Local Body MLC Polls
-
గోవాలో ‘క్యాంపె’యిన్: డీజే పాటలకు ఎమ్మెల్సీ ఓటర్ల స్టెప్పులు, వైరల్ వీడియో
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎవరికి వారే గెలుపే లక్ష్యంగా క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్నారు. అధికార, విపక్ష పార్టీలు తమకు సంబంధించిన వారు, మద్దతు ఇస్తున్నవారు ఆఖరి నిమిషంలో గోడ దూకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లను ప్రలోభాల నుంచి కాపాడుకునేందుకు కుటుంబంతో సహా ట్రిప్‌లకు తరలిస్తున్నారు. శాసనమండలి ఖమ్మం జిల్లా స్థానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా ఓటర్లను గోవా క్యాంపునకు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా గోవా క్యాంపులో ఖమ్మం ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఓటర్లు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణ నేతలతోపాటు ఎమ్మెల్యేలు సైతం డాన్స్‌లు చేస్తూ సందడి చేస్తున్నారు. గోవా టూర్లో భాగంగా ఓడలో ఓటర్ల కోసం స్పెషల్ ట్రిప్ పెట్టారు. ఈ ఓడలో వెళ్లిన వైరా ఎమ్మెల్యే రాముల్ నాయక్ ఓటర్లతో కలిసి ఆడి అందరిని అలరించారు. చదవండి: పాము కాటుకి నాటు కోడి వైద్యం, ఒక్క ప్రాణం పోలేదు.. ఎక్కడంటే.. కాగా గోవాలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు రెండు వారాల పాటు క్యాంపు పెట్టగా ఇప్పటికే 10 రోజులు పూర్తయ్యింది. పోలింగ్‌కు ముందు రోజు గోవా నుంచి హైదరాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి పోలింగ్ రోజు ఖమ్మంకు చేరుకోనున్నారు. చదవండి: ఒమిక్రాన్ భయాలు: స్పైక్ ప్రోటీన్‌లో విపరీతమైన మార్పులు, అందుకే.. -
కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి
సాక్షి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మరో మలుపు తిరిగింది. అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీ సైతం క్యాంపులకు శ్రీకారం చుట్టింది. ఉన్న కొద్దిపాటి ఓట్లు చీలిపోకుండా.. అధికార పార్టీ వైపునకు ఆకర్షితులవకుండా కాంగ్రెస్ పార్టీ తాజా క్యాంపులకు శ్రీకారం చుట్టింది. తాజాగా మంథని నియోజవర్గం నుంచి పలువురు స్థానిక ప్రజాప్రతినిధులను హైదరాబాద్ తరలించేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటికే మంథని నుంచి దాదాపు 40 మంది వరకు ప్రజాప్రతినిధులను హైదరాబాద్‌కు తరలించారు. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ జయశంకర్ జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌కు తరలివెళ్లారని సమాచారం. ఓట్లు చీల్చడమే లక్ష్యం..! మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దాదాపు 1000 మంది తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులతో సహా.. బెంగళూరుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్యాంపుల్లో ప్రజాప్రతినిధుల స్థితిగతులను జిల్లా మంత్రులు ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు. ఈలోపు ఉమ్మడిజిల్లాకు చెందిన మాజీమంత్రి శ్రీధర్‌బాబు కూడా తమ పార్టీ ఉనికిని బలంగా చాటుకునేయత్నంలో భాగంగా కాంగ్రెస్ నేతలను క్యాంపులకు పంపడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో పెట్టకపోయినా.. అధికార పార్టీ విజయావకాశాలను దెబ్బతీయగలం అనే నమ్మకం రావడంతోనే అధిష్టానం ఈ అనూహ్య నిర్ణయం తీసుకుందని సమాచారం. తొలుత ఉమ్మడి జిల్లాకు చెందిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు నియోజకవర్గ పరిధిలోని నేతలు, అంటే ఉమ్మడి జిల్లా తూర్పు ప్రాంతమైన మంథని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నేతలు, తరువాత జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ పరిధిలోని మొత్తం 13 నియోజకవర్గాలకు చెందిన నేతలు హైదరాబాద్‌కు రావాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించిందని తెలిసింది. సోషల్ మీడియాకే పరిమితం కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థులు ఎల్.రమణ, భానుప్రసాద్‌రావు, రవీందర్‌సింగ్, ప్రభాకర్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. విచిత్రంగా వీరి మాటలు వినాల్సిన ఓటర్లయిన నేతలు మాత్రం శిబిరాల్లో ఉన్నారు. దీంతో సదరు అభ్యర్థులంతా కేవలం విలేకరుల సమావేశాలు, ప్రతిపక్ష నేతల ప్రసన్నాలు, సమావేశాలు, సోషల్ మీడియాలో ప్రచారాలకే పరిమితమవుతున్నారు. ఓటర్లు లేకుండా జిల్లాలో జరిగిన తొలి ఎన్నికలు ఇవేనని, ఇలాంటి విచిత్ర పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదని పలువురు సీనియర్ రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
MLC Polls: టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్ కోటీశ్వరుడు..
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ స్థానిక శాసనమండలి బరిలో నిలిచిన అభ్యర్థుల ఆస్తులు వెల్లడయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్ స్థిర, చరాస్తులు కలిపి మొత్తం ఆస్తులు రూ.6.20 కోట్లు ఉండగా, ఆయన భార్య పేరిట రూ.13.29 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక విఠల్ వివిధ బ్యాంకులకు రూ.23.29 లక్షలు బాకీ ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఇంద్రవెల్లి మండలానికి చెందిన పెందూర్ పుష్పరాణి స్థిర, చరాస్తులు కలిపి మొత్తం రూ.50 లక్షలు ఉన్నాయి. ఎమ్మెల్సీ నామినేషన్‌తో సమర్పించిన అఫిడవిట్లో వీరిద్దరు వారి ఆస్తులను వెల్లడించారు. అలాగే పుష్పరాణిపై మూడు క్రిమినల్ కేసులు ఉండగా, ప్రస్తుతం అవి పెండింగ్‌లో ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ తనపై ఎలాంటి కేసులు లేవని తెలిపారు. చదవండి: MLC Elections: విఠల్ ఏకగ్రీవానికి టీఆర్ఎస్ విఫలయత్నం.. ‘విత్‌డ్రా’మా.. వివాదం పుష్పరాణి ఆస్తులు ఇలా.. ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పరాణి చరాస్తులు, స్థిరాస్తులు కలిపి మొత్తం రూ.50 లక్షలు ఉన్నాయి. వాటిని ఓ సారి పరిశీలిస్తే.. పుష్పరాణి వద్ద ప్రస్తుతం వెండి, బంగారం ఉంది. వాటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.25 లక్షలుగా ఉంది. పుష్పరాణి పేరున ఇంద్రవెల్లిలోని డొంగర్‌గావ్ సర్వే నంబర్ 77/225లో 3.39 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2017లో కొనుగోలు చేసిన ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.25 లక్షలుగా ఉంది. విఠల్ ఆస్తులు ఇవీ.. దండె విఠల్ చరాస్తులు మొత్తం రూ.3కోట్ల 76లక్షల 33వేల 484 ఉన్నాయి. ప్రస్తుతం విఠల్ చేతిలో రూ.2లక్షల16వేల 500 నగదు ఉంది. హైదరాబాద్‌లోని ఐసీఐసీఐ బ్యాంకు పంజాగుట్ట, ఎస్బీఐ సనత్‌నగర్, యూనియన్ బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.22.11లక్షలు ఉన్నాయి. నవీత్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.7.50 లక్షల షేర్, సాన్వీ ల్యాబొరేటరీస్‌లో రూ.1.65 కోట్ల షేర్, తాన్వీ హెల్త్ కేర్‌లో రూ.50 వేల షేర్, అనిక ఇన్ఫ్రా డెవలపర్స్‌లో రూ.28.25 లక్షల షేర్ ఉంది. ఇక తాన్వీ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1.38 కోట్లు, విఠల్ దగ్గరున్న 250 గ్రాముల జ్యావెల్లరీ విలువ రూ.12.50 లక్షలుగా ఉంది. స్థిరాస్తులు ఇలా.. విఠల్ పేరున మొత్తం స్థిరాస్తులు రూ.2కోట్ల 44లక్షల 64వేలు ఉన్నాయి. కాగజ్‌నగర్‌లోని వేంపల్లి శివారులో 10.08 ఎకరాల వ్యవసాయ భూమి, మోసం గ్రామ శివారులోని పలు సర్వే నంబర్లలో 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ రెంటి భూముల విలువ ప్రస్తుత మార్కెట్ విలువల ప్రకారం రూ.44.64 లక్షలుగా ఉంది. రెబ్బెన మండల కేంద్రంలోని సర్వే నంబర్ 210లో 27,225 స్క్వేర్ ఫీట్స్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.20 లక్షలుగా ఉంది. ఇక సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో 1,953 స్క్వేర్ ఫీట్స్ స్థలంలో నివాస భవనం ఉంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1.80 కోట్లు. ఇవే కాకుండా విఠల్ భార్య పేరున చరాస్తులు రూ.13.18 కోట్లు, స్థిరాస్తులు రూ.27.90 లక్షలుగా ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఐసీఐసీఐ బ్యాంకులో విఠల్ తీసుకున్న హోమ్ లోన్‌కు సంబంధించి రూ.23.29 లక్షలు బాకీ ఉన్నారు. -
MLC Polls: సకుటుంబ సమేతంగా గో.. గోవా, బెంగళూరు
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీ వ్యూహాత్మకంగా స్థానిక ప్రజాప్రతినిధులందరినీ క్యాంపులకు పంపింది. ఇక్కడ నామినేషన్లు వేసిన వారిలో 14 మందిని తప్పించింది. ఇక మిగిలినవారిని ఎదుర్కొనేందుకు సిద్ధపడింది. వాస్తవానికి బరిలో ఉన్న 10 మందిలో అధికార పార్టీ అభ్యర్థులైన ఎల్.రమణ, టి.భానుప్రసాద్‌రావు కాకుండా ఎనిమిది మంది కూడా తప్పుకుంటే ఎన్నిక ఏకగ్రీవం అయిపోయేది. ఈ లెక్కన అధికార పార్టీల శిబిరం శుక్రవారంతో ముగిసేది. కానీ, ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు విత్‌డ్రా చేసుకోకపోవడంతో వీరి క్యాంపును డిసెంబరు 8 వరకు పొడిగించారు. ఇపుడు శిబిరానికి తరలిన నేతలను, ఇంకా ఇక్కడి నేతలను అందరినీ కలిపి గోవా, బెంగళూరుకు పంపేందుకు సిద్ధమయ్యారు. ఈ జాబితాలో పుణే కూడా ఉంది. కానీ, దూరం ఎక్కువవుతుందని వద్దనుకున్నారు. చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు: బీజేపీలో ఈటల ‘స్వతంత్రం’.. ఆదిలాబాద్‌లో షాక్! సకుటుంబ సమేతంగా..! ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,324 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీరిలో 581 మంది పురుషులు కాగా, 743 మహిళలు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు దాదాపు 990 పైగా ఉన్నారు. అందులోనూ సంఖ్యాపరంగా మహిళా ప్రజాప్రతినిధులదే పైచేయి. అందుకే, క్యాంపులకు మహిళా ప్రజాప్రతినిధులకు తోడుగా వారి భర్తలు, పిల్లలు వెంట వచ్చేందుకు పార్టీ అంగీకరించింది. ఇదే సమయంలో నాయకులు కూడా వీలున్న వారు తమ సతీమణులతో క్యాంపులకు బయల్దేరుతున్నారు. వయసు మీద పడ్డ వారు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం ఇంటి వద్దే ఉంటున్నారు. చదవండి: కరీంనగర్లో కారుకు షాక్! ఆశలు గల్లంతు.. గులాబీకి ‘సింగ్’ బైబై ఈ ఎత్తుగడతో అధికార పార్టీ ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టింది. ఒకటి పార్టీ కేడర్‌ను కాపాడుకున్నారు. రెండు పోటీలో ఉన్న మాజీ మేయర్ రవీందర్‌సింగ్, సారాబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, ఇనుముల సత్యనారాయణ తదితరులకు ప్రచారం చేసే వీలు చిక్కకుండా అభ్యర్థులను దూరం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులంతా క్యాంపు ముగించుకుని నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. నేడు రవీందర్ సింగ్ కార్యాచరణ.. ఈ నేపథ్యంలో మాజీ మేయర్ రవీందర్‌సింగ్ శనివారం తన కార్యచరణ ప్రకటించనున్నారు. వాస్తవానికి ఈయన తప్పుకుంటే మిగిలిన వారు కూడా తప్పుకునేవారన్న ప్రచారం జరిగింది. కానీ, రవీందర్‌సింగ్‌తోపాటు మరో నేత, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు సారాబుడ్ల ప్రభాకర్‌రెడ్డి కూడా నామినేషన్ ఉపసంహరించుకోలేదు. -
కరీంనగర్: అజ్ఞాతంలోకి రెబెల్స్.. మాజీ మేయర్ ఫోన్ స్విచ్ఛాఫ్
సాక్షి, కరీంనగర్: జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్సీ బరిలో నిలుచున్న పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండడంతో ఎక్కడికి వెళ్లారన్నది అంతుపట్టని విషయంగా మారింది. వారితో సంప్రదింపులు జరిపేందుకు ఎమ్మెల్యేలు, మంత్రి గంగుల కమలాకర్ రంగంలోకి దిగారు. పార్టీ అభ్యర్థులుగా భానుప్రసాద్, ఎల్.రమణ బరిలో ఉన్నా.. ఎమ్మెల్సీ బరిలో నిలుచున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. ఎమ్మెల్సీ పదవి ఆశించ భంగపడ్డ నేత కావడంతో తన భవిష్యత్తుపై స్పష్టమైన హామీ లభించేంత వరకు తాను బయటికి వచ్చేది లేదని సన్నిహితులకు చెప్పినట్లు తెలిసింది. చదవండి: ఆసుపత్రిలో చేరిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం ఇదే సమయంలో ఎమ్మెల్సీ బరిలో నిలుచున్న ఇండిపెండెంట్ అభ్యర్థులతో రవీందర్‌సింగ్ తెరవెనుక మంతనాలు సాగిస్తున్న విషయం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో బుధవారం పలువురు అసంతృప్త, బరిలో నిలిచిన నేతలు, వారి మద్దతుదారులతో రవీందర్‌సింగ్ రహస్యంగా సమావేశమయ్యారు. వేములవాడలో కొందరు నేతలతో రహస్యంగా నిర్వహించిన సమావేశం తాలూకు ఫొటోలు ఈ ప్రచారానికి ఊతమిస్తున్నాయి. ఇక సిరిసిల్లలో మాదాసి వేణు నామినేషన్ ఆమోదం పొందింది. ఈయన కూడా ఎంపీటీసీల ఆత్మగౌరవం నినాదంతోనే ఎమ్మెల్సీ బరిలోకి దిగుతున్నారు. చదవండి: ఆర్టీసీపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్ బంపర్ ఆఫర్ ఎన్నికై మూడేళ్లవుతున్నా.. పైసా విదల్చని పదవులు ఉండి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇతని అభ్యర్థిత్వానికి మద్దతిచ్చిన పలువురు నేతలు కూడా ఎవరికీ అందుబాటులో లేరు. వేణును బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు జగిత్యాల జిల్లా ఎంపీటీసీల గౌరవ అధ్యక్షుడు నగేశ్ యాదవ్ వీడియో వైరల్‌గా మారింది. అధికారాలు లేని తమ ఎంపీటీసీ వ్యవస్థను రద్దు చేయాలని లేదా తమకు ప్రభుత్వం కేటాయించిన రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి అభ్యర్థి కోసం యత్నాలు..! ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బరిలో ఉన్న ఇండిపెండెంట్లు, రెబెల్స్ అంతా ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెబెల్స్ మంతనాలు ప్రారంభించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే క్రమంలో విడిపోయి పోటీ చేస్తే ప్రయోజనం ఉండదని, వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఉమ్మడి అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాలని రవీందర్‌సింగ్ వేములవాడలో పలువురు అసంతృప్త నేతలను కలిసి విజ్ఞప్తిచేశారు. ఈ విషయంలో రేపు సాయంత్రానికి లేదా ఎల్లుండి ఉదయానికి స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. శిబిరాన్ని సందర్శించిన మంత్రి హైదరాబాద్ వెళ్లిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విడిది శామీర్‌పేటలోని ఓ రీసార్ట్‌ను మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారని తెలిసింది. ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడారని.. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు కూడా వారితోనే ఉన్నారని సమాచారం. మరోవైపు శిబిరాల్లో ఉన్న నేతలు తమకే ఓటు వేస్తారా? లేక ఎదురు తిరుగుతారా? అన్న భయం గులాబీ సీనియర్ నేతలను వెంటాడుతోంది. ఎంపీటీసీలు తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వీరు పార్టీ అభ్యర్థులకు కాకుండా ఇతరులకు ఓటేయకుండా వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు గులాబీ నేతలు. బరిలో 24 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల స్క్రూటినీ (నామినేషన్ల పరిశీలన) ముగియగా.. ముగ్గురి నామినేషన్లు తిరస్కరించినట్లు బుధవారం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం 27 మంది అభ్యర్థులు 53 నామినేషన్లు సమర్పించారని, వాటిలో నుంచి శ్రీకాంత్ సిలివేరు, రాజు పిడిశెట్టి, వేముల విక్రమ్ రెడ్డి నామినేషన్లు తిరస్కణకు గురైనట్లు చెప్పారు. బరిలో 24 మంది ఉన్నట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం, శుక్రవారం రెండు రోజుల గడువు ఉందని వివరించారు. ఓటు మాదే.. సీటు మాదే.. ఎంపీటీసీల ఆత్మగౌరవం నిలిపేందుకు తాను ఎమ్మెల్సీ బరిలో నిలిచానని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సారాబుడ్ల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఎంపీటీసీలకు న్యాయంగా రావాల్సిన నిధులను గ్రామపంచాయతీలకు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ ఖజానాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఓట్లేస్తే గెలిచిన తాము.. వారికి ఏ పనీ చేయలేక ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీలకు నిధులు, విధులు, పూర్వపు అధికార వైభవం తీసుకొచ్చేందుకు తాను పోటీ చేసి తీరుతానని తెలిపారు. తమ ఓట్లతో పారిశ్రామిక వేత్తలకు సీట్లు ఎలా ఇస్తారని నిలదీశారు. సీనరేజీ గ్రాంట్లు, వెహికిల్స్ అలవెన్స్, ఈజీఎస్ ఫండ్స్, స్టాంప్ డ్యూటీల ద్వారా వచ్చే నిధులను తమకు రాకుండా మళ్లించడం ఎంత మేరకు న్యాయమని, తమ గౌరవ వేతనం రూ.15 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తమ ఆత్మగౌరవం నిలవాలంటే తామే బరిలో ఉంటామని, ఓటు మాదే–సీటు మాదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీల ఆత్మగౌరవం కాపాడే బాధ్యత తనపై ఉందన్నారు. -
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నుంచి కల్వకుంట కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ తిరస్కరించడంతో కవిత ఎన్నిక ఏకగ్రీవమైంది. చదవండి: వైరల్: కామారెడ్డి కలెక్టర్ వాహనంపై 28 చలాన్లు కాగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ తరఫున ఆర్మూర్ నియోజకవర్గం మాక్లూర్ మండలం అమ్రాద్ గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉన్నాయి. అయితే స్వతంత్ర అభ్యర్థిపై ఫోర్జరీ ఆరోపణలు రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. -
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్
-
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ జగన్
జమ్మలమడుగు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. జమ్ములమడుగు పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కూడా సాధారణ ఓటరులాగానే క్యూలో నిలబడి ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు జరుగుతున్న మూడు జిల్లాల్లోనూ (వైఎస్ఆర్ జిల్లా, నెల్లూరు, కర్నూలు) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉందన్నారు. తమకు మెజార్టీ ఉన్న స్థానాల్లో టీడీపీ నేతలు పోటీ చేయడం సిగ్గుచేటు అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. టీడీపీకి బలం లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పరిస్థితి కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. పార్టీ గుర్తుల మీద గెలిచిన తర్వాత కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి... అవహేళన చేయడం దారుణమన్నారు. జిల్లాలో 841మంది ఓటర్లు ఉంటే వారిలో 521మంది ఓటర్లు వైఎస్ఆర్ సీపీ గుర్తుపై గెలిచారన్నారు. ప్రలోభపెట్టి, భయపెట్టి ఓటు వేయించుకోవాలని చూడటం సరికాదన్నారు. పైన దేవుడు ఉన్నాడని, ప్రజల్లో ఇంకా అభిమానం, మంచితనం మిగిలే ఉందని వైఎస్ జగన్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా చివరకు న్యాయమే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న జగన్
-
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్
కడప : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ శుక్రవారం జమ్మలమడుగులో హల్చల్ చేశారు. పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే అనుమతి లేదంటూ ఎంపీని పోలీసులు వెనక్కి పంపారు. మరోవైపు రాజంపేటలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. ఓటుహక్కు లేని టీడీపీ నేతలను పోలింగ్ బూత్‌లోకి అనుమతించారు. దీనిపై ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికారులు కానీ పోలీసులు పట్టించుకోలేదు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గేందుకు అందినకాడికి ప్రలోభాలకు గురిచేస్తూ... లొంగిని వారిపై దౌర్జన్యాలకు అధికార పార్టీ తెరతీసింది. మరోవైపు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలను గాలికి వదిలేసి పలువురు మంత్రులు గత వారంగా జిల్లాల్లో తిష్ట వేసి, చక్రం తిప్పుతున్నారు. బలం లేని చోటుకూడా బలవంతంగా నెగ్గేలా కుతంత్రాలు చేస్తోంది. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిబిరాలు పెట్టించి మరీ టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించారు. -
ఏపీలో 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్
నెల్లూరు, కర్నూలు, కడప : ఆంధ్రప్రదేశ్‌లోని మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. వైఎస్ఆర్, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్ఆర్జిల్లా 841మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కడప, జమ్మలమడుగు, రాజంపేటలో పోలింగ్ జరుగుతోంది. ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...జమ్మలమడుగులో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఆయన పులివెందుల చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా తొలిసారిగా డ్రోన్ కెమెరాలతో పోలింగ్ సరళిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 4వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కడప పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. నెల్లూరు: ఈ ఎన్నికల్లో 852మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. నెల్లూరు, నాయుడుపేట, ఆత్మకూరు, గూడురు, కావలిలో పోలింగ్ కొనసాగుతోంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆనం విజయ్‌కుమార్ బరిలో ఉన్నారు. కర్నూలు: జిల్లాలో 1083 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోనిలో పోలింగ్ జరుగుతుంది. గౌరు వెంకటరెడ్డి...వైఎస్ఆర్ సీపీ నుంచి పోటీ చేసున్న విషయం విదితమే.