లండన్ : ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో చేరే బ్రిటన్‌కు చెందిన పౌరులను వెతికి వేటాడి చంపాల్సిందేనని ఆ దేశ రక్షణశాఖ మంత్రి గావిన్ విలియమ్సన్ అన్నారు. పలువురు బ్రిటన్ నుంచి ఇరాక్, సిరియా వంటి దేశాలకు వెళ్లి అక్కడ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నారని, ఈ విషయాలను తాము జీర్ణించుకోలేకపోతున్నామన్నారు.
అలాంటి వారిని కచ్చితంగా వేటాడి చంపాల్సిందేనని సూచించారు. ప్రస్తుతం ఇరాక్, సిరియాలోని ఇస్లామిక్ స్టేట్‌లో దాదాపు 270మంది బ్రిటన్ పౌరులు ఉన్నట్లు తాము గుర్తించామని, వారిని మట్టుబెట్టేందుకు అవసరం అయితే బలగాలు వైమానిక దాడులు కూడా చేయాలని సూచించారు. 'వీలయిన ప్రతీది మనం తప్పకుండా చేయాలి. బెదిరింపులను తప్పించేందుకు మనం కూడా విధ్వంసం చేయాలి' అని ఆయన ఆవేశంగా అన్నారు. అంతేకాకుండా బ్రిటన్ నుంచి వెళ్లి ఐసిస్‌లో చేరినవారిని తిరిగి బ్రిటన్ రానివ్వకుండా చేయాలని, వారిని అంతమొందించాలని చెప్పారు.
'వారిని వెతికి వేటాడి చంపండి'
Published Thu, Dec 7 2017 4:40 PM | Last Updated on Thu, Dec 7 2017 4:40 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment