సాక్షి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ విమర్శలతో విరుచుకుపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నీ కాళేశ్వరానికే పెట్టారని ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం ప్రతి ఏటా హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాలకు కేంద్ర రూ.50 కోట్లు ఇస్తుందని తెలిపారు. రోడ్ల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన రూ.200 కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల సహకారంతో నిధులను కాళేశ్వరానికి మల్లించారని చెప్పారు.
(చదవండి: విధుల్లో చేర్చుకోండమ్మా..!)
కరోనా నిధులను కూడా కాళేశ్వరానికే తరలించారని వెల్లడించారు. వలస కార్మికులకు ఇచ్చిన నిధులను కూడా టీఆర్ఎస్ నేతలు మింగేశారని అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో 14 వేల వలస కార్మికులను గుర్తించి కేవలం రూ.21 లక్షలు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మిగతా సొమ్మంతా ఎక్కడికి వెళ్ళిందని ప్రశ్నించారు. నాసిరకం సొయా విత్తనాలు సరఫరా చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచిందని గుర్తు చేశారు. పంచాయతీలు యూనిట్‌గా తీసుకుని రైతు వేదికలు నిర్మిస్తే సరిపోతుందని అరవింద్ అన్నారు.
(చదవండి: నిరసనలు: మోదీ దిష్టిబొమ్మ దగ్ధం)
Comments
Please login to add a commentAdd a comment