డై..లాగి కొడితే... | Dialog from Idiot movie | Sakshi
Sakshi News home page

డై..లాగి కొడితే...

Published Thu, Oct 27 2016 10:48 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

డై..లాగి కొడితే... - Sakshi

డై..లాగి కొడితే...

సినిమా : ఇడియట్
రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్
చంటి (రవితేజ) కాలేజీలో చదువుతుంటాడు. ఫ్రెండ్‌తో కలిసి చంటి నడిచి వస్తుండగా కాలేజీలోని వీరి ఆపోజిట్ గ్యాంగ్ ముసుగు వేసి కొడతారు. లిఫ్ట్ అడిగి, సుచిత్ర (రక్షిత) కారులో గాయపడ్డ చంటిని ఆస్పత్రికి చేరుస్తాడు స్నేహితుడు. చంటికి రక్తం అవసరం కావడంతో ఇచ్చి వెళ్లిపోతుంది సుచిత్ర. పోలీస్ కమిషనర్ విప్రనారాయణ (ప్రకాశ్ రాజ్) కూతురైన సుచిత్ర.. చంటి చదివే కళాశాలలో చేరుతుంది. ఆరోగ్యం ఇప్పుడెలా ఉందని సుచి పలుకరించగానే ‘ఐ లవ్ యూ’ అంటాడు చంటి. ‘నేం చెప్పింది ఏం చేశావ్’ అంటూ వెంటపడుతుంటాడు. మా ఫాదర్ ఎవరో తెలుసా? సుచిత్ర ప్రశ్నిస్తుంది. తెలుసు.. కమిషనర్ ఆఫ్ పోలీస్ అట కదా అంటాడు చంటి. కమిషనర్ అని తెలిసే మాట్లాడుతున్నావా? ఇన్నాళ్లూ నీకు తెలియదనుకున్నా. తెలిసి కూడా.. అని ఆశ్చర్యపోతుంది సుచిత్ర.

‘కమిషనర్ కూతురని చెబితే భయపడిపోతామా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ల కూతుర్లకి మొగుళ్లు రారా?’
 అని ప్రశిస్తాడు చంటి. ఈ డైలాగ్ మాస్ ప్రేక్షకులతో పాటు యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement