ramulu nayak
-
వైరాలో వార్.. కారు స్పీడ్‌కు కాంగ్రెస్ బ్రేక్ వేస్తుందా?
వైరా నియోజకవర్గంలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఏవరు గెలుస్తారన్నది పక్కన పెడితే.. రెండు పార్టీలలో గ్రూప్ వార్ చర్చానీయంశంగా మారుతుంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు ఈసారి టికెట్ దక్కలేదు. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు టికెట్ వరించింది. దీంతో పైకి మదన్ లాల్ గెలుపుకోసం పనిచేస్తానని రాములు నాయక్ చెబుతున్నా లోలోపల చేయాల్సిందంతా చేస్తున్నారట. అటు కాంగ్రెస్‌లో కూడా అదే పరిస్థితి తలెత్తింది. ఏకంగా అర డజన్ మంది టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి టికెట్ వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వైరా ఎన్నికల సమరంలో కారు దూసుకు పోతుందా? కాంగ్రెస్ తన సత్తా చాటుతుందా.? ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడు. పాలనా సౌలభ్యం కోసం రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏకైక నియోజకవర్గం వైరా. కొనిజర్ల, వైరా, ఏన్కూర్, జూలూరుపాడు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గ జనాభా 1,97,360 మంది ఓటర్లు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో వైరా నియోజకవర్గం హట్సీట్గా మారునుందనే చెప్పాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో గ్రూప్ వార్ తారాస్థాయికి చేరడంతో టికెట్ వచ్చిన వారికి.. రాని వారు సపోర్ట్ చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకాకుండా మాజీ ఎమ్మెల్యేకు టికెట్ రావడంతో ఎమ్మెల్యేవర్గం ఏమాత్రం మద్దతు ఇచ్చే పరిస్థితి కనబడటంలేదు. అటు కాంగ్రెస్‌లో సైతం అదే పరిస్థితి. అభ్యర్థుల ప్రకటన తర్వాత వైరా కాంగ్రెస్‌లో పెద్ద రచ్చనే చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు అరడజన్ పైనే ఉండటం ఇందుకు కారణం. వైరా నియోజకవర్గం నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేగా లావుడియా రాముల నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రధానంగా ఎమ్మెల్యే తరుచూ అనేక సమావేశాల్లో నోరు జారీ చిక్కులు తెచ్చుకున్నారు. ఎంతలా అంటే ఆయన నోరు జారీన స్పీచ్‌లు నేషనల్ మీడియా వరకు వెళ్లాయంటేనే స్పీచ్‌లు ఏస్థాయిలో డ్యామేజ్ చేశాయో అర్థమవుతుంది. అంతేకాదు ఇండిపెండెంట్‌గా జనం ఆదరించిన ఎమ్మెల్యేరాములు నాయక్ అభివృద్ధి చేసింది ఏమీ చేయలేదనే అపవాదును మూటగట్టుకున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యే, ఆయన కోడుకు జీవన్ లాల్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల లిస్ట్ చాంతడంతా ఉందన్నది లోకల్‌గా ప్రచారం నడుస్తూ వస్తుంది. రాములు నాయక్‌కు టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణం అవినీతి ఆరోపణలే అన్న ప్రచారం ఉంది. మొత్తం ఈక్వేషన్స్ పరిగణంలోకి తీసుకొని బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేరాములు నాయక్‌ను కాదని మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు టికెట్ కేటాయించింది. బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన పథకాలు తనను గెలిపిస్తాయని బానోత్ మదన్ లాల్ ధీమాతో ఉన్నారు. ప్రధానంగా పోడు భూములకు పట్టాల పంపిణీ, దళితులకు దళిత బంధువు పది లక్షలు ,రైతులకు లక్ష రూపాయాల రుణ మాఫీ బీసీలకు లక్ష రుపాయల ఆర్థిక సహయం ఓట్లు కురిపిస్తాయని మదన్ లాల్ ఆశిస్తున్నారు. మదన్ లాల్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. లంబడా సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఈసారి సానుభూతితో గెలుస్తానని నమ్మకంతో ఉన్నారు. మదన్ లాల్ మా బావ ఆయనకి టికెట్ కేసీఆర్ ఇచ్చాడు.. కేసిఆర్ నా దేవుడు ఆయన టికెట్ ఇచ్చారు కాబట్టే ఆయన గెలిపించుకునేందుకు కృషి చేస్తానని చెబుతున్నారు ఎమ్మెల్యే రాములు నాయక్. దళిత బంధు విషయంలో మంత్రి పువ్వాడ అజయ్, మదన్ లాల్ కలిసి మదన్ లాల్ వర్గానికి చెందిన 600 మందికి అధికారులు దళితబంధు ఇచ్చారని స్థానిక ఎమ్మెల్యేగా తనకు తెలియకుండనే ఇదంతా జరిగిందని రాములు నాయక్ ఇటివలే చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమారమే లేపాయి. అంతేకాదు మంత్రి అజయ్‌పై తీవ్రస్తాయిలో విమర్శలు చేశారు. ఇవి కూడా పార్టీలో హట్ టాపిక్‌గా మారాయి. ఆ తర్వాత పార్టీ అధిష్టానం రాములు నాయక్‌ను బుజ్జగించడంతో ప్రస్తుతం కొంత సైలెంట్‌గా ఉన్నారు. మళ్లీ బాంబ్ పేలుస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. పైకి రాముల నాయక్ మదన్ లాల్ మా బావ.. కేసీఆర్ చెప్పిండు కాబట్టి ఓట్లేపిస్తానని పైకి రాములు నాయక్ చెబుతున్న.. రాములు నాయక్ వర్గం మాత్రం మదన్ లాల్‌కు సపోర్ట్ చేసేదే లేదని చెప్పుకొస్తుంది. సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాలోత్ రాందాస్ నాయక్ ,బాలాజీ నాయక్, బానోత్ రామ్మూర్తి నాయక్, విజయిబాయి.. బీజేపీ నుంచి మోహన్ నాయక్, డీబీ నాయక్, కృష్ణ రాథోడ్‌లు టికెట్లు ఆశిస్తున్నారు. వైరా నియోజకర్గంలో లంబాడి ఓట్లు ఎక్కువ. లంబాడి ఓట్లు ఎవరికి ఎక్కువ వేస్తే వాళ్ళు గెలుపొందే అవకాశాలు ఉంటాయి. లంబాడి ఓట్ల తర్వాత బీసీ ఓట్లు కూడా అధికంగా ఉన్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటమిలపై వీరి ప్రభావం ఏక్కువగా ఉంటుంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో వైరా నియెజకర్గంలో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
బీఆర్ఎస్ టికెట్ల లొల్లిలో రాసలీలల ట్విస్ట్!
సాక్షి, ఖమ్మం: అధికార పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటనకు ఇంకా ఒక్కరోజే ఉంది. ఈలోపు టికెట్ల కుంపటి భగ్గుమనే స్థాయికి చేరుకుంది. ఖమ్మం జిల్లాలోనూ బీఆర్ఎస్లో టికెట్ల వార్ కొనసాగుతుండగా.. వైరాలో అది మరో టర్న్ తీసుకుంది. వైరా టికెట్ తనకే మళ్లీ వస్తుందంటూ ఎమ్మెల్యే రాములు నాయక్ ధీమాగా ఉండగా.. తమకే వస్తుందంటూ అనుచరులతో హల్ చల్ చేయించుకుంటున్నారు మాజీలు మదన్‌లాల్, బానోతు చంద్రావతిలు. ఈ క్రమంలో మదన్‌లాల్‌కే టికెట్ అనే ప్రచారాన్ని బలంగా తీసుకెళ్తున్న ఆయన వర్గీయులకు ఊహించని ఝలక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ రాసలీలలు ఫోటోలు తెరపైకి వచ్చి వైరల్ ప్రకంపనలు సృష్టించాయి. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు ప్రస్తుతం అక్కడి వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా అకౌంట్లలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అంటూ ప్రత్యర్థి గ్రూపులు ప్రశ్నలు గుప్పిస్తున్నాయి. అయితే.. అవి మార్ఫింగ్ ఫొటోలు అని, మదన్‌లాల్‌కే బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వనుందని, అది తట్టుకోలేకే ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గమే ఈ పని చేయించిందని మదన్‌లాల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. రాములు నాయక్ వర్గం మాత్రం ఆ అవసరం తమకు లేదని చెబుతోంది. డీజీపీకి ఫిర్యాదు చేస్తా: మదన్‌లాల్ తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మార్పింగ్ చేసిన ఫొటోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. మరోవైపు ఈ ప్రచారంపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. -
అవి అరుదైనవి... విలువైనవే
సాక్షి, హైదరాబాద్: గుండ్లపోచంపల్లి సమీపంలో మల్లన్న గుట్టమీద ఉన్న ఆదిమానవుల కాలం నాటి రాతి చిత్రాలు అరుదైనవి, అత్యంత విలువైనవిగా రాష్ట్ర వారసత్వ శాఖ (పురావస్తు శాఖ) గుర్తించింది. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని, వెంచర్ల కోసం రియల్ వ్యాపారులు ఆ ప్రాంతాన్ని చదును చేస్తుండటంతో ఈ రాతి చిత్రాలున్న గుట్ట ప్రమాదంలో పడిందని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ వెల్లడించారు. గుండ్లపోచంపల్లి గుట్టల్లో ఉన్న రాతి చిత్రాల తావులను రియల్ వెంచర్ల విస్తరణతో ధ్వంసమవుతున్న తీరును వివరిస్తూ ‘‘చరిత్రను చెరిపేస్తున్నారు’’శీర్షికతో మంగళవారం ‘సాక్షి’ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన తెలంగాణ వారసత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ ఆ శాఖ అధికారులు భానుమూర్తి, సైదులు, సతీశ్‌లతో కలిసి మంగళవారం మధ్యాహ్నం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ నాలుగు ప్రాంతాల్లో ఆదిమానవుల చిత్రాలున్నట్టు గుర్తించామని, మూడు తావులను పరిశీలించామని, రెండు చోట్ల చిత్రాలున్నాయని రాములు నాయక్ ‘సాక్షి’తో చెప్పారు. ఆ నాలుగు రాక్ పెయింటింగ్ షెల్టర్లను కాపాడేందుకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు వివరించారు. వెంటనే పరిరక్షించాలి: కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆ అరుదైన రాతి చిత్రాలను వెంటనే పరిరక్షించని పక్షంలో ధ్వంసమయ్యే ప్రమాదముందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ బృందం సభ్యులు వేముగంటి మురళి, భద్ర గిరీశ్, డా.మండల స్వామి, మనోజ్‌లతో కూడిన బృందం వాటిని పరిశీలించింది. తెలంగాణ ప్రాంతంలో ఏనుగుల మనుగడ ఉండేదనటానికి సాక్ష్యంగా అక్కడ ఏనుగు చిత్రముందని, విచిత్రమైన ఆకృతుల్లో ఉన్న జంతువుల చిత్రాలున్నాయని, 10 వేల ఏళ్ల నుంచి 4 వేల ఏళ్ల క్రితం వరకు వివిధ కాలాల్లో బొమ్మలు గీసిన జాడలున్నాయని తెలిపారు. భవిష్యత్తులో కొత్త అధ్యయనాలకు ఇవి దోహదపడే అవకాశం ఉన్నందున వాటిని పరిరక్షించాలని కోరారు. -
గోవాలో ‘క్యాంపె’యిన్: డీజే పాటలకు ఎమ్మెల్సీ ఓటర్ల స్టెప్పులు, వైరల్ వీడియో
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎవరికి వారే గెలుపే లక్ష్యంగా క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్నారు. అధికార, విపక్ష పార్టీలు తమకు సంబంధించిన వారు, మద్దతు ఇస్తున్నవారు ఆఖరి నిమిషంలో గోడ దూకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లను ప్రలోభాల నుంచి కాపాడుకునేందుకు కుటుంబంతో సహా ట్రిప్‌లకు తరలిస్తున్నారు. శాసనమండలి ఖమ్మం జిల్లా స్థానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా ఓటర్లను గోవా క్యాంపునకు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా గోవా క్యాంపులో ఖమ్మం ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఓటర్లు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణ నేతలతోపాటు ఎమ్మెల్యేలు సైతం డాన్స్‌లు చేస్తూ సందడి చేస్తున్నారు. గోవా టూర్లో భాగంగా ఓడలో ఓటర్ల కోసం స్పెషల్ ట్రిప్ పెట్టారు. ఈ ఓడలో వెళ్లిన వైరా ఎమ్మెల్యే రాముల్ నాయక్ ఓటర్లతో కలిసి ఆడి అందరిని అలరించారు. చదవండి: పాము కాటుకి నాటు కోడి వైద్యం, ఒక్క ప్రాణం పోలేదు.. ఎక్కడంటే.. కాగా గోవాలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు రెండు వారాల పాటు క్యాంపు పెట్టగా ఇప్పటికే 10 రోజులు పూర్తయ్యింది. పోలింగ్‌కు ముందు రోజు గోవా నుంచి హైదరాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి పోలింగ్ రోజు ఖమ్మంకు చేరుకోనున్నారు. చదవండి: ఒమిక్రాన్ భయాలు: స్పైక్ ప్రోటీన్‌లో విపరీతమైన మార్పులు, అందుకే.. -
'పార్టీ కార్యకర్తలు తాలిబన్లు, నక్సలైట్లుగా ఉద్యమించాలి'
-
ఎమ్మెల్యే రాములు నాయక్ కు చేదు అనుభవం
-
జర ఆగితే ఏమైంది.. 5 నిమిషాలు ఆగలేక పోయారా..?
సాక్షి, ఖమ్మం: కారేపల్లిలో టీఆర్ఎస్ మండల నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, జెడ్పీటీసీ వాంకుడోత్ జగన్ మధ్య వేదికపై ఆసక్తికర చర్చ జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. జెడ్పీటీసీ కలగజేసుకుని ‘నేను రాకముందే పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే గారూ ఓ ఐదు నిమిషాలు ఆగలేక పోయారా..?’ అన్నారు. ‘మీరే అరగంట ముందు ఉండి ఏర్పాట్లు చూసుకోవాలి కదా? మీకోసం ఎమ్మెల్యే వేచి చూడాలా?’ అని శాసనసభ్యులు బుదులిచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా కాస్త సంవాదం జరిగింది. దీంతో అక్కడి నాయకులు కలగజేసుకుని సముదాయించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కార్యక్రమంలో ఎంపీపీ మాలోతు శకుంతల, వైఎస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, మండల కన్వీనర్ మల్లెల నాగేశ్వరరావు, సర్పంచ్ ఆదెర్ల స్రవంతి, మాజీ ఎంపీపీ పద్మావతి, నాయకులు అజ్మీర వీరన్న, ఇమ్మడి తిరుపతిరావు, ఎంపీటీసీలు ఉమాశంకర్, మూడ్ జ్యోతి పాల్గొన్నారు. -
పల్లా రాజేశ్వర్ పెద్ద బ్రోకర్: ఉత్తమ్
సాక్షి, ఖమ్మం: ''పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక పెద్ద బ్రోకర్ అని.. పెద్దల సభకు అడుగుపెట్టే అర్హత ఆయనకు లేదంటూ'' పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్పీ ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం ఖమ్మం వచ్చిన ఉత్తమ్ కుమార్ ఖమ్మం- నల్గొండ- వరంగల్ అభ్యర్థి రాములు నాయక్‌ను గెలిపించాలని కోరారు. రాములు నాయక్‌తో పాటు రంగారెడ్డి- హైదరాబాద్-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్న చిన్నారెడ్డికి టీటీఎఫ్, ఎస్టీఎఫ్ మద్దతు తెలిపిందని ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ''రాములు నాయక్ కి లక్షా 13వేల మోజార్టీ రావాలి.. జనరల్ సీటులో భాగంగా గిరిజన నాయకుడికి సీటు ఇచ్చాం.కేసీఆర్ నిరంకుశత్వం, దోపిడీ తీరు, ఎస్సీ, ఎస్టీ సభ్యుల పట్ల వివక్షత చూపించి తమ వారిని అవమానించిందన్న కారణంతో రాములు నాయక్ టీఆర్ఎస్ పోలీట్ బ్యూరో కి రాజీనామా చేసిన వ్యక్తిగా పేరు పొందారు. కాంగ్రెస్ సామాజిక న్యాయంకి కట్టుబడి ఉంది. బీజేపీ, కమ్యూనిస్టులు దళితులను గుర్తించలేదు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక బ్రోకర్.పెద్దల సభకు ఆయనకు అర్హత లేదు.ఆరేళ్ళ నుంచి ప్రజలకు అందుబాటులో లేరు.పల్లా, మల్లారెడ్డి ప్రైవేట్ యునివర్సిటీ లు తెచ్చుకొని లాభపడ్డారు. కోదండ రామ్ కు ఓటు వేస్తే అది వృధానే.. పల్లా ప్రలోభాలకు ఓటర్లు లొంగరు..పోటాపోటీగా ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 30లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాల విషయంలో టీఆర్ఎస్ వాళ్ళు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ఈ ఏడేళ్లలో కేసీఆర్ ఇంట్లో ఉద్యోగాలు వచ్చాయి.. నిరుద్యోగులకు కాదు. కొత్త బిచ్చగాళ్ల కి పొద్దు ఎరగడ అన్నట్లు బండి సంజయ్ తీరు ఉంది.కాంగ్రెస్ వాళ్ళ ను డబ్బుల సంచితో కొనుగోళ్ళు చేస్తున్నారు. కేసీఆర్ దేవుళ్లను కూడా మోసం చేశారు. వంద కోట్లు భద్రాద్రి రామునికి ఇస్తాం అన్నాడు.అంతేకాదు పీఆర్సీ, పదోన్నతులు అంటూ ఊరించి చివరకు ఏం చేయకుండానే ఉద్యోగులు, ఉపాధ్యాయులును అవమాన పర్చారు.''అంటూ మండిపడ్డారు. చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు: పార్టీ నేతలకు కేటీఆర్ వార్నింగ్ -
నల్లగొండకు రాములు.. రంగారెడ్డికి చిన్నారెడ్డి?
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖరారు చేసింది. నల్లగొండ– ఖమ్మం– వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్, రంగారెడ్డి– హైదరాబాద్– మహబూబ్‌నగర్ జిల్లాల నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి జి.చిన్నారెడ్డిలను నిర్ణయించినట్టు సమాచారం. నల్లగొండ స్థానానికి ఓయూ విద్యార్థి నాయకుడు కోటూరి మానవతారాయ్, రంగారెడ్డి స్థానానికి మాజీ ఎమ్మెల్యే, యువ నాయకుడు చల్లా వంశీచంద్ రెడ్డి పేర్లు కూడా అధిష్టానం తుది పరిశీలనలో ఉన్నప్పటికీ.. వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్ అధిష్టానం రాములు నాయక్, చిన్నారెడ్డిల అభ్యర్థిత్వాలకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుని అభ్యర్థిత్వాలను అధికారికంగా ప్రకటిస్తుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్ కీలక నిర్ణయం! కసరత్తు.... ఓ కొలిక్కి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద కసరత్తే చేసింది. ముందుగా రెండు నెలల క్రితమే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. నల్లగొండ స్థానానికి 26, రంగారెడ్డికి 24 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల వడపోత సాగుతుండగానే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఇంటి పార్టీ నేత చెరకు సుధాకర్‌లు నల్లగొండ స్థానంలో తమకు మద్దతివ్వాలని టీపీసీసీ నాయకత్వాన్ని విడివిడిగా కోరారు. దీంతో పొత్తులపై నిర్ణయం తీసుకునేందుకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ జరిపిన అభిప్రాయ సేకరణలో మెజారిటీ నేతలు కాంగ్రెస్ పార్టీ బరిలో ఉండాలని కోరారు. మాణిక్యం ఠాగూర్‌తో భేటీలో ముఖ్యనాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చిన నేపథ్యంలో రెండుస్థానాల్లోనూ పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దీంతో దరఖాస్తుల వడపోత కార్యక్రమాన్ని పూర్తి చేసి అభ్యర్థిత్వాలను ఓ కొలిక్కి తెచ్చిన టీపీసీసీ ఒక్కో స్థానానికి మూడు పేర్లను అధిష్టానానికి పంపింది. ఇక, ఏఐసీసీ ఆ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసి అధికారికంగా అభ్యర్థులను ప్రకటించడమే మిగిలింది. సామాజిక సమీకరణాలు... అనుభవం ఈ రెండు ఎమ్మెల్సీ టికెట్లను కేటాయించేందుకు సామాజిక సమీకరణాలు, అనుభవం అనే ప్రాతిపదికలను కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. నల్లగొండ– ఖమ్మం–వరంగల్ ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా రాములునాయక్‌ను కూడా ఇదే కోణంలో ఎంపిక చేసినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు ఎమ్మెల్సీగా రెండేళ్ల పదవీకాలం ఉండగానే అధికార టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. గిరిజన నేతగా, తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తింపు ఉన్నప్పటికీ అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఆయనకు పార్టీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుందనే సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది. దీనికి తోడు ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఎస్టీ, అందులోనూ లంబాడీ గ్రాడ్యుయేట్లు ఎక్కువగా ఉన్నారు. త్వరలో ఉపఎన్నిక జరగనున్న నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈ సామాజికవర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. వీటన్నింటి దృష్ట్యా రాములునాయక్ అభ్యర్థిత్వం వైపు కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపినట్టు సమాచారం. ఇక, ఈ స్థానం నుంచి పరిశీలించిన ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రావణ్ యువకుడు కావడం, ఆయన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న కారణంగా తరువాత అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇదే టికెట్‌ను ఆశించిన విద్యార్థి నాయకుడు మానవతారాయ్ సేవలను పార్టీకి వినియోగించుకోవాలని, వచ్చే ఎన్నికల్లో ఆయనను పోటీ చేయించాలనేది అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది. రంగారెడ్డి– హైదరాబాద్– మహబూబ్‌నగర్ అభ్యర్థిగా జి.చిన్నారెడ్డిని అనుభవం ప్రాతిపదికన ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈసారి చిన్నారెడ్డికి అవకాశం ఇవ్వాలని టీపీసీసీ పెద్దలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, టి.రామ్మోహన్ రెడ్డిలు పోటీ నుంచి తప్పుకోవడం, అధిష్టానం పరిశీలనలో ఉన్న వంశీ యువకుడు కావడంతో మరోమారు అవకాశం ఇవ్వవచ్చనే ఆలోచన మేరకు ఇక్కడి నుంచి చిన్నారెడ్డి పేరు దాదా పు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి: రాములు నాయక్
సాక్షి,హైదరాబాద్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థ్ధిగా పోటీ చేసేందుకు తనకు అవకాశమివ్వాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోరారు. ఈ మేరకు శుక్రవారం గాంధీభవన్‌లో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్‌తో కలిసి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయన వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన గిరిజన నాయకుడిగా తనకు గుర్తింపు ఉందని, ఈ మూడు జిల్లాల్లో ఉన్న గిరిజన ఓటు బ్యాంకు తనకు అనుకూలంగా ఉంటుందని, అందువల్ల ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాములు నాయక్ విజ్ఞప్తి చేశారు. -
చట్టబద్ధంగానే అనర్హత
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్సీలు రాములు నాయక్, కె.యాదగిరిరెడ్డిలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారనే ఫిర్యాదుతో వారిపై అనర్హత వేటు వేస్తూ శాసనమండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. చట్ట నిబంధనలకు లోబడే మండలి అనర్హత నిర్ణయం ఉందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేదేమీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తమపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ రాములు నాయక్, యాదగిరిరెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన రిట్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. గవర్నర్ నామినేట్ చేసిన చట్టసభ సభ్యులకు పార్టీలతో సంబంధం ఉండదని, తమకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదన్న నాయక్ వాదనను ధర్మాసనం ఆమోదించలేదు. నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడండి.. ఈ తీర్పు నేపథ్యంలో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం వారం రోజుల పాటు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయకుండా ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని ఈసీ తరఫు న్యాయవాదిని కోరింది. వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని ఈసీ తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ చెప్పారు. వచ్చే సోమవారం (15) వరకు నోటిఫికేషన్ రాకుండా చూసేందుకు ఆస్కారం ఉందో చూడాలని ధర్మాసనం ఈసీకి సూచించింది. అనర్హతపై తీర్పు చెప్పాక ఆతీర్పు అమలుకు విరుద్ధంగా ఎన్నికల నోటిఫికేషన్ ఎలా జారీ చేయగలమని ధర్మాసనం ప్రశ్నించింది. ఇదిలా ఉండగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 10(8)లో అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లకు విశేషాధికారాలు ఉన్నాయని, దానికి అనుగుణంగా తనపై అనర్హత వేటు వేయడం చెల్లదని భూపతిరెడ్డి రాజ్యాంగాన్ని సవాల్ చేసిన కేసులో హైకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. -
గులాబీ గూటికి వనమా..?
సాక్షి, కొత్తగూడెం: టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కన్ను భద్రాద్రి, ఖమ్మం జిల్లాలపైనే ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకుంటూనే ఉన్నారు. తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు కారెక్కేందుకు రంగం సిద్ధమైంది. వనమాతో నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడి ఒప్పించినట్లు తెలుస్తోంది. అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వనమాతో పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి, భద్రాద్రి జిల్లా అభివృద్ధి అంశాలపై వనమా కేసీఆర్, కేటీఆర్‌లతో చర్చించినట్లు సమాచారం. దీంతో వనమా టీఆర్ఎస్లో చేరిక ఖాయమైనట్లే అని తెలుస్తోంది. చేరికకు సంబంధించిన తేదీ ఖరారు కావాల్సి ఉంది. ప్రస్తుత శాసనసభలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న వనమాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వనమా చేరికతో ఆ ప్రభావం జిల్లా మొత్తం పడనుంది. అధికశాతం కార్యకర్తలు వనమాకు మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వనమా తీసుకున్న ఈ నిర్ణయం ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్కు మరింత మేలు చేస్తుందని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కలిపి టీఆర్ఎస్కు కేవలం ఒక్క ఖమ్మం స్థానంలో మాత్రమే విజయం దక్కింది. మిగిలిన తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్ ఇప్పటికే గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు రెడీ అయ్యారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ కారెక్కేందుకు నిర్ణయించుకున్నారు. తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. రెండు వారాల తేడాతో వరుసగా ముగ్గురు ఎమ్మెల్యేలు జిల్లా నుంచి కారెక్కేందుకు సిద్ధం కావడం గమనార్హం. -
అనర్హతపై కోర్టుకెళ్తాం
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సభ్యులుగా తమను అనర్హులను చేస్తూ చైర్మన్ స్వామిగౌడ్ జారీ చేసిన ఉత్తర్వులపై న్యాయ పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపతిరెడ్డి, యాదవరెడ్డిలు వెల్లడించారు. స్వామిగౌడ్ నిర్ణయం అనంతరం వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ తమపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యయుతం కాదని, ఇది చీకటి రోజని పేర్కొన్నారు. గిరిజన హక్కుల గురించి మాట్లాడినందుకే... నన్ను డిస్క్వాలిఫై చేసినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు. గాంధీతో పోల్చినందుకు నాకు అనర్హత గిఫ్ట్ ఇచ్చారు. సీఎం ఆఫీస్ డైరెక్షన్లోనే స్వామిగౌడ్ మాపై నిర్ణయం తీసుకున్నారు. నేను గవర్నర్ కోటాలో ఎన్నికయ్యా. ఏకపక్షంగా నన్ను అనర్హుడిగా ప్రకటించారు. ఫారూఖ్ హుస్సేన్ కూడా గవర్నర్ కోటాలోనే వచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోలేదు కానీ నా గురించి బులెటిన్ ఇచ్చారు. టీఆర్ఎస్ 88 స్థానాలు గెలిచినా సీఎం సెంచరీ కావాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు. ప్రజలు పాలిం చాలని అధికారం ఇస్తే కేసీఆర్ ప్రతిపక్ష నాయకులను లేకుండా చేస్తున్నారు. గిరిజనుల హక్కుల గురించి నేను మాట్లాడినందుకు నన్ను డిస్క్వాలిఫై చేశారు. కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తా. కాంగ్రెస్ పక్షం టీఆర్ఎస్లో విలీనమైన తర్వాత మేము కాంగ్రెస్ ఎమ్మెల్సీలం ఎలా అవుతామో వారికే తెలియాలి. – రాములు నాయక్ చైర్మన్ అధికారాలు తొలగించాలి... మమ్మల్ని అనర్హులను చేసినట్లు మీడియా ద్వారానే తెలిసింది. చట్టాన్ని అవహేళన చేస్తూ మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు. కాంగ్రెస్‌పక్షం టీఆర్ఎస్లో విలీనమైనప్పుడు మేము పార్టీ మారినట్లు ఎలా అవుతుంది? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలి. చైర్మన్లకు ఉన్న అధికారాలు తొలగించి ఒక కమిటీకి అప్పగించాలి. – యాదవరెడ్డి ఏ పార్టీ గుర్తుపై గెలవకున్నా అనర్హతా? మండలి చైర్మన్ నిర్ణయం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే. నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఏ పార్టీ గుర్తుపైనా గెలవలేదు. గవర్నర్ కోటాలో ఎన్నిక కాలేదు. నాపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్లో విలీనమైనట్లు గెజిట్ విడుదల చేశారు. అలాంటప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది? ఏ ప్రాతిపదికన నాపై అనర్హత వేటు వేస్తారు? కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. పెద్దల సభలోనే న్యాయం జరగనప్పుడు ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఈ అంశంపె కోర్టుకు వెళ్తా. – భూపతిరెడ్డి -
బ్రేకింగ్: ఫిరాయింపు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్సీలపై శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అనర్హత వేటు వేశారు. టీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ్ రెడ్డిలను అనర్హలుగా ప్రకటించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో పొందుపరిచిన పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వారిపై వేటు వేసినట్లు మండలి ఛైర్మన్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముగ్గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లో చేరినందుకు వారి సభ్యత్వాలు రద్దు చేయాలని టీఆర్ఎస్ మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. అనర్హతకు గురైన యాదవ్ రెడ్డి ఎమ్యెల్యేల కోటాలో మండలికి ఎన్నికైయ్యారు. మరోసభ్యుడు భూపతిరెడ్డి నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల కోటాలో మండలి సభ్యుడిగా ఎన్నికైయ్యారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన రాములు నాయక్ కూడా అనర్హతకు గురైయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) ప్రకారం సభ్యులపై చర్యలు తీసుకున్నట్లు మండలి ఛైర్మన్ వెల్లడించారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కొండా మురళి ఇదివరకే మండలి సభ్యుత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
పర్మిట్ రూముల్లో తనిఖీలు చేయండి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని ఏ4 మద్యంషాపుల పక్కన నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న పర్మిట్ రూములను తనిఖీ చేయాలని ఎక్సైజ్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. మద్యం షాపుల యజమానులు తమ షాపుల పక్కనే పర్మిట్ రూమ్‌లు ఏర్పాట్లు చేసి అందులో ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నా అధికారులు వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన ఎస్.రాములు నాయక్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. ఏయే ప్రాంతాల్లోని పర్మిట్ రూమ్‌లలో తనిఖీలు చేయాలో అధికారుల నిర్ణయానికి వదిలేసింది. ఒక్కో పర్మిట్ రూమ్ ఎంత ఉంది? నిబంధనల మేరకే ఆ పర్మిట్ రూమ్ సైజు ఉందా? నిబంధనలకు లోబడే పర్మిట్ రూమ్‌ను నిర్వహిస్తున్నారా? ఆహార పదార్థాల సరఫరా నిబంధనల్లో ఏమైనా మినహాయింపులు ఉన్నాయా? తదితర వివరాలతో నివేదికను తమ ముందుంచాలని కమిషనర్‌ను ఆదేశించింది. విచారణను జనవరి 1కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పర్మిట్ రూమ్‌ల వల్ల ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. పర్మిట్ రూమ్‌లలో ఆహార పదార్థాల సరఫరాకు నిబంధనలు అంగీకరించవన్నారు. -
వేటు వేస్తారా!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సభ్యత్వం విషయంలో తమకు ఇచ్చిన నోటీసుకు జవాబు ఇచ్చేందుకు మరింత గడువు కావాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను ఎమ్మెల్సీలు రాములునాయక్, కె.యాదవరెడ్డి, ఆర్.భూపతిరెడ్డి కోరారు. అన్ని అంశాలను పరిశీలించి వివరణ ఇస్తామని తెలిపారు. ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయాలని టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదు ఆధారంగా చైర్మన్ ఈ నెల 18న నోటీసులు జారీ చేశారు. ఒక పార్టీలో చేరి వేరే పార్టీలోకి వెళ్లారన్న ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఈ నెల 26లోపు వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీలు కొండా మురళీ, ఆర్.భూపతిరెడ్డి, కె.యాదవరెడ్డి, రాములునాయక్‌లను చైర్మన్ లిఖిత పూర్వక వివరణ కోరారు. టీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లో చేరినందుకు సభ్యత్వాలు రద్దు చేయాలని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వీరిలో కొండా మురళీ రాజీనామా చేశారు. మిగిలిన ముగ్గురి విషయంలో చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన కె.యాదవరెడ్డి విషయంలో ఇప్పుడే నిర్ణయం తీసుకోబోరని సమాచారం. మైనంపల్లి హనుమంతరావు రాజీనామాతో పాటు మరో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు మార్చితో ఖాళీ అవుతున్నాయి. ఆరు సీట్లకు ఎన్నికలు జరిగితే ఇప్పుడు కాంగ్రెస్‌కు ఉన్న 19 మంది ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో స్థానం ఖాళీ అయితే అప్పుడు కాంగ్రెస్ కచ్చితంగా ఒక స్థానాన్ని గెలుచుకునే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్చిలోపు యాదవరెడ్డి విషయంలో ఎలాంటి చర్యలు ఉండబోవని తెలుస్తోంది. -
ఆ ఇద్దరిని అనర్హులను చేయండి
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ నుంచి ఎన్నికై టీఆర్ఎస్లోకి వెళ్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్‌కుమార్‌లను అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు పిటిషన్ ఇచ్చారు. తమ పార్టీ నుంచి ఎన్నికైన ఇద్దరు సభ్యులు పార్టీ మారినందున వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. మరోవైపు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపతిరెడ్డిలు కూడా తమకు అందిన నోటీసులపై వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని మండలి చైర్మన్‌ను కోరారు. చైర్మన్ స్వామిగౌడ్‌ను కలసి రాములు నాయక్ లిఖితపూర్వకంగా వినతి పత్రం సమర్పించారు. భూపతిరెడ్డి కూడా ఫిర్యాదు ఇచ్చేందుకు రాగా, చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయంలో ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యమేనా: షబ్బీర్ అలీ మండలి చైర్మన్‌ను కలిసిన అనంతరం షబ్బీర్‌అలీ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన సంతోష్, లలితలను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ ఇచ్చినట్లు తెలిపారు. చట్టాలను కాపాడాల్సిన వారే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం ప్రజాస్వామ్యమేనా అని ప్రశ్నించారు. తాము ఇచ్చిన పిటిషన్లను పట్టించుకోకుండా, టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయగానే ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. బర్రెలను, గొర్రెలను కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొంటున్నారని ఆరోపించారు. తమ పార్టీని ఇతర పార్టీలో విలీనం చేసే అధికారం స్పీకర్‌కు గానీ, మండలి చైర్మన్‌కు గానీ లేదని, ఎన్నికల కమిషన్ మాత్రమే ఆ పనిచేయగలదని పేర్కొన్నారు. ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టకుండా గెలిచిన నాటి నుంచి సీఎం కేసీఆర్ తిరగడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. సామాజిక కార్యకర్తగానే ఎమ్మెల్సీ అయ్యా: రాములు నాయక్ తనను ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీ చేశారనే సమాచారాన్ని గవర్నర్ కార్యాలయం నుంచి కోరానని, అందుకే సమయం కావాలని అడిగినట్లు చెప్పారు. సామాజిక కార్యకర్త హోదాలోనే తనకు ఎమ్మెల్సీ అయ్యే అవకాశం వచ్చిందని, తాను టీఆర్ఎస్ నుంచి ఎన్నికైనట్లు కాదని, తాను కాంగ్రెస్ సభ్యుడిని కూడా కాదన్నారు. అయినా చైర్మన్ స్పందన సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. ఎస్టీని కాబట్టే కేసీఆర్ తనపై చర్యలు తీసుకుం టున్నారని, తనపై అక్రమ కేసులు పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సుపారీ ఇచ్చి తనను అంతమొందించే కుట్ర జరుగుతోం దని, తనకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్లో చేరిన వారికో న్యాయం, తనకో న్యాయమా అని ప్రశ్నించారు. తనకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతానని, కోర్టుకు వెళ్తానని, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాగా, తనకు అందిన నోటీసులపై వివరణ ఇచ్చేందుకు తనకు కూడా సమయం కావాలని కోరినట్లు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి చెప్పారు. -
‘నన్ను అంతంచేయాలని చూస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: ‘నాపై సుపారీ ఇచ్చి అంతమెందించాలనే కుట్ర జరుగుతోంది. నన్ను ఖతం చేయాలని చూస్తున్నారు. నాకేమి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత’’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం శాసన మండలి ఛైర్మన్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఛైర్మన్ నుంచి నోటీసు వచ్చినందున వివరణ ఇచ్చానని వెల్లడించారు. తగిన కారణాలు తెలిపేందుకు నాలుగు వారాల సమయం కోరానని తెలిపారు. సామాజిక సేవకుడిగానే తనకు గవర్నర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, తమపై స్వామిగౌడ్ తీరు బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు. ఎస్టీని ఐనందుకే తానపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అక్రమ కేసులు పెట్టి వేధించాలని ప్రభుత్వం చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ సమస్యలపైనే గతంలో తాను రాహుల్ గాంధీని కలిశానని, కాంగ్రెస్ సభ్యుడిని మాత్రం కానని పేర్కొన్నారు. టీఆర్ఎస్లో చేరిన వాళ్లకో న్యాయం, మాకో న్యాయమా అని ప్రశ్నించారు. తనకు జరిగిన అన్యాయంపై కోర్టుకి వెళ్తానని, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. బ్లాక్ డే.. చట్టాన్ని రక్షించాల్సిన మండలి ఛైర్మన్, రాష్ట్ర సీఎంలే ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్‌పై అనర్హత వేటు వేయాలని శాసన మండలి ఛైర్మన్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక పార్టీని మరోక పార్టీలో విలీనం చేసే అధికారం ఎలక్షన్ కమిషన్‌కు మాత్రమే ఉంటుందని అన్నారు. సీఎల్పీ విలీనం డ్రాఫ్ట్ ప్రగతి భవన్లో తయారు చేశారని, కేసీఆర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ చర్రితలో ఇదో బ్లాక్ డే అని అన్నారు. -
కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్సీలపై ఆ పార్టీ చీఫ్ విప్, మిగతా విప్‌లు సోమవారం మండలి చైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. టీఆర్ఎస్లో ఎమ్మెల్సీలుగా ఉన్న యాదవరెడ్డి, రాములు నాయక్, కొండా మురళి, భూపతిరెడ్డిలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని అధికార పార్టీ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేయనుంది. అయితే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న నాగర్‌కర్నూల్‌కు చెందిన దామోదర్‌రెడ్డి ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరారు. అయితే చర్యలు తీసుకోవాల్సి వస్తే దామోదర్‌రెడ్డిపై ముందు తీసుకుంటారా? లేకా ఈ నలుగురిపై తీసుకుంటారా అన్న దానిపై ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. -
‘స్వతంత్రుడు’ ఒక్కడే.. మిగతావారంతా తేలిపోయారు!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో కారు వేగానికి కూటమి కూలిపోయింది. ప్రస్తుతానికి టీఆర్ఎస్ 85 స్థానాల్లో గెలుపొందగా.. మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక మహాకూటమిగా ఏర్పడి కేసీఆర్‌ను గద్దె దించేందుకు శతవిధాల ప్రయత్నించగా.. అతికష్టం మీద ఇరవై స్థానాల్లో గెలుపొందింది. ఇక కూటమి పరిస్థితే ఇలా ఉంటే స్వతంత్రులుగా బరిలోకి దిగిన అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి వైరా నుంచి రాములు నాయక్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి.. దాదాపు 2వేల మెజార్టీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్‌లాల్‌పై గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పెద్దసంఖ్యలో బరిలోకి దిగారు. పలువురు అభ్యర్థులు బీఎస్పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ వంటి చిన్న పార్టీల నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చిన్న పార్టీల నుంచి పోటీపడిన వారిలో ఇద్దరు గెలుపొందగా.. స్వతంత్రులుగా పోటీచేసిన వారిలో ఒకరు మాత్రమే గెలుపొందారు. ఈసారి మొత్తంగా 1306 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగగా..చాలామందికి చేదు అనుభవమే మిగిలింది. పలు నియోజకవర్గాల్లో చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులకు చాలా తక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చాయి. -
కేసీఆర్ నంబర్‌వన్ అబద్ధాలకోరు
సాక్షి, హైదరాబాద్: అబద్ధాలు చెప్పడంలో అపద్ధర్మ సీఎం కేసీఆర్ నంబర్ వన్ అని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ రాములునాయక్ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారసభల్లో పదే పదే అబద్ధాలు వల్లిస్తున్నారని.. అబద్ధాలు ఆడే రేసులో దేశంలోనే కేసీఆర్ మొదటి స్థానంలో నిలువడం ఖాయమని విమర్శించారు. దళితులను సీఎం చేస్తానని, గిరిజనులు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తామని మోసం చేశారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి.. వాటన్నింటిని అమలు చేశానంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. గాంధీభవన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్టీల రిజర్వేషన్ల అమలుపై ప్రశ్నిస్తే తనను పార్టీ నుంచి బయటికి పంపారని ఆరోపించారు. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ మహిళలను పూర్తిగా విస్మరించారని.. కులాల మధ్య చిచ్చుపెట్టారని దుయ్యబట్టారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేలంతా ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేయాల్సిందేనని ఎద్దేవా చేశారు. వంద సీట్లు రాకుంటే కేటీఆర్ రాజకీయాలు వదిలేసి అమెరికా వెళ్తానంటున్నారని.. పోలీస్ అధికారులు ముందస్తుగా కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మాది గ్రాస్ సర్వే.. ఆయనది గ్లాస్ సర్వే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికారం ఖాయమని రాములునాయక్ చెప్పారు. కాంగ్రెస్‌ది గ్రాస్ రూట్ సర్వే అని, కేసీఆర్‌ది గ్లాస్ సర్వే అని విమర్శించారు. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మెజారిటీ స్థానాల్లో కూటమిదే గెలుపని చెప్పారు. గజ్వేల్‌లో కేసీఆర్ ఓటమి ఖాయమన్నారు. ధనప్రవాహంతో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ రోడ్ షోల్లో ప్రచారం చేస్తారని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నుంచి వలసలు ఇంకా ఉంటాయని చెప్పారు. అందరూ కంటి ఆపరేషన్ల కోసం హైదరాబాద్‌కు వస్తే.. కేసీఆర్ మాత్రం ఢిల్లీ వెళ్తారని, అక్కడ ఆయనకు చికిత్స చేసేందుకు ఇద్దరు కంటి స్పెషలిస్టులు ఉన్నారని ఒకరు డాక్టర్ నరేంద్రమోదీ, మరొకరు డాక్టర్ అమిత్ షా అని ఎద్దేవా చేశారు. -
గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడగొడతాం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడిస్తామని ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. గజ్వేల్ టీఆర్ఎస్ నేత, రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ తూంకుంట నర్సారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్ శనివారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువాలు కప్పి రాహుల్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి ఆర్సీ కుంతియా, రాహుల్ కార్యాలయం కార్యదర్శి కొప్పుల రాజు, గజ్వేల్ కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. గత ఎన్నికల్లో తమ మధ్య పోటాపోటీగా జరిగిన పోరులో కేసీఆర్ స్వల్ప మెజారిటీతో గెలుపొందారని, అయితే ఇప్పుడు తామంతా ఒకటవడంతో కేసీఆర్‌ను ఓడించి గజ్వేల్‌లో కాంగ్రెస్‌ను గెలిపించి బహుమతిగా ఇస్తామని రాహుల్‌కు హామీ ఇచ్చినట్లు నర్సారెడ్డి, ఒంటేరు తెలిపారు. ఆత్మగౌరవం ఉన్నవారు టీఆర్ఎస్లో ఉండరు: నర్సారెడ్డి ‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని గత ఎన్నికల అనంతరం కేసీఆర్ కోరితే తాను టీఆర్ఎస్లో చేరాను. రాజకీయ నాయకులు సేవ చేయాలనుకుంటే ప్రజల్లో ఉండాలనుకుంటారు. అయితే కేసీఆర్‌లో ఆ గుణం లేదు. టీఆర్ఎస్లో ఎవరికీ గౌరవం, విలువ ఇవ్వరు. కేసీఆర్ నిరంకుశ ధోరణితో ప్రజలకు దూరంగా ఉంటున్నారు. నేను గజ్వేల్ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా. అందుకే తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నా. నాకు జరిగిన ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఎన్నడూ కేసీఆర్ నన్ను పరామర్శించలేదు. అయితే పీసీసీ చీఫ్ ఉత్తమ్ మాత్రం పాత పరిచయంతో నన్ను పరామర్శించారు. కాంగ్రెస్‌లో నేతలకు గౌరవం ఇస్తారు. తాను ఏ స్థానం నుంచి టికెట్ ఆశించట్లేదు. పార్టీ గెలుపు కోసం పనిచేస్తా’అని నర్సారెడ్డి అన్నారు. 30 సీట్లకు టీఆర్ఎస్ పరిమితం: రాములు నాయక్ ‘టీఆర్ఎస్కు వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు వచ్చే అవకాశమే లేదు. ఆ పార్టీ 25–30 సీట్లతో ప్రతిపక్షానికే పరిమితం అవుతుంది. బంగారు తెలంగాణ కాస్త కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ తెలంగాణగా మారింది. కాంగ్రెస్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం. కాంగ్రెస్‌లో చేరినందుకు సంతోషంగా ఉంది. గతంలో గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం ఇందిరా గాంధీ ఇచ్చిన రిజర్వేషన్లను తిరిగి అమలు చేయాలని రాహుల్ గాంధీని కోరా. రాహుల్‌ను ప్రధానిగా చూస్తాం’అని రాములు నాయక్ అన్నారు. 20 వేల మెజారిటీలో ఉన్నాం: ఒంటేరు ‘గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే టీడీపీ తరఫున పోటీ చేసిన నాకు 68 వేల ఓట్లు, నర్సారెడ్డికి 34 వేలు, కేసీఆర్‌కు 86 వేల ఓట్లు వచ్చాయి. నాకు, నర్సారెడ్డికి వచ్చిన ఓట్లు కలిపితే ఇప్పుడు మేం 20 వేల మెజారిటీలో ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను కచ్చితంగా ఓడిస్తాం. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తాం. గత నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ చేసిందేమీ లేదు. మిషన్ కాకతీయ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి కమీషన్లు దొచుకోవడం తప్ప తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారు’అని ఒంటేరు ప్రతాప్‌రెడ్డి వివరించారు. -
నేడు కాంగ్రెస్‌లోకి డీఎస్, నర్సారెడ్డి
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: పీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీఆర్ఎస్ నుంచి ఆయన సస్పెండైన నాటి నుంచే కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో శనివారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. 2014 సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం అనూహ్యంగా డీఎస్ టీఆర్ఎస్లో చేరారు. డీఎస్ స్థాయికి తగ్గట్టు సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. పదవి ఇచ్చినా తనను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి డీఎస్‌లో చాలాకాలంగా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ స్థానంతో పాటు ఆ జిల్లాలోని తన అనుచరులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఉన్నారు. ఈ సమయంలోనే ఆయన కుమారుడు అరవింద్ బీజేపీలో చేరటం, టీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయడంతో జిల్లా నాయకత్వం అంతా డీఎస్‌ను పార్టీ నుంచి తొలగించాలని అధినేతకు సిఫార్సు చేసింది. ఆ మేరకు ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఆనాటి నుంచి ఆయన కేసీఆర్‌పై మరింత ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు ఢిల్లీలో సంబంధాలున్న నేతలను కలసి తిరిగి పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ పెద్దలు ఆయనతో పలుమార్లు భేటీ నిర్వహించారు. ఇటీవల రాహుల్ కామారెడ్డి పర్యటన సందర్భంగానే డీఎస్ చేరిక ఉంటుందని భావించినా, ఆయన ఢిల్లీలోనే చేరేందుకు సుముఖత చూపారు. పలు భేటీల తర్వాత నర్సారెడ్డి.. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టి.నర్సారెడ్డి సైతం డీఎ స్తో పాటు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. టీఆర్ఎస్లో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నా ఆయన.. ఇదే విషయాన్ని ఆ పార్టీ ముఖ్య నేతల వద్ద పలుమార్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఆయన ఇటీవల భేటీ అయ్యారు. అయితే మంత్రి హరీశ్‌రావు స్వయంగా నర్సారెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో ఆయన కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించారు. కానీ గురువారం రాత్రి ఉత్తమ్‌తో మరోమారు సమావేశమైన ఆయన కాంగ్రె స్లో చేరాలని నిర్ణయించుకున్నారు. అనంతరం పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డితోనూ భేటీ అయి శుక్రవారం ఉదయమే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఒంటేరు ప్రతాపరెడ్డికి టికెట్ ఇప్పటికే ఖాయమైనందున నర్సారెడ్డికి మెదక్ ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల టీఆర్ఎస్ నుంచి సస్పెండైన ఎమ్మెల్సీ రాములు నాయక్ సైతం రాహుల్ సమక్షంలో కాం గ్రెస్‌లో చేరే అవకాశముంది. ఆయన శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఐతే విజయశాంతి.. లేదా స్థానికుడికే నర్సారెడ్డికి మెదక్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించనున్నారన్న వార్తల నేపథ్యంలో మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేతలు అలెర్టయ్యారు. సీనియర్ నేతలు సుప్రభాత్రావు, బట్టి జగపతి, చంద్రపాల్ తదితరులు శుక్రవారం సాయంత్రం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ను కలిశారు. ఇస్తే విజయశాంతికి టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో స్థానికులకే టికెట్ కేటాయించాలని కోరారు. కూటమిలోని మిగతా పక్షాలకు గానీ, స్థానికేతరులకు కానీ ఇవ్వరాదని విన్నవించారు. ఇదే విషయమై వీరంతా విజయశాంతిని సైతం కలసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. కేసీఆర్ వ్యవహార శైలి నచ్చకనే..: నర్సారెడ్డి కేసీఆర్ వ్యవహార శైలి నచ్చకనే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు నర్సారెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గతఎన్నికల్లో కేసీఆర్ చేతిలో ఓడినా ప్రజాసేవ చేయాలన్న తపనతో టీఆర్ఎస్లో చేరానన్నారు. ఆయన వద్ద తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా లేకపోయిందన్నారు. ఆయన తీరు నచ్చకే రహదారులు అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేశానని తెలిపారు. టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, ఈలోపే పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ప్రజాసేవ కోసమే కాంగ్రెస్‌లో చేరుతున్నానన్నారు. గజ్వేల్ నుంచి కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. కృష్ణయ్య, తుల ఉమ కూడా? ఎల్బీనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య, కరీంనగర్ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వేములవాడ నుంచి టికెటు హామీ ఇస్తే ఉమ చేరే అవకాశముందని సమాచారం. -
‘టీఆర్ఎస్కు 30 సీట్లు వస్తే ఎక్కువ’
నారాయణఖేడ్: టీఆర్ఎస్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని ఎమ్మెల్సీ రాములునాయక్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో విలేకరులతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో మంత్రి హరీశ్‌రావు ఒక్కరే గెలుపొందుతారని, కేసీఆర్‌కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. కేసీఆర్ గజ్వేల్‌ను వీడి ఏదైనా వేరే ప్రాంతం చూసుకోవాలని, లేదంటే పోటీచేయకపోవడమే మంచిదని హితవు పలికారు. తాను కుంతియా ను కలిసినట్టు టీఆర్ఎస్ నేతలు నిరాధారంగా ఆరోపిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో 70 శాతానికిపైగా గుడ్డిగుర్రాలే అని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ 25 నుంచి 30 స్థానాలు గెలిస్తే ఎక్కువన్నారు. కేసీఆర్ కుమారుడు నియంతలా వ్యవహరిస్తూ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా పోటీచేయనని స్పష్టం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ దుర్మరణం
కేతేపల్లి, న్యూస్‌లైన్ : నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్ఐ దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన సమైక్య శంఖారావం సభ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ఎస్ఐ ఎల్. రాములు నాయక్‌కు నకిరేకల్ సర్కిల్ పరిధిలోని కేతేపల్లి మండలంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై బందోబస్తు విధులు వేశారు. ఇనుపాముల శివారులోగల వై-జంక్షన్ వద్ద ఆయన విధి నిర్వహణలో ఉండగా, విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన నాయక్‌ను వెంటనే నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నార్కట్‌పల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. వైఎస్ జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్ : సమైక్య శంఖారావం సభ నిర్వహణ నేపథ్యంలో బందోబస్తుకు వెళ్లిన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ఎస్ఐ రాములు రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేసి సంతాపం ప్రకటించారు. రాములు కుటుంబానికి జగన్ ఒక సందేశంలో తన సానుభూతిని తెలియజేశారు.