Dharmapuri Aravind
-
నిజామాబాద్‌లో ధర్మపురి అర్వింద్ విజయం
నిజామాబాద్: నిజామాబాద్‌లో బీజేపీ విజయం సాధించించింది. బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలుపుకుంది. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ 1,25,369 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టీ. జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజీరెడ్డి గోవర్థన్ ఓటమిపాలయ్యారు. -
మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్‌కు అస్వస్థత
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డి. శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు ఆయన కుమారుడు, బీజేపీ ఎంపీ అర్వింద్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. తన తండ్రి కోసం దేవుడుని ప్రార్థించాలని అభిమానులను కోరారు.కాగా, ఎంపీ అర్వింద్ ట్విటర్ వేదికగా ప్రకటన చేశారు. యూరినరీ ఇన్ఫెక్షన్ కారణంగా శ్రీనివాస్ అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తన తండ్రి కోసం ప్రార్థించాలని అభిమానులను కోరారు. My father, Sri D. Srinivas Garu has been admitted to the ICU of a private hospital due to a urinary tract infection and sodium loss. Please keep him in your thoughts and prayers. pic.twitter.com/6xZtEaP6SN— Arvind Dharmapuri (Modi Ka Parivar) (@Arvindharmapuri) June 1, 2024 -
రేవంత్ కన్నా కేసీఆర్ బెటర్: ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా, బీజేపీ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్నా సీఎం కేసీఆర్ బెటర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎంపీ అర్వింద్ జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో కార్నార్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అర్వింద్ మాట్లాడుతూ.. రేవంత్ కంటే కేసీఆర్ మేలు. సీఎం కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారు. కేసీఆర్ కొట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశాడు. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 2018 ఎన్నికల్లో హైదరాబాద్ నేనే కట్టానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?. కాంగ్రెస్‌కు ఓటు వేశారో తెలంగాణను తీసుకువెళ్లి ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం చేతిలో పెట్టినట్టే అని సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణను హోల్ సేల్‌గా అమ్మేస్తాడు. చంద్రబాబు కోసం సంచులను మోసుకెళ్లాడు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. -
తమాషాలొద్దు.. ఎంపీ అరవింద్‌కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్
సాక్షి, నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. 24 గంటల్లో అరవింద్ చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేదంటే పులంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని కవిత సవాల్ విసిరారు. పిచ్చిపిచ్చిగా ఆరోపణలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని, తప్పుడు ఆరోపణలతో తమాషాలు చేస్తే బాగుండదని ఆమె హెచ్చరించారు. ‘‘ధరణిని రద్దుచేసి దళారీలను ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. మా విధానం ధరణి... కాంగ్రెస్ విధానం దళారి. మేము ఎన్డీఏ కాదు, ఇండియా కూటమి కాదు.. మేము ప్రజల వైపు’’ అని కవిత అన్నారు. చదవండి: ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండి: బండి సంజయ్ కాగా, తెలంగాణ ప్రజల సొమ్మును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళ్ల దగ్గర మంత్రి ప్రశాంత్ రెడ్డి దారబోస్తున్నారంటూ అరవింద్ ఆరోపించిన సంగతి తెలిసిందే. బాల్కొండ నియోజకవర్గంలో కట్టిన ప్రతీ బిడ్జిపై ఎమ్మెల్సీ కవితకు కమీషన్ వెళ్తోంది. ఒకే పనికి డబుల్ బిల్లింగ్ చేస్తున్నారు. రోడ్ కార్పోరేషన్ డెవలప్మెంట్ నుంచి కట్టినట్టు శిలాఫలకం వేశారు. కేంద్రం ద్వారా నిధులు పొందినట్టు కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. 50 ఏళ్లు వడ్డీలేని రుణం ద్వారా నిర్మించినట్టు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా రూ.5వేల కోట్లకు పైగా స్కామ్ జరిగింది’’ అంటూ అరవింద్ ఆరోపణలు చేశారు. -
కర్నాటక ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార బీజేపీతో సహా కాంగ్రెస్, జేడీఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక, అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ సంచలన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్లను కాదని కొత్త వారికి అవకాశం కల్పించింది. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ సరికొత్త ప్రయోగానికి తెర లేపింది. కాగా కర్నాటక ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ నేతలను ఎంపిక చేసింది. మొత్తం 13 రాష్ట్రాల నుంచి కర్నాటక ఎన్నికల ప్రచారానికి నేతలను ఎంపిక చేయగా.. 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా తెలంగాణ నేతలను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో, వీరంతా వారికి కేటాయించిన నియోజకవర్గాలకు బయలుదేరారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోనున్నారు. అయితే, ఇన్‌ఛార్జ్‌లుగా నియమించిన వారిలో బీజేపీ నేతలు లక్ష్మణ్, అర్వింద్, జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, రఘునందన్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, గరికపాటి, బండ కార్తీకరెడ్డి, కొల్లి మాధవి, ఎస్ కుమార్ ఉన్నారు. ఇక, లక్ష్మణ్‌తో సహా మరికొందరికి నియోజకవర్గంతో పాటు ఆ జిల్లాలో ఉన్న మరో 5 నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను కూడా అధిష్టానం అప్పగించింది. మరోవైపు.. కర్నాటకలోని 224 నియోజకవర్గాలకు 224 మందిని ఇతర రాష్ట్రాల నుంచి ఇన్‌ఛార్జ్‌లుగా నియామకం అయ్యారు. -
ఎంపీ అర్వింద్‌కు కొత్త టెన్షన్.. నిజామాబాద్‌లో రసవత్తర రాజకీయం!
ఒకవైపు ఇంట్లో ప్రత్యర్థి.. మరోవైపు బయటి ప్రత్యర్థి. నిజామాబాద్ ఎంపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఇంటా బయటా ప్రత్యర్థులు. ఎవరెంత ఇబ్బంది పెట్టినా తగ్గేదే లే అంటున్నా ఎంపీ అరవింద్. అదే రేంజ్లో ప్రత్యర్థులకు సవాళ్ళు విసురుతున్నారాయన. ఇంతకీ నిజామాబాద్‌లో రసవత్తర రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలుసుకోవాల్సిందే.. నిజామాబాద్ నగరంలో హఠాత్తుగా దర్శనమిచ్చిన వెలిసిపోయిన పసుపు కలర్ ఫ్లెక్సీలు తీవ్ర కలకలం రేపాయి. బీజేపీ ఎంపీ అరవింద్ ను ప్రశ్నిస్తూ.. ఆయనపై సెటైర్స్ వేసే రీతిలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదే మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డ్ అంటూ రంగు వెలసిన పసుపు కలర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది. జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్లన్నింటి దగ్గరా ఈ ఫ్లెక్సీలు దారినపోయే అందరి దృష్టినీ ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల వ్యవహారం బీఆర్ఎస్ ముఖ్యనేతల సోషల్ మీడియా గ్రూపుల్లోనూ వైరల్‌గా మారింది. దాంతో పాటు.. ఆయా గ్రూపుల్లో బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో అడిగిన పసుపు బోర్డ్ ప్రతిపాదనకు సంబంధించిన ప్రశ్నావళి కాపీనీ.. అలాగే పసుపు బోర్డుపై గతంలో జిల్లాకు వచ్చినప్పుడు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ వంటివారిచ్చిన హామీలను వీడియోల రూపంలో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. కాదు కాదు ఎమ్మెల్సీ కవిత వర్సెస్ ఎంపీ అరవింద్ ఫైట్‌కు బీజం పడినట్లయింది. సీఎం కేసీఆర్‌కు కౌంటర్.. పసుపు బోర్డు గురించి బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఎంపీ అరవింద్ కూడా కొద్ది గంటల్లోనే స్పందించారు. అసలు ప్రశ్నలడగడం కూడా చేతకాని వాళ్లుగా బీఆర్ఎస్ ఎంపీలను అభివర్ణించారాయన. తమ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. మేము ఊరుకుంటామా అంటూ ప్రశ్నించారాయన. మీ నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కథ, రైతు రుణమాఫీ వంటి అంశాలన్నింటినీ పైకి తీసుకొస్తామని.. ఇకపై మా తడాఖా చూపిస్తామంటూ కౌంటర్ ఇచ్చారు అరవింద్. అంతేకాదు... వాళ్ల ప్రశ్నలు తనకే మెప్పు లభించేలా ఉన్నాయని గులాబీ పార్టీ ఎంపీలను ఎద్దేవా చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 30 కోట్ల రూపాయల వ్యయంతో స్పైస్ బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేశారన్నారు. పసుపుకు మద్దతు ధర ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. కనీసం లేఖ రాయడం కూడా చేతకాని వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారంటూ సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. పసుపు కూలీల ధరల పెరుగుదల సమస్య పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం పరిష్కారం చూపిస్తుందని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. రెండు సవాళ్లు ఇవే.. తండ్రి ధర్మపురి శ్రీనివాస్ 9 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ తీర్థం మరోసారి పుచ్చుకున్న 24 గంటల్లోపే.. ఆయనతో పార్టీకి రాజీనామా లేఖను విడుదల చేయించడంలో అరవింద్ సక్సెస్ అయ్యారు. అయితే తన సోదరుడైన సంజయ్‌తో మొదలైన ఇంటి పంచాయితీతో తలబొప్పి కట్టిన క్రమంలో అరవింద్‌కు ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ నుంచి పసుపు బోర్డ్ పేరిట పోరు మొదలవ్వడంతో రెండు సవాళ్లనూ సమర్థవంతంగా ఎదుర్కొనడం ఓ సవాల్‌గానే మారింది. మరోవైపు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ .. ఆయనపై అరవింద్ చేసిన కామెంట్స్ విషయంలో బీజేపీ అధిష్ఠానం కూడా అరవింద్ మీద గుర్రుగా ఉన్నట్లు ప్రచారంలోకొచ్చింది. ఈ క్రమంలో ఇంతకాలం అరవింద్‌తో అంటీముంటనట్టుగా ఉంటూ ఈ మధ్య ఆయనకు దూరమైన వారంతా బండి సంజయ్ వర్గంలో చేరుతున్నారనే టాక్ నడుస్తోంది. ఇలా పార్టీలోని అంతర్గత విభేదాలు కూడా అరవింద్‌ను ఎటూ మసలకుండా చేస్తున్నాయనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న ఓ ప్రధాన చర్చ. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్ -
Garam Garam Varthalu: పసుపుబోర్డ్ వచ్చేసిందోచ్
-
బీజేపీలో ఏం జరుగుతోంది!.. అర్వింద్‌కు అధిష్టానం నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అసంతృప్త స్వరాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం కమలదళంలో దుమారం రేపుతోంది. బండి వ్యాఖ్యలను బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇప్పటికే తప్పు బట్టగా తాజాగా ఆర్వింద్ వ్యాఖ్యలు వంద శాతం సరైనవేనంటూ బీజేపీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, సీని యర్ నేత పేరాల శేఖర్‌రావు సోషల్ మీడియా వేదికగా పేర్కొనడం పార్టీ నేతల్లో మరింత కలకలా నికి కారణమయ్యాయి. రాష్ట్ర పార్టీలోని కొందరు నేతలు అర్వింద్, శేఖర్‌రావు వ్యాఖ్యలను సమ ర్థిస్తుండగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఇలాంటివి పార్టీకి నష్టం చేస్తాయని మరికొందరు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితపై సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేకపోయినా అర్వింద్ ఖండించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. అదే సమయంలో సంజయ్ వ్యవహారశైలి, రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే పవర్ సెంటర్ కాదని, అందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంటుందని అర్వింద్ చేసిన వ్యాఖ్యలను మరికొందరు సమర్థిస్తున్నారు. అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా సంజయ్‌పై శేఖర్‌రావు మరిన్ని తీవ్ర విమర్శలు, ఆరోపణలు సంధించడంతో పార్టీలో అంతర్గతంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని నేతలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. మరోవైపు వివిధ జిల్లాల్లోనూ పార్టీ ముఖ్య నేతల మధ్య పొసగక గ్రూపుల గందరగోళం కూడా పెరిగినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. పార్టీ నేతల్లో గందరగోళం..! అర్వింద్‌కు అధిష్టానం నోటీసులు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పార్టీ ఎంపీ అర్వింద్ బహిరంగ విమర్శలు చేయడంపై ఇప్పటికే పంచాయితీ ఢిల్లీ అధిష్టానం వద్దకు చేరింది. ఈ వ్యవహారంపై అర్వింద్‌కు క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ అధిష్టానం నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం. శేఖర్‌రావు ఏమన్నారంటే... రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె.లక్ష్మణ్ వంటి పెద్దలు చేయాల్సిన పనినే అర్వింద్ చేశారని శేఖర్‌రావు సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. అధ్యక్షుడి పరిణతిలేని అసందర్భ మాటలు, నియంతృత్వం, అప్రజాస్వామిక చేష్టలు బీజేపీలో ప్రస్తుత పరిస్థితి కారణమని దుయ్యబట్టారు. బ్లాక్మెయిల్, అంతర్గత సెటిల్మెంట్లు, కార్యకర్తలకు అవమానం, ఒంటెద్దు పోకడలు, సమన్వయలోపం, వ్యక్తిగత ఆర్థిక స్వార్థం, వాడుకొని వదిలేసే విధానం బీజేపీ సంస్కృతి కాదని శేఖర్‌రావు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇవన్నీ పార్టీలో యథేచ్చగా నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లో గ్రానైట్ క్వారీల్లో అక్రమ తవ్వకాలంటూ ప్రచారం చేసి యజమానులతో అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఓ వార్తా చానల్లో ఓ ప్రముఖుడి మైనింగ్ అక్రమాలపై వరుస కథనాలు ప్రసారం చేసి ఆపై సెటిల్మెంట్లు చేసుకోవడం, ఆ చానల్లో నలుగురు పార్టీ నేతలతో రూ. కోట్లలో పెట్టుబడి పెట్టించి నట్టేట ముంచడం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ వైస్‌చైర్మన్ పదవిని ఆర్థిక కారణాలతో కొత్తవారికి కట్టబెట్టడం, హుజురాబాద్‌లో ఈటల గెలుపు అనంతరం ఏర్పడిన వాతావరణాన్ని ఖతం చేయడం వంటి చర్యలకు బండి సంజయ్ పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు. వాటన్నింటినీ ఉదాహరణలతో సహా నిరూపించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. పార్టీలో వినే సంస్కృతి, చర్చించే పద్ధతి మాయమైనప్పుడు సోషల్ మీడియానే ఆధారమవుతోందని శేఖర్‌రావు తెలిపారు. -
బండి Vs అరవింద్.. విజయశాంతి స్పందన ఇదే..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటనపై కాషాయ పార్టీ నేత విజయశాంతి స్పందించారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై తన స్పందన తెలియజేశారు. తాను పార్టీ అంతర్గత సమావేశంలో మాత్రమే.. తన అభిప్రాయం చెప్పగలను అంటూ క్లారిటీ ఇచ్చారు. కాగా, అరవింద్ ప్రకటనపై మీడియా ప్రశ్నలకు తాను సమాధానం ఇస్తున్నట్టు విజయశాంతి తెలిపారు. ఇక, విజయశాంతి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేత ఎవరైనా.. పార్టీ కార్యకర్త లేదా నేతలు.. పార్టీ అధ్యక్షుడి కామెంట్స్‌పై స్పందిస్తే.. అది పార్టీ సమావేశాల్లో జరిగినట్లైతే ఎప్పుడూ కూడా అది అంతర్గత ప్రజాస్వామ్య విధానంగానే పార్టీ పరిగణిస్తుంది. ఆ కామెంట్స్‌ని సమయం, సందర్భం, సమస్య పరిస్థితుల ప్రామాణికతతో విశ్లేషించడం, అవసరమైన నిర్ణయం చెప్పడం కూడా సహజంగా పార్టీ విధానం అని స్పష్టం చేశారు. ఇక, ఎంపీ అరవింద్ మాట్లాడిన సందర్బం మొత్తం నేను చూడలేదు. కానీ, అందులోని ఏదో ఒక అంశాన్ని ప్రొజెక్ట్ చేస్తున్న బీఆర్ఎస్ అనుకూల వర్గానికి మాత్రం ఒకటి చెప్పగలను. బండి సంజయ్ తన మాటలను వెనక్కి తీసుకోవాల్సి వస్తే.. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం, బీఆర్ఎస్ నాయకులు వారు గతంలో చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుత కామెంట్స్‌ను అనేక సార్లు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని వందల సార్లు వారు ముక్కు నేలకు రాయాల్సి వస్తుందని గుర్తించాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా, అంతుకుముందు.. ఎంపీ అరవింద్ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలపై సంచలన కామెంట్స్ చేశారు. కవితపై సంజయ్ వ్యాఖ్యలను సమర్థించనని అన్నారు. సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాదు. అందరినీ సమన్వయం చేసే బాధ్యత అది అని సూచించారు. -
కేటీఆర్‌కు ఎంపీ అరవింద్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: డ్రగ్స్ టెస్ట్ కోసం తాను రెడీ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వెంట్రుకలు ఇస్తానని చెప్పి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సవాల్‌ను ఇంత వరకు నెరవెర్చలేదని గుర్తు చేశారు. ఒక బాధ్యతగల మంత్రిగా, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మాట నిలబెట్టుకోవాలని సూచించారు. నీ వెంట్రులు, నీ గోర్లు ఎవరికి కావాలంటూ మంత్రిపై విమర్శలు గుప్పించారు. ‘నీ బొచ్చు, నీ గోర్లు ఎవరికి కావాలి. నీకు డయాబెటిస్ ఉంది, నీ కిడ్నీలు ఎవడికి కావాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల గెలుపు తర్వాత హైదరాబాద్ రూపు రేఖలు మారుస్తానని చెప్పావు. విచిత్రమైన హామీలు ఇచ్చావు. వరదల్లో మునిగిపోయిన వారికి రూ.10వేలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగలు పెన్షన్, ఉద్యోగాలు , ఉచిత ఎరువులు ఏ హామీ నెరవేర్చలేదు. లవంగాకు తంబాకుకు తేడా తెలియని మంత్రి కేటీఆర్. దర్యాప్తు సంస్థలు, కోర్టులు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంలో దోషి అని తేలితే జైలుకు పోతారు.’అని తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇదీ చదవండి: చెప్పుతో కొట్టుకుంటావా? బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ -
గన్ షాట్ : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం కనిపిస్తోందా..?
-
దాడి.. వేడి: రాష్ట్రంలో మళ్లీ మొదలైన రాజకీయ యుద్ధం!
సాక్షి, హైదరాబాద్: కారు, కమలం పార్టీల మధ్య రాజకీయ రగడ ముదిరి పాకాన పడుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం పరాకాష్టకు చేరుతోంది. రెండు ప్రధాన పార్టీల మధ్య గొడవలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. నువ్వా? నేనా? అన్నట్టుగా తలపడుతున్నాయి. ఎమ్మెల్సీ కవితనుద్దేశించి నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, శుక్రవారం ఆయన నివాసంపై గులాబీ దళం దాడికి దిగడం, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతానని, కొట్టి కొట్టి సంపుతం అంటూ అర్వింద్‌పై కవిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో.. రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఎక్కడ పోటీ చేసినా వెంట పడి ఓడిస్తానని కవిత పేర్కొనగా, ‘తగ్గేదేలే..’ అన్నట్టుగా తాను మళ్లీ నిజామాబాద్‌లోనే పోటీ చేస్తానని, దమ్ముంటే ఓడించాలంటూ ధర్మపురి సవాల్ చేశారు. అర్వింద్‌కు మద్దతుగా బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు రంగంలోకి దిగారు. ఆయన ఇంటిపై దాడిని ఖండించారు. టీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శలు గుప్పించారు. అండర్ గ్రౌండ్ చీఫ్ మినిస్టర్ అని, కుటుంబ పాలన సాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా అర్వింద్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అర్వింద్ ఇంటిపై దాడి జరగడాన్ని డీకే అరుణ, బండి సంజయ్‌లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అర్వింద్‌కు ఫోన్ చేసిన అమిత్ షా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు పలుచోట్ల కవిత దిష్టిబొమ్మలు దహనం చేశారు. దాడి ఘటనపై కోర్టుకు వెళతామని ప్రహ్లాద్ జోషి చెప్పగా, దీనిపై తనకు సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆదేశించడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీపై విమర్శల దాడికి దిగారు. మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ మాత్రం..ఇదంతా టీఆర్ఎస్, బీజేపీల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకేనని విమర్శిస్తోంది. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నిక ముగియడంతో కొన్నాళ్లు ప్రశాంత వాతావరణం నెలకొంటుందని అంతా భావించారు. కానీ మాటల తూటాల దశ దాటి దాడుల వరకు వెళ్లడం, మళ్లీ రాజకీయ యుద్ధం మొదలవడంతో.. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనన్న చర్చ జరుగుతోంది. ఇదీ చదవండి: బీజేపీ ఎంపీ ఇంటిపై దాడి.. ధర్మపురి అర్వింద్ తల్లి ఫిర్యాదు -
నిజామాబాదు నిప్పురవ్వలు..
-
బీజేపీ ఎంపీ ఇంటిపై దాడి.. ధర్మపురి అర్వింద్ తల్లి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి దాడి ఘటనపై ఆయన తల్లి విజయలక్షి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 11:30 ప్రాంతంలో 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి గేటు పగలగొట్టి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి టీఆర్ఎస్ జండాలతో, కర్రలతో రాళ్లతో దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనలో ఇంట్లో పని చేస్తున్న సత్యవతి, సెక్యూరిటీ గార్డ్ రమణ గాయపడ్డారని చెప్పింది. బెంజ్ కారు అద్దాలు ధ్వంసం చేశారని తెలిపారు. దాడికి పాల్పడ్డ 50 మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విన్నపించారు. కాగా నిజామాబాద్ జిల్లా దిశా మీటింగ్ ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని ఎంపీ అర్వింద్ ధర్మపురి నివాసంపై టీఆర్ఎస్ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో ఆందోళనకు దిగారు. చదవండి: బీజేపీ ఎంపీ ఇంటిపై దాడి.. ధర్మపురి అర్వింద్ తల్లి ఫిర్యాదు -
‘కాంగ్రెస్‌లో చేరతానంటూ ఖర్గేకు కవిత ఫోన్’
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేసి కాంగ్రెస్‌లో చేరతానని కోరారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ జాతీయ ప్రధానకార్యదర్శి తనకు చెప్పారన్నారు. గురువారం ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, ఎస్.ప్రకాష్‌రెడ్డితో కలిసి అరవింద్ ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తండ్రి కేసీఆర్‌పై అలిగిన కవిత ఆయనను బెదిరించేందుకు తాను కాంగ్రెస్‌లో చేరతానని ఖర్గేకు ఫోన్ చేసిన విషయంపై లీకులు ఇచ్చిందని ఆరోపించారు. దీంతో భయపడిన కేసీఆర్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం అంతిమయాత్రకు కవితను తన వెంటే లక్నోకు, ఢిల్లీ టూర్‌కు తీసుకెళ్లారన్నారు. తన వెంటే కూతురు ఉన్నదని మీడియా ముందు కేసీఆర్ డ్రామా ఆడారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితి బాగాలేకపోయినా వాళ్లు కూడా ఆమెను వద్దనుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చునని అన్నారు. కవితను తీసుకొస్తామన్న వారిని సస్పెండ్ చేస్తాం కవితను ప్రలోభపెట్టి పార్టీలోకి తీసుకొస్తామన్న వారిని బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తామని అర్వింద్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తానే స్వయంగా బండి సంజయ్, జేపీ నడ్డాలను డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. కవిత, కేటీఆర్‌లను తమ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. సెకెండ్ హ్యాండ్ ఎమ్మెల్యేలు బీజేపీకి అవసరం లేదన్నారు. దేశంలోనే సిల్లీ సీఎంగా కేసీఆర్ మిగిలిపోయారని అర్వింద్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మోడల్ పాలనంటే బిడ్డకు 20 శాతం, కొడుక్కి 20 శాతం, ఎలక్షన్‌కు 20 శాతం కమీషన్లు ఖర్చు పెట్టడమేనని విమర్శించారు. కొడుకు, బిడ్డకు కమీషన్లు ఇచ్చేందుకే నూతన విద్యుత్ బిల్లుకు కేసీఆర్ అంగీకరించడం లేదని ఆరోపించారు. ఇదీ చదవండి: ఆయన రాజకీయాలకు దూరమవ్వాలని ఫిక్స్ అయిపోయారా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా? -
పొలిటికల్ కారిడార్ : నిజామాబాద్ కమలం పార్టీలో కుంపట్లు
-
ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై గ్రామస్తుల దాడి
ఇబ్రహీంపట్నం/కోరుట్ల/జగిత్యాల: వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై ఎర్దండి గ్రామస్తులు దాడి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టునుంచి నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిని ఆ వరద చుట్టుముట్టింది. బాధితులను పరామర్శించి, గోదావరి వరదపై సమీక్షించేందుకు ఎంపీ అర్వింద్ శుక్రవారం ఆ గ్రామానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ‘ఎంపీ అర్వింద్ డౌన్ డౌన్.. గో బ్యాక్’అని నినాదా లు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఓ గ్రామస్తుడు ఎంపీకి చెప్పుల దండ వేసేందుకు య త్నించాడు. పోలీసులు అడ్డుకుని అతడిని పక్క కు పంపించారు. తమ గ్రామంలో భూ సమస్యను పరిష్కరించకుండా ఎందుకు వచ్చారని గ్రామస్తులు ఆయనను నిలదీశారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకుని పంపించారు. దీంతో ఎంపీ గోదావరి నది వద్దకు వెళ్లి వరద పరిస్థితి సమీక్షించి వెనుదిరిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మరోసారి ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. కొందరు ఆగ్రహంతో ఎంపీ కారుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎంపీ కారు వెనుకాల అద్దం పగిలిపోయింది. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పోలీసులు బందోబస్తు మధ్య ఎంపీని అక్కడినుంచి పంపించివేశారు. కారుపై దాడి చేసిన ఓ వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. గోదావరి వరద ముంపు కారణంగా 1996లో ఎర్దండి గ్రామంలోని 200 మందికి సమీపంలోని బర్ధీపూర్‌లో భూములు కేటాయించారు. అయితే గతంలోనే బర్ధీపూర్లోని మరికొందరికి కూడా ఆ భూములు కేటాయించారు. ఒకే సర్వేనంబర్‌లోని భూములు కావడంతో అది వివాదంగా మారింది. ఏడాది కిందట విజ్ఞప్తి చేసినా తమ సమస్య పరిష్కరించలేదని ఎర్దండి వాసులు ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంత్రి, ఎమ్మెల్యేల కుట్ర: అర్వింద్ తమ భూ దందాలు బయట పడతా యన్న భయంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తనపై దాడి చేయించారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. శుక్రవారం కోరుట్లలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిర్మల్ ప్రాంతానికి చెందిన ఎస్సారెస్పీ ముంపు బా«ధితులకు ఎర్దండిలో రోడ్డు వెంట కేటాయించిన భూమిని ఆక్రమించాలన్న లక్ష్యంతో కుట్ర లు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ గూండాలను ఉసిగొలిపి తన కారు అద్దాలు ధ్వంసం చేయడం సిగ్గుచేటన్నారు. చదవండి: వరద విరుచుకుపడినా నిలబడిన కడెం.. చరిత్రలో తొలిసారి భీకర దృశ్యాలు అర్వింద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై జరిగిన దాడిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. దాడి జరిగిందనే సమాచారం తెలియగానే అమిత్ షా అర్వింద్‌కు ఫోన్‌చేసి ఘటనపై ఆరా తీశారు. పథకం ప్రకారమే తనపై దాడి జరిగిందని, అమిత్ షాకు అర్వింద్ వివరించా రు. నియోజకవర్గం పరిధిలో తాను ఎక్కడ పర్యటించినా దాడులు చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు సూచించిందని ఆయన అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లా రు. దాడి వెనుక కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు హస్తం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, ఆర్వింద్‌పై దాడి ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. -
ఎంపీ అర్వింద్ ఇప్పటికీ మభ్యపెడుతూనే ఉన్నాడు: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, నిజామాబాద్ : బీజేపీ ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘‘కరవుతో అల్లాడిన తెలంగాణ రాష్ట్రం ఇవాళ సుభిక్షంగా ఉంది. కేంద్రంతో కొట్లాడినా ధాన్యం కొనకుంటే రాష్ట్రమే కొంటోంది. మరోవైపు ఉద్యోగాల కల్పన, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మహిళల అభివృద్ధి వంటి ఎన్నో పథకాలను టీఆర్ఎస్ తీసుకువచ్చింది. ఈ జిల్లాలో అబద్ధాలు చెప్పి.. ఒట్టును గట్టుమీద పెట్టిన బీజేపీ నాయకులున్నారు. ఎంపీ అరవింద్‌పై ఇప్పటివరకు నేను ఏమీ మాట్లాడలేదు. కానీ, ఇప్పటికీ ఆయన మభ్యపెడుతూనే ఉన్నాడు. పసుపు బోర్దు ఏర్పాటు కోసం ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్‌కు లేఖ కూడా రాశాం. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఇతర ముఖ్యమంత్రుల మద్దతు కూడా తీసుకున్నాము. బాబా రాందేవ్, బాలకిషన్ వంటివాళ్లను కూడా తీసుకువచ్చి వారితో కూడా ఇక్కడ పసుపు బోర్డు ఆవశ్యకతను చెప్పించాం. 2015లో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని కోరింది. ఇలా పలుమార్లు విన్నవించినా కేంద్రంలో చలనం లేదు. 2017లో స్పైస్ బోర్డ్ ఆఫీస్, ఫీల్డ్ ఆఫీస్, డివిజన్ ఆఫీస్ ఇన్ని తీసుకొచ్చినా.. బీజేపీ మాత్రం సాయమందించలేదు. తానే పసుపు రైతులకు అంతా చేసినట్టు అరవింద్ చెబుతున్నాడు. అరవింద్‌వి పసుపు రైతులకు ఉచిత సలహాలు. 90 వేల మందికి పైగా రైతులు పసుపు పండిస్తే.. ఆయన తీసుకొచ్చిన నిధులు 2 కోట్లు కూడా కాదు. అదే ఈ ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు 50 వేల కోట్లు కేటాయించింది. తెలంగాణ ప్రజలకు నిజమైన సంరక్షణ అందించేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఉత్తరమే రాయలేదంటున్న అరవింద్‌కు మీడియా ముఖంగా మా ప్రభుత్వం రాసిన ఉత్తరాన్ని చూపిస్తున్నా. ఈ మూడేళ్ళలో నాలుకకు మడత లేకుండా అరవింద్ అబద్ధాలు ఆడాడు. అన్ని భాషల్లో హైస్పీడ్ అబద్ధాలు చెప్పడం తప్పితే బీజేపీ చేసిందేమీలేదు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప బీజేపీ ఏమీచేయదు. కావాలంటే కేంద్రంలో బీజేపీ పాలన.. ఇక్కడ టీఆర్ఎస్ పాలనను ప్రజలు పోల్చి చూసుకోవాలి. అబద్ధాలకోరులను ప్రజలు తరిమికొట్టాలి. ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్న అరవింద్.. ఎప్పుడు పసుపు బోర్డు తెస్తాడు.. ఎప్పుడు మద్దతు ధర సాధిస్తాడో చెప్పాలి. మోకాళ్ళ యాత్ర చేస్తారో.. మోకరిల్లుతారోగానీ పసుపు బోర్డు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం.. లేకుంటే రైతులే అడుగడుగునా అడ్డుకుంటారు. గ్రూప్ వన్ ఉర్దూ మీడియం పేరిట కొత్త వివాదం లేపకుండా.. కేంద్రం ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తుందో చెప్పాలి. వరికి సంబంధించి మాట్లాడమంటే.. మాట్లాడని రాహుల్.. ఇక్కడ తెలంగాణాలో రైతు సంఘర్షణ సభ పెట్టడంలో అర్థం లేదు. 2014 నుంచి తెలంగాణకు సంబంధించి రాహుల్ గాంధీ ఒక్కమాట కూడా మాట్లాడలేదు’’ అని విమర్శించారు. ఇది కూడా చదవండి: తడిసి ముద్దయిన ధాన్యం.. రైతుల్లో ఆందోళన -
‘టీఆర్ఎస్ మళ్లీ వస్తే గొంతు కోసుకుంటా’
సాక్షి,రామాయంపేట (మెదక్): వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తాను గొంతు కోసుకుంటానని, టీఆర్ఎస్కు ఒక్కరూ కూడా ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ సవాల్ చేశారు. ఇటీ వల ఆత్మహత్య చేసుకున్న మెదక్ జిల్లా రామా యంపేటకు చెందిన సంతోష్ కుటుంబాన్ని అర్వింద్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లీ కొడుకులు కామారెడ్డి వెళ్లి ఆత్మ హత్యకు పాల్పడ్డారంటే ఇక్కడి పోలీసులు, అధికార పార్టీ నాయకులపై వారికి అను మానాలు ఉన్నాయన్నారు. వాస్తవానికి మృతులకు ఏ పార్టీతో సంబంధం లేదన్నారు. -
గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం? తమిళిసై ఏం చేయబోతున్నారు?
సాక్షి, హైదరాబాద్: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెరిగిన విభేదాల ప్రభావం.. రాష్ట్ర ప్రభు త్వం, గవర్నర్ మధ్య సంబంధాలపై పడిందా? రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య అగాధం పెరిగిందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు ఔననే సమాధానమిస్తున్నాయి. ఏటా పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించే రాష్ట్రస్థాయి గణతంత్ర వేడుకలను ఈ ఏడాది కోవిడ్‌ను కారణంగా చూపి రాజ్‌భవన్‌కు మార్చడం.. సీఎం కేసీఆర్ సహా మంత్రు లు ఈ వేడుకలకు దూరంగా ఉండటం.. పైగా గవర్నర్ తన ప్రసంగంలో కేంద్రం, ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించడం.. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలనుగానీ, సీఎం కేసీఆర్‌ను గానీ ప్రస్తావించకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనికితోడు గవర్నర్ గురువారం బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఫోన్ చేసి నిజామాబాద్ జిల్లాలో ఆయనపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి ఘటన గురించి ఆరాతీయడం కూడా.. విభేదాలకు అద్దంపడుతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైకి ఏమీ లేదంటున్నా..! కోవిడ్ మూడో వేవ్ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాన్ని రాజ్‌భవన్‌కు మార్చి నిరాడంబరంగా నిర్వహించాలని.. సీఎం, మంత్రులు వేడుకలకు దూరంగా ఉండాలని కేబినెట్ నిర్ణయించిందని అధికారవర్గాలు చెప్తున్నాయి. కానీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్రాల్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనగా.. ఇక్కడ దూరంగా ఉండటం వెనుక రాజకీయ కారణాలున్నట్టు చర్చ జరుగుతోంది. తెలంగాణ కన్నా ఎన్నోరెట్లు ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో సైతం గణతంత్ర వేడుకలను యధావిధిగా నిర్వహించడం, ఆయా రాష్ట్రాల సీఎంలు వేడుకల్లో పాల్గొనడం ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ఇక గవర్నర్ తమిళిసై తన ప్రసంగంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ పథకాలను అభినందించారు. కానీ ఎక్కడా సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రస్తావన తేలేదు. అంతేగాకుండా ఉస్మానియా సహా రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, సేవలు మెరుగుపర్చాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. ఇక ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఫోన్ చేసి మాట్లాడిన గవర్నర్.. సదరు దాడి ఘటన గురించి కేంద్ర హోంశాఖకు నివేదిక సైతం పంపించనున్నట్టు తెలిసింది. కేంద్రంపై కయ్యానికి దిగడంతో.. ఇటీవల యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం తేల్చి చెప్పడం, కొనాల్సిందేనని సీఎం కేసీఆర్ పట్టుబట్టడంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు కూడా. ఇది గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలపైనా ప్రభావం చూపినట్టు రాజకీయవర్గాలు చెప్తున్నాయి. గవర్నర్ తమిళిసై గతనెలలో రాజ్‌భవన్ ప్రవేశద్వారం వద్ద గ్రీవెన్స్బాక్స్ను ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తుండటం రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారిందని అంటున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య విమర్శల పర్వం మొదలైన తర్వాతే.. గవర్నర్ తమిళిసై ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేస్తున్నాయి. తమిళిసై రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటిపోయినా.. రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతతోనే వ్యవహరించారు. ఇటీవల కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం కయ్యానికి దిగడంతో.. గవర్నర్ తన అస్త్రాలను బయటకు తీసి, అమలుపరుస్తున్నట్టు చర్చ జరుగుతోంది. -
సీపీ నాగరాజు డైరెక్షన్లోనే దాడి
సాక్షి,హైదరాబాద్: నిజామాబాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు తనను హత్య చేయించేందుకు కుట్రపన్నారని, ఆయన డైరెక్షన్లోనే టీఆర్ఎస్ సర్కార్ తనపై హత్యాయత్నానికి ప్రయత్నించిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. తనపై దాడి జరిగిన వైనాన్ని మంత్రి కేటీఆర్ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పర్యవేక్షించారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ..తనపై జరిగిన హత్యాయత్నాన్ని, కమిషనర్, ఇతర అధికారుల తీరుపై లోక్‌సభ స్పీకర్‌కు, ప్రివిలేజెస్ కమిటీకి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు, రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ, హోం కార్యదర్శులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. దాడి ఘటనలో తనను కాపాడిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసేందుకు వెళ్తే టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారన్నారు. దాడులకు భయపడం: విజయశాంతి బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్ఎస్ సర్కార్.. గూండా రాజకీయాలకు తెరతీసిందని, ఈ దాడులకు భయపడేది లేదని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ధ్వజమెత్తారు. -
తండ్రి కాంగ్రెస్ లో.. తనయుడు బీజేపీలో..!!
-
కేసీఆర్, కేటీఆర్‌ల అవినీతిపై సీబీఐ, ఈడీ విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అవినీతిపై సీబీఐ, ఈడీలు త్వరలోనే విచారణను ప్రారంభిస్తాయని, వారిని వంద శాతం జైలుకు పంపుతామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ఇప్పటికే స్పష్టమైన విధానం తెలిపిందని, ఒప్పందం మేరకు కొంటామని చెప్పినా ఆందోళన ఎందు కు చేస్తున్నారో టీఆర్ఎస్ ఎంపీలు చెప్పాలని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు రైతులను మభ్యపెడుతున్న కేసీఆర్ ముందు ధర్నా చెయ్యాలని సూచించారు. -
రేవంత్‌ది టెంట్, అరవింద్‌ది స్టంట్ రాజకీయం
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్రంలో నాన్సెన్స్ రాజకీయాలు చేస్తూ న్యూసెన్స్ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆర్మూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి టెంట్.., అరవింద్ స్టంట్ రాజకీయాలు తెలంగాణలో నడవబోవని, రేవంత్‌రెడ్డి కేవలం తెలంగాణకే కాకుండా కాంగ్రెస్ పారీ్టకి కూడా దుఖఃదాయకుడని విమర్శించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, హుజూరాబాద్ ఉపఎన్నికలో తేల్చుకోకుండా కేటీఆర్‌ను బహిరంగ చర్చకు రావాలని రేవంత్‌రెడ్డి సవాళ్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మీరా మాకు నీతులు చెప్పేది: చింతల సాక్షి, హైదరాబాద్: రాజకీయ అవకాశవాదంతో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు ఇలా అన్ని పారీ్టలతో అంటకాగిన టీఆర్ఎస్ నేతలా తమకు నీతులు చెప్పేది? అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ నేతలను ఇప్పుడు ఎవరూ నమ్మే పరిస్థితిలేదన్నారు. అన్ని ఇబ్బందుల్ని అధిగమించి మోదీ సర్కార్ దేశంలో వందకోట్ల డోస్‌ల కరోనా టీకాలకు చేరువైందని, ఈ సందర్భంగా వ్యాక్సిన్ సెంటర్లలో వైద్య సిబ్బందిని సన్మానించాలని బీజేపీ నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. -
MP Aravind: ఆయనో తుగ్లక్ ముఖ్యమంత్రి
సాక్షి, లింగంపేట(నిజామాబాద్): రాష్ట్రంలో హిందూ సాంప్రదాయాలను ఒవైసీకి తాకట్టు పెట్టిన కేసీఆర్ తుగ్లక్ ముఖ్యమంత్రి అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. హిందూ మతాన్ని తొక్కేస్తున్నాడని, ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడని విమర్శించారు. లింగంపేట లో మంగళవారం నిర్వహించిన బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అర్వింద్ ప్రసంగించారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని, ఈ పాలన చూసి, టీఆర్ఎస్రే ఢిల్లీలోని తుగ్లక్ గల్లీలో స్థలం కేటాయించారని ఎద్దేవా చేశారు. హిందువులంతా ఏకం కావాలి.. హిందువులంతా ఏకం కావాలని, హిందూ రాష్ట్ర స్థాపనే కర్తవ్యంగా పని చేయాలని సూచించారు. అయోధ్యలో శ్రీరామ మందిరం కట్టే వారికే మద్దతు పలకాలని కోరారు. రాష్టంలో బీజేపీ బలపడుతుండడంతో కేసీఆర్‌కు మింగుడు పడడం లేదన్నారు. ఈటలదే గెలుపు.. పార్టీ జెండా మోసిన వారిని బయటకు పంపడం కేసీఆర్‌కు అలవాటేనని, 20 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ఏనుగు రవీందర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లను పార్టీ నుంచి బయటకు పంపించాడన్నారు. ఇరువురు నిఖార్సయిన నాయకులు బీజేపీలోకి రావడం సంతోషకరమని చెప్పారు. హుజూరాబాదులో రూ.200 కోట్లు కాదు కదా.. రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఈటలను ఓడించలేరన్నారు. భారీ మెజారిటీతో ఈటల గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. గులాబీ జెండా కాలుష్యమైందని, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలని సూచించారు. వీళ్లేమైనా సక్కగున్నారా? పసుపుబోర్డు విషయంలో నానా యాగీ చేస్తున్నారని ఎంపీ ధ్వజమెత్తారు. బోర్డు కోసం ప్రధాని మోదీ వద్దకు రైతులను తీసుకెళ్లానని, బోర్డుకు మించి మెరుగైన వ్యవస్థను తీసుకొచ్చానని చెప్పారు. కేంద్రం బడ్జెట్లో రూ.30 కోట్లు కేటాయించిందని, పసుపు ఎగుమతులు పెంచి దిగుమతులు తగ్గించినట్లు తెలిపారు. పసుపుబోర్డు గురించి తన గుండుపై కామెంట్లు చేశారని, కేసీఆర్ కుటుంబంలో చక్కగా ఉన్న ముఖాలు ఒక్కటైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. దొడ్డుబియ్యం కొనబోమని చెప్పలేదు.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడానికి సీఎం కేసీఆర్ కూడా కారణమని అర్వింద్ విమర్శించారు. పెరిగిన ధరల్లో 30 శాతం మేర రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో వసూలు చే స్తోందని, ఆ మొత్తాన్ని కేసీఆర్ తీసుకోకుండా ఉంటే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయ ని చెప్పారు. కేంద్రం దొడ్డు బియ్యం కొనమని ఎక్కడా చెప్పలేదని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రావడం ఖాయం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, వంద సీట్లలో గెలుస్తామని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్, తొమ్మిది అసెంబ్లీ స్థానాలు గెలిచి తీరతామన్నారు. జిల్లాలో టీఆర్ఎస్లో కవిత, కాంగ్రెస్‌లో షబ్బీర్ అలీ ఒక్కరే మిగులుతారన్నారు. బీజేపీలో గెలిచే గుర్రాలకే టికెట్లు వస్తాయని, కార్యకర్తలు జవాబుదారీగా పని చేయాలని సూచించారు. బండి సంజయ్ పాదయాత్ర ఎల్లారెడ్డి నియోజక వర్గంలో నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని, ఆయన యాత్రను విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, పార్టీ నేతలు ఏనుగు రవీందర్‌రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, బాపురెడ్డి, కృష్ణారెడ్డి, రాంరెడ్డి, మాల్యాద్రిరెడ్డి, మురళి, దత్తురాం, రాంచందర్ పాల్గొన్నారు. చదవండి: బ్లాక్‌మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్