‘తెలంగాణ ఏర్పాటులో రాహుల్‌దే కీలకపాత్ర’
మహబూబ్‌నగర్ అర్బన్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కీలకపాత్ర పోషించారని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రజిత అన్నారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక డీసీసీ కార్యాలయంలో రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీకి ఎన్నికలు ముఖ్యం కాదని, అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండుగడుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె జోస్యం చెప్పారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, మహబూబ్‌నగర్ అసెంబ్లీ అధ్యక్షుడు వినోద్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు ఇమ్రాన్, షాద్‌నగర్ అసెంబ్లీ అధ్యక్షుడు మధు తదితరులు పాల్గొన్నారు.