
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరుపై ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు పూనకం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్, ఉత్తమ్ కుమార్‌ల కంటే కేటీఆర్ స్థాయి పెద్దదన్నారు. సిరిసిల్ల నుంచి సిలికాన్ వ్యాలీ వరకు కేటీఆర్‌కు ఓ స్ధాయి ఉందని తెలిపారు. కేసీఆర్ కాలి గోటికి కాంగ్రెస్ నేతలు సరిపోరన్నారు.
ఒకప్పుడు సోనియా బలిదేవతన్న రేవంత్ రెడ్డికి ఇపుడు ఆమె దేవత అయిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ నేతలు దద్దమ్మలే అని అరోపించారు. వచ్చే ఎన్నికల్లో తాము 100 సీట్లు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతల నోళ్లు శాశ్వతంగా మూతపడటం ఖాయయని పల్లా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment