సాక్షి, నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. 24 గంటల్లో అరవింద్ చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేదంటే పులంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని కవిత సవాల్ విసిరారు. పిచ్చిపిచ్చిగా ఆరోపణలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని, తప్పుడు ఆరోపణలతో తమాషాలు చేస్తే బాగుండదని ఆమె హెచ్చరించారు.
‘‘ధరణిని రద్దుచేసి దళారీలను ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. మా విధానం ధరణి... కాంగ్రెస్ విధానం దళారి. మేము ఎన్డీఏ కాదు, ఇండియా కూటమి కాదు.. మేము ప్రజల వైపు’’ అని కవిత అన్నారు.
చదవండి: ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండి: బండి సంజయ్
కాగా, తెలంగాణ ప్రజల సొమ్మును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళ్ల దగ్గర మంత్రి ప్రశాంత్ రెడ్డి దారబోస్తున్నారంటూ అరవింద్ ఆరోపించిన సంగతి తెలిసిందే. బాల్కొండ నియోజకవర్గంలో కట్టిన ప్రతీ బిడ్జిపై ఎమ్మెల్సీ కవితకు కమీషన్ వెళ్తోంది. ఒకే పనికి డబుల్ బిల్లింగ్ చేస్తున్నారు. రోడ్ కార్పోరేషన్ డెవలప్‌మెంట్ నుంచి కట్టినట్టు శిలాఫలకం వేశారు. కేంద్రం ద్వారా నిధులు పొందినట్టు కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. 50 ఏళ్లు వడ్డీలేని రుణం ద్వారా నిర్మించినట్టు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా రూ.5వేల కోట్లకు పైగా స్కామ్ జరిగింది’’ అంటూ అరవింద్ ఆరోపణలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment