ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన తెలుగు స్టార్ హీరో | Actor Venu Thottempudi OTT Entry Athidhi Web Series | Sakshi
Sakshi News home page

Actor Venu: అప్పట్లో నవ్వించాడు.. ఇప్పుడు భయపెట్టనున్నాడు!

Published Tue, Aug 22 2023 6:47 PM | Last Updated on Tue, Aug 22 2023 7:08 PM

Actor Venu Thottempudi OTT Entry Athidhi Web Series - Sakshi

సినిమాలు గొప్ప? ఓటీటీలు గొప్ప? అని అడిగితే సమాధానం ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే లాక్‌డౌన్ టైంలో ఓటీటీలు ఎంటర్‌టైన్ చేశాయి. ఇప్పుడు వాటి హవా ఉన్నప్పటికీ థియేటర్లలో సినిమాలు కూడా కాస్త పుంజుకున్నాయి. దీంతో హీరోలు ఓటీటీల వైపు పెద్దగా చూడట్లేదు. మహా అయితే షోలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఓ స్టార్ హీరో ఓటీటీ వెబ్ సిరీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తెలుగు ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లకు అస్సలు కొదవలేదు. ప్రతి ఏటా పదుల సంఖ్యలో వస్తూనే ఉంటారు. అలా 20ల్లో హీరోగా ఆకట్టుకున్న వారిలో వేణు తొట్టెంపూడి కచ్చితంగా ఉంటాడు. హనుమాన్ జంక్షన్, స్వయంవరం, చిరునవ్వుతో, పెళ్లాం ఊరెళితో తదితర సినిమాలతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించారు. అలాంటిది సడన్‌గా సినిమాలకు దూరమైపోయారు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు)

అప్పట్లో చిన్న బ్రేక్ తీసుకున్న వేణు.. చాన్నాళ్ల క్రితమే రీఎంట్రీ ఇచ్చారు. కాకపోతే సహాయ పాత్రలు చేస్తూ వచ్చారు. ఆ సినిమాలు హిట్ కాలేదు. ఈయనకు గుర్తింపు కూడా రాలేదు. చివరగా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'లో పోలీస్ అధికారిగా నటించారు. అయితే ఇప్పుడు వేణు.. ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. 'అతిథి' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.

హాట్‌స్టార్ త్వరలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. అయితే హీరోగా ఎమోషనల్, కామెడీ తరహా సినిమాలు చేసిన వేణు.. ఇప్పుడు మాత్రం హారర్ కాన్సెప్ట్ స్టోరీతో ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. పోస్టర్‌లో అసలు విషయం రివీల్ చేయలేదు కాబట్టి టీజర్, ట్రైలర్ వస్తే మేటర్ ఏంటనేది తెలుస్తుంది.

(ఇదీ చదవండి: రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement