సాక్షి, అమరావతి: ఆధార్ కార్డుతో ఎలక్ట్రానిక్ పద్ధతిన వినియోగదారుల రేషన్ కార్డుల అనుసంధానం చేసే (ఈ–కేవైసీ) గడువును మరో 15 రోజులు పొడిగిస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ మంగళవారం ప్రకటించారు. లబ్ధిదారులెవరూ ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ముందు ప్రకటించిన దాని ప్రకారం ఈ–కేవైసీ నమోదు గడువు ఆగస్టు 31తో ముగిసింది.
వరుస సెలవులు, పండుగలు రావడం, సర్వర్లు సరిగా పని చేయక పలు చోట్ల ఆధార్ నమోదు కేంద్రాలు పని చేయలేదని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో గడువు పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్‌తో అనుసంధానం అవసరం లేదన్నారు. ఆపై వయసున్న పిల్లలకు సెప్టెంబర్ వరకు గడువు ఉందని, పెద్దలు మాత్రం సెప్టెంబర్ 15లోగా చేయించుకోవచ్చని వివరించారు.
ఇవీ చదవండి:
ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేయమన్నా వేయని లోకేశ్
ప్రభుత్వ భూమిపై పచ్చమూక..
Comments
Please login to add a commentAdd a comment