'టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టలేకపోతున్నాం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర వహించడంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఘోరంగా విఫలమయ్యారని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. శనివారం హైదరాబాద్లో మాట్లాడుతూ... కాంగ్రెస్కు సమర్థ నాయకత్వం లేకపోవడం వల్లే టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్ట లేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
త్వరలోనే సీఎల్పీ, పీసీసీ నాయకత్వం మార్పు ఉంటుందన్నారు. కేబినెట్ ర్యాంక్ కోసం ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి జానారెడ్డి ప్రతిపక్ష నేత అయ్యారని విమర్శించారు. కరెంట్, రుణమాఫీ వంటి సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ సర్కార్ ఘోరంగా విఫలమైందని పాల్వాయి అన్నారు.