Palla Rajeshwar Reddy
-
భూ భారతి, ధరణిపై అసెంబ్లీలో మాటల యుద్దం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీలో ధరణి, భూ భారతి అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య చర్చ జరుగుతోంది. దీంతో, సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో నినాదాలు కొనసాగుతున్నాయి.ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్బంగా ధరణి, భూ భారతి అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..‘భూములపై రైతులకు హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే. భూ రక్షణ కోసం ఏదైనా జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందే. కబ్జా కాలం ఇచ్చి పేదలకు హక్కులు ఇచ్చాం. ధరణితో పేదల భూములను బీఆర్ఎస్ లాక్కుంది. భూస్వాముల చట్టం ధరణి. లక్షల ఎకరాల భూములు వివాదంలో ఉండడానికి కారణం బీఆర్ఎస్.రైతుల హక్కులను కాల రాశారు.పల్లా రాజేశ్వర్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్ భూములపై హక్కులు కల్పిస్తూ వస్తోంది. దున్నేవాడితే భూమి కదా సాయుధ పోరాట నినాదం. ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టమే ధరణి. బంగాళాఖాతంలో ధరణిని వేస్తామని చెప్పాం. బంగాళాఖాతంలో వేశాం.. కొత్త చట్టం తెచ్చాం. జమాబందీ వల్ల లాభం తప్ప నష్టం లేదు. ప్రతీ సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి.భూ భారతి కాదు.. భూ హారతి: పల్లా రాజేశ్వర్ రెడ్డిభూ భారతిపై కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తే.. మేము కూడా ధరణిపైనే ఎన్నికలకు వెళ్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది భూ భారతి కాదు భూ హారతి. జమాబంది పేరుతో మరో దుకాణం తెరిచింది. ఇప్పుడు జమాబంది ఎందుకో ప్రభుత్వం చెప్పాలి.భవిష్యత్‌లో భూభారతిపైనే ఎన్నికలకు వెళ్తాం: పొంగులేటిపల్లా రాజేశ్వర్‌రెడ్డి.. అసత్యాన్ని సత్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే వారిని ఓడించారు. ధరణి రెఫరెండంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాం.. ప్రజలు తీర్పు ఇచ్చారు. ఎవరిని ఆదరిస్తారో చూద్దాం. ధరణితో బీఆర్ఎస్ సభ్యులు ఇబ్బంది పడ్డారు. ధరణి తప్పిదాలను బీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకోవడం లేదు. అసత్యాన్ని సత్యాన్ని చేసేందుకు పల్లా ప్రయత్నం చేస్తున్నారు. 2020న ధరణి చట్టం తీసుకువచ్చి.. 2023 వరకు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని చట్టంలోనే పెట్టాం. -
పల్లా వర్సెస్ మంత్రులు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం శాసనసభలో జరిగిన చర్చలో హామీల అమలుతోపాటు పాలనలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి దాడి చేయగా.. ఆయన చెప్పినవన్నీ అవాస్తవాలేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ప్రతిదాడి చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి వరుస ఆరోపణలు చేస్తుండగా మంత్రులు పదేపదే కల్పించుకుని సమాధానాలిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీల అమలుపై బీఆర్ఎస్ నేతలు వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. పల్లా సొంత నియోజకవర్గం జనగామలో 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.124 కోట్ల రుణమాఫీ చేస్తే.. తాము మూడు నెలల్లోనే రూ.263 కోట్లు మాఫీ చేశామన్నారు. మా సీఎం కూడా మీ సీఎంలాగే ఉండాలా?: భట్టి సీఎం రేవంత్‌రెడ్డి వద్దే విద్యా శాఖ ఉండడంతో పర్యవేక్షణ కొరవడిందని, 2 లక్షలమంది విద్యార్థులు డ్రాపౌట్ అయ్యా రని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపణలు చేయగా, భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ఖండించారు. మీ సీఎం (కేసీఆర్) తరహాలోనే మా సీఎం ఉండాలని ఊహించుకుంటే ఎలా? అని మండిపడ్డారు. సీఎం రేవంత్ డీఎస్సీతో 11వేల టీచర్ పోస్టులను భర్తీ చేశారని, 22వేల మంది టీచర్లకు పదోన్నతులు ఇచ్చారని, 36 వేల మంది టీచర్లకు బదిలీలు కల్పించారన్నారు. గత ప్రభుత్వం వర్సిటీలను గాలికి వదిలేస్తే, 12 మంది వీసీలను నియమించారన్నారు. మహిళా వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడంతోపాటు నిర్మాణానికి రేవంత్ రూ.540 కోట్లు మంజూరు చేయాలని ఆదేశించారన్నారు. గత ప్రభుత్వం మీకు (పల్లాకు), ఇతరులకు ప్రైవేటు వర్సిటీలను ధారాదత్తం చేస్తే వాటికి దీటుగా తాము ప్రభుత్వ వర్సిటీలను తీర్చిదిద్దుతున్నామన్నారు. బీఆర్ఎస్ ధోరణితోనే అన్యాయం: మంత్రి ఉత్తమ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ధోరణితోనే రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో తీరని నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యారోపణలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాల సామర్థ్యం పెంపు విషయంలో ఏపీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందన్నారు. తాము కేంద్రం, కృష్ణా బోర్డుతో కొట్లాడి సాగర్ కుడి కాల్వకు ఏపీ తీసుకుంటున్న జలాలను 10వేల నుంచి 5వేల క్యూసెక్కులకు తగ్గించామన్నారు. మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఒక్కసారి కూడా కాకతీయ ఉత్సవాలు నిర్వహించని బీఆర్ఎస్ వాళ్లు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి రుణమాఫీ చేశామని, రైతులందరికీ బోనస్ చెల్లించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహిళా జర్నలిస్టు ‘ఎక్స్’లో పెట్టిన వీడియోలోని భాషను చూసి కూడా ఆమెను సమరి్థస్తారా? అని పల్లా రాజేశ్వర్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 100% రుణమాఫీ జరిగితే ముక్కును నేలకు రాస్తా: పల్లా రైతు రుణమాఫీ 50 శాతంలోపే జరిగిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. జనగామతోపాటు భట్టి నియోజకవర్గం మధిరలోని ఏ ఒక్క గ్రామంలోనైనా 100శాతం రుణమాఫీ జరిగితే తాను ముక్కును నేలకు రాసి, రాజీనామా చేస్తానని ప్రకటించారు. 27 శాతం మంది రైతులకే బోనస్ లభించిందని, ఏడాదిలో 564 మంది రైతులు, 116 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, గురుకులాల్లో 83 మంది విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు. కరెంట్ కోతలపై ప్రశ్నించిన మహిళా జర్నలిస్టుపై కేసు పెట్టారని, అరెస్టైన జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌ని విడుదల చేయాలన్నా రు. కాకతీయ కళాతోరణం, చారి్మనార్‌ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తే పోరాడతామన్నారు. తెలంగాణ తల్లి సాధారణంగా ఉండాలని, నగలు, వడ్డాణం ఉండకూడదని చెప్పేటోళ్లు రూ.కోట్ల వాచీలు, వారి కుటుంబ సభ్యులు ఖరీదైన నగలు ధరిస్తున్నారన్నారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షా 55వేల కోట్ల అప్పులు చేసిందని ధ్వజమెత్తారు. -
పల్లా రాజేశ్వర్ రెడ్డి కబ్జా చేశాడంటూ స్థానికుల ఆందోళన
-
ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోంది: పల్లా
-
హైడ్రా పేరుతో వేధింపులు.. ఇదేం రాజకీయం: హరీష్ ఫైర్
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేలా కాంగ్రెస్ సర్కార్ రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.కాగా, హరీష్ రావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రతిపక్షాలను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. కాంగ్రెస్ కండువా కప్పుకోండి.. లేదంటే టార్గెట్ చేస్తాం అంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. హైడ్రా పేరుతో రాత్రికి రాత్రే కూల్చివేతలు చేస్తున్నారు. మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై రాజకీయ కుట్రతోనే ఆరు కేసులు నమోదు చేశారు. రాజేశ్వర్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనే ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో లేవని పల్లా విద్యాసంస్థలకు అనుమతి ఇచ్చారు. రెవెన్యూ, ఇరిగేషన్ సంయుక్త సర్వే చేసి రిపోర్టు ఇచ్చాయి. అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నిర్మాణాలకు ఎన్వోసీ ఇచ్చారు. హెచ్ఎండీఏ అనుమతితోనే పల్లా.. విద్యా సంస్థల నిర్మాణం చేశారు. ఆసుపత్రులు, విద్యా సంస్థలపై రాజకీయ కక్ష సాధింపులు వద్దు. రాజకీయంగా ఎదుర్కొలేకనే పల్లాపై వేధింపులకు దిగుతున్నారు. హైడ్రాను కేవలం రాజకీయంగా కక్ష సాధింపులకు మాత్రమే వాడుకుంటుందని ఆరోపించారు.ఇక, అంతకుముందు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన విద్యా సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. నాదం చెరువులో ఒక్క ఇంచ్ అక్రమ నిర్మాణం ఉన్నట్టు తేలితే నేనే కూల్చివేస్తాను. అన్ని అనుమతులు తీసుకుని మా విద్యా సంస్థల నిర్మాణం చేపట్టాం. నాపై రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారు. మాపై ఇప్పటికే ఆరు కేసులు నమోదయ్యాయి అంటూ కామెంట్స్ చేశారు. -
హైడ్రా దడదడ.. నెక్స్ట్ టార్గెట్ పల్లా !
-
BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు
-
‘మూసీ కంటే రేవంత్ నోరే కంపు’.. బీఆర్ఎస్ నేతల కౌంటర్
సాక్షి,హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరాలో జరిగిన రైతు రుణమాఫీ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ‘సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. టీవీ ముందు కూర్చున్న రాష్ట్ర ప్రజలు కూడా తలదించుకులే ఉంది. హరీష్ రావు గురించి కూడా ఏదేదో మాట్లాడారు. రుణమాఫీపై హరీష్ రావు ముక్కు నేలకు రాయాలని అన్నారు. ఇప్పుడు రెండు లక్షల రుణం మాఫీ కాలేదు.. కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చి ముక్కు నేలకు రాయాలి. మీరిచ్చిన హామీలపై నిలదీస్తూనే ఉంటాం. హరీష్ రావు పైన కూడా వాడకూడని భాషతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేరు తీయకుండా రేవంత్‌రెడ్డికి నిద్ర పట్టదు.సీఎం రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే.. భద్రాద్రి రాముడి సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ‘బహిరంగ సభలో పచ్చి భూతులు మాట్లాడారు.. కాంగ్రెస్‌లో ఉన్న మంత్రులు కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. 30 వేల ఉద్యోగాలు కాదు.. 30 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ప్రాజెక్ట్ కట్టింది మేమే అన్నట్టు కాంగ్రెస్ తీరు ఉంది. ఒక మంత్రి నీళ్ళు జల్లుకోవడం, మరో మంత్రి పూలు జల్లడం. ఇదంతా కేసిఆర్ ప్రాజెక్ట్ నిర్మించటం వల్లే. కష్టపడి నీళ్ళు తెచ్చామని చెప్పుకోవడానికి వారికి సిగ్గుండాలి. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ కాగితాలకే పరిమితం చేసింది మీరు కాదా?. రైతు రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు ఇచ్చామని అబద్ధాలు చెప్తున్నారు’ అని ధ్వజమెత్తారు.ముందు రేవంత్ నోరును ప్రక్షాళన చేయాలి..సీఎం రేవంత్‌రెడ్డి ఏమాత్రం సిగ్గు లేకుండా హరీష్ రావుపై అసభ్య విమర్శలు చేశాని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. ‘దేవుళ్ళను మోసం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి. సూటిగా చెప్పు రూ. 31 వేల కోట్ల రుణ మాఫీ చేశావా లేదా?. కేవలం రూ. 17 వేల కోట్లు మాత్రమే అకౌంట్లలో వేశావ్. సిగ్గుంటే సీఎం రేవంత్ ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేయాలి. 2018లో రేవంత్‌ను కొడంగల్‌లో హరీష్ రావు చిత్తు చిత్తుగా ఓడించారు. హరీష్ రావును విమర్శలు చేసే స్థాయి రేవంత్‌కు లేదు. మూసి కంటే కంపు రేవంత్ నోరు. ముందు రేవంత్ నోరును ప్రక్షాళన చేయాలి’అని మండిపడ్డారు. -
రుణమాఫీపై పల్లా కామెంట్స్
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు
జనగామ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై ఎన్నికల నిబంధన ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదైంది . గత ఏడాది నవంబరు 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో చొరబడి ఓటర్లను మభ్యపెట్టారంటూ కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదే రోజు అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్ పాటు పోలీసులకు కాంగ్రెస్ స్టేట్ యూత్ లీడర్, కాంగ్రెస్అభ్యర్థి పోలింగ్ ఏజెంట్ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కండువాతో పోలింగ్ బూత్ కి వెళ్లవద్దని ఎంత చెప్పినా వినలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 'బలవంతంగా పోలింగ్ బూత్ లోకి చొచ్చుకు వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని సదరు ఫొటో ఆధారాలను జత చేస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు తాజాగా శనివారం కేసు నమోదు చేశారు. 188 ఐపీసీ, 130 ఆర్పీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం ఆదివారం బయటకు వచ్చింది. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా కేసు నమోదైంది వాస్తవమేనని చెప్పారు. -
కడియం.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
వరంగల్: ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని షోడాషపల్లి శివారులోని ఓ ఫంక్షన్ హల్లో వేలేరు, ధర్మసాగర్ మండలాల విస్తృత స్థాయి సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ను గెలిపించి కడియం శ్రీహరికి కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. మంత్రిగా పని చేసి ఘన్‌పూర్‌కు చేసిన పని ఒక్కటైనా చూపెట్టాలని సవాల్ చేశారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. కడియం రాజీనామా చేసి వస్తే రాజకీయంగా బొందపెట్టడానికి పార, గడ్డపార రెడీగా ఉన్నాయన్నారు.కడియం శ్రీహరి ఓ నకిలీ దళితుడైతే, ఆయన కూతురు నకిలీ దళితురాలని మండిపడ్డారు. ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. తనను ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కడియం కావ్య తండ్రి చాటు బిడ్డ అని, అరూరి రమేశ్ కబ్జాదారుడని విమర్శించారు.కడియం శ్రీహరి, అరూరి రమేశ్ దొందూ దొందేనని విమర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ చాడ సరిత, జెడ్పీ కో–ఆష్షన్ సభ్యురాలు జుబేదా లాల్, కార్పొరేటర్ ఆవాల రాధిక రెడ్డి, వైస్ ఎంపీపీ సంపత్, మండల అధ్యక్షుడు నర్సింగరావు, కో–ఆష్షన్ జానీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. -
కడియంను ఓడించాలనే కసి మీలో కనిపిస్తోంది: హరీశ్‌రావు
సాక్షి, హన్మకొండ: కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయాక పార్టీలో జోష్ పెరిగిందని, ఆయనకు గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనిపిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్ రావు కడియంపై మండిపడ్డారు. ‘కడియంకు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్. కడియంపార్టీ ఎందుకు మారారో చెప్పాలి. కాంగ్రెస్‌లో కడియం ఇంకో గ్రూప్ పెడతారా?. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కడియం శ్రీహరి’ హరీశ్ రావు నిప్పులు చెరిగారు. తనకు కుమార్తెకు ఎంపీ టికెట్ అడిగి.. చివరి నిమిషంలో బీఆర్ఎస్కు ద్రోహం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని హరీష్ కోరారు. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కావ్య మా నాన్న(కడియం) బ్రాండ్ అంటోంది.. వెన్నుపోటు పొడవటంలోనా బ్రాండా? ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కడియం. ఆరూరి రమేష్, పసునూరి దయాకర్‌ను వెళ్లగొట్టిందే కడియం. కడియం లాంటి ద్రోహులను ప్రజలు క్షమించరు. కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి’అని పల్లా మండిపడ్డారు. -
‘పల్లా’కు మతిభ్రమించింది.. : సుంకెట అన్వేష్‌రెడ్డి
నిజామాబాద్: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకెట అన్వేష్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతు సమన్వయ సమితి ఉన్న అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రకతి వైపరీత్యాలు వచ్చినా స్పందించలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై సర్వే చేయిస్తున్నట్లు చెప్పారు. సర్వే కాకుండానే రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రాజేశ్వర్‌రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్‌హందాన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, సిరికొండ గంగారెడ్డి, అల్లూరి మహేందర్ రెడ్డి, శశిధర్‌రెడ్డి, సుంకెట బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఇవి చదవండి: పసుపుబోర్డు ఎక్కడుందో చెప్పాలి.. : ఎంపీ బాజిరెడ్డి -
ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి బడేబాయ్ అంటున్నారు: పల్లా
-
కొండా సురేఖ పల్లా..స్టేజీపై మాటల యుద్ధం
-
TS: కొండా సురేఖ, పల్లా వాగ్వాదం... ఎందుకంటే
సాక్షి,సిద్దిపేట: మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లపై సిద్ధిపేటలోని హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులను స్టేజిపైకి పిలవడమేంటని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో అలిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయారు. సంప్రదాయాలకు , ఆచారాలకు వ్యతిరేకంగా మల్లన్న జాతరపై సిద్దిపేటలో సమావేశం పెట్టడం ఏంటని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిన వ్యక్తిని స్టేజి మీదకు పిలవడం చాలా దురదృష్టకరం అన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి గుడిలో దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారు. 30 ఏండ్ల చరిత్రలో ఎప్పుడు సమావేశం హోటల్లో పెట్టలేదని, ఈ సమావేశాన్ని తాను బహిష్కరించానని పల్లా చెప్పారు. పల్లా వ్యాఖ్యలపై మంతత్రి కొండా సురేఖ స్పందించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ ఉండలేక సమావేశం నుంచి వెళ్లి పోయారన్నారు. తమకు ఎవరినైనా ప్రత్యేకంగా పిలుచుకునే అధికారం ఉంటుందన్నారు. పల్లా ప్రోటోకాల్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇదీచదవండి..భట్టి పదే పదే అదే చెప్తున్నారు..జగదీష్‌రెడ్డి -
ఇరు పార్టీల నేతలు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో ఆందోళన
-
నాన్ లోకల్ అనే విమర్శలకు రాజేశ్వర్ రెడ్డి సమాధానం ఏంటి ?
-
TS Elections2023: నేను గెలిస్తే ఎమ్మెల్యేగా కాదు.. పాలేరు లాగ పనిచేసస్తా..!
జనగామ: తనను గెలిపిస్తే జనగామ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద పాలేరుగా పనిచేస్తాను.. సీఎం కేసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకా న్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తరిగొప్పులలో కార్యకర్తల సమావేశం, బచ్చన్నపేటలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే బాధ్యతగా ప్రజాసమస్యలు పరిష్కరించడంతోపాటు అభివృద్ధి చేసి చూపించి ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తానని చెప్పారు. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు సేవ విషయంలో పోటీకి రావాలే తప్ప నాన్‌లోకల్ అని ప్రచారం చేయడం మానుకోవాల న్నారు. జిల్లా కేంద్రంలో ఈనెల 16న జరిగే సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని, అద్భుతమైన మేనిఫెస్టో రాబోతోందని చెప్పారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జల్లి సిద్దయ్య, ఇర్రి రమణారెడ్డి, జెడ్పీటీసీ ముద్దసాని పద్మజావెంకట్రెడ్డి, ఎంపీపీలు నాగజ్యోతి, కల్లూరి అనిల్‌రెడ్డి, సర్పంచ్‌లు సతీష్‌రెడ్డి, మల్లారెడ్డి, అయిలుమల్లయ్య, దివ్య, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, పింగిళి జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. సీఎం సభ ఏర్పాట్లు పరిశీలన సిద్దిపేటరోడ్డు మెడికల్ కళాశాల మైదానంలో ఈ నెల 16న నిర్వహించే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను పల్లా రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం పరిశీ లించారు. సభా ప్రాంగణంతో పాటు సీఎం వచ్చే హెలికాప్టర్ కోసం వికాస్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనులను సందర్శించారు. గ్రామాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్‌కు సంబంధించి, ఎవరు ఎక్కడ అనే దానిపై అన్ని గ్రామాల బాధ్యులకు ముందస్తు సమాచారం చేరవేయాలని పేర్కొన్నారు. పల్లా వెంట పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్‌రెడ్డి, పార్టీ శ్రేణులు నీల యాదగిరి, జూకంటి శ్రీశైలం, దేవరాయ నాగరాజు, బండ వెంకటేష్, బండ హరీష్ సంకటి రాజు, బోల మహేష్, బోల వెంకటేష్, జిట్ట శ్రీశైలం యాదవ్, బక్క రవి తదితరులు ఉన్నారు. -
ఇద్దరు కలిసిపాయిండ్రు
-
కరువు, కర్ఫ్యూ, ముడుపులు, ముఠాలకు కేరాఫ్ కాంగ్రెస్
జనగామ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పిదారి అధికారంలోకి వస్తే.. కైలాసం ఆటలో పెద్ద పాము మింగిన విధంగా తెలంగాణ పరిస్థితి మారిపోతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో, ఈ నెల 16న జనగామ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక్క చాన్స్ అంటూ ప్రజల ను బతిమిలాడుకుంటున్న కాంగ్రెస్‌కు.. ప్రజలు 11 సార్లు అధికారం కట్టబెడితే ఒరగబెట్టింది ఏమీ లేదన్నా రు. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణను దేశం గర్వించే స్థాయికి తీసుకెళ్లారన్నారు. కరువులు, కర్ఫ్యూలు, ముడుపులు, ముఠాలు, మతం పేరిట గొడవలకు కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్ అని, ప్రజలు ఆ పార్టీని పక్కన బెట్టి ఎప్పుడో మరచిపోయారని అన్నారు. కర్ణాటకలో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ పాలనలో కరెంటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించడంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తోందన్నారు. ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నా.. మీ ఆశీర్వాదం కావాలి సమావేశంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడు తుండగా.. అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి యాదగిరిరెడ్డికి కాళ్లు మొక్కేందుకు వంగారు. ‘అన్నా.. మీ ఆశీర్వాదం కావాలి’అంటూ కడుపులో తలపెట్టి మోకాళ్లను పట్టుకున్నారు. ఇందుకు ప్రతి గా ముత్తిరెడ్డి మాట్లాడుతూ ‘తమ్ముడూ.. మీ గెలు పులో నా కృషి వందశాతం ఉంటుంది’అని బదులిచ్చారు. -
జనగామ బీఆర్ఎస్ లో టికెట్ జగడానికి తెరపడినట్లేనా..?
-
ఫలించిన కేటీఆర్ ప్లాన్.. సీనియర్ నేతకు టికెట్ ఫిక్స్
సాక్షి, వరంగల్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. కాగా, ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగింది. అయితే, బీఆర్ఎస్లో సీట్ల పంచాయితీపై ఇంకా కోల్డ్‌వార్ నడుస్తూనే ఉంది. టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు సందర్భంగా దొరికిన ప్రతీసారి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. నేతల మధ్య సయోధ్య కుదురుస్తున్నారు. ఇందులో భాగంగానే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. ఇద్దరు నేతలతో మంత్రి కేటీఆర్ సమావేశమై.. వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జనగామ సీటును పల్లా రాజేశ్వర్‌రెడ్డికి కేటాయించడంపై సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడి యాదగిరిరెడ్డితో చర్చించారు. వీరి మధ్య సయోద్య కుదిర్చి జనగామ స్థానాన్ని పల్లాకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ముత్తిరెడ్డికి పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక, జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని స్థానిక నేతలకు కేటీఆర్ సూచించారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపునకు కలిసి పని చేయాలని ముత్తిరెడ్డి సైతం పిలుపునిచ్చారు. మరోవైపు.. జనగామ సీటు ఖరారు కావడంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేడు కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం, అక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక, ఇదే జోష్‌లో ఈనెల 16న కేసీఆర్ నేతృత్వంలో జనగామలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేశారు. ఈ సభ ఏర్పాట్లను నేడు మంత్రి హరీష్ రావుతో కలిసి పల్లా పర్యవేక్షించనున్నారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ వైపు.. తండ్రి కొడుకుల చూపు? -
కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో తొలి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర సృష్టించడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. అయితే మాయమాటలతో రైతులను గోల్మాల్ చేసి రాష్ట్రంలో పాగా వేయాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఈనె గాచి నక్కల పాలు చేసినట్లు కాంగ్రెస్ లాంటి ముదనష్టపు పార్టీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టొద్దని హితవు పలికారు. మంగళ వారం మంత్రుల నివాస సముదాయంలో జన గామ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ నెల 16న జనగామలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పక డ్బందీ ప్రణాళికతో, పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్ల బాధ్యత మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయా కర్రావుకు అప్పగించినట్లు తెలిపారు. కాగా ప్రతి ఊరూవాడ నుంచి జన సమీకరణ చేయాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. పార్టీ ఇచ్చిన అవ కాశంతో జనగామలో 2014లో 34 వేలు, 2018 లో 30 వేల ఓట్ల మెజారిటీతో పీసీసీ అధ్యక్షుడిని ఓడించి కేసీఆర్‌కు కానుకగా ఇచ్చానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యరి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 70 వేల నుంచి లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను జనగామ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజల ముందు పెడతారని పల్లా తెలిపారు. పల్లా ప్రచారానికి లైన్ క్లియర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన పార్టీ కీలక నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ నెల 16న జనగామ బహిరంగ సభ ఏర్పాట్ల కోసం ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే జన గామ టికెట్ దక్కని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నడుమ రాజీ కోసమే ఈ సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. కాగా ఈ భేటీ ద్వారా పల్లా అభ్యర్థిత్వానికి లైన్ క్లియర్ చేయడంతో పాటు ప్రచారానికి కూడా కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో జనగామ నియోజకవర్గంలో బహిరంగ కార్యక్రమాలకు పల్లా శ్రీకారం చుట్టనున్నారు. త్వరలో ‘నర్సాపూర్’పై సయోధ్య! నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీ ఆర్.. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి టికెట్ ఇవ్వడం లేదనే అంశంపై స్పష్టత ఇచ్చారు. అయితే వారం రోజుల వ్యవధి లో నాలుగైదు పర్యాయాలు మదన్‌రెడ్డి ప్రగతి భవన్‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎమ్మెల్యేగా కొన్ని పెండింగ్ పనులు, ఫైళ్ల కోసమే ఆయన వెళ్తున్నారని చెబుతున్నారు. సునీతా లక్ష్మారెడ్డి ఇప్పటికే అంతర్గతంగా నియో జకవర్గంలో పార్టీ నేతలను కలిసి మద్దతు కోరు తున్నారు. కాగా జనగామ తరహాలో ఒకటీ రెండురోజుల్లో సునీతా లక్ష్మారెడ్డి, మద న్‌రెడ్డి మధ్య కూడా రాజీ కుదిర్చి ఒకే వేదికపై ప్రకటన ఇచ్చేలా కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. జనగా మ, నర్సాపూర్, మల్కాజిగిరి, నాంపల్లి, గోషామహల్ అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ప ల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ), సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), మర్రి రాజశేఖర్‌రెడ్డి (మల్కాజి గిరి), నందకిషోర్ వ్యాస్ (గోషామహల్), ఆనంద్ గౌడ్ (నాంపల్లి)కి ఈ నెల 15న తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ బీ ఫారాలు అందజేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
పల్లా, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య కుదిరిన సయోధ్య..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని హీటెక్కించిన జనగామ జగడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెక్ పెట్టారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో జనగామ ప్రజాప్రతినిధులు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి లతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించుకోవాలని కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ భేటీలో మరో ఇద్దరు టికెట్ ఆశావహులు మండల శ్రీరాములు మరో ఆశావాహి కిరణ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అయితే, తెలంగాణ ఆర్టీసీ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినా.. జనగామలో బీఆర్ఎస్ తరపున బరిలో తానే ఉంటానంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. మరోవైపు, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్న తరుణంలో పల్లాను గెలిపించుకోవాలంటూ.. ఈ రోజు జరిగిన భేటీలో కేటీఆరే స్వయంగా చెప్పారు. ఆగస్టు 21న 115 మంది అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని పెండింగ్‌లో పెట్టారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టీఎస్ఆర్టీసీ చైర్మెన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టింది. పల్లాకు లైన్ క్లీయర్ చేసేందుకే ముత్తిరెడ్డికి ఆ పదవిని ఇచ్చినట్లు సమాచారం. చదవండి: ఎమ్మెల్సీకి లైన్ క్లియర్ అయినట్టేనా? ‘పల్లా’ కేనా..!? -
TS Election 2023: ఎమ్మెల్సీకి లైన్ క్లియర్ అయినట్టేనా? ‘పల్లా’ కేనా..!?
సాక్షి, సంగారెడ్డి: జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికే టికెట్ దక్కుతుందని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఆగస్టు 21న 115 మంది అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని పెండింగ్‌లో పెట్టారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టీఎస్ఆర్టీసీ చైర్మెన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టింది. పల్లాకు లైన్ క్లీయర్ చేసేందుకే ముత్తిరెడ్డికి ఆ పదవిని ఇచ్చారని తెలుస్తోంది. పల్లాకే జనగామ ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారు. దానికి తోడు ఇటీవల ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తానే బరిలో ఉంటానని ప్రకటించడంతో నియోజకవర్గంలో జోరుగా చర్చసాగుతుంది. టికెట్ ఆశిస్తున్న నలుగురు నేతలు.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆప్కో మాజీ చైర్మెన్ మండల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం కుమారుడు కిరణ్ కుమార్ టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. వాళ్లు నాలుగు వర్గాలుగా విడిపోయి గ్రూప్‌లుగా ఉంటున్నారు. ఎవరికి వారు తమకే అవకాశం వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. సమావేశాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ పల్లా.. జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కుకునూరుపల్లి మండలం చిన్నకిష్టాపూర్‌లో జరిగిన సమావేశంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని కార్యకర్తలు కోరడంతో డివిజన్ ఏర్పాటు బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం. గతంలో సైతం రెండు మార్లు ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ముత్తిరెడ్డి వ్యాఖ్యలతో.. టీఎస్ఆర్టీసీ చైర్మెన్‌గా యాదగిరిరెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో తానే బరిలో ఉంటాను అని చెప్పారు. దీంతో ఎమ్మెల్యేను కాదని ఎమ్మెల్సీ దగ్గరికి వెళితే ఎలా? అనే సందిగ్ధంలో కార్యకర్తలు పడ్డారు. కొందరు కార్యకర్తలయితే తటస్థంగా వ్యవహరిస్తున్నారు.అభ్యర్థిని త్వరగా ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ, పోస్టర్ వార్
-
వర్గాల పేర్లతో క్యాడర్ ను విభజిస్తున్నారు: ముత్తిరెడ్డి
-
మార్పు కోసం ఒప్పించక తప్పదు: పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, జనగామ: తెలంగాణ ఎన్నికలకు సన్నాహాకాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వేళ.. రాజకీయ పరిణామాలు వేగం పుంజుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధికారికంగా జాబితా ప్రకటించేసింది. కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ప్రకటనను వీలైనంత త్వరగా ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి పెండింగ్‌లో ఉన్న స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో.. పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. జనగాం అసెంబ్లీ టికెట్ పల్లా రాజేశ్వరరెడ్డికి దక్కుతుందనే ప్రచారం బలంగా సాగుతున్నవేళ.. ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ముత్తిరెడ్డి మద్దతు, కేసీఆర్ ఆశీర్వాదంతో జనగాంలో జెండా ఎగరవేద్దామని ట్వీట్ చేశారు. ‘‘ఎక్కడైనా మార్పు జరగాలనుకున్నప్పుడు ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలను ఒప్పించి ముందుకు సాగాలన్నారు. స్టేషన్ ఘనపూర్‌లోను ఎమ్మెల్యే రాజయ్యను మార్చి కడియం శ్రీహరికి ఇచ్చారని, దీంతో తాము రాజయ్యను కలిసి మాట్లాడామన్నారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ను కచ్చితంగా గెలిపించుకోవాలన్నారు. జనగామలోను ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పదేళ్లుగా బాగా పని చేశారన్నారు. ఆయన ఉద్యమంలో కూడా ఉన్నారని గుర్తు చేశారు. అయితే కొన్ని ఇబ్బందులవల్ల జనగామలో మనం(BRS) ఓడిపోయే అవకాశం ఇవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు ముత్తిరెడ్డి అంటే గౌరవం ఉందన్నారు. ముత్తిరెడ్డిని పిలిపించి మాట్లాడుతారని, అందరం ఏకతాటిపై వెళ్దామన్నారు. తాను కేసీఆర్, ముత్తిరెడ్డిల ఆశీర్వాదం తీసుకున్నానన్నారు. రేపు ఎన్నికల్లో కేసీఆర్ ఆశీర్వాదంతో పాటు మంత్రులు, ముత్తిరెడ్డి సహా అందరం కలిసికట్టుగా ముందుకు సాగి జనగామలో బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. రేపో ఎల్లుండో కేసీఆర్ టిక్కెట్ ప్రకటించాక అందరం కలిసి వెళ్దామన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ముత్తిరెడ్డి గారి మద్దతు, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో జనగాంలో గులాబీ జెండా ఎగరేద్దాం. pic.twitter.com/Y1eRUr9jDC — Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS) September 23, 2023 పార్టీకి, కేసీఆర్ గారికి గెలుపోవటములే గీటురాయి.. ఎవరూ దగ్గర, దూరం కాదు. pic.twitter.com/bXmzDHSitA — Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS) September 23, 2023 కేసీఆర్ గారు అప్పగించిన ప్రతి పనిని బాధ్యతగా సక్రమంగా నిర్వహించడం జరిగింది. pic.twitter.com/DBBQ1tQiKR — Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS) September 23, 2023 -
కేటీఆర్ ఫోన్‌కాల్‌తో వెనుదిరిగిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి
-
జనగామ బీఆర్ఎస్లో గ్రూప్ రాజకీయాలకు మంత్రి కేటీఆర్ చెక్
సాక్షి, జనగామ: జనగామ జగడానికి తెరదించే పనిలో నిమగ్నమయ్యారు బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థిత్వంపై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో రహస్యం భేటీలు, ఆత్మీయ సమ్మేళనాలు వద్దని పార్టీ నేతలను ఆదేశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మధ్య సమన్వయం సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. సీఎం కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించే వరకు ఎవరు ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని ఆదేశించడంతో నిడికొండలో నిర్వహించిన మూడు మండలాల ఆత్మీయ సమ్మేళనానికి పల్లా గైర్హాజరు కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున ఆందోళనలు తెలంగాణలో 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ జనగామ టికెట్ విషయంలో సస్పెన్స్‌లో పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కాదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇస్తున్నారనే ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సైతం ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొని పల్లా గో బ్యాక్ అంటూ విమర్శలు చేశారు. రహస్య బేటీలు, ఆత్మీయ సమ్మేళనాలు పల్లా మాత్రం బీఆర్ఎస్జిల్లా అధ్యక్షులు జడ్పి చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో రహస్య బేటీలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల, స్థానిక సంస్థల ప్రజాప్రతినిదుల మద్దతు కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. పల్లా తీరును ముత్తిరెడ్డి తో పాటు మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే గత 15 రోజులుగా కేటీఆర్ విదేశాల్లో ఉండడంతో తిరిగి వచ్చాక జనగామ టికెట్ పై నిర్ణయం ఉంటుందని ప్రచారం జరిగింది. కేటీఆర్ రావడంతో ఆయన దృష్టిని ఆకర్షించి టికెట్ పొందేందుకు ఎవరికి వారుగా ముగ్గురు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చదవండి: ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నరోత్తమ్ నియామకం కేటీఆర్ ఫోన్ రావడంతో పల్లా ఓ అడుగు ముందుకు వేసి నియోజకవర్గంలోని బచ్చన్నపేట తరిగొప్పుల నర్మెట్ట మూడు మండలాలకు చెందిన నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమ్మేళనానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి సైతం హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరగా ప్రగతి భవన్ నుంచి కేటీఆర్ ఫోన్ రావడంతో మధ్యలోనే వెనుతిరిగారు. రాజకీయంగా రకరకాలుగా చర్చలు అర్థాంతరంగా పల్లా ప్రగతి భవన్‌కు వెళ్లడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పల్లా రాకపోయినప్పటికి పార్టీ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి నేతృత్వంలో సమావేశాన్ని నిర్వహించి పల్లాకు అండగా ఉంటాం.. పార్టీ అందిష్టానం అతనికే టికెట్ ఇవ్వాలని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనం జనగామ నియోజకవర్గ పరిధిలో కాకుండా స్టేషన్ ఘనపూర్ పరిధిలోని నిడికొండలో నిర్వహించడం రాజకీయంగా రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఎలాంటి సమావేశాలు వద్దు సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి ఒత్తిడి మేరకు కేటీఆర్ పల్లా నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాలు, రహస్య భేటీలకు చెక్ పెట్టేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. టికెట్ విషయంలో జనగామలో పార్టీ మూడు ముక్కలుగా మారుతున్న తరుణంలో కేటీఆర్ రంగంలోకి దిగి గ్రూప్ రాజకీయాలకు టికెట్ జగడానికి తెరదించే ప్రయత్నంలో భాగంగానే ఎవరు ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని ఆదేశించినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించే వరకు ముగ్గురు నేతలు సమన్వయంతో పని చేసేలా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కేటీఆర్ మదిలో ఏముందో, సీఎం కేసీఆర్ ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారోనని ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. జనగామ టికెట్ పై సస్పెన్స్ కు ఎప్పటిలోగా తెరపడుతుందోనని జనగామ జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
పల్లాకు డబ్బు మదం ఎక్కువైంది: ముత్తిరెడ్డి
సాక్షి, చేర్యాల(సిద్దిపేట): బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి డబ్బు మదం ఎక్కువైందని, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ పార్టీని మలినం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది అధర్మం, సీఎం సంకల్పానికి విరుద్ధమని ముత్తిరెడ్డి ఆరోపించారు. ఆయన సిద్దిపేట జిల్లా చేర్యాలలో విలేకరులతో మాట్లాడారు. ఇక్కడి ప్రజాప్రతినిధులకు ఫోన్లుచేస్తూ డబ్బులు పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన వారిని ‘కుక్కలు’అనడం పల్లా అహంకారానికి నిదర్శనమన్నారు. నాకే నర్సాపూర్ టికెట్ ఇవ్వాలి.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని, తనకు నర్సాపూర్ టికెట్ కావాలని సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏ ఆలోచనతో నర్సాపూర్ టికెట్ ప్రకటించకుండా ఆపారో తెలియదని, పునరాలోచించి తనకే ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి బీఆర్ఎస్లో చేరారని, ఇక్కడ కేబినెట్ కేడర్ హోదాలో ఉన్నారని పరోక్షంగా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి అన్నారు. తనకు మంత్రి హరీశ్‌రావు అండదండలు ఉన్నాయన్నారు. టికెట్ ఇవ్వకుంటే ఏం చేస్తారని విలేకరులు అడగ్గా.. టికెట్ తనకే వస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. చదవండి: Thummala: తుమ్మల చేజారిపోకుండా.. టికెట్ ఇవ్వకుంటే రాజకీయ సన్యాసం సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఈసారి తనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. ఆయన సోమవారం మహబూబాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా మహబూబాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని, ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇంత బలం ఉన్న తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఒక వేళ ఇవ్వకపోతే ఖద్దరు బట్టలు కాకుండా.. ఎర్రటి వస్త్రాలు ధరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తానని వెల్లడించారు. -
పల్లాపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
సాక్షి, జనగామ: జనగామ బీఆర్ఎస్ ఆధిపత్య పోరు మరింత రాజుకుంటోంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణ చెప్పాలని పల్లాను డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు, ఇన్ బ్యాలెన్స్ ఉండేందుకు. అందుకే ఆహ్వానించారే తప్ప కుక్కల్ని చేయడానికి కాదని విషయాన్ని గమనించాలి. పల్లా తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. తప్పు జరిగిందని క్షమాపణ చెప్పాలి అని ముత్తిరెడ్డి డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చారు. ‘ బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుక్కలు. అటువైపు ఉంటే మొరుగుతారనే బీఆర్ఎస్లో చేర్చుకొని దొడ్లో కట్టేశారు. అటువైపు ఉన్న కుక్కలను ఇటు తీసుకుని.. వారిని పిల్లిలాగా కేసీఆర్ మార్చేశారు. అలా కేసీఆర్ వారిని గీత దాటకుండా చేసేశారు’ అని వ్యాఖ్యానించారు పల్లా. ముత్తిరెడ్డి ఆగ్రహం.. పల్లా వ్యాఖ్యలపై ముత్తిరెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘బలుపెక్కువై డబ్బు ఎక్కువ ఉన్నవారు అమాయక ప్రజల మీద డబ్బులు చల్లి అయోమయానికి గురి చేస్తున్నారు. అలా చేయడం సీఎం కేసీఆర్ సంకల్పానికి విరుద్ధం. అమ్ముడుపోయేవారు ఆగమై మట్లే కలిసిపోతారు. కేసీఆర్ నిర్ణయం శిరోధార్యం. కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే అందరం కలిసే ప్రయాణం చేస్తాం. ప్రజల అభిమానాన్ని కోరికను కేసీఆర్ తీరుస్తాడు. ముఖ్యమంత్రి పై నాకు పూర్తి విశ్వాసం ఉంది. 14ఏళ్లుగా మీ కష్టాలు మీ జ్ఞాపకాలు కేసీఆర్ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి సీఎం కోరిక తీరుస్తాడు. సముచిత నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. భారీ మెజార్టీతో గెలుస్తాం’’ అని ముత్తిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చైర్పర్సన్ ప్రసంగానికి అంతరాయం దివ్యాంగుల ఆసరా పెంపు కార్యక్రమంలో ఇవాళ ముత్తిరెడ్డి పల్లాపై మండిపడ్డారు. అయితే.. ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ జమున మాట్లాడారు. ముత్తిరెడ్డి కూడా తన బాధను చెప్పుకున్నారని, ఎవరికీ టికెట్ ఇచ్చిన పని చేయాలని ప్రసంగించారు. ఆ సమయంలో కార్యకర్తలు చైర్పర్సన్ ప్రసంగానికి అడ్డుతలిగారు. ముత్తిరెడ్డి కి అనుకూలంగా నినాదాలు చేయడంతో ఆ కార్యక్రమం గందరగోళంగా మారింది. దీంతో ముత్తిరెడ్డి జోక్యం చేసుకునితన అనుచరుల్ని శాంతింపజేశారు. మరోవైపు జనగామ అభ్యర్థిని త్వరగా ఖరారు చేసి ఉత్కంఠకు తెరదించాలని ముత్తిరెడ్డి వర్గం బీఆర్ఎస్ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తోంది. -
జనగామపై వీడని పీటముడి!
సాక్షిప్రతినిధి, వరంగల్: జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేదానిపై పీటముడి ఇంకా వీడలేదు. ఉమ్మడి వరంగల్‌లో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ ఒక్క స్థానంపై కమిటీ మరోసారి సమావేశమై 25న నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దీంతో జనగామ నుంచి బరిలో నిలిచే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థిత్వం ఖరారుపై గడువు పెరిగిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు ఎవరికి వారుగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. వాస్తవానికి ఉమ్మడి వరంగల్‌లో స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి పేరు వినిపించగా.. జనగామకు ఏడాదిన్నరగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరే వినిపించింది. అయితే హఠాత్తుగా జనగామ నుంచి పోటీ చేసేందుకు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చిందన్న ప్రచారం గందరగోళానికి దారితీసింది. ఇదే సమయంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అనుచరులు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో రహస్యభేటీ నిర్వహించగా.. అక్కడికి వెళ్లిన యాదగిరిరెడ్డి ఇది కరెక్టు కాదని పార్టీ నాయకులకు నచ్చజెప్పారు. ఆ తర్వాత ముత్తిరెడ్డి హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించి బలప్రదర్శన చేశారు. కాగా, సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం కేసీఆర్ అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారన్న సమాచారం మేరకు ఉదయమే హైదరాబాద్‌కు వెళ్లిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితలను కలసినట్లు సమాచారం. అలాగే పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల అనుచరులు సైతం హరీశ్‌రావును కలసి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. మరోవైపు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు కూడా వేర్వేరుగా పార్టీ పెద్దలను కలసినట్లు సమాచారం. దీంతో కేసీఆర్ ఈ స్థానంపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. 25న ఎన్నికల కమిటీ మరోసారి భేటీ అయి అభ్యర్థి పేరును ఖరారు చేస్తుందని ప్రకటించారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ఫైనల్‌గా తనకే ఛాన్స్ ఉంటుందని చెపుతుండగా, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు సైతం ధీమాగా ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే అమెరికా పర్యటనలో ఉన్న పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వచ్చాకే ఈ వివాదం పరిష్కారం అవుతుందన్న మరో వాదన పార్టీ ముఖ్యనేతల నుంచి వినిపిస్తోంది. 25న అభ్యర్థుల ఎంపిక కమిటీ భేటీ అయినప్పటికీ.. సెప్టెంబర్ 1న కేటీఆర్ వచ్చాకే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉందని అంటున్నారు. -
కేసీఆర్‌కు ఇదే నా విన్నపం: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
సాక్షి, జనగామ: నియోజకవర్గపు టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికే అంటూ ప్రచారం జరుగుతుండడంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఓవైపు ముత్తిరెడ్డి అనుచరులు పల్లాకి టికెట్ ఇవ్వొద్దంటూ రోడ్డెక్కి రచ్చ చేస్తున్న వేళ.. మరోవైపు ముత్తిరెడ్డి మీడియా ముందుకొచ్చారు. పల్లాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే కంటతడి పెట్టారాయన. ‘‘బుక్కెడు బువ్వ దొరకని జనగామ నియోజక వర్గాన్ని భారత దేశానికే అన్నం పెట్టేలా తీర్చిదిద్దాను. గెలిచే నియోజకవర్గాన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిస్ట్రబ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ గా గెలిపిస్తే ఏడేళ్ళ లో జనగామకు ఏం చేశావో చెప్పు. పల్లా రాజేశ్వర్ రెడ్డి నియోజకవర్గానికి అసలేం చేశారు?. పైగా ఇప్పుడు డబ్బులు పంచి ప్రలోభ పెడుతున్నారు. ఎన్నికల ముందు డబ్బులు పంచి హుజురాబాద్‌లా జనగామను మార్చాలనుకున్నావా?.అధినేతను, పార్టీని డిస్ట్రబ్ చేయడం పల్లా మానుకోవాలి అని ముత్తిరెడ్డి హితవు పలికారు. నా బిడ్డను బజారుకు ఎక్కించావ్ ‘‘ఇంటెలిజెన్స్ అంటు నీ కాలేజీ వాళ్ళతో సర్వే చేసి పార్టీని నాశనం చేస్తున్నావు. కొమ్మూరి ప్రతాపరెడ్డి కొడుకు నీ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు. (కొమ్మూరి కొడుకు తన కూతురు భర్త ఇద్దరూ క్లాస్ మేట్స్ అని చెప్పుకొచ్చారాయన). నా కుటుంబంలో కలహాలకు పల్లానే కారణం. నా బిడ్డ ను బజారుకు ఎక్కించింది పల్లానే. పల్లా జనగామ నాయకుల్ని మిస్ గైడ్ చేసి టూరిజం ప్లాజాకు తీసుకొచ్చారు. పార్టీ కి విరుద్దంగా గ్రూప్ లను ఎందుకు ప్రోత్సాహిస్తున్నావు పల్లా?. పార్టీ కి విరుద్దంగా పని చేయడం మానుకోండి. కేసిఆర్ వెంట 22ఏళ్ళు ఉన్నా, ఉద్యమంలో పల్లా నీ పాత్ర ఏంటీ? అంటూ నిలదీశారాయన. కేసీఆర్‌కు రిక్వెస్ట్ ‘‘పల్లా చేసే అధర్మ పని మానుకోవాలి. సీఎం ప్రకటించే వరకు ఎందుకు ఆగడం లేదు. పోచంపల్లి శ్రీనివాస రెడ్డి సంస్కారానికి నమస్కారం. ఉద్యమకారులను డిస్టర్బ్ చేస్తే కేసిఆర్ సహించరు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు కేసిఆర్ ను జనగామ ప్రజలు మరువలేరు. నాటి నుంచి నేటి వరకు కేసిఆర్ కు సైనికుడిగా పని చేశాను. 2004లో సామాజిక పరంగా టిక్కెట్ లభించకపోయిన ఇండిపెండెంట్ గా పోటీ చేసి కేసిఆర్ నినాదంతో ప్రచారంతో 60 వేల ఓట్లు తీసుకువచ్చా. 2009లో పాలకుర్తికి పోయినా కేసిఆర్ అడుగుజాడల్లో పనిచేశాను. 2014, 2018 లో కేసిఆర్ ఆశీస్సులతో జనగామ నుంచి పోటీ చేసి గెలిచి ప్రజా సేవలో నిమగ్నమయ్యాను. కేసిఆర్ సైనికుడిగా ఉంటా. ఆయన ఏ పని చెప్పినా చేస్తా.. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని, మొదటి లిస్ట్‌లోనే జనగామ టికెట్ ప్రకటించాలని సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వినతి చేశారు. బోరున విలపించిన సర్పంచ్ ప్రెస్ మీట్ సమయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని వడ్లకొండ సర్పంచ్ బొల్లం శారద పట్టుకుని బోరున విలపించారు. ‘కేసీఆర్ సార్ మమ్మల్ని ఏడ్పించకండి. ఒక్కసారి ముత్తిరెడ్డి కి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే మేమొచ్చి మాట్లాడుతాం సార్. ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి కేసీఆర్ సార్’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బల ప్రదర్శన
జనగామ /కుషాయిగూడ (హైదరాబాద్): నియోజకవర్గంలో అసమ్మతి నేపథ్యంలో జనగామ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బల ప్రదర్శనకు దిగారు. నియోజకవర్గంలో స్థానిక పార్టీ శ్రేణులతో ర్యాలీలు, సమావేశాలు జరపడంతోపాటు హైదరాబాద్‌లోనూ భేటీ అయ్యారు. స్థానిక నాయకత్వం తన వెంటే ఉందని చాటుకునే ప్రయత్నం చేశారు. బుధవారం హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో అసమ్మతి వర్గం సమావేశం కావడం, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్కడికి వెళ్లడంతో వాగ్వాదం జరగడం తెలిసిందే. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ అసమ్మతిని రాజేస్తున్నాడని ముత్తిరెడ్డి ఆరోపించారు కూడా. ఈ క్రమంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు తనతోనే ఉన్నాయనేలా గురువారం బల ప్రదర్శనకు దిగారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పరిధిలో భారీ ర్యాలీలు నిర్వహించడంతోపాటు ఏకకాలంలో మీడియా సమావేశాలు పెట్టి స్థానిక నేతలతో తనకు మద్దతు ప్రకటించేలా చేశారు. తర్వాత వారందరితో హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో ఉన్న నోమా ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సెలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర నేతలు తమ మద్దతు ముత్తిరెడ్డికే ఉంటుందని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీలన్నీ ముత్తిరెడ్డికి మద్దతు ఇస్తున్నట్టుగా చేసిన తీర్మానాల పత్రాలను ముత్తిరెడ్డికి అందజేశారు. కావాలని అభాసుపాలు చేస్తున్నారు: ముత్తిరెడ్డి తనపై కుట్రలు కొత్తేమీ కాదని.. ఇంతకుముందు 2014లో, 2018లోనూ కుట్రలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. తానేమిటో తెలిసిన సీఎం కేసీఆర్ రెండుసార్లు తనకే టికెట్ ఇచ్చారని.. నియోజకవర్గ ప్రజలు గెలిపించారని చెప్పారు. మల్లాపూర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘నాటి కుట్రల పాచికలు పారకపోవడంతో తాజాగా కుటుంబ కలహాల బూ చితో నన్ను అభాసుపాలు చేసేందుకు, వివాదా స్పదుడిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. నాకు అధినేత కేసీఆర్‌పై నమ్మకముంది. ఉద్యమ నాయ కుడిగా, పార్టీ సైనికుడిగా నాకు గుర్తింపునిస్తూనే వచ్చారు. భవిష్యత్తులో కూడా నాకు ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఈ సమావేశానికి సంబంధించిన అంతర్యాన్ని, నిర్ణయాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా..’’ అని తెలిపారు. -
అద్భుతం.. ‘అనన్య’ నృత్యం..
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): దీపాంజలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నృత్యగురువు దీపికారెడ్డి శిష్యురాలు అనన్య పొలసాని కూచిపూడి నృత్య అరంగేట్రం శనివారం రవీంద్రభారతిలో కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె చక్కటి హావభావాలతో నర్తించిన పుష్పాంజలి, భామాకలాపం ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్ గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు హాజరై అనన్యను అభినందించారు. అనన్య ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మేనకోడలు. -
జనగామలో జగడం.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెడుతున్న ఎమ్మెల్సీ
జనగామ గులాబీ గూటిలో ముసలం ముదిరిందా?... సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెడుతుంది ఎమ్మెల్సీలేనా?... ఇంటిపోరుతో సతమతం అవుతున్న ముత్తిరెడ్డి సీటుకు ఎసరు పెట్టారా?...అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తుంది. గ్రూప్ రాజకీయాలతో గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తున్న పుల్లల రాయుడు ఎవరు?.. జనగామ జగడానికి కారణం ఏంటీ? ఉద్యమాల ఖిల్లా జనగామలో బీఆర్ఎస్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యతిరేక వర్గం తాజా ఆడియో సంభాషణ కలకలం సృష్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన సీటును పదిలపర్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ వైపు ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి, మరోవైపు వ్యతిరేక వర్గం వ్యూహాలు ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రసవత్తరంగా జనగామ రాజకీయం ఇదే సమయంలో స్వపక్షంలోని స్థానికులు గ్రూప్ కట్టి స్థానికతను తెరపైకి తీసుకొస్తున్నారు. ఓ ఎమ్మెల్సీ అందుకు ఆజ్యం పోస్తున్నట్లు తాజా ఆడియో వైరల్ తో స్పష్టమౌతుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి స్థానికేతరుడనేది అడొస్తే.. పట్టభద్రుల స్థానానికి మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కలిసేందుకు జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి పలువురితో సంప్రదింపులు జరపడం హాట్ టాఫిక్‌గా మారింది. పోచంపల్లి'.. లేదంటే 'పల్లా'కు జై జనగామ నుంచి పోటీ కోసం ఇప్పటికే యాదగిరిరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిల పేర్లుండగా.. తాజాగా తెరమీదకు ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు వచ్చింది. ఈ మేరకు జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి పలువురు నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే క్రమంలో నర్మెట జెడ్పీటీసీ సభ్యుడు ఎం.శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. చదవండి: పిల్లల టిఫిన్ బాక్సులు తెరిచి చూసి షాకయ్యా: గవర్నర్ తమిళిసై జడ్పీ చైర్మన్ ఆడియో వైరల్ కలకలం 'పల్లా రాజేశ్వర్ రెడ్డి లోకల్ వాడు.. జనగామ నియోజకవర్గం నుంచి నిలబడమని మనం సపోర్ట్ చేద్దాం.. ఇంకొకటి ఏమిటంటే మొత్తం జనగామ నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి.. కాబట్టి 4 మండలాల వారు (చేర్యాల, మద్దూరు, దులిమిట, కొమురవెల్లి) వస్తారో రారోగాని నువ్వు, మన 4 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు కలిసి ఒక రిప్రజెంటేషన్ కేసీఆర్ సార్‌కు ఇవ్వాలి. అన్ని నేను చూసుకుంటా.. సీటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి వస్తే అభ్యంతరం లేదు.. శ్రీనన్న కనుక నాన్ లోకల్ అంటే మనం రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వమందాం.. మన ఆలోచన ఇది. నువ్వు వెంటనే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఫోన్ చెయ్యి, సారుతోటి మంచిగా మాట్లాడు. మీకు అంతా అనుకూలంగా ఉంటది. అందరూ ఒకే అంటారు అని చెప్పు.. నర్మెట సీను ఫోన్ చేస్తాడని చెప్పిన మన తమ్ముడే, మీరంటే పడి చస్తాడని చెప్పిన నువ్ కూడా అదే విధంగా మాట్లాడు.. మళ్లీ నాకు వెంటనే కాల్ చేసి చెప్పు' అంటూ జెడ్పీటీసీ శ్రీనివాస్‌తో మాట్లాడిన పాగాల సంపత్ రెడ్డి ఆడియో రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది. ముత్తిరెడ్డికి ఇంటిపోరు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొంత కాలంగా వివాదాలకు కేంద్రంగా ఉన్నారు. ఇటీవల తన కూతురు తుల్జా భవానిరెడ్డి ఆయన తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడమే కాకుండా చేర్యాలలో తండ్రి ఇచ్చిన స్థలాన్ని కూడా మున్సిపాలిటీకి ధారాదత్తం చేశారు. ఓ వైపు ఇంటిని చక్కబెట్టుకుంటూనే అధిష్టానాన్ని కన్విన్స్ చేసుకుంటున్న తరుణంలో సొంత పార్టీలోనూ కుంపటి రాజుకుంటోంది. ఆయనంటే ససేమిరా అనే గ్రూపు ఈసారి ఎన్నికల నుంచి తప్పించాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తుంది. చదవండి: కమలం గూటికి జయసుధ.. ఎవరికి చెక్ పెట్టేందుకు?.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదేనా? ఈ క్రమంలో ముత్తిరెడ్డి వ్యతిరేక వర్గం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సన్నిహితంగా వ్యవహరిస్తూ ఆయనను కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆయనతో దిగిన ఫొటో లతోపాటు కార్యక్రమాలను విస్తృతంగా ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఇంత జరుగుతున్నా తన పని తాను చేసుకుంటూ పోతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. 'సిట్టింగ్'గా ఉన్న టికెట్ నాకే, గెలుపు నాదే నంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇదే సమయంలో తెరపైకి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు రావడం నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తుంది. గ్రూప్ రాజకీయాలు అందుకు ఆజ్యం పోస్తున్నాయి. పుల్లల రాయుడి ఫిట్టింగ్ గ్రూపు రాజకీయాలకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ పెడుతుంది పుల్లల రాయుడిని ప్రచారం సాగుతుంది. అధిష్టానం పెద్దలకు దగ్గరగా ఉండే నాయకుడు అటు జనగామ, ఇటు స్టేషన్ ఘన్పూర్, మరోవైపు వరంగల్ పశ్చిమ లో సిట్టింగ్ ఎమ్మెల్యే లు సీట్లకు ఎసరు పెట్టి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలకు అంతర్గత విబేదాలకు పుల్లల రాయుడు కారణమని భావిస్తున్నారు. ఇప్పటికే స్టేషన్ ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు బదులు ఎమ్మెల్సీ కడియం పేరు తెరపైకి రావడం, అటు జనగామలో ముత్తిరెడ్డికి బదులు పోచంపల్లి, పల్లా పేర్లు తెరపైకి తేవడం వెనుక పొలిటికల్ డ్రామాగా ఓరుగల్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఇంకా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. -
తెలంగాణపై విషం కక్కేందుకే మోదీ హైదరాబాద్ వచ్చారు: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం వచ్చినట్లు లేదని.. తెలంగాణపై విషం కక్కేందుకే వచ్చినట్లు ఉందని మండిపడ్డారు. ప్రతి మాట సత్యదూరమని, ప్రధానిగా ఇన్ని అబద్ధాలు చెప్పడం మోదీకే చెల్లిందని విమర్శించారు. రైతు బంధును కాపీ కొడితే పీఎం కిసాన్ అయ్యిందని.. కానీ పీఎం కిసాన్ వల్లే మొదటిసారి రైతులకి లబ్ది అని చెప్పుకోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. రైతు బంధుతో పోల్చితే పీఏం కిసాన్ సాయమెంత? అని ప్రశ్నించారు. ‘తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆసరా పెన్షన్, రైతు బంధు వంటివి నేరుగా లబ్ది దారుల ఖాతాలో జమ అవుతున్నాయి. తన వల్లే డీబీటీ మొదలైనట్టు అనడం పచ్చి అబద్దం. ఇందులో గొప్ప చెప్పుకోవాల్సింది ఏముంది?. వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూత అని చెప్పడం పూర్తి అవాస్తవం. ITIRను బెంగళూరుకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వెంటనే గుజరాత్లో అర్బిట్రేషన్ సెంటర్ పెట్టారు. తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించారు. ఇవన్నీ చేసింది మోదీ ప్రభుత్వం కాదా? రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని మోదీ చెప్పడం హాస్యాస్పదం. నిజానికి ఈ పరిస్థితి రివర్స్గాగా ఉంది. రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, జాతీయ హోదా వంటివి ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు ఎలాంటి సహకారం అందించడం లేదు’ అని మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణకు మోదీ ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు: ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్‌రెడ్డి ‘తెలంగాణ సీఎంకు సరైన సమాచారం ఇవ్వకుండా పరేడ్ గ్రౌండ్స్‌లో సభ నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాల సభను ఎన్నికల ప్రచార సభగా ప్రధాని మోదీ మార్చారు. ప్రధాని తన ప్రసంగంలో డొల్ల మాటలు మాట్లాడారు. తెలంగాణకు తొమ్మిది ఏళ్లుగా మోదీ ఎలాంటి సహాయం చేయలేదు. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చలేదు. ఎయిమ్స్ ప్రకటన చేసిన నాలుగేళ్ళ తర్వాత మోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. తెలంగాణకు మోదీ ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇచ్చిన మోదీ తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి. మెట్రోకు కావాల్సిన నిధులు ఎవరు ఇచ్చారో తెలంగాణ ప్రజలకు తెలుసు. మెట్రో తమ ఘనతగా మోదీ గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ 28 ప్రాజెక్టులు అడిగితే కేంద్రం ఇచ్చింది కేవలం మూడు ,నాలుగు మాత్రమే. టోల్ రూపంలో 9 వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు చెల్లించారు. మోడీ తన ప్రసంగంలో మొత్తం అబద్దాలు మాట్లాడారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వలేదు. అప్పు అడిగినా ఇవ్వలేదు’ అని ఎమ్మెల్సీ మండపడ్డారు. అవార్డులు ఎందుకు ఇస్తోంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రధానికి రాష్ట్రానికి వచ్చి ఏమైనా ప్రాజెక్టులు ఇస్తారనుకుంటే.. కేవలం తిట్టిపోయారని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ విమర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలపై మంత్రులు విరుచుకుపడ్డారు. గతంలో కేసీఆర్ పాలనను ప్రధాని మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప మోదీకి ఏమీ చేత కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతే కేంద్రం అవార్డులు ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు. అభివృద్ధి తట్టుకోలేకే విమర్శలు: మంత్రి జగదీశ్ రెడ్డి రైలు ప్రారంభం పేరుతో తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ.. ఈ ప్రాంతంపై మరోసారి విషం చిమ్మారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రధాని నరేంద్ర మోదీ తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఆ ప్రంసంగం ఆసాంతం మోసపూరితంగా సాగిందని విమర్శించారు. మోదీ ముఖంలో కేసీఆర్ భయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు మోదీ. భయంతో మోదీ పూర్తి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారు. ప్రధాని తన ప్రసంగంలో తెలంగాణ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందనడం విడ్డూరంగా ఉంది. ఎందులో అడ్డుకున్నాం.. కేంద్రం పసుపు బోర్డు ఇస్తానంటే అడ్డుకున్నామా?. ‘కేసీఆర్‌ది కుటుంబ పాలన కానేకాదు. ఆయనది ఉద్యమ నేపథ్య కుటుంబం. కేసీఆర్‌కు ప్రజల ఆమోదం ఉంది. -మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి -
BRS Party: మంత్రి, ఎమ్మెల్యేలు, నాయకుల మధ్య అంతర్గత విభేదాలు
సాక్షి, మేడ్చల్ జిల్లా: రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యకర్తలందర్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుడుతోంది. దాదాపు నెల రోజుల పాటు జరిగే సమ్మేళనాల్లో ప్రభుత్వ పథకాలపై ప్రచారం కల్పించడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని భావిస్తోంది. ఇందుకోసం పార్టీ శ్రేణులను సమన్వయ పరిచేందుకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజుతో కలిసి జిల్లాకు సమన్వయకర్తగా అధిష్టానం నియమించిన ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పార్టీ కార్యకర్తలను ప్రజల్లోకి పంపించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమంలో కార్యకర్తలందరిని భాగస్వాములను చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన పథకాల వివరాలను ప్రజలకు వివరించాలని అధిష్టానం ఆదేశించింది. ఇందు కోసం కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం పేరిట గ్రామాల్లో, పురపాలక సంఘాల్లో డివిజన్లు/వార్డుల్లో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచి, ఎంపీటీసీ సభ్యులు, రైతుబంధు కన్వీనర్, సింగిల్ విండో చైర్మన్లతో పాటు జడ్పీటీసీ, ఎంపీపీ, మండల పార్టీ కార్యవర్గం, అనుబంధ సంఘాలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరితో ఈ సమావేశం నిర్వహించనున్నారు. సంబంధిత నియోజకవర్గ ఇన్చార్జి ఉండే ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్, డీసీసీబీ చైర్మన్, ఇతర పదవులున్న నేతలందరినీ ఆహా్వనిస్తారు. పురపాలక సంఘాల్లో కార్పొరేటర్/కౌన్సిలర్, పార్టీ వార్డు అధ్యక్షుడు ఇతర కార్యవర్గాన్ని భాగస్వామ్యం చేస్తారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్చైర్మన్లు సమావేశాల్లో పాల్గొనేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. నెల రోజుల పాటు బీఆర్ఎస్ సమ్మేళనాలు గ్రామ కార్యకర్తల సమ్మేళనం ఏ తేదీన నిర్వహిస్తారో నియోజకవర్గ ఎమ్మెల్యే నిర్ణయించాల్సి ఉంటుంది. వివరాలను పార్టీ జిల్లా ఇన్చార్జి లేదా సమన్వయకర్తకు అందజేస్తే అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలకనుగుణంగా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 24వ తేదీలోగా ఈ సమ్మేళనాలు పూర్తిచేయాలి. అనంతరం 25న గ్రామాల్లో, వార్డుల్లో పార్టీ జెండాలు ఎగురవేసి పండగ వాతావరణం తలపించేలా కార్యక్రమం చేపట్టాలని సూచనలు ఉన్నాయి. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా సచివాలయం ఎదుట 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనుండటంతో జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు ఉత్సవాలు నిర్వహించనున్నారు. కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాల విజయవంతం కోసం పార్టీ జిల్లా సమన్వయ కర్త ఇక్కడకు చేరుకుని నేతలకు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం పటిష్టపరచడం పైనా దృష్టిపెడుతారు. సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను ఇందులో చేర్పించనున్నారు. ప్రస్తుతం పరీక్షల కాలం కావడంతో జూన్ నెలలోనే విద్యార్థి విభాగాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విభేదాలు సమసి.. సమన్వయం జరిగేనా..! మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్ నేతల మ ధ్య అంతర్గంగా కొనసాగుతున్న విభేధాలు.. త్వర లో జరిగే విస్కృత సమ్మేళనాలతో సమసి పోగలవా .. లేక మరింత ముదురుతాయన్న చర్చ పార్టీ వర్గాలను వేధిస్తోంది. మంత్రి మల్లారెడ్డిపై జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఇంత వరకు ఇది ఓ కొలిక్కివచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. కొద్ది రోజుల కిందట మల్కాజిగిరి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత హన్మంతరావు ఇంట్లో సమావేశమైన జిల్లా పార్టీకి చెందిన 5 ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి నిధుల విషయంలో మంత్రి మల్లారెడ్డి జోక్యాన్ని తప్పుపట్టారు. ఈ వ్యవహారశైలిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తుమని, 5 ఎమ్మెల్యేలు ఆ సందర్భంగా ప్రకటించారు. అలాగే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలను ఖాతర్ చేయకుండా నామినేటెడ్ పదవులను మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం వారికి కట్టబెట్టారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ వ్యవహారం ఇంకా చక్కబడకపోవడంతో విభేదాలు కొనసాగుతూనే.. ఉన్నాయి. అలాగే మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డి, ఉప్పల్‌లో ఎమ్మెల్యే భేతి సుభా‹Ùరెడ్డి, మాజీ మేయరు బొంతు రామ్మోహన్, కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నట్లు కేడర్‌లో చర్చ సాగుతోంది. కూకట్‌పల్లిలో కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరు తమ వర్గాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని 13 పురపాలక సంఘాలోకల్ అధికార పార్టీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఉన్నప్పటికీ వారి మధ్యనే ఉన్న విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని డివిజన్లతో సహా పలు గ్రామాల్లో కూడా పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు చాపకింద నీరులా కొనసాగుతున్నాయి. అయితే.. పార్టీ విస్తృత సమ్మేళనాలతో బీఆర్ఎస్ నేతల మధ్య నెలకొని ఉన్న విభేదాలు సమసిపోతాయా.. లేక భగ్గుమంటాయా.. అన్న ఆందోళన కేడర్ నుంచి వ్యక్తమవుతుండగా, దీన్ని జిల్లా సమన్వయకర్త, పార్టీ యంత్రాంగం ఎలా ఎదుర్కొని చల్ల బర్చగలదో వేచి చాడాల్సిందే మరి. సమ్మేళనాలు ఇలా... పది గ్రా మాలను కలిపి ఒక సమ్మేళనం ఏర్పాటు చేస్తారు. పట్టణాల్లో 3 నుంచి 4 వార్డులను కలిపి ఓ సమ్మేళనం ఉంటుంది. గ్రామాల నుంచి వచ్చే కార్యకర్తలకు అక్కడ చేపట్టిన అభివృద్ధిని గణాంకాలతో సహా వి వరిస్తారు. పథకాలతో లబ్దిపొందిన వారి జాబితాను అందిస్తారు. ఆ వివరాలతో కార్యకర్తలు కలసికట్టుగా పర్యటిస్తూ.. ప్రభుత్వం గ్రామానికి ఏం చేసింది? ఎన్ని నిధులతో పనులు జరిగాయి? ఎందరు లబ్ధి పొందారో వివరించి ప్రజలను ఆకట్టుకునేలా చేయడం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. -
వడగళ్ల దెబ్బ! వేల ఎకరాల్లో పంట నష్టం.. ఆరు జిల్లాల్లో ప్రభావం..
సాక్షి, హైదరాబాద్: వడగళ్ల వానలు రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం కలిగించాయి. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో టమాటా, బీరకాయ, మొక్కజొన్న, పచ్చిమిర్చి, బొబ్బర్లు, మినుములు తదితర పంటలకు నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల పొట్టదశకు వచ్చిన వరి నేలవాలింది. మామిడి పిందెలు, కాయలు రాలి తీవ్ర నష్టం వచ్చిందని రైతులు వాపోతున్నారు. ఆరు జిల్లాల్లో ప్రభావం.. అకాల వర్షాలతో ప్రధానంగా ఆరు జిల్లాల్లో పంటలపై ప్రభావం పడింది. సుమా రు 50 మండలాల్లోని 650 గ్రామాల్లో నష్టం జరిగిందని.. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో నష్టం తీవ్రంగా ఉందని అధికారులు చెప్తున్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్, మర్పల్లి మండలాల్లో అయితే పంట పొలాలన్నీ వడగళ్లతో నిండిపోయి మంచు ప్రాంతంలా మారిపోయాయి. ఆ పంటలు చేతికందే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. దీనితోపాటు సంగారెడ్డి, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ పలుచోట్ల వడగళ్లతో పంటలు దెబ్బతిన్నాయి. నేడు మంత్రి పర్యటన వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని.. శుక్రవారం రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలసి నష్టాన్ని పరిశీలిస్తానని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మామిడి, గులాబీ, ఉల్లి, బొప్పాయితోపాటు మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్టు తెలుస్తుందన్నారు. -
రిపబ్లిక్ డే వేడుకలు ఎలా చేయాలో ప్రభుత్వానికి తెలుసు: పల్లా రాజేశ్వర్ కౌంటర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కి లేఖ రాసింది. అనివార్య కారణాలతో పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ వేడుకలు జరపలేమని తెలిపింది. రాజ్‌భవన్‌లోనే వేడుకలు నిర్వహించాలని లేఖలో ప్రభుత్వం పేర్కొంది. దీంతో, ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంపిన లేఖపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. కాగా, పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్‌ను ప్రభుత్వం ఎప్పుడూ అవమానించలేదు. రిపబ్లిక్ వేడుకలు ఎలా జరపాలో ప్రభుత్వానికి తెలుసు. రాజ్‌భవన్‌లో కూడా ఏర్పాట్లు చేసేది ప్రభుత్వమే. గవర్నర్‌ను సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఒక్క మాట అనలేదు. ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రొటోకాల్ పాటిస్తోంది అని స్పష్టం చేశారు. మరోవైపు.. గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజ్‌భవన్‌లోనే జరుపుకోవాలన్న ప్రభుత్వ లేఖపై గవర్నర్ తమిళిసై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో రిపబ్లిక్ వేడుకలపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం దిక్కరించడంపై పిటిషన్ దాఖలు చేశారు. వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ మాధవి ధర్మాసనం విచారించనుంది. -
బండి సంజయ్‌కు ‘కంటి వెలుగు’ పరీక్షలు అవసరం
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) బుధవారం ఖమ్మంలో నిర్వహించిన బహిరంగసభ ద్వారా దేశ రాజకీయాలతోపాటు జిల్లా రాజకీయాలు కూడా మారుతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. పార్టీ నేతల సమన్వయంతో సభ విజయవంతమైందని, ఖమ్మం చరిత్రలో ఈ తరహా సభ ఎన్నడూ జరగలేదని అన్నారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో కలిసి గురువారం బీఆర్ఎస్ శాసన సభాపక్ష కార్యాలయంలో అజయ్ మీడియాతో మాట్లాడారు. ఖమ్మం సభ ఫ్లాప్ అయిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అంతటి భారీసభను కూడా చూడలేకపోయిన ఆయనకు కంటి వెలుగు పరీక్షలు అవసరమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 24 గంటల కరెంటు గురించి సంజయ్‌కు సందేహాలు ఉంటే, రాష్ట్రంలో ఎక్కడైనా కరెంటు తీగను పట్టుకుని చూడాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు సీఎం కేసీఆర్ సుపారీ ఇచ్చారంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఆ పార్టీ నేతలే సరిపోతారన్నారు. సభలో ఖమ్మం జిల్లాకు సీఎం నిధుల వరద పారించారని, అభివృద్ధికి గుమ్మంలా ఖమ్మం మారిందని పువ్వాడ అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా 2001లో జరిగిన కరీంనగర్ సభ తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసినట్లే, ఖమ్మం బీఆర్ఎస్ సభ జాతీయ రాజకీయాల్లో మార్పులకు నాంది పలుకుతుందని రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రగతిశీల శక్తుల కలయికకు ఖమ్మం సభ బాటలు వేసిందని అభిప్రాయపడ్డారు. విద్యుత్ రంగాన్ని బడా పారిశ్రామికవేత్త అదానికి కట్టబెట్టే కుట్రలను ప్రతిఘటించడంతోపాటు తెలంగాణ తరహాలో దేశమంతా ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి స్థానం లేదని బీఆర్ఎస్ బహిరంగ సభ ద్వారా తేలిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఇక్కడ డిపాజిట్లు కూడా రావని రవిచంద్ర అన్నారు. -
కరెంట్ ఉందో లేదో అలా తెలుసుకో.. సంజయ్‌కు పువ్వాడ కౌంటర్
సాక్షి, ఖమ్మం: ఖమ్మం బీఆర్ఎస్ తలపెట్టిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సహా ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, సభలో సీఎం కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేశారు. ఇక, కేసీఆర్ కామెంట్స్ బీజేపీ, కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పువ్వాడ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తనను తానే ఓడించుకుంటోంది. కంటి వెలుగులో బండి సంజయ్ అద్దాలు తీసుకోవాలి. బండి అన్ని తొండి మాటలు మాట్లాడుతున్నారు. లాభాల్లో నడుస్తున్న సంస్థలను కేంద్రం మూసివేస్తోంది. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఉందో లేదో తెలియాలంటే ఏ మోటర్‌లోనైనా బండి సంజయ్ వేలు పెట్టి చూడాలని చురకలంటించారు. మాకు వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యం. ఇంత పెద్ద సమావేశానికి ప్రత్యేకమైన ఆహ్వానం అవసరం లేదు.. బొట్టుపెట్టి పిలవరు’ అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో చారిత్రాత్మక సభ జరిగింది. కరీంనగర్ సింహగర్జన సభం తెలంగాణ ఏర్పాటుకు స్పూర్తి. ఖమ్మం సభ దేశ అభివృద్దికి నాంది కాబోతోంది. ఖమ్మం సభ విజయంతో బీఆర్ఎస్ పార్టీ మొదటి అడుగు ప్రారంభమైంది. సభపై ఎంత మంది విమర్శలు చేసినా, వక్రభాష మాట్లాడిని ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని రుజువైంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ సభకు వారెందుకు రాలేదు.. బండి సంజయ్ సూటి ప్రశ్న -
సజ్జల వ్యాఖ్యల వెనుక మోదీ కుట్ర!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సహా అవకాశం చిక్కిన ప్రతీ సందర్భంలోనూ అనేకమంది రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ పునర్విభజనపై విషం చిమ్మేలా మాట్లాడారని, ఆయన వ్యాఖ్యల వెనుక ప్రధాని మోదీ కుట్ర ఉందని ఆరోపించారు. ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలసి గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని మాట్లాడిన మోదీ దన్నుతోనే గతంలో చంద్రబాబు, ప్రస్తుతం సజ్జల మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ కేఏపాల్‌తో సహా అనేక బాణాలను వదులుతోందన్నారు. ఏపీలో తెలంగాణను విలీనం చేస్తారనే మాటలు మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఏ విషయంపైనా అవగాహన లేదని, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు బీజేపీతో పాటు గవర్నర్ కూడా శిక్షణ ఇస్తున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. -
ధాన్యం సేకరణపై స్పందించకుంటే నిలదీస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని, బీజేపీ నేతలను గ్రామాల్లో నిలదీస్తామని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. మోదీ కుట్రలను ఛేదించడంతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంతుచూస్తామన్నారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యే జాజుల సురేందర్‌తో కలిసి శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పండిన ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వరద తగ్గిన తర్వాత మరమ్మతులు చేసి పంపులను వినియోగంలోకి తెస్తుందని రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. -
‘రైతుబంధు’తో వ్యవసాయ విప్లవం
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు ప్రపంచ వ్యవసాయ రంగంలో ఒక విప్లవం అని, ఈ పథకం రైతులకు బతుకుపై భరోసా కల్పించిందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న పలు రైతు కేంద్రీకృత నిర్ణయాలతో తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రమే మారిపోయిందన్నారు. ఈ మేరకు ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘వానాకాలం, యాసంగి సీజన్‌కు ముందు అప్పు చేయాల్సిన అవసరం లేకుండా పెట్టుబడి సాయంగా రైతులకు ప్రభుత్వం రైతుబంధు అందజేస్తుంది. ఏటా ఎకరానికి రూ.10 వేలు ఇస్తుంది. ఇప్పటివరకు తొమ్మిది సీజన్లలో రూ.58 వేల కోట్లను రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ప్రస్తుత సీజన్లో ఐదు ఎకరాల్లోపు 56.43 లక్షల మంది రైతులకు రూ.4,801 కోట్లు వారి ఖాతాల్లో జమయ్యాయి. గతంలో ఏ కారణంగానైనా రైతు మరణిస్తే.. ఆ కుటుంబం రోడ్డున పడేది. ఇప్పుడు రైతు బీమాతో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందిస్తున్నాం. ఇప్పటివరకు 83,471 కుటుంబాలకు రూ.4,173 కోట్లను ప్రభుత్వం అందించింది. రూ. 572 కోట్ల వ్యయంతో 2,601 క్లస్టర్లలో రైతు వేదికలను నిర్మించాం. వీటి నిర్వహణకు నెలకు రూ. 9 వేలు ఇస్తున్నాం’ అని వివరించారు. బడ్జెట్లో రూ. 30 వేల కోట్లు... మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి గోసను తీర్చారు. ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయానికి రూ. 30 వేల కోట్లు కేటాయించింది. ఉచిత విద్యుత్ చెల్లించే రూ. 10 వేల కోట్లు ఇందుకు అదనం. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో పండిన ధాన్యం 24 లక్షల టన్నులు మాత్రమే. అదే గతేడాది ఏకంగా 1.41 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. రైతులు వరితోపాటు ఇతర పంటల సాగుపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం తరఫున పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. -
ధాన్యం సేకరణకు బీజేపీ మోకాలడ్డుతోంది: పల్లా
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణకు బీజేపీ నేతలు సహకరించకపోగా, అడుగడుగునా మోకాలడ్డుతున్నారని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ఎల్పీలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్‌తో కలిసి ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తోడై తెలంగాణకు, రైతులకు శాపంగా మారారన్నారు. ఉప్పుడు బియ్యం సమస్య తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా ఉందని ఆ రాష్ట్రాల ఎంపీలు చెబుతుంటే రేవంత్ సిగ్గు లేకుండా తెలంగాణలోనే సమస్య ఎందుకుందని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైద్య సీట్ల భర్తీపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలతో గవర్నర్‌కు లేఖ రాశారని పేర్కొన్నారు. తమ ప్రమేయంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రులు పువ్వాడ అజయ్, మల్లారెడ్డి స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. వైద్య విద్య ప్రవేశాల్లో అక్రమాలపై ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోలేదని నిరూపిస్తే తాను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ..బీజేపీ లేకపోతే టీఆర్ఎస్కు పదవులు ఎక్కడివని బండి సంజయ్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 1997 నాటి కాకినాడ తీర్మానానికి అనుగుణంగా 2000 సంవత్సరంలోనే మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణను ఇచ్చి ఉంటే ఇన్ని బలిదానాలు జరిగేవా అని ప్రశ్నించారు. -
బాపూ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
కవాడిగూడ: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో రూపొందించిన 2022 నూతన సంవత్సర బాపూ డైరీనీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రగతిభవన్‌లో గురువారం ఆవిష్కరించారు. అనంతరం గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ వడ్ల సుబ్రమణ్యం మాట్లాడుతూ... తమ డైరీలో ఐక్యరాజ్య సమితి సూచించిన 17 స్థిర అభివృద్ధి లక్ష్యాలను పొందుపరిచినట్లు వెల్లడించారు. గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న సంస్థ ప్రతినిధుల కృషిని మంత్రి కేటీఆర్ అభినందించినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని గోశాలలో నిర్వహిస్తున్న రామచంద్ర ప్రకృతి ఆశ్రమానికి హాజరు కావాలని మంత్రి కేటీఆర్‌ను కోరగా సానుకూలంగా స్పందించిన మంత్రి, ఆశ్రమానికి వస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల కార్యదర్శి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డిగ్రీ కళాశాల సంఘం అధ్యక్షుడు ఎస్.వి.సి.ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. -
‘బీజేపీ ఎంపీలది శిఖండి పాత్ర’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించేవిధంగా బీజేపీ ఎంపీలు శిఖండి పాత్ర పోషిస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రప్రగతిని అడ్డుకునేందుకు కొన్నిశక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో సోమవారం పార్టీ నేతలు ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, లింగంపల్లి కిషన్‌రావు, రూప్‌సింగ్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుబంధు ద్వారా ఇప్పటివరకు రైతుల బ్యాంకుఖాతాల్లో రూ.50 వేలకోట్లు వేసిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా మారిందని, రైతుసంక్షేమం గురించి అనేక రాష్ట్రాలు తెలంగాణను చూసి నేర్చుకుంటున్నాయని పేర్కొన్నారు. ఒమిక్రాన్ నిబంధనలకు లోబడే రైతుబంధు సంబురాలు చేసుకోవాలని తాము రైతులకు పిలుపునివ్వడం కొందరు కుహనా రాజకీయ నాయకులకు ఇబ్బందిగా మారిందని పల్లా విమర్శించారు. రైతుబంధుతో రైతులు సోమరిపోతులు అవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడాన్ని పల్లా ఖండిస్తూ, ఆయన రైతులను కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. రైతుబీమా పథకం కింద రాష్టంలో ఇప్పటివరకు 70,714 మంది రైతు కుటుంబాలకు బీమా పరిహారం ఇచ్చామని చెప్పారు. ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల కొనుగోలు కేంద్రాల ద్వారా 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. రాష్ట్రంలో లేని ఆత్మహత్యలను ఉన్నట్లుగా చిత్రీకరించేందుకు రైతు స్వరాజ్యవేదిక అనే సంస్థ ప్రయత్నిస్తోందని, అది ఆంధ్రా నాయకులు పెట్టుకున్న వ్యాపార సంస్థ అని పల్లా ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. -
బీజేపీని గద్దె దింపే శక్తులతో చేతులు కలుపుతాం!
సాక్షి, హైదరాబాద్: కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బీజేపీని గద్దెదింపే శక్తులతో తమపార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చర్చించి చేతులు కలుపుతారని స్పష్టం చేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శులు ప్రొఫెసర్ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, సోమ భరత్‌కుమార్ గుప్తాతో కలసి సోమ వారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్ఐసీ సంస్థను ప్రైవేటీకరించే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. వరిసాగును ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వానికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రంపై పోరు సాగిస్తున్న కేసీఆర్ అవసరమైన సమయంలో కీలకనిర్ణ యం తీసుకుంటారని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, పీయూష్ గోయెల్ అబద్ధాలు చెప్తున్నారని, వచ్చే యాసంగి లోనూ వరిసాగు చేయకుండా అడ్డుకున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ బాగుందని గవర్నర్ తమిళిసై కూడా మెచ్చుకున్నారని పల్లా గుర్త చేశారు. -
రైతుల వేషంలో ఉన్నది బీజేపీ కార్యకర్తలే: పల్లా
సాక్షి, హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు అంశంపై బీజేపీకి కనీస అవగాహన లేదని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆ పార్టీ ధర్నాలు చేస్తోందని విమర్శించారు. గురువారం బీజేపీ నిర్వహించిన ధర్నాలో రైతుల వేషంలో ఉన్న బీజేపీ కార్యకర్తలే పాల్గొన్నారన్నారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సోమ భరత్‌కుమార్ గుప్తాతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,550 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినా బీజేపీ నాయకులు సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వానాకాలం పంట కొనుగోలుకు సంబంధించి ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. కనీస జ్ఞానం లేని వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో పండించే వరి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు ఢిల్లీలో ధర్నాలు చేయాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. ఇతర రాష్ట్రాల్లో రైతులు తమ దిగుబడులను అమ్ముకునేందుకు బహిరంగ మార్కెట్లకు వెళ్లారని, కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతుల ముగింట్లోకి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసిందీ లేనిదీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. అబద్ధాలతో కొనసాగుతున్న బీజేపీ రాజకీయ ప్రస్థానం రాష్ట్రంలో ఎక్కువ కాలం కొనసాగదని పల్లా అన్నారు. ధర్నా చౌక్‌ను రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఎత్తివేయలేదని.. స్థానికుల ఫిర్యాదు మేరకే ఆ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. -
2023లోనూ టీఆర్ఎస్దే విజయం: ఎమ్మెల్సీగా పల్లా ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల శాసనమండలి సభ్యుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి గురువారం పల్లాతో ప్రమాణ స్వీకారం చేయించారు. మార్చిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత ఉత్కంఠ రేపిన ఎన్నికల ఫలితాల్లో చివరకు పల్లా విజయం సాధించారు. ప్రమాణం అనంతరం రాజేశ్వర్‌రెడ్డిని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మార్చిలో జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో భారతదేశ చరిత్రలో 72 మంది పోటీ చేయగా రికార్డు మెజారిటీతో పట్టభద్రులు తనను గెలిపించారని తెలిపారు. 10 లక్షల మంది ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచిన చరిత్ర సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. 2023లో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో నేరాలు తగ్గాయని చెప్పారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన సంఘటన దురదృష్టకరమని తెలిపారు. దుర్మార్గుడు రాజు తనకు తాను శిక్ష విధించుకున్నాడని, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదదని స్పష్టం చేశారు. చదవండి: జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం -
ఫోన్‌కాల్ కలకలం: ‘నువ్వేమైనా కేసీఆర్వా.. లేక ఎర్రబెల్లివా?’
హన్మకొండ అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోదరి చాడ సరిత వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో మొరం తరలింపు విషయం వివాదంగా మారింది. అప్పట్లో స్వాధీనం చేసుకున్న ఇటాచీ సహా ఇతర వాహనాలను తక్కువ జరిమానాతో వదిలేయాలని అక్కడి తహసీల్దార్ విజయలక్ష్మికి ఫోన్లో హుకుం జారీ చేశారు సరిత. అయినా తహసీల్దార్ వినకపోవడంతో గట్టిగా బెదిరించారు. ఇటీవల జడ్పీటీసీ, తహసీల్దార్ మధ్య సాగిన ఫోన్ సంభాషణ బుధవారం సోషల్ మీడి యాలో వైరల్‌గా మారింది. తాను చెప్పినా.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పినా ఒక్కటిగా భావించాలని, ఎమ్మెల్సీ మాట వింటారా, ఎంపీపీ మాట వింటారా మొదట తేల్చుకోవాలని జడ్పీటీసీ సరిత చెప్పారు. ‘రూ.25 వేలు కట్టించుకుని మిషన్ రిలీజ్ చేయండి.. అక్కడే పెట్టుకుంటే తుప్పు పట్టి పోవాల్నా.. అవసరమైతే ఎమ్మార్వో ఆఫీసు ఎదుట కూర్చుంటా’అని సరిత హెచ్చరించారు. అయితే.. తాము మొదటి నుంచీ రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తున్నామని, అయినా కలెక్టర్ చెప్పినట్లు చేస్తానని తహసీల్దార్ చెప్పడంతో.. జడ్పీటీసీ జోక్యం చేసుకొని ‘మనవాడే కదా అని తీసుకొస్తే రూ.లక్ష కట్టమంటే ఎలా? రూ.25 వేలు కట్టించుకొని రిలీజ్ చేయాలని హుకుం జారీ చేశారు. అసలు ఎంపీపీ ఎవరు? ఏమన్నా.. ఎర్రబెల్లి దయాకర్‌రావా.. లేకుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ప్రతీదిఅన్నయ్యకు చెప్పి చేస్తా.. ఇది మా అన్నయ్య మాట. పల్లా మాట వింటారా... ఎంపీపీ మాట వింటారా మీ ఇష్టం అని’సరిత చెప్పారు. తర్వాత ఏం జరిగిందో కానీ వేలేరు తహసీల్దార్ విజయలక్ష్మిని కలెక్టరేట్‌కు బదిలీ చేయడం కొసమెరుపు. చదవండి: కఠిన కర్ఫ్యూ.. తెలంగాణలో భారీగా లాక్డౌన్ సడలింపులు -
కురుక్షేత్ర యుద్ధంలో ఈటల పాత్ర ఏంటో చెప్పాలి?
హైదరాబాద్: గులాబీ గూటికి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ అండ లేకుండానే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారా? అంటూ ఈటల రాజేందర్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కురుక్షేత్ర యుద్ధంలో ఈటల పాత్ర ఏంటో చెప్పాలి? ఈటెల బీజేపీలో చేరి పెట్రోల్-డీజిల్ తగ్గిస్తారా? పోలవరం తరహాలో తెలంగాణకు జాతీయస్థాయి ప్రాజెక్టు రప్పిస్తారా? ఈటెలకు మర్యాద ఇవ్వలేదు అంటే ఎలా? మంత్రి పదవి ఇచ్చారు చాలదా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అంతేకాకుండా ఈటలపై నమ్మకంతో కేసీఆర్ ఫ్లోర్ లీడర్ అవకాశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గొప్పతనాన్ని పొడిగిన విషయం గుర్తుచేసుకోవాలి అన్నారు. ఈటల వ్యక్తిగతంగా జరిగిన తప్పును నిరూపించుకోలేక నిరాశలో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇన్నేళ్లు ఈటలను పెంచి పోషించిన కేసీఆర్‌పై అబండాలు వెయ్యడం సరైంది కాదని, అన్నం పెట్టిన పార్టీపై విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఇక ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వరవరరావుని జైల్లో పెట్టిన పార్టీలో ఎలా జాయిన్ అవుతారని అన్నారు. బీజేపీపై నెలక్రితం చేసిన విమర్శలు ఈటలకు గుర్తులేవా? అని ఆయన అడిగారు. నాడు దయ్యంలా కనిపించిన బీజేపీ.. నేడు దైవం అయ్యిందా? అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. చదవండి: వారు గాడిదపై ప్రయాణిస్తున్నట్టున్నారు! -
ఈటల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతల కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈటల తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రకమని వ్యాఖ్యానించారు. కన్నతల్లిలాంటి పార్టీపై ఈటల అభాండాలు వేశారని ఆయన మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఉద్యమ ఎజెండా రూపొందించింది కేసీఆర్. నాయకత్వ లక్షణాలు లేకున్నా ఈటలను కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు. ఈటలకు ఎన్నో పదవులు ఇచ్చి గౌరవించారు. పార్టీలో ఉన్నప్పుడు దేవుడన్నారు.. ఇప్పుడేమో నియంతా?’’ అంటూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘బడుగుబలహీన వర్గాలకు చెందిన భూములను ఈటల ఎలా కొంటారు?. అనామకుడి ఫిర్యాదుపై సీఎం స్పందించారంటే అది ప్రజాస్వామ్యం గొప్ప. ఈటలకు ఆత్మగౌరవంపై కాదు.. ఆస్తులపై గౌరవం ఉంది. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే ఆత్మగౌరవ నినాదం. అధికారులను వాడుకుని వారిపైనే నిందలు మోపుతున్నారని’’ పల్లా నిప్పులు చెరిగారు. ఆస్తులను రక్షించుకోవడానికే ఈటల ప్రయత్నాలు: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆస్తులను రక్షించుకోవడానికే ఈటల రాజేందర్ ప్రయత్నాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దుయ్యబట్టారు. ఢిల్లీలో ఉన్నవాళ్లు కూడా ఈటలను కాపాడలేరన్నారు. ప్రగతి భవన్ లో అడుగుపెట్ట నివ్వలేదంటూ ఈటల దిగజారుడు మాటలు బడుగు బలహీన వర్గాలు విశ్వసించరని బాలరాజు అన్నారు. చదవండి: Etela Rajender: టీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా కిడ్నాప్ తరహాలో జర్నలిస్ట్ అరెస్టా?: సంజయ్ -
'నీ కమ్యూనిజం బీజేపీ నేతల వద్ద తాకట్టు పెట్టావా?'
సాక్షి, హైదరాబాద్: 'ఈటల నీ కమ్యూనిజం ఇప్పుడు ఎక్కడ పోయింది.. బీజేపీ నేతల దగ్గర తాకట్టు పెట్టావా' అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. '' ఇవాళ ఈటలను అందరూ ఛీ కొడుతున్నారు. ఒక మంత్రిగా ఈటల చట్ట విరుద్ధమైన పనులు చేశారు? ప్రభుత్వ భూములు ఎలా తీసుకున్నావు? నీ ఆత్మగౌరవం ఎక్కడ ఉంది?.. 20 ఏళ్లల్లో సీఎం కేసీఆర్ ఎందరో నేతలను తయారు చేశారు. కానీ నిన్ను గౌరవించినట్లు కేసీఆర్ ఇంకెవరినీ గౌరవించలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ పదవులు మీరే అనుభవించారు. నాయకుడు, పార్టీపై నమ్మకం లేకుంటే చెప్పాలి. ఈటల క్షమించరాని నేరం చేశారు. సమయం చూసి ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటాం'' అని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్లో ఉన్నవారికి ఆత్మగౌరవం లేదు: డీకే అరుణ హైదరాబాద్: టీఆర్ఎస్లో ఉన్నవారికి ఆత్మగౌరవం లేదని బీజేపీ మహిళా నేత డీకే అరుణ మండిపడ్డారు. ఈటలపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె తనదైన శైలిలో తిప్పికొట్టారు. ఇతరుల ఆత్మగౌరవంపై మాట్లాడే అర్హత పల్లాకు లేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్లో ఉన్నవారికి ఆత్మలు ఉంటే కదా గౌరవం ఉండేది అని అరుణ విరుచుకుపడ్డారు. -
టీఆర్ఎస్కే పట్టం.. రెండు స్థానాలు 'గులాబీ'కే
సాక్షి, హైదరాబాద్: హోరాహోరీగా సాగిన శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి రెండు స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది మొదలు ప్రత్యర్థులపై ఆధిక్యత కనబరుస్తూ వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ పైచేయి సాధించి విజేతలుగా నిలిచారు. దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రతికూలతను చవిచూసిన టీఆర్ఎస్కు ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేసిన రెండు చోట్లా పట్టభద్రులు పట్టం కట్టారు. గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైన పట్టభద్ర ఓటర్ల నమోదు మొదలుకుని అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో దూకుడు, పార్టీ యంత్రాంగం నడుమ సమన్వయం.. తదితరాల్లో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనుసరించిన బహుముఖ వ్యూహం పార్టీ అభ్యర్థుల విజయానికి బాటలు వేసింది. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనంటూ... రాష్ట్రంలో రాజకీయంగా ఇరకాటంలోకి నెడుతున్న బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, మరోచోట ఆ పార్టీ అభ్యర్థి నాలుగో స్థానంలో నిలవడం టీఆర్ఎస్కు నూతన ఉత్తేజాన్ని ఇస్తోంది. మరోవైపు కేసీఆర్‌తో విభేదిస్తూ రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన వారితో పాటు సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్న వారు కూడా ఓటమి చెందడం తమ శ్రేణుల్లో నైతిక స్థైర్యం పెంచుతుందని పార్టీ భావిస్తోంది. కాగా పట్టభద్రుల ఎన్నికల ఫలితమిచ్చిన ఊపుతో త్వరలో జరిగే నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలోనూ గెలుపు సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. నల్లగొండలో విజయ సంకేతం చూపిస్తున్న పల్లా -
MLC Election Results: సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్న టీఆర్ఎస్
సాక్షి, నల్గొండ: నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోసారి విజయం సాధించారు. ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఆయన ఎట్టకేలకు తీన్మార్ మల్లన్నపై గెలుపొందారు. కాగా మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుపై ఆమె గెలుపొందారు. చదవండి: MLC Election Results: సురభి వాణిదేవి విజయం -
కౌంటింగ్ కేంద్రం వద్ద తీన్మార్ మల్లన్న, పల్లా!
► ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తీన్మార్ మల్లన్న లెక్కలు సేకరించే పనిలో నిమగ్నమయ్యా డు. తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ ►కౌంటింగ్ కేంద్రం వద్ద ఎండ వేడికి మజ్జిగ తాగుతున్న పల్లా నిద్ర సుఖమెరుగదు.. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రెండు రోజులుగా ఎఫ్‌సీఐ గోదాములో హమాలీలు 24 గంటలు అలుపెరుగక బాక్సులు మోశారు. కంటికి నిద్ర లేకపోవడంతో ఇలా కౌంటింగ్ కేంద్రం ఆవరణలో ఆదమరిచి నిద్రిస్తున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ -
డబ్బులు పంచుతూ వీడియోకు అడ్డంగా దొరికిపోయారు.
-
తెలంగాణ ఎమ్మెల్సీ: డబ్బులు పంచుతూ వీడియోకు అడ్డంగా
సాక్షి, నల్గొండ: నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి నేడు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్కు ఓటు వేయాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు బూత్‌లోకి వచ్చే పట్టభద్రులకు డబ్బులు పంచడం స్థానికంగా కలకలం రేపింది. తాజాగా భువనగిరి, సూర్యాపేట, దేవరకొండలో ఓటు వేయడానికి వస్తున్న పట్టభద్రులను ప్రలోబాలకు గురిచేస్తూ డబ్బులు పంచుతూ వీడియోకు అడ్డంగా దొరికిపోయారు. నల్గొండ- వరంగల్- ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్), ఎస్.రాములునాయక్ (కాంగ్రెస్), గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ), బి.జయసారధి రెడ్డి (సీపీఐ), ప్రొఫెసర్ ఎం.కోదండరాం (టీజేఎస్) తదితరులు పోటీ పడుతున్నారు. కాగా నల్గొండలోని నాగార్జున డిగ్రీ కళాశాల బూత్ నెం 30 లో ఘర్షణ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నాయకులు బీజేపీ ఏజెంట్‌పై చేయి చేసుకోవడంతో ఘర్షణలు చెలరేగాయి. గుర్తింపు కార్డు లేకుండా ఎలా ఏజెంట్‌గా కూర్చున్నారంటూ బీజేపీ ఏజెంట్‌పై టీఆర్ఎస్ నేతలు చేయి చేసుకున్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ వార్త తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు భారీగా పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులో తేవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చదవండి: MLC Elections 2021: పోలింగ్ లైవ్ అప్డేట్స్ -
లెక్కలు తప్పులైతే ముక్కు నేలకు రాస్తా..
భద్రాచలం: రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఉద్యోగాల లెక్కలన్నీ వాస్తవమేనని, ఆ లెక్కల్లో తప్పులున్నాయని ఆరోపణలు చేస్తున్న పార్టీలు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి, టీఆర్ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి సవాల్ విసిరారు. శనివారం కేకే ఫంక్షన్హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీల్లో భాగంగా కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం మేరకు నిరుద్యోగులకు లక్షకు పైగా ఉద్యోగాలు అందాయని, ఈ లెక్కలు తప్పులని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో పస లేదని స్పష్టం చేశారు. పట్టభద్రులు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెల్లం వెంకట్రావు, బోదెబోయిన బుచ్చయ్య పాల్గొన్నారు. అశ్వాపురం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పదే పదే ప్రశ్నించే గొంతుకను ఎన్నుకోవాలంటున్నారని, ప్రశ్నించడం ఎవరికైనా సాధ్యమని, సమస్యలను పరిష్కరించే గొంతుకను ఎన్నుకోవాలని ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని గౌతమీనగర్ కాలనీలోని అతిథి గృహంలో శనివారం భారజల కర్మాగారం ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో ఆయన ప్రత్యేక సమావేశమయ్యారు. ముత్తినేని సుజాత, బాణోత్ శారద, సదర్లాల్, పాడ్య కేశవరావు, మోహన్‌రావు, వెంకటరెడ్డి, డీవీ రావు, డీవీ చారి, కూరపాటి శ్రీనివాసరావు, పెదిరెడ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. చదవండి: మా మౌనం.. గోడకున్న తుపాకీ -
పల్లా రాజేశ్వర్ పెద్ద బ్రోకర్: ఉత్తమ్
సాక్షి, ఖమ్మం: ''పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక పెద్ద బ్రోకర్ అని.. పెద్దల సభకు అడుగుపెట్టే అర్హత ఆయనకు లేదంటూ'' పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్పీ ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం ఖమ్మం వచ్చిన ఉత్తమ్ కుమార్ ఖమ్మం- నల్గొండ- వరంగల్ అభ్యర్థి రాములు నాయక్‌ను గెలిపించాలని కోరారు. రాములు నాయక్‌తో పాటు రంగారెడ్డి- హైదరాబాద్-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్న చిన్నారెడ్డికి టీటీఎఫ్, ఎస్టీఎఫ్ మద్దతు తెలిపిందని ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ''రాములు నాయక్ కి లక్షా 13వేల మోజార్టీ రావాలి.. జనరల్ సీటులో భాగంగా గిరిజన నాయకుడికి సీటు ఇచ్చాం.కేసీఆర్ నిరంకుశత్వం, దోపిడీ తీరు, ఎస్సీ, ఎస్టీ సభ్యుల పట్ల వివక్షత చూపించి తమ వారిని అవమానించిందన్న కారణంతో రాములు నాయక్ టీఆర్ఎస్ పోలీట్ బ్యూరో కి రాజీనామా చేసిన వ్యక్తిగా పేరు పొందారు. కాంగ్రెస్ సామాజిక న్యాయంకి కట్టుబడి ఉంది. బీజేపీ, కమ్యూనిస్టులు దళితులను గుర్తించలేదు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక బ్రోకర్.పెద్దల సభకు ఆయనకు అర్హత లేదు.ఆరేళ్ళ నుంచి ప్రజలకు అందుబాటులో లేరు.పల్లా, మల్లారెడ్డి ప్రైవేట్ యునివర్సిటీ లు తెచ్చుకొని లాభపడ్డారు. కోదండ రామ్ కు ఓటు వేస్తే అది వృధానే.. పల్లా ప్రలోభాలకు ఓటర్లు లొంగరు..పోటాపోటీగా ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 30లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాల విషయంలో టీఆర్ఎస్ వాళ్ళు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ఈ ఏడేళ్లలో కేసీఆర్ ఇంట్లో ఉద్యోగాలు వచ్చాయి.. నిరుద్యోగులకు కాదు. కొత్త బిచ్చగాళ్ల కి పొద్దు ఎరగడ అన్నట్లు బండి సంజయ్ తీరు ఉంది.కాంగ్రెస్ వాళ్ళ ను డబ్బుల సంచితో కొనుగోళ్ళు చేస్తున్నారు. కేసీఆర్ దేవుళ్లను కూడా మోసం చేశారు. వంద కోట్లు భద్రాద్రి రామునికి ఇస్తాం అన్నాడు.అంతేకాదు పీఆర్సీ, పదోన్నతులు అంటూ ఊరించి చివరకు ఏం చేయకుండానే ఉద్యోగులు, ఉపాధ్యాయులును అవమాన పర్చారు.''అంటూ మండిపడ్డారు. చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు: పార్టీ నేతలకు కేటీఆర్ వార్నింగ్ -
‘పల్లాను గెలిపిస్తే సీఎం గ్లాస్లో సోడా పోశాడు’
సాక్షి, నల్లగొండ : తెలంగాణలో రాక్షస పాలన, గడీల పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. జిల్లా కలెక్టరేట్ వద్ద బండి సంజయ్ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేధావి వర్గం బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. నీచ రాజకీయాలకు సమాధి కట్టాలన్నా.. టీఆర్ఎస్పార్టీ పార్టీ మెడలు వంచాలన్నా.. దమ్మున్న బీజేపీని గెలిపించాలని అభ్యర్థించారు. అమరవీరుల రక్తపు మడుగులో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్.. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రగతి భవన్‌కే పరిమితం అయ్యారన్నారు. ఉపాధ్యాయులను మోసం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, వారి కోసం జైలు కెళ్లిన బీజేపీని ఈ ఎన్నికల్లో గెలిపిస్తే పీఆర్సీ వస్తుందని పేర్కొన్నారు. ఉద్యమాల పురిటిగడ్డగా నిలిచిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల్లో పట్టభద్రులు ఆలోచించి ఓటేయాలన్నారు. జీహెచ్ఎంసీలో బీజేపీని గెలిపిస్తే ఎల్ఆర్ఎస్ పారిపోయిందని, ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే నోటిఫికేషన్, పీఆర్సీ వస్తాయని అన్నారు. అదే పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే సీఎం ఫామ్ హౌస్‌కు వెళ్లి గ్లాస్లో సోడా పోశారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని తెలిసి మరీ పల్లాకే మళ్ళీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. చదవండి: న్యాయవాదుల హత్య : సంజయ్ కీలక వ్యాఖ్యలు -
23న పల్లా నామినేషన్!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం బీ ఫారం అందజేశారు. ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో సీఎం కేసీఆర్‌ను రాజేశ్వర్‌రెడ్డి కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ నియోజకవర్గం నుంచి రాజేశ్వర్‌రెడ్డి మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా అభ్యర్థిత్వాన్ని పార్టీ గతంలోనే ఖరారు చేయడంతో ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 16న ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం 23వ తేదీ వరకు కొనసాగనుండగా, చివరిరోజున భారీ బలప్రదర్శనతో నామినేషన్ దాఖలు చేసేందుకు పల్లా సన్నాహాలు చేసుకుంటున్నారు. గురువారం రాజేశ్వర్‌రెడ్డి తరఫున లాంఛనంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. పీఎల్ శ్రీనివాస్‌కు అవకాశం ఇస్తారా? శాసనమండలి ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’స్థానంలో టీఆర్ఎస్ పోటీకి సంబంధించి అస్పష్టత కొనసాగుతోంది. ఈ స్థానానికి మూడు పర్యాయాలు ఎన్నికలు జరిగినా ఒక్కసారి కూడా కైవసం చేసుకోకపోవడంతో పోటీకి దూరం గా ఉండాలని టీఆర్ఎస్ యోచిస్తున్నట్లు సమాచారం. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైనా అభ్యర్థి ఎంపిక, ప్రచారసన్నాహాలకు సంబంధించి ఎలాంటి కదలిక కనిపించడం లేదు. కాగా పార్టీ సీనియర్ నేత, విద్యాసంస్థల అధినేత పీఎల్ శ్రీనివాస్ బుధవారం కేటీఆర్‌ను కలిశారు. ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’శాసనమండలి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వివరించడంతోపాటు అవకాశం ఇస్తే తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. -
పట్టభద్రుల కోటా.. పకడ్బందీగా పావులు
సాక్షి, హైదరాబాద్ : పట్టభద్రుల ఎన్నికపై టీఆర్ఎస్ సీరియస్‌గానే దృష్టి సారించింది. హైదరాబాద్, వరంగల్ స్థానాలు కైవసం చేసుకునేందుకు పకడ్బందీగా పావులు కదుపుతోంది. శాసన మండలి పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్ఎస్), రామచంద్రరావు (బీజేపీ) పదవీ కాలపరిమితి మార్చి 29న ముగియనుంది. ఈ నెల 18న ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’, 22న ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’ పట్టభద్రుల నియోజకవర్గం ఓటరు తుది జాబితా వెలువడనుంది. ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం ‘హైదరాబాద్’ పట్టభద్రుల నియోజకవర్గంలో 4.48లక్షలు, ‘వరంగల్’లో 5లక్షలకు పైగా పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. ఓటరు జాబితాలో కనీసం మూడింట ఒక వంతు మంది పట్టభద్రులు తమ పార్టీ యంత్రాంగం చొరవతోనే ఓటర్లుగా నమోదైనట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా జనవరి మూడో వారంలో ఉమ్మడి ఆరు జిల్లాల పరిధిలోని టీఆర్ఎస్ కీలక నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. ‘వరంగల్’నుంచి మళ్లీ ‘పల్లా’! వరంగల్– ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోమారు పోటీ చేస్తారని టీఆర్ఎస్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఓటరు తుది జాబితా వెలువడిన తర్వాత అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.కాగా, రాజేశ్వర్‌రెడ్డి గతేడాది అక్టోబర్ నుంచే జిల్లాల వారీగా వివిధ సంఘాలు, వర్గాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, రాణిరుద్రమ, జయసారధిరెడ్డి, తీన్మార్ మల్లన్న, రాములు నాయక్ తదితరులు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతుండటంతో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డాలని నిర్ణయించుకుంది. ‘హైదరాబాద్’ బరిలో ఔత్సాహికులు ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’పట్టభద్రుల నియోజకవర్గానికి 2007, 2009, 2015లో మూడు పర్యాయాలు ఎన్నికలు జరిగినా ఇప్పటి వరకు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందలేదు. దీంతో ఈసారి టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డికి ఈ నియోజకవర్గం పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్ల సభ్యత్వ నమోదు పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు ఔత్సాహికులు ఆసక్తి చూపుతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ విద్యా సంక్షేమ మౌలిక వసతుల కల్పన అభివృద్ధి సంస్థ చైర్మన్ నాగేందర్‌గౌడ్ (రంగారెడ్డి) పీఎల్ శ్రీనివాస్ (హైదరాబాద్), శుభప్రద్ పటేల్ (వికారాబాద్), వర్కటం జగన్నాథ్‌రెడ్డి (మహబూబ్‌నగర్) టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పట్టభద్రుల కోటా ఎన్నికపై కేటీఆర్ దిశానిర్దేశం సాక్షి, హైదరాబాద్: ‘వరంగల్– నల్లగొండ– ఖమ్మం’శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు కీలకభేటీ నిర్వహించారు. నియోజకవర్గాలవారీగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. శనివారం ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మె ల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్సీలు, కీలక నేతలు పాల్గొన్నారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం పూర్తవడంతో పార్టీపరంగా జరిగిన ఓటరు నమోదు గురించి ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గాలవారీగా ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించాలని ఆదేశించారు. బూత్ కమిటీల ఏర్పాటు, పార్టీ నేతల సమన్వయం, ప్రచారవ్యూహంపై పలు సూచనలు చేశారు. ఉద్యోగులు, యువతపై నజర్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అనధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఆయనతో సమన్వయం చేసుకుని సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా కేటీఆర్ సూచించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ప్రచార వ్యూహంపై దిశా నిర్దేశం చేస్తామని, ఆలోగా పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేయాలని సూచించారు. ఉద్యోగులు, యువత కోసం ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ఇతర అంశా ల గురించి సన్నాహక సమావేశాల్లో వివరించా లని కేటీఆర్ సూచించారు. ఈ ఎన్నికలో కీలకమైన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, యువతను లక్ష్యంగా చేసుకుని ప్రచారం సాగించాలని దిశానిర్దేశం చేశారు. గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య రెండింతలు పెరిగినందున వీలైనంత ఎక్కువ మందిని చేరుకునేలా కార్యాచరణ ఉండాలన్నారు. నియోజకవర్గస్థాయిలో స్థానిక ఎమ్మెల్యే పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయాలని పేర్కొన్నారు. -
త్వరలోనే సీఎం కేసీఆర్ శుభవార్త
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి : ఎన్నికలప్పుడే ప్రతిపక్షాలకు ప్రజా సమస్యలు గుర్తుకొస్తాయి. ప్రభుత్వం చేసిన మంచి పనులను మాత్రం విస్మరిస్తారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. మంగళవారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తుందన్నారు. ('దుబ్బాకలో బీజేపీ విజయం ఖాయం') ప్రస్తుతం యువత నిరుద్యోగంతో కొంత నిరుత్సాహంగా ఉన్నారు. వారికి సీఎం కేసీఆర్ త్వరలోనే శుభవార్త చెబుతారు. నిరుద్యోగ భృతి ఇద్దామనుకునే సమయానికి మాయదారి కరోనా వచ్చిందన్నారు. ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్నవారే ఇప్పుడు పండుగ అంటున్నారన్నారు. యువత సైతం వ్యవసాయం చేయడానికి ముందుకొస్తున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలో కూడా అన్ని పంటలను కొనడంలేదన్నారు. మన రాష్ట్రంలో ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని వివరించారు. ఇకనైనా బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలను మానుకోవాలని ఎర్రబెల్లి పేర్కొన్నారు. లక్ష ఉద్యోగాలిచ్చాం : పల్లా రాజేశ్వర్ రెడ్డి రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్దే గెలుపని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ఐటీ రంగంలో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు కల్పించామని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక గ్రామాల రూపు రేఖలు మారిపోయాయన్నారు. ప్రతి పక్షాల అసత్య ప్రచారాన్ని ప్రజలు నమోద్దన్నారు. ప్రతి పట్టభద్రుడు తప్పని సరిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. (కేసీఆర్ కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్ధం) -
బీజేపీ దీక్ష ఓ రాజకీయ డ్రామా
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కూడా రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుపై తప్పుడు ప్రచారం చేయడానికే బీజేపీ దీక్షపేరుతో డ్రామాలాడుతోందని విమర్శించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన దీక్ష పెద్ద డ్రామా అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, అన్ని రకాల పంటలకు మద్దతు ధర ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు, మద్దతు ధర అమలు కోటా పరిమితి లేకుండా రైతులు పండించిన మొత్తం ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు దీక్షలు చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. -
సీఎం సహాయ నిధికి విరాళాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సహాయంగా ఆదివారం పలువురు ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. పోకర్న గ్రూప్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందజేసింది. దీనికి సంబంధించిన చెక్కును గ్రూప్ చైర్మన్ గౌతమ్ జైన్ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. అలాగే నాష్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.కోటి విరాళాన్ని అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండీ బీఎస్ఎన్ రెడ్డి, డైరెక్టర్ వీవీఎస్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పంటల తరలింపు బాధ్యత తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన పంటను గ్రామ కొనుగోలు కేంద్రాలకు తరలించడంతో పాటు వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో జిల్లా, మండల గ్రామాల రైతుబంధు సమితి అధ్యక్షులు క్రియాశీలక పాత్ర నిర్వహించాలని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి కట్టడిలో భాగంగా సీఎం ఆదేశాల మేరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి శనివారం జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామ కొనుగోలు కేంద్రంలో గోనెసంచులు, కాంటాలు, టార్పాలిన్ (తాడిపత్రి)లను తగు సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ధాన్యం తీసుకుని వచ్చే రైతులు సామాజిక దూరం పాటించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బులు, శానిటైజర్లు, నీటిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు పలు విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. వరి, మొక్కజొన్న కోత యంత్రాలు గ్రామాల్లోకి రావడానికి తమ అనుమతులను తీసుకోవడానికి రైతులకు సహాయ సహకారాలను అందించాలన్నారు. వెటర్నరీ మందుల దుకాణాలను, విత్తన, ఎరువుల పురుగు మందుల దుకాణాలను తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న పామాయిల్ ఉత్పత్తి కంపెనీని నడిచే విధంగా చూడాలన్నారు. రైతుబంధు సమితి సభ్యులు, తమ గ్రామాలలోని రైతులు పండించిన పంటంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న భరోసా కలిగించాలన్నారు. -
‘కాంగ్రెస్ నేతలకు కళ్లు బైర్లు కమ్మాయి’
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయంతో కాంగ్రెస్, బీజేపీ నేతల కళ్లు బైర్లు కమ్మాయని.. రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ఈయన బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సాధించిన మెజారిటీ భారతదేశ చరిత్రలో ప్రథమం అన్నారు. 130 సీట్లలో 122 గెలిచామని.. ఓ నాయకుడి మీద అఖండ విశ్వాసం ప్రకటించిన ఎన్నికలు ఇవే అన్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి హుజూర్నగర్ ఎమ్మెల్యే సీటు కోల్పోయినా బుద్ధి మార్చుకోలేదని.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పాలక మండలి ఎన్నికపై దుష్ప్రచారం చేస్తున్నారని రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. రాజ్యసభ బులెటిన్ ప్రకారంకేవీపీ రామచంద్ర రావును ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించారని ఆయన గుర్తు చేశారు. ఉత్తమ్ ఎన్నికల కమిషన్ మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి కేవీపీ రామచంద్ర రావు ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా చేర్పించారని అన్నారు. మున్సిపల్ చట్టం రెండో చాప్టర్ ఐదో సెక్షన్‌ను ఉత్తమ్ చదువుకోవాలి హితవు పలికారు. ఎన్నికలు జరిగిన 30 రోజుల్లోపు కూడా ఎమ్మెల్సీ, ఎంపీలు ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా చేరవచ్చు అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల చట్టాలను చదవరని.. వారికి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల ఆకారాలు పెరిగాయి కానీ బుద్ది పెరగలేదని.. ఇంకా వలసవాద భావజాలంతోనే ఉన్నారని విమర్శించారు. కావాలంటే కేవీపీని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా చేయండని.. ఎవరు వద్దన్నారని రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. చట్ట ప్రకారం నేరేడు చర్లలో టీఆర్ఎస్ గెలిచిందని.. తమ విజయాన్ని అపహాస్యం చేయడం కాంగ్రెస్, బీజేపీ నేతలకు తగదన్నారు. బీజేపీ లక్ష్మణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని.. బీజేపీని ప్రజలు తిరస్కరించినా ఆయన తీరు మారటంలేదని రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్రెడ్డివీధి భాగోతాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వ్యవస్థలను తప్పుబడుతున్న ఉత్తమ్ పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవాలని సుమన్ డిమాండ్ చేశారు. పీసీసీ పదవిని కాపాడుకునేందుకు ఉత్తమ్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఎన్నిక జరిగినా టీఆర్ఎస్కే ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందీ పోయి గావు కేకలు పెడుతున్నారని అన్నారు. ఈవీఎంలతో ఎన్నికలు జరిగినా బ్యాలట్తో ఎన్నికలు జరిగినా విజయం టీఆర్ఎస్దే అన్నారు. గాలివాటంతో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లను గెలిచిందని ఆయన విమర్శించారు. లక్ష్మణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా డిపాజిట్ కోల్పాయారని సుమన్ ఎద్దేవా చేశారు. పదవి పోతుందనే లక్ష్మణ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమను ఎంత తిట్టినా లక్ష్మణ్ పదవి పోవడం ఖాయమన్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటి రెడ్డి, లక్ష్మణ్‌లు సీఎం కేసీఆర్, కేటీఆర్‌లపై వాడిన పరుష పదజాలాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో వచ్చే తీర్పే అంతిమమని ప్రతిపక్షాలు గ్రహించాలన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్, బీజేపీ నేతలు మారాలని హితవు పలికారు. ఇక పరిపాలన, పురపాలనపైనే దృష్టి సారించి.. ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల మాదిరిగా తెలంగాణను తీర్చిదిద్దుతామని సుమన్ తెలిపారు. ఈ సమావేశంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
భట్టి దయతో అక్కడ గెలిచాడు: ఎమ్మెల్సీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తప్పించుకునే ప్రయత్నం చేశాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు ప్రభుత్వాలు అలానే చేశాయన్నారు. ఎన్నికలను తప్పించుకోవడానికి కోర్టులో కేసులు వేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడ్డాయని మండిపడ్డారు. ఇక తాజగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ పార్లమెంట్‌లోని అన్ని స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులను ఎంచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందని, కాగా సీఎల్సీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి.. కళ్లులొట్ట పోయినట్లుగా బయటపడ్డారని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డబ్బుతో, భట్టి విక్రమార్క దయతో అసెంబ్లీలో గెలిచారని విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ దూరం అయిందని, ఎన్నికలను అపహాస్యం చేసేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సాధిస్తున్న విజయాల నుంచి కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోవాలన్నారు. ఎన్నికల్లో బీజేపీ మతం తప్ప వేరే ప్రచారం చేయలేదని, ప్రజలకు సంబంధించి ఒక్క విషయం మాట్లాడలేదని పేర్కొన్నారు. అశాంతి కావాలంటే బీజేపీ.. అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లామన్నారు. క్యాంప్ రాజకీయాలకు చిరునామాగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందని, కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ చేసిన రాజకీయాలు దేశం అంతా చుశారని ఆయన వ్యాఖ్యానించారు. -
విజనే లేని పార్టీ కాంగ్రెస్..: పల్లా
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవడంలో కాంగ్రెస్ డొల్లతనం బయటపడిందన్నారు. విజనే లేని కాంగ్రెస్ పార్టీ విజన్ డాక్యుమెంట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 80 శాతం మంది అభ్యర్థులను కూడా నిలబెట్టుకోలేకపోయిన బీజేపీ.. వచ్చే ప్రభుత్వం తమదే అన్నట్టు గొప్పలకు పోతోందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ నవీన్‌రావు, పార్టీ నేతలు దండే విఠల్‌తో కలిసి గురువారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. రూ.5కే భోజనం పెడతామని విజన్ డాక్యుమెంట్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పటికే సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కడుపు నింపుతోందన్న విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని అడిగి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు, పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ఇవన్నీ తమ ప్రభుత్వ పథకాలే అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్, తమ ప్రభుత్వం వస్తే ఈ కార్యక్రమాలు చేస్తామంటోందని ఎద్దేవా చేశారు. -
ఆ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే..
సాక్షి, హైదరాబాద్: విజన్ లేని కాంగ్రెస్ పార్టీ.. విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిందని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన గురువారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విజన్ డాక్యుమెంట్ లో రూ.5 భోజనం పెడతామని కాంగ్రెస్ చెబుతోందని.. ప్రభుత్వం ఐదేళ్లుగా రూ.5 భోజనం అమలు చేస్తోందన్నారు. అనేక మంది పేద వారి కడుపు నింపుతుందని పేర్కొన్నారు. చెరువులు సుందరీకరణ చేస్తామని చెబుతున్నారని.. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే మిషన్ కాకతీయ ద్వారా చెరువుల సుందరీకరణ పనులు చేపడుతుందని వెల్లడించారు. పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ఇప్పటికే ఉన్నాయని.. ఆ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. టీఆర్ఎస్ పూర్తి చేసిన పనుల్ని కాంగ్రెస్ చేస్తానంటోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థులందరితోనూ కేటీఆర్ మాట్లాడారని, అన్ని జిల్లాల్లో ఉన్న అభ్యర్థుల ప్రచార సరళిపై ఆరా తీశారని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. -
గిట్టుబాటు ధర అందేలా కృషిచేస్తా
సాక్షి, హైదరాబాద్: పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా మార్కెటింగ్ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌లోని శుక్రవారం రైతు సమన్వయ సమితి కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులు ఆయనను చైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..తాను సమర్ధవంతంగా పనిచేస్తాననే నమ్మకంతో కేసీఆర్ ఈ బాధ్యతలు అప్పగించారన్నారు. రైతులను సంఘటితం చేయడమే రైతు సమన్వయ సమితి లక్ష్యమన్నారు. త్వరలో రాష్ట్రంలోని సమన్వయ సభ్యులందరితో సీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించి రైతు సమన్వయ సమితి సభ్యుల విధులు, బాధ్యతలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తారని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కృషిచేస్తామన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ..పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా విజయం సాధిస్తారని చెప్పారు. తెలంగాణ రైతులు అదృష్టవంతులని హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. సమితి చైర్మన్‌గా రాజేశ్వర్‌రెడ్డి రైతుల సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకముందన్నారు. పల్లా బాధ్యతల స్వీకారానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతు సమస్వయ సభ్యు లు అభినందనలు తెలిపారు. ఆయనకు అభినందనలు తెలిపిన వారిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, మంత్రులు పాల్గొన్నారు. -
కేసీఆర్ సీఎం అయ్యాకే దానిపై ఆసక్తి : మంత్రి
సాక్షి, హైదారాబాద్ : రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల నిర్ణయాల కారణంగా వ్యవసాయ రంగం దెబ్బతిన్నదని, కేసీఆర్ సీఎం అయ్యాకే వ్యవసాయంపై అసక్తి చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, అందుకనుగుణంగా బడ్జెట్లో సగానికిపైగా నిధులను ఆ రంగానికే కేటాయించారని తెలిపారు. రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాల రైతులు అడిగే పరిస్థితి వచ్చిందని ప్రశంసించారు. కాళేశ్వరం ద్వారా నీళ్లు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తున్నా లాభాలు రావాలంటే గిట్టుబాటు ధరలతో పాటు రైతులకు బేరమాడే శక్తి రావాలని అభిప్రాయపడ్డారు. హుజూర్నగర్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా కూడా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయిని మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు అదృష్టవంతులని పేర్కొన్నారు. రైతుకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ రైతు లోకానికి ఆదర్శంగా నిలిచారన్నారు. అనంతరం పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ. ఇప్పటికే 45వేల చెరువులలో పూడిక తీశామని, కోటీ 25 లక్షల ఎకరాలకు నీరివ్వడం ఖాయమన్నారు. ప్రస్తుతం రైతులు మార్కెట్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. పంటకు గిట్టుబాటు ధర రావడం కోసం మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని, ఏ పంట పండించాలి? ఎక్కడ అమ్ముకోవాలి? అనే అంశాలను రైతే నిర్ధారించే విధంగా రైతు సమన్వయ సమితి కృసి చేస్తుందని వివరించారు. -
మనసున్న మారాజు కేసీఆర్: పల్లా
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మారాజులా నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ సమ్మెకు కేసీఆర్ మంచి ముగింపు ఇచ్చారన్నారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దీక్ష చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో దీక్షా దివస్‌ను నిర్వహించారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2009 నవంబర్ 29న చేసిన దీక్షతో కేంద్రం దిగివచ్చి తెలంగాణ ఇచ్చిందన్నారు. 2014, 2018లో రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్కు మద్దతు పలకడం ద్వారా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతోందన్నారు. ఉద్యమ నేతకు వందనం: కల్వకుంట్ల కవిత కేసీఆర్ చిత్తశుద్ధి వల్లే తెలంగాణ ఏర్పాటు కల సాకారమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం దీక్షా దివస్ సందర్భంగా ఈ మేరకు తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్‌కు, ఆయన వెంట నడిచిన తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు. ప్రజలు కోరుకున్నప్పుడు తను వారి వెంట కేసీఆర్ ఉన్నారు. సరిగ్గా పదేళ్ల క్రితం ఆయన చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష తెలంగాణ ఉద్యమానికి కొత్త ఉత్తేజాన్నిచ్చింది’’అని ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ నేత కేసీఆర్ తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఉక్కు సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు అని మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌కుమార్, మంత్రులు దయాకర్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా దీక్షా దివస్ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. -
రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా శాసన మండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను చేపట్టడంతో పాటు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు. రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా త్వరలో నియమించనున్నట్లు సీఎం ప్రకటించారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం మండలిలో ప్రభుత్వ విప్‌గా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జిగా ఉన్న పల్లా.. హుజూర్నగర్ ఉప ఎన్నికలో పార్టీ ఇన్చార్జిగానూ వ్యవహరించారు. మంత్రివర్గ విస్తరణలో పల్లాకు చోటు దక్కుతుందని భావించినా, సామాజిక వర్గాల సమీకరణలో అవకాశం దక్కకపోవడంతో మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్ పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే గతంలో రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి మండలి చైర్మన్‌గా ఎన్నిక కావడంతో పల్లాకు అవకాశం కల్పించారు. నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి.. మున్సిపల్ ఎన్నికల తర్వాత పదవుల పందేరం ఉంటుందని భావించినా, ఎన్నికల నిర్వహణపై స్పష్టత రావడం లేదు. దీంతో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను మొదలు పెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుండటంతో నామినేటెడ్ పదవి ఆశిస్తున్న నేతలు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు కూడా ఆ పదవులను ఆశిస్తుండటంతో తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు క్షేత్ర స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ క్రియాశీల కార్యకర్తలు, నేతలు నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు. మార్కెట్, దేవాలయ కమిటీలు, గ్రంథాలయ సంస్థ పాలక మండళ్లలో చోటు కోసం స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50కి పైగా కార్పొరేషన్లు ఉండగా, అందులో 30 కార్పొరేషన్లు కీలకమైనవి కావడంతో ఆశావహులు తెలంగాణ భవన్, ప్రగతి భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 189 మార్కెట్ కమిటీలకు గాను ప్రస్తుతం 96 మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లు లేవు. మరోవైపు సుమారు 4 వేలకు పైగా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. పల్లాకు కేసీఆర్ అభినందన.. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా తన నియామకంపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి ధన్యవాదాలు తెలిపారు. పల్లాను అభినందించిన ఆయన.. రైతులకు అండగా ఉండేలా రైతు సమన్వయ సమితిలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. వచ్చే జూన్‌లోపు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రైతు సమన్వయ సమితిలను బలోపేతం చేయాలన్నారు. సమితిల బలోపేతం, రైతులను సంఘటిత శక్తిగా మార్చడం, రైతు వేదికల నిర్మాణం వంటి అంశాలపై మూడు నాలుగు రోజుల్లో సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. -
రైతు సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నియామక ప్రక్రియ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సమన్వయ సమితిలో సభ్యులను త్వరలో నియమిస్తామని సీఎం తెలిపారు. క్యాబినెట్ హోదా కలిగిన ఈ పదవికి మొదటి అధ్యక్షుడిగా వ్యవహరించిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి చైర్మన్‌గా నియమితులవడంతో ఆయన స్థానంలో పల్లాను ముఖ్యమంత్రి నియమించారు. మరోవైపు రైతు సంబంధ అంశాలపై మూడు, నాలుగు రోజులలో వ్యవసాయ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. -
‘రేవంత్, కోమటిరెడ్డి రోడ్ల మీద పడి కొట్టుకుంటారు’
సాక్షి, హుజూర్నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ గడప గడపకు తిరిగి ఓట్లడిగామని టీఆర్ఎస్ హుజూర్నగర్ ఉప ఎన్నికల ఇంచార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక అయి పోగానే ఉత్తమ్ పీసీసీ పోస్ట్ ఊడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. రేవంత్, కోమటిరెడ్డి పీసీసీ పదవి కోసం రోడ్ల మీద పడి కొట్టుకుంటారని ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం రాజేశ్వర్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి హుజూర్నగర్ ప్రజలను రెచ్చగొట్టేలా, అవమానించేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుడైన సైదిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని హుజూర్నగర్ ప్రజలంతా మనసారా కోరుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ బండ ప్రకాశ్, ప్రభుత్వ విప్ బోడకంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, హుజూర్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి పాల్గొన్నారు. ఉత్తమ్ ముక్కు నేలకు రాయాలి.. ‘ఇది టీఆర్ఎస్ అభివృద్ధికి అభివృద్ధి నిరోధక ఉత్తమ్ కుటుంబానికి వచ్చిన ఉప ఎన్నిక. ఒక్క అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపిస్తా. ప్రజలంతా గమనిస్తున్నరు. ఉత్తమ్ అహంకారానికి బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నరు. పద్మావతి రెడ్డికి ఘోర పరాజయం తప్పదు. హుజూర్నగర్ అభివృద్ధి కోసమే ఈ ఎన్నిక వచ్చింది. టీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు హుజూర్నగర్ ప్రజలంతా సిద్ధంగా ఉన్నరు. ఓటమి భయంతో ఉత్తమ్ కాంగ్రెస్ లీడర్లందరినీ ఇక్కడకు రప్పించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిండు. నా పై ఉత్తమ్ చేసిన ఆరోపణలు నిరూపించాలి. లేదంటే ఉత్తమ్ భేషరతుగా క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలి’అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి డిమాండ్ చేశారు. -
కేసీఆర్ సభ రద్దు.. నేతల ప్రత్యేక సమావేశం
సాక్షి, హుజూర్నగర్: రాష్ట్ర రాజకీయాల్లో హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారం అధికార, ప్రతిపక్ష పార్టీలకు మధ్య హోరాహోరీగా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో పార్టీలు ప్రచార జోరును పెంచాయి. అయితే భారీ వర్షం కారణంగా సీఎం కేసీఆర్ బహిరంగసభ రద్దు కావటంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నిరాశ వ్యక్తం అవుతోంది. కేసీఆర్ సభతో హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు, ఓటర్లలో కొత్త జోష్ తేవాలని భావించిన టీఆర్ఎస్ నేతలు సభ రద్దుతో నిరుత్సహపడ్డారు. ముఖ్యమంత్రి సభ రద్దైనప్పటికీ ప్రచార జోరును ప్రతి పక్షాలకు దీటుగా కొనసాగించాలనే వ్యూహంతో టీఆర్ఎస్ నేతలు సమావేశం అయ్యారు. సభ రద్దు అయిందని ప్రకటించిన వెంటనే మంత్రి జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి, జిల్లా ఎమ్యెల్యేలంతా ప్రత్యేకంగా భేటీ ఆయ్యారు. తదుపరి కార్యాచరణపై చర్చలు జరిపారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ సభ రద్దు కావటంతో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తోంది. సీఎం సభ అనగానే కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకింత కలవరపాటు నెలకొంది. నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ ఎలాంటి హామీలు ఇస్తారో.. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఎటువంటి ప్రకటన చేసి ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపుతారోనని అనుకున్నారు. కానీ, సభ రద్దు కావటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎంసభ రద్దు కావటం టీఆర్ఎస్ పార్టీకి, శ్రేణులకు ఎదురుదెబ్బ అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
కేసీఆర్ సభ ట్రెండ్ సెట్టర్ సభ కాబోతోంది!
సాక్షి, హుజూర్నగర్: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17న (గురువారం) హుజూర్ నగర్ పట్టణంలో సీఎం కేసీఆర్ హాజరయ్యే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ మాటలు వినడానికి, ఆయనను చూడటానికి హుజూర్నగర్ ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. సబ్బండ వర్గాల ప్రజలు ఎవరికీ వారు స్వచ్ఛందంగా కేసీఆర్ సభకు తరలివస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ సభ ట్రెండ్ సెట్టర్ సభ కాబోతున్నదని అన్నారు. హుజూర్నగర్ ప్రజల అదృష్టం బాగుందని, వారు ఈ ఉప ఎన్నికలో అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో పులిచింతల బాధితుల సమస్యకు, రెవెన్యూ డివిజన్ సమస్యకు టీఆర్‌శ్రీస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపెడుతుందని చెప్పారు. -
హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్కు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతివ్వాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం టీఆర్ఎస్ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డిని కలసి మద్దతు కోరగా ఆయన సానుకూలంగా స్పందించి మద్దతు తెలిపారు. -
‘ఉత్తమ్ స్థానికేతరుడు.. చిత్తుగా ఓడించండి’
సాక్షి, నల్గొండ: ఓటమి భయంతోనే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. హుజుర్నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్నగర్ అభివృద్ది కావాలంటే టీఆర్ఎస్ గెలవాలని అన్నారు. ఉత్తమ్ స్వార్థ ప్రయోజనాలకు ప్రజలు బలికావొద్దని హితవు పలికారు. హుజుర్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి స్థానికుడని, ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్థానికేతరుడని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలంతా స్పష్టమైన ఆలోచనతో ఉన్నారని, కాంగ్రెస్‌ను బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ఉత్తమ్ ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు ఎంఎల్సీ భానుప్రసాద్, ఉప ఎన్నిక ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘అబద్దం చెప్పి.. ఉత్తమ్ ఎంపీగా గెలిచారు’
సాక్షి, సూర్యాపేట : ఉత్తమ్ కుమార్‌రెడ్డి బ్లాక్‌మెల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరెడ్డి ఆరోపించారు. పచ్చి అబద్దాలు మాట్లాడుతూ.. ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. శనివారం ఆయన నేరేడుచర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బూత్‌కమిటీ ఇంచార్జీలా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడగొట్టే శక్తి ఎవరికి లేదన్నారు. ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్దేనని, 40వేల మెజార్టీతో హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కేంద్ర మంత్రి అవుతానని ప్రజలను మభ్యపెట్టి ఉత్తమ్ ఎంపీగా గెలిచారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గానికి చేసిందేమి లేదని దుయ్యబట్టారు. నిజాయితీ, నిబద్దతతో పనిచేసే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ గెలుపుతో నియోజకవర్గ దశ మారుతుందని, అభివృద్ధికి ముఖద్వారంగా హుజూర్‌నగర్‌ను నిలుపుతామని పల్లా హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పల్లాతో పాటు ఎమ్మెల్యే భాస్కర్‌రావు, హుజూర్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'రాష్ట్రమంతా హుజూర్నగర్ వైపే చూస్తోంది'
సాక్షి, సూర్యాపేట: రాష్ట్రమంతా హుజూర్నగర్ ఉప ఎన్నిక వైపే చూస్తోందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్కు ఉప ఎన్నికల్లో ఎప్పుడూ జయమే లభించిందని అన్నారు. నారాయణఖేడ్, పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయమే ఇందుకు నిదర్శనమన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటలను ఎవ్వరు నమ్మరని వ్యాఖ్యానించారు. హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సైదిరెడ్డిని గెలిపించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలో 40 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ గెలుస్తుందని తమకు వచ్చిన సర్వే రిపోర్ట్‌లో తేలిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలతో అనేక రాష్ట్రాలకు తెలంగాణ మోడల్‌గా మారిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తాయని చెప్పారు. రైతులకు, పరిశ్రమలకు 24 గంటలు కరెంట్ అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కోటి ఎకరాల మాగాణికి నీరు అందించే దిశగా కేసీఆర్ ప్రభుత్వం అడుగులేస్తుందన్నారు. అంతేకాక రైతు రుణమాఫీని కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఉత్తమ్ నీతిలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తమ అభ్యర్థి సైదిరెడ్డి స్వస్థలం గుండ్లపల్లి అయితే నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాక కేటీఆర్‌ను 'బచ్చా' అని ఉత్తమ్ సంబోధించడం బాగాలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లిన కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత వారికి లేదని అభిప్రాయపడ్డారు. -
హుజూర్నగర్ ఇన్చార్జిగా పల్లా
సాక్షి, హైదరాబాద్:హుజూర్నగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఇన్చార్జిగా పార్టీ ప్రధానకార్యదర్శి, శాసన మండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. హుజూర్‌నగర్‌లోనే మకాం వేసి పార్టీ ఎన్నికల వ్యూహాన్ని పక్కాగా అమలు చేసే బాధ్యతను పల్లాకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని పరుగులు పెట్టించేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులను పల్లా సమన్వయం చేస్తారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో, ఇతర జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి పార్టీ యంత్రాంగా న్ని సన్నద్ధం చేయాల్సిందిగా కేసీఆర్ ఆదేశించారు. సీనియర్ నాయకులు హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కేసీఆర్ ఆదేశిం చారు. కాగా హుజూర్నగర్ ఉప ఎన్నిక ఇన్చార్జిగా నియమితులైన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం నియోజకవర్గానికి చేరుకుంటారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించి స్థానికంగా ప్రచారం, సమన్వయం కోసం అంతర్గత కమిటీలు ఏర్పాటు చేస్తారు. పార్టీ తరఫున నిర్వహించే సభలు, ర్యాలీలు, కేసీఆర్ పాల్గొనే కార్యక్రమాలు తదితరాలకు సంబంధించి పల్లా తుదిరూపు ఇస్తారు. ఈ నెల 26న పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారు. పాలేరు, ఇతర ఎన్నికల అనుభవంతోనే..! హుజూర్నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ కంటే ముందు ప్రచార పర్వంలో దూసుకెళ్లేలా కేసీఆర్ వ్యూహం సిద్ధం చేశారు. ఎన్నికల వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసే ఉద్దేశంతో తనకు సన్నిహితంగా ఉండే పల్లాకు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పల్లాతో కలిసి పనిచేయా ల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. గతంలో పాలేరు ఉప ఎన్నికతో పాటు, ఖమ్మం మున్సిపాలిటీ ఎన్నికల్లో పల్లా ఇన్చార్జిగా వ్యవహరించారు. ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు, ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లోనూ పల్లా పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనగామ, భువనగిరి జిల్లాల పార్టీ ఎన్నికల ఇన్చార్జిగా పనిచేశారు. ఆయనకు పార్టీ బాధ్యత అప్పగించిన ప్రతి సందర్భంలోనూ టీఆర్ఎస్కు అనుకూల ఫలితం రావడంతో.. హుజూర్నగర్ ఉప ఎన్నిక బాధ్యతను పల్లాకు అప్పగించారు. -
‘తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు చేస్కోండి’
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం.. ఈ ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభోత్సవం చేస్తున్నాం.. ప్రారంభోత్సవం రోజు గ్రామ గ్రామాన సంబరాలు చేసుకోవాలని పార్టీ తరపున పిలుపునిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్లో బుధవారం టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ప్రతి రైతు కూడా సంబరాల్లో పాల్గొనాలని కోరారు. రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న వారిలో కొందరు ఎమ్మెల్సీ, ఎంపీ, జెడ్పీ చైర్మన్లు అయ్యారని, వారిని కేసీఆర్ కూడా అభినందించినట్లు తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ కమిటీ కూడా సీఎం కేసీఆర్‌ను అభినందించిందని వెల్లడించారు. ఏ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీలాగా బలమైన పార్టీలేదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల నిర్మాణాల కోసం రూ.19.20 కోట్లను పార్టీ కేటాయించిందని పేర్కొన్నారు. ఈ నెల 24న అన్ని జిల్లా కేంద్రాల్లో భూమి పూజ నిర్వహించాలని, దసరా లోపు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ఈ నెల 27న తెలంగాణ భవన్లో పార్టీ సంయుక్త సమావేశం జరుగుతుందని, ఈ సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్యవర్గ సభ్యులు హాజరవుతారని వెల్లడించారు. జూలై నెలలోపు పార్టీ సభ్యత్వం పూర్తి చేస్తామన్నారు. -
కాళేశ్వర నిర్మాణం.. చరిత్రాత్మక ఘట్టం
సాక్షి, ఖమ్మం : కాళేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణం ఓ చరిత్రాత్మక ఘట్టమని టీఆర్ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశంసించారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అత్యంత పెద్దదన్నారు. అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేయ్యటం తెలంగాణ ప్రభుత్వ పాలనకు నిదర్శనం అన్నారు. ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుపడుతున్నా.. చిత్తశుద్ధితో అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌దే అని ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మాదిరిగానే సీతారామ ప్రాజెక్ట్‌ను కూడా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్ట్‌లను అడ్డుకోకండి : పువ్వాడ అజయ్ పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటూ ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టడం తెలంగాణ ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్. కాళేశ్వరం మాదిరిగానే సీతారామ ప్రాజెక్ట్‌ను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని.. ప్రాజెక్ట్‌లను అడ్డుకునే పద్దతిని విడనాడలని తెలిపారు. -
16 సీట్లు గెలిచి టీఆర్ఎస్ సత్తా చాటాలి
సాక్షి, ఖమ్మం వైరారోడ్: రాష్ట్రంలో 16 మంది టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించి పార్టీ సత్తా మరోసారి చాటాలని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ మంగళవారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కారు గుర్తుపై ఓటు వేసి నామా నాగేశ్వరరావును గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందన్నారు. గత 60 ఏళ్లలో కాని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదు సంవత్సరాల్లో చేసి చూపించారన్నారు. అత్య«ధిక ఎంపీ సీట్లు సాధిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తనను గెలిపించడం ద్వారా తెలంగాణ బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, కార్మిక విభాగం అధ్యక్షుడు కాసాని నాగేశ్వరరావు, బిక్కసాని నాగేశ్వరరావు, కూరపాటి రంగరాజు, ఖాజామియా, బి.కరుణ, పాల్వంచ కృష్ణ, జలగం రామకృష్ణ, మన్మథరావు, డోకుపర్తి సుబ్బారావు, మద్దెల రవి తదితరులు పాల్గొన్నారు. -
సమావేశాల్లోపే ఆ ముగ్గురిపై వేటు
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు ఖాయంగా కనిపిస్తోంది. సమావేశాలు మొదలయ్యేలోపే దీనిపై చైర్మన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. జనవరి 19న శాసనçసభ, శాసనమండలి సంయుక్త సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలు రాములునాయక్, కె.యాదవరెడ్డి, ఆర్. భూపతిరెడ్డిలపై అనర్హత వేటు వేయాలని టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసింది. రాములు నాయక్ వ్యవహారంపై విచారణ పూర్తయ్యింది. కె.యాదవరెడ్డి, ఆర్.భూపతిరెడ్డి తరఫున న్యాయవాదులు శనివారం శాసనమండలికి వచ్చా రు. చైర్మన్ వి.స్వామిగౌడ్ వద్ద జరిగిన విచారణలో వాదనలు వినిపించారు. వాటిని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలను నమోదు చేసుకున్న చైర్మన్ స్వామిగౌడ్ తీర్పులను రిజర్వులో పెట్టారు. నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం: పల్లా టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటిం చాలని ఫిర్యాదు చేశామని, చైర్మన్ తీర్పు కోసం వేచి చూస్తున్నామని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీలపై విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాం గ్రెస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని మండలి చైర్మన్‌కు ఫిర్యాదుచేశాం. కొండా మురళీధర్‌రావు రాజీనామా చేశారు. రాములునాయ క్, భూపతిరెడ్డి, యాదవరెడ్డిల అనర్హత పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. వారిపై చట్ట ప్రకారం చర్య లు తీసుకోవాలని చైర్మన్‌ను కోరాం’ అని చెప్పారు. -
ఫీజు రీయింబర్స్‌మెంటుకు ప్రత్యేక బడ్జెట్: పల్లా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ కోర్సుల్లో ఫీజు రీయింబర్స్‌మెంటుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించేందుకు కృషిచేస్తానని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఇంటర్మీడియెట్ ఫీజు ప్రతి ఏటా 10 శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని, డిగ్రీలో కామన్ ఫీజుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ అభివృద్ధిలో ప్రైవేటు విద్యాసంస్థల పాత్ర–ప్రభుత్వ తోడ్పాటు ఆవశ్యకత అనే అంశంపై సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సంఘం పేరుతో ఓ రాజకీయ పార్టీకి తాకట్టుపెట్టడం సమంజసం కాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆ సంఘం అసత్య ఆరోపణలు చేసిందని, ఫీజు రీయింబర్స్‌మెంటుపై దుష్ప్రచారం చేసిందని చెప్పారు. 2013–14కు సంబంధించిన రూ.2,200 కోట్ల బకాయిల విడుదలలో కొంత ఇబ్బంది వచ్చిందన్నారు. 2018–19 విద్యాసంవత్సరానికి మొత్తం ఫీజులొచ్చాయని, కేవలం రూ.100 నుంచి రూ.150 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంటు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ఫైర్ ఎన్ఓసీ నుంచి మినహాయింపు ఇచ్చే ఫైలుపై సీఎం సంతకం చేశారని చెప్పారు. -
‘16 స్థానాల్లో గెలవడమే మా లక్ష్యం’
సాక్షి, హైదారాబాద్ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 16 పార్లమెంట్ నియోజక వర్గాల్లో గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కేటీఆర్ పిలుపునిచ్చారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం11:50 నిమిషాలకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. అనంతరం జిల్లాల వారీగా పర్యటనలు చేపట్టి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతారని పేర్కొన్నారు. కాగా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత మొదటిసారిగా కేటీఆర్.. శనివారం తెలంగాణ భవన్లో పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థాగత, సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం.. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాల్లో భాగంగా... ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జనరల్ సెక్రటరీ, ముగ్గురు సెక్రటరీలు, ఎమ్మెల్యేలు ఇంచార్జీలుగా ఉంటారని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఓటర్ల లిస్ట్ అప్డేట్ చేయించడంతో పాటు...మార్చి నాటికి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేయాలని సూచించారు. జనవరిలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్సాహంగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ భవనాలు నిర్మించేందుకు సబ్ కమిటీలు నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇక పార్టీ కార్యకర్తలు, ప్రజలు తమ సమస్యల గురించి చెప్పుకొనేందుకు వీలుగా తెలంగాణ భవన్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు ముఠా గోపాల్ (బీసీ సెల్ అధ్యక్షుడు- ముషీరాబాద్ ఎమ్మెల్యే), సుంకె రవి శంకర్ (ఎస్సీ సెల్ అధ్యక్షుడు- చొప్పదండి ఎమ్మెల్యే), మైనంపల్లి హన్మంతరావు (జనరల్ సెక్రటరీ- మల్కాజిగిరి ఎమ్మెల్యే), పట్నం నరేందర్ రెడ్డి (రాష్ట్ర కార్యదర్శి- కొడంగల్ ఎమ్మెల్యే), బండ్ల కృష్ణ మెహన్ రెడ్డి(గద్వాల ఎమ్మెల్యే)లు రాష్ట్ర కార్యవర్గం నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారని పేర్కొన్నారు.వాళ్ల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. -
‘అందుకే విశ్వేశ్వరరెడ్డి పార్టీ వీడారు’
సాక్షి, మహబూబాబాద్ : ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ విశ్వేశ్వరరెడ్డికి సముచిత స్థానం కల్పించిందని, ఎంపీగా గెలిపించి.. అత్యధిక సార్లు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం కల్పించిందన్నారు. ఆర్థికంగా లబ్ధిపొంది ఇప్పుడు సిద్ధాంతాల పేరుతో రాద్ధాంతం చేయటం తగదని హితవు పలికారు. టీఆర్ఎస్.. సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిందంటున్న విశ్వేశ్వరరెడ్డి ఈ నాలుగేళ్లు ఏమి చేశారని ప్రశ్నించారు. మహేందర్ రెడ్డితో భూముల వివాదం కారణంగానే కొండా పార్టీ మారారన్నారు. మహేందర్ రెడ్డి తెలంగాణ ద్రోహి అయితే ఆయనతో కలిసి ఎంపీగా ఎలా పోటీ చేశావని ప్రశ్నించారు. పార్టీకి వెన్నుపోటు పొడిచి తన మనషులైన పైలెట్ రోహిత్ రెడ్డి, కేఎస్ రత్నం, కనకయ్యలను ఇతర పార్టీలకు పంపారని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీనేనన్నారు. ప్రాజెక్టును ఆపాలని కేంద్రాన్ని కోరింది చంద్రబాబు కాదా..? పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్న కాంగ్రెస్, టీడీపీలతో కలిసి ఎలా పని చేస్తావ్..? అంటూ ప్రశ్నించారు. ఏ సిద్ధాంతాలతో విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
మహాకూటమితో మహాముప్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థలకు కేసీఆర్ ప్రభుత్వంలోనే భరోసా ఉంటుందని శాసనమండలి చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో నాణ్య తా ప్రమాణాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఒక్క ప్రైవేటు విద్యాసంస్థను కూడా ప్రభుత్వం మూసివేయలేదన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో అవసరానికి మించి కాలేజీలకు అనుమతులు ఇవ్వడంతో విద్యార్థుల్లేక కొన్ని మూతపడ్డాయి తప్ప మరేమీ కాదన్నారు. రాష్ట్రంలో కేఎల్ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కొంతమంది చేస్తున్న విమర్శలన్నీ అబద్ధాలేనన్నారు. అసలు ఆ విద్యా సంస్థలు టీడీపీ నేతలు, మంత్రులకు సంబంధించినవేనన్నారు. టీఆర్ఎస్ పాలనలోనే నారాయణ, శ్రీచైతన్యకు చెందిన 60 బ్రాంచీలు మూతపడ్డాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలం కాదన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలకే ప్రయోజనం ఉంటుందన్నారు. ‘జేఏసీ’ది తప్పుడు ప్రచారం కొంతమంది యాజమాన్య సంఘాల నేతలు కేజీ టు పీజీ జేఏసీ పేరుతో మహాకూటమి కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో చెల్లించాల్సిన రూ.2 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో అధికారు లు సీఎంను తప్పుదోవ పట్టించారని, ఆ తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వమే 1,800 కోట్లు చెల్లించిందన్నారు. అలాంటి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. కూటమి నేతలు చెప్పేవన్నీ పచ్చి అబద్ధా్దలన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.17 వేల వేతనం ఉంటే ప్రభుత్వం రూ.37 వేలకు పెంచిందన్నారు. ఈ సమావేశంలో యాజమాన్య సంఘాల నేతలు ప్రకాశ్, నాగయ్య, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతల ఆటలు సాగవు: పల్లా
సాక్షి, హైదరాబాద్: కొన్ని విద్యాసంస్థల అధిపతు లు టీడీపీ నేతలతో కలసి రాజకీయాలు చేస్తున్నారని.. ఇది సరికాదని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో టీడీపీ నేతల ఆటలు ఇక సాగబోవన్నారు. తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేజీ టు పీజీ విద్య విషయంలో మహాకూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ‘కార్పొరేట్ విద్యాసంస్థలు టీడీపీకి అనుబంధంగా టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కరపత్రాలు విడుదల చేశాయి. ప్రతి ప్రభుత్వ స్కూల్ లో టాయిలెట్లు కట్టించాం. 1.68 లక్షల మంది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరారు. బీసీల కోసం వసతి గృహాలు పెట్టించినందుకు ఆర్.కృష్ణయ్య సైతం కేసీఆర్‌ను పొగిడారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే విశ్వవిద్యాలయాలను భ్రష్టు పట్టించాయి. ప్రభుత్వ విద్యావ్యవస్థను గాడిలో పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. బోధన, ఫలితా ల్లో నాణ్యత పెంపొందించాలని విద్యాసంస్థలను అడగొద్దా.. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఏ కార్పొరేట్ కళాశాల ఏర్పాటుకు అనుమతినివ్వలేదు. కొత్త వర్సిటీలను రానివ్వబోమని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చెబుతున్నారు. అసలు నిబంధనలు పెట్టకుండా విద్యా వ్యవస్థ ఎలా నడుస్తుందో వారే చెప్పాలి...’అని పల్లా వ్యాఖ్యానించారు. -
అసమ్మతిపై టీఆర్ఎస్ కన్నెర్ర
సాక్షి, హైదరాబాద్: అసమ్మతి రాగం వినిపిస్తున్న పార్టీ నేతలపై టీఆర్ఎస్ కన్నెర్రజేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా, పోటీగా కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఉమ్మడి నల్లగొండలో గురువారం బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఆ జిల్లాలోని మునుగోడు అసమ్మతి నేత వేనేపల్లి వెంకటేశ్వరరావుపై వేటు వేసింది. వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటన జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన కారణంగా వేనేపల్లి వెంకటేశ్వరరావును బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నామని ప్రకటనలో తెలిపారు. వెంకటేశ్వరరావుపై బహిష్కరణ నిర్ణయం టీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగుతున్న టీఆర్ఎస్కు కొన్ని సెగ్మెంట్లలో అసమ్మతి నేతల తీరు ఇబ్బందిగా మారింది. టీఆర్ఎస్ అధిష్టానం తరఫున మంత్రి కేటీఆర్ అసమ్మతి నేతలతో భేటీ అవుతున్నారు. అయితే పార్టీ అభ్యర్థులకు పోటీగా ప్రచారం చేస్తున్న కొందరు నేతలు కేటీఆర్‌తో చర్చలకు సైతం రావడంలేదు. దీంతో వీరిపై కఠినంగా వ్యవహరించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. నల్లగొండలో సభ నేపథ్యంలోనే మునుగోడు అసమ్మతి నేత వెంకటేశ్వరరావును బహిష్కరించారు. మరికొందరు నేతల విషయంలోనూ టీఆర్ఎస్ ఇదే రకమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. చివరి అవకాశంగా ఓసారి చర్చలకు ఆహ్వానించాలని, అయినా దారికి రాకుంటే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అభ్యర్థులకు అడ్డంకులు.. కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు సొంత పార్టీ వారితోనే ఇబ్బందులు వస్తున్నాయి. కొందరు అసమ్మతి నేతలు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనను పొగుడుతూ.. సీఎం కేసీఆర్ చిత్రపటాలు, గులాబీ రంగు జెండాలు వినియోగిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. నామినేషన్ల సమయం వరకు తమకే టికెట్లు వస్తాయని చెబుతున్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీల నేతలతో కంటే వీరితోనే టీఆర్ఎస్ అభ్యర్థులకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. కేడర్‌లోనూ అయోమయం నెలకొంటోంది. పార్టీ అధిష్టానం నుంచి స్పష్టత రాక ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొనడం లేదు. ఇలా సొంత పార్టీ నేతలతో ఇబ్బంది పడే అభ్యర్థులు కేటీఆర్‌కు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కేటీఆర్ పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దాదాపు 10 నియోజకవర్గాల నేతలు చర్చలకు సైతం రావడంలేదు. కొన్ని నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీరి విషయంలోనూ పార్టీ కఠిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. టీఆర్ఎస్ అభ్యర్థులకు పోటీగా తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్న కోరుకంటి చందర్ (రామగుండం), గండ్ర సత్యనారాయణరావు (భూపాలపల్లి), రాజారపు ప్రతాప్ (స్టేషన్‌ఘన్‌పూర్), చకిలం అనిల్‌కుమార్ (నల్లగొండ) విషయంలోనూ టీఆర్ఎస్ రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. వేములవాడ, రామగుండం, జగిత్యాల, స్టేషన్‌ఘన్‌పూర్, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, సత్తుపల్లి, మక్తల్, మునుగోడు నియోజకవర్గాల్లోని పలువురు ద్వితీయ శ్రేణి నేతలపైనా వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. రెండు సభలు వాయిదా.. ముందస్తు ఎన్నికల వ్యూహంలో ముందున్న టీఆర్ఎస్.. ప్రచారంలో మాత్రం ఆ ఊపు కొనసాగించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ రద్దయిన మరుసటి రోజు సీఎం కేసీఆర్ హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 50 రోజుల్లో వంద నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ప్రకటించా రు. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు సమయం ఉండటంతో ప్రచార వ్యూహాన్ని మార్చారు. ఉమ్మడి జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అక్టోబర్ 3న నిజామాబాద్, 4న నల్లగొండ, 5న మహబూబ్‌నగర్, 7న వరంగల్, 8న ఖమ్మంల్లో సభలు నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటన జారీ చేసింది. అయితే ఆయా జిల్లాల్లో నెలకొన్న అసంతృప్తుల దృష్ట్యా వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల బహిరంగ సభలను వాయిదా వేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో అసమ్మతి ఎక్కువగా ఉంది. బహిరంగ సభ నిర్వహించే వరంగల్ నగరంలోని వరంగల్ తూర్పు నియోజకవర్గానికి అభ్యర్థిని ఖరారు చేయలేదు. దీంతో ఇక్కడ సభ వాయిదా వేశారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని సత్తుపల్లి, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లోనూ అసమ్మతి పూర్తిగా తొలిగిపోలేదు. దీంతో ఖమ్మంలో తలపెట్టిన బహిరంగ సభనూ వాయిదా వేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నేతలు మంగళవారం మంత్రి కేటీఆర్‌ను కలసి బహిరంగ సభ విషయాన్ని ప్రస్తావించగా.. వరంగల్ బహిరంగ సభ ఉందని ఎవరు చెప్పారని కేటీఆర్ వారిని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ రెండు బహిరంగ సభల నిర్వహణ తేదీలను త్వరలోనే ఖరారు చేయనున్నారు. ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభల విషయంలోనూ నిర్ణయం తీసుకోనున్నారు. హుస్నాబాద్‌లో సభ నిర్వహించినందున ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సభ ఉండకపోవచ్చని తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రగతి నివేదన సభ నిర్వహించిన కారణంగా రంగారెడ్డి, హైదరాబాద్‌ల్లోనూ బహిరంగ సభలు నిర్వహించే అవకాశం లేదు. ఉమ్మడి జిల్లాల బహిరంగ సభల అనంతరం సీఎం కేసీఆర్ నేరుగా నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నారు. దసరా తర్వాత నియోజకవర్గాల వారీగా ప్రచార కార్యక్రమం మొదలుకానుంది. -
అసమ్మతి నేతకు టీఆర్ఎస్ పార్టీ షాక్!
సాక్షి, నల్గొండ : అసమ్మతి నేతకు టీఆర్ఎస్ పార్టీ షాకిచ్చింది. అసమ్మతి నేత వెంకటేశ్వర్ రావును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. మునుగోడు సీటును ఆశించిన వెంకటేశ్వర్ రావు పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడ్డారని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనను పలుమార్లు పిలిచి బుజ్జగించినా మాట వినకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక నల్గొండ, సాగర్, మిర్యాలగూడ, తుంతుర్తిలోనూ అసమ్మతి నేతలు పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారని చెప్పారు. దీంతో వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. -
కాంగ్రెస్ వాళ్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ..
నల్గొండ: కాంగ్రెస్ నాయకులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల వద్దకు వెళుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ.. నల్గొండలో జరిగే సభ చారిత్రాత్మక సభ అవుతుందని అన్నారు. 9 నెలల పాలనను కేసీఆర్ త్యాగం చేశారని కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీ గతంలో తెలంగాణ సాధించడం కోసం పొత్తు పెట్టుకుందని వ్యాఖ్యానించారు. అడుగడుగునా తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్న టీడీపీతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికూటములు జతకట్టినా టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిని ప్రకటించే దమ్ము ఉందా అని సూటిగా అడిగారు. నల్గొండ జిల్లాలోనే నలుగురు నాయకులు తాము సీఎం అభ్యర్థులమని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. -
‘రేవంత్ ఇంట్లో ఐటీ దాడి.. కాంగ్రెస్ ఖుష్’
సాక్షి, నల్గొండ : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ సీట్లలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాదిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్ 4న జిల్లాలో జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభ ప్రాంతాన్ని ఎంపీ బుర నర్సయ్య గౌడ్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సభకు నాలుగు లక్షల మందికి తగ్గకుండా ప్రజల వస్తారని.. కేసీఆర్‌ను చూడాలని ప్రజలంతా ఎందో ఆత్రుతతో ఎదురుచుస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సభ ద్వారా జిల్లా ప్రజలు తమ అభిష్టాన్ని తెలియజేస్తారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు.. రేవంత్ రెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని టీఆర్ఎస్ ఎంపీ బుర్రా నర్సయ్య గౌడ్ అన్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని,దీనిలో తమ ప్రమేయం ఏమీ లేదని పేర్కొన్నారు. రేవంత్ జైలుకు పోతా.. జైల్ నుంచే పోటీ చేస్తానని ప్రకటనలు చేస్తున్నారని అంటే శిక్ష పడుతుందని రేవంత్‌కు తెలుసని వ్యాఖ్యానించారు. రేవంత్‌పై దాడులతో కాంగ్రెస్ నాయకులే కొంతమంది లోలోపల సంతోషంగా ఉన్నారని... ఆ పార్టీలో ఓ సీఎం అభ్యర్థి పీడ పోయిందని తెలిపారు. రేవంత్ నేర చరిత్ర కలిగిన వ్యక్తి... రేవంత్ రెడ్డి లాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు దేశానికి చాలా ప్రమాదకరమని ఆ పార్టీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. తమ పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కూడా గతంలో ఈడీ దాడులు జరిగాయని గుర్తుచేశారు. ఈడీ సంస్థ కేంద్ర పరిదిలోనిదని... టీఆర్ఎస్ పార్టీకి దాడులతో ఎలాంటి సంబందం లేదని ఆయన తెల్చి చెప్పారు. -
మంత్రుల చాయ్.. చిట్‌చాట్
ఇబ్రహీంపట్నంరూరల్ : నిన్న మొన్నటి వరకు సామాన్య ప్రజలకే కేరాఫ్‌గా మారిన రంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టరేట్ నిర్మాణం సమీపంలోని టీ కొట్టు ఇప్పుడు ప్రధాన్యత సంతరించుకుంది. ఈ కలెక్టరేట్ నిర్మాణం పక్కనే ప్రగతి నివేదన సభ జరగనుంది. సభ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి వచ్చిన మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నగర మేయర్ బోంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు ఈ టీకొట్టు వద్ద ఆగి చాయ్ తాగారు. మిర్చితిని వెళ్లారు. నిత్యం బిజీగా గడిపే నాయకులు సామాన్య ప్రజల మాదిరిగా రోడ్డుపై చాయ్‌తాగడాన్ని అక్కడి వారు ఆశ్చర్యంగా చూశారు. -
రుణమాఫీ, నిరుద్యోగభృతి సాధ్యం కావు: పల్లా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్న రూ.2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి హామీలు ఆచరణ సాధ్యం కావని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గట్టెక్కడానికి కాంగ్రెస్ నేతలు ప్రయోగిస్తున్న ఆపదమొక్కులను ప్రజలు నమ్మరన్నారు. ఐదు దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌నేతలు ఆస్తులు, ఆకారాలు, అహంకారాన్ని తప్ప బుర్రను పెంచుకోలేదని విమర్శించారు. సంక్షేమపథకాలతో సీఎం కేసీఆర్ ప్రతిష్ట పెరిగితే వారు జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రారంభమైన కాంగ్రెస్ పతనం 2019 నాటికి పూర్తిగా కనుమరుగవుతుందని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ వందసీట్లు గెలిచి చరిత్ర సృష్టిస్తుందని జోస్యం చెప్పారు. -
అసలు కౌలు చట్టాలు తెలుసా: పల్లా
సాక్షి, హైదరాబాద్: కౌలు చట్టాలపై అవగాహన లేకుండా ప్రతిపక్ష నేతలు రైతుబంధు పథకంపై నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లా డుతూ, కౌలు రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. కౌలు రైతుల గురించి మాట్లాడుతున్న వారు 1956 టెనెన్సీ యాక్ట్ చదివితే బాగుంటుందన్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఎప్పుడు, ఏ పార్టీలో ఉంటారో, ఎప్పుడే పార్టీలోకి మారతారో ఎవరికీ తెలి యదని పల్లా ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై, మిషన్ భగీరథపై ఏవేవో మాట్లాడుతున్న నాగం వాదనల్లో నిజం ఉంటే కోర్టులకు ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. -
ఎరువుల డీలర్లకు సహకారం: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ఎరువులు, విత్తన డీలర్లకు పూర్తి సహకారం అందిస్తామని మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు హామీనిచ్చారు. విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల డీలర్ల సంఘం (స్పెడ్) రాష్ట్ర అధ్యక్షుడు కె.పృథ్వీ బుధవారం మంత్రి హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిశారు. నూతనంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన పృథ్వీకి అభినందనలు తెలుపుతూ, రైతుల కోసం డీలర్ల సంఘం పనిచేయాలని మంత్రి సూచించారు. తమ సంఘం గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యవహరిస్తారని పృథ్వీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
27న కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో నిర్వహించనున్నట్లు మండలిలో ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న నిర్వహించే ప్లీనరీకి సంబంధించి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సెంటర్లో ప్లీనరీ నిర్వహించాలని కేసీఆర్ ఈ మేరకు నిర్ణయించినట్లు వివరించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 150 మంది చొప్పున 15 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ రంగాలపై చర్చ, తీర్మానాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా చర్చ, తీర్మానాలు ఉంటాయని తెలిపారు. పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు నేతృత్వంలో తీర్మానాల కమిటీని కేసీఆర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. మిగతా కమిటీలను కూడా త్వరలో ప్రకటిస్తారని, అక్టోబర్ లేదా నవంబర్‌లో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా సభ నిర్వహిస్తామని, ఈ సభకు టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారందరూ హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. -
అసెంబ్లీలో ‘మద్యం’ గోల!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల తొలిరోజున అధికార, విపక్షాల మధ్య ‘మద్యం’చిచ్చుపెట్టింది. విపక్ష కాంగ్రెస్ సభ్యులు తాగి వచ్చారంటూ అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టించాయి. అటు కాంగ్రెస్ నేతలు కూడా అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో ఈ విషయంపైనే చర్చోపచర్చలు జరగడం గమనార్హం. అసలేం జరిగింది..? సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సభ్యులు పోడి యం వైపు దూసుకొచ్చారు. మార్షల్స్ వారిని అడ్డుకోవడంతో నినాదాలు చేస్తూ ఆందోళనలకు దిగారు. ఆ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన మైక్‌సెట్ తగిలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయాలయ్యాయి. దీనిపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలకు దిగారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాగి వచ్చారని.. శాసనవ్యవస్థ తలదించుకునేలా ప్రవర్తించారని ఆరోపించారు. సభ్యులు జానారెడ్డిపై తూలిపడ్డారని, దాంతో ఆయన లేచి వెళ్లిపోయారని పేర్కొన్నారు. తాగి వచ్చి బూతులు తిడుతూ, భౌతిక దాడులకు దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయాలన్నారు. భగ్గుమన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ పల్లా వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంది. ఆ సమయంలో సీఎల్పీ కార్యాల యంలో ఉన్న ఎమ్మెల్యే సంపత్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు పల్లా వ్యాఖ్యను ఖండించాలని నిర్ణయించారు. దీనిపై మీడియా పాయింట్లో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సమాచారమివ్వడంతో... ఆయన అధికార పక్షంపై ఘాటుగా విమర్శలు చేశారు. తాగి వచ్చారని అధికారపక్ష సభ్యులు ఆరోపించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. అధికారపక్షానికి దమ్ముంటే సీఎంతో సహా అందరు టీఆర్ఎస్ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు కలసి ల్యాబ్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకుందామని... ఎవరి ఒంట్లో ఆల్కహాల్ ఉందో తేలిపోతుందని సవాల్ చేశారు. అసెంబ్లీలో జరిగిన ఘటనకు సీఎం కారణమని.. ఘటనలో తనకూ గాయాలయ్యా యని చెప్పారు. కానీ తప్పుడు వ్యాఖ్యలు చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉండేందుకు అనర్హుడని విమర్శించారు. ‘‘మీ తాగుబోతుల సంఘాల కోసం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11.30 గంటల దాకా వైన్స్‌లకు అనుమతిచ్చింది మీరు (టీఆర్ఎస్ ప్రభుత్వం) కాదా.. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి తాగుబోతుల తెలంగాణ చేసింది మీరు కాదా..’’ అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ పల్లా వ్యాఖ్యలు సరికాదని.. ఈ వ్యాఖ్యలు సభలో ఉన్న ప్రతి సభ్యుడిని అవమానించినట్టేనని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షం విమర్శలపై అధికారపక్షం తిరిగి కౌంటర్ చేయకపోయినా.. అసెంబ్లీ లాబీల్లో సభ్యుల మధ్య ‘మద్యం’ వ్యాఖ్యలపైనే తీవ్ర చర్చ జరిగింది. -
కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ: పల్లా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతుల అభివృద్ధి కోసం తీసు కుంటున్న చర్యలతో కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయని ఆరోపించారు. రాజకీయంగా అడ్రస్ లేకుండా పోతామనే భయంతోనే కాంగ్రెస్, బీజేపీలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయన్నారు. -
కాంగ్రెస్ నేతలంతా కాలకేయ ముఠా: కర్నె
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఉసురుపోసుకుంటూ, అభివృద్ధిని అడ్డుకుంటూ కాంగ్రెస్ నేతలంతా కాలకేయ ముఠాలాగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఎమ్మెల్సీ రాజు, ఎమ్మెల్యే గణేశ్ గుప్తాతో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని పదేళ్లపాటు మిడతల దండులాగా దోచుకున్నారని ఆరోపించారు. గాంధీ భవన్లో కూర్చుని పిచ్చికూతలతో హింసావాదాన్ని రెచ్చగొట్టాలని కాంగ్రెస్ నేతలు కుట్రలు చేసినా, టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించిదని చెప్పారు. ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కాంగ్రెస్ దండుకు ప్రజలే బుద్ధి చెప్తారని ఎమ్మెల్సీ రాజు హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ పనిచేసే తత్వాన్ని, సమర్థతను ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గణేశ్ గుప్తా విమర్శించారు. కేటీఆర్ విజయాలను జీర్ణించుకోలేని కాంగ్రెస్ మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల నుంచి సిలికాన్ వ్యాలీ దాకా మంత్రి కేటీఆర్‌కు సర్వత్రా అభినందనలు వస్తున్నాయని, దీనిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నేతలు పిచ్చిపట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ నేతలంతా ప్రజలను పట్టించుకోకుండా క్లబ్బుల్లో, ఏసీ గదుల్లో గడిపారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ప్రజల్లో తిరుగుతూ సమస్యలను పరిష్కరించడమే కాకుండా విదేశాలను ఆకర్షించి పెట్టుబడులు తీసుకొస్తున్నాడని అన్నారు. అవినీతి పొరలు కమ్మిన కాంగ్రెస్ నాయకుల కళ్లకు ప్రతీ స్కీమ్‌లోనూ స్కామ్ కనబడుతోందని విమర్శించారు. -
'రాహుల్ కంటే కేటీఆర్ స్థాయి పెద్దది'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరుపై ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు పూనకం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్, ఉత్తమ్ కుమార్ల కంటే కేటీఆర్ స్థాయి పెద్దదన్నారు. సిరిసిల్ల నుంచి సిలికాన్ వ్యాలీ వరకు కేటీఆర్‌కు ఓ స్ధాయి ఉందని తెలిపారు. కేసీఆర్ కాలి గోటికి కాంగ్రెస్ నేతలు సరిపోరన్నారు. ఒకప్పుడు సోనియా బలిదేవతన్న రేవంత్ రెడ్డికి ఇపుడు ఆమె దేవత అయిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ నేతలు దద్దమ్మలే అని అరోపించారు. వచ్చే ఎన్నికల్లో తాము 100 సీట్లు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతల నోళ్లు శాశ్వతంగా మూతపడటం ఖాయయని పల్లా తెలిపారు. -
శ్రీనివాస్ హత్యపై లబ్ధి పొందాలనే..
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య రాజకీయపరమైంది కాదని పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టినా కాంగ్రెస్ నేతలు ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎన్.భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ పూల రవీందర్‌లతో కలసి టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హత్య జరిగిన వెంటనే హతుని భార్య లక్ష్మి అనుచరులే నమ్మించి చంపారని ఆరోపించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హతుని భార్య దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా మాట్లాడాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. చనిపోయిన శ్రీనివాస్ ఎప్పుడైనా టీఆర్ఎస్ మీద పిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. వీధి గొడవను, రాష్ట్ర గొడవగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గతంలో నల్లగొండ జిల్లాలో అనేకమంది చనిపోయారని, వారిని పరామర్శించి ఓదార్చడం తప్ప ఎలాంటి సాయం చేయలేదని, ఇది కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే భాస్కర్‌రావు హితవు పలికారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే వీరేశం దళితుడనే కాంగ్రెస్ నేత వీహెచ్ ఎన్కౌంటర్ చేయాలని అంటున్నారని ఎమ్మెల్సీ పూలరవీందర్ ఆరోపించారు. -
విప్ల సదస్సు సిఫారసుల అమల్లో రాష్ట్రం ఫస్ట్
సాక్షి, హైదరాబాద్: గోవా, విశాఖపట్నం నగరాల్లో 2014, 2015లో జరిగిన ఆలిండియా విప్ల సదస్సుల్లో చేసిన సిఫారసులను అమలు చేయడంలో తెలంగాణ శాసన సభ, శాసన మండలి ముందంజలో ఉన్నాయని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సోమవారం ప్రారంభమైన 18వ ఆలిండియా విప్ల సదస్సులో పాల్గొన్న పల్లా గత సదస్సుల్లో చేసిన తీర్మానాలు, తెలంగాణలో అమలవుతున్న తీరును వివరించారని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సిఫారసుల అమలులో తెలంగాణ ప్రభుత్వం ఫలవంతమైన కృషి చేస్తోందని, శాసన సభ, మండలి సమావేశాలను స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. శీతాకాల సమావేశాలను 20 రోజుల పాటు నడపడం ద్వారా దేశానికే స్ఫూర్తిని ఇచ్చామన్నారు. సదస్సు సందర్భంగా రాజస్తాన్ సీఎం వసుంధరా రాజే, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్, కేంద్ర మంత్రి విజయ్ గోయెల్‌ను కలసి పలు అంశాలపై చర్చించామని తెలిపారు. ఉదయ్‌పూర్ సదస్సులో మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఉభయ సభల విప్‌లు బోడకుంటి వెంకటేశ్వర్లు, గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, శాసన సభా కార్యదర్శి నర్సింహాచార్యులు పాల్గొన్నారని వెల్లడించారు. -
‘పవన్ కల్యాణే.. అపాయింట్మెంట్ కోరారు’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ ల భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... పవన్ కల్యాణే ...కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ గురించి పవన్ ప్రశంసించారని, ఇరవై నాలుగు గంటల కరెంట్... కేసీఆర్ ఘనతేనని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కాగా పవన్ నిన్న సాయంత్రం కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లోని సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కేసీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పవన్ తొలిసారిగా ప్రగతి భవన్‌కు రావటం, సీఎంతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. అయితే ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదంటూ టీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. -
చరిత్రలో నిలిచిపోయేలా మహాసభలు: పల్లా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తల్లికి దండ వేసి గౌరవించాకే ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమవుతాయని మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ సభలు జరుగుతాయని, సభలకు 8 వేల మంది హాజరవుతారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. సభల్లో పద్యం, గద్యం వంటి వాటితో పాటు తెలుగు ప్రక్రియలపై చర్చలుంటాయన్నారు. విప్లవ రచయితల సంఘం(విరసం) వంటి సంస్థలు రాజ్యాంగాన్ని గుర్తించవని, పిలిచినా కూడా వారు రారనే ఉద్దేశంతోనే పిలవలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలుగు భాష ఖ్యాతిని పెంచేలా సభలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు అన్నీ ఢిల్లీ నుంచే వస్తాయి కాబట్టి తెలంగాణ తెలుగు రుచించట్లేదని ఎద్దేవా చేశారు. -
కాంగ్రెస్ కబంధ హస్తాల్లో కోదండరాం: సుమన్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కబంధ హస్తాల్లో జేఏసీ చైర్మన్ కోదండరాం బందీ అయ్యారని ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చునే ఓపిక లేని కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక పోతున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కాళేశ్వరం, మల్లన్న సాగర్, పాలమూరు, డిండి, కొండపోచమ్మ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసులు వేసిన ముఠానే నిరుద్యోగుల సమస్యను వాడుకుంటూ విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. రాజకీయం చేస్తున్న కోదండరాం ముఠా: పల్లా సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణకు వస్తున్న ఖ్యాతిని తట్టుకోలేక విపక్షాలు కోదండరాంను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం, కేసీఆర్, ఆయన కుటుంబంపై విషం కక్కుతున్నాయని మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కోదండరాంను, ఆయన ముఠాను నిరుద్యోగులు నమ్మడం లేదన్నారు. కోదండరాంకు దమ్ముంటే పార్టీ పెట్టాలన్నారు. విద్యార్థి మురళి డీఈడీ, బీఈడీ చేయలేదని తెలిసి కూడా ఆయన డీఎస్సీ కోసం సిద్ధమవుతున్నారని కోదండరాం అసత్యాలు చెప్పడం దురదృష్టకరమన్నారు. -
రాజకీయ నిరుద్యోగుల కోసమే ‘కొట్లాట’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కొలువులపై జేఏసీ చైర్మన్ కోదండరాం అసత్య ప్రచారం చేస్తున్నారని మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. కొలువుల కొట్లాటంతా రాజకీయ నిరుద్యోగుల కోసమేనని విమర్శిం చారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యో గాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం త్రిముఖ వ్యూహం తో ముందుకు వెళుతోందని, లక్షా 12 వేల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పటికే 27 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, 63 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ వివిధ దశల్లో ఉందని వివరించారు. ఎన్నికలప్పుడు కోటి ఉద్యోగాలిస్తామని బీజేపీ హామీ ఇచ్చిం దని, కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దాన్ని తుంగలో తొక్కిందని తెలిపారు. మీ పోరాటం బీజేపీ మీద చేయకుండా ఆ పార్టీ సాయం తీసుకుంటారా అని నిలదీశారు. నిరుద్యోగ సమస్యను పెంచి పోషించిన కాంగ్రెస్‌తో కోదండరాం ఎలా కలిసి పనిచేస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై నిరుద్యోగులు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. ఐదు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ కొందరు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. -
రేవంత్ రాజీనామా డ్రామా ఆపాలి
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాజీనామా డ్రామాను బంద్ చేసి స్పీకర్‌కు నేరుగా రాజీనామా లేఖ ఇవ్వాలని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే డ్రామా కట్టిపెట్టి రాజీనామా చేయాలని సవాలు చేశారు. కొడంగల్ ప్రజలు శంకరగిరి మాన్యాలకు పంపడానికి సిద్ధంగా ఉన్నారని, ఉప ఎన్నిక వస్తే కొడంగల్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రేవంత్, ఆయన బాస్ చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ సదస్సు ఉన్నందునే జేఏసీ కొలువుల కొట్లాటకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదని చెప్పారు. సన్‌బర్న్ షోకు అనుమతి ఇచ్చి కొలువుల కొట్లాటకు అనుమతి ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి అనడం అవగాహనా రాహిత్యమని దుయ్యబట్టారు. కావాలనే కొందరు సీఎం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఈవెంట్ల నిర్వహణతో మంత్రి కేటీఆర్‌కు, ఆయన బావమరిదికి సంబంధం ఉందని రేవంత్ చేసిన వ్యాఖ్యలు శుద్ధ అబద్ధమని ఖండించారు. -
చర్చించమంటే రచ్చ చేస్తారేం!
సందర్భం 60 ఏళ్లు పాలించిన ఈ ప్రతిపక్షాల పాలనలో జరగని ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలోనే జరుగుతుంటే వారికి ఊపిరి ఆడటం లేదు. ఏదో ఒక సమస్యపై గగ్గోలు పెట్టి పత్రికల్లో కనపడకపోతే ప్రజలలో వారి ఉనికి ప్రశ్నార్థకం అవుతుందేమోననే తప్పుడు భావంతో ఉన్నారు. ప్రజల సంక్షేమమే ప్రతిపక్షాలకూ ప్రాధాన్యతాంశంగా మారాలి. స్వార్థ ప్రయోజనాలను విడనాడి తెలంగాణ అభివృద్ధికి కలసి నడవాల్సిన చారిత్రక సందర్భంలో ప్రతిపక్షాలున్నాయనే విషయాన్ని వారు మరువరాదు. నేటి నుంచి ఎనిమిదవ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. చేసిన పనులు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడానికి ప్రభుత్వం గణాంకాలతో సహా సిద్ధంగా ఉంది. ఈ మూడున్నరేళ్లలో చేసిన కార్యక్రమాలే ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుతున్నాయి కూడా. కానీ ప్రతిపక్షాలు తీవ్ర గందరగోళంతో లేని సమస్యలను సృష్టించాలని చూస్తున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న రోజునే ప్రతిపక్ష నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చలో అసెంబ్లీ పిలుపునిచ్చారు. అలాంటి పిలుపు ఎవరు, ఎందుకు, ఎప్పుడు ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితిలో కాంగ్రెస్ పడిపోవడం శోచనీయం. 125 సంవత్సరాలు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వైఖరిని అవలంబించటం ఆత్మహత్యాసదృశమేగానీ మరొకటి కాదు. ప్రతినిధులు లేని చిన్న చిన్న ప్రజా సంఘాలు తమ డిమాండ్లను వినిపించడానికి ఆఖరి నిమిషంలో ఇచ్చే పిలుపు, అసెంబ్లీ ముట్టడి. కానీ మీ వాణిని అసెంబ్లీ వేదిక మీద వినిపించండి అని స్వయంగా ప్రభుత్వపక్షమే కాంగ్రెస్‌ను కోరుతున్నది. ఏ అంశంపైన అయినా, ఎంత సేపైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వమే చెబుతున్నది. అయినా కాంగ్రెస్ చలో అసెంబ్లీకి పిలుపు ఇవ్వడం స్వార్ధ రాజకీయ ఆరాటం తప్ప ప్రజల కోసం పోరాటం కాదు. రైతుల దుస్థితికి కారణం ఎవరో తెలియదా? అధికారంలో ఉండగా రైతుల నడ్డి విరిచిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆ వర్గం పేరు చెప్పుకుంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇవాళ దేశంలోనే ఏ రాష్ట్రమూ చేయని విధంగా రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నది తెలం గాణ ప్రభుత్వమే. ఆ సంక్షేమ దృష్టిని చూసి దేశమే గర్విస్తున్నది. రాష్ట్రంలో ఎక్కువ మందికి ఆధారం వ్యవసాయమే. అందుకే ఆ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి, రైతే కేంద్ర బిందువుగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. బడ్జెట్ కేటాయింపులు చూస్తే ఆ విషయం అవగతం అవుతుంది. వ్యవసాయ, సహకార రంగాలకి బడ్జెట్లో కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రంలో, 2013–14 సంవత్సరంలో రూ. 4,040.59 కోట్లు. ఒక్క తెలంగాణ రాష్ట్రం లోనే 2017–18 సంవత్సరం నాటికి దీనిని రూ. 5,755.62 కోట్లకు పెంచిందీ ప్రభుత్వం. కోటి ఎకరాలకు నీటిని అందించాలనే దృఢ సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది. సాగునీటి ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తే తమ అస్తిత్వానికే ప్రమాదమున్నదనే భయంతో ప్రతిపక్షాలు ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డం పడుతున్నాయి. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సాగునీటి కోసం తీసుకున్న కార్యాచరణ ఇప్పటికే ఫలితాలనివ్వడం ప్రారంభించాయి. పాలమూరు జిల్లాలో వలసలు వాపస్ అయ్యాయి. దశాబ్దాల నాటి ఆ సమస్యకు ఈ ప్రభుత్వం మూడేళ్లలోనే పరిష్కారం చూపగలిగింది. కేవలం తాగునీటికి పరిమితమైన సింగూరు, గణపురం ప్రాజెక్ట్ నీటిని, సాగుకు ఇవ్వటంతో అక్కడ సిరులు పండుతున్నాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో చరిత్ర సృష్టించబోతున్నది. కానీ రైతులకు మేలు చేసే పనులకు సహకరించకుండా, అడ్డుకునే ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్. సొంత రాష్ట్ర ప్రయోజనాలు విస్మరించి ప్రాజెక్ట్‌లకు అడ్డు పడటం ఎక్కడైనా ఉందా? మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ప్రతిపక్షం తీరు ఇదే మాదిరిగా ఉన్నదని ఎవరైనా అనగలరా? కర్ణాటక మాత్రమే కాదు, మరో రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం కనిపిస్తుందా? ప్రాజెక్టులతో భూమిని కోల్పోయే వారికి పరిహారం పెంచాలని కోరుతూ కోర్టులకు వెళ్లడం కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు పార్టీలు, కొన్ని సంఘాలు పనిగట్టుకొని కేసులు వేయించడమే ఒక ఉద్యమంగా నిర్వహిస్తున్నాయి. ఇట్లా వ్యవహరించి తెలంగాణకు ఎంత నష్టం కలిగిస్తున్నారో వారికి అర్థం కావడంలేదు. కోట్లాదిమంది సామాన్య జీవుల ప్రయోజనాలు ముఖ్యమా? లేకుంటే కొద్దిమంది రాజకీయ స్వార్థం ముఖ్యమా? అనే విషయాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ తేల్చుకోలేని స్థితిలో ఉంది. అలాంటి అసూయాపూరిత రాజకీయ ఉచ్చులో ప్రతిపక్షాలు కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే కేసీఆర్ ముందు ఈ కుప్పిగంతులు సాగవు. తెరాస ప్రభుత్వం నిబద్ధతను కట్టడి చేయలేవు. పంటల మద్దతు ధర విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. పత్తి మద్దతు ధర విషయానికొస్తే ఇది పూర్తిగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిధిలోనిది. దేశంలో మొదటి పత్తి పంట చేతికి వచ్చేది తెలంగాణలోనే. అయితే ఈ వర్షాల వల్ల పత్తిలో తేమ శాతం ఎక్కువయింది. అదనపు ఒక శాతం తేమకు పది శాతం చొప్పున కనీస మద్దతు ధరలో కోత విధిస్తున్నారు. దీనితో రైతులు నష్టపోతున్నారు. దాదాపు 46 లక్షల మేర పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. పంట చేతికొచ్చే సమయానికి భారీ వర్షాల కారణంగా సుమారు లక్షన్నర ఎకరాల్లో పత్తి తడిసింది. తేమ శాతం 20 పైగానే ఉంది. దీనిని గుర్తించి మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ‘బి’రకం పత్తి కింద మద్దతు ధర ఇవ్వమని సీసీఐని లేఖ ద్వారా కోరారు. వాస్తవాలు ఇలా ఉన్నప్పటికీ ప్రభుత్వంపై అసూయా ద్వేషాలతో నిత్య నిరసనకారులుగా ప్రతిపక్ష నాయకులు పబ్బం గడుపుతున్నారు. వీరంతా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజానీకం కోసం నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం పాత్రను పోషించడం ఎప్పుడు ఆరంభిస్తారో తెలియడం లేదు. విద్యుత్ పరిస్థితి మెరుగుపడింది రాష్ట్రంలో అత్యధిక సేద్యం బోర్ల ద్వారా జరుగుతున్నది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి, అమలు చేసి చూపించిన ఘనత ఈ ప్రభుత్వానిది. విపక్షాలు దీనినే మానిఫెస్టోలో చూపించి, అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కిన మాట వాస్తవం కాదా? వారి పవర్ కట్ల పాలనలో రైతులు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కోకొల్లలు. ఇప్పుడు పాత మెదక్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్ అమలవుతోంది. మిగతా జిల్లాల్లో కూడా అమలు చేయడానికి విద్యుత్ శాఖ సమాయత్తం అవుతోంది. తెలం గాణ ప్రాంతంలోని మార్కెటింగ్ శాఖ ఉమ్మడి రాష్ట్రంలో నిధుల లేమితో కుదేలై పోయింది. గత అరవై సంవత్సరాలలో వారు చేయలేని కొత్త గోదాముల నిర్మాణం రూ.1,024 కోట్ల ఖర్చుతో 21 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన 364 అదనపు గోదాముల నిర్మాణం జరుగుతోంది. దీనిని మూడు సంవత్సరాల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం సాధ్యం చేసి చూపించింది. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేయటం ప్రభుత్వాల కనీస భాద్యత. దీనిని విస్మరించిన గత ప్రభుత్వాలు రైతులను అనేక ఇబ్బందులకు గురిచేశాయి. విత్తనాల కోసం రైతులు తమ చెప్పులు రోడ్డుపై లైన్లలో పెట్టడం చూశాం. రైతుల వీపులపై లాఠీ దెబ్బలు చూశాం. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అడ్వాన్సుగా ఎండాకాలంలోనే విత్తనాలు సిద్ధం చేసింది. నకిలీ విత్తనాలు అమ్మే ఏజెన్సీలపై పీడీ యాక్ట్ ప్రయోగించి, నిర్వాహకులను జైలుకు పంపించింది. ఇలాంటి ఎన్నో రైతు పక్షపాత కార్యక్రమాలను చేపట్టిన ప్రభుత్వం, ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే మాట్లాడుకుందాం రమ్మని ప్రతిపక్షాన్ని ఆహ్వానిస్తున్నది. అందుకు చట్టసభలను వేదికగా చేసుకుందామని, పార్లమెం టరీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే చర్చిద్దామని, అసెంబ్లీ సమావేశాలు పెడుతుంటే వారేమో రోడ్డుకెక్కి చలో అసెంబ్లీ అంటున్నారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వటానికి వారి దగ్గరేమీ లేవు. వారి ఊహలకు కూడా అందని పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నదీ రాష్ట్ర ప్రభుత్వం. అదొక మహాయజ్ఞం తిండి పెట్టే రైతాంగానిది ఇప్పటికీ అసంఘటిత రంగమే. రైతుకు సంబందించిన ఏ కార్యక్రమం చేద్దామన్నా గ్రామస్థాయిలో ఒక వ్యవస్థ లేదు. దీన్ని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ స్థాయిలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయ తలపెట్టారు. ఇంకో వైపు రాష్ట్రంలోని 568 మండలాలలోని 10,875 రెవిన్యూ గ్రామాల్లో భూ సర్వే జరుగుతున్నది. అధికారులు మొత్తం 1,468 బృందాలుగా ఏర్పడి మొత్తం 75.54 లక్షల ఖాతాల్లోని 1.78 కోట్ల సర్వే నంబర్ల ప్రక్షాళన చేస్తున్నారు. ఇదొక మహాయజ్ఞం. ఈ ప్రక్రియ తర్వాత రైతులకు మే నెల 2018 నుంచి వ్యవసాయ పెట్టుబడి కింద ఎకరాకు రూ. 8,000 ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. రైతు సంఘంలోని ప్రతి సభ్యుని ఖాతాలో ఈ డబ్బులు జమ చేస్తామని ప్రకటించిందీ ప్రభుత్వం. ఇలాంటి ఆలోచన దేశంలోని ఏ ప్రభుత్వానికైనా వచ్చిందా? రైతుల ఆత్మహత్యలంటూ గగ్గోలు పెట్టె ఈ ప్రతిపక్షాలు అవి వారి పాపపు పాలన ఆనవాళ్లేనని గుర్తుంచుకోవాలి. దురదృష్టవశాత్తూ బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం లక్షన్నర నుంచి ఆరు లక్షల వరకు పెంచిందీ ప్రభుత్వం. 60 ఏళ్లు పాలించిన ఈ ప్రతిపక్షాల పాలనలో జరగని ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలోనే జరుగుతుంటే వారికి ఊపిరి ఆడటం లేదు. ఏదో ఒక సమస్యపై గగ్గోలు పెట్టి పత్రికల్లో కనపడకపోతే ప్రజలలో వారి ఉనికి ప్రశ్నార్థకం అవుతుందేమో ననే తప్పుడు భావంతో ఉన్నారు. ప్రజల సంక్షేమమే ప్రతిపక్షాలకూ ప్రాధాన్యతాం శంగా మారాలి. స్వార్థ రాజకీయ ప్రయోజనాలను విడనాడి తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వంతో కలసి నడవాల్సిన చారిత్రక సందర్భంలో ప్రతిపక్షాలున్నాయనే విషయాన్ని వారు మరువరాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చర్చలకు వేదిక చట్టసభలేనని వారికి తెలియనిది కాదు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించుకుంటూ మన వ్యవస్థలు పనిచేయాలి. అంతేకాని అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజుననే చలో అసెంబ్లీ పిలుపునివ్వటం మనం ఏర్పరుచుకున్న చట్టసభలను అగౌరవ పరచడమే. చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఉండీ, సమస్యల పరిష్కారానికి వేదికయిన అసెంబ్లీని విడిచి వీధి పోరాటాలకు పిలుపునివ్వడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ధర్ణాలు, రాస్తారో కోలు, చలో అసెంబ్లీలు నిర్వహించినంత మాత్రాన రైతు సంక్షేమం పట్ల కేసీఆర్ దృఢ సంకల్పం చెక్కు చెదరదు. మరింత బలోపేతమవుతుంది. డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాసకర్త ప్రభుత్వ విప్, శాసనమండలి -
రైతు సమితిలపై అవగాహన లేదు
విపక్షాలపై పల్లా ఫైర్ సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితిలపై విపక్షాలకు అవగాహన లేదని, సమితిల ఏర్పాటు ను అడ్డగిస్తామంటూ అర్థం లేకుండా మాట్లాడుతు న్నారని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. అందరితో మాట్లాడి సుదీర్ఘ కసరత్తు తర్వాతే సమితిల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని శనివారం ఇక్కడ చెప్పారు. టీఆర్ఎస్లో కోవర్టులు న్నారని భట్టి అర్థంలేకుండా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇద్దరు తప్ప అందరూ తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. -
ప్రభుత్వంపై విషం కక్కుతున్న కాంగ్రెస్
మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంపై పోరాడటానికి ఏ అంశమూ దొరక్క.. కాంగ్రెస్ నాయకులు సమస్యే కాని దాన్ని సమస్యగా చిత్రీకరించి ప్రభుత్వంపై, మంత్రి కేటీఆర్‌పై విషం కక్కు తున్నారని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. మీరాకుమార్ను సిరిసిల్లకు రప్పించి కాంగ్రెస్ నేతలు డ్రామాకు తెరలేపారని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మూడేళ్లలో దళితులు, గిరిజనులపైనే కాకుండా ఏ ఒక్క వర్గం వారిపైనా చిన్న దాడి జరగలేదని, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. -
అబద్ధాలు శృతిమించుతున్నాయి
ఉత్తమ్‌పై పల్లా ధ్వజం సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నింపిన చీకట్లను తొలగిస్తూ మూడేళ్లలోనే విద్యుత్ కొరత లేకుండా చేసి టీఆర్ఎస్ వెలుగులు నింపుతోందని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అబద్ధాలు శృతి మించుతు న్నాయన్నారు. పులిచింతలపై ఉత్తమ్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనన్నారు. 2006లో పులిచింతల హైడల్ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు వచ్చినా కాం గ్రెస్ హయాంలో తట్టెడు మన్ను కూడా తీయలేదన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే 2015లో పులిచింతలకు రూ.563 కోట్లతో పనులు మొదలయ్యాయన్నారు. కేసీఆర్ కృషితోనే విద్యుత్ ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయన్నారు. భూపా లపల్లి, కడప థర్మల్ప్లాంట్లకు ఒకేసారి శంకుస్థాపన జరిగినా కడపలో ఉత్పత్తి ప్రారంభమవలేదని, భూపాలపల్లిలో 600 మెగావాట్ల ఉత్పత్తి చేస్తున్నామన్నారు. 60 ఏళ్లలో 6వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి జరిగితే... టీఆర్ఎస్ హయాంలో మూడేళ్లలోనే 12 వేల మెగావాట్లు విద్యుత్ వస్తుందన్నారు. -
ఆయన అబద్ధాలు శృతిమించుతున్నాయి..
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలు శృతి మించుతున్నాయని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ..పులిచింతలపై ఉత్తమ్ మాట్లాడుతున్నవన్నీ అబద్దాలేనని స్పష్టం చేశారు. ఉత్తమ్ చెప్పిన దాంట్లో పులిచింతల హుజుర్ నగర్లో ఉందనేది మాత్రమే నిజమన్నారు. 2006లో పులిచింతల హైడల్ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు వచ్చినా కాంగ్రెస్ హాయంలో తట్టెడు మన్ను కూడా తీయలేదన్నారు. అపుడు ఆంధ్రా సీఎంలకు భయపడి ఉత్తమ్ లాంటి వారు పులిచింతలపై మాట్లాడలేదన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకే 2015లో పులిచింతల హైడల్ ప్రాజెక్టు డీపీఆర్ 563 కోట్ల రూపాయలతో రూపొందిందని తెలిపారు. కేసీఆర్ చొరవతోనే విద్యుత్ ప్రాజెక్టులు వేగిరంగా పూర్తవుతున్నాయని చెప్పారు. భూపాలపల్లి , కడప థర్మల్ ప్లాంట్లు ఒకేసారి మొదలయ్యాయి..భూపాలపల్లి పూర్తయితే కడప ప్లాంటు ఎందుకు పూర్తి కాలేదో కాంగ్రెస్ నేతలు చెప్పాలని కోరారు. ప్రాజెక్టులను ఆపేందుకు కాంగ్రెస్ నేతలు ట్రిబ్యునళ్ల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. అరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ ఆరు వేల మెగావాట్ల కరెంటు యిస్తే గత మూడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం 12 వేల మెగావాట్ల కరెంటు ఇచ్చిందని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రం లో విద్యుత్ ఉత్పాదనను 28 వేల మెగావాట్లకు పెంచుతామన్నారు.మేము విద్యుత్ పై చెప్పిన గణాంకాలు తప్పుంటే ఉత్తమ్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. విద్యుత్ పై కాంగ్రెస్ నేతలు అబద్దాలు ఆడటం మానుకోవాలని సూచించారు. -
టీడీపీది అక్కడో మాట.. ఇక్కడో మాట
మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తమది జాతీయ పార్టీ అని చెప్పుకునే టీడీపీ.. జీఎస్టీ, నియోజకవర్గాల పునర్విభజన, రాష్ట్రపతి ఎన్నికలు తదితర అంశాలపై ద్వంద్వ ప్రమాణాలు పాటి స్తోందని.. ఏపీలో ఒక మాట, తెలంగాణలో మరో మాట మాట్లాడుతోందని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయలో ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. డీలిమిటేషన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమి కోరారో, సీఎం కేసీఆర్ కూడా అలాగే కోరారని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్‌పై బురదచల్లడమే పనిగా పెట్టుకున్న టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. ఒకే దేశం, ఒకే పన్ను విధానంలో భాగంగా కేంద్రం తీసుకువచ్చిన జీఎస్టీ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉండదని, రాష్ట్రాలు అవునన్నా, కాదన్నా అమలు ఆగదని అన్నారు. జీఎస్టీ వల్ల వచ్చే ప్రయోజనాలను స్వాగతిస్తూనే, ప్రజలపై అధిక భారం పడే అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి వాటిని తగ్గించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేసిందన్నారు. -
'రేవంత్ రెడ్డి మళ్లీ జైలుకెళ్లడం ఖాయం'
హైదరాబాద్: టీడీపీ నేతలు ఏపీలో ఒకమాట ఇక్కడొక మాట మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో కేసీఆర్ అదే మాట్లాడుతున్నారని తెలిపారు. అమరావతిలో బాబు టీటీడీపీ నేతలతో సీట్ల పెంపుపై చర్చించలేదా ? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను సీబీఐ విచారించిందంటున్న రేవంత్ రెడ్డి దానికి ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రోడ్డు మీద ఎవడో ఏదో మాట్లాడాడని ఆ వ్యాఖ్యల మీద మేము స్పందించాలా ? అని అడిగారు. రేవంత్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. విపక్షాలు టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. కేంద్రం తీసుకున్న మూడు ప్రధాన నిర్ణయాలపై టీఆర్ఎస్ తీసుకున్న వైఖరిని కొందరు ప్రశ్నిస్తున్నారని, తెలంగాణ ప్రయోజనాల కోణంలోనే టీఆర్ఎస్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. ఓకే దేశం ఒకే పన్ను విధానం లక్ష్యంతో జీఎస్టీ అమల్లోకి వస్తోందని.. టీఆర్ఎస్ అవునన్నా.. కాదన్నా కేంద్రం జీఎస్టీ తీసుకురావాలన్న పట్టుదలతో ఉంది కాబట్టే మేం మద్దతు ఇచ్చామని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు అర్ధం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని.. జాతీయ పార్టీ అని చెప్పుకునే టీడీపీకి రాష్ట్రాల వారీగా విధానాలుంటాయా ? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు పిచ్చి కూతలు మానుకోవాలని సూచించారు. మా నేత కేసీఆర్ సూచన మేరకే మోదీ రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్‌ను ఎంపిక చేశారని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికపై కాంగ్రెస్ మమ్మల్ని ఏనాడైనా సంప్రదించిందా ? అని ప్రశ్నించారు. -
ఉత్తమ్ బంధువు ధర్నా చౌక్ బాధితుడే: పల్లా
హైదరాబాద్: ధర్నా చౌక్ తో నగరంలో రెండు లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీప బంధువు కూడా ధర్నా చౌక్ బాధితుడేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ..ఉత్తమ్ తన బంధువును అడిగితే వాస్తవాలు చెబుతారని సూచించారు. స్థానికులను కొట్టించిన లోకల్ ఎమ్మెల్యే పతనం నేటి నుంచి మొదలైందన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ప్రస్తుతం నేరపూరిత నాయకత్వాల చేతిలో ఉన్నాయన్నారు. తెలంగాణాలో హింసకు తావు లేదని స్పష్టం చేశారు. ఇకపై కఠినంగా ఉంటామన్నారు. ఎక్కడ కమ్యూనిస్టులు ఉంటే అక్కడ విధ్వంసమేనని తెలిపారు. ప్రజల మీద ప్రతిపక్షాల దాడి దురదృష్టకరమని వాపోయారు. -
మిర్చి రైతును నట్టేట్లో ముంచిన కేంద్రం
బీజేపీ నేతలపై మండిపడ్డ పల్లా రాజేశ్వర్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మిర్చి రైతును నట్టేట్లో ముంచిందని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.మిర్చి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఢిల్లీలో నిలదీయకుండా రాష్ట్ర బీజేపీ నాయకులు గల్లీలో రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం మార్కెట్లో కొన్ని పార్టీలు చేసిన కుట్రలో తాము పాల్గొనలేకపోయామన్న బాధతోనే మిర్చి మార్కెట్ల వద్ద బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మిర్చి రైతుల సమస్యను పూర్తిగా అర్థం చేసుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి విమర్శలు చేయడం సరికాదన్నారు. -
రైతుల ఉసురు తీసింది కాంగ్రెస్సే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని నాలు గున్నర దశాబ్దాలు పాలించిన కాం గ్రెస్.. వ్యవసాయ రంగాన్ని పట్టించుకో కుండా రైతుల ఉసురు తీసిందని మండలి లో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమె త్తారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవా రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లంద కుండా జలవనరులను ధ్వంసం చేసిన పాపపు చరిత్ర కాంగ్రెస్‌ది కాదా అని నిలదీశారు. టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డికి టీఆర్ఎస్ సంస్థాగత అంశాలను విమర్శించే స్థాయి లేదన్నారు. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుత మని అసెంబ్లీలో పొగిడిన బీజేపీ నేత లక్ష్మణ్, బయట అందుకు విరుద్ధంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సామాజిక న్యాయం గురించి మాట్లాటం నేతి బీరకాయ చందంగా ఉందని ఎద్దేవా చేశారు. వరంగల్ ప్రజాప్రగతి సభ ద్వారా రెండున్నరేళ్లలో ఏం చేశామో, మిగిలిన రెండున్నరేళ్లలో ఏం చేయబోతు న్నామో వివరిస్తామని చెప్పారు. -
కుంభకోణాల్లో మునిగిన కాంగ్రెస్
మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: కుంభకోణాల్లో మునిగి తేలిన కాంగ్రెస్ నేతలు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు తమ ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతే టీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ జరుగుతుందన్న ఊహల్లో ఉన్నారని, సంచలన వార్తల కోసమే కాంగ్రెస్ నేతలు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన టీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి మాదాడి రమేశ్ రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. పారదర్శకంగా, మచ్చ లేని పాలనను టీఆర్ఎస్ అందిస్తోందని, కానీ, ప్రతిపక్ష నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు ఎక్కడ అవినీతి కనిపించినా ఆధారాలు బయట పెట్టాలని, వారి మాటలు నిజమైతే ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆరోపణలకు ఆధారాలు చూపకపోతే తాము చూస్తూ ఊరుకోమని, కేసులు పెడతామని హెచ్చరించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయితే ప్రజలు వారికి ఎందుకు పట్టం కట్టలేదని నిలదీశారు. 2019 ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తున్నామని కాంగ్రెస్ పగటి కలలు కంటోందని, ఇప్పటికే ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు 2024 ఎన్నికలను టార్గెట్ చేసుకొంటే మంచిదని సలహా ఇచ్చారు. ధర్నా చౌక్ ను ప్రధాన సమస్యగా టీజేఏసీ, బీజేపీ భావిస్తున్నాయని, ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు వద్దని అన్నాం కానీ, అసలు ధర్నాలే వద్దని తాము చెప్పలేదన్నారు. పార్టీ సభ్యత్వం కోసం పోటీ పెరిగిందని, 50 లక్షల టార్గెట్‌గా పెట్టుకున్నా, 70 లక్షల సభ్యత్వాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోందని విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. -
కోదండరాంను విమర్శించే స్థాయి ఆయనకు లేదు!
హైదరాబాద్: ఇటీవల నిర్వహించిన నిరుద్యోగుల నిరసన ర్యాలీపై పోలీసుల నిర్బంధం నేపథ్యంలో తెలంగాణ జేఏసీ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. నిరుద్యోగుల నిరసన ర్యాలీతోపాటు భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నెల 27న విద్యార్థి, యువజన విభాగాలతో భేటీ కావాలని టీజేఏసీ ఈ సందర్భంగా నిర్ణయించింది. టీజేఏసీ భేటీ అనంతరం జేఏసీ అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. జేఏసీ చైర్మన్ కోదండరాంను విమర్శించే స్థాయి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని వారే టీజేఏసీపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. -
రేవంత్‌రెడ్డికి జీవితాంతం చిప్పకూడే: పల్లా
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఇప్పటికే నెల రోజులు జైల్లో గడిపిన టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి తన తీరు మార్చుకోకపోతే జీవితాంతం జైలులో చిప్పకూడు తినక తప్పదని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. కోస్గిలో టీడీపీ పాదయాత్ర ముగింపు సందర్భంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుపై రేవంత్‌రెడ్డి అనుచిత విమర్శలు చేశారని మండిపడ్డారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌తో కలసి గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ దీపం ఆరిపోయే దశలో ఉందని, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్న చందంగా రేవంత్ వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు. -
‘క్యాంప్ కార్యాలయంపై విష ప్రచారం’
హైదరాబాద్: సీఎం క్యాంపు కార్యాలయంపై టీడీపీ నేతలది విషప్రచారమని విప్ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత ఒకరు క్యాంపు కార్యాలయంలో 150 గదులున్నాయంటారు.. మరో నేత 300 కోట్లు ఖర్చు పెట్టారంటారు.. వీటికి సంబంధించి ఏమైనా ఆధారాలున్నాయా.. వీటికి జీవోలు చూపగలరా అని ప్రశ్నించారు. వేరే రాష్ట్రాల్లో ఇంతకంటే పెద్ద క్యాంప్ కార్యాలయాలున్న సంగతి టీడీపీ నేతలకు తెలియదా అన్నారు. క్యాంపు కార్యాలయానికి రూ. 35 కోట్లు మాత్రమే ఖర్చు అయిందని, అతి తక్కువ ఖర్చుతో ప్రజల సౌకర్యార్థం, మెరుగైన పాలన కోసమే క్యాంప్ కార్యాలయం నిర్మించామని తెలిపారు. ఇది సొంతానికి కట్టింది కాదని, 150 ఏళ్ల అవసరాలకు సరిపడే విధంగా నిర్మించినట్లు చెప్పారు. అలాగే రైతు రుణ మాఫీపై కాంగ్రెస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. కేవలం ఒకే ఒక్క విడత మాఫీ చేయాల్సి ఉందని దాన్ని కూడా విడుదల చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి అనుకున్న ప్రకారం ప్రతి ఎకరాకు నీరందిస్తామని, పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రానికి ఆదాయం తగ్గినా ఆ ప్రభావం ఈ ప్రాజెక్టులపై పడకుండా చూస్తామని చెప్పారు. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పాదయాత్ర సందర్భంగా సామాజిక న్యాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
కాంగ్రెస్‌కు సహకరించడమే ఎజెండా
కోదండరాంపై ఎంపీ సుమన్ ఆరోపణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్ పార్టీని లేపి నిలబెట్టాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తాపత్రయపడుతున్నారని, ఏదోరకంగా కాంగ్రెస్‌కు సహకరించడమే ఆయన ఏకైక ఎజెండాగా కనిపిస్తున్నదని ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. కోదండరాం మేధావి ముసుగులో ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని, అయినా అసలు జేఏసీ ఎక్కడుందని ప్రశ్నించారు. శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌తో కలసి సుమన్ శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని కోదండరాం చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. -
‘రేవంత్ వ్యాఖ్యలు అర్థరహితం’
సాక్షి, హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలైన తర్వాత జిల్లాల విభజన చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరినో రాజకీయంగా దెబ్బతీయడానికి కేసీఆర్ జిల్లాల విభజన చేస్తున్నారన్న రేవంత్ ఆరోపణలు.. పచ్చర్ల కామెర్ల రోగి సామెతను తలపిస్తున్నాయన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలసి శనివారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో సుమన్ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయాలు, పనులను రాజకీయ కోణంలో చూడటం టీడీపీకి దిక్కుమాలిన అలవాటుగా మారిందని సుమన్ విమర్శించారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్ర క్రియ మొదలైందని రేవంత్ అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. -
రైతులకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం: తుమ్మల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు, రైతులకిచ్చిన మాట నిలబెట్టుకుంటామని, వారికి ఎప్పటికీ ద్రోహం చేయబోమని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. ఒకవేళ మాట తప్పాల్సిన పరిస్థితి ఎదురైతే ఉరి వేసుకుంటామన్నారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజే శ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పురాణం సతీశ్‌తో కలసి ఆయన గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మాట్లాడారు. కాంగ్రెస్.. రైతు పరామర్శ యాత్ర, సీపీఎం.. మహాజన పాదయాత్రలు చేస్తామంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు రోడ్లెక్కకుండా సకాలంలో అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కోతల్లేని కరెంటు ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణను వ్యతిరేకించి, పార్లమెంటులో తెలంగాణ ఇచ్చి తప్పు చేశారని ఇటీవల పార్లమెంటులో అన్న సీపీఎం ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేపడుతుందన్నారు. క్షమాపణ చెప్పి పాదయాత్ర చేయండి: పల్లా రాష్ట్ర ప్రజల కోసం సీపీఎం ఏనాడూ సానుకూలంగా ఆలోచించలేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే మహాజన పాదయాత్ర చేపట్టాలని హితవు పలికారు. -
'దొంగ లెక్కలు చెప్పడంలో ఆయన దిట్ట'
-
'దొంగ లెక్కలు చెప్పడంలో ఆయన దిట్ట'
హైదరాబాద్: 'దొంగ లెక్కలు చెప్పడంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమిత్ షా దిట్ట' అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంతో బీజేపీకి సంబంధం లేదన్నారు. సెప్టెంబర్ 17ను బీజేపీ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీ.. సెప్టెంబర్ 17ను అధికారికంగా ఎందుకు నిర్వహించలేదని అన్నారు. కేంద్ర పథకాలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేవని చెప్పారు. అరుణాచల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో అమిత్ షా చెప్పాలని డిమాండ్ చేశారు. 2019లో బీజేపీ అధికారంలోకి వస్తుందనడం హాస్యాస్పదమని పల్లా తెలిపారు. -
మండలి చీఫ్ విప్‌గా పాతూరి
విప్‌లుగా పల్లా, బోడకుంటి సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి నియమితులయ్యారు. విప్‌లుగా ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లును నియమించారు. ఏడాదిగా వాయిదా పడుతూ వచ్చిన చీఫ్ విప్, విప్ల నియామకాలకు ఎట్టకేలకు సీఎం కేసీఆర్ అనుమతివ్వడంతో ఈ మేరకు ప్రభుత్వం మూడు జీవోలను జారీ చేసింది. పాతూరి, పల్లా, బోడకుంటి శనివారం క్యాంపు ఆఫీస్‌లో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు. పాతూరి సుధాకర్‌రెడ్డి: కరీంనగర్ జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లికి చెందిన సుధాకర్‌రెడ్డి 1968 నుంచి 2005 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం (పీఆర్టీయూ) నేత గా, 1975 నుంచి రాష్ట్ర అధ్యక్షునిగా, కార్యదర్శిగా పనిచేశారు. 2007లో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2011లో టీఆర్ఎస్లో చేరి 2013లో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నుంచి రెండోసారి మండలికి ఎన్నికయ్యారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి: వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం షోడశపల్లికి చెందిన పల్లా.. ఎమ్మెస్సీ (ఫిజిక్స్), పీహెచ్డీ పూర్తి చేశారు. విద్యార్థి సంఘాల్లో పని చేసి తర్వాత నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో విద్యా సంస్థలు నెలకొల్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీతో మమేకమై పనిచేశారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్ఎస్ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా పనిచేశారు. ఈ ఏడాది జరిగిన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మండలికి ఎన్నికయ్యారు. బోడకుంటి వెంకటేశ్వర్లు: వరంగల్ జిల్లా బచ్చన్నపేటకు చెందిన బోడకుంటి.. బచ్చన్నపేట ఎంపీపీగా, వరంగల్ జెడ్పీ చైర్మన్‌గా, వరంగల్ ఎంపీగా పనిచేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటాలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై త ర్వాత టీఆర్ఎస్లో చేరారు. 2015లో జరిగిన ఎమ్మెల్యే కోటా మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. -
నయీమ్‌ను పెంచి పోషించింది గత పాలకులే : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
* రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ఆరోపణలు * టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ధ్వజం సాక్షి, హైదరాబాద్: నయీమ్ అనే క్రూర మృగాన్ని పెంచి పోషించింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. నయీమ్ నేర సామ్రాజ్యానికి టీడీపీ విత్తనం నాటి, అంకురార్పణ చేయగా, కాంగ్రెస్ నీళ్లు పోసి సంరక్షించిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిశోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉండి నయీమ్ ఆగడాలను అరికట్టలేకపోయిన రాజగోపాల్‌రెడ్డి వంటి కాంగ్రెస్ నాయకులు.. ఉద్యమాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. దళిత ఎమ్మెల్యేలపై అనవసర ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్ డిమాండ్ చేశారు. తనపై, మరో ఎమ్మెల్యే వేముల వీరేశంపై చేసిన తప్పుడు ఆరోపణలపై చర్చకు సిద్ధం కావాలని, ఆధారాలు ఉంటే నిరూపించాలన్నారు. ఇపుడు నీతులు చెబుతున్న రాజగోపాల్‌రెడ్డి గతంలో నయీమ్ సాంబశివుడిని హత్య చేసినప్పుడు ఎందుకు ఖండించలేదని నిలదీశారు. -
'వాళ్లంతా కూడా నయీం బాధితులే'
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీంతో నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను ఆ పార్టీ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఖండించారు. మంగళవారం వారు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఎఫ్ఐఆర్లో పేరున్నంత మాత్రాన తప్పుచేసినట్టు కాదన్నారు. ప్రాథమిక సమాచారం మేరకే ఎఫ్ఐఆర్ నమోదవుతుందని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో తప్పులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్వి చీప్ పాలిటిక్స్' అని మండిపడ్డారు. నయీమ్ మా ఎమ్మెల్యేలను బెదిరించారని అన్నారు. తమ పార్టీ అయినా వేరే పార్టీ అయినా చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయని చెప్పారు. నేతి విద్యాసాగర్‌పై నమోదు అయింది ఎఫ్ఐఆర్ మాత్రమేనని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు అయినంత మాత్రాన దోషి కాదన్నారు. కాంగ్రెస్ నిరసన అనడానికి సిగ్గు ఉండాలని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశావని ప్రశ్నించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మోచేతి నీళ్లు తాగావని కోమటిరెడ్డి బ్రదర్స్‌పై పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తప్పులు చేసి ఉంటే.. చర్యలు తీసుకుకేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమని తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా నయీం బాధితులే' అని వెల్లడించారు. నయీం వల్ల లాభం పొందింది ఎవరూ? నష్టం పొందిందెవరో అందరికీ తెలుసునని చెప్పారు. తమ పార్టీకి చెందిన సాంబశివుడు, రాములను హత్యచేసినప్పుడు ఎందుకు స్పందించలేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్ సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ అక్రమంగా సంపాదించిన డబ్బులతో పదవులు కొంటున్నాడని ఆరోపించారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా వెళ్తామన్నారు. గుండాగిరితో రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు. నయీమ్‌కు రాజకీయ, ఆర్థిక సహకారం కోమటిరెడ్డి బ్రదర్స్ అందించారనే అనుమానం కలుగుతుందని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌తో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. నయీంతో కాంగ్రెస్ నేతలు లబ్ధిపొందారని ఆయన విమర్శించారు. గత ముఖ్యమంత్రులు కూడా నయీంతో అంటకాగారని విమర్శించారు. -
జీవో 123 రద్దుతో ప్రతిపక్షాల రాక్షసానందం
పల్లా రాజేశ్వర్‌రెడ్డి సాక్షి,హైదరాబాద్: భూసేకరణకు ఉద్దేశించిన జీవో 123ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ రాక్షసానందం పొందుతున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... జీవో 123కు వ్యతిరేకంగా 70 పిటిషన్ల వరకు వేశారని, 2013 చట్టానికి లోబడే ప్రభుత్వం భూ సేకరణ జరుపుతోందని, ఇంత పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా భూసేకరణ పూర్తి చేసి ప్రాజెక్టులు నిర్మించి తీరుతామన్నారు. వాటర్ గ్రిడ్ తమదే అంటున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వేసవి కాలంలో తాగునీటి కష్టాలు ఎందుకొచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
మాగ్నటిక్ కు టీఆర్ఎస్కు సంబంధం లేదు
►ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గందరగోళ పరుస్తున్నాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎంసెట్ పరీక్ష నిర్వహించిన మాగ్నటిక్ సంస్థతో టీఆర్ఎస్ నేతలెవరికీ సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ఉనికి చాటుకోవడానికి విమర్శలు చేస్తున్నారన్నారు. లీకేజీ వ్యవహారం బహిర్గతం కాగానే ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టిందని, చట్టప్రకారం ముందుకు వెళ్తుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఎంసెట్ పేపర్ లీకేజీతో మంత్రులకు సంబంధం లేదని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. మరో ఎమ్మెల్సీ బోడికుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పత్రికల్లో ఎంసెట్ లీకేజీ వార్తలు రాగానే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించి, వాస్తవాలను వెలుగులోకి తెచ్చారన్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీని అడ్డుకున్న పోలీసులు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించేలా ఓ పోలింగ్ కేంద్రంలోకి అనుచరులతో వెళ్లేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మండల కేంద్రంలోని బాలుర హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్దకు రాజేశ్వర్‌రెడ్డి ఉదయమే వచ్చారు. ఆయన వెంట సుమారు 60 మంది స్థానిక నాయకులు కూడా ఉన్నారు. అందరూ కలసి గుంపుగా లోపలికి వెళుతుండగా స్థానిక ఎస్ఐ రాఘవేందర్ సిబ్బందితో కలసి అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం అలా వెళ్లకూడాదని స్పష్టం చేశారు. ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరు కూడా కానందున.. కావాలంటే 100 మీటర్ల దూరంలో ఉండి పోలింగ్‌ను పర్యవేక్షించుకోవచ్చని సూచించారు. దీంతో రాజేశ్వర్‌రెడ్డి వెనక్కి తగ్గారు. -
'చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి'
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటున్నామని చెప్పారు. -
'టీడీపీ నేతలకు మురికి పట్టింది.. క్లీన్ చేస్తాం'
హైదరాబాద్: టీ టీడీపీ నేతలకు మురికి పట్టింది.... స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా వారిని కూడా క్లీన్ చేస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ... స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని రాజకీయం చేయడం సరికాదని టీడీపీ నేతలకు హితవు పలికారు. సాగునీటిపై త్వరలో సీఎం కేసీఆర్ కొత్త పథకం ప్రకటిస్తారని తెలిపారు. జూన్ 2 లోగా రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. అయితే ఈ కార్యక్రమంపై టీ టీడీపీ నేతలు విమర్శులు గుప్పిస్తున్నారు. -
'సాగునీటిపై కేసీఆర్ త్వరలో కొత్తపథకం'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలో సాగునీటిపై కొత్త పథకం ప్రకటిస్తారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. జూన్ 2లోగా మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై రాజకీయ చేయడం సరికాదని, టీడీపీ నేతలకు మురికిపట్టిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా వారిని కూడా శుభ్రం చేస్తామని అన్నారు. -
సాగర్ శిక్షణలో సైడ్‌లైట్స్
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉదయం 9గంటల నుంచే విజయ విహార్‌లోని శిక్షణ కేంద్రానికి రావడం ప్రారంభమైంది. 10గంటలకు చేతిలో బ్యాగు నోటుబుక్స్‌తో సమావేశమందిరంలోకి చేరారు. హాజరుపట్టికలో సంతకం పెట్టి సెలైంట్‌గా కూర్చున్నారు. శిక్షణనిచ్చేవారు చెప్పిన ప్రతి అంశాన్ని నోటు చేసుకోవడంతో పాటు అర్ధంకాని అంశాలను అడిగి తెలుసుకున్నారు. వాలంటరీలను మంచినీరు కూడా తాగనివ్వకపోవడంతో వారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆదివారం తాగునీటితో పాటు భోజనాలు ఏర్పాటు చేశారు. సమయం పూర్తయ్యేవరకు ఏఒక్క ప్రజాప్రతినిధీ బయటకు రాలేదు. శనివారం కన్నా ఆదివారం శిక్షణ సీరియస్‌గా నడిచింది. పోలీసులు ఏ ఒక్కరినీ అనుమతిలేకుండా లోపలికి వెళ్లనివ్వలేదు. మీడియా ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సాయంత్రం మీడియా వాళ్లు కూర్చోవడానికి విజయవిహార్ ముందు టెంట్ వేసి కుర్చీలు వేశారు. రెండు రోజులకు మేల్కొన్న టీఆర్ఎస్ నాయకులు దూరం నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులకు అదివారం రాత్రి గెట్‌టూ గెదర్ ఏర్పాటు చేశారు. - నాగార్జునసాగర్ -
టీఆర్ఎస్ కార్యకర్తలకు బీమా: పల్లా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కార్యకర్తలకు రూ.2 లక్షల సాయం అందేలా ఇన్సూరెన్సు చేయించామని ఆ పార్టీ అడహాక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.4 కోట్ల 64 లక్షల 21 వేల 200 ప్రీమియం సొమ్మును చెల్లించామని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. థర్డ్‌పార్టీ బీమా కంపెనీ ‘ఈ-మెడ్ లైఫ్’ ప్రతినిధులకు ఈ మొత్తానికి చెక్కును సీఎం కేసీఆర్ అందించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల సభ్యత్వం నమోదు కాగా, ఇప్పటి వరకు తమ కార్యాలయానికి అన్ని వివరాలతో 41.30 లక్షల మంది సభ్యత్వాలు అందాయని, వీరందరికీ ఇన్సూరెన్సు చేయించామన్నారు. ఈ బీమా ద్వారా సభ్యులకు రూ.2 లక్షల మేర లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. -
'ప్లీనరీకి 36 వేల మంది హాజరవుతారు'
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ఈ నెల 24న చేపట్టనున్న ప్లీనరీ సమావేశానికి 36 వేల మంది హాజరవుతారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... 24వ తేదీ సాయంత్రం అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని తెలిపారు. టీఆర్ఎస్ కొత్త అధ్యక్ష ఎన్నికల అధికారిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యవహరిస్తారని చెప్పారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న ప్లీనరీలో సీఎం కేసీఆర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటారన్నారు. అలాగే ఈనెల 27న పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సభకు 10 లక్షల మంది హాజరవుతారని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. -
‘నల్లగొండ’లో టీఆర్ఎస్ గెలుపు
► రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ► మొదటి ప్రాధాన్యత ఓట్లలో మెజార్టీకి 7,013 ఓట్లు తక్కువ ► ఎలిమినేషన్ ప్రక్రియలో 67,183 ఓట్లు సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి ► రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి.. అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చిన రామ్మోహనరావు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. సమీప బీజేపీ ప్రత్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావుపై రెండో ప్రాధాన్యత ఓటుతో 11,940 ఓట్ల మెజారిటీ సాధించారు. తొలిరౌండ్లో ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఏ అభ్యర్థికీ మెజార్టీ రాకపోవడంతో... రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించాల్సి వచ్చింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను ఎలిమినేట్ చేసి.. ప్రక్రియను కొనసాగించగా గెలుపునకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 66,777 ఓట్లకు మించి 67,183 ఓట్లను రాజేశ్వర్‌రెడ్డి సాధించారు. ఈ సమయానికి రామ్మోహనరావుకు 55,243 ఓట్లు వచ్చాయి. దీంతో 11,940 ఓట్ల మెజారిటీతో రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. ఈ మేరకు రాత్రి 11 గంటల సమయంలో రిటర్నింగ్ అధికారి పి.సత్యనారాయణరెడ్డి ఆయనకు ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు. పోటా పోటీ..: మొత్తంగా నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో 1,53,547 ఓట్లు పోల్‌కాగా.. 1,51,413 ఓట్లు చెల్లినవిగా గుర్తించారు. ఇందులో 50 శాతం కన్నా ఒక ఓటు అదనంగా అంటే.. 66,777 ఓట్లు సాధించిన అభ్యర్థి గెలుపొందినట్లు లెక్క. కానీ పోటీ చేసిన 22 మంది అభ్యర్థుల్లో తొలుత ఎవరికీ మెజారిటీ రాలేదు. తొలి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజేశ్వర్‌రెడ్డి 59,764 ఓట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి రామ్మోహనరావు 47,041 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 13,033 ఓట్లు, వామపక్షాల మద్దతుతో పోటీచేసిన సూరం ప్రభాకర్‌రెడ్డి 11,580 ఓట్లు సాధించారు. మిగతా 18 మంది స్వతంత్ర అభ్యర్థులకు కలిపి 2,154 ఓట్లు వచ్చాయి. దీంతో మెజార్టీ ఓట్ల కోసం రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి బీజేపీ నుంచి పోటీ చేసిన ఎర్రబెల్లి రామ్మోహనరావు గట్టి పోటీ ఇచ్చినా.. మెజార్టీకి అవసరమైన ఓట్లు సాధించలేకపోయారు. మొత్తంగా 16 రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా... ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అయితే ఏ రౌండ్లోనూ భారీ మెజారిటీ సాధించలేకపోయారు. బీజేపీ కన్నా సరాసరి 750 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. అదే సమయంలో వామపక్షాలు, కాంగ్రెస్ అభ్యర్థులకు కలిపి ప్రతి రౌండ్లో 1,500 ఓట్ల వరకు వచ్చాయి. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడంతోనే అధికార పార్టీ అభ్యర్థి గెలుపొందారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ చాలా మందకొడిగా సాగింది. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ముగిసి విజేతను అధికారికంగా ప్రకటించేందుకు 37 గంటల 30 నిమిషాల సమయం తీసుకోవడం గమనార్హం. -
ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గెలుపు
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలిలో వరంగల్ - ఖమ్మం - నల్గొండ జిల్లాల పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత కౌంటింగ్‌లో ఆయనకు తగినంత మెజార్టీ రాలేదు. దాంతో రెండవ ప్రాధాన్యత కౌంటింగ్ మొదలు పెట్టారు. ఇందులో రాజేశ్వర రెడ్డి 12వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లలలో విజేతగా నిలవడానికి 66,777 ఓట్లు రావాలి. అయితే టీఆర్ఎస్ అభ్యర్థికి 59,764 ఓట్లు మాత్రమే వచ్చాయి. రెండవ ప్రాధాన్యత ఓట్లతో పల్లా రాజేశ్వర రెడ్డి గెలుపొందారు.