
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ నుంచి కల్వకుంట కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ తిరస్కరించడంతో కవిత ఎన్నిక ఏకగ్రీవమైంది.
చదవండి: వైరల్: కామారెడ్డి కలెక్టర్ వాహనంపై 28 చలాన్లు
కాగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ తరఫున ఆర్మూర్ నియోజకవర్గం మాక్లూర్ మండలం అమ్రాద్ గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉన్నాయి. అయితే స్వతంత్ర అభ్యర్థిపై ఫోర్జరీ ఆరోపణలు రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.
Comments
Please login to add a commentAdd a comment