సాక్షి, ఖమ్మం: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎవరికి వారే గెలుపే లక్ష్యంగా క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్నారు. అధికార, విపక్ష పార్టీలు తమకు సంబంధించిన వారు, మద్దతు ఇస్తున్నవారు ఆఖరి నిమిషంలో గోడ దూకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లను ప్రలోభాల నుంచి కాపాడుకునేందుకు కుటుంబంతో సహా ట్రిప్‌లకు తరలిస్తున్నారు.
శాసనమండలి ఖమ్మం జిల్లా స్థానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా ఓటర్లను గోవా క్యాంపునకు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా గోవా క్యాంపులో ఖమ్మం ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఓటర్లు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణ నేతలతోపాటు ఎమ్మెల్యేలు సైతం డాన్స్‌లు చేస్తూ సందడి చేస్తున్నారు. గోవా టూర్‌లో భాగంగా ఓడలో ఓటర్ల కోసం స్పెషల్ ట్రిప్ పెట్టారు. ఈ ఓడలో వెళ్లిన వైరా ఎమ్మెల్యే రాముల్ నాయక్ ఓటర్లతో కలిసి ఆడి అందరిని అలరించారు.
చదవండి: పాము కాటుకి నాటు కోడి వైద్యం, ఒక్క ప్రాణం పోలేదు.. ఎక్కడంటే..
కాగా గోవాలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు రెండు వారాల పాటు క్యాంపు పెట్టగా ఇప్పటికే 10 రోజులు పూర్తయ్యింది. పోలింగ్‌కు ముందు రోజు గోవా నుంచి హైదరాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి పోలింగ్ రోజు ఖమ్మంకు చేరుకోనున్నారు.
చదవండి: ఒమిక్రాన్ భయాలు: స్పైక్ ప్రోటీన్‌లో విపరీతమైన మార్పులు, అందుకే..
Comments
Please login to add a commentAdd a comment