extradition
-
హసీనాను రప్పించడమే ప్రాథమ్యం
ఢాకా: భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆ దేశ ప్రభుత్వం ఉద్ఘాటించింది. హసీనాను విచారించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలం తెలిపారు. ‘‘హసీనా పార్టీ అవామీ లీగ్ భవితవ్యంపై నీడలు కమ్ముకున్నాయి. ఆ పార్టీ దేశ రాజకీయ ముఖచిత్రంలో ఉండాలా, వద్దా అనేది ప్రజలతో పాటు ఇతర పారీ్టలు నిర్ణయిస్తాయి. హత్యలు, అదృశ్యాలు, నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే’’అని నొక్కి చెప్పారు. హసీనా ప్రభుత్వం మానవాళిపై నేరాలకు పాల్పడుతోందంటూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఇచ్చిన నివేదికను ఉదాహరించారు. ఈ నేపథ్యంలో హసీనాను అప్పగించే విషయమై భారత్‌పై ఒత్తిడి పెరిగిందన్నారు. యూనస్‌కు శిక్ష తప్పదు: హసీనా మహమ్మద్ యూనస్ బంగ్లాలో అరాచకాలకు పాల్పడుతున్నారని హసీనా ఆరోపించారు. ‘‘నన్ను అధికారానికి దూరం చేసే కుట్రలో భాగంగానే హత్యలకు పాల్పడ్డారు. అందుకు కారణమైన ‘దుండగుడు’యూనస్‌ను, ఇతరులను బంగ్లా గడ్డపై శిక్షిస్తా’’అని ప్రతినబూనారు. జూలై తిరుగుబాటులో మరణించిన పోలీసుల కుటుంబాలతో ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె వర్చువల్‌గా పాల్గొన్నారు. మృతుల భార్యలతో ముఖాముఖి మాట్లాడారు. యూనస్ వచ్చాక గతంలో ఎన్నడూ లేనంతగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. 2024 తిరుగుబాటు నేపథ్యంలో తన ప్రభుత్వం కుప్పకూలడంతో హసీనా భారత్‌కు పారిపోయి వచ్చి ఆశ్రయం పొందుతుండటం తెలిసిందే. ‘‘విచారణ కమిటీలన్నింటినీ యూనస్ రద్దు చేశారు. ప్రజలను చంపడానికి ఉగ్రవాదులను మధ్యంతర ప్రభుత్వం విడుదల చేసింది. వారు బంగ్లాను నాశనం చేస్తున్నారు. హత్యాయత్నం నుంచి నేను త్రుటిలో తప్పించుకున్నా. ఏదో మంచి చేయడానికే దేవుడు నన్ను బతికించాడని భావిస్తున్నా. నేను బంగ్లా తిరిగొచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తా’’ఆమె ప్రకటించారు. -
రాణాకు మూసుకుపోయిన దారులు.. ఇక భారత్‌కు అప్పగింతే!
వాషింగ్టన్: ముంబయి దాడుల కేసు కీలక నిందితుడైన తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించే విషయంలో ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. రాణా వేసిన రివ్యూ పిటిషన్‌ను అమెరికా సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. భారత్-అమెరికా మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా ఆ దేశ లోయర్ కోర్టు గతంలో ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను సవాల్ చేయడానికి రాణాకు ఇక అవకాశాల్లేకుండా పోయాయి.2008 నవంబర్ 26న ముంబయిలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాణా కీలక నిందితుడిగా ఉన్నాడు. పాకిస్థాన్ మూలాలున్న కెనడియన్ రాణా. ముంబై దాడులకు ఆర్థిక సాయం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతేగాక, ఈ కేసులో ప్రస్తుతం ప్రధాన నిందితుడిగా ఉన్న డేవిడ్ హెడ్లీకి ఇతడు అత్యంత సన్నిహితుడు. అలాగే.. దాడులకు ముందు ముంబయిలో తుది రెక్కీ నిర్వహించింది కూడా తహవూరేనని విచారణలో భాగంగా హెడ్లీ గతంలోనే వెల్లడించాడు. మరో కేసులో ఉగ్రమూకలకు సాయం చేశాడన్న ఆరోపణల కింద గతంలో షికాగో కోర్టు 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. రాణా ప్రస్తుతం లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా, తహవూర్ రాణాను అప్పగించాలని భారత్ చేసిన అభ్యర్థనకు గతంలో అనుకూలంగా కాలిఫోర్నియా జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. భారత్-అమెరికా మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రాణా.. ఫెడరల్ కోర్టులతో సహా పలు పిటిషన్లు వేశాడు. చివరగా.. కిందటి ఏడాది నవంబర్ 13వ తేదీన సుప్రీం కోర్టులో రిట్ ఆఫ్ సెర్షియోరరి దాఖలు చేశాడు. డిసెంబర్ 16వ తేదీన వాదనలు జరిగాయి. కింది కోర్టులు లేదంటే ట్రైబ్యునళ్లు తమ అధికార పరిధిలో ఉండేలా చూడటం ఈ రిట్ ఉద్దేశం. కింది కోర్టులు, ట్రైబ్యునళ్లు వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేయడానికి ఈ రిట్‌ను జారీ చేస్తారు.కాలిఫోర్నియా కోర్టు ఆదేశాలు అమెరికా-భారత్ నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని రెండు రకాలుగా ఉల్లంఘిస్తుందని రాణా తరఫు అటార్నీ వాదనలు వినిపించాడు. ఈ కేసులో ఇప్పటికే రాణాను ఇల్లినాయిస్(చికాగో) కోర్టు నిర్దోషిగా పేర్కొందనే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాడు. అమెరికాలో ఈ కేసుకు సంబంధించి అపరాధిగా తేలినా లేదంటే నిరపరాధిగా నిరూపించినా.. అమెరికా-భారత్ ఒప్పందం ప్రకారం సదరు వ్యక్తిని అప్పగించడం కుదరదని రాణా తరఫు అటార్నీ వాదించాడు.మరోవైపు.. ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ ఎలిజబెత్ ప్రెలోగర్ వాదనలు వినిపించారు. భారత్ అభియోగాలను ఇల్లినాయిస్ పరిగణనలోకి తీసుకుని ఉండకపోవచ్చని, కాబట్టి ఆ దేశానికి అప్పగించే విషయంలో రాణాకు ఎలాంటి ఉపశమనం ఇవ్వకూడదని కోర్టును కోరారామె. అలాగే.. ఈ కేసును ప్రత్యేకమైందిగా పరిగణించాలని ఆమె కోరారు. దీంతో.. రాణా వాదనలను తోసిపుచ్చిన కోర్టు అతడి పిటిషన్ కొట్టేస్తూ జనవరి 21వ తేదీన తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు దానిని తిరస్కరించడంతో.. మళ్లీ రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. ఇప్పుడు దానిని కూడా కోర్టు తోసిపుచ్చింది. దీంతో అతని ముందు దారులు మూసుకుపోయాయి. భారత్‌కు ఇదో విజయంతహవూర్ రాణా అప్పగింతకు అమెరికా సుప్రీం కోర్టు మార్గం సుగమడం చేయడాన్ని.. భారత విజయంగా అభివర్ణించారు సీనియర్ లాయర్ ఉజ్వల్ నికమ్. అమెరికా సుప్రీం కోర్టు అతని వాదనలను, పిటిషన్లను తోసిపుచ్చింది. ట్రంప్ ప్రభుత్వం త్వరలోనే అతన్ని భారత్‌కు అప్పగిస్తుందని ఆశిస్తున్నా అని అన్నారాయన. -
Malaysia PM: సాక్ష్యాధారాలు సమర్పిస్తే జకీర్ నాయక్‌ను అప్పగిస్తాం
న్యూఢిల్లీ: వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్‌ను భారత్‌కు అప్పగించే విషయంలో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం సానుకూలంగా స్పందించారు. అతడిపై వచ్చిన ఆరోపణలపై తగిన ఆధారాలు సమర్పిస్తే భారత్‌కు అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. భారత్‌లో పర్యటిస్తున్న ఇబ్రహీం బుధవారం ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్‌కు వ్యతిరేకంగా మలేషియాలో జకీర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తమ దేశ భద్రతకు జకీర్ వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లనంతవరకు, ఎలాంటి సమస్యలు రానంత వరకు అతడి విషయంలో తాము కలుగజేసుకోబోమని తెలిపారు. అయితే, తగిన సాక్ష్యాధారాలు సమర్పిస్తే చట్టప్రకారం భారత్ అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్పష్టం చేశారు. -
US Court: రాణాను భారత్‌కు అప్పగించవచ్చు
వాషింగ్టన్: 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల కేసులో ప్రధాన నిందితుడైన తహవ్వుర్ హుస్సేన్ రాణా విషయంలో అమెరికా కోర్టులో భారత అనుకూల తీర్పు వెలువడింది. ఆయనను విచారణ నిమిత్తం భారత్‌కు అప్పగించవచ్చని అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు ఆఫ్ అప్పీల్స్ స్పష్టం చేసింది. రాణాను భారత్‌కు అప్పగించేందుకు భారత్, అమెరికా దేశాల మధ్య అమల్లో ఉన్న నేరగాళ్ల అప్పగింత ఒప్పందం అనుమతి ఇస్తోందని తేలి్చచెబుతూ ఈ నెల 15వ తేదీన న్యాయస్తానం తీర్పు వెలువరించింది. ఈ ఒప్పందం కింద తనను భారత్‌కు అప్పగించడం సాధ్యం కాదంటూ రాణా చేసిన వాదనను న్యాయస్తానం తిరస్కరించింది. 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు అమెరికన్ పౌరులు సహా మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయిన∙సంగతి తెలిసిందే. ఈ దాడులకు నిధులు సమకూర్చినట్లు పాకిస్తాన్ జాతీయుడైన తహవ్వుర్ రాణాపై పలు ఆరోపణలున్నాయి. ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారి అయిన లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ముంబై ఉగ్రవాద దాడుల కేసులో రాణా ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెలెస్ జైలులో ఉన్నాడు. రాణాను తమకు అప్పగించాలని భారత దర్యాప్తు సంస్థలు చాలా సంవత్సరాలుగా కోరుతున్నాయి. అయితే, కోర్టు ఆఫ్ అప్పీల్స్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అతడికి వెసులుబాటు ఉందని చెబుతున్నారు. -
పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే
ప్రాగ్: ఖలిస్తానీ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నిన కేసులో భారత్‌కు చెందిన నిందితుడు నిఖిల్‌గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు ప్రాగ్ హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తనను అమెరికాకు అప్పగించవచ్చని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని గుప్తా వేసిన అప్పీల్‌ను హై కోర్టు తోసిపుచ్చింది. పన్నూ హత్యకు కుట్ర పన్నాడని నిఖిల్ గుప్తాపై అమెరికన్ పోలీసులు అభియోగం మోపారు. గతేడాది జూన్‌లో గుప్తాను చెక్ రిపబ్లిక్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే హై కోర్టు ఓకే అన్నంత మాత్రాన గుప్తాను అమెరికాకు అప్పగించడం సులువు కాదని తెలుస్తోంది. పన్నూ కేసులో గుప్తాను అమెరికాకు అప్పగించవచ్చని ప్రాగ్ హై కోర్టు ఇచ్చిన తీర్పును చెక్ రిపబ్లిక్ న్యాయ శాఖ మంత్రి ఆమోదించాల్సి ఉంటుంది. మంత్రి ఎప్పటిలోగా ఆమోదించాలన్నదానిపై కాల పరిమితి ఏమీ లేదు. ఒకవేళ న్యాయ శాఖ మంత్రికి కోర్టు తీర్పుపై ఏమైనా సందేహాలుంటే ఆయన తిరిగి ఈ తీర్పును సమీక్షించాల్సిదిగా సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేసే అవకాశం ఉంది. ఈ తతంగం మొత్తం పూర్తయిన తర్వాతే గుప్తాను అమెరికాకు అప్పగిస్తారు. తీర్పును సుప్రీంకోర్టుకు రిఫర్ చేయాలని న్యాయ శాఖ మంత్రిని కోరతానని గుప్తా తరపు న్యాయవాది చెప్పడం గమనార్హం. ఖలిస్తానీ నేత పన్నూకు అమెరికాతో పాటు కెనడా పౌరసత్వం ఉంది. ఇదీచదవండి.. నిక్కీపై ట్రంప్ అనుచిత పోస్టులు -
Hafiz Saeed extradition: నేరగాళ్ల అప్పగింతకు ఒప్పందమేదీ?: పాక్
ఇస్లామాబాద్: నేరగాళ్ల అప్పగింతకు భారత్‌తో తమకు ద్వైపాక్షిక ఒప్పందమేమీ లేదని పాకిస్తాన్ పేర్కొంది. ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను అప్పగించాల్సిందిగా పాక్‌ను భారత్ కోరడం తెలిసిందే. ఇందుకవసరమైన అన్ని పత్రాలను కూడా పాక్‌కు ఇప్పటికే అందజేసినట్టు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి వెల్లడించారు. సయీద్‌ను అప్పగించాలంటూ భారత్ నుంచి అభ్యర్థన అందిందని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ ధ్రువీకరించారు. అయితే హఫీజ్ అప్పగింతకు వీలు కల్పించే ద్వైపాక్షిక ఒప్పందమేదీ ఇరు దేశాల మధ్య లేదన్నారు. -
భారత్ రిక్వెస్ట్‌కి పాక్ నో!
ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను అప్పగించాలంటూ భారత్ కోరిందని పాకిస్థాన్ నిర్ధారించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. అయితే.. హఫీజ్‌ను అప్పగించేందుకు మాత్రం పొరుగు దేశం పరోక్షంగా నో చెప్పేసింది. ముంబై 26/11 ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగించాలంటూ భారత్ అభ్యర్థించిందని పాకిస్థాన్ చెప్పింది. పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. మనీలాండరింగ్ కేసులో హఫీజ్ సయీద్‌ను అప్పగించాలంటూ భారత అధికారుల నుంచి విజ్ఞప్తి వచ్చిందన్నారు. అయితే.. నేరస్థుల అప్పగింతకు సంబంధించి భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందాలు లేవన్నారు. మరోవైపు ఢిల్లీ వర్గాలు కూడా ఈ తరహా ఒప్పందం ఇస్లామాబాద్‌తో లేదని ధృవీకరించాయి. ఇక.. హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని పాకిస్థాన్ కోరడం నిజమేనని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం నిర్ధారించిన విషయం తెలిసిందే. ఒక కేసులో విచారణ కోసం హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని అభ్యర్థించినట్టు చెప్పారు. కాగా హఫీజ్ సయీద్ భారత్‌లో అనేక కేసులలో వాంటెడ్‌గా ఉన్నాడు. ఐక్యరాజ్య సమితి నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో కూడా అతడి పేరు ఉందన్న విషయం తెలిసిందే. పాక్‌లో మత పెద్దగా చెలామణి అవుతున్న సయీద్‌ను 2019లో అక్కడి ఉగ్రవాద వ్యతిరేక కలాపాల న్యాయస్థానం అరెస్ట్ చేసింది. ఆ టైంలో సయీద్ అతని అనుచరులపై ఏకంగా 23 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. ఇక.. కిందటి ఏడాది ఏప్రిల్‌లో ఉగ్రవాదులకు డబ్బు సాయం అందించిన రెండు కేసులకు సంబంధించి.. యాంటీ-టెర్రరిజం కోర్టు సయీద్‌కు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2008 నాటి భయానక ముంబై ఉగ్రదాడుల్లో ఆరుగురు అమెరికన్లు సహా 166 మంది మృత్యువాత పడ్డారు. అయితే పాక్‌లో సయీద్‌కు లభించే వీఐపీ ట్రీట్మెంట్ చర్చనీయాంశంగా మారింది. సయీద్‌కు అక్కడి ఆర్మీ సంరక్షణలో ఉండడం, అక్కడ రాజకీయ పార్టీలు సైతం సయీద్ ఉగ్ర కార్యకలాపాలను ఖండించకపోవడం చూస్తున్నదే. ఇక.. సయీద్ కొడుకు తల్హా సయీద్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే పాక్ సార్వత్రిక ఎన్నికల్లో లాహోర్ నుంచి పోటీ చేస్తుండడం గమనార్హం. -
ఇంత కథ నడిచిందా!, చోక్సీ భారత్ రాకుండా లంచాలు ఎరచూపుతున్నారా?
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన మెహుల్ చోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఫైనాన్షియల్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్, ప్రముఖ ఎడిటర్ కెన్నెత్ రిజోక్ తెలిపారు. చోక్సీ లంచాల భాగోతంపై కెన్నెత్ రిజోక్ తన బ్లాగ్ (rijock.blogspot)లో ఓ ఆర్టికల్ ను పోస్ట్ చేశారు. ఆ న్యూస్ ఆర్టికల్‌లో కరేబియన్ దేశమైన ఆంటిగ్వాలో ఉంటున్న చోక్సీ భారత్‌కు రాకుండా ఉండేలా ఉన్నతాధికారులకు లంచాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా ఇక్కడ (ఆంటిగ్వాలో) అతనిని అదుపులోకి తీసుకొని భారత్‌కు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్న ఇంటర్‌పోల్ ప్రయత్నాలకు స్థానిక అధికారులు అడ్డుపడుతున్నారని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం : సీనియర్ పోలీస్ అధికారి ఆడోనిస్ హెన్రీ) అంతేకాదు న్యాయ విచారణ ఆలస్యంగా జరిగేలా ఆంటిగ్వా ప్రభుత్వ పెద్దలతో పాటు సీనియర్ పోలీస్ అధికారి ఆడోనిస్ హెన్రీ వంటి అధికారులకు లంచాలు ఇవ్వడం ద్వారా తన అప్పగింతను ఆలస్యం చేస్తున్నట్లు తేల్చారు ఆంటిగ్వాలో వ్యాపారం భారత్‌లో బ్యాంకుల్ని కొల్లగొట్టిన చోక్సీ ఆంటిగ్వాలో పెద్ద ఎత్తున రెస్టారెంట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. చోక్సీకి సొంతమైన జోలీ హార్బర్ రెస్టారెంట్లో హెన్రీని పలు మార్లు కలిసినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. చోక్సీ హెన్నీని కలవడం మాత్రమే కాదని, లంచం ఇచ్చి న్యాయ విచారణ ఆలస్యంగా జరిగేలా మేజిస్ట్రేట్ కాన్లిఫ్ క్లార్క్‌ని సైతం ప్రభావితం చేస్తున్నారని నివేదికలో హైలెట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం : మేజిస్ట్రేట్ కాన్లిఫ్ క్లార్క్) పక్కా ఆధారాలున్నాయి క్లార్క్,హెన్రీలు కుట్రపన్ని ఇంటర్ పోల్ అధికారులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారని, అందుకు తగిన సాక్ష్యాదారాలు తన వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టే చోక్సీని ఇండియాకు తీసుకొని రావడం కష్టతరంగా మారిందన్నారు. కిడ్నాప్ డ్రామా.. విఫలం అంటిగ్వా నుండి క్యూబాకు పారిపోవడానికి చోక్సీ కిడ్నాప్ డ్రామా ఆడి అందులో విఫలమైనట్లు రిజోక్ ఆ కథనంలో వివరించారు. 2021లో క్యూబా - భారత్‌ల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం లేనందున విచారణ నుండి తప్పించుకునేందుకు క్యూబా పారిపోవాలని చోక్సీ భావించాడని నివేదికలో పేర్కొన్నాడు. మే 2021లో స్మగ్లర్ల సాయంతో పారిపోయే ప్రయత్నంలో చోక్సీ .. వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వలేదని, అందుకే వాళ్లు డొమినికాలో వదిలేశారని చెప్పారు. చదవండి👉 బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన ప్రబుద్ధుల్లో ఈయనే నెంబర్ వన్! -
బ్రిటన్ కోర్టులో నీరవ్ మోదీకి షాక్.. త్వరలోనే భారత్‌కు అప్పగింత!
లండన్: రూ.11వేల కోట్ల బ్యాంకు మోసానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి బ్రిటన్ కోర్టులో షాక్ తగిలింది. తనను భారత్‌కు అప్పగించే విషయంపై అక్కడి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు లండన్ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయనకు చట్టపరంగా ఉన్న అన్ని దారులు మూసుకుపోయినట్లు అయింది. ఫలితంగా ఆయనను త్వరలోనే భారత్‌కు తీసుకువచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11 వేల కోట్ల మేర మోసం చేశాడు. ఈ విషయం బయటకు రావడంతో 2018లో దేశం వీడి పారిపోయాడు. 2019లో లండన్‌లో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి అక్కడి జైలులోనే ఉంటున్నాడు. తనను భారత్‌కు అప్పగించొద్దని గతనెలలోనూ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆయన అప్పీల్‌ను రిజెక్ట్ చేసింది. దీంతో చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరుతూ లండన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తాను భారత్‌కు వెళ్తే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయని, మానసికంగా సమస్యలున్నాయని పిటిషన్లో పేర్కొన్నాడు. న్యాయస్థానం వీటిని తోసిపుచ్చి అప్పీల్‌ను రిజెక్ట్ చేసంది. అయితే నీరవ్‌కు ఇంకా ఓ అవకాశం ఉంది. తనను భారత్‌కు అప్పగించే విషయంపై ఐరోపా సమాఖ్య మానవ హక్కుల కోర్టును ఆయన ఆశ్రయించవచ్చు. చదవండి: రష్యాను వణికిస్తున్న ‘ఫ్లూ’ భయం.. ఇప్పటికే అనారోగ్యంతో పుతిన్! బంకర్లోనే -
జూలియన్ అసాంజే అప్పగింత తప్పదా?
సుదీర్ఘ చట్టపర తగాదా తర్వాత, లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు 2022 ఏప్రిల్ 20న, వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేని అమెరికాకు అప్పగించాలని ఉత్తర్వు జారీచేసింది. బ్రిటన్ హోమ్ సెక్రెటరీ ప్రీతి పటేల్ అతన్ని అమెరికాకు అప్పజెప్పడానికి ‘స్టాంప్’ వేసే స్థితికి వచ్చారు. అమెరికాలో అసాంజేపై గూఢచర్య చట్టం కింద విచారణ జరుగుతుంది. గూఢచారికీ, సమాజ సంరక్షకునికీ మధ్య తేడాను ఈ చట్టంలో వివరించలేదు. చరిత్రలో మొదటిసారి ఈ చట్టాన్ని ఒక పాత్రికేయునికి వర్తింపజేశారు. అసాంజే పాత్రికేయుడు కాదని అమెరికా ప్రభుత్వ వకీలు వాదించారు. ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికా పూర్వ కంప్యూటర్ ఇంటెలిజెన్స్ కన్సల్టెంట్. అమెరికా ప్రభుత్వం సొంత ప్రజల ఫోన్ కాల్స్, అంతర్జాల చర్యలు, వెబ్ కెమెరాలపై నిఘాను నిరూపించే రహస్య పత్రాలను బయట పెట్టారు. ఆయన మీద కూడా గూఢచర్య చట్టం కింద కేసు పెట్టారు. ‘‘అమెరికా న్యాయ శాఖ పాత్రికేయతపై యుద్ధం చేస్తోంది. ఈ కేసు అసాంజేపై కాదు, మీడియా భవిష్యత్తును నిర్ణయించేది’’ అని వ్యాఖ్యానిస్తూ పాత్రికేయునిపై ఈ చట్ట వర్తింపును స్నోడెన్ ఖండించారు. అసాంజేను వాక్ స్వాతంత్య్ర విజేతగా ఒకప్పుడు ప్రధాన స్రవంతి మీడియా ప్రశంసించింది. 2010లో ఆయన అమెరికా కుట్రల రహస్య సమాచారం బయట పెట్టగానే అదే మీడియా అసాంజేను వదిలేసింది. అసాంజే ఈ కోర్టు నిర్ణయాన్ని అప్పీల్ చేయగలిగినా, కోర్టులో నెగ్గే అవకాశం చాలా తక్కువ. అసాంజే ఆస్ట్రేలియా దేశానికి చెందిన సంపాదకుడు, ప్రచురణకర్త, సామాజిక కార్యకర్త. ఆస్ట్రేలియా అప్రజాస్వామిక ఆగడాలను భరించలేక పారదర్శక సమాజం ఉన్న స్వీడెన్‌లో స్థిరపడ్డారు. 2006లో వికీలీక్స్ స్థాపించాడు. 2010లో వికీలీక్స్ అమెరికా కుతంత్రాల రహస్య సమాచారాన్ని బహిర్గతం చేసింది. వర్గీకరించిన వరుస దస్త్రాలనూ, దౌత్య సంబంధ తంత్రీ సమాచారాన్నీ పెద్ద మొత్తంలో ప్రచురించిన తర్వాత అమెరికా అసాంజేపై 18 నేరాలు మోపింది. ఇవి రుజువయితే వందేండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అమెరికా ఇద్దరు స్వీడెన్ సెక్స్‌వర్కర్లతో అసాంజేపై అసమంజస అత్యాచార కేసులు పెట్టించింది. ఆ కేసుతో సహా గూఢచర్య విచారణను ఎత్తేయాలని స్వీడెన్ 2012లో నిర్ణయించి, 2017లో ఎత్తేసింది. స్వీడెన్ పార్లమెంటులో మితవాదం బలపడిన తర్వాత అసాంజేపై ఎత్తేసిన కేసులను 2019 మేలో తిరగదోడింది. కానీ నవంబర్‌లో విచారణను ఆపేసింది. అసాంజే 12 ఏళ్ల నుండి నిర్బంధంలో ఉన్నారు. ఆయనకు ఆరేళ్ళ క్రితం లండన్‌లోని ఈక్వడోరియన్ రాయబార కార్యాలయంలో ఆశ్రయ మిచ్చారు. అప్పటి నుండి జైలు జీవితం అనుభవిస్తు న్నారు. బయటికి పోతే లండన్ పోలీసులు అరెస్టు చేసి అమెరికాకు అప్పజెపుతారని భయం. ఈక్వడార్ అధ్యక్షుడు లెనిన్ మోరెనో అసాంజేను అప్పజెప్పి అమెరికాను సంతోషపెట్టాలని నిర్ణయించినప్పటి నుండి ఆయన కష్టాలు పెరిగాయి. 12 ఏళ్ళు దాటినా అమెరికా అసాంజేను కంటిలో ముల్లుగా, పక్కలో బల్లెంలా చూస్తోంది. తమ రహస్య సమాచారాన్ని బయటపెట్టి తమ దేశం పరువు పోగొట్టాడని భావిస్తోంది. (క్లిక్: అసమ్మతి గళాలపై అసహనం) అసాంజే వికీలీక్స్ ఘటన తర్వాత అమెరికాను ముగ్గురు అధ్యక్షులు పాలించారు. దేశంలో వాక్ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ‘రక్షణల’ నిజ స్వరూపం తెలిసింది. అమెరికా అంతర్జాతీయ సమాజ నియమాలు, అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి, మానవ హక్కుల హననానికి పాల్పడుతున్న వైనాన్ని బయటపెట్టే ఎవరినైనా యునైటెడ్ కింగ్డమ్ వంటి తన సన్నిహిత దేశాల సహాయంతో జైలులో పెట్టవచ్చని అమెరికా భావిస్తోంది. తన స్వేచ్ఛా ముఖాన్ని ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించడానికే వాడుకుంటోంది. (క్లిక్: రెండూ సామాజిక విప్లవ సిద్ధాంతాలే!) - సంగిరెడ్డి హనుమంత రెడ్డి వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
ఆర్థిక నేరగాళ్లను అప్పగించాలి
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నేరస్థులను రప్పించి చట్టం ముందు నిలబెట్టడం తమకు అత్యంత ప్రాధాన్యాంశమని ఇంగ్లండ్‌కు భారత్ స్పష్టం చేసింది. దీన్ని తాను అర్థం చేసుకున్నానని భారత పర్యటనలో ఉన్న ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. భారత చట్టాలను తప్పించుకునేందుకు తమ న్యాయవ్యవస్థను వాడుకోవాలనుకునే నేరగాళ్లను ఎన్నటికీ స్వాగతించబోమని స్పష్టం చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడి ఇంగ్లండ్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని చాలారోజులుగా భారత్ ఒత్తిడి తెస్తోంది. శుక్రవారం ప్రధాని మోదీతో చర్చల అనంతరం ఉమ్మడి మీడియా సమావేశంలో జాన్సన్ మాట్లాడారు. ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్పారు. న్యాయపరమైన కారణాల వల్ల ఈ ప్రక్రియ క్లిష్టంగా మారిందని వివరించారు. మోదీ, జాన్సన్ చర్చల్లో ఆర్థిక నేరగాళ్ల అప్పగింత అంశం ప్రస్తావనకు వచ్చిందని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా చెప్పారు. ఈ విషయంలో భారత్ వైఖరిని జాన్సన్‌కు మోదీ వివరించారని చెప్పారు. దీనిపై జాన్సన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఉగ్ర మూకలను సహించం ఇంగ్లండ్ వేదికగా ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకునే ఉగ్ర మూకలను సహించబోమని బోరిస్ హెచ్చరించారు. బ్రిటన్‌లో ఖలిస్తాన్ మద్దతుదారులు ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయం ప్రధానుల చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని ష్రింగ్లా చెప్పారు. దీనిపై భారత్ ఆందోళనను బోరిస్ అర్ధం చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి గ్రూపులను ఎదుర్కొనేందుకు సంయుక్త ంగా ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఉక్రెయిన్ సంక్షోభంపై నేతలు చర్చించారన్నారు. అక్కడ సత్వరమే శాంతి నెలకొనాలని మోదీ ఆకాంక్షించారని చెప్పారు. రష్యాపై ఆంక్షల విషయంలో భారత్‌పై యూకే ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదన్నారు. కీవ్‌లో వచ్చేవారం తమ రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభిస్తామని బోరిస్ వెల్లడించారు. అఫ్గాన్‌లో శాంతి స్థాపన జరగాలని ఇరువురు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్–ఇంగ్లండ్ బంధం.. అత్యంత పటిష్టం భారత్, ఇంగ్లండ్ మధ్య అన్ని విషయాల్లోనూ బంధం ముందెన్నడూ లేనంత బలోపేతంగా మారిందని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో శుక్రవారం ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రక్షణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు అంగీకరించారు. దీపావళి నాటికి రెండుదేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని నిర్ణయించారు. 2030 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం రెట్టింపవుతుందని, వినిమయ వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. ఎఫ్‌టీఏలోని 26 అంశాల్లో నాలుగింటిపై గతంలో జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరిందని, మిగతా వాటిపై పురోగతి కనిపించిందని అధికారులు తెలిపారు. ఇండియాకు ఒజీఈఎల్ (ఓపెన్ జనరల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్) ఇస్తామని, దాంతో రక్షణ రంగ వాణిజ్యానికి అడ్డంకులు తొలగుతాయని జాన్సన్ చెప్పారు. భూ, జల, వాయు, సైబర్ మార్గాల్లో సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయించామన్నారు. నూతన ఫైటర్ జెట్ టెక్నాలజీని భారత్‌తో పంచుకుంటామన్నారు. చర్చల్లో మంచి పురోగతి కనిపించిందని మోదీ చెప్పారు. రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి యూకే సాయం చేస్తుందన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛపై యూకే ఆరంభించిన ఐపీఓఐని స్వాగతించారు. విద్య, వైద్యం, పునర్వినియోగ ఇంధనం తదితర అంశాలపై కీలక ఒప్పందాలు కుదిరాయి. సచిన్, అమితాబ్‌లా ఫీలవుతున్నా: జాన్సన్ భారత్‌లో తనకు అత్యంత ఆదరణపూర్వక స్వాగతం లభించిందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతోషం వ్యక్తం చేశా రు. ప్రధాని నరేంద్ర మోదీని తన ఖాస్ దోస్త్ (బెస్ట్ ఫ్రెండ్)గా అభివర్ణించారు. పలుమార్లు నరేంద్ర అని ప్రస్తావిస్తూ తమ సాన్నిహిత్యాన్ని తెలియజేశారు. బ్రిటీష్ ఇండియన్లలో దాదాపు సగంమందికి పుట్టిల్లైన గుజరాత్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ తనకు లభించిన ఆదరణ చూస్తే సచిన్ టెండూల్కర్‌లాగా ఫీలవుతున్నానని, ఎక్కడచూసినా అమితాబ్ బచ్చన్ లాగా తన పోస్టర్లే కనిపిస్తున్నా యని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని పురాతన ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య బంధం ఎంతో కీలకమన్నారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ వద్ద జాన్సన్‌కు ఘనంగా గార్డ్ ఆఫ్ ఆనర్ స్వాగతం లభించింది. నా భుజానికున్నది భారతీయ టీకానే! తనతో సహా వందకోట్లమందికి పైగా ప్రజలకు భారత్ కోవిడ్ టీకా అందించిందని బోరిస్ ప్రశంసించారు. ‘ నా భుజానికున్నది ఇండియన్ టీకా, అది నాకు ఎంతో మేలు చేసింది. భారత్‌కు కృతజ్ఞతలు’ అని వ్యాఖ్యానించారు. మోదీ ఆశించినట్లు ప్రపంచానికి ఔషధ కేంద్రంగా భారత్ మారిందని కొనియాడారు. ఆస్ట్రాజెనెకా, సీరమ్ సహకారంతో కోవిడ్ టీకా రూపొందించడాన్ని ప్రస్తావించారు. -
లండన్ కోర్టు సంచలన తీర్పు: మాల్యాకు భారీ షాక్!
లండన్: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు భారీ షాక్ తగిలింది. మాల్యా అప్పగింత కేసును సోమవారం విచారించిన లండన్ హైకోర్టు విజయ్ మాల్యా దివాలా తీసినట్లు ప్రకటించింది. ఈ ఉత్తర్వుతో మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. ఈ మేరకు లండన్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఏడాది ప్రారంభంలో, భారతదేశంలో మాల్యా ఆస్తులపై సెక్యూరిటీని వదులుకునేందుకు అనుకూలంగా వారి దివాలా పిటిషన్‌ను సవరించాలని ఎస్బిఐ నేతృత్వంలోని రుణదాత కన్సార్టియం ఇచ్చిన దరఖాస్తును యుకే కోర్టు సమర్థించింది. ఈ మేరకు లండన్ హైకోర్టు చీఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్ట్ (ఐసిసి) న్యాయమూర్తి మైఖేల్ బ్రిగ్స్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చారు. దీంతో గతకొన్నాళ్లుగా మ్యాలాపై సుదీర్ఘం పోరాటం చేస్తున్న భారత బ్యాంకులకు భారీ విజయం లభించినట్టైంది. అయితే దీనిపై మాల్యా అప్పీల్‌కు వెళ్లే అవకాశాలను కూడా కోర్టు తోసిపుచ్చింది. దివాలా ఉత్తర్వుకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి అనుమతి కోరుతూ మాల్యా దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయమూర్తి బ్రిగ్స్ నిరాకరించారు. ఇటీవల భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్షియంకు అనుకూలంగా తీర్పునిచ్చిన లండన్ హైకోర్టు తాజాగా మాల్యా దివాలా తీసినట్టుగా ప్రకటించడం గమనార్హం. కాగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు మంజూరు చేసిన 9వేల కోట్ల రూపాయల రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసినట్లు 13 భారతీయ బ్యాంకుల కన్సార్టియం ఆయనపై ఆరోపణలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యం..
లండన్: బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని భారత్‌కు అప్పగించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న వేళ.. లండన్ కోర్టులో అప్పీల్‌కు వెళ్లిన అతను సంచలన వ్యాఖ్యలతో మరో డ్రామాకు తెరలేపాడు. తనను భారత్‌కు అప్పగించొద్దని కోర్టుకు మెరపెట్టిన నీరవ్.. భారత్‌కు అప్పగిస్తే తనకు ఆత్మహత్యే శరణ్యమని వ్యాఖ్యానించాడు. కాగా, ఇదే కేసుకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే నీరవ్‌కు లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు అప్పీల్‌కు లండన్ కోర్టు తిరస్కరించింది. ఫలితంగా అతన్ని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇదిలా ఉంటే, బ్యాంకులకు రూ.13వేల 700 కోట్ల రూపాయల మేర ఎగనామం పెట్టి విదేశాల్లో తల దాచుకుంటున్న నీరవ్ మోదీ.. ఆర్థిక నేరాల్లో నిందితుడు కావడంతో అతన్ని భారత్‌కు అప్పగించాలని లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరిలో ఆదేశాలిచ్చింది. భారత్‌లో మనీల్యాండరింగ్, నమ్మకద్రోహం వంటి నేరారోపణలను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. కానీ, ఇప్పుడు కోర్టును ఆశ్రయించిన నీరవ్ మోదీ.. సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
మిషన్ చోక్సీ: కీలక మహిళ ఎవరంటే?
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ కుంభకోణంలో కీలక నిందితుడు ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని స్వదేశానికి రప్పించేందుకు మల్టీ-ఏజెన్సీ బృందం డొమినికాకు చేరుకుంది. "మిషన్ చోక్సీ" పేరుతో ఏర్పాటైన ఎనిమిది మంది సభ్యుల ఈ బృందానికి సీబీఐ అధికారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న శారదా రౌత్ నేతృత్వం వహించడం విశేషంగా నిలిచింది. సీబీఐ, ఈడీ , సీఆర్పీఎఫ్ సభ్యులు ఈ బృందంలో భాగమని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సీబీఐ బ్యాంకింగ్ మోసాలను విచారించే విభాగం చీఫ్ ముంబైకి చెందిన శారదా రౌత్ నేతృత్వంలోని ఈ బృందం రేపు (జూన్ రెండు) చోక్సీపై జరిగే కోర్టు విచారణకు హాజరవుతుంది. అక్కడ రాజకీయంగా దుమారాన్ని రేపిన ఈ కేసులో డొమినికన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సహాయం చేయనుంది. అన్ని ప్లాన్ ప్రకారం జరిగితే ఒక ప్రయివేట్ విమానం ద్వారా ఈ బృందం చోక్సీని వెనక్కి తీసుకురానుందని సమాచారం. డిల్లీలో విమానాశ్రయంలో అడుగుపెట్టిన మరుక్షణమే చోక్సీని అదుపులోకి తీసుకునేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. సీబీఐ అధికారి శారదా రౌత్ (ఫైల్ ఫోటో) ఇది ఇలాఉంటే అందరూ భావిస్తున్నట్టుగా మే 25 న కాకుండా మే 23నే మెహు్‌ల్ చోక్సీ డొమినికాకు చేరుకున్నాడని ఆంటిగ్వా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అవుట్ బౌండ్ క్లియరెన్స్ పత్రం ద్వారా తెలుస్తోంది. సెయింట్ లూసియా ఆధారిత పడవ 'కాలియోప్ ఆఫ్ ఆర్నే' ద్వారా డొమినికాలో అడుగుపెట్టాడు. అక్కడినుంచి భారత్‌తో నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలు లేని క్యూబాకు చెక్కెయ్యాలని ప్రయత్నించి చోక్సీ చివరికి బుక్కయి పోయాడు. కాగా నకిలీ పత్రాలు, పీఎన్బీ అధికారులతో కుమ్మక్కై వేలకోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడిన కేసులో డైమండ్ కింగ్ నీరవ్ మోదీ, అతని మేనమామ మెహెల్ చోక్సీ కీలక నిందితులుగా ఉన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్ద కుంభకోణంగాఈ స్కాం వెలుగులోకి వచ్చిన తరువాత ఆంటిగ్వాకు పారిపోయి అక్కడి పౌరసత్వాన్ని అనుభవిస్తున్న మెహుల్ చోక్సీ ఇటీవల క్యూబాకు పారిపోతూ డొమినికాలో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డొమినికా పౌరసత్వంలేని చోక్సీని నేరుగా భారత్‌కు అప్పగించవచ్చని ఆంటిగ్వా ప్రకటించింది. చోక్సీ భారతదేశానికి తిరిగి వెళ్లాల్సిందే..అక్కడ నేరారోపణల విచారణను ఎదుర్కోవలసిందే అని ఆంటిగ్వా అండ్ బార్బుడా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ తేల్చి చెప్పారు. అలాగే చట్టవిరుద్ధంగా తమ దేశంలోకి ప్రవేశించినందుకు చోక్సిని అదుపులోకి తీసుకోవాలని డొమినికన్ ప్రభుత్వాన్ని బ్రౌన్ కోరినట్లు ఆంటిగ్వా మీడియా వెల్లడించింది. మరోవైపు చోక్సీ భారత పౌరుడు కాదు కాబట్టి, చట్టబద్దంగా భారతదేశానికి తరలించలేరని చోక్సీ న్యాయవాది వాదిస్తున్నారు. అంతేకాదు కొన్ని రాజకీయ కారణాల రీత్యా బలవంతంగా డొమినికాకు చోక్సీని తీసుకెళ్లారని కూడా ఆరోపించారు. అటు చోక్సీ వ్యవహారం డొమినికాలో రాజకీయ వివాదానికి దారి తీసింది. అంతర్జాతీయంగా తమ ప్రతిష్ట దెబ్బదింటోందంటూ డొమినికా ప్రతిపక్ష నాయకుడు లెన్నాక్స్ లింటన్ ప్రధానమంత్రి రూజ్వెల్ట్ స్కెర్రిట్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చదవండి : Mehul Choksi: గర్ల్‌ఫ్రెండ్‌తో డిన్నర్‌కు వెళ్లి చిక్కాడు కరోనా విలయం: కోటి ఉద్యోగాలు గల్లంతు -
భారత్‌కు నీరవ్ మోదీ అప్పగింత!
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు రూ.13,000 కోట్ల మేర మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(50)ని భారత్‌కు రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమయ్యింది. అతడిని భారత్‌కు అప్పగించేందుకు యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అప్పగింత ఉత్తర్వుపై యునైటెడ్ కింగ్డమ్ హోంశాఖ మంత్రి(సెక్రెటరీ) ప్రీతి పటేల్ సంతకం చేసినట్లు యూకేలోని భారత రాయబార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణాలకు సంబంధించి మోసం, మనీలాండరింగ్ కేసులు నీరవ్ మోదీపై నమోదయ్యాయి. ఆయన ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నారు. హోంశాఖ సెక్రెటరీ జారీ చేసిన తాజా ఉత్తర్వుకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరడానికి నీరవ్ మోదీకి 14 రోజుల గడువు ఇచ్చారు. ఆధారాల పట్ల కోర్టు సంతృప్తి నీరవ్ మోదీ తన మామ మెహుల్ చోక్సీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించినట్లు ఇండియాలో కేసులు నమోదయ్యాయని, అతడు ఇండియాలోని న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవాలని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరి 25న స్పష్టం చేసింది. నీరవ్‌పై నమోదైన కేసుల విషయంలో ఇండియాలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగదనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. నీరవ్‌ను భారత్ అప్పగించే విషయంలో నిర్ణయాన్ని హోంశాఖకు వదిలేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఇండియాలో అయితే సరైన వైద్యం అందదన్న నీరవ్ వాదనను న్యాయస్థానం కొట్టిపారేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ నిందితుడని చెప్పేందుకు ఉన్న ఆధారాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. మనీ లాండరింగ్, సాక్షులను బెదిరించడం, ఆధారాలను మాయం చేయడం తదితర అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన కేసుల్లో నీరవ్ మోదీ నిందితుడని స్పష్టంగా బయటపడుతోందని గుర్తుచేసింది. అందుకే బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తెలియజేసింది. యూకే అప్పగింత చట్టం–2003 ప్రకారం.. న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని హోంశాఖ సెక్రెటరీకి తెలియజేస్తారు. ఇండియా–యూకే మధ్య కుదిరిన నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని పర్యవేక్షించే అధికారం ఉన్న యూకే కేబినెట్ మంత్రి దీనిపై రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిప్రకారమే నీరవ్ మోదీ అప్పగింతకు హోంశాఖ మంత్రి ప్రీతి సుముఖత వ్యక్తం చేశారు. అప్పగింత ఎప్పుడు? నీరవ్ మోదీని వాండ్స్‌వర్త్ జైలు నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ కారాగారంలో ఉన్న 12వ నంబర్ బ్యారక్‌కు తరలించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. యూకే హోంమంత్రి ఉత్తర్వులను సవాలు చేస్తూ లండన్ హైకోర్టును ఆశ్రయించేందుకు నీరవ్ మోదీకి అవకాశం కల్పించారు. ఆయన ఒకవేళ హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడే మరికొంత కాలం విచారణ జరుగనుంది. యూకే సుప్రీంకోర్టులో కూడా నీరవ్‌మోదీ అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుందని సమాచారం. అయితే, లండన్ హైకోర్టు అనుమతిస్తేనే అది సాధ్యమవుతుంది. తాజా పరిణామాలపై నీరవ్ మోదీ లీగల్ టీమ్ ఇంకా స్పందించలేదు. హైకోర్టుకు వెళ్తారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. యూకేలో అన్ని దారులు మూసుకుపోయిన తర్వాతే నీరవ్ మోదీ భారత్‌కు చేరుకుంటారు. అసలేమిటి కేసు? నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు మరికొందరు లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్‌ను (ఎల్ఓయూ) దుర్వినియోగం చేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ 2018 జనవరి 31న నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు ఇతరులపై కేసు నమోదు చేసింది. ఎల్ఓయూ అంటే తమ ఖాతాదారులకు విదేశాల్లోని తమ బ్యాంకుశాఖల నుంచి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జారీ చేసే గ్యారంటీ పత్రం. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన ఎల్‌ఓయూతో నీరవ్ మోదీ ముఠా వివిధ కంపెనీల పేరిట విదేశాల్లోని పీఎన్బీ బ్యాంక్ శాఖల నుంచి రూ.13,000 కోట్లకుపైగా రుణాలుగా తీసుకొని, తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఈ కేసులో సీబీఐ 2018 మే 14న నీరవ్‌తోసహా మొత్తం 25 మంది నిందితులపై మొదటి చార్జిసీట్ కోర్టులో దాఖలు చేసింది. 2019 డిసెంబర్ 20న 30 మందిపై రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. మొదటి చార్జిషీట్లో ఉన్నవారంతా రెండో చార్జిషీట్లోనూ ఉన్నారు. బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును నీరవ్ మోదీ ముఠా దుబాయ్, హాంకాంగ్‌లోని తమ డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ముత్యాల ఎగుమతి, దిగుమతుల పేరిట ఈ సొమ్మును దారిమళ్లించారు. నీరవ్ మోదీ 2018 జనవరి 1న ఇండియా నుంచి తప్పించుకున్నాడు. ట్రయల్ కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2018 జూన్‌లో ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. 2019 మార్చిలో యూకే పోలీసులు నీరవ్ మోదీని లండన్‌లో అరెస్టు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ అతడు పలుమార్లు దాఖలు చేసిన పిటిషన్లను వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు, లండన్ హైకోర్టు కొట్టివేశాయి. నీరవ్ మోదీని తమకు అప్పగించాలంటూ భారత ప్రభుత్వం యూకేను అభ్యర్థించింది. -
మాల్యా, మోదీ, మెహుల్‌కు నిర్మలాజీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: కోట్లాది రూపాయల బ్యాంకింగ్ కుంభకోణాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు చట్టపరమైన చర్యలను ఎదుర్కొనడానికి భారత్‌కు రప్పిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ గురువారం స్పష్టం చేశారు. బీమా సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో భాగంగా అడిగిన ఒక ప్రశ్నకు ఆమె ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి బ్యాంకింగ్‌ను దాదాపు రూ.9000 కోట్ల మేర మోసం చేసి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్‌మాల్యాను ఆ దేశం నుంచి రప్పించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. 2016 నుంచీ ఆయన బ్రిటన్‌లో ఉంటున్నారు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో దాదాపు రూ.14,500 కోట్లకుపైగా రుణ మోసం కేసులో ప్రధాన నిందితుడైన 49 సంవత్సరాల నీరవ్ మోదీ లండన్ పారిపోయారు. అయితే ఈడీ, సీబీఐ విజ్ఞప్తి మేరకు ఆయనను 2019లో అక్కడి అధికారులు తమ అదుపులోనికి తీసుకున్నారు. ఆయనను భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేసులో మరో నిందితుడు చోక్సీ, నీరవ్ మోదీకి మేనమామ. చోక్సీ భారత్ నుంచి పారిపోయి ఆంటిగ్వా అండ్ బార్బుడాలో ఉంటున్నట్లు సమాచారం. ఇప్పటికే మోదీ, చోక్సీలకు చెందిన దాదాపు రూ.2,600 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసిన సంగతి విదితమే. బీమాలో ఎఫ్‌డీఐలు 74 శాతానికి: రాజ్యసభలో బిల్లు ఆమోదం కాగా బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభ గురువారం మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఈ పరిమితి 49 శాతంగా ఉంది. బీమా (సవరణ) బిల్లు, 2021పై జరిగిన చర్చకు ఆర్థికమంత్రి సమాధానం ఇస్తూ, దేశంలోకి బీమా రంగం సేవలు మారుమూలకు విస్తరించడానికి ఈ చొరవ దోహదపడుతుందని తెలిపారు. సంబంధిత వర్గాలతో బీమా రంగం రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ సమగ్ర చర్చల అనంతరమే ఈ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. 2015లో అప్పటికి 26 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచడం జరిగింది. జీవిత బీమా సేవలు దేశంలో మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నది నిపుణుల అభిప్రాయం. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో జీవిత బీమా ప్రీమియం ప్రస్తుతం 3.6 శాతంగా ఉంది. అంతర్జాతీయగా చూస్తే దీని సగటు 7.13 శాతం. ఇక జనరల్ ఇన్సూరెన్స్ చూస్తే, ప్రపంచ సగటు 2.88 శాతంకాగా, భారత్ జీడీపీలో కేవలం 0.94 శాతం. 2015లో 49 శాతానికి పరిమితులు పెంచిన తర్వాత దేశీయ బీమా రంగంలోకి వచి్చన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమాణం రూ.26,000 కోట్లని ఆర్థికమంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశంలో బీమా కంపెనీలు ద్రవ్యపరమైన (లిక్విడిటీ) ఒత్తిడులను ఎదుర్కొంటున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి తాజా నిర్ణయం దోహదపడుతుందన్నారు. -
వికీలీక్స్ ఫౌండర్‌కు భారీ ఊరట
లండన్ : గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికిలీస్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె కేసులో అమెరికాకు ఎదురు దెబ్బ తగిలింది. అసాంజెనే అమెరికాకు అప్పగించే విషయమై బ్రిటన్ కోర్టు ప్రతికూలంగా స్పందించింది. అసాంజేను అమెరికాకు అప్పగించలేమని సోమవారం తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి వెనెస్సా బరైట్సర్ సోమవారం తన తీర్పును ప్రకటించారు. క్లినికల్ డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్న వ్యక్తిగా అసాంజె ఆత్మహత్య చేసుకునే ప్రమాదం గణనీయంగా ఉందని తాను నమ్ముతున్నానని, అందుకే అతన్ని అప్పగించలేమని ఆమె వ్యాఖ్యానించారు. తాజా తీర్పుతో అసాంజే అభిమానులు భారీ సంబరాల్లో మునిగిపోయారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా హక్కుల సంఘాలు, జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశాయి. అయితే అమెరికాపై దీనిపై తిరిగి అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉందని, దీంతో అసాంజే జైల్లోనే ఉండే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఫ్రీడం ఆఫ్ ది ప్రెస్ ఫౌండేషన్ ట్వీట్ చేసింది. మరోవైపు న్యాయమూర్తి తీర్పును స్వాగతించిన పరిశోధనాత్మక పాత్రికేయుడు స్టెఫానియా మౌరిజి స్వేచ్ఛా ప్రసంగం, జర్నలిజానికి మించి అసాంజే పనిచేశాడన్న అమెరికా వాదనలపై న్యాయమూర్తి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా 2010-11లో అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన కీలక సమాచారం, రహస్య పత్రాలను వికిలీక్స్ బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఇరాక్, అఫ్ఘనిస్థాన్ దేశాల్లో అమెరికా యుద్ధనేరాలకు పాల్పడిందని వికీలీక్స్ ఆధారాలతో బయటపెట్టడం ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు రేపింది. ఈ కేసులో అసాంజె దోషిగా తేలినట్టయితే ఆయనకు 175 ఏండ్ల జైలుశిక్ష విధించే అవకాశముందని భావించారు. -
మాల్యా అప్పగింతలో అడ్డంకులు ఏమిటి?
న్యూఢిల్లీ: బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను ఆ దేశం తిరిగి భారత్‌కు అప్పగించడంలో అడ్డంకులు ఏమిటని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. అలాగే ఇందుకు సంబంధించి కేంద్రం పేర్కొంటున్న ‘పెండింగు లో ఉన్న రహస్య న్యాయ ప్రక్రియ’ అంశాలను తెలియజేయాలనీ ఆదేశించింది. ఆయా అంశాల యథాతథ పరిస్థితిపై ఒక నివేదికను సమర్పి ంచాలని కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. ఇందుకు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ అశోక్‌భూషణ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం కేంద్రానికి ఆరు వారాల గడువు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది. మాల్యా అప్పగింతకు సంబంధించి పూర్వాపరాల్లోకి వెళితే... ► విజయమాల్యా 2016 మార్చిలో బ్రిటన్‌కు పారిపోయారు ► 2017లో ఏప్రిల్ 18న అప్పగింత వారెంట్‌పై ఆయనను అరెస్ట్ చేయగా, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. ► 2018 డిసెంబర్లో చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టు అప్పగింతకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ► దీన్ని 2020 ఏప్రిల్‌లో బ్రిటన్ హైకోర్టు సమర్థించింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకూ అనుమతి ఇవ్వలేదు. అప్పీల్‌కు అనుమతించాలన్న మాల్యా పిటిషన్‌ను మే 14వ తేదీన కొట్టివేసింది. సాధారణ ప్రజా ప్రాముఖ్యత కోణంలో సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చన్న న్యాయపరమైన అంశాన్ని ధ్రువీకరించేందుకు తిరస్కరిస్తున్నట్లు లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ ధర్మాసనం తేదీన స్పష్టం చేసింది. యూకే ఎక్సŠట్రాడిషన్ యాక్ట్ 2003 చట్టంలోని సెక్షన్ 36, సెక్షన్ 116 కింద అప్పగింత ప్రక్రియను నిర్దేశించిన 28 రోజుల్లోపు పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. ► అయితే ఆయన అప్పగింతకు ముందు కొన్ని చట్టపరమైన అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. దీనికి ఎంతకాలం పడుతుందన్నది చెప్పలేమని బ్రిటన్ హై కమిషన్ ప్రతినిధి చెప్పారు. మరిన్ని వివరాలు వెల్లడించలేమనీ ప్రతినిధి చెప్పారు. ► మరోవైపు, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ, మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదలాయించడం ధిక్కరణ కిందకే వస్తుందని 2017లో వచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన పిటిషన్‌ను ఆగస్టు 31న కొట్టివేసింది. -
నవంబర్ 3 వరకు నీరవ్ మోదీ రిమాండ్ పొడిగింపు
లండన్: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ జ్యుడీషియల్ రిమాండ్‌ను యూకే కోర్టు నవంబర్ 3వ తేదీ వరకు పొడిగించింది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడానికి సంబంధించిన కేసు తదుపరి విచారణ నవంబర్ 3న జరగనుండడంతో అప్పటివరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.14 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన నీరవ్ మోదీ విదేశాలకు పరారయ్యాడు. లండన్‌లో తలదాచుకుంటున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీరవ్ మోదీని తమకు అప్పగించాలంటూ భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన లండన్ కోర్టు మెజిస్ట్రేట్ అతడి రిమాండ్‌ను నవంబర్ 3 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పం -
రహస్యంగా మాల్యా అప్పగింత ప్రక్రియ : కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: పరారీలో ఉన్న మాజీ వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను భారత్‌కు తీసుకొచ్చేందుకు అప్పగించే ప్రక్రియ రహస్యంగా కొనసాగుతోందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది. ఈ అంశంలో తాజా పరిస్థితి గురించి తెలియదని.. ఇందులో తాము ఒక పక్షంగా లేమని స్పష్టం చేసింది. అప్పగించే విషయంలో రహస్యంగా కొనసాగుతున్న ప్రక్రియలు ఏంటనేవి తమకు తెలియజేయాలని మాల్యా తరఫు న్యాయవాది అంకుర్సైగల్ను జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ అశోక్‌భూషణ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశించింది. మాల్యా న్యాయవాది సైతం ఈప్రక్రియలపై తనకు అవగాహన లేదని చెప్పారు. అప్పగింతకు వ్యతిరేకంగా చేసుకున్న అభ్యర్థనను తిరస్కరించిన విషయమే తనకు తెలుసన్నారు. దీంతో మాల్యా అప్పగింత ప్రక్రియ ముగియనున్న నవంబర్ 2 నాటికి ఈ వివరాలు తెలియజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదిలీ చేయగా.. దీన్ని నేరంగా కోర్టు గతంలో ప్రకటించింది. దీన్ని సమీక్షించాలని కోరుతూ మాల్యా దాఖలు చేసుకున్న రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తూ అక్టోబర్ 5న తమ ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు లోగడ ఆదేశాలు జారీ చేసింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ తరఫున తీసుకున్న రూ.9,000 కోట్ల రుణ ఎగవేతకు సంబంధించి మాల్యా కోర్టు కేసును ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో తలదాచుకున్నారు. -
‘మాల్యా అప్పగింతకు నో టైమ్‌లైన్’
లండన్ : బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించడం కోసం నిర్దిష్ట గడువును నిర్ణయించడం సాధ్యం కాదని బ్రిటిష్ హై కమిషనర్ సర్ ఫిలిప్ బార్టన్ గురువారం చెప్పారు. విజయ్ మాల్యాను భారత దేశానికి ఎప్పుడు అప్పగిస్తారు? అని అడిగిన ప్రశ్నపై బార్టన్ స్పందిస్తూ, ఇటువంటి అంశాలపై తమ ప్రభుత్వం ఎటువంటి వ్యాఖ్యలు చేయబోదని చెప్పారు. అయితే బ్రిటన్ కోర్టులు స్వతంత్రంగా పని చేస్తాయన్నారు. నేరస్థులు వేరొక దేశానికి వెళ్ళడం ద్వారా చట్టం నుంచి తప్పించుకుపోవడాన్ని నిరోధించడంలో పోషించవలసిన పాత్ర గురించి బ్రిటన్ ప్రభుత్వం, న్యాయస్థానాలకు తెలుసునని చెప్పారు. ఆన్లైన్ మీడియా సమావేశంలో మాట్లాడిన ఫిలిప్ బార్టన్.. నేరస్థులు సరిహద్దులు దాటి వెళ్లినంతమాత్రాన తప్పించుకోలేరని తేల్చిచెప్పారు. అయితే మాల్యాను ఫిబ్రవరిలోనే భారత్‌కు అప్పగించాల్సి ఉండగా, కొన్ని న్యాయపరమైన చిక్కులు ఏర్పడటంతో ఈ కేసు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. తనను భారత్‌కు అప్పగించడం తగదని మాల్యా బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానాల్లో చేసిన వాదనలు ఇటీవలే వీగిపోయాయి. దీంతో ఇటీవలె ‘శరణార్థి’ హోదాలో దేశంలో ఉంటానని మాల్యా బ్రిటన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దానికి ఆమోదముద్ర వేయవద్దని భారత్ ఇటీవలె బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. (మాల్యా ‘శరణార్థి’ అభ్యర్థనను మన్నించొద్దు) కాగా 9వేల కోట్ల రూపాయలకు పైగా రుణాల ఎగవేత ఆరోపణలతో మాల్యా ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. అయితే మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు కొన్ని చట్టపరమైన సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందని బ్రిటిష్ హైకమిషన్ ప్రకటించింది. తాజాగా శిక్షనుంచి తప్పించుకునే మార్గాలన్నీ మూసుకు పోవడంతో బ్యాంకుల కన్సార్షియంతో సెటిల్మెంట్ ప్యాకేజీని అంగీకరించాలంటూ కోరినట్టు తెలుస్తోంది. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు అప్పగించడం ఖాయం అనుకుంటున్న తరుణంలో ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మాల్యా సిద్ధం కావడం గమనార్హం. (ఆఖరి అస్త్రం : మాల్యా బంపర్ ఆఫర్ ) -
మాల్యా ‘శరణార్థి’ అభ్యర్థనను మన్నించొద్దు
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకులను వేల కోట్ల రూపాయల్లో ముంచి, ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ వ్యాపారస్తుడు విజయ్ మాల్యాను దేశానికి రప్పించే దిశలో కేంద్రం కీలక చర్య తీసుకుంది. ‘శరణార్థి’ హోదాలో దేశంలో ఉంటానని మాల్యా అభ్యర్థిస్తే, దానికి ఆమోదముద్ర వేయవద్దని బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది. నిజానికి తనను భారత్‌కు అప్పగించడం తగదని మాల్యా బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానాల్లో చేసిన వాదనలు ఇటీవలే వీగిపోయాయి. అయితే ఆయనను తక్షణం భారత్‌కు పంపడం జరిగే పనికాదనీ, ఇందుకు కొన్ని న్యాయపరమైన చిక్కులు వీడాల్సి ఉందని బ్రిటన్ ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు తాజా విజ్ఞప్తి చేసినట్లు గురువారంనాటి ఆన్లైన్ మీడియా బ్రీఫింగ్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. -
మాల్యా అప్పగింత : మరో ఎత్తుగడ
సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ ఆరోపణలతో విచారణను ఎదుర్కొంటున్న ఉద్దేశపూరక ఎగవేతదారుడు విజయ్ మాల్యాను భారతదేశానికి రప్పించే ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. మాల్యా అప్పగింతకు ముందు చట్టపరమైన సమస్య పరిష్కరించాల్సి ఉందంటూ బ్రిటీష్ హైకమిషన్ ఇప్పటికే తేల్చి చెప్పింది. తాజాగా మరో న్యాయపరమైన చిక్కు వచ్చినట్టు సమాచారం. ఇది పరిష్కారం అయ్యేంత వరకు మాల్యాను స్వదేశానికి రప్పించే ప్రక్రియలో మరికొంత జాప్యం తప్పదు. మానవతా దృక్పథం ప్రాతిపదికన తనకు లండన్ లో ఆశ్రయం కల్పించాల్సిందిగా మాల్యా కోరినట్టు తెలుస్తోంది. యూరోపియన్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ఈసీహెచ్ఆర్) ఆర్టికల్ 3 ప్రకారం తాజా పిటిషన్ దాఖలు చేశారు. మాల్యాకు యూకే ఆశ్రయం ఇస్తుందా లేదా అనేది చూడాలి. అయితే ఇలాటి దరఖాస్తులు ప్రాసెస్ కు కనీసం ఆరు నెలలు పడుతుందనీ, ఒకవేళ మాల్యా అభ్యర్ధనను తిరస్కరించి నప్పటికీ, దీనిపై మళ్లీ రివ్యూ కోరుకునే అవకాశం కూడా వుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల్యాకు కొంత సమయం కచ్చితంగా లభిస్తుందని చెబుతున్నారు. -
మాల్యా అప్పగింతలో మరింత జాప్యం
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు బ్రిటన్ అప్పగించే ప్రక్రియకు మరింత సమయం పట్టేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆయన అప్పగింతకు ముందు కొన్ని చట్టపరమైన అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. దీనికి ఎంతకాలం పడుతుందన్నది చెప్పలేమని బ్రిటన్ హై కమిషన్ ప్రతినిధి చెప్పారు. ‘అప్పగింతను వ్యతిరేకిస్తూ విజయ్ మాల్యా పెట్టుకున్న అప్పీళ్లన్నీ తిరస్కరణకు గురయ్యాయి. అయినప్పటికీ ఆయనను అప్పగించేందుకు ముందుగా పరిష్కరించుకోవాల్సిన చట్టపరమైన అంశం ఒకటి ఉంది‘ అని వివరించారు. అది పూర్తయ్యే దాకా బ్రిటన్ చట్టం ప్రకారం అప్పగింత కుదరదని, ఇంతకు మించి వివరాలు వెల్లడించడానికి లేదని ప్రతినిధి చెప్పారు. దివాలా తీసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ మాల్యా దేశీ బ్యాంకులకు దాదాపు రూ. 9,000 కోట్లు ఎగవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2016 నుంచి ఆయన బ్రిటన్‌లో తలదాచుకుంటున్నారు. -
మాల్యా అప్పగింతపై సందేహాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలు ఎగవేసి లండన్‌లో తలదాచుకున్న భారీ ఎగవేతదారుడు విజయ్ మాల్యాను భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ ఇప్పట్లో జరిగే పనికాదని తాజా నివేదికల సారాంశం. చట్ట ప్రకారం మాల్యాను తిరిగి ఇండియాకు రప్పించడం సమీప కాలంలో కష్టమే అనే సందేహం వ్యక్తమవుతోంది. (త్వరలోనే భారత్‌కు విజయ్ మాల్యా..) చట్ట పరమైన నిబంధనల కారణంగా భారతదేశానికి అప్పగించలేమని బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి వ్యాఖ్యలను ఉటంకిస్తూ సీఎన్‌బీసీ రిపోర్టు చేసింది. యూకే హైకమిషన్ ఈ విషయాన్ని ధృవీకరించిందని కూడా తెలిపింది. చట్ట సమస్యలను పరిష్కరించిన తరవాత మాత్రమే మాల్యాను పంపిస్తామని బ్రిటిష్ హై కమిషన్ పేర్కొంది. ఇది చాలా గోప్యమైన వ్యవహారమంటూ ఇంతకుమించి వివరాలను అందించేందుకు నిరాకరించారు. అలాగే ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా అంచనా వేయలేమనీ, వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని ప్రతినిధి తెలిపారు. ముఖ్యంగా చట్టపరమైన కారణాల వల్ల మాల్యాను అప్పగింత ఆదేశాలపై యూకే హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ సంతకం చేయకపోవడమే ఆలస్యానికి కారణమనే అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు మాల్యా న్యాయవాది ఆనంద్ దూబే కూడా మాల్యాను వెనక్కి రప్పించే వ్యవహారం తమ దృష్టిలో లేదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. కాగా పరారీలో ఉన్న మాల్యాను ముంబైకి తరలించనున్నారని, ఆయనతో పాటు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు ఉంటారంటూ పలు వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. -
విజయ్ మాల్యాకు భారీ షాక్..
లండన్\న్యూఢిల్లీ : బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాల ఎగవేత కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ విదేశాల్లో తలదాచుకున్న లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యాకు చుక్కెదురైంది. రుణాల ఎగవేత కేసులో విచారణను ఎదుర్కొనేందుకు తనను భారత్‌కు అప్పగించాలని 2018లో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించడాన్ని సవాల్ చేస్తూ యూకే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు మాల్యాకు అనుమతి లభించలేదు. ఈ నిర్ణయంతో తన అప్పగింతను వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేసేందుకు మాల్యాకు అన్ని దారులు మూసుకుపోయాయి. దీంతో భారత్-బ్రిటన్ ఒప్పందం ప్రకారం 28 రోజుల్లో మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు కోర్టు ఉత్తర్వులను బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ధ్రువీకరిస్తారని భావిస్తున్నారు. బ్రిటిష్ చట్టాల ప్రకారం 28 రోజుల వ్యవధి తక్షణమే కౌంట్‌డౌన్ ప్రారంభవుతుందని, నెలరోజుల లోపే మాల్యా భారత్‌లో ఉంటారని భారత దర్యాప్తు సంస్ధల వర్గాలు వెల్లడించాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తరపున రూ 9000 కోట్లు రుణాలు పొందిన విజయ్ మాల్యాకు వాటిని తిరిగి చెల్లించే ఉద్దేశం లేదని బ్యాంకులు ఆరోపిస్తుండగా, రుణాలు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాల్యా చెబుతున్నారు. రుణ ఎగవేత కేసులో అరెస్టయిన మాల్యా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న సంగతి తెలిసిందే. తనను భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయంపై బ్రిటన్ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. మాల్యాపై అభియోగాలకు ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా రుణ ఎగవేత కేసుల్లో నిందితులు విచారణను తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో మాల్యా అప్పగింత మోదీ ప్రభుత్వానికి సానుకూల పరిణామంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి : కరోనా ప్యాకేజీ : మాల్యా స్పందన -
పీఎన్బీ స్కాం: నీరవ్ మోడీ విచారణ షురూ!
సాక్షి. న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ (49) పై లండన్ కోర్టులో విచారణ మొదలు కానుంది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోడీని విచారణ కోసం యుకె కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం సౌత్‌వెస్ట్ లండన్‌లోని వర్డ్స్‌వర్త్ జైల్లో ఉన్న ఆయనను అధికారులు ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మోడీని భారత్‌కు అప్పగించాలని దాఖలైన పిటిషన్‌పై 5 రోజుల పాటు విచారణ జరగనుంది. వేలకోట్ల రూపాయల మేర బ్యాంకును మోసం చేసి లండన్‌కు పారిపోయిన మోడీని అప్పగించాలంటూ భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. కోవిడ్-19 వాప్తి, లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో వీడియో లింక్ ద్వారా ఆయనను విచారించే విషయాన్ని కూడా డిస్ట్రిక్ జడ్జి శామ్యూల్ గూజీ పరిశీలిస్తున్నారు. ''కొన్ని జైళ్లు నిందితులను వ్యక్తిగతంగా ప్రవేశపెడుతున్నందున ఈ నెల 11న నీరవ్ మోదీని కోర్టు ముందుకు తీసుకురావాలని ఆదేశిస్తాం. ఒకవేళ ఇది సాధ్యం కాని పక్షంలో లైవ్ వీడియో లింక్ ద్వారా విచారిస్తాం..'' అని న్యాయమూర్తి గూజీ పేర్కొన్నారు. (మరో మెగా డీల్‌కు సిద్ధమవుతున్న అంబానీ) నీరవ్ మోడీని అప్పగించాలంటూ గతేడాది భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నుంచి ఐదు రోజుల పాటు లండన్ కోర్టు విచారణ జరపనుంది. గత ఏడాది మార్చి 19న అరెస్టు అయినప్పటి నుండి నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో మోడీ పీఎన్బీని రూ.13,600 కోట్ల మేర మోసగించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. (కరోనా : అనుకోని అతిధి వైరల్ వీడియో) -
మాల్యా అప్పగింతకు తొలగిన మరో అడ్డంకి..
లండన్: భారత్‌కు తనను బ్రిటన్ అప్పగించడం చట్టబద్ధంగా తగదంటూ విజయ్‌మాల్యా దాఖలు చేసిన అప్పీల్‌ను బ్రిటన్ హైకోర్టు ఒకటి కొట్టివేసింది. దీనితో భారత్ బ్యాంకులను వేలాది కోట్ల రూపాయలమేర మోసం చేసి, బ్రిటన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాను తిరిగి భారత్ అప్పగించడానికి మార్గం కొంత సుగమం అయ్యింది. అయితే తన తాజా తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అనుమతి కోరేందుకు యూకే హైకోర్టు మాల్యాకు 14 రోజుల గడువు ఇచ్చింది. మాల్యా అప్పీల్చేస్తే, దీనిపై తుది తీర్పునకు బ్రిటన్ హోం కార్యాలయం నిరీక్షించాల్సి ఉంటుంది. లేదంటే భారత్–బ్రిటన్ నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద 28 రోజుల్లో భారత్‌కు బ్రిటన్ హోం శాఖ అప్పగిస్తుంది. తప్పుడు సమాచారం ఇవ్వడం, కుట్ర, అక్రమ ధనార్జనలకు సంబంధించి మాల్యా తప్పు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు కనబడుతున్నట్లు లండన్‌లోని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. -
లండన్ కోర్టులో మాల్యాకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారుడు, లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా (64) కు భారీ షాక్ తగిలింది. మాల్యాను భారత్ కు అప్పగించేందుకు 2018 లో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాల్యా దాఖలు చేసుకున్న పిటిషన్ ను లండన్ కోర్టు సోమవారం కొట్టివేసింది. లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఇద్దరు సభ్యుల ధర్మాసనం లార్డ్ జస్టిస్ స్టీఫెన్ ఇర్విన్, జస్టిస్ ఎలిజబెత్ లాంగ్ మాల్యా అభ్యర్థనను తిరస్కరించింది. భారతీయ బ్యాంకుల కన్సార్షియంకు సుమారు 9,000 కోట్ల రూపాయలకు పైగా ఎగవేసిన, మాల్యా 2016 మార్చిలో లండన్ పారిపోయాడు. మనీలాండరింగ్ ఆరోపణల కింద కేసు నమోదు చేసిన ఈడీ, సీబీఐ చార్జ్ షీట్లను దాఖలు చేశాయి. మాల్యాకు చెందిన ఆస్తులను ఇప్పటికే ఎటాచ్ చేశాయి. మాల్యాను ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన భారత ప్రభుత్వం. విచారణనిమిత్తం అతణ్ని ఇండియాకు తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. భారత ప్రభుత్వ వాదనను సమర్థించిన బ్రిటన్ పోలీసుల సహకారంతో 2017 ఏప్రిల్‌లో మాల్యాను లండన్‌లో భారత అధికారులు అరెస్టు చేశారు. తర్వాత బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలోనే 2018 డిసెంబర్లోనే విజయ్ మాల్యాను అప్పగించాలని యుకె కోర్టు ఆదేశించింది. (విజయ్ మాల్యాకు భారీ ఊరట) కాగా తాను రుణాలను ఎగవేయలేదని పదే పదే వాదించే మాల్యా వంద శాతం అప్పులు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించాడు. తాజాగా (మార్చి, 31) కరోనా సంక్షోభంలో నైనా తన కోరిక మన్నించాలని, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను అభ్యర్థించిన సంగతి తెలిసిందే. -
‘ఇలాగైతే అసాంజే జైలులోనే మరణిస్తారు’
లండన్ : వికీలీక్స్ వ్యవస్ధాపకుడు జులియన్ అసాంజే ఆరోగ్యం సరిగా లేదని, విచారణ పేరిట వేధింపులు కొనసాగితే బ్రిటిష్ జైలులోనే ఆయన మరణించవచ్చని 60 మందికి పైగా వైద్యులు బ్రిటన్ హోం సెక్రటరీకి రాసిన బహిరంగ లేఖలో స్పష్టం చేశారు. అసాంజేకు తక్షణమే శారీరక, మానసిక వైద్య చికిత్సలు అవసరమని తేల్చిచెప్పారు. గూఢచర్య ఆరోపణలపై అసాంజేను తమకు అప్పగించాలని బ్రిటన్ను అమెరికా కోరుతోంది. గూఢచర్యం చట్టం కింద అసాంజేపై ఆరోపణలు నిగ్గుతేలితే అమెరికన్ జైలులో ఆయన 175 ఏళ్లు మగ్గవలసి ఉంటుంది. అసాంజేను ఆరోగ్య కారణాలతో బెల్మార్ష్ జైలు నుంచి యూనివర్సిటీ టీచింగ్ ఆస్పత్రికి తరలించాలని హోం సెక్రటరీ ప్రీతిపటేల్, బ్రిటన్ దేశీయాంగ మంత్రికి రాసిన లేఖలో వైద్యులు కోరారు. లండన్‌లో అక్టోబర్ 21న కోర్టుకు హాజరైన సందర్భంగా అసాంజేను చూసినవారు వెల్లడించిన వివరాలతో పాటు ఆయన ఎదుర్కొంటున్న వేధింపులపై ఐరాస ప్రతినిధి నిల్స్ మెల్జర్ నివేదిక ఆధారంగా తాము ఆందోళనతో ఈ లేఖ రాస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. అసాంజేపై విచారణ పేరుతో వేధింపులు కొనసాగితే ఆయన జీవితం అంతమయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హక్కుల నిపుణులు ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. 2010లో ఆప్ఘనిస్తాన్, ఇరాక్లలో అమెరికా దాడులకు సంబంధించిన సైనిక దౌత్య ఫైళ్లను అసాంజే వికీలీక్స్‌లో ప్రచురించడంతో అమెరికా ప్రభుత్వంలో ప్రకంపనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. -
నేరస్తుల అప్పగింత బిల్లు వెనక్కి
హాంకాంగ్/బీజింగ్: కొన్ని నెలలుగా నిరసనలకు కారణమైన వివాదాస్పద ‘నేరస్తుల అప్పగింత’ బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు బుధవారం హాంకాంగ్ ప్రకటించింది. ఈ బిల్లుపై వ్యతిరేకతే తరువాత కాలంలో మరిన్ని ప్రజాస్వామ్య మార్పులను కోరుతూ తీవ్రమైన నిరసనలకు కారణమైంది. బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు హాంకాంగ్ సిటీ సెక్రటరీ ఫర్ సెక్యూరిటీ జాన్ లీ స్థానిక చట్ట సభలో ప్రకటించారు. ఈ విషయమై ప్రశ్నించేందుకు కొందరు ప్రజాస్వామ్య మద్దతుదారులైన సభ్యులు ప్రయత్నించగా ఆయన సమాధానమివ్వలేదు. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను మార్చలేదు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేరీ లామ్‌ను మార్చేందుకు చైనా ప్రయత్నిస్తోందన్న మీడియా కథనాలను చైనా తోసిపుచ్చింది. అది స్వార్థ ప్రయోజనాల కోసం పుట్టించిన రాజకీయ వదంతి అని పేర్కొంది. కేరీ లామ్ స్థానంలో తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను నియమించే దిశగా చైనా ఆలోచిస్తోందని లండన్ కేంద్రంగా వెలువడే ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఆ కథనాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ తోసిపుచ్చారు. లామ్‌కు తమ పూర్తి మద్దతు ఉందని పేర్కొన్నారు. హాంకాంగ్‌లో త్వరలోనే హింస నిలిచిపోయి, సాధారణ స్థితి ఏర్పడుతుందన్నారు. నేరస్తుల అప్పగింత బిల్లును వెనక్కు తీసుకోవడంతో పాటు లామ్ రాజీనామా చేయాలన్నది హాంకాంగ్‌లోని ప్రజాస్వామ్య వాదుల ప్రధాన డిమాండ్. బిల్లులో ఏముంది? ఈ బిల్లు ఆమోదం పొందితే చైనాతో పాటు ప్రపంచంలోని ఏ దేశానికైనా నేరానికి పాల్పడినట్లుగా భావిస్తున్న తమ పౌరులను హాంకాంగ్ అప్పగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం హాంకాంగ్‌కు అమెరికా, యూకే సహా 20 దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. చైనాతో మాత్రం లేదు. 1997లో హాంకాంగ్ చైనా చేతికి వచ్చాక ఒక దేశం రెండు వ్యవస్థల విధానం కింద హాంకాంగ్‌కు 50 ఏళ్ల పాటు అత్యున్నత స్వయంప్రతిపత్తి, న్యాయ స్వతంత్రత లభించాయి. చాన్ అనే హాంకాంగ్ పౌరుడు తైవాన్‌లో తన గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసి తిరిగి హాంకాంగ్‌కు వచ్చిన నేపథ్యంలో ఈ బిల్లును ప్రభుత్వం తెచ్చింది. చాన్ హాంకాంగ్ జైళ్లో ఉన్నాడు. నేరస్తుల అప్పగింతకు ముందు ఆ అభ్యర్థనను కోర్టులో సవాలు చేసే అవకాశం బిల్లులో ప్రతిపాదించారు. ఏడేళ్లు, లేదా ఆపై శిక్ష పడే నేరాలకే అప్పగింత వర్తించేలా ప్రతిపాదనను బిల్లులో చేర్చారు. -
అట్టుడుకుతున్న హాంకాంగ్
ఒప్పందంలో ఇచ్చిన హామీలను నీరుగార్చాలని చూసిన చైనా ఎత్తుగడలకు వ్యతిరేకంగా ఇప్పుడు హాంకాంగ్ భగ్గుమంటోంది. తమ స్వేచ్ఛాస్వాతంత్య్రాలపై ఉక్కుపాదం మోపాలనుకుంటున్న చైనా నాయకత్వాన్ని హాంకాంగ్ పౌరులు నిలదీస్తున్నారు. వారంరోజులుగా ఆ నగరం నిరసనలతో హోరె త్తుతోంది. హాంకాంగ్‌లో నేరాలకు పాల్పడే వారిని చైనాకు అప్పగించడానికుద్దేశించిన నేరస్తుల అప్పగింత చట్టం సవరణ బిల్లు ఈ ఆగ్రహావేశాలన్నిటికీ మూలం. బ్రిటన్‌కున్న లీజు ముగిశాక 1997 జూలై 1న హాంకాంగ్ మళ్లీ చైనాకు వశమైంది. ఈ విలీనం కావడం తమకు సమ్మతం కాదని స్వతంత్ర నగర రాజ్యంగా ఉంటామని ఆనాడు అక్కడివారు పట్టుబట్టారు. అయితే హాంకాంగ్ ప్రజాస్వామ్య వ్యవస్థ యధాతథంగా ఉంటుందని చైనా నేతలు హామీ ఇచ్చారు. వారికి సార్వత్రిక ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు. తమ నాయకుడు డెంగ్ జియావో పెంగ్ అంతకు కొన్నేళ్లక్రితం హాంకాంగ్ చైనా పరిధిలోకొస్తే ‘ఒక దేశం–రెండు వ్యవస్థలు’ విధానాన్ని పాటిస్తామని హామీ ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. చైనా విధానాలేవీ హాంకాంగ్‌ను తాకబోవని చెప్పారు. అది పూర్తి స్థాయిలో తమ నియంత్రణలోకొచ్చేవరకూ... అంటే 2047 వరకూ నగర స్వయంపాలనే ఉంటుందని వాగ్దానం చేశారు. 1997లో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఖరారైనప్పుడు చైనా, తైవాన్లను అందులో చేర్చలేదు. హాంకాంగ్ అనుసరిస్తున్న ప్రమాణాలకు ఆ రెండుచోట్లా అమలవుతున్న నేర న్యాయవ్యవస్థ విరుద్ధం గనుక ఆ నిర్ణయం తీసుకున్నారు. అందుకు చైనా కూడా అంగీకరించింది. కానీ హాంకాంగ్‌కు ఇచ్చిన ఇతర హామీల్లాగే దీన్ని కూడా నీరు కార్చాలని చైనా ప్రయత్నిస్తోంది. తన అభిప్రాయాలకు భిన్నంగా మాట్లాడేవారిని అది ఇప్పటికే శత్రువులుగా పరిగణిస్తోంది. రకరకాల సాకులతో అపహరించడం కూడా రివాజే. ఇప్పుడు నేరస్తుల అప్పగింత చట్టానికి తీసుకురాదల్చిన సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తే అటువంటి వారందరినీ చైనాకు ‘చట్టబద్ధంగా’ తరలించి అక్కడి చట్టాల కింద విచారించి దశాబ్దాలపాటు ఖైదు చేయడమో, మరణశిక్ష వంటివి విధించడమో చేసే ప్రమాదం ఉన్నదని ఉద్యమకారులు ఆందోళనపడుతున్నారు. అయితే ఇవన్నీ ఉత్త అనుమానాలే నని నగర చీఫ్ ఎగ్జిక్యూటివ్ కారీ లామ్ చెబుతున్నారు. ఎవరినైనా నేరుగా చైనాకు అప్పగించడం ఉండదని, ప్రతి కేసునూ పరిశీలించి అవసరాన్నిబట్టి నిర్ణయం తీసుకుంటామని ఆమె అంటు న్నారు. కానీ దీనికొక మెలిక ఉంది. తాజా సవరణలు గత కాలంనుంచి అమల్లోకొచ్చేవిధంగా రూపొందించారు. సారాంశంలో బిల్లు ఆమోదం పొందగానే పాత కేసుల్ని తవ్వి తీసి, వాటిల్లో నిందితులుగా ఉన్నవారిని చైనాకు అప్పగించే అవకాశం లేకపోలేదు. వాస్తవానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థే పెద్ద ప్రహసనంలా నడుస్తోంది. స్వయంపాలన అమలు చేస్తామని, నగర నిర్వహణ చూసే చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను ప్రజలే ఎన్నుకోవచ్చునని 1997లో చైనా హామీ ఇచ్చింది. అది 2017 నుంచి అమలు చేస్తామని చెప్పింది. అంతవరకూ పాలనా వ్యవహా రాలు సాఫీగా సాగడానికి భిన్న రంగాలనుంచి కొందరు వ్యక్తుల్ని తానే ఎంపిక చేసి ఒక కమిటీని ఏర్పరిచింది. ఆ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను ఎన్నుకునే విధానాన్ని ఏర్పరిచింది. కానీ 2017 నుంచి అమల్లోకి రావాల్సిన ఎన్నికల విధానాన్ని చైనా నీరుగార్చింది. ఇప్పటికీ చైనా అనుకూలురదే నగర నిర్వహణ వ్యవస్థలో మెజారిటీ. వారిద్వారా ఎన్నికైన కారీ లామ్ ఆచరణలో చైనా ప్రతినిధిగానే వ్యవహరిస్తున్నారు. 2017లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు స్వీకరించాక పాలనావ్యవస్థలోని చైనా వ్యతిరేకుల్ని అనర్హులుగా ప్రకటించారు. ఉద్యమకారులు ఎన్నికల్లో పాల్గొనడాన్ని నిషేధిం చారు. వారిని అరెస్టు చేయించారు. ఇవన్నీ చైనా మెప్పు పొందడానికి ఆమె తీసుకున్న చర్యలే. మరోపక్క చైనా వ్యతిరేకులుగా ముద్రపడినవారిని ఆ దేశం అపహరిస్తుంటే ఆమె నోరు మెదప లేదు. ఉద్యమకారుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇప్పటికైతే సవరణ బిల్లుపై జరిగే చర్చను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ ఉద్యమం మరికొన్నాళ్లకు చల్లారక తప్పదన్న అభిప్రాయంతో చైనా ఉంది. సరిగ్గా ఆ కారణం వల్లే ఉద్యమాన్ని దీర్ఘకాలం కొనసాగించాలని ఉద్యమకారులు నిర్ణయిం చుకున్నారు. తాజా సవరణలు అమల్లోకొస్తే అక్కడుండే తమ పౌరుల పరిస్థితి ఏమిటన్న ఆందోళన అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉంది. అమెరికాకు చెందిన 1,300 సంస్థలు అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆ దేశ పౌరులు 85,000మంది వ్యాపారం, ఇతర రంగాల్లో పని చేస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియా పౌరులు లక్షమంది, బ్రిటన్‌కు చెందిన 50,000మంది అక్కడుం టున్నారు. కొత్త చట్టం అమలైతే వీరందరూ చైనా ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని ఆ దేశాల భావన. బ్రిటన్ వలసగా ఉన్నప్పుడు హాంకాంగ్‌లో ఉదారవాద ప్రజాస్వామ్యం అమలయ్యేది. భావప్రకటనా స్వేచ్ఛ ఉండేది. కానీ ఆ నగరం చైనా ఛత్రఛాయలోకి వచ్చాక భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే మీడియా సంస్థలపై నిఘా మొదలైంది. అప్రకటిత సెన్సార్ షిప్ అమలు ప్రారంభమైంది. కొన్ని చానెళ్ల లైసెన్స్‌ల గడువు తీరాక వాటిని పునరుద్ధరించడాన్ని నిలిపేశారు. గతంతో పోలిస్తే హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థ కూడా అంతంతమాత్రమే. 1997నాటికి చైనా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో హాంకాంగ్ వాటా 16 శాతం. ఇప్పుడది కేవలం 2 శాతం మాత్రమే. అయితే చైనా ఆర్థిక వ్యవస్థ పటిష్టతకూ, ఎదుగుదలకూ హాంకాంగ్ ఇప్పటికీ తోడ్పడుతోంది. దాన్ని పరిగణనలోకి తీసుకుని కనీసం హామీ ఇచ్చినవిధంగా హాంకాంగ్‌లో యధాతథ స్థితిని కొన సాగించాలని కూడా చైనా భావించడం లేదు. హాంకాంగ్ పౌరుల నిరసనోద్యమ ఉధృతిని గమ నించి ఇప్పటికైనా అది తన వైఖరిని మార్చుకోవాలి. తియనాన్మెన్ స్క్వేర్‌లో 1989లో వందల మందిని ఊచకోత కోసి ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణిచిన తీరులోనే ఇప్పుడూ వ్యవహరిద్దా మనుకుంటే ప్రపంచం ముందు దోషిగా నిలబడవలసి వస్తుందని అది గుర్తించాలి. -
విజయ్ మాల్యాకు ఎదురుదెబ్బ
లండన్: మద్యం వ్యాపారి విజయ్ మాల్యా(63)కు బ్రిటన్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్‌కు అప్పగించాలంటూ యూకే హోం శాఖ తీసుకున్న నిర్ణయంపై విచారణకు అనుమతించాలంటూ ఆయన పెట్టుకున్న అర్జీని యూకే హైకోర్టు తిరస్కరించింది. అప్పగింత నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తన వాదనలకు అనుమతించాలంటూ మాల్యా హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఈనెల 5వ తేదీన జస్టిస్ విలియం డేవిస్ ఈ అప్పీలును తిరస్కరించారని న్యాయ విభాగం ప్రతినిధి తెలిపారు. మాల్యాకు వచ్చే శుక్రవారంలోగా మౌఖికంగా విజ్ఞప్తి చేసుకునే అవకాశం ఉందన్నారు. విజ్ఞప్తి విన్నాక మాల్యా అప్పీలును పూర్తిస్థాయి విచారణకు అనుమతించాలా వద్దా అనేది జడ్జి నిర్ణయిస్తారని తెలిపారు. -
మాల్యాకు లండన్ కోర్టు భారీ షాక్
లండన్ : ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. వేలకోట్ల రూపాయలను ప్రభుత్వ బ్యాంకులకు ఎగవేసి లండన్‌కు పారిపోయిన పారిశ్రామిక వేత్త మాల్యాను భారత్‌కు రప్పించే క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి ఊరట కలిగింది. భారత్‌కు రప్పించే చర్యలకు వ్యతిరేకంగా మాల్యా అభ్యర్థనను లండన్ కోర్టు సోమవారం తోసిపుచ్చింది. దీంతో మాల్యాను త్వరలోనే దేశానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. తనను భారత్‌కు అప్పగించే చర్యలను అడ్డుకోవాలని మాల్యా దాఖలు చేసిన పిటీషన్‌ను బ్రిటన్ హైకోర్టు తోసిపుచ్చింది. వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హై కోర్టును ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బుత్నాట్ వ్యాఖ్యానిస్తూ...విజయ్ మాల్యా భారత న్యాయస్థానాలకు జవాబుదారీగా ఉండాలని సూచించింది. అతను చేసిన ఆర్థిక అవకతవకలకు భారతీయ న్యాయస్థానాల పరిధిలోనే విచారణ కొనసాగాలని సూచించింది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా 9వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ బ్యాంకులకు ఎగవేసి, డీఫాల్టర్‌గా 2016 మార్చిలో దేశం లండన్‌కు పారిపోయాడు. ఆర్థిక నేరాలకు పాల్పడిన కేసులో విజయ్ మాల్యాను తిరిగి దేశం రప్పించేందుకు కేంద్ర కసరత్తును తీవ్రం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన్ను భారత్‌కు అప్పగించడానికి ఇంగ్లండ్ హోం మినిస్టర్ సాజిద్ జావిద్ ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. -
నీరవ్ ఎఫెక్ట్ : చోక్సీ కొత్త రాగం
సాక్షి, ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో కీలకనిందితుడు, గీతాంజలి గ్రూపు అధినేత మెహుల్ చోక్సీ (60) రోగాల రాగం అందుకుని పీఎంఏల్‌ఏ కోర్టు కొత్త అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆర్థిక నేరస్తుడు చోక్సీని ఆంటిగ్వా నుంచి తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసిన నేపథ్యంలో ముంబైలోని మనీ లాండరింగ్ చట్టం (పిఎంఎల్ఏ) కోర్టులో కొత్తగా దరఖాస్తు చేసుకున్నాడు. ఈ కారణంగాను తాను విచారణకు రాలేనని కోర్టును కోరాడు. ఇటీవల పీఎన్బీ స్కాంలో మరో కీలక నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని ఇటీవల లండన్‌లో అరెస్టు చేయడంతోపాటు బెయిల్ నిరాకరించి జైలుకు తరలించిన నేపథ్యంలో తనకు కూడా అరెస్ట్ తప్పదని భావించిన ఫ్యుజిటివ్ వ్యాపారవేత్త మెహుల్ చోక్సి చోక్సీ ఈ చర్యకు దిగాడు. తాను దీర్ఘ కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానంటూ ముంబై కోర్టును ఆశ్రయించాడు. ముఖ్యంగా హృదయ సంబంధ వ్యాధి, కాలిలో తీవ్రమైన నొప్పి, మెదడులో గడ్డ తదితర రుగ్మతలతో బాధపడుతున్నానని పేర్కొన్నాడు. కాగా గతంలో కూడా ఆంటిగ్వానుంచి 41గంటలపాటు విమానంలో ప్రయాణించి ఇండియాలో కోర్టు విచారణకు హాజరు కాలేననీ, అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపించాలని కోర్టుకు విన్నవించు కున్నాడు. తాజాగా మరోసారి విచారణకు ముఖం చాటేస్తూ కోర్టుకు దరఖాస్తు పెట్టుకోవడం గమనార్హం. బ్యాంకింగ్ రంగంలోఅతిపెద్ద కుంభకోణంగా పేరొందిన రూ.13వేల కోట్ల పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీకి మేనమామ మెహుల్ చోక్సీ. వేలకోట్ల రూపాయల మేర బ్యాకులకు ఎగనామం పెట్టిన చోక్సీ విదేశాలకు పారిపోయాడు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ, సీబీఐ చార్జి షీట్లను దాఖలు చేసాయి. అలాగే చోక్సీ పాస్‌పోర్టును రద్దు చేయడతోపాటు ఇంటర్ పోల్ నోటీసు కూడా జారీ అయింది. ప్రస్తుతం చోక్సీ ఆంటిగ్వా పౌరసత్వంతో అక్కడ తలదాచున్న సంగతి తెలిసిందే. -
స్పెషల్ మిషన్‌తో చోక్సీకి చెక్?
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణంలో ప్రధాన నిందితులైన వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీని స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఒక ప్రత్యేక మిషన్ ద్వారా గీతాంజలి గ్రూపు అధినేత మెహుల్ చోక్సీని భారత్‌కు రప్పించే పనిలో ఉన్నాయి. ఇందుకోసం ఎయిర్ ఇండియాకు లాంగ్ రేంజ్ బోయింగ్ విమానంలో సీబీఐ, ఈడీ అధికారులు వెస్ట్ ఇండీస్‌కు తరలి వెళ్లనున్నాయని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. అంతేకాదు తిరుగు ప్రయాణంలో యూరప్ నుంచి నీరవ్ మోదీని తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. పీఎన్బీ స్కాంలో కీలక నిందితులైన వజ్రాల వ్యాపారులు, నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీలను తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్రం అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటికే వీరిద్దరి పాస్‌పోర్టులను రద్దు చేయడంతోపాటు ఇంటర్‌పోల్ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే నిందితులిద్దరూ విదేశాలకు చెక్కేశారు. నీరవ్ మోదీ లండన్‌లో తలదాచుకోగా, చోక్సీ వెస్టిండిస్‌లోని ఆంటిగువా అండ్ బార్బుడా దేశ పౌరసత్వం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేసు విచారణకు రాలేనంటూ కుంటి సాకులు చెబుతూ, ఇటీవల కేసులనుంచి తప్పించుకునే ఎత్తుగడలో భాగంగా భారతీయ పౌరసత్వాన్ని కూడా వదులుకున్నట్టు చోక్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మాల్యాను భారత్‌కు అప్పగించండి
లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాల్ని ఎగవేసి విదేశాలకు పరారైన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను స్వదేశం తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. ఆయన్ని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ కోర్టు మంగళవారం అంగీకరించింది. లోక్‌సభ ఎన్నికల ముంగిట ఈ పరిణామం ఎన్డీయే ప్రభుత్వానికి గొప్ప విజయమని భావిస్తున్నారు. మాల్యాకు వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టిన ఆనవాళ్లు కనిపించడం లేదని ఈ తీర్పును వెలువరించిన లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు చీఫ్ జడ్జి ఎమ్మా అర్బుత్నాట్ తెలిపారు. భారత్ సమర్పించిన ఆధారాల్ని పరిశీలించిన మీదట కొన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మాల్యాను భారత్‌కు అప్పగించినంత మాత్రాన ఆయన మానవ హక్కులకు భంగం వాటిల్లదని పేర్కొన్నారు. మాల్యా తన కంపెనీ ఆర్థిక పరిస్థితిని తప్పుగా చూపి బ్యాంకులను మోసిగించారని ఆరోపించారు. విలాసాలకు అలవాటుపడిన ఈ వ్యాపారవేత్త తప్పుడు ధ్రువపత్రాలతో రుణాలు పొందారని పేర్కొన్నారు. ఈ తీర్పు ఆధారంగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ సాజిద్ జావిద్.. మాల్యా అప్పగింతకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేయనున్నారు. ఈ కేసును సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కు అప్పగించడాన్ని మాల్యా లాయర్ల బృందం యూకే హైకోర్టు అనుమతితో 14 రోజుల్లోగా సవాలు చేయొచ్చు. ఒకవేళ మాల్యా లాయర్ల బృందం కోర్టు తీర్పును సవాలుచేయకుంటే జావిద్ ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి 28 రోజుల్లోగా ఆయన్ని భారత్‌కు అప్పగిస్తారు. మరోవైపు, మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్ కోర్టు ఆదేశాల్ని కేంద్ర ప్రభుత్వం, సీబీఐ స్వాగతించాయి. యూపీఏ హయాంలో లబ్ధిపొందిన మాల్యాకు శిక్ష విధించడానికి ఎన్డీయే భారత్‌కు తీసుకొస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఆ ఆఫర్ బూటకం కాదు: మాల్యా అంతకుముందు, మాల్యా కోర్టు ప్రాంగణంలో విలేకర్లతో మాట్లాడుతూ...బ్యాంకులకు అసలు మొత్తాన్ని చెల్లిస్తానని గతంలో చేసిన ప్రకటన బూటకం కాదని అన్నారు. బ్యాంకుల డబ్బును దొంగిలించానని తనపై వస్తున్న కథనాల్ని తోసిపుచ్చారు. ‘రుణాల్ని తిరిగి చెల్లిస్తానని కర్ణాటక హైకోర్టుకు తెలిపాను. ఈ ఆఫర్‌కు అప్పగింత కేసు విచారణకు సంబంధం లేదు. చెల్లించాల్సిన రుణాల కన్నా నా ఆస్తుల విలువే ఎక్కువ’ అని తెలిపారు. హైకోర్టు నుంచి అనుమతి వచ్చాక తొలుత కింగ్‌ఫిషర్ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తానని వెల్లడించారు. జైలు సిద్ధం.. భారత్‌కు తీసుకొచ్చిన తరువాత మాల్యాను ఉంచబోయే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఓ గదిని అధికారులు సిద్ధం చేశారు. జైలు ప్రాంగణంలో రెండంతస్తుల భవనంలో పటిష్ట భద్రత, నిరంతర నిఘా ఉండే చెరసాలలో ఆయన్ని ఉంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ జైలులో అంతర్జాతీయ స్థాయిలో భద్రతా ప్రమాణాలు అమలుచేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ముంబై దాడులకు పాల్పడి సజీవంగా చిక్కిన ఏకైక ఉగ్రవాది కసబ్‌ను కూడా ఈ జైలులోనే నిర్బంధించారు. ప్లేబాయ్ మాయలో బ్యాంకులు! సీబీఐ, ఈడీలు మోపిన నేరాభియోగాలపై విచారణ ఎదుర్కొనేందుకు మాల్యాను భారత్‌కు అప్పగించాల్సిందేనని జడ్జి ఎమ్మా అర్బుత్నాట్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న బెయిల్ షరుతులే ఇకపైనా వర్తిస్తాయని తెలిపారు. భారత్‌కు తీసుకొచ్చిన తరువాత మాల్యాను ఉంచబోయే ముంబై జైలులోని పరిస్థితులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మధుమేహం, హృద్రోగ సమస్యలు తలెత్తితే మాల్యాకు వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారని, జైలులో ఆయనకు ఎలాంటి ముప్పులేదని తెలిపారు. మాల్యాకు బ్యాంకులు అంత భారీ మొత్తంలో రుణాలు మంజూరుచేసిన విధానాన్ని తప్పుపట్టారు. ‘మాల్యాకు రుణాలు మంజూరు చేసిన విషయంలో వ్యవస్థాగతంగా కొన్ని లోపాలతో పాటు ఆర్థికపర దురుద్దేశం ఉన్నట్లు కనిపిస్తోంది. భారత్ సమర్పించిన ఆధారాలతో ఏదీ స్పష్టంగా తెలియట్లేదు. లేదంటే, విలాస పురుషుడు, ప్రముఖుడు, ఎప్పుడూ చుట్టూ బాడీగార్డులను ఉంచుకునే, ఆభరణాలు ధరించే ఆ ప్లేబాయ్ మాయలో బ్యాంకులు పడిపోయి ఉంటాయి. బ్యాంకులు తమ నిబంధనల్ని సైతం పక్కన పెట్టేలా ఆయన ఏదో మంత్రం వేసి ఉంటారు’ అని ఆమె వ్యాఖ్యానించారు. రూ.9 వేల కోట్ల మేర మోసం, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై మాల్యా గతేడాది ఏప్రిల్‌లో అరెస్టయి బెయిల్‌పై విడుదలయ్యారు. మాల్యాను భారత్ ఇది వరకే పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మాల్యా కేసు పూర్వాపరాలు 2005 మే 9: ‘కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్’ పేరిట వాణిజ్య విమాన సర్వీసులను ప్రారంభించిన విజయ్‌మాల్యా 2013: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం తమవద్ద తీసుకున్న రూ.6,494 కోట్లు తిరిగి చెల్లించాలని మాల్యాను కోరిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం 2016 మార్చి3: భారత్ నుంచి పారిపోయి ఆశ్రయం కోసం లండన్ చేరిన మాల్యా 2017 ఫిబ్రవరి: మాల్యాను అప్పగించాలని బ్రిటన్ను కోరిన భారత్ 2017, ఏప్రిల్ 18: మాల్యాను అరెస్టుచేసి సెంట్రల్ లండన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన స్కాట్లాండ్ పోలీసులు. వెనువెంటనే దాదాపు రూ.6కోట్ల విలువైన షూరిటీ పత్రాలు సమర్పించి బెయిలుపై బయటికొచ్చిన మాల్యా. 2017, డిసెంబర్ 4: భారత్‌కు మాల్యా అప్పగింత కేసు విచారణ మొదలు. 2017, డిసెంబర్ 14: భారత్ తరఫు నుంచి, మాల్యా తరఫు నుంచి వారి వాదనలను బలపరిచే పూర్తిస్థాయి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించారు. 2018 ఏప్రిల్ 27: మాల్యాపై అభియోగాలను రుజువుచేస్తూ కోర్టుకు భారత్ సమర్పించిన నివేదికలను సాక్ష్యాలుగా స్వీకరించేందుకు అంగీకరించిన కోర్టు. 2018 జూలై 31: భారత్‌కు అప్పగిస్తే ముంబైలోని ఆర్ధర్ రోడ్ జైలులో మాల్యాను నిర్భంధించే గది వీడియోను కోరిన కోర్టు. 2018 సెప్టెంబర్ 12: భారత్ వీడి లండన్‌కు వచ్చే ముందు ఆర్థికమంత్రి జైట్లీని కలిసే వచ్చానని ప్రకటించిన మాల్యా. అబద్ధమని కొట్టిపారేసిన జైట్లీ డిసెంబర్ 10: మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు అంగీకరించిన లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు మహిళా జడ్జి ఎమ్మా అర్బుత్నాట్. -
బ్రిటన్ కోర్టులో మాల్యాకు ఎదురుదెబ్బ
లండన్: రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు బ్రిటన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాల్యాను భారత్‌కు అప్పగించే విషయంలో సోమవారం తీర్పు వెలువరించిన న్యాయస్థానం.. భారత ప్రభుత్వ వాదనను సమర్ధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 9 వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేయడంతో పాటు, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు మాల్యాపై ఉన్నాయి. రుణ బకాయిలను వసూలు చేసుకునేందుకు బ్యాంకుల కన్సార్షియం న్యాయపరమైన చర్యలు ప్రారంభించిన క్రమంలో 2016లో విజయ్ మాల్యా భారత్ నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. మాల్యాపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సీబీఐ, ఈడీలు అతన్ని భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ కోర్టును ఆశ్రయించాయి. భారత ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించారు. మరోవైపు తనపై రాజకీయ దురుద్దేశంతోనే కేసులు మోపారని, భారత జైళ్లలో దారుణ పరిస్థితులు ఉంటాయని మాల్యా వెస్ట్‌మినిస్టర్ కోర్టులో వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం భారత ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ.. నేడు తీర్పు వెలువరించింది. కాగా, మాల్యాకు ఈ తీర్పుపై 14 రోజుల్లోగా హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. -
మరికాసేపట్లో మాల్యా అప్పగింతపై నిర్ణయం
లండన్ : బ్యాంకులకు రూ 9000 కోట్ల రుణాల ఎగవేత కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ బ్రిటన్‌లో తలదాచుకుంటున్న పారిశ్రామికవేత్త, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించడంపై బ్రిటన్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. తనపై రాజకీయ దురుద్దేశంతోనే కేసులు మోపారని, భారత జైళ్లలో దారుణ పరిస్థితులు ఉంటాయని వెస్ట్‌మినిస్టర్ కోర్టులో వాదించారు. బ్యాంకులకు రుణ బకాయిల్లో అసలు మొత్తాన్ని చెల్లిస్తానని, తన ఆఫర్‌ను స్వీకరించాలని విజయ్ మాల్యా పదేపదే బ్యాంకులను కోరుతున్నారు. కాగా, సెటిల్మెంట్కు అంగీకరించాలని బ్యాంకులను కోరుతూ తనపై చర్యల తీవ్రతను తగ్గించడంతో పాటు ఆస్తుల స్వాధీన ప్రక్రియను అడ్డుకునేందుకు మాల్యా ప్రయత్నిస్తున్నారు. మాల్యాను భారత్‌కు అప్పగించాలని కోరుతూ సీబీఐ, ఈడీలు బ్రిటన్ కోర్టులో బలంగా వాదించాయి. మాల్యా అప్పగింతపై కీలక నిర్ణయం వెలువడుతున్న నేపథ్యంలో సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులు లండన్‌కు తరలివెళ్లారు. రుణ బకాయిలను వసూలు చేసుకునేందుకు బ్యాంకుల కన్సార్షియం న్యాయపరమైన చర్యలు ప్రారంభించిన క్రమంలో 2016లో విజయ్ మాల్యా భారత్ నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. వెస్ట్‌మినిస్టర్ కోర్టులో మాల్యాకు వ్యతిరేకంగా తీర్పు వెలువడితే దాన్ని ఎగువ కోర్టులో సవాల్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని మాల్యా సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు మాల్యా అప్పగింతకు కోర్టు నిరాకరిస్తే నిర్ధిష్ట గడువులోగా సీబీఐ హైకోర్టులో వెస్ట్‌మినిస్టర్ కోర్టు తీర్పును సవాల్ చేసే అవకాశం ఉంటుంది. -
మాల్యా అప్పగింతపై నేడు బ్రిటన్ కోర్టు తీర్పు
లండన్: రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే అంశంపై బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం (నేడు) తీర్పును వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన అప్పగింతకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేవని న్యాయస్థానం భావించిన పక్షంలో తుదినిర్ణయం తీసుకునేందుకు ఈ కేసును బ్రిటన్ హోంశాఖకు పంపవచ్చని న్యాయనిపుణులు జైవాలా అండ్ కో మేనేజింగ్ పార్ట్నర్ పావని రెడ్డి తెలిపారు. ప్రతికూల ఉత్తర్వులు వచ్చిన పక్షంలో ఇరు వర్గాలు (మాల్యా, భారత ప్రభుత్వం) 14 రోజుల్లోగా హైకోర్టులో అప్పీలు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అప్పీలు చేసుకోకపోతే 28 రోజుల్లోగా మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు అమల్లోకి (ప్రభుత్వం కూడా ఏకీభవిస్తే) వస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంతో మూతబడిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం తీసుకున్న దాదాపు రూ. 9,000 కోట్ల రుణాలను ఎగ్గొట్టిన మాల్యా .. బ్రిటన్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా ఆయన్ను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. -
బ్రిటన్‌లోనే నీరవ్: సీబీఐ కీలక చర్య
సాక్షి, న్యూఢిల్లీ: అతిపెద్ద బ్యాంకింగ్ స్కాంకు సంబంధించి సీబీఐ కీలక సమాచారాన్ని సేకరించింది. దాదాపు రూ.14000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ యునైటెడ్ కింగ్ డమ్ (యుకె)లోనే ఉన్నట్టు సీబీఐ సోమవారం వెల్లడించింది. ఈ మేరకు బ్రిటన్ అధికారులు సమాచారం ఇచ్చినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. వేలకోట్ల రుణాలను ఎగొట్టి లండన్‌కు చెక్కేసిన బిలియనీర్ వజ్రాల వ్యాపారి నీరవ్‌ను తమకు అప్పగించాలని కోరినట్టు తెలిపింది. నీరవ్ మోదీ అప్పగించాల్సిందిగా సీబీఐ హోమ్ మంత్రిత్వ శాఖ ద్వారా దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తును విదేశాంగ శాఖ బ్రిటన్‌కు పంపిస్తుంది. అలాగే నీరవ్ మోదీని అదుపులోకి తీసుకోవాల్సిందిగా సీబీఐ యుకె అధికార యంత్రాంగాన్ని కోరింది. దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ స్కామ్ పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి రాకముందే నీరవ్ మోదీ, భార్య అమీ మోదీ, సోదరుడు నిశాల్ మోదీ మామ మెహుల్ చోక్సీ విదేశాలకు చెక్కేశారు. ఈ కేసు విచారణలో భాగంగా మోదీ, చోక్సీల పాస్‌పోర్ట్‌లను రద్దు చేసింది. అలాగే ఇంటర్ పోల్ కూడా మాల్యాకు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. అటు ప్రభుత్వ బ్యాంకుల నుంచి రూ.9,వేల కోట్లు రుణం తీసుకొని ఎగ్గొట్టి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కూడా లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. -
చోక్సీపై ఆంటిగ్వా ప్రభుత్వం న్యూ ట్విస్ట్
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితుల్లో ఒకడైన మెహుల్ చోక్సీ వ్యవహారంలో భారత ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ద్రోహులకు తమ దేశంలో స్థానంలేదు, ఇరుదేశాల స్నేహ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించిన ఆంటిగ్వా అండ్ బర్బూడా ప్రభుత్వం తాజాగా యూ టర్న్ తీసుకుంది. మెహుల్ చోక్సీకి పౌరసత్వం మంజూరు చేయడంలో తామేమీ తప్పు చేయలేదని ప్రకటించింది. భారత ప్రభుత్వ సానుకూల నివేదిక ఆధారంగాను ఆయనకు పాస్‌పోర్టు మంజూరు చేసినట్టు తెలిపింది. ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాటు జరగలేదని వివరించింది. ఈ కొత్త మలుపుతో చోక్సీని భారత్‌కు రప్పించాలని చూస్తున్న ప్రభుత్వానికి కొత్తతలనొప్పి మొదలైంది. అయితే చోక్సీపై నేరారోపణలకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించిన అనంతరం చోక్సీ అప్పగింత అంశాన్ని పరిగణనలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంటిగ్వా విదేశాంగ మంత్రి వెల్లడించారు. మెహుల్ చోక్సీ 2017 మేలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా, భారతదేశ హోం శాఖ, సెబీ సానుకూల నివేదికలు ఇచ్చాయని ఆంటిగ్వా అండ్ బర్బూడా ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడిదారుల యూనిట్, క్యాపిటల్ మార్కెట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ద్వారా ప్రభుత్వం నుంచి పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఫ్యుజిటివ్ వ్యాపారవేత్త మెహుల్ చోక్సికి పౌరసత్వాన్ని మంజూరు చేసినట్టు తెలిపింది. అలాగే విదేశీ వ్యవహారాల రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి వచ్చిన ధ్రువపత్రంలోనూ చోక్సీకి సంబంధించి ప్రతికూల అంశాలేమీ లేవని ఆంటిగ్వా వెల్లడించింది. అంతేకాదు చోక్సీ దరఖాస్తుపై నేపథ్య తనిఖీలు కూడా చేశామని తెలిపింది. ఏ సందర్భంలోనూ ఆయన ధరఖాస్తుపై అనుమానాస్పద సమాచారం లేదని పేర్కొంది. ప్రస్తుతం చోక్సీ తమ దేశ పౌరుడు కనుక ఆయనను దేశం నుంచి పంపించలేమని స్పష్టం చేసింది. అయితే చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేయాలంటే చట్టబద్ధమైన ప్రక్రియను చేపట్టవలసి ఉంటుందని పేర్కొంది. -
మాల్యా కోసం...జైలుగా మారనున్న గెస్ట్‌హౌస్
సాక్షి,ముంబయి: బ్యాంకులకు రూ వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో నిందితుడు, లండన్‌లో తలదాచుకున్న విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. అప్పగింత కేసులో భారత్‌లో జైళ్ల పరిస్థితిని సాకుగా చూపుతున్నలిక్కర్ దిగ్గజం మాల్యాకు చెక్ పెట్టేందుకు మహారాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం ద్వారా పలు ప్రతిపాదనలు పంపగా, తాజాగా ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌ను జైలుగా మార్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాసింది. బ్రిటన్ నుంచి తనను తరలించకుండా ఉండేందుకు భారత్‌లో జైళ్ల పరిస్థితి దయనీయంగా ఉంటుందని మాల్యా తన న్యాయవాదులతో బ్రిటన్ న్యాయస్ధానం ముందు వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా దేశంలో ఏ ప్రాంతాన్ని అయినా జైలుగా ప్రకటించేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు విశేషాధికారాలున్నాయని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. దేశంలో జైళ్లు బాగాలేవని మాల్యా అప్పగింతకు దాన్ని అవరోధంగా భావిస్తే...ఆయనకు అనుగుణంగా ఉండేలా గెస్ట్‌హౌస్‌లోనే మాల్యాను ఉంచుతామని, దాన్నే ప్రభుత్వం జైలుగా ప్రకటించవచ్చనే ప్రతిపాదనను పరిశీలించాలని కేంద్రాన్ని కోరినట్టు ఆయన తెలిపారు. బ్రిటన్ కోర్టులో జరుగుతున్న మాల్యా అప్పగింత కేసులో పదునైన వాదనలు వినిపించేందుకు అవసరమైన వ్యూహాన్ని మంగళవారం జరిగే భేటీలో హోంమంత్రిత్వ శాఖ ఖరారు చేయనుంది. మాల్యా న్యాయవాదులు లేవనెత్తే అంశాలను దీటుగా ఎదుర్కొనేందుకు ఎలాంటి వాదనను తెరపైకి తేవాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. మాల్యా అప్పగింత కేసు విచారణ డిసెంబర్ 4న జరగనుంది. మాల్యా న్యాయవాదుల వాదనలను తిప్పికొట్టేందుకు సకల సౌకర్యాలున్న ముంబయి ఆర్థర్ రోడ్డు జైలును ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఈ జైలులోని బ్యారక్ 12లో మాల్యాను ఉంచుతామంటూ దానికి సంబంధించిన ఫోటోలనే హోంమంత్రిత్వ శాఖకు మహారాష్ర్ట ప్రభుత్వం పంపింది. యూరప్‌లోని జైళ్లతో సరిపోలేలా ఆర్ధర్ రోడ్డు జైలు బ్యారక్ నెంబర్ 12 ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. -
విజయ్ మాల్యాకు భారీ ఊరట
లండన్: రుణ ఎగవేతదారు విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో భారీ ఊరట లభించింది. అతణ్ని భారత్‌కు అప్పగించాలన్న కేసు విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. బెయిల్ గడువు సైతం పొగడించారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో మంగళవారం అప్పగింత కేసు విచారణ ప్రారంభమైన కొద్ది సేపటికే.. కేసును జులై 6కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. అంతేకాదు.. మాల్యాకు మంజూరు చేసిన బెయిల్‌ను మరో ఆరునెలలు(డిసెంబర్ దాకా) పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కోర్టు తీర్పుతో మాల్యాలో హుషారు రెట్టింపైంది. నేటి విచారణకు మాల్యా తనయుడు సిద్ధార్థ్ మాల్యా సైతం హాజరై తండ్రికి బాసటగా నిలిచాడు. బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల రుణాలను ఎగవేసి, లండన్ పారిపోయిన మాల్యా ఏడాదిన్నర కాలంగా అక్కడే ఉంటున్న సంగతి తెలిసిందే. అతనిని రప్పించేందుకు సీబీఐ, ఈడీ నేతృత్వంలోని అధికారుల బృందం.. బ్రిటన్ న్యాయశాఖతో చర్చలుజరిపి అప్పగింత కేసు నమోదుచేయించిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్(సీపీఎస్) వాదనలు వినిపిస్తున్నది. (చదవండి: మాల్యాను రప్పించడం చాలా కష్టం) (నేను ఎవ్వరినీ మోసం చేయలేదు: మాల్యా) -
నేను ఎవ్వరినీ మోసం చేయలేదు: మాల్యా
లండన్: భారత్‌లో రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్ పారిపోయిన విజయ్ మాల్యా మరోసారి తాను నిర్దోషినని వాదించారు. అప్పగింత కేసులో విచారణ ఎదుర్కొనేందుకుగానూ మంగళవారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టుకు హాజరైన ఆయన వీలేకరులతో మాట్లాడారు. భారత ప్రభుత్వం తనపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమైనవని, తాను ఎలాంటి మోసాలకు పాల్పడలేదని మాల్యా చెప్పుకొచ్చారు. మాల్యా అప్పగింత ప్రక్రియకు సంబంధించి భారత్ ఇదివరకే అన్ని ఆధారాలను సమర్పించిన దరిమిలా కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
మాల్యా అప్పగింత కేసు; నేడు విచారణ
లండన్: కింగ్‌ఫిషర్ సంస్థల మాజీ అధినేత, రుణ ఎగవేతదారు విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే కేసును లండన్ వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు మంగళవారం విచారించనుంది. ఈ మేరకు నిందితుడు మాల్యా, భారత్ తరఫు న్యాయవాదులు ఇప్పటికే కోర్టుకు చేరుకున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల రుణాలను ఎగవేసి, లండన్ పారిపోయిన మాల్యా ఏడాదిన్నర కాలంగా అక్కడే ఉంటున్న సంగతి తెలిసిందే. అతనిని రప్పించేందుకు సీబీఐ, ఈడీ నేతృత్వంలోని అధికారుల బృందం.. బ్రిటన్ న్యాయశాఖతో చర్చలుజరిపి అప్పగింత కేసు నమోదుచేయించిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్(సీపీఎస్) వాదనలు వినిపిస్తున్నది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను భారత అధికారులు సీసీఎస్‌కు అందించింది. -
మాల్యా అరెస్ట్ తర్వాత మరో కీలక పరిణామం
భారీరుణ ఎగవేతదారుడు, పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించే ప్రయత్నాలను అధికారులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఇటీవల లిక్కర్ కింగ్ అరెస్ట్ తరువాత భారత విచారణ అధికారులు మరింత వేగంగా కదులుతున్నారు. ఈ మేరకు ఎన్ఫోర్సెమెంట్ డైరెక్టరేట్ (ఇడి) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సీనియర్ అధికారుల ప్రత్యేక బృందం లండన్ చేరుకుంది. అక్కడి బ్రిటిష్ న్యాయవాదులతో చర్చలు జరపనున్నారు. భారత్‌కు విజయ్ మాల్యాను తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఈడీ, సీబీఐ అధికారులతో కూడిన బృందం లండన్‌కు చేరుకుంది. సిబిఐ అదనపు డైరెక్టర్ రాకేష్ ఆస్తానా నేతృత్వంలో బృందం ఈ వ్యవహారాన్ని పరిశీలించనున్నారు. మాల్యాను దేశానికి తిరిగి తీసుకు వచ్చేందుకు లండన్ విచారణ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నట్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి. అలాగే ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శులు రాజీవ్ మెహ్రిషి , అంబర్ రుద్ల చర్చించనున్నట్టు చెప్పాయి. గత వారం లండన్‌లో మాల్యా అరెస్ట్ అయినప్పటినుంచి సీబీఐ, ఈడీ , బ్రిటిష్ న్యాయవాదులు పరస్పరంతో సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపాయి. కాగా ఇటీవల లండన్ లో అరెస్ట్ చేసిన విజయ్ మాల్యాకు బెయిల్ మంజూరైంది. ఈ కేసు మే 17న విచారణకు రానున్న సంగతి తెలిసిందే. -
మాల్యాకు త్వరలోనే చెక్ పడనుందట!
న్యూఢిల్లీ: భారీ రుణ ఎగవేతదారుడు, పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా చాలా తొందరగా చెక్ చెప్పేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు యూకే, భారత్ అధికారుల మధ్య చర్చలు చాలా ఫలితంగా సాగినట్టు తెలుస్తోంది. బ్యాంకులకు వేలకోట్ల రుణాలను ఎగవేసి లండన్‌కు పారిపోయిన మాల్యాను దేశానికి రప్పించడం ముందుగానే ఊహించిన దాని కంటే జరుగనున్నట్టు తెలుస్తోంది. ఇరుదేశాల అధికారుల మధ్య జరిగిన చర్చలు పాజిటివ్‌గా ముగిసినట్టు తెలుస్తోంది. పరస్పర న్యాయ సహాయంతో ఇరు దేశాల అధికారుల మధ్య ఒక సమావేశం తరువాత ఆయన్ను భారత్‌కు రప్పించే అంశంలో బ్రిటన్ అధికారుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. మాల్యా కేసుపై నేరుగా వ్యాఖ్యానించడానికి ప్రభుత్వం ఇష్టపడకపోయినప్పటికీ, రెండు వైపులా వివరణాత్మక మరియు ఫలవంతమైన చర్చలు జరిగినట్టు అధికారిక ప్రతినిధి చెప్పారు. రెండు రోజుల సుదీర్ఘ సమాశాల్లో మాల్యాపై పెండింగ్ లో వివిధ కేసులను చర్చించినట్టు తెలిపారు. రెండు వైపులా న్యాయ సహకారం బలోపేతానికి పెండింగ్‌లో ఉన్న అభ్యర్థనల పరిష్కారాన్ని వేగవంతం కోసం కట్టుబడి ఉన్నట్టు పునరుద్ఘాటించారు -
'నన్ను త్వరగా పారిస్ పంపించండి'
బ్రస్సెల్స్: తనను త్వరగా పారిస్‌కు పంపించాలని ఆ నగరంపై దాడికి పాల్పడి ఇటీవల బ్రస్సెల్స్ పోలీసులకు పట్టుబడిన సలాహ్ అబ్దెస్లామ్ కోరాడు. ఈ విషయాన్ని అతడి తరుపు న్యాయవాది తెలిపాడు. 'వీలయినంత తొందరగా పారిస్ పోయేలా చూడాలని అబ్దెస్లామ్ నన్ను కోరాడు. స్వయంగా తనంతట తానే వివరణ ఇచ్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇది మంచి పరిణామం' అని ఆ న్యాయవాది చెప్పాడు. కాగా, ఫ్రాన్స్‌పై దాడికి సంబంధించి మరింతమంది ఉగ్రవాదుల గురించిన సమాచారం తెలుసుకునేందుకు అతడిని తమ నిర్భందంలోనే ఉంచుకోవాలా లేక పారిస్‌కు బదిలీ చేయాలా అనే విషయంపై బ్రస్సెల్స్ కోర్టు ఈ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.