Telangana Bill
-
బిగ్.. హంబగ్!
సాక్షి, హైదరాబాద్: కాలేజీలో క్యాంపస్ నియామకాలున్నాయా? ఏయే కంపెనీలు వస్తాయి? వార్షిక ప్యాకేజీలు ఎలా ఉంటాయి? ఇంజనీరింగ్‌లో చేరే ప్రతీ విద్యార్థి ముందుగా వాకబు చేసే అంశాలివి. పెద్ద కంపెనీలు క్యాంపస్ నియామకాలు చేపడతాయంటే ఆ కాలేజీకి ఎగబడతారు. కానీ ఐటీ కంపెనీల వల్ల ఇప్పుడు ట్రెండ్ మారిందంటున్నారు నిపుణులు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీల కన్నా... చిన్న మధ్య తరహా ఐటీ కంపెనీలే ఎక్కువ వేతనాలు ఇస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే నైపుణ్యం ఉన్న వారికి పెద్ద సంస్థల కన్నా భారీగా జీతాలు చెల్లిస్తున్నాయి. కోవిడ్ తర్వాత ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తోందని స్పెషలిస్ట్ స్టాఫింగ్ కంపెనీ ‘ఎక్స్‌ఫెనో’ అధ్యయనంలో వెల్లడైంది.దూసుకెళ్లే అవకాశాలుదేశంలో ఐటీ సేవలు అందించే ఆరు కంపెనీల్లో దాదాపు 20 వేల మంది వేతనాలను పరిశీలించింది. వీళ్లంతా ఇంజనీరింగ్ పూర్తి చేసి, కొత్తగా ఐటీ ఉద్యోగాల్లో చేరినవాళ్ళే. వీళ్ళల్లో 74 శాతం మందికి ఏడాదికి రూ. 2.5 నుంచి రూ. 5 లక్షల వేతనం ఇస్తున్నారు. 12 శాతం మందికి రూ. 5.75 నుంచి రూ. 7 లక్షల వార్షిక వేతనం ఇస్తున్నారు. కేవలం 7 శాతం మంది మాత్రమే రూ. 7.5 లక్షల కన్నా ఎక్కువ వేతనం పొందుతున్నారు⇒ మధ్యస్థంగా ఉండే 10 ఐటీ సర్వీస్ కంపెనీల్లో 5 వేల మంది వేతనాలపై అధ్యయనం చేశారు. 57 శాతం మందికి రూ. 2.5–5 లక్షల వార్షిక ప్యాకేజీ ఇస్తున్నారు. 30 శాతం మందికి రూ.5.75 లక్షల ప్రారంభ వేతనం ఇస్తున్నాయి. 7 శాతం మందికి పెద్ద సంస్థలకన్నా ఎక్కువ వేతనం చెల్లిస్తున్నాయి.⇒ ఆరు పెద్ద కంపెనీల్లో రెండేళ్ల తర్వాతే పదోన్నతులు లభిస్తున్నాయి. వేతనంలో హైక్ నిమిత్తం మధ్యస్థ కంపెనీలు ప్రతీ ఆరు నెలలకూ వృత్తి నైపుణ్య అంచనా వేస్తున్నాయి. 58 శాతం ఫ్రెషర్స్‌కు స్కిల్‌ను బట్టి ప్రమోషన్లు ఇచ్చారు.కోతకు చాన్స్ తక్కువేగడచిన ఐదేళ్లుగా టైర్–1 ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తగ్గించుకున్నాయి. ఆరు కంపెనీల్లో 15 శాతం మేర కోత పెట్టాయి. హై స్కిల్ ఉండి, మధ్యస్థ వేతనం ఉన్న వాళ్ళనే కొనసాగించేందుకు ఇష్టపడుతున్నాయి. ఫ్రెషర్స్ విషయంలో పరిస్థితి దయనీయంగా ఉంటోంది. మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయంగా వచ్చే పరిస్థితులను పెద్ద కంపెనీలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. చిన్న, మధ్యస్థ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల, స్కిల్స్ ఉంటే అంత తొందరగా తీసేసే అవకాశం ఉండదు. కాబట్టి వేగంగా ప్రమాదం ముంచుకొస్తుందన్న భయం ఉండదని ఉద్యోగులు భావిస్తున్నారు. పెద్ద కంపెనీల ఉద్యోగుల్లో అనుక్షణం భయం వెంటాడుతోంది.ట్రెండ్‌ను కాలేజీలూ పట్టుకోవాలిప్రతీ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా క్యాంపస్ నియామకాలకు సంబంధించిన విభాగం ఉంటుంది. మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులకు స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నాయి. అయితే, పెద్ద కంపెనీల మనోభావాలనే ఈ శిక్షణలో భాగస్వామ్యం చేస్తున్నాయి. దీంతో పాటు చిన్న, మధ్యస్థ ఐటీ సంస్థల అవసరాలు, అవి ఆఫర్ చేస్తున్న జాబ్ మార్కెట్‌పైనా అవగాహన కల్పించాలని హైదరాబాద్ లోని ఓ మల్టీ నేషనల్ కంపెనీ సీనియర్ కన్సల్టెంట్ విశేష్ తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్‌లో ఫ్రెషర్స్‌కు పెద్ద కంపెనీలకన్నా, చిన్న కంపెనీలే అత్యధిక వేతనాలు ఇస్తున్నాయి. ఈ దిశగా శిక్షణ ఇస్తే విద్యార్థుల ఉపాధి అవకాశాల్లో మార్పులుండే వీలుంది.వేతనాల్లో పెద్ద వాటితో పోటీ..ఉద్యోగి నిర్వహించే పాత్ర, అతని అనుభవాన్ని బట్టి కంపెనీల్లో వేతనాలుంటున్నాయి. ఈ విషయంలో పెద్ద కంపెనీలతో చిన్న కంపెనీలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇది ఈ మధ్య కన్పిస్తున్న కొత్త ట్రెండ్. - రోహన్ సిల్వెస్టర్ (టాలెంట్ స్ట్రాటజీ అడ్వైజర్,ఇన్‌డీడ్ ఇండియా)నిలబడేందుకు పోరాటం చిన్న, మధ్యస్థ కంపెనీలు తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు ఓ రకంగా పోరాటం చేస్తున్నాయి. మార్కెట్లో నిలబడాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ కారణంగా నైపుణ్యం ఉన్న ఫ్రెషర్స్‌కు పెద్ద కంపెనీల కన్నా 30 నుంచి 50 శాతం వేతనాలు ఎక్కువ ఇచ్చి చేర్చుకుంటున్నాయి. పదేళ్ళ నికర వృద్ధిలో ఇవి కూడా అత్యుత్తమ ప్రమాణాలకు చేరుకోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. - నీలమ్‌కౌర్ (ఐటీ ప్రొఫెషనల్, ముంబై) చిక్కులు తెస్తున్న ఆర్థికాంశాలు ఆర్థిక మాంద్యం పెద్ద కంపెనీ ఉద్యోగుల స్థితి గతులను మారుస్తోంది. ఈ ప్రభావం చిన్న, మధ్యస్థ కంపెనీల్లో తక్కువగా ఉంటోంది. కొన్ని అంతర్జాతీయ కంపెనీలు కూడా ఐటీ సేవల్లో ఈ సంస్థలకే ప్రాధాన్యమిచ్చే ధోరణి కన్పిస్తోంది. కాబట్టి స్కిల్స్ ఉన్న వాళ్ళకు చిన్న కంపెనీల్లోనూ ఢోకా ఉండదు. ఎంఎస్ ప్రసాద్ (టైర్–1 కంపెనీలో వర్క్‌ఫోర్స్ హెడ్) -
..భూమార్గం పట్టిద్దాం!
‘తెలంగాణలో భూమి అనేది చాలా ప్రధానమైన అంశం. ప్రపంచంలోని ఎక్కడా లేని భూపోరాటాలు ఇక్కడే జరిగినా 75 ఏళ్ల తర్వాత కూడా∙భూసమస్యలు అసంపూర్తి పనిగానే మిగిలిపోయాయి. అసంపూర్ణమైన భూసంస్కరణలే ఇందుకు కారణం. ప్రభుత్వాలు చేసే పనుల కారణంగా పేదల భూములకు భద్రత కల్పించడం మాట అటుంచితే పేదల భూములు లాక్కుంటున్నారని, ఉన్న కాసిన్ని భూములు పేదల చేతుల నుంచి పోతున్నాయని ఐక్యరాజ్యసమితి చెప్పింది. ఇదీ అసలు సమస్య. ప్రజలకున్న అసలు సమస్యలే కదా ఎన్నికల ఎజెండా కావాలి. ప్రజల ప్రతి సమస్యా ఎజెండా అయితే ఆ సమస్యలు తీరుస్తామని రాజకీయ పార్టీలు చెప్పాలి..’ అని భూచట్టాల నిపుణులు, నల్సార్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎం.సునీల్‌కుమార్ అన్నారు. తెలంగాణలో ధరణి ఒక్కటే భూ సమస్య కాదని పేర్కొన్నారు. ప్రజలు కోరుకుంటున్న భూవిధానాలను తీసుకురావడం ఎన్నికల ఎజెండా అయినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు. 75–80 ఏళ్ల నాటి పరిస్థితే ఇప్పటికీ.. భూమిని ప్రజల కోణంలో చూడాలి. భూమి లేని వారికి భూమి ఇవ్వడం, భూమి ఉన్న వారి హక్కులకు భద్రత ఉన్నప్పుడే ఆస్తి సంపదగా మారుతుంది. అయితే ఈ రెండింటి విషయంలో 75–80 ఏళ్ల నాటి పరిస్థితే ఇప్పటికీ ఉంది. భూమి లేని గ్రామీణ కుటుంబాలు తెలంగాణలో 56 శాతం ఉన్నాయని లెక్కలు చెపుతున్నాయి. భూములున్న కుటుంబాల విషయంలో ఊరికో 200 సమస్యలున్నాయి. ఈ సమస్యలు ఎన్నికల ఎజెండా కావాలి. దురదృష్టవశాత్తూ అలా జరగడం లేదు. గత మూడు ఎన్నికలను పరిశీలిస్తే.. 2014 ఎన్నికల్లో పార్టీల మేనిఫెస్టోల్లో భూమి ప్రస్తావన ఉంది. 2018లో కొందరే ప్రస్తావించారు. కానీ ఈసారి భూమి అంశం చర్చకే రావడం లేదు. ధరణిని రద్దు చేస్తామని ఒకరు అంటుంటే, అసైన్డ్ భూములపై హక్కులు కలి్పస్తామని బీఆర్ఎస్ అంటోంది. తెలంగాణలో భూసమస్య అంటే ధరణి ఒక్కటేనా? కీలకమైన భూసర్వే ఏ పార్టీ మేనిఫెస్టోలో అయినా ఉందా? అంటే మెల్లగా భూమి అనేది ఎన్నికల ఎజెండా కాకుండా మాయమైపోతోందన్న మాట. సమస్యలు కొనసాగితేనే పార్టీలకు ఉపయోగం రాజకీయ పార్టీలు ఎన్నికల్లో భూమిని ఎజెండాగా చేయాలనుకోవడం లేదనే చెప్పాలి. ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కానీ, ఉద్దేశపూర్వకంగా కానీ, లేదంటే పరిష్కరించలేక పోవడం వల్ల కానీ భూమి అంశాన్ని పార్టీలు చేపట్టలేకపోతున్నాయి. భూమి సమస్యను యథాతథంగా కొనసాగించాలన్న ఆలోచన కూడా రాజకీయ పార్టీలకు ఉండొచ్చు. భూములకు సంబంధించిన సమస్యలు ఉంటేనే కదా రాజకీయ పార్టీలకు ఉపయోగం. ప్రతి గుంట భూమిని సర్వే చేయాలి తెలంగాణలో భూముల సమగ్ర సర్వే చేయాలి. ఇందుకు రూ.700–800 కోట్ల వరకు ఖర్చవుతుంది. తెలంగాణలో ప్రతి గుంట భూమిని సమగ్రంగా సర్వే చేసి కొత్త రికార్డులను తయారు చేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. కానీ సర్వే చేస్తామని ఎవరైనా చెప్తున్నారా? భూ చట్టాల్లో సమగ్ర మార్పు రావాలి. ఆర్వోఆర్, పీవోటీ, కౌలు చట్టాలు మార్చాలి. ఏ పార్టీ అయినా భూ చట్టాల్లో మార్పు తెస్తామని ప్రకటిస్తోందా? రెవెన్యూ కోడ్ తెస్తామని చెప్తోందా? భూమి హక్కులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే టైటిల్ గ్యారంటీ చట్టం తెస్తామని ఏ పార్టీ అయినా చెపుతోందా? భూమి లేని పేదలకు భూములిస్తామని ఎవరైనా అన్నారా? తెలంగాణలో 10 లక్షల మందికి పైగా ఉన్న కౌలు రైతులను గుర్తిస్తామని ఎవరైనా చెపుతున్నారా? సమగ్ర చట్టం లేకుండా కౌలుదారులను ఎలా గుర్తిస్తారు? ఎలా డబ్బులిస్తారు? భూపరిపాలన మెరుగుపరుస్తామని ఎవరైనా అంటున్నారా? ఇవి ప్రజలు చేసే డిమాండ్లే. కంప్యూటర్ రికార్డు తప్పనిసరి పేరేదైనా సరే.. భూమికి కంప్యూటర్ రికార్డు ఉండి తీరాలి. తెలంగాణలో భూమి కంప్యూటర్ రికార్డులు బ్రహ్మాండంగా ఉన్నాయమని అధికారపక్షం చెపుతోంది. ప్రతిపక్షమేమో చెండాలంగా ఉందని అంటోంది. వీళ్లు రద్దు చేస్తామంటారు. వాళ్లు యథాతథంగా కొనసాగిస్తామంటున్నారు. ఇద్దరూ చెబుతున్నదీ తప్పే. రద్దు సమస్యకు పరిష్కారం కాదు. అసలు కంప్యూటర్ రికార్డు అయితే ఉండాలి కదా? ఏదో ఒక రికార్డుండాలి. కొత్త రికార్డు ఎలా తెస్తారు? అనేది చెప్పాలి కదా? ఏం చేస్తారనే పరిష్కారం చెప్పకుండా రద్దు సమంజసం కాదు. అంతా బాగుందని చెప్పడం సరైంది కాదు. అంటే ఈ రెండు పక్షాలు ప్రజలేం కోరుకునేదానివైపు వెళ్లడం లేదన్నది అర్థమవుతోంది. కంప్యూటరీకరణ అవసరమా? భూమికి కాగితాలిచ్చే ప్రక్రియ ప్రపంచమంతా జరుగుతోంది. ఎందుకంటే భూమి ఉన్నా.. ఆ భూమికి సరైన కాగితాలున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 30 శాతమేనట. అంటే రికార్డులు లేని వారే ఎక్కువ ఉన్నారు. ఈ రికార్డులను కల్పించడంలో భాగంగా జరిగే ప్రక్రియనే ఫార్ములైజేషన్ ఆఫ్ ల్యాండ్ రైట్స్ అంటారు. అంటే భూములకు రికార్డులు రూపొందించాలి. వాటిని కంప్యూటరీకరించాలి. అమ్మకాలు, కొనుగోళ్లు సులభంగా జరగాలి. వీటి వల్ల భూమి హక్కులకు భద్రత ఏర్పడుతుంది. పేదలకు కూడా భూములు కొనుగోలుచేయగలిగిన ధైర్యం వస్తుంది. భూవినియోగ విధానం ఉండాలి భూమి విధానం, భూమి వినియోగ విధానాలు ప్రతి రాష్ట్రానికి ఉండాలి. ఎన్నికల సమయంలోనే ఇవి చర్చకు రావాలి. ఉచితాలు అనేవి తాత్కాలిక లబ్ధి చేకూర్చేవి. అందువల్ల రాజకీయ పార్టీల హామీలు భూమి చుట్టూ తిరగాలి. స్థిరాస్తి కల్పనపై అవి దృష్టి సారించాలి. గుంట భూమి ఉంటే ఎన్ని సమస్యలో.. అది కూడా లేని వారి పరిస్థితేంటో అందరికీ తెలిసిందే. భూములివ్వడం, ఉన్న భూములను కాపాడడం చుట్టూ ఎన్నికల ఎజెండా తిరిగితేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. - మేకల కళ్యాణ్ చక్రవర్తి -
తెలంగాణకు చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్..
సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన ఎండలు, వడగాలులతో అల్లాడుతున్న తెలంగాణకు ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు తెలిపింది. ఖమ్మం వరకూ నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని, రెండు మూడు రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత కొంతమేర తగ్గనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో ఆవర్తనం ఏర్పడిందని, దీని కారణంగా పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకు గాలులు వీస్తున్నాయని వాతావావరణశాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. చదవండి: సిద్దిపేటకు రైలు.. తిరుపతి, బెంగళూరు, ముంబయికి ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ములుగు ,యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. ఈనెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ హైదరాబాద్ కేంద్రం తెలంగాణకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. సాక్షి, అమరావతి: ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. పార్వతీపురం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, ఏలూరులో గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పల్నాడు జిల్లాలోనూ పలుచోట్ల వర్షం కురిసింది. ఈదురు గాలులు వీస్తున్నాయి. రాజుపాలెం, సత్తెనపల్లి, క్రోసూరు, నకరికల్లు, పెదకూరపాడు, నూజెండ్లలో వర్షం పడగా.. ఈదురుగాలులకు కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నలిచిపోయింది. -
నేడు సుప్రీంలో తెలంగాణ గవర్నర్ బిల్లుల పెండింగ్ కేసు విచారణ
-
మూడు బిల్లులకు ఆమోదం..రెండు బిల్లులు పెండింగ్
-
ముందే అనుబంధ గుర్తింపు సాధ్యమేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంటర్, డిగ్రీ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియను ఈసారి మేలోగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించినా దాని అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా ఆదేశాలు జారీ అయి రెండు నెలలైనా ఇప్పటికీ కార్యాచరణ ప్రారంభం కాకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇందుకు చాలా కారణాలే కనిపిస్తున్నాయి. జాప్యాన్ని నివారించాలనుకుంటున్నా.. ఏటా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ విద్యాసంవత్సరం మొదలైన కొన్ని నెలల వరకూ జరుగుతుండటంతో గుర్తింపు రాకుండానే చాలా కాలేజీలు విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. నిబంధనలు పాటించనందుకు ఆయా కాలేజీలకు గుర్తింపు ఇవ్వరాదని అధికారులు భావిస్తున్నప్పటికీ అప్పటికే చేరిన విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా గుర్తింపు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఇది విద్యాశాఖకు తలనొప్పిగా మారుతోంది. దీన్ని నివారించేందుకే ఈ ఏడాది విద్యాసంవత్సరం ముగిసేలోగా గుర్తింపు పక్రియ పూర్తిచేయాలని నిర్ణయించారు. నిబంధనలు బేఖాతర్ చేస్తున్న యాజమాన్యాలు.. రాష్ట్రంలోని 1,856 ప్రైవేటు ఇంటర్ కాలేజీల్లో దాదాపు 400 కాలేజీలు ఇరుకైన ప్రదేశాల్లోని బహుళ అంతస్తుల భవనాల్లో నడుస్తున్నాయి. అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు లేకున్నా ఆయా బోధన సాగిస్తున్నాయి. మరికొన్ని కాలేజీల్లో కనీస మౌలిక వసతుల్లేవు. దీనిపై ఇంటర్ బోర్డు కొన్నేళ్లుగా నోటీసులిస్తున్నా యాజమాన్యాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసేలోగా అనుబంధ గుర్తింపు ఇవ్వాలంటే ఆయా యాజమాన్యాలు తాము నడిపే కాలేజీల ప్రాంతాలపై స్పష్టత ఇవ్వాలి. అప్పుడే గుర్తింపు ప్రక్రియ సాధ్యం కానుంది. మరోవైపు ఈ నెల 15 నుంచి ఇంటర్ పరీక్షలు మొదలు కానుండగా ఏప్రిల్, మే నాటికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. జూన్ నుంచి కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉండటంతో ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తయ్యేలోగా ముందే అనుబంధ గుర్తింపు ఎలా ఇవ్వగలరనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గుర్తింపు అనుకున్నట్టు పూర్తవ్వడం కష్టమేనని బోర్డు వర్గాలు అంటున్నాయి. డిగ్రీ సీట్లపై స్పష్టత ఏది? రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో దాదాపు 4.6 లక్షల సీట్లున్నాయి. వాటిల్లో ఏటా భర్తీ అవుతున్నవి సుమారు 2.25 లక్షల సీట్లే. సగానికిపైగా సీట్లు మిగిలిపోతున్నాయి. కొన్ని కాలేజీల్లో జీరో అడ్మిషన్లు ఉంటున్నాయి. మరికొన్ని కోర్సుల్లో జీరో ప్రవేశాలుంటున్నాయి. వాటిని రద్దుచేస్తామని ఉన్నత విద్యామండలి ఏటా చెప్పడమే తప్ప కార్యాచరణకు దిగడం లేదు. ఈ ఏడాది దాదాపు లక్ష సీట్లను ఫ్రీజ్ చేయగా వచ్చే ఏడాది ఇలాంటి సమస్య రాకుండా కాలేజీలే అవసరం లేని సీట్లను వదులుకోవాలనే అవగాహన కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. దీనికితోడు ఈ ఏడాది కొత్తగా విభిన్న కోర్సుల సమ్మేళనంతో డిగ్రీ ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. ఆర్ట్స్ విద్యార్థి కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సుచేసే అవకాశం ఇస్తామంటున్నారు. ఇది జరగాలంటే ప్రైవేటు కాలేజీల్లో డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకోవాలి. డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లను పెంచుకోవాలి. వచ్చే మే నాటికి ఈ ప్రక్రియ పూర్తవ్వాలని ఉన్నత విద్యామండలి అన్ని వర్సిటీలకు సూచించింది. కానీ ప్రైవేటు కాలేజీలు సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఇప్పటికిప్పుడు కోర్సులను మార్చుకోవడం, అందుకు తగ్గ ఫ్యాకల్టీ ఏర్పాటు చేసుకోవడం కష్టమని పేర్కొంటున్నాయి. వర్సిటీలను అప్రమత్తం చేశాం మార్పులను స్వాగతించేలా ప్రైవేటు కాలేజీలకు నచ్చజెప్పి వారి భాగస్వామ్యాన్ని పెంచుతాం. ఈ దిశగా అన్ని వర్సిటీలను అప్రమత్తం చే స్తాం. విద్యార్థులకు అవసరమయ్యే కోర్సులనే తీసుకోవడం కాలేజీలకు మంచిది. డిమాండ్ లేకుండా అనుమతులివ్వడం వల్ల ఉపయోగం లేదు. వీలైనంత త్వరగా అనుబంధ గుర్తింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి,రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ -
తల్లిదండ్రుల మధ్య గొడవ.. పురుగుల మందు తాగిన కుమార్తె..
సాక్షి, మద్దిరాల(నల్లగొండ): పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధి లోని జి.కొత్తపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గురువారం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన నిమ్మ సుధాకర్ మేరమ్మ దంపతులు తరచూ గొడవ పడుతున్నారు. దీంతో వారి కుమార్తె నిమ్మ రూప(18)మనస్థాపానికి గురై బుధవారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన తల్లిదండ్రులు సూర్యాపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. తల్లి మేరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై నాగయ్య తెలిపారు. -
నేడు వాసాలమర్రికి సీఎం కేసీఆర్.. సర్పంచ్ ఇంట్లో భోజనం
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం తన దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రికి రానున్నారు. జూన్ 22న వాసాలమర్రిలో గ్రామసభ నిర్వహించి, గ్రామస్తులతో కలసి సీఎం సహపంక్తి భోజనం చేసిన విషయం తెలిసిందే. గ్రామాన్ని బంగారు వాసాలమర్రిగా అభివృద్ధి చేసి మరో అంకాపూర్‌గా తీర్చిదిద్దుతానని ప్రకటించిన సంగతీ విదితమే. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం 11 గంటలకు సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి కేసీఆర్ వాసాలమర్రికి చేరుకుంటారు. 53 దళిత కుటుంబాలతో కూడిన కాలనీలో పర్యటించి వారి అవసరాలను తెలుసుకుంటారు. దళిత బంధుపై చర్చిస్తారు. సర్పంచ్‌కు సీఎం ఫోన్ గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు ఇంట్లో కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేస్తారు. వాస్తవానికి జూన్ 22నే సర్పంచ్ ఇంటికి వస్తానని చెప్పినప్పటికీ ఆరోజు సమయాభావం వల్ల వెళ్లలేకపోయారు. మరోమారు వస్తానని ఆ రోజు సర్పంచ్‌కు హామీ ఇచ్చిన సీఎం.. ఇచ్చిన మాట ప్రకారం బుధవారం ఆయన ఇంటికి వెళ్లనున్నారు. ఈ మేరకు సర్పంచ్‌కు స్వయంగా ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. భోజనం చేసిన తర్వాత గ్రామంలోని రైతువేదిక భవనంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశమవుతారు. ఈ సమావేశానికి పరిమిత సంఖ్యలో 150 మంది మాత్రమే హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రామాభివృద్ధిపై కలెక్టర్‌తో చర్చ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. జూన్ 22 తర్వాత గ్రామంలో వచ్చిన మార్పులు అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధి కమిటీల ఏ ర్పాటు, యువత, రైతులు, మహిళల అభ్యున్నతికి అవసరమైన చర్యలు, గ్రామంలో మౌలిక వసతులు, డబుల్ బెడ్రూం ఇళ్లు, సాగు, తాగు నీటి వివరాలు, ఉపాధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. -
తెలంగాణ లాక్డౌన్ ఫోటోలు (24-04-2020)
-
ప్రజలారా ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్లుగా ప్రసవ వేదన చెందుతోంది. తల్లి గర్భం నుంచి తెలంగాణ బయటకు వచ్చేందుకు నానా యాతన పడుతోంది. ఆ తల్లి పడుతున్న వేదనను అర్థం చేసుకున్నాం. తల్లికి పురుడు పోసి తెలంగాణ పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు మేమెప్పుడూ అండగా ఉంటాం’’అని తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీ నుంచి గల్లీ వేదికల వరకు పదే పదే చెబుతూ రాష్ట్ర ఏర్పాటుకు మొదట నుంచి అండదండగా ఉంటూ వచ్చిన మహిళా నేత సుష్మస్వరాజ్. ఢిల్లీ వేదికగా నిర్వహించిన ప్రతి ఆందోళనకు హాజరై రాష్ట్ర ఏర్పాటుకు తొలి నుంచి ఆమె అండగా నిలబడ్డారు. ముఖ్యంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే సందర్భంలో కొందరు బీజేపీ అగ్రనేతలే తెలంగాణలో, పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలను తప్పుబట్టినా.. ఇది యూపీఏ ప్రభుత్వం తేల్చాల్సిన అంశమంటూ తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ కోర్టులోకి నెట్టేసినా.. తెలంగాణరాష్ట్ర ఏర్పాటు జరగాల్సిందేనని పట్టుబట్టి మద్దతుగా నిలిచిన సుష్మాస్వరాజ్.. మన రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అగ్రనేతలు ఎల్.కే.అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌గడ్కరీ, అరుణ్‌జైట్లీను తెలంగాణకు అనుకూలంగా వారిని ఒప్పించడంలో సుష్మ పోషించిన పాత్ర చాలా కీలకం. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో బిల్లుపై చర్చలో ప్రధాన ప్రతిపక్ష నేతగా సుష్మస్వరాజ్ మాట్లాడిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్లో నిలిచిపోతాయి. ‘‘ప్రసవ వేదనను తీర్చే సమయం ఆసన్నమైంది. ఎన్నో త్యాగాల మీద, విద్యార్థుల బలిదానాల మధ్య అనేక మంది ప్రజా పోరాటాలతో పండంటి తెలంగాణ బిడ్డ జన్మించబోతుంది. మేమిచ్చిన వాగ్దానం మేరకు మా మాటను నిలబెట్టుకున్నాం. ముందు ముందు తెలంగాణబిడ్డ ఎదిగేందుకు వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతాం. తెలంగాణ ప్రజలారా ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి’’అంటూ ఆమె చేసిన ప్రసంగం చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. చదవండి: సుష్మా హఠాన్మరణం -
'రాహుల్ కంటే కేటీఆర్ స్థాయి పెద్దది'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరుపై ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు పూనకం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్, ఉత్తమ్ కుమార్ల కంటే కేటీఆర్ స్థాయి పెద్దదన్నారు. సిరిసిల్ల నుంచి సిలికాన్ వ్యాలీ వరకు కేటీఆర్‌కు ఓ స్ధాయి ఉందని తెలిపారు. కేసీఆర్ కాలి గోటికి కాంగ్రెస్ నేతలు సరిపోరన్నారు. ఒకప్పుడు సోనియా బలిదేవతన్న రేవంత్ రెడ్డికి ఇపుడు ఆమె దేవత అయిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ నేతలు దద్దమ్మలే అని అరోపించారు. వచ్చే ఎన్నికల్లో తాము 100 సీట్లు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతల నోళ్లు శాశ్వతంగా మూతపడటం ఖాయయని పల్లా తెలిపారు. -
పంచాయతీ పెట్టేద్దాం!
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలను మూడు నెలల ముందే నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది మే నెల చివరినాటికి సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అందుకు సంబంధించి కసరత్తు కూడా ప్రారంభించింది. ముందుగా నిర్వహించాల్సిన అవసరాన్ని తెలుపుతూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013 జూలైలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో గెలిచిన సర్పంచుల పదవీకాలం అదే ఏడాది ఆగస్టు 2 నుంచి ప్రారంభమైంది. ఐదేళ్ల పదవీకాలం వచ్చే ఏడాది (2018) ఆగస్టు ఒకటో తేదీతో ముగియనుంది. ఆలోగా ఎన్నికలు నిర్వహించాలి. జూన్, జూలైలో పాఠశాలలు ప్రారంభమవుతాయి. అదే సమయంలో రైతులు ఖరీఫ్ పనులో బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ తర్వాత మే నెలలో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని, అప్పటికల్లా విద్యార్థుల పరీక్షలు కూడా పూర్తవుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ఇ(3ఎ) ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల పదవీకాలం ముగియక ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుంది. సెక్షన్ 13(2) ప్రకారం గడువు కన్నా మూడు నెలలు ముందుగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారాలున్నాయి. రాజ్యాంగం కల్పించిన ఈ వెసులుబాటు మేరకు గడువు కన్నా ముందుగానే ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదికతో రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకోవడం కోసం ఈసీ షెడ్యూల్ కూడా రూపొందించింది. యంత్రాంగాన్ని సిద్ధం చేయండి వచ్చే ఏడాది మే చివరికల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది. ఈ మేరకు ఈ ఏడాది నవంబర్ 30 నాటికి గ్రామ పంచాయతీల జాబితా ఖరారు చేసి, డిసెంబర్ నాటికి వార్డుల పునర్విభజనను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఏప్రిల్ 16లోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని కోరింది. గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించడం, ముద్రణ పనులను మార్చి 15 కల్లా పూర్తి చేస్తామని తెలిపింది. ఏప్రిల్ 17లోగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, మే 31లోగా ఎన్నికల నిర్వహణను ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు. ఓటర్ల జాబితా తయారు చేసేందుకు అవసరమైన పాలనా యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని, పోలింగ్ సామగ్రి, రవాణా సదుపాయాలను సమకూర్చుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఎన్నికల సంఘం సూచించింది. గ్రామ పంచాయతీల్లో వార్డుల సంఖ్యకు సమానంగా పోలింగ్ స్టేషన్లు ఉండాలని, ప్రతి వార్డులో పోలింగ్ స్టేషన్ తప్పనిసరని పేర్కొంది. 200 మంది ఓటర్లున్న పోలింగ్ స్టేషన్‌కు ఒక ప్రిసైడింగ్ అధికారితోపాటు ఒక పోలింగ్ అధికారి, 400 లోపు ఓటర్లు ఉంటే ఇద్దరు, ఆపైన ఉంటే ముగ్గురు పోలింగ్ అధికారులు తప్పనిసరని స్పష్టంచేసింది. ఈ మేరకు జిల్లా, డివిజన్ స్థాయిలో ఏర్పాట్లు చేసి తమకు నివేదిక పంపాలని సూచించింది. సర్కారు ముందుకొస్తుందా? రాష్ట్రంలో దాదాపు 8,691 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ ఎన్నికలు పార్టీరహితంగా జరగనున్నాయి. కానీ గ్రామాల్లో పూర్తిగా రాజకీయపరంగానే జరుగుతాయి. గ్రామస్థాయిలో పట్టుంటే తప్ప ఎన్నికలను ఎదుర్కోవడం కష్టం. 2013లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో టీఆర్ఎస్ ఉద్యమంలో బిజీగా ఉంది. రాష్ట్రం వచ్చే దశలో ఉన్నందున ఆ పార్టీకి దాదాపు 3 వేలకుపైగా సర్పంచి స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్‌కు కూడా అదే స్థాయిలో స్థానాలు వచ్చాయి. టీడీపీకి దాదాపు 1,500 వరకు వచ్చాయి. మిగిలిన వాటిలో వామపక్షాలు, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు ఉన్నారు. అయితే 2019లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సరిగ్గా ఏడాది ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తుందా లేదా అన్నది ప్రశ్న. వాస్తవంగా ఏ ప్రభుత్వం కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలతో పెట్టుకోదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి ఎన్నికల సంఘం ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రభుత్వం మాత్రం అందుకు సుముఖంగా ఉండే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. అంతేగాక తండాలను పంచాయతీలుగా మార్చుతానని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరికొన్ని పంచాయతీలను విడదీసి కొత్త వాటిని ఏర్పాటు చేస్తానని చెప్పింది. ఈ అంశాలను సాకుగా తీసుకొని ఎన్నికలను వాయిదా వేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతుందని అంటున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో వెయ్యి నుంచి 1,500 వరకు తండాలను పంచాయతీలుగా చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రక్రియకు సమయం తీసుకొని పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసే వీలుందని అంటున్నారు. గ్రామ పంచాయతీల స్వరూపం ఇలా... 200 జనాభా కలిగిన పంచాయతీలు–346 500లోపు జనాభా ఉన్నవి–870 1000లోపు జనాభా ఉన్నవి–1,733 2000లోపు జనాభా ఉన్నవి–3,029 5000లోపు జనాభా ఉన్నవి–3,104 10,000లోపు జనాభా ఉన్నవి–630 10,000కంటే ఎక్కువ జనాభా ఉన్నవి– 122 -
'నాడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు'
న్యూఢిల్లీ: రాష్ట్రాధికారాలను గవర్నర్ హరిస్తున్నారని భావిస్తే కోర్టుకు వెళ్లొచ్చని తెలంగాణ ప్రజాప్రతినిధులకు కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు సూచించారు. విభజన బిల్లులో ఉన్న అంశాలనే కేంద్రం అమలు చేస్తుందని ఆయన తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలో అశోక్‌గజపతి రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాసయ్యే క్రమంలో టీఆర్ఎస్ ఎందుకు ఆనాడు అభ్యంతరం తెలపలేదని తెలంగాణ ప్రతినిధులను ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఉమ్మడి రాజధాని కావడం వల్లే గవర్నర్‌కు అధికారులు ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ సర్వే అంతా గందరగోళమని ఆయన ఆరోపించారు. 1956 స్థానికత అనడం సమంజసం కాదని అన్నారు. ఎవరు ఎక్కడ పుడితే అక్కడే వారు స్థానికులవుతారని అశోక్‌గజపతిరాజు అభిప్రాయపడ్డారు. బేగంపేట విమానాశ్రయంలో కమర్షియల్ ఆపరేషన్స్ చేయలేమని స్పష్టం చేశారు. అలా చేస్తే తెలంగాణకు పెట్టుబడుదారులు ఎవరూ రారని అన్నారు. వైజాగ్, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. -
అభివృద్ధికి సహకారం, సమస్యలపై పోరాటం!
సీపీఎం ఉభయ రాష్ట్రాల కార్యదర్శివర్గాల భేటీలో కారత్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తూనే ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కమిటీలు నిర్ణయించాయి. ఏపీలో ఏర్పడే కొత్త రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోవడం నిరుత్సాహాపరచేదే అయినా, మనోస్థైర్యంతో ముందుకు సాగాలని ఏపీ కమిటీ నిర్ణయిం చగా, ఎంఐఎంతో టీఆర్ఎస్ చర్చలు జరపడాన్ని తెలంగాణ కమిటీ స్వాగతించింది. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఉభయ రాష్ట్రాల నూతన కార్యదర్శివర్గ సభ్యులను ఉద్దేశించి ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ప్రసంగించారు. దేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులను వివరించారు. కేంద్రంలో ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వ తీరు తెన్నులు యూపీఏ ప్రభుత్వ విధానాలకు భిన్నంగా ఉండబోవంటూ, మున్ముందు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేం దుకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేయమని సూచించారు. కారత్ ప్రసంగం తర్వాత వేర్వేరుగా భేటీ అయిన కార్యదర్శివర్గాలు ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను చర్చించాయి. ఎన్నికల్లో ఓటమికి దారి తీసిన పరిస్థితులను సమీక్షించాయి. తెలంగాణలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని, ప్రభుత్వంలో చేరమని ఎంఐఎంను టీఆర్ఎస్ కోరడం హర్షణీయమని తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎంఐఎంను టీఆర్ఎస్ ఆహ్వానిస్తోందంటే ఆ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఉండబోతోందని అర్థమవుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తామన్నారు. కాగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ తనపై చేసిన ఆరోపణలను ఆయన వ్యక్తిగతమైనవిగా భావిస్తున్నట్టు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో చెప్పారు. నారాయణ వ్యాఖ్యలను సీరియస్‌గా పట్టించుకోవడం లేదన్నారు. వామపక్షాల ఐక్యతకు నారాయణ వ్యాఖ్యలు ఆటంకం కాబోవన్నారు. -
కేసీఆర్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం
పరిగి, న్యూస్‌లైన్: తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోనే సాధ్యమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో తెలంగాణ పునర్నిర్మాణం అంశంపై యువకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ బిల్లుపెడితే బీజేపీ మద్దతిచ్చిందన్నారు. పార్లమెంట్లో బిల్లును అడ్డుకునేందుకు నానా తంటాలు పడిన చంద్రబాబు.. ఇప్పుడు తాము లేఖ ఇవ్వటం వల్లే తెలంగాణ వచ్చిందటం హాస్యాస్పదమన్నారు. దశాబ్దాలపాటు వెనకబాటుకు గురైన తెలంగాణకు ప్యాకేజి ఇవ్వాలన్నారు. టీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినంతనే పోరా టం ఆగదని, ఈ ప్రాంత అభివృద్ది కోసం మరి న్ని పోరాటాలు అవసరమన్నారు. కార్యక్రమం లో ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ చైర్మన్ ప్రొఫెసర్ రౌతు కనకయ్య, పరిగి సర్పంచ్ విజయమాల, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ ఎస్పీ బాబాయ్య, మాజీ ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ సురేందర్, పరిగి, కుల్కచర్ల మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు ప్రవీణ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, పరిగి పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధికార ప్రతినిధి సునంద బుగ్గన్నయాదవ్, నాయకులు అనూష, రాములు, సురేష్, రాంచంద్రయ్య పాల్గొన్నా రు. అనంతరం కుల్కచర్ల మండల పరిధిలోని టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వీరిలో టీడీపీ కుల్కచర్ల మం డల అధ్యక్షుడు శివరాజ్ తదితరులు న్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలి అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్‌లో చైర్మన్ స్థానాన్ని సాధించి సత్తా చాటాలని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో గురువారం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ మెతుకు ఆనంద్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, రాష్ట్ర నాయకులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కనకయ్య, నాయ కులు కృష్ణయ్య, యాదగిరి యాదవ్, శంకర్, సత్యనారాయణరెడ్డి, వేమారెడ్డి తదితరులు న్నారు. టీఆర్ఎస్ కండువాతో శుభప్రద్ పటేల్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శుభప్రద్ పటేల్ ఈ సమావేశంలో గులాబీ కండువాతో కనిపించడం చర్చంనీయాంశమైంది, వికారాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా టీఆర్ఎస్నుంచి శుభప్రద్ పోటీ చేస్తున్నారన్న గుసగుసలు వినపించాయి. -
సీమాంధ్రను నట్టేట ముంచారు: వైఎస్ జగన్
* ఓట్లు, సీట్లే ముఖ్యమనుకున్నారు * అడ్డగోలు విభజనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం, ఆవేదన * ప్రధాని చెప్పిన ప్యాకేజీలో స్పష్టత ఏదీ? సీమాంధ్ర ప్రజలు ఎలా బతకాలి? * లోక్‌సభలో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి చీకట్లో బిల్లును ఆమోదించారు * రాజ్యసభలో డివిజన్‌కు పట్టుపట్టినా వినిపించుకోకుండా ఆమోదించారు * మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది * సీమాంధ్రకు ప్యాకేజీ అన్న ప్రకటనలో ఏ ఒక్కదానిపైనా స్పష్టత లేదు * హైదరాబాద్‌ను తీసేసుకున్నారు.. వేరే చోటుకు వెళ్లిపొమ్మని చెప్పారు * మరి కొత్త రాజధానికి ఎంత డబ్బిస్తున్నారు? ఎన్ని రోజుల్లో ఇస్తారు? * సీమాంధ్రలో ప్రతి ఏటా రూ. 15 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉంటుంది * తొలి ఏడాది మాత్రమే ఇస్తారట.. ఆ తర్వాత ప్రతి ఏడాదీ భర్తీ ఎలా? * ప్రతి ఏటా జీతాల కోసం మేము ఎక్కడికెళ్లాలి? ఎవరిని అడగాలి? * సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్యాకేజీతో ఎవరికి ప్రయోజనం? * నదీ జలాల కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు నిధులపై స్పష్టత ఏది? * పోలవరం ప్రాజెక్టుకు ఇన్ని నిధులు ఇస్తున్నామన్న మాటే లేదు * దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ప్రాజెక్టు కనీసం ప్రస్తావన లేదు * ఢిల్లీలో మీడియాతో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ సాక్షి, న్యూఢిల్లీ: మరో పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసీ.. కేవలం ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా, దారుణంగా విభజించటం ద్వారా.. సీమాంధ్ర ప్రాంత ప్రజలను నట్టేట ముంచి తెలంగాణ ప్రాంతంలో పొత్తుల కోసం కాంగ్రెస్ పాకులాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ తీసేసుకుని.. కొత్త చోటుకు వెళ్లిపొమ్మంటున్నారని.. కానీ కొత్త రాజధానికి ఎన్ని నిధులు ఇస్తారు? ఆ నిధులు ఎప్పుడు ఇస్తారు? అన్న ఊసే ఎత్తటం లేదని తప్పుపట్టారు. హైదరాబాద్ తీసేసుకుంటే.. సీమాంధ్రకు ఏటా రూ. 15 వేల కోట్ల లోటు ఏర్పడుతుందని.. కేంద్రం తొలి ఏడాది మాత్రమే భర్తీ చేస్తానని చెప్తే.. ఆ తర్వాత ప్రతి ఏడాదీ ఆ లోటు ఎలా తీరుతుందని సూటిగా ప్రశ్నించారు. జనం ఎలా బతకాలని.. జీతాలు ఎలా చెల్లించాలని జగన్ నిలదీశారు. శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జగన్మోహన్రెడ్డి.. పార్లమెంటు ఉభయసభల్లో విభజన బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం.. సీమాంధ్రకు న్యాయం చేసే ఏ ఒక్క అంశంపైనా స్పష్టత ఇవ్వలేదని ఎండగట్టారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులు, ప్రాజెక్టు నిర్మాణం, కొత్త రాజధానికి నిధులు, కృష్ణా జలాల పంపిణీ తదితర అంశాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేసి.. సీమాంధ్ర ప్రజలను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. సీమాంధ్రను అన్నివిధాలా ఆదుకుంటామంటూ రాజ్యసభలో ప్రధాని మన్మోహన్సింగ్ చేసిన ప్రకటనలోని అంశాలేవీ బిల్లులో పొందుపరుచకపోవటాన్ని ఆయన ప్రశ్నించారు. అధికారపక్షం, ప్రతిపక్షం కలసిపోతే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని ఈ విభజనతో రుజువు చేశారని ఆయన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల వైఖరిని తూర్పారబట్టారు. అసెంబ్లీ తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును.. అన్యాయంగా పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించిన తీరును చూస్తే.. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ‘‘తెలుగు ప్రజలకు తీరని అన్యాయం చేసిన సోనియాగాంధీ, కా్రంగెస్ పార్టీ రానున్న ఎన్నికలే కాదు.. మరో వందేళ్లు రాష్ట్రంలో కాలు పెట్టనివ్వకుండా వారి పార్టీ కాళ్లను నరికేయాలి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మరోమారు రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేస్తామని, న్యాయస్థానాల్లోనూ పోరాడతామని జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. ఈ విభజన అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు, మీడియా, సోషల్ మీడియా తమతో కలసిరావాలని చేతులు జోడించి వేడుకున్నారు. జగన్మోహన్రెడ్డి వివరించిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఇకపై నియంత అంటే సోనియా గుర్తుకు వస్తారు.. ‘‘దేశ చరిత్రలో లేని విధంగా రాష్ట్రవిభజన చేశారు.. ఈ విషయంతో నియంత అంటే ఇకపై సోనియా గుర్తుకొస్తారు. గురువారం రాజ్యసభలో అంతకుముందు లోక్‌సభలో విభజన బిల్లును ఆమోదించిన తీరును చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? అనే అనుమానం కలుగుతోంది. అసలు మనం భారతదేశంలో ఉన్నామా? అనిపిస్తుంది. పదే పది సెకన్లలో లోక్‌సభలో ప్రవేశపెట్టారు... రాష్ట్ర అసెంబ్లీ నిర్మొహమాటంగా విభజనకు వ్యతిరేకమని చెప్తూ బిల్లును తిప్పిపంపింది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టరాదని అసెంబ్లీ చెప్పినా అప్రజాస్వామికంగా బిల్లును పార్లమెంటుకు తీసుకొచ్చారు. మామూలుగా స్పీకర్ బిల్లు ప్రవేశపెట్టటానికి అంగీకరించాలని ఒకమారు, వ్యతిరేకించాలని మరోమారు సభ్యులను అడుగుతారు. దేనికి ఎక్కువ మంది చేతులు ఎత్తి చెప్తే.. దానిప్రకారం బిల్లు ప్రవేశపెట్టటానికి అంగీకారం దొరికిందని, లేకపోతే లేదని చెప్తారు. కానీ అవేమీ చెప్పకుండా లోక్‌సభలో స్పీకర్ పదే పది సెకన్లలో బిల్లును ప్రవేశపెట్టారు. ఇది దారుణమన్నా, వాకౌట్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రసారాలు నిలిపివేసి అంధకారంలో విభజించారు... మొత్తం సీమాంధ్రకు చెందిన 15మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి తప్పించారు. ఇది చాలా దారుణం. సీమాంధ్ర ప్రాంత ఎంపీలే లేకుండా 23 నిమిషాల్లో చర్చ పూర్తిచేసి బిల్లును ఆమోదించారు. దీన్నిచూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని అనిపిస్తోంది. లోక్‌సభలో జరిగిన సన్నివేశాలు బయటకు రాకుండా కేబుల్ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపేసి అంధకారంలో రాష్ట్రాన్ని విభజించారు. ఇది ఏ మేరకు న్యాయం? సభ్యులు అడ్డుపడితే చర్చిస్తారు కానీ.. డివిజన్ పెట్టరా..? ఇక రాజ్యసభలో సభ్యులు అడ్డుపడినా బిల్లుపై చర్చ జరిపిన ప్రభుత్వం.. అదే సభ్యులు అడ్డుపడుతున్నారని చెప్తూ బిల్లుపై డివిజన్, ఓటింగ్ జరుపలేదు. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన తీరు, చర్చ జరిగిన తీరు చాలా బాధ కలిగించింది. కేవలం ఆరుగురు సభ్యులు వెల్‌లోకి వచ్చి అడ్డుపడుతుంటే.. ఆ నెపం చూపించి డివిజన్, ఓటింగ్ పెట్టకుండా నెట్టుకొచ్చారు. అదే ఆరుగురు సభ్యులు అడ్డుపడుతున్నపుడు చర్చను మాత్రం కొనసాగించారు. కానీ డివిజన్, ఓటింగ్‌కు వచ్చేసరికి ఆ ఆరుగురూ అడ్డుపడుతున్నారని డివిజన్ జరుగకుండా చేశారు. దీన్ని నిరసిస్తూ సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి ఇది అన్యాయమని వాకౌట్ చేసినా పట్టించుకోలేదు. ఏ ఒక్క అంశంపైనా ప్రధాని స్పష్టత ఇవ్వలేదు... రాజ్యసభలో పేజీన్నర లేఖను చదివిన ప్రధానమంత్రి అనేక అంశాలపై స్పష్టత ఇవ్వలేదు. ఆయన ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదు. ఒకటిన్నర పేజీ మాత్రమే చదివి ప్రసంగం ముగించారు. ఇది చూస్తే అసలు వీరు మనుషులేనా? అని బాధ కలుగుతోంది. రాష్ట్రాన్ని విడగొడుతున్నారు. హైదరాబాద్ తీసేసుకుంటున్నారు. వేరే చోటికి వెళ్లిపొమ్మంటున్నారు. కొత్త రాజధాన్ని చూసుకోమంటున్నారు. కానీ కొత్త రాజధానికి ఎంత డబ్బిస్తున్నారు? అక్కడి జనం ఎలా బతుకగలుగుతారు? ఎన్ని రోజుల్లో డబ్బులు ఇస్తారు? అనే ప్రస్తావన ఏదీ లేదు. ఇది న్యాయమేనా? ప్రతి ఏటా పెరిగే లోటును ఎలా భర్తీ చేస్తారు? హైదరాబాద్ తీసేస్తే సీమాంధ్రలో ప్రతి ఏటా రూ. 15 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉంటుంది. ఇంతలోటు ఉంటే జీతభత్యాలు సైతం ఇవ్వని పరిస్థితి ఉంటుంది. ఈ విషయం తెలిసీ ప్రతి ఏటా ఇంత లోటును ఎలా భర్తీ చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. కేవలం తొలి ఏడాది మాత్రం లోటును భర్తీ చేస్తామని ప్రధాని లేఖలో చెప్పారు. ఒక్క ఏడాది మాత్రమే రెవెన్యూ లోటును భర్తీ చేస్తే.. ఆ తర్వాత ప్రతి ఏటా లోటును ఎలా భర్తీ చేస్తారు? ప్రతి ఏటా 14 శాతం లోటు పెరుగుతూ పోతుంది. ఒక ఏడాది రెవెన్యూ లోటును ప్రస్తావిస్తే మిగతా లోటును ఎలా భర్తీ చేస్తారో చెప్పే నాథుడే లేడు. జీతాల కోసం మేము ఎక్కడికెళ్లాలి? ఎక్కడ తిరగాలి? ఐదేళ్ల ప్రత్యేక ప్యాకేజీతో ఎవరికి మేలు? సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటి? పరిశ్రమలు పెట్టాలంటే కనీసం మూడు నుంచి ఐదేళ్లు పడుతుంది. అలాంటిది ప్రత్యేక ప్యాకేజీ ఐదేళ్లకు పరిమితం చేస్తే ఆ తర్వాత పరిస్థితి ఏమిటి? ఈ ప్యాకేజీతో ఎవరికి మేలు చేస్తారు? దీనిపై అడిగేవారు లేరు.. అడిగినా పట్టించుకున్న నాథుడే లేడు. కనీసం 15 ఏళ్లు అయినా ఈ ప్యాకేజీ ఇవ్వకుంటే ఎవరికీ ప్రయోజనం ఉండదు. అసలు సభలో ప్రస్తావించిన ప్యాకేజీ అంశాలు బిల్లులో ఎక్కడ ఉన్నాయి? నీటి కోసం రైతులు కొట్టుకుని చావండంటారా? నదీ జలాల కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు నిధులకు సంబంధించి కేంద్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ఇష్టారీతిగా విభజన చేసేసి మీ చావు మీరు చావండన్న ధోరణిలో వ్యవహరించింది. నీళ్లకు సంబంధించి కృష్ణా ఆయకట్టుపై తెలంగాణలోని రెండున్నర జిల్లాల రైతులు, సీమాంధ్రలోని ఎనిమిదిన్నర జిల్లాల రైతులు ఆధారపడి ఉన్నారు. నదిపై ఎగువన ఉన్న మహారాష్ట్ర అవసరాలు తీరాక, ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండితే తప్ప నీరు కిందకు రాని పరిస్థితి ఉంది. వీటిపై ట్రిబ్యునళ్లు, వాటర్ బోర్డులు ఉండగానే నీటి కోసం కొట్టుకునే పరిస్థితి ఉంటే.. మధ్యలో మరో రాష్ట్రం వస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీరెక్కడినుంచి ఇస్తారు? నో ట్యాంపర్ జోన్ పెట్టాలన్న ఇంగితజ్ఞానం లేదు. ఇక పోలవరానికి సంబంధించి ప్రాజెక్టుకు ఇన్ని నిధులు ఇస్తున్నామన్న మాటే లేదు. ఈ విషయంలో స్పష్టత శూన్యం. కృష్ణా ఆయకట్టు స్థిరీకరణకు దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ప్రాజెక్ట్ చాలా ముఖ్యం. దీనిపై కనీసం ప్రస్తావన లేదు. నాయకుడంటే ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేవాడా? చంద్రబాబు సాక్షాత్తూ పార్లమెంటులో బిల్లు అన్యాయంగా ఉంది అంటారు. సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు బిల్లు అన్యాయంగా ఉంది, వ్యతిరేకిస్తాం అంటారు. అదే పార్టీకి చెందిన నామా నాగేశ్వరరావు, రమేశ్రాథోడ్లు లోక్‌సభలో బిల్లు చాలా బాగుందని చెప్పి ఓటువేస్తారు. మొదటి ఓటు తామే వేశామని చెప్పుకుంటారు. రాజ్యసభలోనూ అంతే. ఒకవైపు బిల్లు బాగోలేదని చెప్పిస్తారు. మరోవైపు తెలంగాణ ప్రాంత ఎంపీలు దేవెందర్‌గౌడ్, గుండు సుధారాణిలు బిల్లుకు అనుకూలంగా ఓటేస్తారు. రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం, విద్వేషాలు పెంచడం నాయకత్వమా? -
రాజ్యసభలో నాటకీయంగా ఆమోదం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను ఈ రోజు రాజ్యసభలో నాటకీయంగా ఆమోదించారు. లోక్‌సభలో ఎటువంటి చర్చ లేకుండా ఆమోదించడంతో కాంగ్రెస్‌తోపాటు బిజెపి కూడా పలు విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అందువల్ల బిల్లుకు కొన్ని సవరణలు చేసి, సభ్యులు చర్చించేందుకు అవకాశం ఇచ్చి, ఓటింగ్ పెట్టమన్నా పెట్టకుండా మూజువాణి ఓటుతో తంతును నాటకీయంగా ముగించారు. బిల్లుకు సంబంధించి ఉదయం నుంచి పలు పార్టీలకు చెందిన సభ్యుల నిరసనలు - నినాదాలు - అరుపులు -కేకలు - గందరగోళం - ఘర్షణలు.... మధ్యలోనే రాజ్యసభ జరిగింది. ఆ గందరగోళ పరిస్థితులలోనే సభ వాయిదాలుపై వాయిదాలు పడుతూ బిల్లు ప్రవేశం - బిల్లుకు వ్యతిరేకంగా సభ్యుల నోటీసులు ఇవ్వడం - వాటిని డిప్యూటీ చైర్మన్ కురియన్ చదవడం - కేంద్ర హొం మంత్రి బిల్లును చదివడం - చర్చ - ప్రధాని ప్రకటన - చర్చ ముగింపు - బిల్లు ఆమోదం.. అన్నీ జరిగిపోయాయి. రాజ్యసభలో ఏం జరిగిందంటే... * గందరగోళం మధ్యలో తెలంగాణ బిల్లు సభకు వచ్చిందని డిప్యూటీ చైర్మన్ కురియన్ సభలో ప్రకటించారు. * బిల్లు రాజ్యాంగ విరుద్దంగా ఉందని, బిల్లుకు రాజ్యాంగ బద్దతలేదని - బిల్లును తిరస్కరించాలని ....పలువురు సభ్యులు నోటీస్‌లు ఇచ్చారు. * సభ్యులు ఇచ్చిన నోటీసులను డిప్యూటీ స్పీకర్ చదివి వినిపించారు. * సభలో ప్రతిపక్ష బిజెపి నేత అరుణ్ జైట్లీ ఇచ్చిన నోటీస్‌ను డిప్యూటీ చైర్మన్ కురియన్ తప్పుగా చదివి, ఆ తరువాత సవరించుకున్నారు. * పలువురు సభ్యులు నిరసన-అరుపులు-కేకల మధ్యలోనే కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు డిప్యూటీ చైర్మన్ అనుమతి ఇచ్చారు. . * బిల్లుకు రాజ్యాంగబద్దతలేదని సభ్యులు నినాదాలు చేస్తుండగా - గందరగోళం మధ్యలోనే షిండే బిల్లును చదివేశారు. * సీమాంధ్ర, తెలంగాణ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. * విభజనపై టిడిపి సభ్యులు రెండుగా చీలి అనుకూల - వ్యతిరేక ప్లకార్డులు ప్రదర్శంచారు. * తెలంగాణ బిల్లుకు అనుకూలంగా గుండు సుధారాణి, అక్రమ బిల్లు కాదు, రాజ్యాంగబద్దమైన బిల్లు కావాలని సుజనాచౌదరి నినాదాలు చేశారు. * సేవ్ ఆంధ్రప్రదేశ్ అని సీఎం రమేష్ ప్లకార్డు పట్టుకున్నారు. తెలంగాణ కావాలని అదే టీడీపీ పేరుతో గుండు సుధారాణి ప్లకార్డు పట్టుకున్నారు. * ప్యానల్ చైర్మన్ హొదాలో అనూహ్యంగా రేణుకా చౌదరి కొద్దిసేపు సభ నిర్వహించారు. * బిల్లు చదివిన తరువాత హొగయా.. అని షిండే డిప్యూటీ ఛైర్మన్‌కు చెప్పారు. * బిల్లుకు వ్యతిరేకత తెలుపుతూ డిఎంకె, జెడియు సభ్యులు రాజ్యసభ నుంచి బయటకు వెళ్లిపోయారు. * లోక్‌సభలో అప్రజాస్వామికంగా ఆమోదించన బిల్లును రాజ్యసభకు తెచ్చారని ఇతర రాష్ట్రాల సభ్యులు ప్లకార్డులు పట్టుకున్నారు. * బిల్లుకు వ్యతిరేకంగా చైర్మన్ పోడియం వద్ద నిలబడి కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో స్పృహ తప్పి పడిపోయారు. * సభ జరిగినంతసేపూ పలువురు సభ్యులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. * దుష్ట సంప్రదాయాలను ప్రారంభించారని ఎస్పీ, తృణమూల్, జేడీయూ సభ్యులు మండిపడ్డారు. * బిల్లుపై చర్చకు డిప్యూటీ ఛైర్మన్ అనుమతించారు. * గందరగోళం మధ్యలోనే అన్ని పార్టీల సభ్యులు బిల్లుపై, రాష్ట్ర విభజనపై తమతమ అభిప్రాయాలు చెప్పారు. * సభ్యుల ప్రసంగాల తరువాత చివరగా ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటన చేశారు. * ప్రధానికి రక్షణగా కాంగ్రెస్ సభ్యులు నిలబడ్డారు. * మాయావతి, ప్రధాని ప్రసంగాలను తృణమూల్ సభ్యులు అడ్డుకున్నారు. * తెలంగాణ బిల్లుపై చర్చ ముగిసిందని డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు. * ఓటింగ్‌కు పట్టుబట్టిన వెంకయ్య నాయుడు - అంగీకరించని కురియన్ * క్లాజులవారీగా బిల్లుపై మూజువాణి ఓటింగ్ జరిగింది. * చివరగా బిల్లు సభ ఆమోదం పొందిందని డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు. * సభ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. సభలో ఎవరేమన్నారంటే... * ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్: అన్ని ప్రాంతాల అభివృద్దికి కట్టుబడి ఉన్నాం. హైదరాబాద్ పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని. అయిదు సంవత్సరాలపాటు సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి . బుంధేల్ఖండ్ తరహాలో సీమాంధ్రకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు. రెండు రాష్ట్రాలకు పన్ను రాయితీ. ఆదాయం, ఆస్తులు, సిబ్బంది పంపిణీ తరువాతే రాష్ట్ర విభజన. పోలవరం ప్రాజెక్ట్, పునరావాస బాధ్యతలను కేంద్రమే చేపడుతుంది. * బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు: తెలంగాణకు సమ్మతమే, అయితే సీమాంధ్రకు న్యాయం జరగాలి. * ప్రతిపక్ష బిజేపి నేత అరుణ్ జైట్లీ : రాజ్యాంగ సవరణలు లేకుండా గవర్నర్‌కు అధికారాలు ఎలా ఇస్తారు? గవర్నర్ కేంద్రానికి ప్రతినిధి మాత్రమే. లోపాల బిల్లును ఎందుకు ఆమోదించాలి? * సిపిఎం సభ్యుడు సీతారామ్ ఏచూరి: రాష్ట్ర విభజనకు మేం వ్యతిరేకం. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని చీల్చడం దారుణం. * కేంద్ర మంత్రి చిరంజీవి: కాంగ్రెస్ నిర్ణయానికి కట్టబడి ఉంటాను. ప్రజల ఆవేదనను కూడా పట్టించుకోవాలన్నదే నా విజ్ఞప్తి. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏమాత్రం చర్చ జరగకుండా ఆమోదించారు. అది చాలా దురదృష్టకరం. * బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి : తెలంగాణ బిల్లుకు మేం అనుకూలం. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని సరికాదు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అంటే చాలా ఎక్కువ కాలం. * కనిమొళి: అసెంబ్లీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.సమైక్య స్పూర్తిని దెబ్బతీశారు. *కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాన కారణమైతే, బిల్లు ఆమోదం పొందడానికి సుష్మా స్వరాజ్ కూడా ఒక కారణమన్నారు. * జేడీయూ సభ్యుడు ఎన్.కె.సింగ్ : బిల్లులో ఆర్థికపరమైన ప్యాకేజీలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ లేదు. లక్ష్యాలేమిటో, ఉద్దేశాలేమిటో చెప్పకుండా, రాజకీయ కారణాలతో రాష్ట్ర విభజనకు పూనుకోవడం ఎంత మాత్రం తగదు. * లోక్ జనశక్తినేత రామ్‌విలాస్ పాశ్వాన్: తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తున్నాం. యూపీని కూడా విభజించాలి. * ఏజీపీ, అస్సాం సభ్యుడు బీరేంద్ర ప్రసాద్ బైశ్య: బిల్లు రాజ్యాంగ విరుద్ధం. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటుకు ఎలా తీసుకు వస్తారు? దేశం సమైక్య స్ఫూర్తిని తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. ఈ బిల్లును ఆమోదించి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని చంపొద్దు. రేపు ఏం జరిగినా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది తప్పుడు విధానంతో వచ్చిన బిల్లు దయచేసి బిల్లును అడ్డుకోండి. * శిరోమణి అకాలీదళ్ సభ్యుడు నరేష్ గుజ్రాల్ : తెలుగు ప్రజలతో ఆడుకున్నారు. బిల్లు తీరు చూస్తే ఏపీలో హింస పొంచి ఉన్న సూచనలు కనపిస్తున్నాయి. చండీగఢ్ ఐదేళ్ల రాజధాని అన్నారు. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. కొన్నిరోజుల్లో ఇంటికెళ్లబోయే కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. * సీపీఎం నేత డి.రాజా: తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తున్నాం. చిన్నరాష్ట్రాలకు మేం అనుకూలం. విభజన తీరు వ్యవహారంలో కేంద్రం సరిగ్గా వ్యవహరించలేదు. * ఎన్సీపీ సభ్యుడు డాక్టర్ జనార్దన్ : బిల్లుకు మేం మద్దతు పలుకుతున్నాం. రాంగోపాల్ సింగ్ యాదవ్ (ఎస్పీ): పెద్దరాష్ట్రాలు జాతీయ సమైఖ్యతకు చిహ్నం. నెహ్రూ, ఇందిరలు విభజనను వ్యతిరేకించారు. * శశిభూషణ్ బెహరా(బీజేడీ, ఒడిశా) పోలవరం ప్రాజెక్టుకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వ్యతిరేకం. ఇప్పటికే ఇది కోర్టు పరిధిలో ఉంది. రాజ్యాంగ, న్యాయపరమైన అడ్డంకులు బిల్లుకు చాలా ఉన్నాయి. -
తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను సభ్యుల ఆందోళన మధ్య రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. ఉదయం నుంచి అనేక సార్లు వాయిదాలు పడుతూ సభ సాగింది. పలువురు సభ్యుల ఆందోళన, నిరసన, అరుపులు, కేకలు, నినాదాల మధ్యనే కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు వ్యతిరేకంగా, బిల్లుకు రాజ్యాంగ ప్రాతిపదిక లేదని, బిల్లును తిరస్కరించాలని పలువురు సభ్యులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను సభ డిప్యూటీ చైర్మన్ కురియన్ చదివి వినిపించారు. డిప్యూటీ చైర్మన్ అనుమతితో పలువురు సభ్యులు నిరసన-అరుపులు-కేకల మధ్యలోనే కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే బిల్లును చదివి వినిపించారు. ఆ తరువాత బిల్లుపై చర్చ జరిగింది. చర్చలో వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, చిరంజీవి, సీతారాం ఏచూరి, రాజా, మాయావతి తదితరులు మాట్లాడారు. బిల్లును పలు విపక్షాలు వ్యతిరేకించాయి. చివరిగా ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సభలో ఒక ప్రకటన చేశారు. తెలంగాణ బిల్లుపై చర్చ ముగిసిందని డిప్యూటీ చైర్మన్ ప్రకటించిన తరువాత క్లాజులవారీగా నాటకీయంగా మూజువాణి ఓటింగ్ జరిగింది. ఓటింగ్‌కు వెంకయ్య నాయుడు పట్టుపట్టినా డిప్యూటీ చైర్మన్ అంగీకరించలేదు. చివరకు సభ్యుల గందరగోళం మధ్య బిల్లు ఆమోదం పొందినట్లు కురియన్ ప్రకటించారు. ఆ తరువాత సభ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. -
గందరగోళం మధ్య ప్రధాని ప్రకటన
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)కు సంబంధించి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఈరోజు రాజ్యసభలో సభ్యుల ఆందోళన మధ్య ఒక ప్రకటన చేశారు. మన్మోహన్ సింగ్ ప్రసంగాన్ని విపక్ష నేతలు అడ్డుకున్నారు. సభ్యుల గొడవ కారణంగా ప్రధాని ప్రకటన వినిపించలేదు. ప్రధాని ఒక పక్క మాట్లాడుతుంటే కొందరు సభ్యులు తెలంగాణ బిల్లు పేపర్లు చించిపారవేశారు. అన్ని ప్రాంతాల అభివృద్దికి కట్టుబడి ఉన్నామని ప్రధాని చెప్పారు. హైదరాబాద్ పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. అయిదు సంవత్సరాలపాటు సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి - బుంధేల్ఖండ్ తరహాలో సీమాంధ్రకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామిన చెప్పారు. రెండు రాష్ట్రాలకు పన్ను రాయితీలు ప్రకటించారు. ఆదాయం, ఆస్తులు, సిబ్బంది పంపిణీ తరువాతే రాష్ట్ర విభజన జరుగుతుందని ప్రధాని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్, పునరావాస బాధ్యతలను కూడా కేంద్రమే చేపడుతుందన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి పది సంవత్సరాలు కావాలని వెంకయ్యనాయుడు కోరారు. కొత్త రాజధాని పేరు ప్రకటించాలని కూడా బిజెపి కోరింది. బిజెపి డిమాండ్లను అంగీకరించలేదు. ప్రధాని ప్రకటన చేసే సమయంలో ఆయన చుట్టూ కాంగ్రెస్ ఎంపిల రక్షణగా నిలిచారు. -
మరిన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి:మాయావతి
న్యూఢిల్లీ: ఎస్సార్సీ వేసి మరిన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై రాజ్యసభలో ఆమె ప్రసంగించారు. యుపిని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్నారు. చిన్న రాష్ట్రాల డిమాండ్ చాలా కాలంగా ఉందని చెప్పారు. మహారాష్ట్ర నుంచి విదర్భను వేరు చేయాలని కోరారు. తెలంగాణ బిల్లుకు తమ పార్టీ అనుకూలం అని చె్ప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని సరికాదన్నారు. అలా అయితే ఘర్షణపూరిత వాతావరణం నెలకొంటుందని చెప్పారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అంటే చాలా ఎక్కువ కాలం అన్నారు. గతంలో మూడు రాష్ట్రాలకు కొత్త రాజధానులను ఏర్పాటు చేశారని చెప్పారు. సీమాంధ్రకు, అలాగే తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేయాలన్నారు.రాజధాని ఏర్పాటుకు కేంద్రం నిధులు సమకూర్చాలని కోరారు. మాయావతి ప్రసంగానికి తృణమూల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
చిరంజీవి ప్రకటనను ఎలా చూడాలి?
న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై చిరంజీవి ప్రసంగాన్ని బిజెపి, పలు ఇతర పార్టీల సభ్యులు తప్పుపట్టారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మండలి నిర్ణయాన్ని మంత్రిగా ఉన్న చిరంజీవి ఎలా వ్యతిరేకిస్తారని ప్రతిపక్ష బిజెపి నేత అరుణ్ జైట్లీ విమర్శించారు. చిరంజీవి ప్రకటను ఎలా చూడాలని అడిగారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి అవలంభిస్తోందన్నారు. చిరంజీవి ఎవరి తరపున మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రిగా ఉన్న చిరంజీవి ఎలా వ్యతిరేకిస్తారని అడిగారు. ఆయన ఏ హొదాలో మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. మంత్రిగా ఆయన సొంత అభిప్రాయాలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఓ మంత్రిగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా సవాల్ చేస్తారని అడిగారు. ఆ సవాల్ చేయాలనుకుంటే మందు మంత్రి పదవికి రాజీనామా చేయాలని జైట్లీ చెప్పారు. -
వ్యూహాలు మార్చిన సోనియా, బిజెపి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) నిన్న లోక్‌సభలో ఆమోదించడంతో సీమాంధ్రలో కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా పెల్లుబికిన నిరసనల నేపధ్యంలో అటు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇటు బిజెపి ఆలోచనలో పడ్డాయి. రాజ్యసభలో బిల్లు ఆమోదించే విషయంలో కాంగ్రెస్, బిజెపి రెండూ తమ తమ వ్యూహాలను మార్చుకున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితోపాటు కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అనేక మంది కాంగ్రెస్ నేతలు వసలబాట పట్టారు. సీమాంధ్రలో వేల సంఖ్యలో సోనియా గాంధీ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. సీమాంధ్ర ప్రజలు సోనియా పేరెత్తితే మండిపడుతున్నారు. ఎటువంటి సవరణలు ఆమోదించకపోయినా బిల్లుకు బిజెపి మద్దతు తెలపడంతో ఆ పార్టీపై కూడా సీమాంధ్రులు మండిపడుతున్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మలను కూడా తగులబెట్టారు. బిజెపి, కాంగ్రెస్‌తో కుమ్మక్కైందన్న తీవ్ర విమర్శల నేపధ్యంలో ఆ పార్టీ కూడా కొత్త ఆలోచనలు చేయడం మొదలు పెట్టింది. రెండు పార్టీలు ఇప్పుడు బిల్లులో సవరణలకు తుదిరూపం ఇస్తున్నారు. నిన్న లోక్‌సభలో ఎటువంటి అభ్యంతరాలు లేకుండా బిల్లును ఆమోదించిన బిజెపి ఈ రోజు రాజ్యసభలో ఆమోదించడానికి అనేక అభ్యంతరాలు తెలిపింది. బిల్లు ఆమోదానికి రాజ్యాంగ సవరణతోపాటు, బిల్లుకు కూడా పలు సవరణలు ప్రతిపాదించింది. తమ డిమండ్లను ఆమోదించాలని పట్టుపడుతోంది. ఈ నేపధ్యంలో ఈరోజు బిల్లుపై చర్చ జరగకుండానే రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఈ రోజు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తో రాజ్యసభలో ప్రతిపక్ష బిజెపి నేత అరుణ్ జైట్లీతోపాటు ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే, సోనియా గాంధీ రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్ కూడా పాల్గొన్నారు. సీమాంధ్రకు 10వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాలని బిజెపి నేతలు డిమాండ్ చేశారు. అలాగే 32 సవరణలను కూడా ప్రతిపాదించారు. పలు అంశాల విషయంలో బిజెపి పట్టుపడుతోంది. బిజేపి డిమాండ్లు అన్నింటినీ అంగీకరించడానికి కేంద్రం సిద్దంగా లేదు. దాంతో ఈ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. రేపటి లోపల బిజెపి డిమాండ్లలో కొన్నింటినైనా కేంద్రం అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. బిజెపి ఆ విధంగా సీమాంధ్రులకు దగ్గర కావాలని చూస్తుంటే, ఇక సోనియా గాంధీ కూడా ప్రధాని ముందు ఒక ప్రధాన డిమాండ్‌ను పెట్టారు. సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని ఆమె ప్రధానిని కోరారు. సోనియా ఆదేశిస్తే ప్రధాని అమలు చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ సోనియా ప్రధానికి విజ్ఞప్తి చేయడం ఏమిటని అనుకుంటున్నారా? ఆమె అలా కోరిన తరువాత, ప్రధాని ఆమోదిస్తే ఆమెపై సీమాంధ్రుల ఆగ్రహం కొంతవరకు తగ్గిద్దని వారి భావన. ఆ విధంగా సీమాంధ్ర ప్రజలను, నేతలను శాంతింపచేజాలని చూస్తున్నారు. సోనియా కోరారంటే సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడానికి కేంద్రం అంగీకరించినట్లుగానే మనం భావించాలి. రేపు ఉదయం జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలో సోనియా ప్రతిపాదనను ఆమోదించే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రం నుంచి సీమాంధ్రకు భారీ స్థాయిలో నిధులు అందే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే, బిల్లుపై రాజ్యసభలో చర్చ జరపాలనుకుంటున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి రాజీవ్‌శుక్లా చెప్పారు. బిల్లులో సవరణలన్నిటిపై చర్చ జరుపుతామన్నారు. ఆ తర్వాతే తెలంగాణ బిల్లును ఆమోదిస్తామని చెప్పారు. రేపు రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఈ లోపల బిల్లు విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
మిన్నంటిన సంబురం
వరంగల్, న్యూస్‌లైన్ : అరవై ఏళ్ల కల సాకారమయ్యే క్షణం... అందరి కళ్లల్లో ఒక ఆత్మసంతృప్తి.... పోరాటాలు, త్యాగాలతో దారులు వేశాం... బలిదానాల పీఠమెక్కాం... పాలకులు కనికరిం చారు... ఫలితం సాధించాం... తెలంగాణ సాక్షాత్కరిం చింది. సగటు తెలంగాణ ఉద్యమకారుడిలో మంగళవారం కన్పించిన భావోద్యోగమిది. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో ఓరుగల్లులో తెలంగాణ సంబురాలు అంబరాన్నంటారుు. జిల్లావ్యాప్తంగా తెలంగాణ నినాదాలు మార్మోగాయి. తెలంగాణవాదులు భావోద్వేగానికి గురై ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సంబరాల్లో పాలుపంచుకున్నారు. త్యాగధనులను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టారు. వయో భేదం వీడి.. ఇళ్లను విడిచి రోడ్డెక్కారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎల్డీ, ఎంఎస్పీ, వివిధ ఉద్యోగ, న్యాయవాద, ప్రజా సంఘాలు, టీపీఎఫ్, టీఎన్ఎస్, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. కళాకారుల ఆటపాటలతో హోరెత్తించగా, యువకులు నృత్యాలు చేస్తూ... రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. తొలిసారిగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ సాగింది. కాకతీయ యూనివర్సీటీ ఆనందోత్సాహాలతో మునిగితేలింది. కేయూ జేఏసీ, అధ్యాపకులు, సిబ్బంది కేరింతలు కొడుతూ, నృత్యాలు చేశారు. నిట్, ఆర్ట్స్, లా కళాశాల విద్యార్థులు ర్యాలీలతో హోరెత్తిం చారు. ఉపాధ్యాయులు, కళాకారులు ర్యాలీలు చేశారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, ములుగు, పరకాల, ఏటూరునాగారం, నర్సంపేట, మహబూబాద్, డోర్నకల్, తొర్రూరు, పాలకుర్తి, మరిపెడ సెంటర్లు తెలంగాణవాదులతో నిండిపోయాయి. హన్మకొండ అమరవీరుల స్థూపం వద్ద భారీస్థాయి కాగ డా వెలిగించారు. అమరవీరులకు తెలంగాణ వాదులు ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ, కాంగ్రెస్ జిల్లా కార్యాలయాల్లో కార్యకర్తలు సంబ రాలు జరుపుకున్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. సీపీఐ నాయులు, కార్యకర్తలు సంబరాల్లో పాలుపంచుకున్నారు. హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద న్యాయవాదులు, విద్యుత్, ఉద్యోగ సంఘాల నాయకులు బ్యాండ్ మేళాలతో సంబరాలు చేసుకున్నారు. పోచమ్మమైదాన్, వరంగల్ చౌరస్తా, హన్మకొండ సెంట ర్లలో అన్ని పక్షాల నాయకులు, బీసీ జేఏసీ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఎంజీఎం, కేఎంసీ వద్ద సంబరాలు జరుపుకున్నారు. అమరవీరుల స్థూపాలకు పాలాభిషేకం చేశారు. హన్మకొండ ఏకశిల పార్కు వరకు తెలంగాణవాదులు ర్యాలీగా వచ్చి... తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
నియంత అంటే హిట్లర్ కాదు సోనియా: ఈరోజు బ్లాక్‌డే
న్యూఢిల్లీ: నియంత అంటే మనందరికి హిట్లర్ గుర్తుకు వచ్చేవాడని, ఇక ఈ రోజు నుంచి నియంత అంటే సోనియా గాంధీ గుర్తుకు వస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. ఈ రోజు లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) ఆమోదం పొందిన తీరును తప్పుపట్టారు. పాకిస్తాన్లో కూడా ఈ రకంగా ఎవరూ చేయరన్నారు. ఈరోజును బ్లాక్‌డే ప్రకటించారు. పార్లమెంటులో జరిగిన తీరును చూసిన తరువాత నియంతగా సోనియా గుర్తుకు వస్తారని చెప్పారు. ఈ నియంత పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో రేపు బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఒక బిల్లు ఆమోదం పొందడం కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం ఏ స్థాయికి దిగజారిపోతారో ఈ రోజు అర్ధమైందన్నారు. కనీవిని ఎరుగని విధంగా అసెంబ్లీ వ్యతిరేకంగా తీర్మానం చేసినా, లోక్‌సభలో బిల్లు ప్రవేశ పెట్టారన్నారు. ఒక బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడు సభ్యులు ఆమోదిస్తే చేతులు పైకెత్తండి లేకపోతే చేతులు కిందనే ఉంచండి అనే పార్లమెంటు సంప్రదానికి విరుద్దంగా పదేపది సెకండ్లలో బిల్లును ఆమోదించారని ఆవేదన వ్యక్తం చేశారు. నియంతలా బిల్లును ఆమోదించారన్నారు. మనం భారతదేశంలో ఉన్నామా? ఈ పోకడ సరైనదేనా? అని ప్రశ్నించారు. తమని సభలోకి పోనివ్వలేదని చెప్పారు. ఈ బిల్లు ఆమోదం పొందడానికి ప్రధాన కారణం సోనియా గాంధీ అయితే, రెండవ వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పారు. టిడిపికి చెందినవారు బిల్లుకు అనుకూలంగా ఓటువేశారని తెలిపారు. బిల్లు ఆమోదం పొందడానికి కాంగ్రెస్, బిజెపి, టిడిపి బాధ్యత వహించాలన్నారు. -
కాంగ్రెస్ ఎంపిలకు విప్ జారీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులకు విప్ జారీ చేశారు. కాంగ్రెస్ ఎంపిలు వారం రోజులపాటు సభకు విధిగా హాజరుకావాలని తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు సభకు తప్పనిసరిగా హాజరుకావాలని మూడు లైన్లు ఉన్న ఆ విప్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై రేపు లోక్‌సభలో చర్చ జరుగుతుంది. యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రేపు లోక్‌సభలో మాట్లాడే అవకాశం ఉంది.