venu thottempudi
-
నటుడు వేణు ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ నటుడు వేణు తొట్టెంపూడి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తండ్రి ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు (92) సోమవారం (జనవరి 29న) తెల్లవారుజామున కన్నుమూశారు. తండ్రి మరణంతో వేణు ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. వెంకట సుబ్బారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చదవండి: సత్తా చాటిన యానిమల్, 12th ఫెయిల్ చిత్రాలు -
‘అతిథి’లో అడల్ట్ కంటెంట్ ఉండదు: హీరో వేణు తొట్టెంపూడి
ఇవాళ ఓటీటీలో చాలా వెబ్ సీరిస్ వస్తున్నాయి కానీ అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటోంది. ఎవరికి వారు గదుల్లో ఉండి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే అలాంటి అడల్ట్ సీన్స్ లేకుండా ఓ వెబ్ సిరీస్ చేయాలనుకున్నాను. ఆ టైమ్‌లోనే ‘అతిథి’స్క్రిప్ట్ వచ్చింది. కథ నచ్చి చేశాను. హారర్, కామెడీ ఇవన్నీ పక్కన పెడితే అందరూ కలిసి హాయిగా చూడగలిగే కథ ఇది’ అని హీరో వేణు తొట్టెంపూడి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సీరీస్ ‘అతిథి’.అవంతిక మిశ్రా హీరోయిన్.రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు భరత్ వైజీ రూపొందించారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్ గా వ్యవహరించారు. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 19 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మీడియా కోసం రెండు ఎపిసోడ్స్‌ను ప్రివ్యూ వేశారు. అనంతరం హీరో వేణు మీడియాతో మాట్లాడుతూ..కరోనా టైమ్ లో వెబ్ సిరీస్ లు చాలా చూశాను. అప్పుడే ఒక వెబ్ సిరీస్ చేయాలని అనుకున్నాను. ఆ టైమ్ లో అతిథి స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. కథ చాలా బాగుంది. అయితే దీన్ని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చేయాలని చెప్పాను. భరత్ అలాగే చేశాడు. అతిథి వెబ్ సిరీస్ ఇంత బాగా వచ్చిందంటే ఆ క్రెడిట్ నేను టెక్నీషియన్స్కే దక్కుతుంది’ అన్నారు. ‘మన తెలుగులో హారర్ మూవీస్ తక్కువ. ఎప్పుడో ఆర్జీవీ దెయ్యం చూశాం. ఇది అండర్ కరెంట్ గా హారర్ ఉంటూ ఎంటర్ టైన్ చేస్తుంది. ప్యామిలీతో కలిసి చూస్తే ఎంజాయ్ చేస్తారు’అని దర్శకుడు భరత్ వైజీ అన్నారు. ‘అతిథిలో హారర్ అనేది అండర్ కరెంట్ గా ఉంటుంది. ప్రతి సన్నివేశంలోని ట్విస్ట్, డెప్త్ ను ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఎం జరుగుతుంది అనేది ఆసక్తి కలిగిస్తుంది. భయపెట్టే దెయ్యాలు, అలాంటివి ఉండవు. మీరు పిల్లల్ని దగ్గర కూర్చో బెట్టుకుని కూడా అతిథి చూడొచ్చు’అని నటుడు రవి వర్మ అన్నారు. -
పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరో.. కమ్ బ్యాక్ ఇస్తాడా?
స్వయంవరం చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన నటుడు వేణు తొట్టెంపూడి. ఆ తర్వాత టాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించిన తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. దాదాపు 30కి పైగా చిత్రాల్లో నటించిన వేణు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత గతేడాది రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించారు. తెలుగులో చెప్పవే చిరుగాలి, పెళ్లాం ఊరెళితే, దమ్ము, గోపి గోపిక గోదావరి, హనుమాన్ జంక్షన్, శ్రీకృష్ణ 2006, చిరునవ్వుతో లాంటి చిత్రాల్లో నటించారు. (ఇది చదవండి: 'జవాన్' సినిమాను నిలబెట్టిన ఈ ఆరుగురు.. ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఇవే) అయితే ఈ ఏడాది ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. 2013 తర్వాత ఏ చిత్రంలోనూ లీడ్ రోల్లో కనిపించని వేణు.. ప్రస్తుతం గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా వేణు ఎంట్రీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. చివరగా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'లో పోలీస్ అధికారిగా కనిపించిన వేణు 'అతిథి' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో అతనికి జోడీగా అవంతిక మిశ్రా నటిస్తోంది. (ఇది చదవండి: షారుఖ్ ఖాన్ మేనేజర్ ఎవరో తెలుసా? జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే!) అయితే ఈ సిరీస్‌కు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. తాజాగా అతిథి వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేసిన మేకర్స్.. స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేశారు. ఈనెల 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. అయితే హీరోగా ఎమోషనల్, కామెడీ తరహా సినిమాలు చేసిన వేణు.. ఇప్పుడు మాత్రం సరికొత్తగా హారర్ కాన్సెప్ట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. A mansion full of secrets, an unexpected guest and the story unfolds… with a twist you’ll never see coming! Are you ready for it. #ATHIDHI TRAILER OUT NOW! WATCH NOW: https://t.co/0iuJpChB9c#Athidhi streaming from SEP 19 only on @DisneyPlusHSTel #AthidhiOnHotstar… pic.twitter.com/I8XIjwVSpw — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 8, 2023 -
ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన తెలుగు స్టార్ హీరో
సినిమాలు గొప్ప? ఓటీటీలు గొప్ప? అని అడిగితే సమాధానం ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే లాక్డౌన్ టైంలో ఓటీటీలు ఎంటర్టైన్ చేశాయి. ఇప్పుడు వాటి హవా ఉన్నప్పటికీ థియేటర్లలో సినిమాలు కూడా కాస్త పుంజుకున్నాయి. దీంతో హీరోలు ఓటీటీల వైపు పెద్దగా చూడట్లేదు. మహా అయితే షోలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఓ స్టార్ హీరో ఓటీటీ వెబ్ సిరీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలుగు ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లకు అస్సలు కొదవలేదు. ప్రతి ఏటా పదుల సంఖ్యలో వస్తూనే ఉంటారు. అలా 20ల్లో హీరోగా ఆకట్టుకున్న వారిలో వేణు తొట్టెంపూడి కచ్చితంగా ఉంటాడు. హనుమాన్ జంక్షన్, స్వయంవరం, చిరునవ్వుతో, పెళ్లాం ఊరెళితో తదితర సినిమాలతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించారు. అలాంటిది సడన్‌గా సినిమాలకు దూరమైపోయారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు) అప్పట్లో చిన్న బ్రేక్ తీసుకున్న వేణు.. చాన్నాళ్ల క్రితమే రీఎంట్రీ ఇచ్చారు. కాకపోతే సహాయ పాత్రలు చేస్తూ వచ్చారు. ఆ సినిమాలు హిట్ కాలేదు. ఈయనకు గుర్తింపు కూడా రాలేదు. చివరగా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'లో పోలీస్ అధికారిగా నటించారు. అయితే ఇప్పుడు వేణు.. ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. 'అతిథి' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. హాట్‌స్టార్ త్వరలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. అయితే హీరోగా ఎమోషనల్, కామెడీ తరహా సినిమాలు చేసిన వేణు.. ఇప్పుడు మాత్రం హారర్ కాన్సెప్ట్ స్టోరీతో ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. పోస్టర్లో అసలు విషయం రివీల్ చేయలేదు కాబట్టి టీజర్, ట్రైలర్ వస్తే మేటర్ ఏంటనేది తెలుస్తుంది. Not all GUESTS are welcome! 🚪🔥 Stay tuned for an exciting new series #ATHIDHI!#AthidhiOnHotstar coming soon… Only on #DisneyPlusHotstar. pic.twitter.com/MJB3kGPI1P — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) August 21, 2023 (ఇదీ చదవండి: రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?) -
రీఎంట్రీ తర్వాత వేణు దూకుడు.. మరో క్రేజీ ఆఫర్ కొట్టేశాడుగా?
దాదాపు పదేళ్ల గ్యాప్ అనంతరం రీఎంట్రీ ఇచ్చాడు నటుడు వేణు తొట్టెంపూడి. ‘స్వయంవరం’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన వేణు తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘చిరునవ్వు, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే’ వంటి ప్రేమ, కుటుంబ కథా చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. ఇక వరుస ఆఫర్స్, హిట్స్‌తో దూసుకుపోయిన వేణును ఆ తర్వాత ఫ్లాప్‌లు వెంటాడాయి. ఇలా అడపదడప చిత్రాలు చేస్తూ వచ్చిన వేణు చివరిగా ‘రామాచారి వీడో పెద్దగూఢ’ చారి సినిమాతో తెరపై కనిపించాడు. ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వేణు రీసెంట్గా ‘రామారావు ఆన్‌డ్యూటీ’తో ప్రేక్షకులను పలకరించాడు. చదవండి: సందడే సందడి.. ఈ వారం బోలెడన్ని సినిమాలు రిలీజ్! ఇక సీఐ మురళి అనే పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఇప్పుడు వేణు మరో క్రేజీ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. మహేశ్ బాబు సినిమాలో ఓ కీ రోల్ కోసం చిత్ర బృందం వేణుని సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల సర్కారు వారి పాట మూవీతో అలరించిన మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎమ్బి 28(#SSMB28) అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందే ఈ సినిమా వచ్చే నెల సెట్స్‌పైకి రానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మించబోతున్నారు. చదవండి: హీరోగా చేస్తానని చెప్పగానే నాన్న చివాట్లు పెట్టారు: దుల్కర్ సల్మాన్ అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత కోసం త్రివిక్రమ్ వేణును ఎంపిక చేసినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా వేణు-త్రివిక్రమ్‌లు స్వయంవరం చిత్రంతో ఒకేసారి వెండితెర ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరికి ఈ మూవీ తొలి చిత్రం కావడం విశేషం. ఈ సనిమాకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. అందులోని త్రివిక్రమ్ డైలాగ్స్ ఏ రేంజ్లో పేలాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత వేణు నటించిన ‘చిరునవ్వుతో’ చిత్రానికి కూడా త్రివిక్రమే మాటలు రాశారు. ఈ సినిమా కూడా అప్పట్లో సూపర్ హిట్టయింది. ఇప్పుడు ఏకంగా వేణుకి త్రివిక్రమ్ డైరెక్షన్లో నటించే అవకాశం రావడం ఆసక్తిని సంతరించుకుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ఒకప్పుడు సునీల్ నచ్చాడు, కానీ ఇప్పుడు కాదు: వేణు
దమ్ము సినిమా తర్వాత కనిపించకుండా పోయాడు నటుడు వేణు తొట్టెంపూడి. ఈ సినిమా తర్వాత వ్యాపారాలతో బిజీ అయిన అతడు సినిమాలను పట్టించుకోవమే మానేశాడు. కానీ కరోనా టైంలో మళ్లీ సినిమాలపై ఇంట్రస్ట్ రావడం, అదే సమయంలో దర్శకుడు శరత్ మండవ చెప్పిన రామారావు ఆన్ డ్యూటీ కథ నచ్చడంతో సినిమా ఓకే చేశాడు వేణు. అప్పటివరకు తన పాత్రకు డబ్బింగ్ చెప్పని వేణు రామారావు ఆన్ డ్యూటీలో మాత్రం తనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు కమెడియన్ సునీల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'చెప్పవే చిరుగాలి సినిమాలో నేను- సునీల్ కాంబినేషన్ సీన్స్ వచ్చినప్పుడు చించి ఆరేశాం. సునీల్ ఇప్పుడు విలన్‌గా కూడా చేస్తున్నాడు. ఒక ఆర్టిస్ట్‌గా అన్ని అవకాశాలు రావడం గొప్ప విషయం. తను చాలా బాగా చేస్తున్నాడు. కానీ నాకు మాత్రం పాత సునీలే ఇష్టం. సరదాగా భలే ఉండేవాడు. కానీ హీరోగా, విలన్‌గా అయితే నటించాల్సి వస్తుంది. కాబట్టి అతడి పాత సినిమాలే ఇష్టం' అని చెప్పుకొచ్చాడు. చదవండి: కమెడియన్ వెంట పరిగెత్తి మరీ కొట్టాను, సినిమాలో కూడా లేకుండా చేశా సుహాస్ హీరో అనగానే అవసరమా? అంటూ చీప్ లుక్కిచ్చారు -
‘దమ్ము’ తర్వాత అందుకే సినిమాలు చేయలేదు: వేణు తొట్టెంపూడి
‘‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో సీఐ మురళి పాత్ర చేశాను. ఇలాంటి జోనర్ సినిమా నేను చేయలేదు. పైగా వైడ్ రీచ్ ఉన్న సినిమా. ఇలాంటి సినిమా చేస్తే నేను మళ్లీ నటిస్తున్నాననే విషయం ప్రేక్షకులకు రీచ్ అవుతుందనే అభిప్రాయంతోనే ఈ సినిమా చేశాను’’ అని నటుడు వేణు తొట్టెంపూడి అన్నారు. రవితేజ హీరోగా దివ్యాంశా కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న వేణు తొట్టెంపూడి పంచుకున్న విశేషాలు. ► ‘దమ్ము’ చిత్రం తర్వాత నేను సినిమాలు చేయకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు లేవు. మాకున్న వ్యాపారాల్లో బిజీ అయిపోవడంతో సినిమాల గురించి ఆలోచించే తీరిక లేదు. కొంతమంది సినిమా కోసం సంప్రదించినా సున్నితంగా తిరస్కరించేవాణ్ణి. అయితే కరోనా టైమ్‌లో ఇంట్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తున్నప్పుడు మళ్లీ సినిమాపై ఆసక్తి కలిగింది. ఆ సమయంలో శరత్ మండవ చెప్పిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ కథ నచ్చడంతో ఓకే చెప్పేశాను. ► ‘స్వయంవరం’ సినిమాలో రవితేజగారు నాతో కలిసి పని చేయాల్సి ఉన్న విషయం గురించి నిజంగా నాకు తెలీదు. అప్పుడు కుదరకపోయినా ‘రామారావు ఆన్ డ్యూటీ’తో మా కాంబినేషన్ కుదిరింది. మొదటి నుంచి కూడా నేను మల్టీస్టారర్ సినిమాలకి ఆసక్తి చూపేవాణ్ణి. ‘చిరునవ్వుతో’ వంటి హిట్ తర్వాత ‘హనుమాన్ జంక్షన్’ సినిమా చేశాను. చాలామంది నటీనటులతో కలసి నటించడం ఓ పండగలా ఉంటుంది. ► నేను హిట్ సినిమాలు చేసినప్పటికీ నా పాత్రకు డబ్బింగ్ చెప్పలేదనే చిన్న అసంతృప్తి ఉండేది. కానీ ‘రామారావు ఆన్ డ్యూటీ’లో నేనే డబ్బింగ్ చెప్పడం తృప్తిని ఇచ్చింది. ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెబుతాను. రవితేజగారి లాంటి మాస్ స్టార్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం హ్యాపీ. ఇలాంటి మంచి చిత్రంతో నాకు ఒక ప్లాట్‌ఫామ్ ఇచ్చిన రవితేజ, సుధాకర్, శరత్ మండవలకు థ్యాంక్స్. ► నా సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా చేశారు. తను దర్శకుడు అయ్యాక ‘అతడు’లో సోనూ సూద్ చేసిన పాత్ర మొదట నాకే చెప్పారు. నేను చేయకపోవడంతో సోనూ సూద్ చేశారు. నాకు సరిపడే పాత్ర ఉంటే త్రివిక్రమ్ తప్పకుండా నాకు చెబుతారు. నా ఫిట్నెస్ సీక్రెట్ ఏం లేదు.. మంచి ఆహారం తింటాను. సాధ్యమైనంత వరకూ బయట ఫుడ్‌కు దూరంగా ఉంటాను. శరీరాన్ని పాడుచేసే ఏ చెడ్డ అలవాటు లేదు. మిగతాది తల్లితండ్రుల ఆశీర్వాదం. ►ఇకపై వరుసగా సినిమాలు చేస్తాను. అలాగే వెబ్ కంటెంట్‌పై కూడా దృష్టి పెట్టాను. ప్రస్తుతం ఛాయ్ బిస్కెట్ నిర్మా ణంలో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ఒక వెబ్ సిరీస్ కూడా చర్చల్లో ఉంది. -
Ramarao On Duty Stills: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
రవితేజ ‘రామారావు: ఆన్ డ్యూటీ’ప్రీ రిలీజ్ వేడుక (ఫోటోలు)
-
అల్లు అర్జున్ నటించిన ఆ సినిమా నేను చేయాల్సింది: వేణు
ఒకప్పడు హీరోగా,కమెడియన్‌గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. పదేళ్ల కిందట ఎన్టీఆర్ నటించిన దమ్ము, ఆ తర్వాత రామాచారి అనే చిత్రాల్లో వేణు కీలక పాత్రలు పోషించాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా వెండితెరకు దూరమయ్యాడు. పదేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు రవితేజ లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’తో రీఎంట్రీ ఇస్తున్నాడు. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వేణు పోలీసు అధికారి మురళి పాత్రను పోషిస్తున్నాడు. జులై 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. (చదవండి: పెళ్లిపై హీరోయిన్ హన్సిక ఆసక్తికర వ్యాఖ్యలు) ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు వేణు. తాజాగా ఓ టీవీ చానెల్లో ప్రసారమయ్యే టాక్ షోలో పాల్గొన్న వేణు.. తన సినీ కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. భారతీ రాజా సినిమాతో తాను వెండితెరకు పరిచయం కావాల్సిందని, కానీ అది కుదరలేదని చెప్పారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా కథని పూరి జగన్నాథ్ తొలుత తనకే చెప్పాడని, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయానని అన్నాడు. అయినప్పటికీ పూరి జగన్నాథ్ మరోసారి తన దగ్గరకు వచ్చి ‘దేశముదురు’ కథ చెప్పాడని, హీరో నువ్వేనంటూ చెప్పి.. చివరకు అల్లు అర్జున్‌తో తీశాడంటూ.. నాడు జరిగిన సంఘటనల గురించి వేణు చెప్పుకొచ్చాడు. -
అందుకే ఇంతకాలం నటనకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
నటుడు వేణు తొట్టెంపూడి గుర్తున్నాడు కదా.. ‘స్వయంవరం’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టాడు. ఆ తర్వాత చిరు నవ్వుతో, గోపి గోపిక.. గోదావరి వంటి చిత్రాల్లో లీడ్ రోల్ పోషించిన ఆయన.. తనదైన శైలిలో ఫిలాసఫి డైలాగ్‌లు చెబుతూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా వంటి సినిమాల్లో సహానటుడిగా కామెడీ పండిస్తూ ప్రేక్షకలును ఆకట్టుకున్నాడు. అలా హీరోగా, కమెడియన్‌గా తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యాడు. చదవండి: ఆ కామెడీ షో నుంచి అందుకే తప్పుకున్నా.. జబర్దస్త్ అప్పారావు చివరిగా దమ్ము, రామాచారి చిత్రాల్లో కనిపించిన ఆయన ఆకస్మాత్తుగా తెరపై కనుమరుగయ్యాడు. దాదాపు పదేళ్ల తర్వాత వేణు రవితేజ రామారావు ఆన్‌డ్యూటీ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడు. నిన్న(జులై 6న) ఈ మూవీలోని వేణు ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో అతడు సీఐ మురళిగా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో వేణు సోషల్ మీడియా వేదికగా ఓ చానల్‌తో ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రామారావు ఆన్‌డ్యూటీ మేకర్స్ ఎస్ఎల్వీ సినిమాస్ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘చాలా కాలం తర్వాత మళ్లీ నటించడం ఎలా ఉందిని అనే ప్రశ్నకు.. తానేప్పుడు సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తానన్నాడు. ‘చాలా రోజుల తర్వాత మళ్లీ నటించడం చాలా ఆనందంగా ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల నటనకు దూరంగా ఉన్నా. మళ్లీ ఇంతకాలానికి రామారావు ఆన్‌డ్యూటీతో రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను సీఐ మురళిగా కనిపిస్తాను. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలైన విషయం మీకు తెలిసిందే. ప్రస్తుతం రామారావు ఆన్‌డ్యూటీతో పాటు పారా హుషార్ అనే మరో సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: మైనర్ బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. ప్రముఖ నటుడు అరెస్ట్ ‘అయితే మొదట ఈ మూవీలో నటించమని దర్శకుడు శరత్ మండవ చాలాసార్లు ఫోన్ చేశారు. కానీ నేను ఒప్పుకోలేదు. అసలు నటించనని చెప్పాను. మీరు ఈ సినిమాలో నటించకపోయిన పర్వాలేదు. కానీ ఓసారి కలుద్దాం’ అని శరత్ మెసేజ్ చేశారు. దీంతో ఓసారి మీట్ అయ్యాం. ఆ ముచ్చట్లలో భాగంగా ఈ చిత్రంలోని మీ పాత్రను ఇలా అనుకుంటున్నా. మీకు నమ్మకం ఉంటే చేయండి అన్నారు. నాకూ ఆ పాత్ర నచ్చింది. రెండు మూడుసార్లు శరత్‌తో నా పాత్రపై చర్చించి ఒకే చేశాను. అంతకుముందు కూడా పలు కథలు విన్నాను. కానీ, అనుకోకుండా ఇది ఫైనల్ అయ్యింది’ అని వేణు తెలిపాడు. View this post on Instagram A post shared by SLV Cinemas (@slv_cinemas) -
రామారావు ఆన్‌డ్యూటీ నుంచి వేణు ఫస్ట్‌లుక్ అవుట్
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో స్పీడ్ స్పీడ్‌గా షూటింగ్‌లను పూర్తి చేస్తూ సినిమాలు వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన సినిమాల నుంచి తరచూ ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తోంది. ఈ క్రమంలో రామారావు ఆన్‌డ్యూటీ మూవీ నుంచి ఓ అప్డేట్ను వదిలారు మేకర్స్. ఇటీవల రిలీజైన సీసా సీసా అనే ఐటం సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా నటుడు వేణు తొట్టెంపూడి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. చదవండి: సమంత ఇన్‌స్టాలో కేటీఆర్ పోస్ట్, షాక్‌లో ఫ్యాన్స్, సామ్ టీం క్లారిటీ కాగా వేణు ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అతడు ఓ కీ రోల్ పోషించనున్నాడు. అయితే ఆయన పాత్రపై మాత్రం ఇప్పటి వరకు మూవీ టీం నుంచి ఎలాంటి క్లారిటీ. దీంతో తాజాగా వదిలిన వేణు ఫస్ట్‌లుక్ చూస్తుంటే అతడు పోలీతసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. హీరోగా స్యయం వరం, చెప్పవే చిరుగాలి, చిరునవ్వుతో వంటి చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వేణు అనంతరం సహా నటుడిగా మెప్పించాడు. ఇక చివరిగా జూనియర్ ఎన్టీఆర్ దమ్ము, రామాచారి చిత్రాల్లో కనిపించిన ఆయన దాదాపు 11 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. చదవండి: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శ్రుతి? హీరోయిన్ క్లారిటీ ఇప్పుడు మళ్లీ రామారావు ఆన్‌డ్యూటీ మూవీతో తన ఫ్యాన్స్‌ను పలకరించేందుకు రెడీ అయ్యాడు. మరి ఈ సినిమాలో తన పాత్రతో ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి. శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఈ చిత్రంలో సర్పట్టా ఫేం జాన్ విజయ్, చైతన్యకృష్ణ, నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జులై 29న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతుంది. Our favourite #VenuThottempudi will be live to talk about #RamaRaoOnDuty and much more 💥🔥 Tune into Instagram and Facebook of @SLVCinemasOffl 🔥#RamaRaoOnDutyOnJuly29 Mass Maharaja @RaviTeja_offl @directorsarat #AnveshiJain @SamCSmusic @RTTeamWorks pic.twitter.com/g0ORirHDic — SLV Cinemas (@SLVCinemasOffl) July 6, 2022 -
రవితేజ 'రామా రావు ఆన్ డ్యూటీ' అప్పటినుంచే..
Ravi Teja Ramarao On Duty New Release Date Announced: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా, మాస్ మహారాజాగా ఎదిగాడు రవితేజ. హిట్లు, ప్లాప్‌లు పట్టించుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు. ఇటీవల క్రాక్‌తో హిట్ కొట్టిన ఖిలాడీ అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం రవితేజ చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఒకటి 'రామారావు ఆన్ డ్యూటీ'. ఇప్పటివరకు ఈ మూవీ విడుదల తేది పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజగా మరోసారి రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుట్లు తెలిపారు. విడుదల తేదిని ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ ధీర్ఘంగా, సీరియస్‌గా ఆలోచిస్తున్న ఫొటోను చూడోచ్చు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో 'మజిలీ' ఫేమ్ దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి నటిస్తూ వెండితెరకు రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: రణ్‌బీర్ వీరోచిత పోరాటం.. ఆసక్తిగా 'షంషేరా' టీజర్ The calm before the MASS Storm!#RamaRaoOnDuty Grand Release Worldwide on JULY 29 💥#RamaRaoOnDutyOnJULY29 Mass Maharaja @RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @SamCSmusic @sahisuresh @Cinemainmygenes @sathyaDP @RTTeamWorks @LahariMusic pic.twitter.com/k0527vUTps — SLV Cinemas (@SLVCinemasOffl) June 22, 2022 -
రీ ఎంట్రీ ఇస్తున్న నటుడు వేణు తొట్టెంపూడి..
నటుడు వేణు తొట్టెంపూడి గుర్తున్నాడు కదా.. స్వయంవరం సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టాడు. ఆ తర్వాత చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి మూవీల్లో లీడ్ రోల్ పోషించిన ఆయన.. హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా సినిమాల్లో నటించి తన గ్రాఫ్‌ను పెంచుకున్నాడు. హీరోగా, కమెడియన్‌గా తన నటనతో నటనతో అలరించిన ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. రీసెంట్‌గానే రవితేజ హీరోగా చేస్తున్న రామారావు ఆన్‌డ్యూటీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా రవితేజ హీరోగా చేస్తున్న ధమాకా సినిమాలో ముఖ్య పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ రానుంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల నటించనుంది. -
రీఎంట్రీకి సిద్ధమైన నటుడు వేణు తొట్టెంపూడి
Venu Thottempudi comeback : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం శరత్ మండవ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రియల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా తెరెకెక్కుతున్న ఈ చిత్రంతో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలో మజిలి ఫేమ్ దివ్యాంశ కౌశిక్‌తో పాటు రజిష విజయన్ హీరోయిన్లుగా నటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ను వదిలారు మేకర్స్. కొన్నాళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న హీరో వేణు తొట్టెంపూడి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. గురువారం ఇందుకు సంబంధించి 'వెల్కమ్ అబోర్డ్ వేణు' అంటూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. కాగా 1999లో వచ్చిన 'స్వయంవరం' సినిమాతో హీరోగా పరిచయం అయిన వేణు ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే 'గోపి గోపిక గోదావరి' సినిమా అనంతరం సినిమాలకు దూరమైన వేణు 2012లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దమ్ము చిత్రంలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు రవితేజ సినిమాతో మరోసారి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు వేణు. Team #RamaRaoOnDuty takes privilege in welcoming back everyone's favorite #VenuThottempudi garu to be ON DUTY again to flare the screen.@RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @Cinemainmygenes @sathyaDP @sahisuresh @SamCSmusic @RTTeamWorks pic.twitter.com/QYWRbdFNxy — SLV Cinemas (@SLVCinemasOffl) July 29, 2021 -
నటుడు వేణు గుర్తున్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా!
వేణు తొట్టంపూడి.. హీరోగా, కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో అలరించిన ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తన సినిమాల్లో ఫిలాసఫి డైలాగ్‌లు చెబుతూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వేణు 1999లో వచ్చిన స్వయంవరం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే స్పెషల్ జ్యూరీ క్యాటగిరి కింద నంది అవార్డు గెలుచుకున్నాడు. ఆ తరువాత చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి మూవీల్లో లీడ్ రోల్ పోషించిన ఆయన.. హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా సినిమాల్లో నటించి తన గ్రాఫ్‌ను పెంచుకున్నాడు. ఇక ఆయన నటించిన సినిమాలన్ని మంచి సక్సెస్ సాధించాయి. ఎందుకంటే తన సినిమాల్లో కాస్తా కొత్తదనం కోరుకుంటారు వేణు. అంతేగాక ప్రతి సినిమాల్లో తనలోని ప్రత్యేకతను చూపిస్తుంటాడు. అలా తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకుని దాదాపు 26 సినిమాల్లో నటించాడు. అలా 2009లో ‘గోపి గోపిక గోదారి’ మూవీలో నటించి కాస్తా బ్రేక్ తీసుకున్నాడు. కాగా ఇందులో హీరోయిన్గా కమలిని ముఖర్జీ నటించింది. ఈ సినిమా కూడా వేణు కేరీర్‌కు మంచి హిట్ అందించింది. అయితే ఈ మూవీ తర్వాత ఆయన బ్రేక్ ఇవ్వడంతో తన సినీ కేరీర్ కాస్తా వెనకపడింది. ఈ నేపథ్యంలో మంచి అవకాశం కోసం ఎదురు చూసిన ఆయనకు బోయపాటి, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో 2012లో వచ్చిన దమ్ము చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత రామాచారి సినిమా చేసినా అది కూడా పరాజయం పాలైంది. దీంతో వ్యాపారంపై దృష్టి పెట్టిన ఆయన ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పి వ్యాపారవేత్తగా మారిపోయాడు. పూర్తిగా సినిమాలను, నటనను పక్కన పెట్టిన వేణు 2013లో లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బావ నామా నాగేశ్వరరావు కోసం టీఆర్ఎస్ తరఫున ఖమ్మం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించాడు. ఈ క్రమంలో గతేడాది లాక్డౌన్లో ఉపాధి కోల్పోయిన పేదలకు వేణు తనకు తోచిన సాయం అందించి ఉదారత చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరల్ కూడా అయ్యాయి. అయితే ఇప్పటికి మంచి అవకాశం వస్తే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు పలు ఇంటర్వ్యూలో చెప్పాడు. చదవండి: హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలుసా! -
హీరో వేణుపై కేసు నమోదు
హైదరాబాద్ : అద్దె ఇంటికి ఇచ్చిన అడ్వాన్స్ రూపంలో ఇచ్చిన నగదును తిరిగివ్వకుండా వేధిస్తున్నారంటూ టాలీవుడ్ ప్రముఖ నటుడు వేణు తొట్టెంపుడి దంపతులపై ఇరాన్‌కు చెందిన మహిళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డాక్టర్ ఫాతేమీ బేగంపేటలో వైద్యురాలుగా పని చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని జీపీ రెసిడెన్సీలో ఫ్లాట్ నంబర్ 302ను ఏడు నెలల క్రితం సినీ నటుడు వేణు తొట్టెంపుడి నుంచి అద్దెకు తీసుకుంది. ఈ ప్లాట్ నెలసరి అద్దె రూ.29,300కాగా అద్దెకు దిగే ముందు మూడు నెలల అడ్వాన్స్ కింద రూ.88 వేలు చెల్లించింది. అయితే ఈ నెల 8వ తేదీన తాను ఫ్లాట్ ఖాళీ చేస్తున్నట్లు ఆమె యజమాని వేణుకు తెలిపింది. ఫ్లోరింగ్‌పైన చిన్న బీటలు ఏర్పడ్డాయని వాటిని సరి చేసి ఇవ్వాలని అప్పటిదాకా అడ్వాన్స్ ఇచ్చేది లేదంటూ వేణుతో పాటు ఆయన భార్య అనుపమ చౌదరి కరాకండిగా చెప్పారు. దీంతో వైద్యురాలు ఫాతేమీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై పోలీసులు హీరో వేణును సంప్రదించారు. టెనెంజ్ ఫిర్యాదు వివరాలతో పాటు వేణు నిర్ణయాన్ని అడిగారు. ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని వేణు నిర్ణయించుకుని... ఫాతేమీతో చర్చించినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు హీరో వేణు రాజీకి రావడంతో ఈ గొడవ సద్దుమణిగిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేసు వాపస్ తీసుకోగా కొన్ని గంటల ఈ డ్రామాకు తెరపడింది. -
మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా..
ఏలూరు : ‘స్వయంవరం’ చిత్రంతో హీరోగా ప్రేక్షకుల మదిలో చోటు దక్కించుకున్న నటుడు వేణు తొట్టెంపూడి మంగళవారం స్థానిక చిన వెంకన్న ఆలయానికి విచ్చేశారు. ముందుగా శ్రీవారిని, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలోకి వచ్చిన ఆయన్ని పలువురు భక్తులు గుర్తించి కరచాలనం చేశారు. తమ అభిమాన నటుడితో ఫొటోలు దిగారు. మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా.. ఈ సందర్భంగా వేణు విలేకరులతో మాట్లాడారు. 1999లో తాను స్వయంవరం చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమైనట్టు చెప్పారు. తాను నటించిన ఎన్నో చిత్రాలు హిట్ అయ్యాయని, దీంతో తనకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించిందని అన్నారు. ఇప్పటి వరకు తాను 28 చిత్రాల్లో నటించానని, ఇందులో హీరోగా నటించిన స్వయంవరం, చిరునవ్వుతో, ఖుషిఖుషీగా, యమగోల, రామాచారి వంటి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయన్నారు. ప్రస్తుతం తాను మంచి అవకాశాల కోసం వేచి చూస్తున్నట్టు చెప్పారు.