
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును మరోసారి పొడిగించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల బ్యారేజీల్లో అవకతవకలపై ఉమ్మడి ఏపీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ వేసింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ఏప్రిల్ 30 వరకు కమిషన్ గడువు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ ఈ నెల 23న హైదరాబాద్ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి విచారణ కొనసాగించనున్నారు. ఈ దఫా మిగిలిన విచారణతో పాటు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయనున్నట్టు సమాచారం. కాగా తదుపరి జరగనున్న విచారణలోఅధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లలతో పాటు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్ద నాయకులను కూడా పిలిచే అవకాశముందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment