Britain Court
-
బ్రిటన్ కోర్టులో నీరవ్ మోదీకి షాక్.. త్వరలోనే భారత్‌కు అప్పగింత!
లండన్: రూ.11వేల కోట్ల బ్యాంకు మోసానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి బ్రిటన్ కోర్టులో షాక్ తగిలింది. తనను భారత్‌కు అప్పగించే విషయంపై అక్కడి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు లండన్ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయనకు చట్టపరంగా ఉన్న అన్ని దారులు మూసుకుపోయినట్లు అయింది. ఫలితంగా ఆయనను త్వరలోనే భారత్‌కు తీసుకువచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11 వేల కోట్ల మేర మోసం చేశాడు. ఈ విషయం బయటకు రావడంతో 2018లో దేశం వీడి పారిపోయాడు. 2019లో లండన్‌లో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి అక్కడి జైలులోనే ఉంటున్నాడు. తనను భారత్‌కు అప్పగించొద్దని గతనెలలోనూ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆయన అప్పీల్‌ను రిజెక్ట్ చేసింది. దీంతో చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరుతూ లండన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తాను భారత్‌కు వెళ్తే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయని, మానసికంగా సమస్యలున్నాయని పిటిషన్లో పేర్కొన్నాడు. న్యాయస్థానం వీటిని తోసిపుచ్చి అప్పీల్‌ను రిజెక్ట్ చేసంది. అయితే నీరవ్‌కు ఇంకా ఓ అవకాశం ఉంది. తనను భారత్‌కు అప్పగించే విషయంపై ఐరోపా సమాఖ్య మానవ హక్కుల కోర్టును ఆయన ఆశ్రయించవచ్చు. చదవండి: రష్యాను వణికిస్తున్న ‘ఫ్లూ’ భయం.. ఇప్పటికే అనారోగ్యంతో పుతిన్! బంకర్లోనే -
మాల్యా అప్పగింతకు తొలగిన మరో అడ్డంకి..
లండన్: భారత్‌కు తనను బ్రిటన్ అప్పగించడం చట్టబద్ధంగా తగదంటూ విజయ్‌మాల్యా దాఖలు చేసిన అప్పీల్‌ను బ్రిటన్ హైకోర్టు ఒకటి కొట్టివేసింది. దీనితో భారత్ బ్యాంకులను వేలాది కోట్ల రూపాయలమేర మోసం చేసి, బ్రిటన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాను తిరిగి భారత్ అప్పగించడానికి మార్గం కొంత సుగమం అయ్యింది. అయితే తన తాజా తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అనుమతి కోరేందుకు యూకే హైకోర్టు మాల్యాకు 14 రోజుల గడువు ఇచ్చింది. మాల్యా అప్పీల్చేస్తే, దీనిపై తుది తీర్పునకు బ్రిటన్ హోం కార్యాలయం నిరీక్షించాల్సి ఉంటుంది. లేదంటే భారత్–బ్రిటన్ నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద 28 రోజుల్లో భారత్‌కు బ్రిటన్ హోం శాఖ అప్పగిస్తుంది. తప్పుడు సమాచారం ఇవ్వడం, కుట్ర, అక్రమ ధనార్జనలకు సంబంధించి మాల్యా తప్పు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు కనబడుతున్నట్లు లండన్‌లోని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. -
మాల్యాను భారత్‌కు అప్పగించండి
లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాల్ని ఎగవేసి విదేశాలకు పరారైన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను స్వదేశం తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. ఆయన్ని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ కోర్టు మంగళవారం అంగీకరించింది. లోక్‌సభ ఎన్నికల ముంగిట ఈ పరిణామం ఎన్డీయే ప్రభుత్వానికి గొప్ప విజయమని భావిస్తున్నారు. మాల్యాకు వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టిన ఆనవాళ్లు కనిపించడం లేదని ఈ తీర్పును వెలువరించిన లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు చీఫ్ జడ్జి ఎమ్మా అర్బుత్నాట్ తెలిపారు. భారత్ సమర్పించిన ఆధారాల్ని పరిశీలించిన మీదట కొన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మాల్యాను భారత్‌కు అప్పగించినంత మాత్రాన ఆయన మానవ హక్కులకు భంగం వాటిల్లదని పేర్కొన్నారు. మాల్యా తన కంపెనీ ఆర్థిక పరిస్థితిని తప్పుగా చూపి బ్యాంకులను మోసిగించారని ఆరోపించారు. విలాసాలకు అలవాటుపడిన ఈ వ్యాపారవేత్త తప్పుడు ధ్రువపత్రాలతో రుణాలు పొందారని పేర్కొన్నారు. ఈ తీర్పు ఆధారంగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ సాజిద్ జావిద్.. మాల్యా అప్పగింతకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేయనున్నారు. ఈ కేసును సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కు అప్పగించడాన్ని మాల్యా లాయర్ల బృందం యూకే హైకోర్టు అనుమతితో 14 రోజుల్లోగా సవాలు చేయొచ్చు. ఒకవేళ మాల్యా లాయర్ల బృందం కోర్టు తీర్పును సవాలుచేయకుంటే జావిద్ ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి 28 రోజుల్లోగా ఆయన్ని భారత్‌కు అప్పగిస్తారు. మరోవైపు, మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్ కోర్టు ఆదేశాల్ని కేంద్ర ప్రభుత్వం, సీబీఐ స్వాగతించాయి. యూపీఏ హయాంలో లబ్ధిపొందిన మాల్యాకు శిక్ష విధించడానికి ఎన్డీయే భారత్‌కు తీసుకొస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఆ ఆఫర్ బూటకం కాదు: మాల్యా అంతకుముందు, మాల్యా కోర్టు ప్రాంగణంలో విలేకర్లతో మాట్లాడుతూ...బ్యాంకులకు అసలు మొత్తాన్ని చెల్లిస్తానని గతంలో చేసిన ప్రకటన బూటకం కాదని అన్నారు. బ్యాంకుల డబ్బును దొంగిలించానని తనపై వస్తున్న కథనాల్ని తోసిపుచ్చారు. ‘రుణాల్ని తిరిగి చెల్లిస్తానని కర్ణాటక హైకోర్టుకు తెలిపాను. ఈ ఆఫర్‌కు అప్పగింత కేసు విచారణకు సంబంధం లేదు. చెల్లించాల్సిన రుణాల కన్నా నా ఆస్తుల విలువే ఎక్కువ’ అని తెలిపారు. హైకోర్టు నుంచి అనుమతి వచ్చాక తొలుత కింగ్‌ఫిషర్ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తానని వెల్లడించారు. జైలు సిద్ధం.. భారత్‌కు తీసుకొచ్చిన తరువాత మాల్యాను ఉంచబోయే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఓ గదిని అధికారులు సిద్ధం చేశారు. జైలు ప్రాంగణంలో రెండంతస్తుల భవనంలో పటిష్ట భద్రత, నిరంతర నిఘా ఉండే చెరసాలలో ఆయన్ని ఉంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ జైలులో అంతర్జాతీయ స్థాయిలో భద్రతా ప్రమాణాలు అమలుచేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ముంబై దాడులకు పాల్పడి సజీవంగా చిక్కిన ఏకైక ఉగ్రవాది కసబ్‌ను కూడా ఈ జైలులోనే నిర్బంధించారు. ప్లేబాయ్ మాయలో బ్యాంకులు! సీబీఐ, ఈడీలు మోపిన నేరాభియోగాలపై విచారణ ఎదుర్కొనేందుకు మాల్యాను భారత్‌కు అప్పగించాల్సిందేనని జడ్జి ఎమ్మా అర్బుత్నాట్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న బెయిల్ షరుతులే ఇకపైనా వర్తిస్తాయని తెలిపారు. భారత్‌కు తీసుకొచ్చిన తరువాత మాల్యాను ఉంచబోయే ముంబై జైలులోని పరిస్థితులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మధుమేహం, హృద్రోగ సమస్యలు తలెత్తితే మాల్యాకు వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారని, జైలులో ఆయనకు ఎలాంటి ముప్పులేదని తెలిపారు. మాల్యాకు బ్యాంకులు అంత భారీ మొత్తంలో రుణాలు మంజూరుచేసిన విధానాన్ని తప్పుపట్టారు. ‘మాల్యాకు రుణాలు మంజూరు చేసిన విషయంలో వ్యవస్థాగతంగా కొన్ని లోపాలతో పాటు ఆర్థికపర దురుద్దేశం ఉన్నట్లు కనిపిస్తోంది. భారత్ సమర్పించిన ఆధారాలతో ఏదీ స్పష్టంగా తెలియట్లేదు. లేదంటే, విలాస పురుషుడు, ప్రముఖుడు, ఎప్పుడూ చుట్టూ బాడీగార్డులను ఉంచుకునే, ఆభరణాలు ధరించే ఆ ప్లేబాయ్ మాయలో బ్యాంకులు పడిపోయి ఉంటాయి. బ్యాంకులు తమ నిబంధనల్ని సైతం పక్కన పెట్టేలా ఆయన ఏదో మంత్రం వేసి ఉంటారు’ అని ఆమె వ్యాఖ్యానించారు. రూ.9 వేల కోట్ల మేర మోసం, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై మాల్యా గతేడాది ఏప్రిల్‌లో అరెస్టయి బెయిల్‌పై విడుదలయ్యారు. మాల్యాను భారత్ ఇది వరకే పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మాల్యా కేసు పూర్వాపరాలు 2005 మే 9: ‘కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్’ పేరిట వాణిజ్య విమాన సర్వీసులను ప్రారంభించిన విజయ్‌మాల్యా 2013: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం తమవద్ద తీసుకున్న రూ.6,494 కోట్లు తిరిగి చెల్లించాలని మాల్యాను కోరిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం 2016 మార్చి3: భారత్ నుంచి పారిపోయి ఆశ్రయం కోసం లండన్ చేరిన మాల్యా 2017 ఫిబ్రవరి: మాల్యాను అప్పగించాలని బ్రిటన్ను కోరిన భారత్ 2017, ఏప్రిల్ 18: మాల్యాను అరెస్టుచేసి సెంట్రల్ లండన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన స్కాట్లాండ్ పోలీసులు. వెనువెంటనే దాదాపు రూ.6కోట్ల విలువైన షూరిటీ పత్రాలు సమర్పించి బెయిలుపై బయటికొచ్చిన మాల్యా. 2017, డిసెంబర్ 4: భారత్‌కు మాల్యా అప్పగింత కేసు విచారణ మొదలు. 2017, డిసెంబర్ 14: భారత్ తరఫు నుంచి, మాల్యా తరఫు నుంచి వారి వాదనలను బలపరిచే పూర్తిస్థాయి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించారు. 2018 ఏప్రిల్ 27: మాల్యాపై అభియోగాలను రుజువుచేస్తూ కోర్టుకు భారత్ సమర్పించిన నివేదికలను సాక్ష్యాలుగా స్వీకరించేందుకు అంగీకరించిన కోర్టు. 2018 జూలై 31: భారత్‌కు అప్పగిస్తే ముంబైలోని ఆర్ధర్ రోడ్ జైలులో మాల్యాను నిర్భంధించే గది వీడియోను కోరిన కోర్టు. 2018 సెప్టెంబర్ 12: భారత్ వీడి లండన్‌కు వచ్చే ముందు ఆర్థికమంత్రి జైట్లీని కలిసే వచ్చానని ప్రకటించిన మాల్యా. అబద్ధమని కొట్టిపారేసిన జైట్లీ డిసెంబర్ 10: మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు అంగీకరించిన లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు మహిళా జడ్జి ఎమ్మా అర్బుత్నాట్. -
మాల్యా అప్పగింతపై విచారణ
లండన్: భారత బ్యాంకులకు రూ.9 వేల కోట్ల మేరకు రుణాలు ఎగ్గొట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అప్పగింతపై బ్రిటన్ కోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. మాల్యాపై బ్యాంకులను మోసగించడం, మనీల్యాండరింగ్ తదితర కేసులు నమోదైన నేపథ్యంలో ఆయనను తమకు అప్పగించాలని భారత్ కోరడంతో లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. కేసు విచారణ సందర్భంగా మాల్యా కోర్టుకు హాజరయ్యారు. తనపై అభియోగాలను కొట్టిపారేసిన మాల్యా.. ఇవన్నీ నిరాధారమని, ఉద్దేశపూర్వకంగా చేసిన అభియోగాలని చెప్పారు. కాగా, మాల్యా కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానంలో ఫైర్ అలారం మోగడంతో విచారణకు ఆటంకం ఏర్పడింది. కోర్టు రూమ్‌ను ఖాళీ చేయించడంతో మాల్యా, ఇతరులు కోర్టు బయటే వేచి ఉన్నారు. అనంతరం కేసు విచారణ కొనసాగింది. మాల్యాపై విచారణ ఈ నెల 14 వరకూ కొనసాగనుంది. ఈ కేసులో న్యాయమూర్తి ఎమ్మా లూయీస్ ఆర్బుత్నాట్ వచ్చే ఏడాది ప్రారంభంలో తీర్పు వెలువరించే అవకాశం ఉంది. మాల్యా తరఫున యూకే మాట్రిక్స్ చాంబర్స్‌కు చెందిన బారిస్టర్ క్లేర్ మాంట్గోమరి నేతృత్వంలోని న్యాయవాదుల బృందం.. భారత ప్రభుత్వం తరఫున క్రౌన్ ప్రొటెక్షన్ సర్వీస్(సీపీఎస్) నేతృత్వంలోని బారిస్టర్ మార్క్ సమ్మర్స్ బృందం వాదనలు వినిపించనున్నాయి. -
లండన్‌లో సీబీఐ, ఈడీ బృందం
లండన్:లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యా అప్పగింత కేసులో బ్రిటన్ కోర్టులో విచారణ నిమిత్తం సీబీఐ, ఈడీ జాయింట్ టీమ్ లండన్‌కు చేరుకుంది. బ్యాంకులకు రూ వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో మాల్యా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మాల్యా అప్పగింత కేసులో తమ న్యాయవాదులకు సీబీఐ,ఈడీ బృందం సహకరించనుంది. మాల్యాకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలను సమర్పించి ఆయనను భారత్‌కు అప్పగించేలా చూస్తామని భారత దర్యాప్తు సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. భారత్ తరపున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ వెస్ట్‌మినిస్టర్ కోర్టులో వాదనలు వినిపిస్తోంది. మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం రుణాలంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసం చేసి నిధులను ఎలా దారి మళ్లించారో వివరిస్తూ 2000 పేజీలతో కూడిన సవివర నివేదికను కోర్టుకు సమర్పించినట్టు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. అదనపు డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ను కూడా కోర్టు ముందుంచినట్టు చెప్పారు. -
భార్యను కొట్టిన ఎన్నారైకు 16 ఏళ్ల జైలు
లండన్: కట్టుకున్న భార్యను, కన్న కొడుకును విచక్షణారహితంగా కొట్టినందుకు ప్రవాస భారతీయుడొకరికి బ్రిటన్ కోర్టు 16 ఏళ్లకుపైగా జైలు శిక్ష విధించింది. దక్షిణ యార్క్‌షైర్‌లోని బమ్స్లే ప్రాంతంలో ఉంటున్న అజిత్ శేఖన్ గతేడాది అక్టోబర్‌లో తన భార్య మంజీత్ కౌర్ శేఖన్(55), కుమారుడు పాల్(31)పై దాడికి పాల్పడ్డాడు. టీవీ చూస్తున్నారనే కోపంతో లోహపు పాత్రతో వీరిపై విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో అజిత్ భార్య, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల నమోదు చేసిన కేసు ఆధారంగా విచారణ జరిపిన కోర్టు అజిత్‌ను దోషిగా తేల్చింది. కొడుకును కొట్టినందుకు 9 ఏళ్ల నెలలు, భార్యను గాయపరిచినందుకు 6 ఏళ్ల 9 నెలల జైలు శిక్ష విధించింది. ఈనెల 9న షిఫీల్డ్ క్రౌన్ కోర్టు ఈమేరకు తీర్పు వెలువరించింది.