Venu Thottempudi Re-Entry: Actor To Play Key Role In Raviteja New Movie - Sakshi
Sakshi News home page

Venu Thottempudi : మాస్‌ మహారాజ చిత్రంతో కంబ్యాక్‌

Published Thu, Jul 29 2021 12:40 PM | Last Updated on Thu, Jul 29 2021 2:41 PM

Venu Thottempudi Making A Comeback With Ramarao On Duty - Sakshi

Venu Thottempudi comeback : మాస్‌ మహారాజ రవితేజ ప్రస్తుతం శరత్ మండవ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  రియ‌ల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా తెరెకెక్కుతున్న ఈ చిత్రంతో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలో మ‌జిలి ఫేమ్ దివ్యాంశ కౌశిక్‌తో పాటు రజిష విజయన్ హీరోయిన్లుగా నటించనున్న సంగతి తెలిసిందే.  తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ను వదిలారు మేకర్స్‌. కొన్నాళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న హీరో వేణు తొట్టెంపూడి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది.

గురువారం ఇందుకు సంబంధించి 'వెల్కమ్ అబోర్డ్ వేణు' అంటూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. కాగా 1999లో వచ్చిన 'స్వయంవరం' సినిమాతో హీరోగా పరిచయం అయిన వేణు ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే  'గోపి గోపిక గోదావరి' సినిమా అనంతరం సినిమాలకు దూరమైన వేణు 2012లో ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన దమ్ము చిత్రంలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు రవితేజ సినిమాతో మరోసారి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు వేణు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement