
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అవినీతిపై సీబీఐ, ఈడీలు త్వరలోనే విచారణను ప్రారంభిస్తాయని, వారిని వంద శాతం జైలుకు పంపుతామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ఇప్పటికే స్పష్టమైన విధానం తెలిపిందని, ఒప్పందం మేరకు కొంటామని చెప్పినా ఆందోళన ఎందు కు చేస్తున్నారో టీఆర్‌ఎస్ ఎంపీలు చెప్పాలని అన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు రైతులను మభ్యపెడుతున్న కేసీఆర్ ముందు ధర్నా చెయ్యాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment