కొంతమంది సరదా కోసం చేసే సాహస విన్యాసాలు.. చూసేవాళ్లకు ఒళ్లు జలదరించేలా ఉంటాయి. ప్రాణాలు పణంగా పెట్టి చేసే సాహసకృత్యాలు.. అత్యంత భయానకంగా ఉంటాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా.. ప్రాణం క్షణాల్లో గాల్లో కలిసిపోతుంది. ఇదిగో సరిగ్గా ఇలాంటి విన్యాసాన్ని లండన్ అడర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్‌లో ఒక యువకుడు చేశాడు. అది ఈస్ట్ లండన్‌లోని స్ట్రాఫోర్డ్ అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్. ఇంతలో ఒక రైలు అత్యంత వేగంగా స్టేషన్ దాటుకుని వెళుతోంది. స్టేషన్‌లో పెద్దగా జనాలు ఎవరూ లేరు. ఇంతలో ఒక కుర్రాడు.. వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా.. ఒక గెంతుగెంతాడు. ఉన్న కొద్దిపాటి జనం ఆ దృశ్యాన్ని చూసి కొయ్యబారిపోయారు. ఆత్మహత్యా ప్రయత్నం అని కూడా సందేహించారు. అయితే ఇదేమి జరక్కుండా.. ఆ యువకుడు.. రైలును దాటుకుని ఇవతలి ఫ్లాట్‌మీదకు పడ్డాడు.. రైలు క్షణకాలం ఆలస్యం చేయకుండా వెళ్లిపోయింది.