
లండన్: భారత్‌కు తనను బ్రిటన్ అప్పగించడం చట్టబద్ధంగా తగదంటూ విజయ్‌మాల్యా దాఖలు చేసిన అప్పీల్‌ను బ్రిటన్ హైకోర్టు ఒకటి కొట్టివేసింది. దీనితో భారత్ బ్యాంకులను వేలాది కోట్ల రూపాయలమేర మోసం చేసి, బ్రిటన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాను తిరిగి భారత్ అప్పగించడానికి మార్గం కొంత సుగమం అయ్యింది. అయితే తన తాజా తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అనుమతి కోరేందుకు యూకే హైకోర్టు మాల్యాకు 14 రోజుల గడువు ఇచ్చింది. మాల్యా అప్పీల్‌చేస్తే, దీనిపై తుది తీర్పునకు బ్రిటన్ హోం కార్యాలయం నిరీక్షించాల్సి ఉంటుంది. లేదంటే భారత్–బ్రిటన్ నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద 28 రోజుల్లో భారత్‌కు బ్రిటన్ హోం శాఖ అప్పగిస్తుంది. తప్పుడు సమాచారం ఇవ్వడం, కుట్ర, అక్రమ ధనార్జనలకు సంబంధించి మాల్యా తప్పు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు కనబడుతున్నట్లు లండన్‌లోని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment