CBI & ED
-
హీరోయిన్‌తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు
మనీలాండరింగ్ కేసులో మలయాళ ప్రముఖ నటి నవ్య నాయర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఐఆర్ఎస్ అధికారి సచిన్ సావంత్‌తో నవ్య నాయర్‌కు సన్నిహిత స్నేహం ఉందని ఈడీ గుర్తించింది. ఈ కేసులో నవ్య నాయర్‌ను ముంబయికి పిలిపించి ఈడీ ప్రశ్నించి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. (ఇదీ చదవండి: హీరోయిన్ అవుతానని ఊహించలేదు..ఆ చిత్రం నాకు చాలా స్పెషల్: ఆనంది) సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సచిన్ సావంత్ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆదారాలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తు సందర్భంగా అతని మొబైల్ డేటాను అధికారులు పరిశీలించారు. అందులో వాట్సప్ ద్వారా ఆయన చేసిన చాటింగ్స్ స్టేట్మెంట్లను వారు సేకరించారు. దీనిలో భాగంగానే ఆయనతో నవ్య నాయర్‌కు మంచి పరిచియమే ఉందని ఈడీ గుర్తించింది. వాటి అధారంగా ఐఆర్ఎస్ అధికారి సచిన్ సావంత్, నవ్య నాయర్ చాలా సన్నిహితంగా మెలిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. నటి నవ్య నాయర్‌ని కలిసేందుకు సచిన్ సావంత్ సుమారు 10 సార్లు పైగానే కొచ్చిన్‌కు కూడా వెళ్లినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఈడీ ప్రశ్నిస్తే... తనకు సచిన్ సావంత్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆమె తెలిపింది. తామిద్దరం కేవలం స్నేహితులమనే తెలిపింది. కానీ నవ్య నాయర్‌కు సచిన్ సావంత్ నగలతోపాటు కొన్ని బహుమతులు ఇచ్చాడని పక్కా ఆధారాలతో విచారణలో తేలింది. దీనికి సమాధానంగా సచిన్ తమ స్నేహానికి గుర్తుగా కొన్ని నగలను బహుమతిగా ఇచ్చాడని నవ్య నాయర్ తెలిపింది. ఆమె వాంగ్మూలాన్ని ప్రత్యేక కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఈడీ జత చేసింది. ఎవరీ సచిన్ సావంత్ సచిన్ సావంత్ గతంలో ముంబైలోని జోనల్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా (ED) నియమించబడ్డారు . సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అతన్ని అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సచిన్ సావంత్ పేరును చేర్చింది. ప్రస్తుతం కస్టమ్స్, జీఎస్టీ అదనపు కమిషనర్‌గా ఆయన పనిచేస్తున్నాడు. అతను భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆధారలు లభించడంతో సీబీఐ ఎంట్రీ ఇచ్చి అతన్ని విచారిస్తుంది. ఈ విచారణలో కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం. తన కుటుంబ సభ్యులు, సన్నీహితుల పేర్లతో పెద్ద పెద్ద భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసు విచారణలో భాగంగానే మలయాళ నటి నవ్య నాయర్ పేరు తెరపైకి వచ్చింది. -
అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు.. ఆదివారం విచారణకు రావాలని ఆదేశాలు
-
ఢిల్లీ లిక్కర్ స్కామ్... మరో చార్జిషీట్లోనూ ఎమ్మెల్సీ కవిత పేరు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సమీర్ మహేంద్రుతో పాటు మరో నాలుగు మద్యం సంస్థలపై ఈడీ మంగళవారం ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. తెలంగాణ ఎమ్మెల్సీ కె.కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, శరత్‌చంద్రారెడ్డిలు.. బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిళ్లైలను తమ ప్రతినిధులుగా పేర్కొన్నారని ఈడీ తెలిపింది. ముత్తా గౌతమ్ పేరును ప్రస్తావించింది. కవిత వాడిన పది ఫోన్లను ధ్వంసం చేయడాన్ని కూడా ప్రస్తావించింది. ఎవరి ఖాతాల నుంచి ఎవరెవరి ఖాతాలకు డబ్బులెళ్లాయి అనే వివరాలను కూడా స్పష్టంగా పేర్కొంది. చార్జిషీట్ దాఖలుకు గాను 30 మందిని విచారించినట్లు తెలిపింది. శరత్ చంద్రారెడ్డి చేతుల్లోని ఐదు రిటైల్ జోన్లను అభిషేక్ రావు నడిపిస్తున్నట్టు పేర్కొంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తమ విచారణలో సమీర్ మహేంద్రు చెప్పాడని తెలిపింది. శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్, బుచ్చిబాబులు ఒబెరాయ్ హోటల్లో సమీర్ మహేంద్రును కలిసినట్టు వివరించింది. అనంతరం వారు శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లినట్టు తెలిపింది. ఒబెరాయ్ హోటల్ భేటీలోనూ కవిత! ఇండో స్పిరిట్స్‌కు ఎల్ 1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ అభియోగం మోపింది. ఒబెరాయ్ హోటల్లో జరిగిన సమావేశంలోనూ కవిత, అరుణ్ పిళ్లై, దినేష్ అరోరా, విజయ్ నాయర్లు పాల్గొన్నట్టు పేర్కొంది. సమీర్ మహేంద్రు ఫేస్ టైంలో రెండుసార్లు, ఒకసారి హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా కవితను కలిసినట్టు వివరించింది. ఇండో స్పిరిట్‌లో రామచంద్ర పిళ్లై వెనుక ఉండి నడిపించింది ఎమ్మెల్సీ కవిత అని, ప్రేమ్ రాహుల్.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి తరఫున పనిచేస్తున్నారని వివరించింది. ఇండో స్పిరిట్స్‌లో అసలైన పార్టనర్స్ కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని అభియోగం మోపింది. అరుణ్ పిళ్లైకి రూ.32.26 కోట్ల లాభం అరుణ్పిళ్లై 32.5% వాటా నిమిత్తం పెట్టుబడి రూ.3.4 కోట్లు చెల్లించగా అతనికి 65% లాభంతో రూ.32.26 కోట్లు వచ్చినట్లు ఈడీ తెలిపింది. ప్రేమ్ రాహుల్ రూ.5 కోట్ల పెట్టుబడి పెట్టగా ఎలాంటి లాభం చూపించలేదు. ప్రేమ్ రాహుల్‌ను డమ్మీగా చూపించి 65% వాటాను అరుణ్ పిళ్లై నియంత్రించారని ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ తరఫున సమీర్ మహేంద్రు 35% వాటాగా రూ.5 కోట్ల పెట్టుబడితో 35% లాభం పొందారని తెలిపింది. వీరిపై మనీలాండరింగ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రత్యేక కోర్టును ఈడీ కోరింది. విచారణ జనవరి 5కు వాయిదా సమీర్ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు తెలిపింది. జనవరి ఐదులోగా కౌంటరు దాఖలు చేయాలని సమీర్ మహేంద్రుతో పాటు నాలుగు మద్యం సరఫరా, తయారీ సంస్థలను ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 5కు వాయిదా వేసింది. ఇలావుండగా జ్యుడీషియల్ రిమాండులో ఉన్న సమీర్ బెయిలు పిటిషన్‌పై విచారణ జనవరి 3కు వాయిదా వేసింది. చదవండి: ఎంపీ సంతోష్‌పై ‘ఇండియా ఫోర్బ్స్’ కథనం -
బీజేపీ గోబెల్స్ ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్మరు : మంత్రి హరీష్ రావు
-
కేసీఆర్, కేటీఆర్‌ల అవినీతిపై సీబీఐ, ఈడీ విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అవినీతిపై సీబీఐ, ఈడీలు త్వరలోనే విచారణను ప్రారంభిస్తాయని, వారిని వంద శాతం జైలుకు పంపుతామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ఇప్పటికే స్పష్టమైన విధానం తెలిపిందని, ఒప్పందం మేరకు కొంటామని చెప్పినా ఆందోళన ఎందు కు చేస్తున్నారో టీఆర్ఎస్ ఎంపీలు చెప్పాలని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు రైతులను మభ్యపెడుతున్న కేసీఆర్ ముందు ధర్నా చెయ్యాలని సూచించారు. -
విజయ్ మాల్యా కథ క్లైమాక్స్‌కు..
న్యూఢిల్లీ: లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యా కథ క్లైమాక్స్‌కు చేరింది. బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా బ్రిటన్‌లో న్యాయపరమైన అన్ని అవకాశాలను కోల్పోయారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే మే 14న విజయ్ మాల్యా దాఖలు చేసిన అన్ని పిటిషన్లను యూకే సుప్రీం కోర్టు కొట్టేసిందని అధికారులు తెలిపారు. మాల్యా దేశంలోకి రావడానికి 28 రోజులు పట్టవచ్చని.. మొదటగా అతడిని కస్టడిలోకి తీసుకొని విచారిస్తామని సీబీఐకి చెందిన ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మాల్యా భారత్‌లోకి ప్రవేశించగానే ఏ విధంగా విచారించాలో వ్యూహాలు రచిస్తున్నట్లు సీబీఐ, ఈడీ అధికారులు తెలిపారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడడం, ఎయిర్‌లైన్స్ సంస్థ తరఫున తీసుకున్న సుమారు రూ.9,000 కోట్ల రుణాలను చెల్లించకపోవడంతో.. మాల్యాపై మనీలాండరింగ్, మోసపూరిత అభియోగాలతో భారత దర్యాప్తు సంస్థలు (సీబీఐ, ఈడీ) కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాల్యా భారత్‌లో విచారణను తప్పించుకోవడానికి అన్ని అవకాశాలను కోల్పోయారని యూకే న్యాయ నిపుణులు పేర్కొన్నారు. చదవండి: డబ్బులు తిరిగిస్తా.. తీసుకోండి! -
నీరవ్ కోసం లండన్‌కు ప్రత్యేక బృందం
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ స్కాంలో కీలక నిందితుడు, ఫ్యూజిటివ్ డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ (49)కి చెక్ చెప్పేందుకు కేంద్ర చకా చకా పావులు కదుపుతోంది. గతవారం లండన్‌లో అరెస్టయ్యి రిమాండ్‌లో ఉన్న నీరవ్ మోదీని ఇండియాకు తిరిగి తీసుకొచ్చేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఈ నెల 29న కీలక విచారణ జరగనున్న నేపథ్యంలో అక్కడి అధికారులకు సహకరిచేందుకు సీబీఐ ఈడీ ప్రత్యేక బృందం లండన్ బయలు దేరి వెళ్లనుంది. జాయింట్ డైరెక్టర్‌స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం లండన్ వెళుతోంది. మరోవైపు 13 వేల కోట్ల రూపాయల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టుకు శుక్రవారం (మార్చి29) హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రెండవసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు నీరవ్ సిద్ధమవుతున్నారు అక్కడి కోర్టు వర్గాలు ధృవీకరించాయి. గత వారం మోదీని అరెస్ట్ చేసిన స్కాట్లాండ్ యార్డ్ అధికారులు కోర్టు ముందు హాజరుపర్చగా.. అతని బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించింది. దీంతో మోదీని జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. -
స్పెషల్ మిషన్‌తో చోక్సీకి చెక్?
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణంలో ప్రధాన నిందితులైన వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీని స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఒక ప్రత్యేక మిషన్ ద్వారా గీతాంజలి గ్రూపు అధినేత మెహుల్ చోక్సీని భారత్‌కు రప్పించే పనిలో ఉన్నాయి. ఇందుకోసం ఎయిర్ ఇండియాకు లాంగ్ రేంజ్ బోయింగ్ విమానంలో సీబీఐ, ఈడీ అధికారులు వెస్ట్ ఇండీస్‌కు తరలి వెళ్లనున్నాయని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. అంతేకాదు తిరుగు ప్రయాణంలో యూరప్ నుంచి నీరవ్ మోదీని తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. పీఎన్బీ స్కాంలో కీలక నిందితులైన వజ్రాల వ్యాపారులు, నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీలను తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్రం అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటికే వీరిద్దరి పాస్‌పోర్టులను రద్దు చేయడంతోపాటు ఇంటర్‌పోల్ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే నిందితులిద్దరూ విదేశాలకు చెక్కేశారు. నీరవ్ మోదీ లండన్‌లో తలదాచుకోగా, చోక్సీ వెస్టిండిస్‌లోని ఆంటిగువా అండ్ బార్బుడా దేశ పౌరసత్వం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేసు విచారణకు రాలేనంటూ కుంటి సాకులు చెబుతూ, ఇటీవల కేసులనుంచి తప్పించుకునే ఎత్తుగడలో భాగంగా భారతీయ పౌరసత్వాన్ని కూడా వదులుకున్నట్టు చోక్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నీరవ్‌కు చెందిన రూ.26 కోట్ల ఆస్తుల జప్తు
ముంబై/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.13,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ అధికారులు మళ్లీ సోదాలు నిర్వహించారు. ముంబైలో మోదీకి చెందిన సముద్ర మహల్ లగ్జరీ రెసిడెన్షియల్ ఫ్లాట్లలో ఇప్పటివరకూ రూ.26.4 కోట్ల విలువైన ఆభరణాలు, చేతి గడియారాలు, పెయింటింగ్‌లను జప్తు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఎంఎఫ్ హుస్సేన్, కె.కె.హెబ్బర్ తదితరుల పెయింటింగ్స్ ఉన్నాయి. ఆభరణాల్లో ఓ ఉంగరం విలువే రూ.10 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. -
రూ.10కోట్ల విలువైన రింగ్, వాచీలు..
సాక్షి, ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాంలో ప్రధాన నిందితుడు డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులపై దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ మరోసారి దాడులు నిర్వహించాయి. ఈ సందర్భంగా కళ్లు చెదిరే డైమండ్ ఆభరణాలను, విలువైన వాచీలను, ఎంఎఫ్ హుస్సేన్ సహా ప్రముఖుల పెయింటింగ్స్‌ను అధికారులు సీజ్ చేశారు. తాజా దాడుల్లో రూ.26కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని విలాసవంతమైన నివాస ప్రాంతాల్లో ఒకటైన సముద్ర మహల్లో నీరవ్‌మోదీకి చెందిన భవనాల్లో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించిన సోదాల్లో భారీగా ఆస్తులను సీబీఐ, ఈడీ సీజ్ చేశాయి. 15కోట్ల విలువైన వజ్రాల నగలు, డైమండ్లు పొదిగిన రూ. 1.40కోట్ల వాచీలు, రూ.10కోట్ల విలువైన ఎంఫ్ హుస్సేన్, హెబ్బార్, అమ్రితా షెర్గిల్ ల పెయింటింగ్స్ , ముఖ్యంగా 10కోట్ల రూపాయల విలువైన డైమండ్ రింగ్ ఈ జాబితాలో ఉన్నాయి. కాగా దేశంలో అతపెద్ద బ్యాంకింగ్ స్కాంగా నిలిచిన పీఎన్బీ స్కాంలో కీలక నిందితులుగా నీరవ్ మోదీ,ఆయన మామ, మెహుల్ చోక్సీ తదితరులపై మనీలాండరింగ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఈడీ ఎటాచ్ చేసిన మొత్తం ఆస్తులు విలువ రూ. 7600 కోట్లుగా నిలిచింది. -
‘ఆరు నెలల్లోగా ముగించండి’
సాక్షి, న్యూఢిల్లీ : 2జీ స్పెక్ర్టమ్ కేటాయింపుల కేసులు, ఇతర సంబంధిత కేసుల విచారణను ఆరు నెలల్లోగా పూర్తిచేయాలని సుప్రీం కోర్టు సోమవారం దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను ఆదేశించింది. 2జీ కేసు సహా ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందం వంటి సంబంధిత కేసుల విచారణ పురోగతిని వివరిస్తూ రెండువారాల్లో స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నవీన్ సిన్హాలతో కూడిన సుప్రీం బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది. 2జీ స్పెక్ట్రమ్ వంటి సునిశిత కేసుల్లో విచారణ సుదీర్ఘంగా సాగుతూ ప్రజలకు ఆయా అంశాలపై సమాచారం వెళ్లకపోవడం సరైంది కాదని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. 2014లో 2జీ స్పెక్ర్టమ్ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన సీనియర్ అడ్వకేట్ ఆనంద్ గ్రోవర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. గ్రోవర్ స్ధానంలో ఈ కేసుకు సంబంధించి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నియామకంపై ప్రభుత్వం ప్రతిపాదనకు కోర్టు ఆమోదం తెలిపింది. -
విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగుచూసిన భారీ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుచేయక ముందే నీరవ్ మోదీ భారత్‌ను విడిచి స్విట్జర్లాండ్‌కు పారిపోయినట్టు తెలిసింది. పీఎన్బీలోని ముంబై బ్రాంచులో రూ.11వేల కోట్ల అక్రమాలు చోటుచేసుకున్నాయని బ్యాంకు బుధవారం రెగ్యులేటరీకి రిపోర్టు చేసింది. ఇన్నివేల కోట్ల నగదును విదేశాలకు తరలించినట్టు తేల్చింది. ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రాగానే, బ్యాంకింగ్ రంగం తీవ్ర షాకింగ్‌కు గురైంది. ఈ అక్రమాల్లో బడా వజ్రాల వ్యాపారి, బిలీనియర్ నీరవ్ మోదీ పాత్ర ఉన్నట్టు పీఎన్బీ ఆరోపించింది. ఈయనపై సీబీఐ వద్ద రెండు ఫిర్యాదులు కూడా దాఖలు చేసింది. ఈ కుంభకోణం వెలుగులోకి రాకముందు నీరవ్‌పై రూ.280 కోట్ల చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తుతం పీఎన్బీ కుంభకోణంలో నీరవ్ పాత్ర ఉన్నట్టు ఆరోపిస్తూ, ఆయనకు వ్యతిరేకంగా సీబీఐతో పాటు ఈడీ కూడా మనీ లాండరింగ్ కేసు నమోదుచేసింది. అయితే రూ.5000 కోట్లను తిరిగి బ్యాంకులకు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు నీరవ్ మోదీ చెబుతున్నారు. మరోవైపు నీరవ్ మోదీ, పీఎన్బీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ముంబైలోని నీరవ్ మోదీ దుకాణాల్లో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అంతేకాక దేశవ్యాప్తంగా 21 ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. పీఎన్బీ మాజీ డీజీఎం గోఖుల్ శెట్టికి ఈడీ సమన్లు జారీచేసింది. అంతేకాక ఈ అక్రమాల్లో పాలుపంచుకున్నారనే ఆరోపణలతో 10 మంది బ్యాంకు ఉద్యోగులను పీఎన్బీ నిన్ననే(బుధవారమే) సస్పెండ్ చేసింది. పీఎన్బీతో పాటు యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ ఓవర్సీస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకులు కూడా నీరవ్ మోదీకి రుణాలు ఇచ్చినట్టు తెలిసింది. పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి రాగానే, పలు బడా జువెల్లరీ సంస్థలపై కూడా ఇన్వెస్టిగేషనల్ ఏజెన్సీలు విచారణ చేపడుతున్నాయి. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ కూడా ఈ స్కాంపై విచారణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. బ్యాంకులు, ఇతర లిస్టెడ్ కంపెనీలపై సెబీ దృష్టిసారించింది. భారీ కుంభకోణం నేపథ్యంలో పీఎన్బీ బ్యాంకు షేరు రెండు రోజుల్లో దాదాపు 17 శాతం నష్టపోయింది. ప్రముఖ జువెల్లరీ కంపెనీ షేర్లు కూడా భారీగా పడిపోతున్నాయి. -
లాలూ అక్రమాల చిట్టా : చుక్కలు చూపిస్తున్న ఏజెన్సీలు
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చుక్కలు చూపిస్తున్నాయి. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా తేలుస్తూ సీబీఐ కోర్టు నేడు తీర్పును వెలువరించింది. ఈ దాణా స్కాంకు సంబంధించి ఆర్జేడీ చీఫ్‌కు వ్యతిరేకంగా సీబీఐ కొన్నేళ్ల కిందటే ఐదు కేసులను నమోదుచేసింది. దానిలో మొదటి కేసులో లాలూ దోషిగా తేలడంతో ఐదేళ్ల జైలుశిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించారు. జైలుశిక్ష నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ అప్పట్లో తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అంతేకాక ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా 11 ఏళ్ల పాటు అనర్హత వేటు వేసింది. అనంతరం ఆయన 2013లో బెయిల్‌పై బయటికి వచ్చినప్పటికీ.. ప్రస్తుతం మరోసారి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. నేడు వెలువరిచిన తీర్పులో కూడా లాలూను దోషిగానే తేల్చుతూ సీబీఐ కోర్టు మరోసారి తీర్పునిచ్చింది. ఈ కేసులో జనవరి 3ను తీర్పును వెలువరచనుంది. యూపీఏ-1 ప్రభుత్వం(2004-09)లో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు, బిహార్ ముఖ్యమంత్రిగా(1990-97) ఉన్నప్పుడు లాలూ పలు అక్రమాలకు పాల్పడ్డారు. ఈ అక్రమాలపై పలు కేసులు నమోదుచేసిన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు లాలూ ప్రసాద్ యాదవ్‌కు చుక్కలు చూస్తున్నాయి. అక్రమాస్తుల కేసు 1998లో అక్రమాస్తుల కేసులో లాలూకు వ్యతిరేకంగా కేసు నమోదైంది. ప్రభుత్వ ట్రెజరీ నుంచి రూ.46 లక్షలకు లాలూ తన ఖాతాలోకి వేసుకున్నారని ఆదాయపు పన్ను శాఖ ఆరోపించింది. ఆయన భార్య రబ్రీ దేవికి కూడా దీనిలో పాలు పంచుకున్నారని పేర్కొంది. 2000లో వీరిద్దరూ సీబీఐ కోర్టుకు సరెండర్ అయ్యారు. ఆ సమయంలో రబ్రీదేవి సీఎంగా ఉన్నారు. వెంటనే ఆమెకు బెయిల్ లభించింది. అనంతరం లాలూకి కూడా పాట్న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఐఆర్సీటీసీ కేసు 2006లో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రాంచి, పురి ప్రాంతాల్లోని రైల్వేకు చెందిన హోటళ్ల టెండర్ల విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఏజెన్సీ రిపోర్టులు నివేదించాయి. ఐఆర్సీటీసీ స్కామ్‌గా ఈ కేసు ప్రాచుర్యంలోకి వచ్చింది. 2004లో యూపీఏ ప్రభుత్వం లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వియాదవ్, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్లపై సీబీఐ కేసు కూడా నమోదుచేసింది. మనీలాండరింగ్ కేసు లాలూ కూతురు మిశా భారతి, ఆమె భర్త శైలేష్ కుమార్లపై మనీ లాండరింగ్ కేసు నమోదైంది. వీరికి చెందిన మిస్ మిశాలి ప్రింటర్స్, ప్యాకర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మనీ లాండరింగ్ యాక్ట్ 2002ను ఉల్లంఘించినట్టు ఆరోపణలున్నారు. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తున్నాయి. నేడు దాణా కేసు తీర్పు వెలువడానికి కాస్త ముందుగా లాలూ కూతురు మిశా భారతి, ఆమె భర్తపై మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్‌షీటు కూడా దాఖలు చేసింది. అంతేకాక అంకతముందే వీరిపై ఆదాయపు పన్ను శాఖ బినామి లావాదేవీల చట్టాన్ని ప్రయోగించింది. ఢిల్లీ, పాట్నాలో ఉన్న లాలూ ప్రసాద్ కుటుంబానికి చెందిన 9 కోట్లకు పైగా విలువైన భూములు, ప్లాట్లు, భవంతులను ఆస్తులను ఈ యాక్ట్ కింద అటాచ్ మెంట్ చేస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీచేసింది. తేజ్ ప్రతాప్ 2015 అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా దాఖలు చేసిన అఫిడ్‌విట్‌లో లాలూ కొడుకు తేజ్ ప్రతాప్ తను కలిగి ఉన్న భూమి వివరాలను దాచిపెట్టాడని ఇటీవలే ఆయనపై కూడా కేసు నమోదైంది. 2017 సెప్టెంబర్‌లో బీజేపీ ఎంఎల్సీ నందన్ ప్రసాద్ ఈ కేసు దాఖలు చేశారు. -
సీబీఐ విచారణకు హాజరైన ముకుల్ రాయ్
కోల్‌కతా: శారదా స్కాం కేసులో రైల్వే మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ కార్యదర్శి ముకుల్ రాయ్ శుక్రవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. విచారణలో సీబీఐ పదేపదే అడిగిన ప్రశ్నలకు.. 'నేను ఎలాంటి నేరాలకు పాల్పడలేదు' అని మాత్రమే ఆయన సమాధానం చెప్పినట్లు సమాచారం. బెంగాల్‌కు చెందిన మంత్రి మదన్ మిత్రతో సహా తృణమూల్ పార్టీకి చెందిన నలుగురిపై శారదా స్కాం కేసులో ఆరోపణలు ఉన్నాయి. తృణమూల్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, పార్లమెంటరీ నేతలను సీబీఐ, ఈడీ బృందాలు విచారించాయి. కాగా ముకుల్ రాయ్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రధాన అనుచరుడు.