briton
-
94 ఏళ్ల వయస్సులో ‘సాహసం’
లండన్ : పండు ముదుసలి. 94 ఏళ్లు. కాటికి కాళ్లు చాపుకునే వయస్సు. అత్యంత సాహసానికి ఒడిగట్టింది. తన కుటుంబ సభ్యులను కలసుకోవాలనే ఆరాటమే అందుకు కారణం. ఇది వర కే లండన్ చేరుకున్న తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఫ్రాన్స్ నుంచి లండన్‌లోని డోవర్ రేవుకు అతి చిన్న పడవలో ఇద్దరు, ముగ్గురితో కలసి బయల్దేరింది. అత్యంత ప్రమాదకరమైన ఇంగ్లీషు ఛానల్లో అతి చిన్న పడవలో డోవర్ రేవు చేరుకునేందుకు బయల్దేరడం అంటే దుస్సాహసమే. ఇలాంటి దుస్సాహసాలకు ఎంతో ఇప్పటి వరకు ఎంతో మంది బలైపోయారు. అయినప్పటికీ ఫ్రాన్స్ నుంచి ఇంగ్లండ్‌కు అక్రమ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. 94 ఏళ్ల పండు ముసలవ్వ చిన్న పడవలో ఇంగ్లీష్ ఛానల్లో 21 మైళ్లు ప్రయాణించగానే బ్రిటన్ గస్తీ నౌకా దళం గమనించింది. వెంటనే ఆమెను, ఆమెతో పాటు వచ్చిన మరో ఇద్దరుముగ్గురిని అదుపులోకి తీసుకొని ఒడ్డుకు చేర్చింది. 94 ఏళ్లు కలిగిన వారు ఇంత వరకు వలస వచ్చేందుకు ప్రయత్నించలేదని, బహూశ వలసకు వచ్చిన వారిలో అతి పెద్ద వయస్కురాలు ఆమెనే కావొచ్చని ఇంగ్లండ్ నౌకాధికారులు తెలిపారు. ఆమె పేరు వెల్లడించేందుకు వారు నిరాకరించారు. (కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్!) ఇతరులతోపాటు తనకు పౌరసత్వం ఇవ్వాలని డోవర్ ఒడ్డుకు చేరుకున్న 94 ఏళ్ల వృద్ధురాలు దరఖాస్తు చేసుకున్నారు. వృద్ధాప్యరీత్య ఆమెకు పౌరసత్వం లభించవచ్చని బ్రిటీష్ మీడియా అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు ఐదువేల మంది ఇంగ్లీష్ ఛానల్ ద్వారా ఫ్రాన్స్ నుంచి లండన్ వలస వచ్చేందుకు ప్రయత్నించారని బ్రిటీష్ అధికార వర్గాలు తెలిపాయి. చదవండి: ‘ఇంటి నుంచి పని’లో పదనిసలు -
మాల్యా అప్పగింతకు తొలగిన మరో అడ్డంకి..
లండన్: భారత్‌కు తనను బ్రిటన్ అప్పగించడం చట్టబద్ధంగా తగదంటూ విజయ్‌మాల్యా దాఖలు చేసిన అప్పీల్‌ను బ్రిటన్ హైకోర్టు ఒకటి కొట్టివేసింది. దీనితో భారత్ బ్యాంకులను వేలాది కోట్ల రూపాయలమేర మోసం చేసి, బ్రిటన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాను తిరిగి భారత్ అప్పగించడానికి మార్గం కొంత సుగమం అయ్యింది. అయితే తన తాజా తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అనుమతి కోరేందుకు యూకే హైకోర్టు మాల్యాకు 14 రోజుల గడువు ఇచ్చింది. మాల్యా అప్పీల్చేస్తే, దీనిపై తుది తీర్పునకు బ్రిటన్ హోం కార్యాలయం నిరీక్షించాల్సి ఉంటుంది. లేదంటే భారత్–బ్రిటన్ నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద 28 రోజుల్లో భారత్‌కు బ్రిటన్ హోం శాఖ అప్పగిస్తుంది. తప్పుడు సమాచారం ఇవ్వడం, కుట్ర, అక్రమ ధనార్జనలకు సంబంధించి మాల్యా తప్పు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు కనబడుతున్నట్లు లండన్‌లోని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. -
పాకిస్తాన్ ప్రధానినవుతా!
దావోస్: ఓ బాలిక తనకు రాసిని ఉత్తరంలో భవిష్యత్తులో తాను ఇండియాకు ప్రధానమంత్రిని అవుతానని చెప్పిందని పాకిస్తానీ యువతి మలాలా యూసఫ్ జాయ్ గుర్తు చేసుకుంది. బాలిక విద్య కోసం పోరాడుతున్న మలాలా త్వరలోనే భారత పర్యటనకు వస్తానని ప్రకటించింది. 15 ఏళ్ల ప్రాయంలో పాకిస్తాన్లో బాలిక విద్య కోసం పోరాడుతున్న క్రమంలో ఆమెపై ఉగ్రమూకలు హత్యయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మలాలా బ్రిటన్ వేదికగా బాలికల సమస్యలపై పోరాడుతోంది. గుల్‌మకాయ్ పేరుతో సంస్థను స్థాపించి బాలిక విద్య కోసం నిధులు సేకరిస్తోంది. ఇందులోభాగంగా ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లోనూ పాల్గొంది. ఈ సందర్భంగా నోబెల్ శాంతి గ్రహీత మీడియాతో మాట్లాడింది. తన సంస్థ గుల్‌మకాయ్ విస్తరణ కోసం ఇండియాలో పర్యటించాలని అనుకుంటున్నానని మలాలా వెల్లడించింది. ఎంతోమంది భారతీయులు ఉత్తరాలు రాసి తన పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొంది. వారిచ్చే ప్రోత్సాహం మాటల్లో వర్ణించలేమని కొనియాడింది. పాకిస్తాన్ ప్రధానినవుతా! తనకు భారత్ అంటే చాలా ఇష్టమని మలాలా చెప్పింది. భారతీయ సినిమాలు, టీవీ కార్యక్రమాలు చూసి హిందీ నేర్చుకున్నానని తెలిపింది. తనకు ఉత్తరం రాసిన ఓ బాలిక భవిష్యత్తులో తాను ఇండియాకు ప్రధానమంత్రిని అవుతానని చెప్పిందని గుర్తు చేసుకుంది. ఆ ఉత్తరం తన హృదయాన్ని తాకిందని చెప్పింది. నేటి బాలికల ఉన్నత ఆశయాలకు ఈ ఉత్తరమే నిదర్శనమని ప్రశంసించింది. తాను కూడా పాకిస్తాన్‌కి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇండియాలోని బాలికల కోసం కూడా తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ‘‘భావితరాలకు బాలికలే భవిష్యత్తు అన్న సంగతి మరువద్దు. కేవలం వారికి విద్యనందిస్తే సరిపోదు, వారికి నచ్చిన రంగంలో రాణించేందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి’’ అని సూచించింది. -
బ్రెగ్జిట్ బిల్లుకు ఆమోదముద్ర
లండన్ : యూరపియన్ యూనియన్ నుంచి వైదొలిగే బ్రెగ్జిట్ బిల్లును బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ (హౌస్ ఆఫ్ కామన్స్) ఆమోదించింది. బ్రెగ్జిట్ బిల్లుపై దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో ప్రధాని థెరిసా మే వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించారు. ఈ ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 324 మంది ఎంపీలు ఓటేయగా, వ్యతిరేకంగా 295 మంది ఓటేశారు. దిగవ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు.. ఇక ఎగువ సభలోనూ పాసవ్వాలి. యూరోపియన్ యూనియన్ చట్టాలన్నీ బ్రిటన్ చట్టాలుగా మారడానికి ఉద్దేశించిన 1972 చట్టం ప్రకారమే హౌస్ ఆఫ్ లార్డ్స్ (ఎగువ సభ)లో బ్రెగ్జిట్‌పై చర్చ జరగనుంది. ఇదిలావుండగా దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్‌లో బ్రెగ్జిట్ బిల్లు ఆమోదమే అత్యంతక కీలక ఘట్టమని నిపుణులు చెబుతన్నారు. దిగువ సభలో బ్రెగ్జిట్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని బ్రెగ్జిట్ సెక్రెటరీ డేవిడ్ డేవిస్ అన్నారు. బ్రిటన్ ప్రయోజనాలకే ఐరోపా సమాఖ్య నుంచి బయటకు వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈయూ నుంచి బ్రిటన్ సాఫీగా బయటకు రావడానికి ఇది ఎంతో దోహదం చేస్తుందని డేవిడ్ డేవిస్ చెప్సారు. దిగువ సభలో బ్రెగ్జిట్ బిల్లు ఆమోదం పొందడం ప్రధాని థెరిసా మే సాధించిన ఘనవిజయంగా విశ్లేషకులు చెబుతున్నారు. -
వామ్మో.. ఎలా దూకాడో చూడండి!
కొంతమంది సరదా కోసం చేసే సాహస విన్యాసాలు.. చూసేవాళ్లకు ఒళ్లు జలదరించేలా ఉంటాయి. ప్రాణాలు పణంగా పెట్టి చేసే సాహసకృత్యాలు ఒక్కోసారి అత్యంత భయానకంగా ఉంటాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణం క్షణాల్లో గాల్లో కలిసిపోతుంది. ఇదిగో సరిగ్గా ఇలాంటి విన్యాసాన్ని లండన్ అడర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్లో ఒక యువకుడు చేశాడు. అది ఈస్ట్ లండన్‌లోని స్ట్రాఫోర్డ్ అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్. ఇంతలో ఒక రైలు అత్యంత వేగంగా స్టేషన్ దాటుకుని వెళుతోంది. స్టేషన్లో పెద్దగా జనాలు ఎవరూ లేరు. ఇంతలో ఒక కుర్రాడు.. వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా.. ఒక గెంతుగెంతాడు. ఉన్న కొద్దిపాటి జనం ఆ దృశ్యాన్ని చూసి కొయ్యబారిపోయారు. ఆత్మహత్యా ప్రయత్నం అని కూడా సందేహించారు. అయితే ఇదేమి జరక్కుండా.. ఆ యువకుడు.. రైలును దాటుకుని ఇవతలి ఫ్లాట్మీదకు పడ్డాడు.. రైలు క్షణకాలం ఆలస్యం చేయకుండా వెళ్లిపోయింది. యువకుడు సాహసంతో చేసిన ఈ విన్యాసం అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తే.. 21 వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్లు వస్తున్నాయి. కొందరైతే.. దూకే ముందు మీ అమ్మ గుర్తుకు రాలేదా అని అడిగారు. మరొకరైతే.. ఇడియట్.. నీకు ఏమన్నా అయితే నీ తల్లిదండ్రుల మాటేమటి అని తిట్టారు. కొందరైతే ఇలాంటి సాహసాలు మళ్లీ చేయొద్దని సూచించారు. -
చావును తెగించిన ధైర్యం!
-
'వారిని వెతికి వేటాడి చంపండి'
లండన్ : ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో చేరే బ్రిటన్‌కు చెందిన పౌరులను వెతికి వేటాడి చంపాల్సిందేనని ఆ దేశ రక్షణశాఖ మంత్రి గావిన్ విలియమ్సన్ అన్నారు. పలువురు బ్రిటన్ నుంచి ఇరాక్, సిరియా వంటి దేశాలకు వెళ్లి అక్కడ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నారని, ఈ విషయాలను తాము జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. అలాంటి వారిని కచ్చితంగా వేటాడి చంపాల్సిందేనని సూచించారు. ప్రస్తుతం ఇరాక్, సిరియాలోని ఇస్లామిక్ స్టేట్‌లో దాదాపు 270మంది బ్రిటన్ పౌరులు ఉన్నట్లు తాము గుర్తించామని, వారిని మట్టుబెట్టేందుకు అవసరం అయితే బలగాలు వైమానిక దాడులు కూడా చేయాలని సూచించారు. 'వీలయిన ప్రతీది మనం తప్పకుండా చేయాలి. బెదిరింపులను తప్పించేందుకు మనం కూడా విధ్వంసం చేయాలి' అని ఆయన ఆవేశంగా అన్నారు. అంతేకాకుండా బ్రిటన్ నుంచి వెళ్లి ఐసిస్‌లో చేరినవారిని తిరిగి బ్రిటన్ రానివ్వకుండా చేయాలని, వారిని అంతమొందించాలని చెప్పారు. -
ఆ దెయ్యాల కంట పడ్డారో.. అంతే?!
దయ్యాలు.. ఆత్మలు గురించి మాట్లాడుతుంటే.. ఇంకా ఈ కాలంలో వాటి గురించి చర్చించే వాళ్లున్నారా? అని వింతగా చూస్తారు. ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తే.. అబ్బే అవన్నీ ఉత్తి మాటలని కొట్టి పారేస్తాం. ఆత్మలు, దయ్యాలు అనేవి లేవు.. మన భ్రమ అని సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. ఇటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. మీరు నమ్మినా నమ్మకపోయినా.. అక్కడ మాత్రం దయ్యాలున్నాయి. బ్రిటన్.. ఆధునికతకు మారు పేరుగా నిలిచన దేశం. ఇక్కడున్న యార్క్‌షైర్, విల్ట్‌షైర్, నర్ఫోక్, కుంబ్రియా, స్టాఫోర్డ్‌షైర్, ఎడ్విన్ బర్డ్, ఇజిల్ ఆఫ్ వెయిట్, లండన్ ప్రాంతాల్లో దయ్యాలు విరివిగా తిరుగుతున్నాయి. ఏదో ఒకటిరెండు కాదు.. వందల సంఖ్యలో ఆత్మలు, దయ్యాలు సంచరిస్తున్నాయట. యార్క్‌షైర్ : ఈ ప్రాంతాన్ని బ్రిటన్‌లో దయ్యాల అడ్డాగా పిలుస్తారు. ఇక్కడ రమారమీ 607 దయ్యాలను ప్రజలు గుర్తించారట. బ్రాడ్‌ఫోర్డ్‌లోని గోల్ఫ్ కోర్ట్ దగ్గర రాత్రి సమయాల్లో దయ్యాలు సంచరిస్తాయట. తూర్పు యార్క్‌షైర్ ప్రాంతంలోనూ.. అతీత శక్తులు తిరుగాడుతాయట. ఈ ప్రాంతంలో 1960-70 మధ్యనివసించిన ఒక దొంగ సాధువు.. అనేకమందిని హత్య చేశాడట. కొన్నాళ్లుకు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడట. దొంగ సాధువు చేతిలో అమాకయంగా హతులైన వారు.. చివరకు దొంగ సాధువు కూడా దయ్యాలై ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నారని ఒక కథనం ఉంది. ఇది నిజమని చాలా మంది విశ్వాసం. విల్ట్‌షైర్: విల్ట్‌షైర్, నోర్ఫోక్ ప్రాంతంలోని అడవుల్లో సుమారు 28 దయ్యాలు తిరుగుతున్నాయట. ఇవి చాలా వరకు నల్లటి భీకరమైన కుక్కలా కనిపిస్తాయని.. మనిషి కనిపిస్తే.. వెంటాడి వేటాడతాయని ప్రజలు చెబుతున్నారు. స్టాఫొర్డ్షైర్ : ఈ ప్రాంతంలో 2007 నుంచి భీకరమైన తోడేలు రూపంలో దయ్యాలు తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వీటిపైన వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ఘోస్ట్ క్లబ్ వారు పరిశోధనలు సైతం చేశారు. ఎవరైనా రాత్రి పూట ఒంటరిగా నడుస్తున్న సమయంలో.. ఈ తోడులు వెనకగా వస్తుందట.. మనిషి దానిన గమనిస్తే.. బిగ్గరగా అరిచి.. భయపెడుతుందట. లండన్ : గ్రేటర్ లండన్‌లోనూ ప్రజలకు ఇటువంటి అనుభవాలున్నాయట. సుమారు 547 మంది ప్రజలు వీటి బారిన పడి ఇబ్బందులు పడ్డారట. -
ఆ దెయ్యాల కంట పడ్డారో.. అంతే?!
-
ఎన్నికలవేళ బ్రిటన్‌పై ఉగ్రపంజా
-
ఎన్నికలవేళ బ్రిటన్‌పై ఉగ్రపంజా
- వరుస ఉగ్రదాడులతో బ్రిటిషర్లు ఉక్కిరిబిక్కిరి - నేడు లండన్‌లో ఆరుగురు.. మొన్న మాంచెస్టర్‌లో 22 మంది బలి - చాంపియన్స్ ట్రోఫీపైనా ఉగ్రనీడలు.. జూన్ 8న పోలింగ్ లండన్: మాంచెస్టర్ మారణకాండ నుంచి తేరుకోకముందే బ్రిటన్‌పై ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. సెంట్రల్ లండన్‌లో థేమ్స్ నదిపై ఉన్న ‘లండన్ బ్రిడ్జి’పై ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. వ్యాన్‌ను వేగంగా నడుపుతూ పాదచారులను తొక్కిచంపేశారు. అదే సమయంలో సమీప బారో మార్కెట్ వద్ద కత్తులతో పలువురిని పొడిచి చంపారు. ఈ రెండు ఘటనల్లో కనీసం ఆరుగురు చనిపోగా, పదుల సంఖ్యలో జనం గాయపడినట్లు తెలిసింది. దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను లండన్ పోలీసులు కాల్చిచంపినట్లు సమాచారం. ఎప్పుడు జరిగింది? శనివారం రాత్రి 10 గంటల సమయంలో వ్యాన్‌ను నడుపుకుంటూ లండన్ బ్రిడ్జిపైకి వచ్చిన ఉగ్రవాదులు.. పాదచారులపైకి వాహనాన్ని ఎక్కించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే బ్రిడ్జిని ఆనుకుని ఉన్న బరో మార్కెట్లో ఉగ్రవాదులు.. పౌరులను కత్తులతో పొడిచినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇది ఉగ్రదాడేనని బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే అనుమానం వ్యక్తంచేశారు. మరికొద్ది గంటల్లో ఎన్నికలు: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ దేశంలో వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకుంటుండటం బ్రిటిషర్లను కలవరపెడుతోంది. 650 స్థానాలున్న బ్రిటన్ పార్లమెంటుకు జూన్ 8న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు పోలీసులు, అధికారగణం ఏర్పాట్లలో తలమునకలైఉన్నారు. ఇదే అదనుగా భావించి ముష్కరులు తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. మే 22న బ్రిటన్ పారిశ్రామిక నగరం మాంచెస్టర్‌లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతిదాడిలో 22 మంది చనిపోయారు. ఆ సంఘటనతో ఎన్నికల ప్రచారం నిలిచిపోయింది. అయితే పోలింగ్ దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు మళ్లీ కార్యకలాపాలు ముమ్మరం చేశాయి. చాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రనీడలు: లండన్, వేల్స్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స ట్రోఫీపై ఉగ్రనీడలు కమ్ముకున్నాయి. టోర్నీ ప్రారంభానికి ముందే మాంచెస్టర్ ఘటన జరగడంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు భయాందోళనలను వ్యక్తం చేశాయి. అయితే ‘భద్రతకు మాదీ గ్యారెంటీ’ అని ఇంగ్లాండ్ క్రికెట్‌బోర్డు హామీ ఇవ్వడంతో సిరీస్ సజావుగా మొదలైంది. కానీ నేటి ఉగ్రదాడితో పరిస్థితి తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. కీలకమైన ‘పాకిస్థాన్- ఇండియా’ మ్యాచ్‌కు కొద్ది గంటల ముందే ఉగ్రదాడి చోటుచేసుకోవడం క్రీడాభిమానులను కలవరపాటుకు గురిచేసింది. తాజా ఉగ్రదాడి జరిగిన లండన్ నగరానికి.. ఇండో-పాక్ మ్యాచ్ జరిగే బర్మింగ్‌హోమ్ నగరానికి మధ్య దూరం 200 కిలోమీటర్ల పైమాటే అయినా ఏక్షణం ఏంజరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠనెలకొంది. (మాంచెస్టర్ మారణకాండ: భారీ మూల్యం!) -
భీకర పోరాటంలో ఊహించని మలుపు
అనాదిగా వస్తోన్న 'ఆహార గొలుసు' నియమం ప్రకారం కొండచిలువను చంపి తినాలనుకున్న గుంట నక్క.. అనూహ్యంగా ఉడుంపట్టుకు చిక్కి కుక్కచావు చచ్చింది. మనుగడకోసం జరిగిన ఈ భీకర పోరాటం తాలూకు ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. న్యూసౌత్ వేల్స్(బ్రిటన్)కు చెందిన తండ్రీకొడుకులు పనిమీద పట్నం పోయి ఊరికి తిరిగి వస్తూ మధ్యలో కాసేపు కారు ఆపారు. పక్కనుంచే గట్టిగా కసా-బుసా శబ్ధాలు వినిపించడంతో అటుగా కదిలారు. తీరా చూస్తే.. కొండచిలువ-నక్కల పోరాటం. అప్పటికే నక్క తన కోరపళ్లతో కొండచిలువ తలను నమిలే ప్రయత్నం చేసింది. తనను తాను కాపాడుకునే క్రమంలో ఆ రెండు మీటర్ల భారీ కొండచిలువ.. నక్కను అమాంతం చుట్టేసి నలిపేసింది. దీంతో ఊపిరాడక నక్క చచ్చిపోయింది. ఈ దృశ్యాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించిన సాహస తండ్రీకొడుకులు.. ఇంకాస్త దగ్గరికి వెళ్లి నక్క నోట్లో నుంచి కొండచిలువ తలను బయటికి తీశారు. నక్కను చుట్టుముట్టిన కొండచిలువ కూడా వేరుచేసేందుకు ప్రయత్నించేశారట. కానీ విజయగర్వంతో ఊగిపోతోన్న ఆ కొండచిలువ వీళ్లకేసి బుసలు కొట్టడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వచ్చేశారట! -
ఢాకా కేఫ్ ముట్టడి కేసులో మరో ఇద్దరి అరెస్ట్...
ఢాకాః బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కేఫ్ సీజ్ కేసులో మరో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశీ మూలాలు కలిగిన.. ఓ బ్రిటిష్ పౌరుడు సహా.. కెనడియన్ యూనివర్శిటీ విద్యార్థి అయిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతనెల్లో జరిగిన ఢాకా మారణహోమం తో వారికి సంబంధాలు ఉన్నట్లు అనుమానించిన పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. ఢాకా కేఫ్ దాడిలో మరో ఇద్దరు అనుమానితుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బంగ్లాదేశీ మూలాలు కలిగిన బ్రిటిష్ పౌరుడు మస్నత్ కరీం తోపాటు... టొరంటో విశ్వవిద్యాలయ విద్యార్థి అయిన తహ్మింద్ ఖాన్ లను బుధవారం రాత్రి నిర్బంధించినట్లు పోలీస్ ప్రతినిధి ఏకేఎమ్ షహిదుర్ రెహ్మాన్ వెల్లడించారు. ఎవరినైనా నేరస్థులుగా అనుమానించినప్పుడు వినియోగించే చట్టం ఐపీసీ సెక్షన్ 54 క్రింద వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా విదేశీయులు ఉండే హోలీ ఆర్టిజన్ కేఫ్ ను ముష్కరులు ముట్టడించిన సమయంలో జూలై 1వ తేదీ రాత్రి కరీం, ఖాన్ లు లోపలే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని బంధించి జరిపిన దాడిలో ఇద్దరు పోలీసులతోపాటు 20 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే కమెండోలు జూలై 2వ తేదీ ఉదయం ఢాకా కేఫ్ పై దండెత్తిన సమయంలో వారు బయట ప్రజలతోపాటు కనిపించినట్లు ఆధారాలనుబట్టి తెలుసుకున్నారు. అయితే కరీం, ఖాన్ లు ఇద్దరూ సెక్యూరిటీ సర్వీసెస్ లో ఉండేవారని, వారికి దాడితో ఎటువంటి సంబంధాలు లేవని వారి కుటుంబ సభ్యులు విచారణలో తెలిపారు. కాగా పోలీసులు ఈ వారం మొదట్లో ఢాకా మారణహోమం ప్రధాన సూత్రధారి బంగ్లాదేశ్ మూలాలు కలిగిన కెనడాకు చెందిన వ్యక్తి తమీమ్ చౌదురిగా గుర్తించారు. అతడికోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి 25,000 డాలర్లు బహుమతిని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యం.. ప్రస్తుత అరెస్టులకు దారి తీసింది. -
22 గంటల్లో ఆమెను 110 మంది రేప్ చేశారు!
-
22 గంటల్లో ఆమెను 110 మంది రేప్ చేశారు!
ఏథెన్స్: గ్రీకు దేశానికి ఆమె విహారయాత్ర జీవితంలో మరిచిపోలేని 'పీడకల'గా మారింది. 14 ఏళ్ల మేగన్ స్టీఫెన్స్ (పేరు మార్చారు) తన తల్లితో కలిసి 2009లో గ్రీస్ పర్యటనకు వెళ్లింది. కానీ విహారయాత్ర కాస్తా ఆమె పాలిట విషాదయాత్రగా మారింది. జీవితానికి సరిపడ నరకయాతనను మిగిల్చింది. మేగన్‌ను ఆమె ప్రియుడే 'సెక్స్ బానిస'గా అమ్మేశాడు. దీంతో ఆరేళ్లపాటు వేశ్యగా నరకయాతన అనుభవించిన మేగన్ ఎట్టకేలకు తప్పించుకొని బయటపడింది. ఇప్పుడు ఆ నరకయాతన, వ్యభిచార కూపపు అనుభవాలను మారుపేరుతో 'బాట్ అండ్ సోల్డ్'గా పుస్తకరూపంలో ప్రచురించింది. ఒక వ్యభిచారిగా తాను అనుభవించిన హృదయవిదారకమైన దుస్థితిని ఈ పుస్తకంలో మేగన్ వివరించింది. రోజుకు 50 మందితో పడుకునేలా ఆమెపై ఒత్తిడి తెచ్చేవారు. ఒక్కోసారి 22 గంటల్లో 110 మంది ఆమెతో బలవంతంగా శృంగారించేవారు. అక్రమ మానవ రవాణా దుండగులు మేగన్‌ను అనేకసార్లు అమ్మివేశారు. కొన్నిసార్లు వీధుల్లో, మరికొన్ని బ్రోతల్ గృహాల్లో ఆమె పడుపు వృత్తిని చేయాల్సి వచ్చింది. 14 ఏళ్ల వయస్సులో గ్రీకు వచ్చినప్పటి అనుభవాలను మేగన్ ఈ పుస్తకంలో వివరించింది. అప్పుడు తల్లితో కలిసి వచ్చిన ఆమె ఓ గ్రీకు బార్లో జాక్ (22)ను తొలిసారి కలిసింది. అప్పటికే ప్రేమ కోసం తహతహలాడుతున్న మేగన్ అతన్ని తొందరగానే వలచింది. తల్లికి జాక్ నచ్చకపోయినా అతనితో కలిసి ఉండేందుకు అంగీకరించింది. ఎందుకంటే ఆమె బార్ ఓనర్ నికోస్‌తో అప్పట్లో సన్నిహితంగా ఉండేది. విహారయాత్ర ముగిసాక జాక్‌తో గ్రీకులోనే ఉండిపోతానని మేగన్ తల్లిని ఒప్పించింది. తన అధీనంలోకి వచ్చిన తర్వాత టాప్‌లెస్ (అర్థనగ్న) బార్లో నర్తించాల్సిందిగా మేగన్‌ను జాక్ ఒత్తిడి తెచ్చాడు. అందువల్లే వచ్చే డబ్బుతో తన తల్లికి చికిత్స చేయిస్తానని బుకాయించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో చితకబాది బ్రోతల్ హౌస్ కి అమ్మేశాడు. క్రమంగా ఆమె పడుపువృత్తిలోకి నెట్టివేయబడింది. ఆమెతో ఐదు నిమిషాలు గడిపితే ఒక విటుడు 20 జీబీపీ (గ్రీకు కరెన్సీ) ఇచ్చేవాడు. కొన్ని సందర్భాల్లో 22 గంటలపాటు ఏకధాటిగా ఈ వృత్తి కొనసాగేది. దాదాపు 110 మందితో ఆమె శంగారంలో పాల్గొనేలా దారుణాతి దారుణంగా అక్కడ పరిస్థితులు ఉండేవని మేగన్ తన పుస్తకంలో ఆ చీకటి అనుభవాలను గుర్తుచేసుకుంది. ఆ తర్వాత ఎలాగోల బయటపడి తిరిగి బ్రిటన్ వచ్చిన మేగన్ తల్లిని కలుసుకుంది. ఇప్పుడు 25 ఏళ్ల ఆమె ఓ వ్యక్తిని పెళ్లాడి గర్భవతి అయింది. అక్రమ రవాణా బారినపడి నరకయాతన అనుభవిస్తున్న అభాగ్యులైన మహిళలకు చేయూత అందించేందుకు ఓ చారిటీని స్థాపించాలని మేగన్ భావిస్తోంది. -
'ఈ రోజుకీ ఆమె బతికే ఉంది'
లండన్: ఆ చిన్నారి పుట్టిన 74 నిమిషాలకే కన్నుమూసింది. ఆ కొద్ది నిమిషాల్లో ఒక మంచిపని చేసి అమరజీవిగా నిలిచిపోయింది. తాను చనిపోతూ అయవయదానంతో మరొకరికి పునర్జన్మ ప్రసాదించింది. బ్రిటన్ లో యంగెస్ట్ ఆర్గాన్ డోనర్ గా తన పేరు లిఖించుకుంది. ఆ నవజాత ఆడశిశువు పేరు హోప్ లీ. గర్భంలో ఉండగానే ఆమె అమస్తిష్కత(అనిసెఫలే)తో బాధపడుతున్నట్టు హోప్ లీ తల్లిదండ్రులు ఎమ్మా, ఆండ్రూ గుర్తించారు. అమస్తిష్కత కారణంగా మెదడు, పుర్రే సరిగా అభివృద్ధి చెందవని, పుట్టిన తర్వాత ఆమె బతకదని వైద్యులు తెలపడంతో హోప్ లీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గుండెను దిటువుచేసుకుని అవయవదానికి అంగీకరించారు. కేంబ్రిడ్జి ఆస్పత్రిలో తన ట్విన్ సోదరుడు జోష్ కంటే రెండు నిమిషాలు ముందు పుట్టిన హోప్ లీ కొద్దినిమిషాలకే కన్నుమూసింది. ఆమె మాత్రపిండాలను సేకరించి పెద్దాళ్లకు అమర్చారు. ఆమె కాలేయం నుంచి సేకరించి కణాలను భద్రపరిచారు. కాలేయ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వారికి వీటిని వినియోగించనున్నారు. హోప్ లీ అవయవాలను దానం చేయాలన్న నిర్ణయం తమ గుండెలను పిండేసిందని, కానీ తప్పలేదని ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు. 'మరొకరికి అవయవాలు దానం చేయడం ద్వారా ఈరోజుకీ(హోప్) బతికేవుంది. తీవ్ర దుఃఖంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. అయితే హోప్ ద్వారా మరొకరికి ప్రాణదానం చేశామన్న సంతృప్తి మా బాధను కొంతవరకు తగ్గించింది' అని అన్నారు. -
బ్రిటన్ను టార్గెట్ చేసిన ఐఎస్ఐఎస్!
లండన్: బ్రిటన్‌లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా యూకే భద్రతా విభాగం ప్రకటించింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దేశంలో దాడులకు సన్నాహాలు చేసుకుంటున్నారనీ, వీటిని నియంత్రించడానికి నిఘా విభాగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని బ్రిటన్ భద్రతా విభాగం ఎమ్ఐ5 డైరెక్టర్ జనరల్ ఆండ్రూ పార్కర్ గురువారం ప్రకటించారు. బ్రిటన్‌లో ఐఎస్ఐఎస్ దాడులు జరగడానికి గల అవకాశాలు ఇంత ఎక్కువగా ఎన్నడూ చూడలేదని తెలిపిన పార్కర్, గత సంవత్సరం ఉగ్రవాదులు దాడి కోసం చేసిన ఆరు ప్రయత్నాలను విఫలం చేశామని తెలిపారు. సిరియా నుండి ఐఎస్ఐఎస్ ప్రేరేపిత ఉగ్రవాదులు బ్రిటన్‌లో దాడులు జరపడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. దేశం నుండి సుమారు 750 మంది ఉగ్రవాదులు సిరియాకు వెళ్లడం, బ్రిటన్‌లో దాడికి గల అవకాశాలను పెంచుతుందని హెచ్చరించారు. టీనేజ్ పిల్లల నుండి వయోజనుల వరకు అందరినీ ఇస్లామిక్ ఉగ్రవాదులు అంతర్జాలం ద్వారా ప్రభావితం చేస్తున్నారని, యువత త్వరగా వారి ఉచ్చులో పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆధునిక సమాచార వ్యవస్థ ద్వారా ద్వేషాన్ని రగిలించడంలో ఐఎస్ఐఎస్ ఆరితేరిందని పార్కర్ తెలిపారు. బ్రిటన్‌లో నిఘా వ్యవస్థకు సంబంధించిన చట్టాలలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందనీ, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చట్టాలలో వెసులుబాటు చేయాల్సిన అవసరం అని పార్కర్ తెలిపారు. -
ఎలక్ట్రిక్ హైవేలు వస్తున్నాయ్!!
సాక్షి: సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి అందుబాటులోకి వస్తున్నాయి. అలా ఓ కొత్త ఆవిష్కరణ.. దాని వెనుక కొన్ని సవాళ్లు.. చివరకు వాటికి పరిష్కారం.. అలాంటి వాటిలో ఒకటి ఎలక్ట్రిక్ హైవేలు. కొన్నేళ్ల క్రితం ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వచ్చాయి. అయితే వాటికి అంతగా ఆదరణ లభించలేదు. ఈ క్రమంలోనే వీటి వినియోగానికి ఇప్పుడు ఓ పరిష్కారమార్గాన్ని కనుగొన్నారు నిపుణులు. అదే ఎలక్ట్రిక్ హైవే. ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డంకులు ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లువంటి వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ వీటికి ఎక్కడా సరైన ఆదరణ లభించలేదు. ఇందుకు ఉన్న కారణాల్లో ప్రధానమైంది.. వీటితో ఎక్కువ దూరం ప్రయాణించలేం. గంట, లేదా రెండు గంటలపాటు చార్జింగ్ చేస్తే బ్యాటరీ ఫుల్ అవుతుంది. కానీ ఈ బ్యాటరీలతో 30, 40 కిలోమీటర్లకు మించి దూరం వెళ్లలేం. అందువల్ల ఎక్కువ దూరం ప్రయాణించేవారు ఇలాంటి వాహనాలు తీసుకోరు. పైగా వీటిని ఎక్కడపడితే అక్కడ చార్జ్ చేసుకోలేం. ప్రయాణం మధ్యలో చార్జింగ్ అయిపోతే ఇక అంతే సంగతులు. మళ్లీ చార్జింగ్ చేయగలిగే సెంటర్లు ఎక్కువగా అందుబాటులో లేవు. పర్యావరణహితం ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి మేలు కలిగిస్తాయి. సంప్రదాయ వాహనాల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలను ఇంధనంగా వాడుతున్నారు. వీటిని వినియోగించడం వల్ల హానికర వాయువులు గాలిలోకి విడుదలవుతాయి. ఫలితంగా పర్యావరణానికి హాని కలుగుతుంది. పైగా భవిష్యత్‌లో ఈ వనరుల కొరత వెంటాడే అవకాశం ఉంది. వీటి ధరలూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. కానీ ముందుగా వీటి వినియోగంలో ఉన్న సమస్యలను అధిగమించాలి. విదేశాల్లో అధికం.. మన దేశంలో కన్నా బ్రిటన్, అమెరికాలాంటి దేశాల్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తున్నారు. బ్రిటన్‌లో ఇటీవల కాలంలో వీటి అమ్మకాలు 300 శాతం పెరిగినట్లు అంచనా. వీటిని మరింతగా వినియోగంలోకి తేవాలని ఆయా దేశాలు కృషి చేస్తున్నాయి. దీనిలో భాగంగా బ్రిటన్‌లో ఇప్పటికే పలు చోట్ల రహదారులపై ఎలక్ట్రిక్ చార్జింగ్ సెంటర్లను ప్రభుత్వం నెలకొల్పింది. కొన్ని ప్రాంతాల్లో దాదాపు ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ హైవేలంటే.. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లు ఉన్నట్లుగానే హైవేలమీద ఎలక్ట్రిక్ హైవేలకోసం ఓ ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ రోడ్ల అంతర్భాగంలో ఎలక్ట్రిక్ కేబుల్స్‌ని ఏర్పాటు చేస్తారు. ఇవి విద్యుదయస్కాంత తరంగాల్ని ఏర్పరుస్తాయి. ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలంటే ఎలక్ట్రిక్ కార్లకు అడుగు భాగంలో ప్రత్యేక పరికరం ఉండాలి. ఈ రోడ్లపై వాహనాలు వెళ్తున్నప్పుడు వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు ఆ పరికరానికి విద్యుత్ శక్తిని అందిస్తాయి. ఈ పరికరం ద్వారా అది కారు బ్యాటరీకి చేరి చార్జింగ్ అవుతుంది. దీంతో రోడ్లపై వెళ్తున్నంతసేపూ కార్లకు చార్జింగ్ అవుతూనే ఉంటుంది. ఎంతదూరం వెళ్లినా చార్జింగ్ అయిపోతుందనే ఇబ్బంది ఉండదు. చార్జింగ్ కోసం మధ్యలో ఎక్కడా ఆగాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇది ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. బ్రిటన్‌లో ఇలా రహదారిని ఏర్పాటు చేసి పరీక్షించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటిని అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియాలో కూడా ఎలక్ట్రిక్ హైవేలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా పర్యావరణానికీ మేలు జరుగుతుంది. -
మ్యాగీ నూడుల్స్‌కు బ్రిటన్ క్లీన్చిట్
లండన్: భారత్‌లో నిషేధానికి గురైన మ్యాగీ ఉత్పత్తుల సంస్థ నెస్లేకు గొప్ప ఉపశమనం లభించింది. మ్యాగీ ఉత్పత్తులకు బ్రిటన్ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చింది. మ్యాగీ ఉత్పత్తులు సురక్షితమని, వీటిని తినడం ఎలాంటి హానికరం కాదని బ్రిటన్ ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఏ) సర్టిఫికెట్ ఇచ్చింది. భారత్‌లో తయారు చేసిన ఈ ఉత్పత్తులు యూరోపియన్ యూనియన్ అనుమతించిన స్థాయి మేర ఉన్నాయని పేర్కొంది. మ్యాగీ నూడిల్స్ శాంపిల్స్‌ను పరీక్షించిన అనంతరం బ్రిటన్ ఎఫ్ఎస్ఏ నివేదిక రూపొందించింది. మ్యాగీ తయారీలో స్థాయి మేరకు పదార్థాలను వాడారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వినియోగదారులకు భరోసా ఇచ్చింది. మ్యాగీ నూడుల్స్ లో సీసం(లెడ్), మోనో సోడియం గ్లూటామేట్(ఎంఎస్‌జీ) అనే హానికర రసాయనాలు పరిమితికి మించి ఉన్నాయనిని భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) తనిఖీల్లో రుజువుకావడంతో జూన్ 5న కేంద్ర ప్రభుత్వం నిషేధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకానొక దశలో మ్యాగీ ఉత్పత్తులన్నింటినీ ధ్వంసం చేయాలనే డిమాండ్ వెల్లువెత్తడంతో అలా చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని, విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతించాలని నెస్లే సంస్థ కోర్టును ఆశ్రయించింది. భారత్‌లో నిషేధానికి గురైన మ్యాగీ ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతించాలన్న నెస్లే అభ్యర్థనకు బాంబే హైకోర్టు అంగీకారం తెలిపింది. -
'ఓ' బ్లడ్ గ్రూపా.. అయితే మీకు మతిమరుపు లేనట్టే..!
లండన్: ఏ, బి, ఏబి రక్త గ్రూప్‌లతో పోలిస్తే ఓ గ్రూప్ రక్తం కలిగిన వారికి మతిమరుపు సంబంధమైన అల్జీమర్స్ సంభవించే అవకాశం తక్కువేనని పరిశోధకులు అంటున్నారు. ఓ రక్త గ్రూప్ కలిగిన వారి మెదడులో బూడిద వంటి పదార్థం ఎక్కువగా ఉంటుందని, ఇది అల్జీమర్స్ రాకుండా కాపాడుతుందని వారు తెలిపారు. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ షెఫ్ఫిల్డ్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం జ్ఞాపకశక్తి సంబంధ సమస్యలు తలెత్తడానికి రక్త గ్రూప్‌లు కూడా కారణమవుతాయి. యుక్త వయసులో మెదడులో బూడిద రంగు పదార్థం సహజంగానే ఉంటుంది. అయితే వయసు పైబడుతున్న కొద్దీ మెదడులో ఈ పదార్థ స్థాయిలో మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు రక్త గ్రూప్‌లను బట్టి వేర్వేరుగా ఉంటాయి. ఓ రక్త గ్రూప్ ఉన్నవారిలో ఈ పదార్థం ఎక్కువగా ఉండి, అల్జీమర్స్ వ్యాధి రాకుండా మెదడులోని భాగాల్ని నియంత్రిస్తుంది. అనేక మంది మెదడును ఎమ్ఆర్ఐ స్కానింగ్ ద్వారా పరీక్షించి శాస్త్రవేత్తలు ఈ విషయాలు వెల్లడించారు. -
చంద్రుడికో వరదగూడు!
చందమామ చుట్టూ రంగురంగుల కాంతివలయం ఏర్పడిన ఈ అద్భుత దృశ్యం సోమవారం బ్రిటన్‌లో కనువిందు చేసింది. అయితే ఇదంతా భూమి వాతావరణంలోని మంచు స్ఫటికాల మాయ! సుమారు 20 వేల అడుగుల ఎత్తులోని పలుచని మేఘాల్లోని మంచు స్ఫటికాలు చంద్రుడి కాంతిని వక్రీకరించి చూపడంతో ఇలా కనిపించింది. అన్నట్టూ... చంద్రుడి చుట్టూ ఇలా కాంతివలయం కనిపించడం అనేది.. వరదలొచ్చేంత భారీ వర్షాలకు సూచన అని భావిస్తారు. కానీ దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు తేల్చేశారు. -
విడిపోవాలి.. లేదు కలిసుండాలి!
విభజించు పాలించు విధానాన్ని అవలంభించిన ఆంగ్లేయులు ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తమతో సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగించిన స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భావించాలన్న ఆకాంక్షను వెల్లడించడంతో విలవిల్లాడుతున్నారు. విడిపోవద్దంటూ స్కాట్లాండ్ వాసులను వేడుకుంటున్నారు. మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు స్కాట్లాండ్ ప్రజలు సిద్దమయ్యారు. ఫలితం ఎలావున్నా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విభజనపై స్కాట్లాండ్ లోని ప్రవాస భారతీయులు రెండుగా విడిపోయారు. కొంతమంది సమైక్యానికే మద్దతు పలుకుతుంటే, మరికొందరు విడపోవడమే మేలంటున్నారు. స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాలన్న ఆకాంక్షను భారత సంతతి విద్యార్థిని జవిత నారంగ్ వ్యక్తం చేసింది. స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి కావలసిన అన్ని అర్హతలు స్కాట్లాండ్ కు ఉన్నాయని ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో క్లినికల్ సైకాలజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న జవిత అభిప్రాయపడింది. జవిత అభిప్రాయంతో అబర్డీన్ ఇండియన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు మొహువా బెనర్జీ విభేదించారు. బ్రిటన్ లో భాగంగా స్కాట్లాండ్ కొనసాగాలని తాను కోరుకుంటున్నానని మూడు దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్న ఆమె పేర్కొన్నారు. ఏ దేశమైనా విడిపోతే బలహీనపడుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. మొహువా వాదనతో గ్లాస్కో బెంగాలీ సాంస్కృతిక సంఘం అధ్యక్షురాలు షీలా బెనర్జీ ఏకీభవించారు. గ్లాస్కో ప్రాంతంలో ఉన్న బెంగాలీల్లో 99 శాతం మంది విభజనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. బ్రిటన్ నుంచి స్కాట్లాండ్ విడిపోరాదని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని బ్రిటన్ కు చెందిన సోషల్ వర్కర్ రిచా గ్రోవర్ కోరారు. బ్రిటన్‌తో 307 ఏళ్ల అనుబంధాన్ని కొనసాగించడమా? లేక స్వతంత్ర దేశంగా తొలి అడుగులు వేయడమా? అనేది స్కాట్లాండ్ ప్రజలు మరికొద్ది గంటల్లో నిర్ణయించనున్నారు. -
బ్రిటన్‌లో 73 శాతం కొనుగోళ్లు ఆన్లైన్లోనే
మీరు ఇంటర్నెట్ ఎంతవరకు ఉపయోగిస్తారు? గట్టిగా మాట్లాడితే భారతదేశంలో ఎంతమంది రోజూ ఉపయోగిస్తున్నారు.. అది కూడా ఆన్లైన్ షాపింగ్ కోసం ఏమాత్రం ఉపయోగపడుతోంది? మన దేశం మాటేమిటో గానీ, ఇంగ్లండ్‌లో మాత్రం ఏకంగా 73 శాతం మంది తమకు కావల్సిన వాటన్నింటినీ కేవలం ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారట. ఈ విషయం అక్కడి ప్రభుత్వం వెల్లడించిన వివరాల్లో తేలింది. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటస్టిక్స్ (ఓఎన్ఎస్) లెక్కల ప్రకారం, బ్రిటన్‌లో ప్రస్తుతం 3.6 కోట్ల మంది పెద్దలు లేదా, మొత్తం జనాభాలో దాదాపు 73 శాతం మంది ప్రతిరోజూ ఇంటర్నెట్ ఉపయోగస్తున్నారు. 2006 సంవత్సరంలో కేవలం 2 కోట్ల మందే ఉపయోగించగా, ఇప్పుడీ సంఖ్య గణనీయంగా పెరిగిందన్నమాట. 2.1 కోట్ల కుటుంబాలు లేదా మొత్తం కుటుంబాల్లో 83 శాతం వాటికి ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ప్రజల రోజువారీ జీవన విధానాన్ని ఇంటర్నెట్ శరవేగంగా మార్చేసిందని ఓఎన్ఎస్ తెలిపింది. పెద్దల్లో మూడింట రెండొంతుల మంది ఇంటర్నెట్ వాడుతుండగా, ప్రతి పదిమందిలో ఆరుగురు మొబైల్‌ఫోన్ లేదా పోర్టబుల్ కంప్యూటర్లను ఇంటర్నెట్ కోసం ఉపయోగిస్తున్నారట. అయితే, బ్రిటన్‌లోని దాదాపు 40 లక్షల కుటుంబాలు లేదా.. మొత్తం కుటుంబాల్లో 17 శాతం మందికి ఇప్పటికీ అసలు ఇంటర్నెట్ సౌకర్యమే లేదు. ఇక నెట్ వాడకంలో వివరాలు చూస్తే, దాదాపు సగం మందికి పైగా వార్తా పత్రికలు చదవడానికి లేదా డౌన్లోడ్ చేయడానికే ఉపయోగిస్తున్నారు. దీంతో వార్తా పత్రికలు కొని చదవడం బాగా తగ్గిపోయింది. సోషల్ నెట్వర్కింగ్ కూడా ఇటీవలి కాలంలో బాగా పెరిగిందని ఓఎన్ఎస్ చెప్పింది. తమకు ఇంట్లో కావల్సిన వస్తువులు కొనుగోలు చేయడానికి 72 శాతం మంది ఆన్లైన్ స్టోర్స్ మీదే ఆధారపడుతున్నారు. 2008లో ఈ సంఖ్య 53 శాతం మాత్రమే. బ్రిటిష్ మహిళల్లో సగం మంది తమ దుస్తులను కూడా ఆన్లైన్లోనే కొంటున్నారు.