర్జెన్సీ నేటి (జూన్ 22) తో ముగియనున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని పొడిగిస్తూ డిక్రీ జారీ అయ్యింది. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శనివారం ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఇంకా అత్యవసర పరిస్థితి ఉందని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులున్న నేపథ్యంలో ప్రజా భద్రత చట్ట నిబంధనలు కొనసాగేలా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. దేశ రాజధాని కొలంబో నగరంలో ఈస్టర్ సండే రోజు హోటళ్లు, చర్చిలపై దాడులు నేపథ్యంలో శ్రీలంక అతలాకుతలమైంది. మూడు చర్చిలు, మూడు లగ్జరీ హోటళ్లలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 258కి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల సంఘటన తరువాత దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన సంగతి తెలిసిందే. -
మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి భారీ ఊరట
సాక్షి,న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరంకు మరోసారి ఊరట లభించింది. ఈయనతోపాటు కుమారుడు కార్తీ చిదంబరాన్ని కూడా మార్చి 8 వరకు అరెస్ట్ చేయకుండా ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ కేసులలో ప్రశ్నించడానికి మార్చి 5, 6, 7, 12 తేదీల్లో సీబీఐ కోర్టుముందు హాజరు కావాలని కోరామని ఈడీ కోర్టుకు తెలిపింది. అనంతరం కోసును మార్చి12వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసును వాయిదా వేయడాన్ని అక్కడే కోర్టులో ఉన్నచిదంబరం వ్యతిరేకించారు. ఈడీ కావాలనే ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. కాగా 2006లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ డీల్‌కు సంబంధించి విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు(ఎఫ్ఐపిబి) ఆమోదం విషయంలో కార్తి చిదంబరం అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
జూనియర్ కాలేజీల సెలవులు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు ఇచ్చిన దసరా సెలవులను మరో 3 రోజులు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెల 18వ తేదీ వరకే సెలవులు ఇచ్చినప్పటికీ, తాజాగా ఈ నెల 19, 20 తేదీలు కూడా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు 21వ తేదీ ఆదివారం కావడంతో మొత్తంగా మరో మూడు రోజులు సెలవులుగా వెల్లడించింది. ఈ నెల 22వ తేదీన కాలేజీలు తిరిగి ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డు పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఈ సెలవు దినాలను పాటించాలని స్పష్టం చేసింది. -
వరవరరావుకు గృహనిర్బంధం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో పౌర హక్కుల నేతల గృహ నిర్బంధాన్ని సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. భీమా-కొరేగావ్ అల్లర్లతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న పౌర హక్కుల నేతలకు గృహ నిర్బంధ గడువు పెంచుతూ మరోసారి వారికి భారీ ఊరట కల్పించింది. ఈ గడువు నేటితో (సెప్టెంబరు 12) ముగియనున్న నేపథ్యంలో సెప్టెంబరు 17వ తేదీవరకు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఆగస్టు 28న విప్లవ కవి వరవరరావు సహా మరో అయిదుగురి నేతల ఇళ్లలో పుణే పోలీసుల సోదాలు నిర్వహించడంతో పాటు అరెస్ట్ చేసి పుణేకు తరలించారు. ఈ అరెస్టును సవాలు చేస్తూ చరిత్రకారులు రొమిల్లా థాపర్‌తో పాటు ఐదుగురు మేధావులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీం పౌర నేతలను జైల్లో కాకుండా గృహనిర్బంధంలో ఉండాలని ఆగస్టు 30న ఆదేశించింది. మొదట సెప్టెంబరు 6వరకు, ఆ తరువాత 12వ తేదీవరకు వరుసగా పొడిగిస్తూ వచ్చింది. తాజాగా మరో అయిదురోజులపాటు వారిని కేవలం గృహ నిర్బంధంలోనే ఉంచాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ప్రధాని హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలకు సంబంధించి వరవరరావుతో సహా మరో నలుగురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడం తదనంతర పరిణామాల నేపథ్యంలో వారిని గృహ నిర్బంధంలోనే ఉంచాలని ఆదేశించింది. అంతేకాతు గత విచారణ సందర్భంగా పుణే పోలీసుల వ్యవహారంపై జస్టిస్ దీపక్ మిశ్రా తదితరులతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
మాల్యాకు ఊరట, జైలు వీడియో కోరిన కోర్టు
లండన్: వేలకోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో ఊరట లభించింది. భారత్‌కు మాల్యా అప్పగింత కేసును మంగళవారం విచారించిన వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు మాల్యా బెయిల్‌ను మరికొంత కాలం పొడిగించింది. మాల్యాకు బెయిల్ ఇవ్వొద్దన్న భారత ప్రభుత్వం అభ్యర్థనను కోర్టు తోసి పుచ్చింది. అంతేకాదు మాల్యాను అప్పగిస్తే ఆయనను ఉంచబోయే ముంబై ఆర్దర్ రోడ్డులోని జైలు వీడియోను కోర్టుకు సమర్పించాల్సిందిగా కోరింది. ఇందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేసింది. 13 భారతీయ బ్యాంకులకు 9వేల కోట్ల మేర ఉద్దేశ పూర్వక రుణ ఎగవేతదారుడు మాల్యాను భారత్‌కు అప్పగింత విషయమై దాఖలైన పిటిషన్‌పై వాదనలు ఈ రోజు జరిగాయి. ఈ విచారణ నిమిత్తం కోర్టుకు మాల్యా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్యా మీడియాతో మాట్లాడారు. అక్రమంగా డబ్బులను విదేశాలకు తరలించారన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. అలాగే భారతీయ బ్యాంకులకు రుణాలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశిస్తే చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తనకున్న రూ.14వేల కోట్ల ఆస్తులను అమ్మకానికి పెట్టి రుణాలు చెల్లిస్తానన్నారు. అలాగే 2015నుంచి ఈ కేసును పరిష్కరించుకునేందుకు తాను ప్రయత్నిస్తున్నానని తెలిపారు. బ్యాంకుల ఫిర్యాదు మేరకు ఆస్తులను ఎటాచ్ చేసిన తరువాత తాను చేయగలిగింది ఏముందన్న మాల్యా, తుది నిర్ణయాన్ని కోర్టు నిర్ణయిస్తుందన్నారు. -
టీఎస్ఎడ్సెట్–2018 గడువు పొడిగింపు
హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న టీఎస్ఎడ్సెట్–2018 గడువును ఈనెల 25 వరకు పొడిగించినట్లు శుక్రవారం ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మధుమతి తెలిపారు. కాగా రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. -
సీట్లు ఎక్కువ... దరఖాస్తులు తక్కువ
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాయం, అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశానికి మొదటి సారిగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పీజీ సెట్–2018 నిర్వహిస్తున్నారు. 2008లో ఈ వర్సిటీ ఏర్పడినప్పటికీ పీజీ ప్రవేశాల కోసం విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీ ద్వారా పీజీ సెట్లు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నుంచి సొంత సెట్ ద్వారా ప్రవేశాలు నిర్వహించాలని బీఆర్‌ఏయూ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల బీఆర్‌ఏయూ పీజీ సెట్–2018 నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులు, కళాశాలల్లో ఉన్న సీట్ల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. వర్సిటీ, ఏఫిలియేషన్ కళాశాలల్లో 17 కోర్సులు ఉన్నాయి. వర్సిటీ క్యాంపస్‌లో 16 కోర్సుల్లో 530 సీట్లు ఉన్నాయి. వర్సిటీ పీజీ అనుబంధ కళాశాలు 8 ఉన్నాయి. ఆదిత్య, గాయత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషులు, మహిళలు, ఎస్ఎస్ఆర్, సన్, రంగముద్రి ఎంఎడ్, బీఎస్‌జేఆర్ ఎంఎడ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 531 సీట్లు ఉన్నాయి. వర్సిటీ, అనుబంధ పీజీ కళాశాలల్లో మొత్తం 1061 సీట్లు ఉన్నాయి. అయితే డబ్బులు చెల్లించిన దరఖాస్తులు 360 మాత్రమే వచ్చాయి. 1350 వరకు రదఖాస్తులు చేసుకున్నా ఫీజులు మాత్రం అందరూ చెల్లించలేదు. ఫీజులు చెల్లించిన వారు మాత్రమే ప్రవేశ పరీక్షలు రాయడానికి అర్హత సాధిస్తారు. స్పందన లేక గడువు పొడిగింపు బీఆర్‌ఏయూ పీజీ సెట్–2018 కోసం ఈ ఏడాది మార్చి 7వ తేదీ నుంచి ఈ నెల 6 వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. అయితే అనుకున్న స్థాయిలో స్పందన లేకపోవటంతో ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తులు గడువు పెంచారు. గడువు పెంచినా దరఖాస్తుల సంఖ్య పెరుగు తుందా? లేదా? అన్నది చూడవల్సి ఉంది. 8 విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, గణితం, కెమికల్ సైన్సెస్, జియోలజీ, హుమానీ అండ్ సోషల్ సైన్సెస్, ఇంగ్లిష్, తెలుగు విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా, సీట్లుకు తగ్గ రీతిలో కెమికల్ సైన్సెస్, గణితంకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. హుమానీటీస్ అండ్ సోషల్ సైన్స్‌లో ఎంకాం, ఎకనామిక్స్, రూరల్ డెవలప్మెంట్, సోషల్ వర్కు, ఎంఎల్ఐఎస్సీ, ఎంఈడీ, ఎంజేఎంసీ సబ్జెక్టుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ సబ్జెక్టులకు కనీస దరఖాస్తులు రాలేవు. మరో పక్క జిల్లాలో వర్సిటీ, రెండు ప్రైవేట్ కళాశాలల్లో ఎంఎడ్ కోర్సుల్లో 120 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సుల్లో గత ఏడాది కనీస ప్రవేశాలు జరగలేదు. ఈ ఏడాది అదే పరిస్థితి ఉంది. అలాగే వర్సిటీ, ఏఫిలియేషన్ కళాశాలల్లో ప్రస్తుతం ఆర్గానిక్ కెమిస్ట్రీ, గణితం, ఎననాటికల్ కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో మాత్రమే ప్రవేశాలు మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. వర్సిటీలో పూర్తిస్థాయి రెగ్యులర్ బోధన సిబ్బంది ఉన్న బయోటెక్నాలజీ, సోషల్ వర్కు కోర్సులకు గత కొంతకాలంగా స్పందన అంతంత మాత్రంగా ఉంది. సెట్‌పై ఆసక్తి కనబర్చని విద్యార్థులు గతంలో ఆంధ్రాయూనివర్సిటీ సెట్(ఆసెట్) ద్వారా బీఆర్‌ఏయూ, దీని అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేవారు. ప్రవేశాలు జరగని కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించేవారు. ప్రస్తుతం స్పాట్ అడ్మిషన్లకు ప్రభుత్వ రాయితీలు, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు మంజూరు కావటం లేదు. దీంతో స్పాట్ అడ్మిషన్లు కంటే సెట్లకు దరఖాస్తు చేసుకోవటం మంచిది. విద్యార్థులు మాత్రం సెట్ పట్ల ఆసక్తి కనపర్చటం లేదు. జిల్లాకు చెందిన విద్యార్థులు ఆసెట్ రాసేందుకు ఇచ్చే ప్రాధాన్యం బీఆర్‌ఏయా సెట్ రాచేందుకు ఇవ్వటం లేదు. మరో పక్క పీజీలు చదివటం వల్ల సమయం వృథాగా చాలా మంది విద్యార్థులు భావిస్తున్నారు. డిగ్రీ తర్వాత పోటీ పరీక్షలకు చదవటం, ప్రైవేట్ రంగంలో ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సెట్ కంటే డిగ్రీ మార్కులు ఆధారంగా పీజీల్లో ప్రవేశాలు కల్పించటం మంచిదని కొందరి అభిప్రాయం. ఇదిలావుండగా బీఆర్‌ఏయూ సెట్ పరీక్షలు మే 5, 6, 7 తేదీల్లో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ తేదీలు సైతం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దరఖాస్తులు పెరుగుతాయి బీఆర్‌ఏయూ సెట్–2018కు దరఖాస్తుల గడువు ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించాం. జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. చాలా మంది విద్యార్థులు ప్రవేశ రుసుం చెల్లించకుండా దరఖాస్తులు చేస్తున్నారు. ఫీజు చెల్లిస్తేనే సెట్ హాల్ టిక్కెట్ మంజూరవుతుంది. విద్యార్థులు సెట్ ద్వారా ప్రవేశాలు పొందితే ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్లు మంజూరుకు అవకాశం ఉంటుంది. – ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, సెట్ కన్వీనర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, ఎచ్చెర్ల -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను పొడిగించారు. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 6 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 30,31, వచ్చే నెల 1, 5న సెలవుగా ప్రకటించారు. అలాగే 28 వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. -
ఆధార్ లింకింగ్..భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ సంక్షేమ పథకాలతోపాటు, ఇతర సేవలకోసం ఆధార్ లింకింగ్‌పై సుప్రీంకోర్టు భారీ ఊరట నిచ్చింది. ఆధార్ అనుసంధాన ప్రక్రియ గడువును మార్చి 31, 2018 వరకు పెంచుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు అన్ని సేవలకు ఆధార్‌నంబర్ అనుసంధాన గడువును మార్చి 31వ తేదీకి పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ చట్టం చట్టబద్ధత అంశంపై తదుపరి వాదనలను జనవరి 17వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి దీపాక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు జడ్జిల బెంచ్ శుక్రవారం ఈ విషయంపై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ పథకాలు, బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్ల ఆధార్ లింకింగ్ గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ సుప్రీం శుక్రవారం తీర్పు వెలువరించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఉపశమనం కల్పించింది. అలాగే కొత్త బ్యాంకు ఖాతాలను తెరవడానికి కూడా ప్రస్తుతానికి ఆధార్ అనుసంధానం అవసరం లేదని తేల్చి చెప్పింది. ఆధార్ నంబర్ లేకుండానే బ్యాంకు ఖాతాను తెరవచ్చని స్పష్టం చేసింది. అయితే ఆధార్ కార్డుకోసం దరఖాస్తు చేసిన కాపీని జతచేయాలని తెలిపింది. దీంతోపాటు 2018, ఫిబ్రవరి 6వ తేదీతో ముగియనున్న మొబైల్ ఆధార్‌లింకింగ్ గడువును కూడా మార్చి 31 వరకు పొడిగించింది. -
ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్: జియో ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ జీయో కస్టమర్లకు ఊరట నిచ్చింది. జియో ఇటీవల ప్రకటించిన ట్రిపుల్‌క్యాఫ్ ఆఫర్‌ను మరికొంత కాలం పొడిగించింది. జియో ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ సేవల పరిమితిని పొడిగించింది. డిసెంబర్ 15వ తేదీ వరకు జియో కస్టమర్లు ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వినియోగించుకోవచ్చని ప్రకటించింది. వినియోగదారుల నుంచి వస్తున్న స్పందనతో గడువు తేదీని మరికొద్ది రోజులు పొడిగించినట్టు జియో వెల్లడించింది. ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా వినియోగదారులు రూ.399 ఆపైన విలువ గల ప్లాన్‌ను జియో యాప్ లేదా వెబ్సైట్ ద్వారా రీచార్జి చేసుకుంటే వారికి రూ.400 విలువ గల 8 ఓచర్లు లభిస్తాయి. ఒక్కో ఓచర్ విలువ రూ.50 ఉంటుంది. దీంతోపాటు కస్టమర్లకు రూ.1899 విలువైన డిస్కౌంట్ కూపన్లు లభిస్తాయి. వీటిని ఆజియో, యాత్రా, రిలయన్స్ ట్రెండ్స్ సైట్లలో వాడుకోవచ్చు. ఇక జియో పార్ట్నర్ వాలెట్ యాప్స్ అమెజాన్ పే, పేటీఎం, ఫోన్ పే, మొబిక్విక్‌లలో జియో యూజర్లు రీచార్జి చేసుకుంటే వారికి రూ.300 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈనెల 25వ తేదీతో ముగిసిన ఈ ఆఫర్‌ను డిసెంబర్ 15వరకు పొడిగించింది. నవంబరు 10 నుంచి నవంబరు 25 వరకు రూ. 2,599ల విలువైన ట్రిపుల్ క్యాష్బ్యాక్ప్లాన్ను ఆఫర్ అందుబాటులో ఉంటుందని ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఏపీ అసెంబ్లీ పనిదినాల పెంపు
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల పని దినాలను పెంచారు. ఈ నెల 27,28, 29 తేదీలలోనూ సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ నెల 25 న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ఈ నెల 10 న ప్రారంభమైన ఏపీ అసంబ్లీ సమావేశాలు మొత్తం 10 రోజుల పాటు నిర్వహించాలనుకున్నారు. 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా అప్పట్లో బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. 11, 12, 16, 17, 18, 19 తేదీల్లో సభకు సెలవు ప్రకటించారు. తిరిగి నేడు ( సోమవారం) అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన తర్వాత పని దినాలను పెంచుతున్నట్టు అధికారంగా తెలిపారు. -
జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు మరోసారి పెంపు
న్యూఢిల్లీ: జీఎస్టీ ఫైలింగ్‌కు గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. జులైలో కొనుగోళ్లు, ఇన్పుట్-అవుట్‌పుట్ లావాదేవీల కోసం జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ రిటర్న్ దాఖలు సోమవారం మరోనెలపాటు పొడిగిస్తూ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. అక్టోబర్28న బెంగళూరులో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుతెలిపింది. జీఎస్టీ -2 రిటర్న్‌కు నవంబర్ 30 అని జీఎస్టీఆర్-2 దాఖలుకు చివరి తేదీ డిసెంబర్ 11 అని ట్విట్టర్లో వెల్లడించింది. అక్టోబర్ 31 నుంచి గడువు కొనుగోలు రిటర్న్ లేదా జీఎస్టీఆర్-2 గడువును నవంబర్ 30వరకు, ఇన్పుట్-అవుట్‌పుట్ లావాదేవీల జీఎస్టీఆర్ 3 దాఖలును డిసెంబర్ 11 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు ట్వీట్ చేసింది. గతంలో ఆడిట్ చేసిన ఆదాయం పన్ను రాబడిల సమర్పణకు జీఎస్టీ-2 దాఖలు చేసిన గడువు ముగియడంతో కొంతమంది పన్ను చెల్లింపుదారులపై ఒత్తిడి తెచ్చిందని క్లియర్ టాక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆర్చిత్ గుప్తా తెలిపారు. ఇన్పుట్ పన్ను క్రెడిట్ లభ్యత దానిపై ఆధారపడి ఉండటం వలన ఇది అత్యంత ముఖ్యమైందన్నారు. -
ఆధార్ లింక్ గడువు మార్చి 31
న్యూఢిల్లీ: వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందడానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ ఇచ్చిన గడువును 2018, మార్చి 31వ వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. 2017, డిసెంబర్ 31 వరకు ఉన్న ఈ గడువును మరో మూడు నెలలు పెంచుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనానికి బుధవారం వివరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎంకే ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ సేవలు పొందడానికి ఆధార్ తప్పనిసరి అన్న కేంద్రం ప్రకటనను సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం విచారింది. కేంద్రం గడువు పొడిగిస్తూ పోతున్నది తప్ప.. అసలు ఆధార్ లింక్ చేసుకోబోమంటున్న వారి పరిస్థితి గురించి వివరణ ఇవ్వడం లేదని పిటిషనర్ల తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై కేంద్రం స్పందనను అక్టోబర్ 30లోగా తెలియజేయాలని అటార్నీ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. -
ఆవాస్ యోజన మరో 15 నెలలు పొడిగింపు
సాక్షి,ముంబయిః ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన కింద మధ్యాదాయ వర్గాలకు ఇచ్చే రూ 2.60 లక్షల వడ్డీ రాయితీ పథకాన్ని మరో 15 నెలలు పొడిగించారు. ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనున్న ఈ స్కీమ్‌ను 2019 మార్చి వరకూ పొడిగించినట్టు అధికారులు తెలిపారు. 2022 నాటికి అందరికీ ఇల్లు ఆశయం నెరవేర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా తెలిపారు. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన పథకం కింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్‌ను ప్రధాని గత ఏడాది తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన విషయం విదితమే. 2022 నాటికి దేశ ప్రజలందరికీ ఇళ్లు సమాకూర్చే లక్ష్యంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఈ గృహాల నిర్మాణంలో బిల్డర్లు, ప్రైవేటు ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని ప్రభుత్వం స్వాగతిస్తుందన్నారు. -
గుడ్ న్యూస్: జియో మెంబర్షిప్ గడువు పొడిగింపు?
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తాజా పథకం ప్రైమ్ మెంబర్షిప్ ఇంకా తీసుకోని జియో ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఈ పథకం రిజిస్టర్ గుడువును జియో పెంచే అవకాశం ఉందట. మార్చి 31 తో ముగియనున్న ప్రైమ్ మెంబర్ షిప్ రిజిస్ట్రేషన్ గడువును ఆర్ఐఎల్ పెంచనుందట. ఈ గడువు మరో నాలుగు రోజుల్లోముగియనుండగా మరింత సమయం పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. తన కస్టమర్ల సౌలభ్యంకోసం ఈ గడువును మరో నెలపాటు పొడిగించే అవకాశం ఉందని సమాచారం. కాగా ఉచిత డాటా ప్రకనటతో టెలికాం మార్కెట్ లో సునామీ సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా టారిఫ్‌లను ప్రకటించింది. ముఖ్యంగా వన్‌టైం ఫీజు రూ. 99 తో ప్రైమ్ మెంబర్ షిప్ రిజిస్ట్రేషన్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ నమోదు కార్యక్రమం మార్చి 1 నుంచి ప్రారంభమై మార్చిలో 31న ముగియనుంది. దీని ద్వారా ప్రస్తుతం అమల్లో ఉన్న ఆఫర్లను వినియోగదారులు 2018వరకు పొందవచ్చని తెలిపింది. మరోవైపు గత ఫిబ్రవరిలో ఆర్ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఏప్రిల్ నెలనుంచి ప్రత్యర్థులతో పోలిస్తే తమ వినియోగదారులు 20 శాతం ఎక్కువ డేటా సహా, ఇతర ఆఫర్లను అందించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై రిలయన్స్ జియో అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
రాజువారిపేట(చాపాడు): అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు యత్నించిన మండల పరిధిలోని రాజువారిపేట గ్రామానికి చెందిన పాలూరు వెంకటరెడ్డి (55) అనే రైతు మృతి చెందాడు. పోలీసులు, మృతుని బంధువుల కథనం మేరకు.. గత ఐదారేళ్లుగా వెంకటరెడ్డి 9 ఎకరాల కౌలు పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో తనకు వ్యవసాయం, కుటుంబ పోషణ కోసం రూ. 8లక్షలు పైగా అప్పులు అయ్యాయి. ఈ ఏడాది సాగు చేసిన చెరకు పంట సైతం అనుకున్నంత దిగుబడి ఇవ్వకపోవటంతో మనస్తాపం చెందిన రైతు ఈ నెల 20న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివశంకర్ తెలిపారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
రాజువారిపేట(చాపాడు): అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు యత్నించిన మండల పరిధిలోని రాజువారిపేట గ్రామానికి చెందిన పాలూరు వెంకటరెడ్డి (55) అనే రైతు మృతి చెందాడు. పోలీసులు, మృతుని బంధువుల కథనం మేరకు.. గత ఐదారేళ్లుగా వెంకటరెడ్డి 9 ఎకరాల కౌలు పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో తనకు వ్యవసాయం, కుటుంబ పోషణ కోసం రూ. 8లక్షలు పైగా అప్పులు అయ్యాయి. ఈ ఏడాది సాగు చేసిన చెరకు పంట సైతం అనుకున్నంత దిగుబడి ఇవ్వకపోవటంతో మనస్తాపం చెందిన రైతు ఈ నెల 20న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివశంకర్ తెలిపారు. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జనవరి 11 వరకు పొడిగించారు. శుక్రవారం జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 3, 4, 5, 6, 9, 10, 11 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలను పొడిగించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించినట్టు చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అసెంబ్లీ లో విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనేది అవాస్తవమని ఆయన తెలిపారు. కాంగ్రెస్ 12 గంటల 36 నిమిషాల సమయం వినియోగించుకుందని, టీఆర్ఎస్ 9 గంటల సమయాన్ని వినియోగించుకుందన్నారు. భూ సేకరణ చట్టం ఆమోదించిన తర్వాత కాంగ్రెస్ సభ నుంచి పారిపోవడం విచారకరమన్నారు. కాంగ్రెస్ కోరుకున్న పెద్దనోట్ల రద్దు, డబుల్ బెడ్ రూమ్ అంశాలపై ఇప్పటికే చర్చించామన్నారు. విపక్షం ఒకటి అడిగితే తాము పది సమాధానాలు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ కు లేవనెత్తేందుకు అసలు సమస్యలు లేవని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు పొడిగిస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తే కాంగ్రెస్ నేతలు తెల్ల మొహం వేశారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఇంత సజావుగా జరగడం ఇదే మొదటిసారని తెలిపారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ శతవిధాలా యత్నించినప్పటికీ తమ సర్కార్ ఎక్కడా చిక్కలేదన్నారు. కనీసం 3 వ తేది నుంచి జరిగే సమావేశాల్లో నైనా హుందాగా వ్యవహరించాలని, కాంగ్రెస్ ఏ అంశాన్ని లేవనెత్తినా ధీటుగా బదులిస్తామని తెలిపారు. కాగా జనవరి 3 న మత్స్య సంపద అభివృద్ది, 4 న బోధన రుసుములు, 5న సింగరేణి, 6న ఎస్సీ, ఎస్టీల ఆర్తిక స్థితిగతులు తదితర అంశాలపై చర్చించనున్నారు. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు
-
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
బద్రిపల్లె(చాపాడు): సాఫ్ట్వేర్ ఇంజినీర్ కదా బాగా చూసుకుంటాడని తమ ఒక్కగానొక్క కూతురిని రూ.2లక్షలు నగదు, 10 తులాల బంగారం ఇచ్చి వివాహం జరిపిస్తే.. కట్న పిశాచిగా మారిన అల్లుడు తమ బిడ్డను వేధించి హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని చాపాడు మండలం బద్రిపల్లెకు చెందిన గవిరెడ్డి బాలిరెడ్డి కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. చాపాడు మండలంలోని బద్రిపల్లెకు చెందిన గవిరెడ్డి బాలిరెడ్డి కూతురు యోగీశ్వరి(23) ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బెంగళూరులోని తన ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కట్టుకున్న భర్తే తన కూతురిని కట్నం కోసం హత్య చేశాడని మృతురాలి తండ్రి బాలిరెడ్డి బెంగళూరులోని కేఆర్ పురం పోలీస స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బద్రిపల్లెకు చెందిన యోగీశ్వరికి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న చెన్నూరు మండలం రామనపల్లెకు చెందిన మహేశ్వర్‌రెడ్డితో 2014 ఏప్రిల్‌లో వివాహమైంది. కట్న కానుకల కింద 10 తులాల బంగారం, రూ.2లక్షల నగదు, ఎకరం పొలం ఇచ్చారు. ఇందులో పొలం బద్రిపల్లెలోనే ఉంది. వివాహమైనప్పటి నుంచి బెంగళూరులోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఏడాది క్రితం యోగీశ్వరి బంగారం మొత్తాన్ని భర్త అమ్మేశాడు. అప్పటి నుంచి భార్యా భర్తల నడుమ మనస్పర్థలు పెరిగాయి. ఈ క్రమంలో తన భార్యకు రావాల్సిన విలువైన పొలంపై కన్నేసిన మహేశ్వర్‌రెడ్డి తనకు కట్నం కింద ఇస్తామన్న ఎకరా పొలంను రాయించుకుని రావాలని యోగీశ్వరిపై ఒత్తిడి చేస్తూ వేధింపులకు గురి చేసేవాడు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులతో ఫోనులో మాట్లాడిన యోగిశ్వరి పొలం రాసివ్వాలని, తనపై వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపింది. నీకిస్తామన్న భూమి తప్పకుండా ఇస్తామని సంక్రాంతి పండుగకు ఇక్కడికి వచ్చినప్పుడు రాసిస్తామని తల్లిదండ్రులు చెప్పారు. చెప్పిన రెండు గంటల్లోనే రాత్రి 9గంటలకు యోగీశ్వరి ఆత్మహత్య చేసుకుందని ఫోను వచ్చింది. హుటా హుటిన బెంగళూరుకు వెళ్లి చూడగా, యోగీశ్వరి మెడపై గొంతు నులిమిన కాట్లు ఉన్నాయని, తమ అల్లుడే యోగీశ్వరీని చంపేసి ఫ్యానుకు ఉరివేసినట్లు చిత్రీకరించాడని బాలిరెడ్డితో పాటు గ్రామస్తులు వాపోయారు. ఏడాదిన్నర్ర కుమారుడి భవిష్యత్తు కూడా చూడకుండా ఇలా కర్కోటకుడిగా మారి డబ్బుల వ్యామోహంతో తమ గ్రామ ఆడబిడ్డను పొట్టన పెట్టుకున్నాడని బద్రిపల్లె గ్రామస్తులు భగ్గుమంటున్నారు. ఇలాంటి దుస్థితి ఏ ఆడకూతురుకు రాకూడదని, హత్య చేసిన మహేశ్వర్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలని యోగీశ్వరీ కుటుంబీకులు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు అక్కడి కేఆర్ పురం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
కర్ఫ్యూ నీడలోకి మరికొన్ని ప్రాంతాలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నెల 16న అరిపథన్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు మృతి చెందడంతో మరోసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేర్పాటువాదులు అరిపథన్ ప్రాంతానికి ర్యాలీకి పిలుపునివ్వడంతో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. శుక్రవారం కర్ఫ్యూను మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బుడ్గాం జిల్లాలోని అరిపథన్, మాగం ప్రాంతాలలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వాని ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు 42 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీనగర్, అనంతనాగ్, పాంపోర్, షోపియన్, ఖాన్పుర, కలూస ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఘర్షణల్లో ఇప్పటివరకు ఇద్దరు భద్రతా సిబ్బందితో సహా మొత్తం 64 మంది మృతి చెందారు. -
ఇంకా 30 రోజులూ విలీన చర్చలే
ముంబై : దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్ కామ్), ఎయిర్ సెల్ లు విలీనానికి సంబంధించి చర్చల గడువును మరో 30 రోజులు పొడిగించాయి. చర్చల గడువును పొడిగిస్తున్నట్టు రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ కంపెనీ ప్రకటించింది. ఈ విలీన చర్చల గడువును పొడిగించడం ఇది రెండోసారి. మొదటిసారి మార్చి 22న విలీన చర్చల గడువును 60 రోజులుకు పెంచుతున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. మరింత గణనీయమైన పురోగతి కోసం ఆర్ కామ్, మాక్సిస్ కమ్యూనికేషన్ బెర్హడ్(ఎమ్ సీబీ), సింద్యా సెక్యురిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్ సెల్ పెట్టుబడిదారులు పరస్పరం ఈ ప్రత్యేక సమయ వ్యవధిని 2016 జూన్ 22 వరకు పెంచాలని నిర్ణయించినట్టు ఆర్ కామ్ తెలిపింది. అయితే ఈ విలీన ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. షేర్ హోల్డింగ్ గురించి ప్రస్తుత చర్చలు జరుగుతున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కొత్త సంస్థలో ఆర్ కామ్ ఎక్కువ షేరును ఆశిస్తున్నట్టు సమాచారం. ఆర్ కామ్ టవర్, ఆప్టికల్ ఫైబర్ ఆస్తులను వదిలేసి, విలీన చర్చలను 90 రోజుల ప్ర్యతేక సమయ వ్యవధితో ప్రారంభిస్తున్నట్టు డిసెంబర్ 22న ఈ కంపెనీలు ప్రకటించాయి. అయితే మార్చి 22న మరో 60 రోజులు ఈ విలీన చర్చల గడువును పొడిగిస్తున్నట్టు పేర్కొన్నాయి. ఆర్ కామ్, ఎయిర్ సెల్ చర్చలు సఫలమైతే, మొత్తం స్పెక్ట్రమ్ పరిశ్రమలో ఈ రెండు 19.3శాతం వాటాను కలిగి ఉంటాయి. 2జీ, 3జీ, 4జీ సర్వీసుల కొరుకు 800 ఎమ్ హెచ్ జడ్, 900ఎమ్ హెచ్ జడ్ ,1800ఎమ్ హెచ్ జడ్,2100ఎమ్ హెచ్ జడ్,2300 ఎమ్ హెచ్ జడ్ స్పెక్ట్రమ్ లను ఇవి పొందనున్నాయి. -
ఎస్సై ప్రిలిమ్స్ రీవాల్యుయేషన్ గడువు పెంపు
హైదరాబాద్: సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎస్సై) ప్రిలిమినరీ రాత పరీక్ష జవాబు పత్రాల రీవాల్యుయేషన్ కోసం పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు గడువు పెంచింది. ప్రిలిమినరీ పరీక్ష జవాబు పత్రాలలో అభ్యంతరాలు ఉన్న వారు రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 12 వరకు గడువు పెంచుతూ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్ష తుది ఫలితాలను ఏప్రిల్ 28న రిక్రూట్‌మెంట్‌బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, అభ్యర్థుల జవాబు పత్రాలను కూడా బోర్డు వెబ్సైట్లో ఉంచింది. వీటిపై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మరోసారి రీవాల్యుయేషన్ చేసుకోవడానికి బోర్డు అవకాశం కల్పించింది. వాస్తవానికి మే 5తో గడువు ముగియడంతో తాజాగా 12వరకు పెంచింది. రీవాల్యుయేషన్ కోసం జనరల్ అభ్యర్థులు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2వేలు చెల్లించాల్సి ఉంటుంది. -
సాయన్న టీటీడీ బోర్డు సభ్యత్వం రద్దు
హైదరాబాద్ : టీటీడీ చైర్మన్ అనుమతి లేకుండా వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాక పోవడంతో టీటీడీ బోర్డు సభ్యుడు జి. సాయన్న సభ్యత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దుచేస్తూ సోమవారం ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే సాయన్నను ఏడాది క్రితం టీటీడీ సభ్యునిగా నియమించారు. అయితే ఆయన ఒక్కసారి కూడా తిరుమలలో జరిగే టీటీడీ ట్రస్టు బోర్డు సమావేశాలకు హాజరుకాలేదు. గైర్హాజరుపై టీటీడీ చైర్మన్‌కు సమాచారం కూడా ఇవ్వలేదు. దాంతో ప్రభుత్వం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. కాగా తిరుమల తిరుపతి దేవస్ధానం పాలక మండలిని మరో ఏడాది పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
30 వరకు టెట్ దరఖాస్తుల్లో మార్పులకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: టెట్ దరఖాస్తుల్లో మార్పులకు ఈనెల 30 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు టెట్ డెరైక్టర్ జగన్నాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పేపరు, లాంగ్వేజి, సబ్జెక్టు, ఫొటో తదితర వివరాల్లో పొరపాట్లు ఉంటే ఎస్సీఈఆర్టీ కార్యాలయంలోని టెట్ విభాగంలో సంప్రదించి సవరించుకోవాలని సూచించారు. తొలుత 29వ తేదీ వరకే ఈ అవకాశం ఇచ్చినా 30 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. -
31 వరకు అసెంబ్లీ
- రెండు రోజులు పొడిగించాలని బీఏసీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలను రెండ్రోజులు పొడిగించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయించింది. తొలి బీఏసీలో 29 వరకు మాత్రమే సభ కొనసాగుతుందని నిర్ణయించగా ఆదివారం స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తాజా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రాష్ట్రంలో కరువు పరిస్థితులు, విద్యా విధానంపై 30న సభ స్వల్పకాలిక చర్చ చేపట్టనుంది. హైదరాబాద్‌లో తాగునీటి ఎద్దడిపైనా చ ర్చించే అవకాశం ఉంది. 31న సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర జల విధానంపై ప్రత్యేక చర్చ ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్, జల విధానంపై సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అంశంపై బీఏసీలో భిన్నాభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ప్రజెంటేషన్ ఇచ్చేట్లయితే అభ్యంతరాలు తెలిపేందుకు లేదా వాదనలు వినిపించేందుకు తామూ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశమివ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టగా మిగిలిన పార్టీలూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం ఏం మాట్లాడతారో ముందుగా తమకు నివేదిక ఇవ్వాలని, తమ పార్టీలోనూ ఇరిగేషన్ నిపుణు లున్నారని, వారి తో చర్చించి చర్చల్లో పాల్గొంటామని టీడీపీ కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్, ఇతర పక్షాలు సైతం అప్పటికప్పుడు తయారై చర్చలో పాల్గొనడం ఎలా కుదురుతుందని ప్రశ్నించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు నిబంధనలు అడ్డంకి గా ఉన్నందున మొదట అసెంబ్లీ కమిటీ హాలు లో ప్రజెంటేషన్ ఇచ్చి ఆ తర్వాత అసెంబ్లీలో ప్రకటన చేయాలన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. దీంతో సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై స్పష్టత లేకుండానే బీఏసీ సమావేశం ముగిసింది. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని స్పీకర్‌కు బీఏసీ వదిలిపెట్టింది. 29వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుతోపాటు మరో నాలుగు బిల్లులను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాల పెంపుద లకు సంబంధించిన బిల్లుతోపాటు, వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ల అమలు, రాజీవ్ గాంధీ టెక్నాలజీ యూనివర్సిటీ, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ సవరణల బిల్లులను కూడా ప్రవేశపెడతారు. -
ఇంద్రాణి కస్టడీ పొడిగింపు
ముంబై: షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా జ్యుడిషియల్ కస్టడీని పొడగించారు. ఇంద్రాణితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్‌కు ఈ నెల 31 వరకు కస్టడీ పొడగిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2012 ఏప్రిల్ నెలలో కన్న కూతురుని ఇంద్రాణి ముఖర్జీ దారుణంగా చంపేసి అనంతరం రాయఘడ్ అడవుల్లో పాతిపెట్టిన విషయం తెలిసిందే. -
ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు గడువు పెంపు
-
గురుకుల కళాశాలలకు దరఖాస్తు గడువు పొడిగింపు
కరీంనగర్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల గడువును పొడిగించినట్లు టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ కన్వీనర్ ఏంజెల్ తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరానికి గాను మొత్తం 11 గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం జూన్ 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా మంథనిలోని గురుకుల పాఠశాలను కళాశాలగా స్థాయి పెంచినట్లు వెల్లడించారు. అల్గునూర్‌లోని సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ నుంచి బాలురు, చింతకుంట గురుకుల విద్యాలయం నుంచి బాలికలు దరఖాస్తు పొందవచ్చని చెప్పారు. పూర్తి వివరాలకు చింతకుంట ప్రిన్సిపాల్ 90000 49542, అల్గునూర్ ప్రిన్సిపాల్ 94926 48847 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు. -
మరో 1.2 లక్షల మంది బీడీ కార్మికులకు పింఛన్
రాష్ట్రవ్యాప్తంగా మరో 1,20,419 మంది బీడీ కార్మికులకు ఏప్రిల్ నుంచి పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 2.56 లక్షల మంది బీడీ కార్మికులకు రూ.వెయ్యి చొప్పున ప్రభుత్వం పింఛన్ ఇస్తుండగా, తాజాగా ఎంపికైన వారితో కలిపి ఈ సంఖ్య 3.77 లక్షలకు చేరింది. తాజా ఉత్తర్వుల మేరకు నిజామాబాద్ జిల్లా నుంచి 48 వేలు, కరీంనగర్ జిల్లా నుంచి 44,882, మెదక్ జిల్లా నుంచి 13వేలు, అదిలాబాద్ జిల్లా నుంచి 8,700, వరంగల్ నుంచి 6,237 మంది బీడీ కార్మికులకు కొత్తగా పింఛన్ మంజూరు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. -
లఖ్వీ నిర్బంధం పొడగింపు
కరాచీ: ముంబై ఉగ్రవాదుల దాడుల సూత్రదారి లక్వీ నిర్బంధాన్ని పాకిస్థాన్ మరో 30 రోజుల పాటు పొడగించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒబామా భారత్ రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ అదుపులో ఉన్న లక్వీ 2008లో ముంబై దాడికి కుట్ర పన్నాడు. అతణ్ని భారత్ కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. -
డిసెంబర్ 17వరకు ఓటర్ల నమోదు