ఒకప్పడు హీరోగా,కమెడియన్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. పదేళ్ల కిందట ఎన్టీఆర్ నటించిన దమ్ము, ఆ తర్వాత రామాచారి అనే చిత్రాల్లో వేణు కీలక పాత్రలు పోషించాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా వెండితెరకు దూరమయ్యాడు. పదేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు రవితేజ లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’తో రీఎంట్రీ ఇస్తున్నాడు. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వేణు పోలీసు అధికారి మురళి పాత్రను పోషిస్తున్నాడు. జులై 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
(చదవండి: పెళ్లిపై హీరోయిన్ హన్సిక ఆసక్తికర వ్యాఖ్యలు)
ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు వేణు. తాజాగా ఓ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే టాక్ షోలో పాల్గొన్న వేణు.. తన సినీ కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. భారతీ రాజా సినిమాతో తాను వెండితెరకు పరిచయం కావాల్సిందని, కానీ అది కుదరలేదని చెప్పారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా కథని పూరి జగన్నాథ్ తొలుత తనకే చెప్పాడని, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయానని అన్నాడు. అయినప్పటికీ పూరి జగన్నాథ్ మరోసారి తన దగ్గరకు వచ్చి ‘దేశముదురు’ కథ చెప్పాడని, హీరో నువ్వేనంటూ చెప్పి.. చివరకు అల్లు అర్జున్‌తో తీశాడంటూ.. నాడు జరిగిన సంఘటనల గురించి వేణు చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment