
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను పసుపు బోర్డ్ ఏర్పాటు చేయలేకపోయినా.. పసుపుకు, ఎర్రజొన్నకు మద్దతు ధర కల్పించకపోయినా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ విషయాన్ని బాండ్ పేపర్ మీద రాసి సంతకం కూడా చేశారు. ఇప్పటికే దేశం మొత్తం నిజామాబాద్ వైపు చూస్తోంది. అక్కడి పసుపు, మొక్కజొన్న రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు వేయడంతో నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య 185కు పెరిగిపోయిన విషయం తెలిసిందే.