సాక్షి, ఖమ్మం: ''పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక పెద్ద బ్రోకర్ అని.. పెద్దల సభకు అడుగుపెట్టే అర్హత ఆయనకు లేదంటూ'' పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్పీ ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం ఖమ్మం వచ్చిన ఉత్తమ్ కుమార్ ఖమ్మం- నల్గొండ- వరంగల్ అభ్యర్థి రాములు నాయక్‌ను గెలిపించాలని కోరారు. రాములు నాయక్‌తో పాటు రంగారెడ్డి- హైదరాబాద్-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్న చిన్నారెడ్డికి టీటీఎఫ్, ఎస్‌టీఎఫ్ మద్దతు తెలిపిందని ఉత్తమ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ''రాములు నాయక్ కి లక్షా 13వేల మోజార్టీ రావాలి.. జనరల్ సీటులో భాగంగా గిరిజన నాయకుడికి సీటు ఇచ్చాం.కేసీఆర్ నిరంకుశత్వం, దోపిడీ తీరు, ఎస్సీ, ఎస్టీ సభ్యుల పట్ల వివక్షత చూపించి తమ వారిని అవమానించిందన్న కారణంతో రాములు నాయక్ టీఆర్‌ఎస్ పోలీట్ బ్యూరో కి రాజీనామా చేసిన వ్యక్తిగా పేరు పొందారు. కాంగ్రెస్ సామాజిక న్యాయంకి కట్టుబడి ఉంది. బీజేపీ, కమ్యూనిస్టులు దళితులను గుర్తించలేదు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక బ్రోకర్.పెద్దల సభకు ఆయనకు అర్హత లేదు.ఆరేళ్ళ నుంచి ప్రజలకు అందుబాటులో లేరు.పల్లా, మల్లారెడ్డి ప్రైవేట్ యునివర్సిటీ లు తెచ్చుకొని లాభపడ్డారు. కోదండ రామ్ కు ఓటు వేస్తే అది వృధానే.. పల్లా ప్రలోభాలకు ఓటర్లు లొంగరు..పోటాపోటీగా ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణలో 30లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాల విషయంలో టీఆర్ఎస్ వాళ్ళు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ఈ ఏడేళ్లలో కేసీఆర్ ఇంట్లో ఉద్యోగాలు వచ్చాయి.. నిరుద్యోగులకు కాదు. కొత్త బిచ్చగాళ్ల కి పొద్దు ఎరగడ అన్నట్లు బండి సంజయ్ తీరు ఉంది.కాంగ్రెస్ వాళ్ళ ను డబ్బుల సంచితో కొనుగోళ్ళు చేస్తున్నారు. కేసీఆర్ దేవుళ్లను కూడా మోసం చేశారు. వంద కోట్లు భద్రాద్రి రామునికి ఇస్తాం అన్నాడు.అంతేకాదు పీఆర్సీ, పదోన్నతులు అంటూ ఊరించి చివరకు ఏం చేయకుండానే ఉద్యోగులు, ఉపాధ్యాయులును అవమాన పర్చారు.''అంటూ మండిపడ్డారు.
చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు: పార్టీ నేతలకు కేటీఆర్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment