సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కుంభకోణంలో ప్రధాన నిందితులైన వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీని స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఒక ప్రత్యేక మిషన్ ద్వారా గీతాంజలి గ్రూపు అధినేత మెహుల్ చోక్సీని భారత్‌కు రప్పించే పనిలో ఉన్నాయి. ఇందుకోసం ఎయిర్ ఇండియాకు లాంగ్ రేంజ్ బోయింగ్ విమానంలో సీబీఐ, ఈడీ అధికారులు వెస్ట్ ఇండీస్‌కు తరలి వెళ్లనున్నాయని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. అంతేకాదు తిరుగు ప్రయాణంలో యూరప్ నుంచి నీరవ్ మోదీని తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం.
పీఎన్‌బీ స్కాంలో కీలక నిందితులైన వజ్రాల వ్యాపారులు, నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీలను తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్రం అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటికే వీరిద్దరి పాస్‌పోర్టులను రద్దు చేయడంతోపాటు ఇంటర్‌పోల్ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది.
మరోవైపు పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే నిందితులిద్దరూ విదేశాలకు చెక్కేశారు. నీరవ్ మోదీ లండన్‌లో తలదాచుకోగా, చోక్సీ వెస్టిండిస్‌లోని ఆంటిగువా అండ్ బార్బుడా దేశ పౌరసత్వం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేసు విచారణకు రాలేనంటూ కుంటి సాకులు చెబుతూ, ఇటీవల కేసులనుంచి తప్పించుకునే ఎత్తుగడలో భాగంగా భారతీయ పౌరసత్వాన్ని కూడా వదులుకున్నట్టు చోక్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment