idiot
-
ఇడియెట్ సిండ్రోమ్ అంటే ఏంటి? మీకూ ఉందేమో చెక్ చేసుకోండి!
గూగుల్ చేసి చూడకు. రాసిచ్చిన మందులు వాడు’ అని డాక్టర్ పేషెంట్‌తో చెప్పాల్సి వస్తోంది. కారణం -ప్రిస్కిప్షన్ తీసుకుని బయటకు వచ్చిన వెంటనే ఆ మందులను గూగుల్ చేసి వాటి గుణాలు, సైడ్ ఎఫెక్ట్లు, వాటిని ఏయే జబ్బులకు వాడతారు అన్నీ పేషెంట్ తెలుసుకోవడమే. తెలుసుకున్న తర్వాత ఎన్నో డౌటానుమానాలు తెచ్చుకొని కొన్ని మందులు వాడకపోవడం, కొన్ని డోస్ తగ్గించమనడం ఇలా చేస్తూ ఆరోగ్యానికి హాని చేసుకుంటున్నారని డాక్టర్లు అంటున్నారు. ఇలా చేసే స్వభావానికి ‘ఇడియట్ సిండ్రోమ్’ అనే పేరు కూడా పెట్టారు. కొన్ని నెలల క్రితం ఒక యువతి కిడ్నీలు ఫెయిలయ్యే స్థితిలో హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెకు మందులు పని చేయని స్థితిని గమనించారు. కారణం ఆమె యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పినప్పుడల్లా తండ్రి ఇంటర్నెట్లో చూసి మందులు తెచ్చి వాడటమే. అతను డాక్టర్ని కలవాలనుకోలేదు. డాక్టర్ కంటే గూగుల్‌ని నమ్మాడు. ఇలా చేయడం వల్ల ప్రాణాంతకమైతే తిరిగి డాక్టరే రక్షించాల్సి వచ్చింది గూగుల్ కాదు.డాక్టర్‌కు తెలుసు డాక్టర్లు తమ డాక్టర్ పట్టా కోసం ఐదేళ్లు చదువుతారు. ఆ తర్వాత తర్ఫీదు అవుతారు. ఆ తర్వాత ప్రాక్టీసు మొదలెడతారు. దేహ గుణాలు, మందు గుణాలు పేషెంట్‌ను బట్టి జబ్బును బట్టి తమ అనుభవం కొద్దీ రాస్తారు. పేషెంట్‌ను కాపాడటమే డాక్టర్ లక్ష్యం. గతంలో డాక్టర్ రాసింది పేషెంట్లు నమ్మకంగా ఫాలో అయ్యేవారు. మహా అయితే మందుల షాపువాణ్ణి ఈ మందులు మంచివేనా అని అడుగుతారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. విస్తృతంగా వచ్చిన ఇంటర్నెట్ వల్ల ప్రతి దాన్ని తెలుసుకోవాలనే ఉబలాటం, ప్రతి దాన్నీ సందేహించే స్వభావం ఏర్పడ్డాయి. డాక్టర్ రాసిన మందులను తమ ఇష్టానుసారం మార్చు కుంటున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ చదివి బెంబేలు పడి కొన్ని వాడటమే లేదు. పైగా మందుచీటిని తిరిగి తీసుకొచ్చి ప్రశ్నలతో వేధిస్తున్నారు. పేషెంట్ల ఇలాంటి రుగ్మతకు డాక్టర్లు పెట్టిన పేరే ‘ఇడియట్ సిండ్రోమ్’!శంక వద్దంటున్నారుఇటీవల సీఎస్ మంజునాథ్ అనే వైద్యుడు ‘మీ గూగుల్ పరిజ్ఞానంతో అయోమయానికి గురై... నా మెడికల్ డిగ్రీని శంకించకండి’ అంటూ బోర్డు పెట్టుకున్న దృశ్యం వైరల్ అయ్యింది. ఆయన దగ్గరే కాదు... ఈ తరహా బోర్డులు మరెన్నో ఆసుపత్రుల్లో కనిపిస్తున్నాయి. ఆన్లైన్లో వంటలూ, వార్పులూ, కామెడీ ఎంత చూసినా పర్లేదు. కానీ వ్యాధులూ, వైద్యాలు చూస్తూ తమ జబ్బులతో తామే పేషెంట్లు చెలగాటాలాడుతున్నారని డాక్టర్ల ఆవేదన. ‘ఈ మందును ఎక్కువ వాడితే సైడ్ఎఫెక్ట్స్ వస్తాయట’ అంటూ డాక్టర్లకే వైద్యం నేర్పుతున్నారు. ‘పానీపూరీ, ఫాస్ట్ఫుడ్డూ తినేప్పుడు ఇలాగే సైడ్ఎఫెక్ట్స్ గురించి ఆలోచిస్తున్నారా’ అంటూ డాక్టర్లు చీవాట్లు పెడుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. నిజానికి ‘పేషెంట్’ అనే మాటకు ‘రోగి’ అన్న పదం అంత గౌరవప్రదంగా లేదంటూ ‘బాధితుడు’ అని వాడటం పరిపాటి అయ్యింది. ఇడియెట్ సిండ్రోమ్ వల్ల పేషెంట్ల చేతిలో డాక్టర్లు బాధితులవుతున్నారనేది వైద్యుల ఆవేదన.నెట్ జ్ఞానం సరికాదు...‘ఇడియట్ సిండ్రోమ్’తో రోగులు వైద్యుల్ని ప్రశ్నించడం, సొంతవైద్యం చేసుకోవడం సరికాదు. ఇంటర్నెట్ సమాచారంతో వ్యాధి నిర్ధారణ సమంజసం కాదు. నెట్ చూసి మందులు వాడితే ఒక్కోసారి ప్రాణాలమీదికి రావచ్చు. వైద్యాన్ని వైద్యుడు తన పరిజ్ఞానంతో, అనుభవంతో, నైపుణ్యంతో వ్యాధి నిర్ధారణ చేసి, ఏయే మందులు ఏయే మోతాదులో వాడాలో నిర్ణయిస్తాడు. గూగుల్ సమాచారంతో ఎవరికి వారు నిర్ధారణలూ, మందుల నిర్ణయాలూ సరికాదని తెలుసుకోవాలి.- డాక్టర్ పావనీ ప్రియాంక కార్యదర్శి, ఐఎంఏ, తెనాలి డాక్టర్ షాపింగ్వాస్తవానికి వ్యాధి ఏమిటనేది అనుభవంతో కూడిన వైద్యులు, ఎన్నో కోణాల నుంచి పరిశోధన, ఎన్నో పరీక్షలు చేశాక నిర్థారణ చేస్తారు. తర్వాత తగిన మోతాదులో మందులిస్తారు. అప్పుడు ‘ఈ ఫలానా ఇంజెక్షనే ఎందుకు? దీనికి ప్రత్యామ్నాయంగా ట్యాబ్లెట్ ఉందిగా’ అంటూ అడుగుతున్న పేషెంట్లు... అంతటితో ఆగకుండా... ఆ డాక్టర్‌ను వదిలి మరో డాక్టర్ దగ్గరికి మరో ఒపినీయన్, ఇంకో ఒపీనియన్ అంటూ తిరుగుతున్నారు. ఇలా తిరగడాన్నే వైద్య పరిభాషలో ‘డాక్టర్ షాపింగ్’ అంటారు. దీని తర్వాత సొంతంగా మందుల్ని కొని వాడుతూ ప్రాణాల మీదికి తెచ్చుకున్న దాఖలాలూ ఉన్నాయి. దీనికి పరాకాష్ట ఇటీవల ఓ భర్త ఇంటర్నెట్ చూస్తూ పురుడు పోస్తూ తన భార్య మరణానికి కారణమయ్యాడు. అందుకే ‘ఇడియట్ సిండ్రోమ్’ ధోరణి వద్దంటున్నారు. – బి.ఎల్. నారాయణ, సాక్షి, తెనాలి. -
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
రోజుకో కొత్త సిండ్రోమ్‌లు వచ్చేస్తున్నాయి. టెక్నాలజీకి తగ్గట్టుగా కొత్త కొత్త వ్యాధులు వచ్చేస్తున్నాయి. మనుషుల పిచ్చి అపోహాలు, నమ్మకాలే వ్యాధుల రూపంలో సిండ్రోమ్లుగా బయటకొస్తున్నాయి. అలాంటి సరికొత్త సిండ్రోమ్ ఒకటి ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. దానిపేరే 'ఇడియట్ సిండ్రోమ్'. ఏంటీ సిండ్రోమ్? ఎందువల్ల వస్తుందంటే..?'ఇడియట్' అంటే "ఇంటర్నేట్ డెరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్ర్స్టక్షన్ ట్రీట్మెంట్". ఈ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు అందుబాటులో ఉన్న ఆన్లైన్ హెల్త్ సమాచారానికి ప్రాధాన్యత ఇచ్చి స్వీయ చికిత్స తీసుకుంటారు. అనారోగ్యాన్ని నిర్థారించుకోవడానికి పూర్తిగా ఆన్లైన్ వనరులనే ఆశ్రయిస్తారు. ఈ పరిస్థితిని "ఇడియట్ సిండ్రోమ్"అని పిలుస్తారు. ఈ సిండ్రోమ్ ఉన్న రోగులు ఇంటర్నెట్ సర్చ్‌ల ఆధారంగా వ్యాధులను స్వయంగా నిర్థారణ చేసుకుంటారు. ఆఖరికి డాక్లర్లు సూచించిన చికిత్సలను కూడా పక్కన పెట్టేసి వారు ఆన్లైన్ ద్వారా తెలుసుకున్న చికిత్సను స్వయంగా చేసుకోవడం, ఆ మందులనే వాడడం వంటివి చేస్తారు. ఇక్కడ ఈ వ్యక్తులు రోగ నిర్థారణ కోసం వెబ్ శోధనే సరియైనదని భావించడమే ప్రమాదం. డబ్ల్యూహెచ్ఓ దీన్ని 'ఇన్ఫోడెమిక్' అని పిలుస్తుంది. ఈ విధమైన తీరు రాను రాను మరింత తీవ్రమై వైద్య నిపుణలపై అమనమ్మకానికి దారితీస్తుంది. రోగులు ఇక్కడ ఆరోగ్య సమాచారాన్ని ఆన్లైన్ వంటి సాంకేతికతో తెలుసుకోవడం వరకు మంచిదే తప్పులేదు. అదే సాయంతో తనకు తానుగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ప్రమాదకరం అని వైద్యుల చెబుతున్నారు. ఆరోగ్యానికి ఎలా ప్రమాదమంటే..ఈ విధానం ముదిరిపోతే వారి దృష్టిలో ఆన్లైన్ హెల్త్ సమాచారమే తిరుగలేనిదిగా కనిపిస్తుంది. నిరంతరం ఆన్లైన్ సెర్చ్లకే పరిమితమైపోతారు. దీంతో విపరీతమైన, ఆందోళనకు, ఒత్తిడికి గురవ్వుతారు.ఒకవేళ్ల అది ఇచ్చిన సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అసలుకే మోసం వచ్చి ఆరోగ్యాన్ని చేజేతులారా నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. ఈ వైఖరి వైద్య సహాయాన్ని నిరాకరించే స్థితికి తీసుకొస్తుంది. అప్పటి వరకు వాడుతున్న మందులను కూడా ఆపేయడం లేదా వేనే వాటిని వాడేలా చేస్తుంది. దీంతో ఆయా వ్యక్తులు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని, లేనిపోని అనారోగ్యల బారినపడతారు.ఇక్కడ వెబ్ అనేది ఒక సాధనం. దీని ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై అవగాహన ఏర్పరుచుకోండి తప్పులేదు. శృతిమించితేనే ప్రమాదం. రోగ నిర్థారణ, చికిత్సల సలహాల కోసం వైద్య నిపుణులను సంప్రదించడమే ఉత్తమం అని గ్రహించండి. (చదవండి: ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?) -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'ఇడియట్' హీరోయిన్!
అలనాటి అందాల హీరోయిన్ రక్షిత గుర్తుండే ఉంటుంది. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే.. అంటూ రవితేజ, గిచ్చి గిచ్చి చంపుతోంది గ్రీకు సుందరి, చూపుతోటే వైరసేదో పంపుతున్నది అంటూ ఎన్టీఆర్.. వీళ్లిద్దరేనా! మహేశ్‌బాబు, నాగార్జున వంటి బడా హీరోలు కూడా ఆమెతో ఆడిపాడారు. తెలుగు, కన్నడ సినిమాలను సమంగా బ్యాలెన్స్ చేసిన రెండు చోట్లా ఓ వెలుగు వెలిగిన ఈ తార ప్రస్తుతం ఏం చేస్తుందో చదివయేండి.. రక్షిత అసలు పేరు శ్వేత. పుట్టి పెరిగింది బెంగళూరులో. ఆమె తండ్రి బీసీ గౌరీశంకర్ కొరియోగ్రాఫర్, తల్లి మమతా రావు కన్నడ నటి. ఇద్దరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి ఆమె సినిమా ఎంట్రీ సులువైంది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో పునీత్ రాజ్‌కుమార్ సరసన అప్పు అనే కన్నడ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దీంతో నత చదువుకు ఫుల్స్టాప్ పెట్టేసి 2002లో అప్పుతో వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమానే బంపర్ హిట్ అవ్వడంతో అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. అప్పుకు రీమేక్‌గా తెరకెక్కిన ఇడియట్(తెలుగు), దమ్(తమిళం) సినిమాల్లోనూ రక్షిత హీరోయిన్గా మెరిసింది. ఆమె నటనను చూసి ప్రేక్షకులు మురిసిపోయారు. కన్నడలో టాప్ హీరోయిన్గా వెలుగొందుతూనే తెలుగులోనూ నాగార్జునతో శివమణి, మహేశ్‌బాబుతో నిజం, జూనియర్ ఎన్టీఆర్‌తో ఆంధ్రావాలా, జగపతిబాబుతో జగపతి సినిమాల్లో జోడీ కట్టింది. దీంతో ఇక్కడ కూడా స్టార్ హీరోయిన్గా నిలదొక్కుకుంది. అలా కెరీర్ ఓ రేంజ్లో దూసుకుపోతున్న సమయంలో 2007లో కన్నడ దర్శకుడు ప్రేమ్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేసిన ఆమె వెండితెరకు పూర్తిగా దూరమైపోయింది. జోగయ్య, డీకే అనే రెండు చిత్రాలను నిర్మించిన ఆమె ప్రస్తుతం ఎవరూ గుర్తుపట్టని విధంగా మారిపోయింది. ఎంతగానో లావైపోయిన ఆమెను చూసి అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. రక్షిత ఇలా అయిపోయిందేంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే తనకు కొడుకు పుట్టాక థైరాయిడ్ సమస్య రావడంతో ఇలా లావెక్కానని రక్షిత ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయినా నాజూకుగా ఉండటానికి ఇప్పుడు తానేమీ హీరోయిన్ను కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం పలు కన్నడ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఆమె ఏక్ లవ్ యా అనే సినిమాను నిర్మిస్తోంది. అంతేకాదు, దశాబ్ద కాలం తర్వాత ఈ సినిమాలో గెస్ట్ పాత్ర ద్వారా కెమెరా ముందు నటిస్తోంది. గతంలో రెండు పార్టీలు మారిన ఆమె ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతోంది. చదవండి: ఫాదర్స్ డే స్పెషల్: ఈ సినిమాలు చూశారా? తాళిబొట్టుతో షాకిచ్చిన వర్ష, చేతికి రింగు కూడా ఉందే! -
ఇడియట్ అన్నందుకు రూ. 4 లక్షల ఫైన్
అబు దాబి : కాబోయే భార్యను ఇడియట్ అని పిలిచినందుకు గాను ఓ వ్యక్తికి 20 వేల దీరామ్ల జరిమానతో పాటు 60 రోజుల జైలు శిక్ష విధించారు. వివరాలు.. ఖలీజ్ టైమ్స్ ప్రకారం ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యను ఉద్దేశిస్తూ వాట్సాప్‌లో ‘ఇడియట్’ అని మెసేజ్ పెట్టాడు. కేవలం సరదాగా చేసిన ఈ పనికి అతడు భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇడియట్ అని పిలవడంతో ఆగ్రహించిన అతని ఫియాన్సి ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో అతడు సరదాగా చేసిన పనికి గాను దాదాపు 4 లక్షల రూపాయల జరిమానా చెల్లించడమే కాక ఆరు నెలల జైలు జీవితం గడపబోతున్నాడు. మన దగ్గర ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోరు కానీ.. అరబ్ దేశాల్లో మాత్రం సోషల్ మీడియాలో ఇలాంటి పదాలను, నేర పూరిత పదాలను వాడటాన్ని సైబర్ నేరంగా పరిగణిస్తారు. ఈ ఏడాది జనవరిలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. దుబాయ్‌లో ఉంటున్న బ్రిటిష్ సిటిజన్ ఒకరు కార్ డీలర్‌ని తిడుతూ మెసేజ్ చేశాడు. దాంతో అతన్ని జైలు పంపించారు. -
ట్రంప్‌ను ఇడియట్ అంటున్న గూగుల్
శాన్ ఫ్రాన్సిస్కొ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, దిగ్గజ సర్చ్ ఇంజన్ గూగుల్ మరోసారి వార్తల్లో నిలిచాయి. అప్పుడప్పుడు తప్పుడు సమాచారం ఇవ్వడం గూగుల్‌కు అలవాటే. అలానే ఈ సారి మరో పెద్ద తప్పిదం చేసి వార్తల్లో నిలిచింది ఈ సర్చ్ ఇంజన్. ప్రస్తుతం గూగుల్‌లో ‘ఇడియట్’ అని టైప్ చేసి... ఇమేజెస్ కోసం వెతికితే, ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోలను చూపిస్తోంది. మానిటర్ మొత్తం ఆయన ఫొటోలతోనే నిండిపోతోంది. అయితే దీనిలో గూగుల్ తప్పిదం ఏం లేదంట. ట్రంప్‌పై ద్వేషం ఉన్నవారు గూగుల్ అల్గారిథమ్‌లో ‘ఇడియట్’ అనే పదం దగ్గర ట్రంప్ ఫొటోను యాడ్ చేశారంట. అందువల్లే ‘ఇడియట్’ అని టైప్ చేసి ఫోటోల కోసం వెతికితే ట్రంప్ ఫోటోలు దర్శనమిస్తున్నాయంట. ఎవరో ట్రంప్ వ్యతిరేకులే కావాలని ఈ పని చేశారని సీఎన్ఈటీ అభిప్రాయపడింది. ట్రంప్ శత్రువులు ఈ విధంగా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని ‘ది గార్డియన్’ పత్రిక తెలిపింది. ట్రంప్ పాలసీలు నచ్చని వారు ఈ క్యాంపెయిన్ లో భాగస్వాములుగా ఉన్నారని తెల్పింది. అయితే గూగుల్ ఇలాంటి తప్పులు చేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో ‘వరస్ట్ బాలీవుడ్ యాక్టర్’, ‘వరస్ట్ ఇండియన్ యాక్టర్’ అని గూగుల్‌లో వెతకగా సల్మాన్ ఖాన్ ఫొటోతో పాటు అతడి వివరాలు కూడా చూపించి అభిమానుల ఆగ్రహానికి గురి అయ్యింది. అంతే కాక భారత దేశ తొలి ప్రధాని ఎవరు అన్న సమాధానానికి నెహ్రూకి సంబంధించిన సమాచారం రాగా.. ఫొటో మాత్రం నరేంద్ర మోదీది ప్రత్యక్షం కావటంతో చాలా మంది కంగుతున్నారు. ఈ విషయం కాస్తా వైరల్ కావటం.. అదే సమయంలో విమర్శలకు దారితీయటం జరిగింది. దీంతో పొరపాటును గమనించిన గూగుల్.. ఆ తప్పిదాన్ని సరిచేసుకుంది. -
వామ్మో.. ఎలా దూకాడో చూడండి!
కొంతమంది సరదా కోసం చేసే సాహస విన్యాసాలు.. చూసేవాళ్లకు ఒళ్లు జలదరించేలా ఉంటాయి. ప్రాణాలు పణంగా పెట్టి చేసే సాహసకృత్యాలు ఒక్కోసారి అత్యంత భయానకంగా ఉంటాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణం క్షణాల్లో గాల్లో కలిసిపోతుంది. ఇదిగో సరిగ్గా ఇలాంటి విన్యాసాన్ని లండన్ అడర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్లో ఒక యువకుడు చేశాడు. అది ఈస్ట్ లండన్‌లోని స్ట్రాఫోర్డ్ అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్. ఇంతలో ఒక రైలు అత్యంత వేగంగా స్టేషన్ దాటుకుని వెళుతోంది. స్టేషన్లో పెద్దగా జనాలు ఎవరూ లేరు. ఇంతలో ఒక కుర్రాడు.. వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా.. ఒక గెంతుగెంతాడు. ఉన్న కొద్దిపాటి జనం ఆ దృశ్యాన్ని చూసి కొయ్యబారిపోయారు. ఆత్మహత్యా ప్రయత్నం అని కూడా సందేహించారు. అయితే ఇదేమి జరక్కుండా.. ఆ యువకుడు.. రైలును దాటుకుని ఇవతలి ఫ్లాట్మీదకు పడ్డాడు.. రైలు క్షణకాలం ఆలస్యం చేయకుండా వెళ్లిపోయింది. యువకుడు సాహసంతో చేసిన ఈ విన్యాసం అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తే.. 21 వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్లు వస్తున్నాయి. కొందరైతే.. దూకే ముందు మీ అమ్మ గుర్తుకు రాలేదా అని అడిగారు. మరొకరైతే.. ఇడియట్.. నీకు ఏమన్నా అయితే నీ తల్లిదండ్రుల మాటేమటి అని తిట్టారు. కొందరైతే ఇలాంటి సాహసాలు మళ్లీ చేయొద్దని సూచించారు. -
చావును తెగించిన ధైర్యం!
-
ట్రంప్ ఇడియట్ అంటూ తిట్ల దండకం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ (ఐసిఎస్) తిట్ల దండకం లంకించుకుంది. ‘ఇడియట్’ అంటూ ట్రంప్‌ను తీవ్ర పదజాలంతో దూషించింది. ఇస్లాం గురించి ట్రంప్‌కు ఏం తెలియదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఐఎస్ అధికార ప్రతినిధి అబు హసన్ అల్ ముహజిర్ పేరిట అరబిక్ భాషలో దాదాపు 36 నిమిషాల నిడివి గల వీడియోను మంగళవారం విడుదల చేసింది. ఆ వీడియోలో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పాలనాపగ్గాలు చేపట్టటం అమెరికన్ల దివాళాకోరుతనంగా అభివర్ణించింది. కాగా ట్రంప్ జనవరిలో అధికారంలోకి వచ్చాక ఐసిఎస్ నుంచి వచ్చిన తొలి వీడియో ఇది. అందులో ఇస్లాంను గురించి ఏమాత్రం అవగాహన లేని ఇడియట్గా ట్రంప్‌ను పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ అంటే ఏమిటో కూడా తెలియని మూర్ఖుడని వ్యాఖ్యలు చేసింది. అమెరికా అధ్యక్ష గద్దె నుంచి ట్రంప్‌ను తొలగించటం ఖాయమని, ఆయన ఉద్వాసనకు మార్గం మరింత సుగమమైందని పేర్కొంది. అమెరికా సర్కార్ త్వరలోనే దివాళా తీయడం ఖాయమని, ఇప్పటివరకు అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఇమేజ్ త్వరలోనే తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరికలు చేసింది. సిరియా, ఇరాక్లలో తాము పట్టు కోల్పోలేదని, సిరియాలో మరింత బలపడేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించింది. ఇరాక్ బలగాలతో తాము ఎదుర్కొంటున్న పరిస్థితి జిహాదీ చరిత్రలోనే గొప్పదిగా అభివర్ణించింది. కాగా అమెరికా ఎన్నికల ప్రచారంలోనూ, అధ్యక్షుడయ్యాక ట్రంప్ పలు సందర్భాల్లో ఐఎస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయటంతోపాటు అమెరికా బలగాలను ఐఎస్‌ను యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే. అలాగే ఇరాక్‌తోపాటు సిరియాలోని కొంతభాగంలో ఇస్లామిక్‌స్టేట్ పేరుతో అధికారం నడుపుతున్న ఈ సంస్థను తుదముట్టించేందుకు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణదళాలు పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటువంటి వీడియోను ఐఎస్ వ్యూహకర్తలు రూపొందించారని భావిస్తున్నారు. -
డై..లాగి కొడితే...
సినిమా : ఇడియట్ రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్ చంటి (రవితేజ) కాలేజీలో చదువుతుంటాడు. ఫ్రెండ్‌తో కలిసి చంటి నడిచి వస్తుండగా కాలేజీలోని వీరి ఆపోజిట్ గ్యాంగ్ ముసుగు వేసి కొడతారు. లిఫ్ట్ అడిగి, సుచిత్ర (రక్షిత) కారులో గాయపడ్డ చంటిని ఆస్పత్రికి చేరుస్తాడు స్నేహితుడు. చంటికి రక్తం అవసరం కావడంతో ఇచ్చి వెళ్లిపోతుంది సుచిత్ర. పోలీస్ కమిషనర్ విప్రనారాయణ (ప్రకాశ్ రాజ్) కూతురైన సుచిత్ర.. చంటి చదివే కళాశాలలో చేరుతుంది. ఆరోగ్యం ఇప్పుడెలా ఉందని సుచి పలుకరించగానే ‘ఐ లవ్ యూ’ అంటాడు చంటి. ‘నేం చెప్పింది ఏం చేశావ్’ అంటూ వెంటపడుతుంటాడు. మా ఫాదర్ ఎవరో తెలుసా? సుచిత్ర ప్రశ్నిస్తుంది. తెలుసు.. కమిషనర్ ఆఫ్ పోలీస్ అట కదా అంటాడు చంటి. కమిషనర్ అని తెలిసే మాట్లాడుతున్నావా? ఇన్నాళ్లూ నీకు తెలియదనుకున్నా. తెలిసి కూడా.. అని ఆశ్చర్యపోతుంది సుచిత్ర. ‘కమిషనర్ కూతురని చెబితే భయపడిపోతామా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ల కూతుర్లకి మొగుళ్లు రారా?’ అని ప్రశిస్తాడు చంటి. ఈ డైలాగ్ మాస్ ప్రేక్షకులతో పాటు యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. -
పుట్టేశాం... ఇక బతికి సాధించాలి!
పాటతత్వం పూరి జగన్నాథ్ తో నాకది రెండో సినిమా. మా కాంబినేషన్లో వచ్చిన ‘ఇట్లు శ్రావణి సుబ్ర మణ్యం’లో నేను రాసిన రెండు పాటలూ సూపర్‌హిట్. ‘ఇడియట్’లో మళ్లీ అవకాశ మిచ్చారు. మొత్తం మూడు పాటలు. మూడు వేరియేషన్లు. చక్రితో నాకు అయిదో సినిమా ‘ఇడియట్’. రవితేజను పక్కింటి అబ్బాయిలా తనదైన స్టయిల్లో చూపించడానికి పూరి రెడీ అవుతున్నారు. అసలే రవితేజ రియల్ లైఫ్‌లో హైపర్ యాక్టివ్. ఇక సినిమాలో అతని పాత్ర కూడా అంతే. ఏదీ మనసులో ఉంచుకోడు. సూటిగా సుత్తి లేకుండా ఎదరెవరున్నా సరే దూసుకెళ్లిపోవడం అతని తత్వం. అలాంటి హీరోకి పరిచయ గీతం. క్లిష్టతరమైన పదాలకు దూరంగా, ఎవరికైనా కనెక్ట్ అయ్యేలా ఇన్ స్పిరేషనల్‌గా రాయమన్నారు పూరి. అంద మైన పదాలతో ఓ పాటను పొదగడం ఎంత కష్టమో, సులువుగా అర్థమ య్యేలా రాయడం అంతకన్నా కష్టం. రోజూ చదివే భగవద్గీత, బైబిల్ మననం చేసుకుంటూ ఈ పాట రాశా. ఏకంగా మూడు రోజులు పట్టింది. చివరికి సక్సెస్. సై సర సర సై -సై చిరు చిందైయ్ -వెయ్ వెయ్ వెయ్/సర సర వెయ్ వెయ్ వెయ్/ నింగిలోని తార నీ చేతిలోకి రాదా/తలదిండు తీసిలేరా దునియాను దున్నుకోరా/నవ్వే నువ్వై నిప్పు రవ్వై/కదం తొక్కేయ్రా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అన్నారు. చాలా మంది కలలు కంటారు, అలా కంటూనే ఉంటారు. కానీ వాటిని సాకారం చేసుకోరు. అలా కాకుండా ముందడుగెయ్యాలి. చేసేది తప్పా... ఒప్పా అని చూడకూడదు. ముందు అనుకున్న పనిని మొదలుపెట్టాలి. ఎలాంటి కష్టమొచ్చినా ముఖాన చిరునవ్వు చిందిస్తూ బరిలో సాగిపోవాలి. చేసేదేదైనా చెప్పేదేదైనా/చేసేయ్ జంకూ బొంకూ లేకుండా/పిండై బండైనా ఎక్కేయ్ ఎవరెస్టయినా/సాహసంతో సావాసం చేసేయ్‌రా... మనం చేసే పని రైట్ అనుకున్నప్పుడు ఎవరికీ భయపడకూడదు. ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధపడాలి. అది ఎలాంటిదైనా సాహసమే శ్వాసగా సాగిపోవాలి. అప్పుడే మనకు అనుకున్న విజయాలు దక్కుతాయి. విపణి వీధి నిండా ఎగరెయ్ ప్రేమజెండా/ చిరాకు నీకు వస్తే అమ్మేయ్రా గోలుకొండ అందరి హృదయాలను ప్రేమతో గెలిచి, ఈ సమాజాన్ని ప్రేమతో నింపేసేయ్. ఒక పనిలో మనకు నష్టం వచ్చింది. అది మనకు రాదు అనుకున్నప్పుడు దాని జోలికి వెళ్లకూడదు. నిన్న తప్పు తెలుసుకుని ఫీలు కాకురా/తప్పు వల్ల కొత్త నిజం తెలుసు కోరా/చాన్సు ఉంటే మళ్లీ తప్పు చేసి చూడరా/చేసిన ఆ తప్పే మళ్లీ చేయమాకు చేయమాకు నాకు మొదటి నుంచి ఓషో ఫిలాసఫీ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన భావజాలాన్ని కూడా ఇందులోకి జొప్పించాను. తప్పులు చేస్తేనే నిజాలు తెలు స్తాయి. అసలు తప్పులు చేయనివాడు మనిషే కాడు. తప్పులు చేస్తూ ఉండాలి. అందులోంచి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. ప్రపంచంలోని ఆవిష్కరణలకు మూలం ఇలాంటి తప్పులే. కానీ చేసిన తప్పే మళ్లీ చేయడం మాత్రం మూర్ఖత్వమే. బిల్ గే ట్సే గొప్ప కాదురా/నీకు నువ్వే కింగు సోదరా... పోలిక పెడితే ఎంతటివాడైనా నిరాశలో కుంగిపోవడం ఖాయం. అందరూ బిల్ గే ట్స్, టాటా, బిర్లా, అంబానీలే గొప్పనుకుంటారు. కానీ ఎవరి టాలెంట్ వారిది. కొంతమంది పాటలు బాగా పాడితే, ఇంకొంత మంది బాగా చదువుతారు. ఇంకొద్ది మందికి చదవడమంటే చాలా ఇష్టం. ఎవడి జీవితానికి వాడే హీరో. కింగు కూడా. పుట్టాకెవడైనా బతకాలి ఏమైనా/వేసే ముందడగు ఇకనైనా/వద్దు కొండైనా చాలు రవ్వైనా/తోసేయ్ నచ్చకుంటే దేన్నైనా... పుట్టుక, చావుల మధ్య ఊగిసలాడే చిన్న దారమే ఈ జీవితం. కష్టమొచ్చిందా... భరించు, దు:ఖ మొచ్చిందా సహించు. సంతోషమొచ్చిందా ఎగిరి గంతేయ్. మళ్లీ కష్టాలొస్తాయి. చిరు నవ్వుతో సాగిపో. మనకు చావు వచ్చేదాకా బతకాలి. ఏదైనా చేసి బతకాలి అంతే. అలాగని నచ్చని పని చేయకూడదు. రాజీపడి బతక్కూ డదు. మనకంటూ ఆటిట్యూడ్, ఇండివిడ్యు వాలిటీ ఉండాలి. నడిచే దారి కరెక్ట్ అయితే చాలు. ముళ్లున్నా, పూవులున్నా, ఎవరు అడ్డొచ్చినా వెళ్లిపోవాలంతే. చేయగలను కానీ అనే మాటలొద్దురా/ గుండెలోన దమ్ములుంటే చేసిచూపరా/నడిచి నడిచి పాతబడ్డ బాటలొద్దురా/సత్తువుంటే కొత్త బాట వేసిచూపు చేసిచూపు... ఈ పని నేను చేయగలను కానీ... అంటూ కొందరు సాకులు చెబుతారు. పని తెలిసినవాడు సాధిస్తాడు. చేయలేనివాడు సాకులు వెతుక్కుంటాడు. మనకే గనక దమ్ముంటే చేసి చూపించి మన సత్తా నిరూపించుకోవాలి. ఏ పని చేసినా కొత్తగా చేయాలి. ఇలానే చేయాలి అనే రూల్స్ అన్ని చోట్లా ఉంటాయి. కానీ ఆ రూల్స్‌ను బ్రేక్ చేస్తేనే గొప్పవాళ్లవుతారు. చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారు. లిరిక్స్ విన్నవెంటనే పూరి బాగా మెచ్చుకున్నారు. సింగిల్ వెర్షన్లో ఓకే. ఇప్పటివరకూ నేను ఆయనకు రాసిన పాటలన్నీ సింగిల్ వెర్షన్లో ఓకే చేసినవే. తను రాసే మాటలెంత సూటిగా ఉంటాయో, పాటలు కూడా అదే స్టయిల్లోనే ఉండాలంటారు పూరి. అందుకే ఆయన సినిమాకి పాటలు రాయడమంటే ఓ కిక్కు ఉంటుంది! - కందికొండ, గీత రచయిత -
ఇడియట్ చంటిగాడు లోకల్
సినిమా వెనుక స్టోరీ ఒక్కోసారి ఫెయిల్యూర్ కూడా మంచి చేస్తుంది. ‘బాచి’ సినిమా ఫెయిల్యూర్ పూరి జగన్నాథ్‌ని బెంగళూరు దాకా తీసుకెళ్లింది. కన్నడ సూపర్‌స్టార్ రాజ్ కుమార్ ఫ్యామిలీతో క్లోజ్ అయ్యేలా చేసింది. అదెలా అంటే - ‘బాచి’ ఇక్కడ అట్టర్‌ఫ్లాప్. కానీ కర్ణాటకలో బాగా ఆడింది. కన్నడ రాజ్‌కుమార్ ఫ్యామిలీలో ఎవరో ఈ సినిమా చూసి, డెరైక్టర్ బాగా తీశాడని ఇంట్లోవాళ్లందరికీ చెప్పాడు. ఇంకేముంది... పూరీకి పిలుపొచ్చింది. కన్నడ రాజ్‌కుమార్ పెద్దబ్బాయ్ శివరాజ్‌కుమార్‌తో ‘యువరాజా’ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. అదే టైమ్‌లో రవితేజతో తెలుగులో ‘ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం’ చేస్తున్నాడు పూరి. అక్కడో కాలు... ఇక్కడో కాలు. రెండు పడవల మీద కాళ్లేసినా ప్రయాణం మాత్రం సాఫీగానే జరిగింది. అక్కడ ‘యువరాజా’ హ్యాపీ. ఇక్కడ ‘ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం’ హిట్. పూరి బిహేవియర్, స్పీడ్, టాలెంట్ కన్నడ రాజ్‌కుమార్‌కు విపరీతంగా నచ్చే శాయి. తను మామూలు దర్శకుడు కాదని ఆయనకు అర్థమైపోయింది. ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కదా ఆయన! రెండేళ్ల ఎదురు చూపులకు ఇతనే ఫుల్స్టాప్ పెట్టగలడని కన్నడ రాజ్‌కుమార్‌కు అర్థమైపోయింది. కన్నడ రాజ్‌కుమార్ మూడో కొడుకు పునీత్ రాజ్‌కుమార్. అతణ్ని హీరోగా లాంచ్ చేయాలి. రెండేళ్ల నుంచీ వినని కథ లేదు. పిలవని డెరైక్టర్ లేడు. వాళ్లకేదీ ఎక్కడం లేదు. ఆ టైమ్‌లో పూరి వాళ్లకు విపరీతంగా నచ్చేశాడు. పునీత్‌ని లాంచ్ చేసే ప్రపోజల్ పెట్టారు. పూరి మంచి స్వింగ్‌లో ఉన్నాడు. అప్పటికే ఓ బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. కమిషనర్ కూతురితో కానిస్టేబుల్ కొడుకు ప్రేమా యణం. క్లాసూ మాసూ లవ్‌స్టోరీ. హీరో క్యారెక్టరైజేషనే ఈ స్క్రిప్టుకి గుండెకాయ. విజయవాడలో శ్రీను అనే ఫ్రెండ్ ఉండేవాడు. అతనేం మాట్లాడినా తన పేరు చెప్పుకుని మాట్లాడుతుంటాడు. ఆ రోజు అతని బర్త్‌డే అనుకోండి. ‘ఈరోజు శ్రీనుగాడి బర్త్‌డే. మీకు తెలుసా?’ అనడిగేవాడు. దాన్ని బేస్ చేసుకునే పూరి ఈ కేరెక్టర్ డిజైన్ చేశాడు. కథ చెప్పడానికి పూరి బెంగళూరు వెళ్లాడు. రాజ్‌కుమార్ ఇంట్లో పూరీకి రాయల్ ట్రీట్మెంట్. ఓ గదిలో కూర్చోబెట్టారు తనని. అక్కడ ఫుల్ క్రౌడ్. ఏదైనా ఫంక్షన్ జరుగు తుందేమోననుకున్నాడు పూరి. కాస్సేపటికి కన్నడ రాజ్‌కుమార్ వచ్చి కూర్చున్నారు. పార్వతమ్మ, శివరాజ్‌కుమార్, పునీత్... అంతా అక్కడే ఉన్నారు. రాజ్‌కుమార్ చేయి పెకైత్తగానే రూమ్‌లో పిన్‌డ్రాప్ సెలైన్స్. ‘‘ఊ... కథ చెప్పండి’’ అన్నారు రాజ్‌కుమార్. పూరి కంగారుగా ‘‘వీళ్లందరూ ఎవరు సార్?’’ అనడిగాడు. ‘‘వీళ్లంతా నా ఫ్యామిలీ మెంబర్స్. కొడుకులూ కూతుళ్లూ అల్లుళ్లూ మనవళ్లూ మనవరాళ్లూ పనివాళ్లూ అందరూ ఉన్నారు. మా పునీత్‌ని లాంచ్ చేసే ప్రాజెక్ట్ మా ఫ్యామిలీకి ప్రెస్టీజ్ ఇష్యూ. అందుకే వీళ్లందరి అభిప్రాయం కావాలి’’ అని చెప్పారాయన. పూరీకి టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ప్రపంచ సినీచరిత్రలోనే ఇంత పెద్ద స్టోరీ సిట్టింగ్ ఎప్పుడూ జరిగి ఉండదని పించింది. ఒక వ్యక్తికి కాదు... ఓ పెద్ద ఆడిటోరియమ్కి కథ చెప్పి ఒప్పించాలి. ఇదొక వింతైన విచిత్రమైన అనుభవం. ఏదైతే అది అయ్యిందిలే అనుకుని కథ చెప్పడం స్టార్ట్ చేశాడు. రెండు గంటలు పిన్‌డ్రాప్ సెలైన్స్. కథ పూర్తయింది. ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఒకళ్లకొకళ్లు సైగలు మాత్రం చేసుకుంటున్నారు. కాస్సేపటికి రాజ్‌కుమార్ లేచి పూరీని హగ్ చేసుకుని, ‘‘వెరీగుడ్. చాలా బాగుంది. మా పునీత్‌ని మీరే హీరోగా లాంచ్ చేయాలి’’ అన్నారు. అప్పుడు పూరి రిలాక్స్ అయ్యాడు. దీన్ని రవితేజతో తెలుగులో చేద్దామని పూరి అప్పటికే ప్రిపేర్ అయ్యాడు. కానీ పునీత్ కోసం ముందే చేసేయాల్సి వచ్చింది. రవితేజ కూడా వెయిట్ చేస్తానన్నాడు. ‘‘ఏం పర్లేదు. ఇంకో ఏడాదైనా నీకోసం చూస్తా’’ అని చెప్పాడు చాలా కాన్ఫిడెంట్‌గా.పునీత్ హీరోగా ‘అప్పు’ స్టార్ట్ అయ్యింది. ఎంత స్పీడ్‌గా తీస్తున్నాడంటే అంత స్పీడ్‌గా తీస్తున్నాడు. ఇంకోపక్క తెలుగులో చేయడానికి కూడా ఏర్పాట్లు షురూ. ‘ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం’ హిట్ కావడంతో ప్రొడ్యూసర్లు చాలామంది వస్తున్నారు. కానీ పూరీకి మాత్రం సొంతంగా చేసుకోవాలనిపించింది. ‘వైష్ణో అకాడమీ’ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేశాడు. పూరీ వైష్ణోదేవి టెంపుల్కెళ్లినప్పుడు అక్కడి పూజారి, ‘ఇక్కడ ఏం కోరుకుంటే అది జరుగుతుంద’ని చెప్పాడు. పూరి ఇలాంటివి నమ్మడు. పూజారితో అదే చెప్పాడు. పూజారి చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ‘‘నేను ప్రొడ్యూసర్ కావాలను కోవడం లేదు. ప్రొడ్యూసరైతే మాత్రం వైష్ణో పేరుతోనే చేస్తాను’’ చెప్పాడు పూరి ఆ పూజారితో. అప్పటికి తాను నిర్మాత అవుతాననే ఆలోచన వన్ పర్సంట్ కూడా లేదు. కానీ పరిస్థితులు అలా డ్రైవ్ చేసి పూరీని ప్రొడ్యూసర్‌ను చేశాయి. బయటి ప్రొడ్యూసర్లు తనతో చేయాలనుకుంటే ఇందులో షేర్ ఇస్తాడంతే. పొలిటీషియన్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ ప్రాజెక్టులో పార్ట్నర్. కానీ ఆయన పేరుం డదు. సీహెచ్ పద్మావతి అని ఆయన శ్రీమతి పేరుంటుంది. ఆయన తరఫున ప్రొడక్షన్ అంతా ఎం.ఎల్.కుమార్ చౌదరి చూసుకుంటాడు. ఇదీ కమిట్మెంట్.కన్నడంలో ‘అప్పు’ సూపర్‌హిట్. పునీత్‌కి హీరోగా ఫస్ట్ సినిమాతోనే డిస్టింక్షన్. కన్నడ రాజ్‌కుమార్ ఖుష్ అయిపోయారు.‘‘నువ్వు నాకు నాలుగో కొడుకువయ్యా. నా కొడుకు లెవరూ నాకింత డబ్బు ఇవ్వలేదు. అయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ’’ అని పూరీని మెచ్చుకున్నారు. హండ్రెడ్ డేస్ ఫంక్షన్‌ని బెంగళూరులో చాలా గ్రాండ్‌గా చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫస్ట్ టైమ్ పాల్గొన్న కన్నడ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అదే. సినిమా చూసి పూరీకి హ్యాట్సాఫ్ చెప్పారు రజనీకాంత్. రవితేజతో ‘ఇడియట్’ సినిమా అనౌన్స్ చేశాడు పూరి. తిట్టుని టైటిల్‌గా పెట్టడమేంటని నెగటివ్ కామెంట్లు. ఆడియన్స్‌లో స్పెషల్ అటెన్షన్ కావాలంటే ఇలాంటి టైటిలే కావాలి. కథకు ఇదే యాప్ట్. పూరి ఇంతకుమించి ఆన్సర్ చెప్ప లేదు. ఈ టైటిల్‌కి క్యాప్షన్ - ‘ఓ శ్రీనుగాడి ప్రేమకథ’. రవితేజకు చంటిగాడు పేరంటే ఇష్టం. ‘సిందూరం’లో అతని పేరు అదే. రవితేజ కోరిక మేరకు హీరో పేరుని చంటిగాడుగా చేసేశారు. ‘అప్పు’లో చేసిన రక్షితనే తెలుగు వెర్షన్‌కు తీసుకున్నాడు. రక్షిత వాళ్ల నాన్నగారు గౌరీశంకర్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్. రక్షిత తల్లి మమతా రావ్ కన్నడంలో హీరోయిన్. ప్రకాశ్‌రాజ్, కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారా యణ తదితరులకు ఇంపార్టెంట్ రోల్స్. చక్రికి మ్యూజిక్ డెరైక్టర్‌గా మళ్లీ చాన్స్. శ్యామ్.కె.నాయుడుకు పూరి ఆస్థానంలో ఛాయాగ్రాహకునిగా చోటు. 2002 మార్చి 24న షూటింగ్ మొద లెట్టారు. హైదరాబాద్ దాటి వెళ్లకుండానే షూటింగ్ చేసేశారు. ఇందులో కీలకమైన మూడు ఫైట్స్ ఉన్నాయి. రవితేజ - టాస్క్‌ఫోర్స్ పోలీసులను కొట్టే ఫైట్, హెడ్ ఫైట్, మరో ఫైట్. ఈ మూడింటినీ సారథి స్టూడియోలోనే తీసేశారు. ఫైట్‌లో కాన్సెప్ట్ ఉంటే ఆడియన్స్‌కు లొకేషన్‌తో పనేముంటుంది! రెండు పాటల కోసం మాత్రం బ్యాంకాక్ వెళ్లారు. పూరీకి బ్యాంకాక్‌తో అటాచ్మెంట్ ఏర్పడటానికి బీజం ఇక్కడే పడింది. 2002లో చిరంజీవి పుట్టినరోజునాడు ‘ఇడియట్’ రిలీజైంది. సూపర్ డూపర్ హిట్ టాక్. రవితేజ క్యారెక్టరైజేషన్ అందరికీ పిచ్చపిచ్చగా నచ్చేసింది. మనసులో ఏదనుకుంటే అది చేసేయడం, ఎవరో ఏదో అనుకుంటారని సంకోచ పడకుండా ఉండటం... హీరో పాత్ర చిత్రణ చాలా కొత్తగా అనిపించింది. హీరో అంటే స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండాలని, స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా బిహేవ్ చేయాలని, వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్‌గా ఉండాలని, చాదస్తం - చేతకానితనం ఉండకూడదని పూరీ తనదైన శైలిలో హీరోయిజానికి కొత్త డెఫినిషన్ సెట్ చేసి పెట్టాడు. దీనికి రవి తేజ బాడీ లాంగ్వేజ్ బ్రహ్మాండంగా సెట్ అయ్యింది. ఆ పాత్రకు రవితేజ మినహా వేరే ఆప్షన్ లేదన్నంతగా ఇన్వాల్వ్ అయి చేశాడు. కెరీర్లో పెద్ద బ్రేక్ కోసం ఎన్నో యేళ్లుగా ఎదురుచూస్తున్న రవితేజకు గొప్ప యాక్సిలేటర్లాగా ‘ఇడియట్’ పనికొచ్చింది. అటు పూరి - ఇటు రవితేజ ఇన్నేళ్లపాటు బిజీబిజీగా ఉన్నారంటే, అదంతా ‘ఇడియట్’ పుణ్యమే.పెట్టుబడి 2.20 కోట్లు. రాబడి 20 కోట్లు. అంటే రూపాయికి పది రూపా యల లాభం. 45 ప్రింట్లతో రిలీజైన సినిమా వంద ప్రింట్లకు చేరుకుంది. 36 కేంద్రాల్లో హండ్రెడ్ డేస్ ఆడింది. ‘కమిషనర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చంటిగాడు లోకల్’, ‘కమిషనర్ కూతుళ్లకు మొగుళ్లు రారా?’, ‘రోజూ ఈ టైమ్‌లో ఇక్కడికొచ్చి సైటు కొడతానని తెలుసు కదా. వచ్చి నిలబడాలని తెలీదా?’ లాంటి డైలాగ్స్ విజిల్స్ వేయించాయి. ‘చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకే’ లాంటి పాటలు కూడా మార్మోగాయి. ‘ఇడియట్’ క్యారెక్టరైజేషన్ ఓ ట్రెండ్ సెట్ చేసేసింది. ఇదే తరహాలో చాలా మంది స్క్రిప్టులు చేసేసుకున్నారు. ఇప్పటికీ బోర్ కొట్టని కాన్సెప్ట్ ఇది. హిందీలో దీన్ని వివేక్ ఒబెరాయ్‌తో రీమేక్ చేయాలని సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు ట్రై చేశారు. కుదర్లేదు. తమిళంలో హీరో శింబు ‘ధమ్’ (2003) పేరుతో రీమేక్ చేశాడు. ఇందులోనూ రక్షితే కథానాయిక. 2008లో బెంగాలీలో ‘ప్రియ అమర్ ప్రియ’ పేరుతో రూపొందింది. ఫెయిల్యూర్లు వస్తుంటాయి... పోతుంటాయి. పూరి మాత్రం కాన్ఫిడెంట్. కాన్ఫిడెన్స్ ఉన్నవాడి దగ్గరే సక్సెస్ కాపురం ఉంటుంది. ఆ కాన్ఫిడెన్సే ‘ఇడియట్’ని సృష్టించింది. వెరీ ఇంట్రస్టింగ్ ఈ కథను పవన్ కల్యాణ్‌కి చెప్పారు. మహేశ్‌కి వినిపించారు. తరుణ్నీ టచ్ చేశారు. చివరకు రవితేజతో తీశారు. ‘ఇడియట్’ నెగటివ్ ఎక్స్పోజర్ కేవలం 55 వేల అడుగులు ఈ సినిమాలో రవితేజ కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి చచ్చిపోతానంటాడు. మళ్లీ ఆగిపోయి ‘నేను చచ్చిపోతే నువ్వెలా ఉండగలవే’ అంటాడు రక్షితతో. ఈ సీన్‌కి ‘పదహారేళ్ల వయసు’ సినిమా ప్రేరణ. అందులో చంద్రమోహన్ కూడా చచ్చిపోతానని చెప్పి, మళ్లీ శ్రీదేవి దగ్గరకొచ్చి ఇదే డైలాగ్ చెబుతాడు. దీన్నే పూరీ క్యాప్చర్ చేసి ఈ సినిమాలో వాడారు. -
కథ వినగానే లవ్‌లో పడ్డాను
శౌర్య, ‘ఉయ్యాలా జంపాల’ఫేం అవికా గోర్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్మీ రావే మా ఇంటికి’. నంద్యాల రవి దర్శకుడు. సీనియర్ పాత్రికేయుడు గిరిధర్ నిర్మాత. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి కేఎల్ దామోదరప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. గిరిధర్ మాట్లాడుతూ -‘‘సినీ పాత్రికేయునిగా పాతికేళ్ల కెరీర్ నాది. మంచి కథతో సినిమా నిర్మించాలనే నా ఆశ ఈ సినిమాతో నెరవేరుతోంది. నంద్యాల రవి చక్కని కథ తయారు చేశారు. అవికా కోసం ఆరు నెలలు ఎదురు చూశాం. ఆమె ఓకే చేయడంతో సినిమాకు మరింత గ్లామర్ వచ్చినట్లైంది. ‘ఇడియట్’ ద్వారా రవితేజకు ఎంత మంచి పేరొచ్చిందో, శౌర్యకు ఈ చిత్రం అంత మంచి పేరు తెస్తుంది. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని తెలిపారు. ‘‘కమర్షియల్‌గా ఆలోచించకుండా మంచి సినిమా చేయాలనే సంకల్పంతో ఉన్నాం’’ అని సమర్పకుడు తాడిశెట్టి వెంకట్రావ్ అన్నారు. కథకు తగ్గ టీమ్ కుదిరిందని దర్శకుడు ఆనందం వ్యక్తం చేశారు. కథ వినగానే... తన పాత్రతో లవ్‌లో పడిపోయానని, ‘ఉయ్యాలా జంపాల’లా తనకు మరో విజయాన్ని ఈ సినిమా ఇస్తుందని అవిక నమ్మకం వ్యక్తం చేశారు. మంచి కథలో హీరోగా నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని శౌర్య చెప్పారు. ఇంకా సయాజీషిండే, భాస్కరభట్ల తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: కేఎమ్ రాధాకృష్ణన్, కెమెరా: సాయిశ్రీరామ్. -
లోకేష్ ఒక చవటబ్బాయి: ఎమ్మెల్యే శ్రీకాంత్
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ చవటబ్బాయని వైఎస్ఆర్ సీఎల్పీ కో-ఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన రెడ్డికి వచ్చిన ఆదరణ తన కొడుక్కి రాలేదనే ఆందోళనతోనే చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. లోకేష్ లీలలు ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమకు బాగా తెలుసని చెప్పారు. చంద్రబాబు గోబెల్స్ ప్రచారం మానుకోవాలని సలహా ఇచ్చారు. లేకుంటే లోకేష్ లీలలు బయటపెడతామని హెచ్చరించారు. సీమాంధ్రలో చంద్రబాబు చేసేది ఆత్మగౌరవ యాత్ర కాదని, వైఎస్ఆర్ సిపిపై విషప్రచారయాత్ర అన్నారు. చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేసే ఎన్టీఆర్‌ను దించి అధికారాన్ని చేజిక్కించుకున్నారని విమర్శించారు. 2009 ముందు వైఎస్ఆర్పై గోబెల్స్ ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని, వైఎస్‌కే పట్టం కట్టారని గుర్తు చేశారు.