
ఉత్తమ్ బంధువు ధర్నా చౌక్ బాధితుడే: పల్లా
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీప బంధువు కూడా ధర్నా చౌక్ బాధితుడేనని టీఆర్‌ఎస్..
హైదరాబాద్: ధర్నా చౌక్ తో నగరంలో రెండు లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీప బంధువు కూడా ధర్నా చౌక్ బాధితుడేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ..ఉత్తమ్ తన బంధువును అడిగితే వాస్తవాలు చెబుతారని సూచించారు.
స్థానికులను కొట్టించిన లోకల్ ఎమ్మెల్యే పతనం నేటి నుంచి మొదలైందన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ప్రస్తుతం నేరపూరిత నాయకత్వాల చేతిలో ఉన్నాయన్నారు. తెలంగాణాలో హింసకు తావు లేదని స్పష్టం చేశారు. ఇకపై కఠినంగా ఉంటామన్నారు. ఎక్కడ కమ్యూనిస్టులు ఉంటే అక్కడ విధ్వంసమేనని తెలిపారు. ప్రజల మీద ప్రతిపక్షాల దాడి దురదృష్టకరమని వాపోయారు.